Thursday, April 9, 2026

హస్తప్రయోగం: సమస్య – పరిష్కారం

పరిచయం ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పో తాయి. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (మాస్టర్బేషన్) అంటారు. నేటి కాలంలో యువతను పట్టిపీడిస్తున్న ఒక క్లిష్టమైన సమస్య "స్వయంతృప్తి" (Masturbation). ఇది అనేక మానసిక ఆందోళనలకు, హృదయ బలహీనతలకు మరియు విశ్వాసం (ఈమాన్) లో హెచ్చుతగ్గులకు కారణమవుతోంది. యువతలోని కోరికల సెగలు వారిని ఈ అలవాటు వైపు నెడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారాన్ని, చికిత్సను వివరించడానికి ఉద్దేశించబడినదే ఈ వ్యాసం. కారణం: నేటి సమాజంలో వ్యాపిస్తున్న అశ్లీలత, చెడు మార్గాలు మరియు మురికి వాతావరణం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. యువకులు పుస్తకాలు, ఇంటర్నెట్ లేదా చెడు స్నేహితుల ద్వారా ఈ అలవాటును నేర్చుకుంటున్నారు. వారు దీని ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నట్లు భావించినా, అది వారిని ఒక విషవలయంలోకి నెట్టివేస్తోంది. యుక్తవయసు వచ్చినప్పుడు, లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయి. దానివల్ల, కొందరు హస్తప్రయోగానికి (masturbation) అలవాటు పడే అవకాశం ఉంది. అదేం పెద్ద తప్పు కాదని చాలామంది అంటారు. “దానివల్ల ఎవరికీ నష్టం జరగదు” అని వాళ్లు సమర్థించుకుంటారు కూడా. అందులో కొంత వరకు నిజం ఉండొచ్చు కానీ, మనిషి ముఖ్యంగా ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఇది పెద్ద అవరోధం అన్నది కఠోర సత్యం. ఇది సరిపోదన్నట్టు - వినాశకర పరికరాలు, టాయ్స్ లాంటివి కూడా జతయి భయంకర పరిణామాలకు దారి తీస్తున్నాయి. చాలామంది దీని నుండి బయటపడాలని ప్రయత్నించి విఫలమై, నిరాశకు గురవుతున్నారు. కానీ అల్లాహ్ ఖురాన్‌లో ఇలా అన్నాడు: "మేము ఖురాన్‌లో విశ్వాసుల కోసం ఉపశమనాన్ని (షిఫా), కారుణ్యాన్ని అవతరింపజేశాము" (అల్-ఇస్రా: 82).
పరిష్కార మార్గాలు మరియు సూచనలు: 1. అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రయత్నించడం: ఈ అలవాటును వదులుకోవడానికి ప్రాథమిక ఉద్దేశ్యం అల్లాహ్ ను మెప్పించడం మరియు ఆయన ఆగ్రహం నుండి తప్పించుకోవడం అయి ఉండాలి. కేవలం ఆరోగ్య సమస్యల కోసమే కాకుండా, ఒక ఆరాధనగా దీనిని వదలాలి. 2. అవగాహనను పెంచుకొని ధార్మిక తీర్పును తెలుసుకోవడం: ఇమామ్ షాఫీ (రహ్) మరియు ఇతర పండితులు ఖురాన్ లోని ఈ వాక్యం ఆధారంగా స్వయంతృప్తి నిషిద్ధం (హరామ్) అని పేర్కొన్నారు: "ఎవరైతే తమ భార్యలు …. తప్ప ఇతర మార్గాల ద్వారా తృప్తిని కోరుకుంటారో, వారు హద్దు మీరిన వారు" (అల్-ముఅమినూన్: 5-7). ప్రవక్త ﷺ కూడా యువతను ఉద్దేశించి "సామర్థ్యం ఉంటే పెళ్లి చేసుకోమని, లేకపోతే ఉపవాసం ఉండమని" చెప్పారు. ఆయన స్వయంతృప్తికి అనుమతి ఇవ్వలేదు. 3. వివాహం (పెళ్లి): ఈ సమస్యకు ఇస్లాం సూచించిన అత్యంత గొప్ప మరియు శాశ్వత పరిష్కారం వివాహం. అల్లాహ్ ఇలా అన్నాడు: మీలో భార్యవిహీనులుగా, భర్తవిహీనులుగా ఉన్నవారికి పెళ్ళిళ్ళు చేయండి. అలాగే మీ బానిసలలో యోగ్యులైనవారికి కూడా పెళ్ళిళ్ళు చేసేయండి. వారొకవేళ నిరుపేదలైతే అల్లాహ్ తన ప్రత్యేక అనుగ్రహంతో వారిని ధనికులుగా చేస్తాడు. అల్లాహ్ సకల సాధన సంపన్నుడు, సమస్తం తెలిసినవాడు. (అన్-నూర్: 32). పెళ్లి బాధ్యతలకు భయపడి లేదా చదువు సాకుతో దానిని వాయిదా వేయకూడదు. 4. చెడు ఆలోచనలను అరికట్టడం: ఇది చికిత్సలో అతి ముఖ్యమైన భాగం. ఆలోచనలే కోరికలకు, కోరికలే పనులకు, పనులే అలవాట్లకు దారితీస్తాయి. అందుకే ప్రారంభంలోనే చెడు ఆలోచనలను తుంచివేయాలి. ఇమామ్ ఇబ్న్ ఖయ్యిమ్ (రహ్) చెప్పినట్లు, మనసు ఒక తిరగలి (Grinding stone) విసుర్రాయ, రాగల్రాయి, గానుగ వంటిది. అందులో మంచి గింజలు వేస్తే మంచి పిండి వస్తుంది, చెత్త వేస్తే చెత్తే వస్తుంది. అందుకే మనసును అల్లాహ్ స్మరణతో, మంచి విషయాలతో నింపుకోవాలి. 5. చూపును అదుపులో ఉంచుకోవడం (Lowering the Gaze): కళ్లతో చూసే అశ్లీల దృశ్యాలే మెదడులో ముద్ర పడి, తర్వాత ఆలోచనలుగా మారి ఈ అలవాటుకు ప్రేరేపిస్తాయి. అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: "విశ్వాసులకు చెప్పు, వారు తమ చూపులను అదుపులో ఉంచుకోవాలి" (అన్-నూర్: 30). సోషల్ మీడియా, సినిమాలు మరియు అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండాలి. 6. ఆరాధనల్లో మరియు ధర్మ ప్రచారంలో నిమగ్నం అవ్వడం: ఖాళీ మనసు దుష్ట ఆలోచనలకు, షైతాన్ ప్రేరకాలకు నిలయం. నమాజ్, ఉపవాసం, ఖురాన్ పఠనం, తల్లిదండ్రుల సేవ మరియు సమాజ సేవలో నిమగ్నమైన యువకుడికి చెడు ఆలోచనలు చేసే సమయం ఉండదు. 7. కలిగే నష్టాలను గమనించడం: దీనివల్ల శారీరక బలహీనత, చూపు మందగించడం, నడుము నొప్పి, నరాల బలహీనత మరియు మానసిక ఆందోళనలు కలుగుతాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మరియు మనిషిని ఒంటరిగా మార్చేస్తుంది. 8. తప్పుడు అపోహలను తొలగించుకోవడం: కొంతమంది వ్యభిచారానికి దూరంగా ఉండటానికి ఇది అవసరమని అనుకుంటారు. కానీ ఇది కేవలం ఒక తాత్కాలిక భ్రమ మాత్రమే. ఇది కోరికను ఆపదు, సగటున మనిషిని మరింత బలహీనపరుస్తుంది. 9. స్వార్థ చింతనకు స్వస్తి పలకండి. హస్తప్రయోగం అలవాటు, మనం కేవలం మన గురించే ఆలోచించుకునేలా చేస్తుంది. ఉదాహరణకు, హస్తప్రయోగం చేసేటప్పుడు ఒక వ్యక్తి మనసంతా తన శరీరం పొందుతున్న సుఖం మీదే ఉంటుంది. హస్తప్రయోగం ద్వారా అలవడిన స్వార్థపూరిత ఆలోచనాతీరు వల్ల, వివాహంలోని లైంగిక సంబంధం నుండి సంతృప్తి పొందలేరు. 10. సంకల్ప బలం (Will Power): ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం) ఎదుర్కొన్న పరీక్షను గుర్తుచేసుకోవాలి. ఎంతటి ప్రలోభం ఎదురైనా అల్లాహ్ భయంతో వెనక్కి తగ్గాలి. 11. ఒంటరితనానికి దూరంగా ఉండటం: ఒంటరిగా ఉండటం వల్ల సైతాన్ త్వరగా దాడి చేస్తాడు. అందుకే ఎప్పుడూ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ఉండటానికి ప్రయత్నించాలి. ఒంటరిగా పడుకోవద్దని ప్రవక్త ﷺ వారించారు. 13. ఉపవాసం యొక్క శక్తి: ప్రవక్త ﷺ చెప్పినట్లు, వివాహం చేసుకోలేని వారు ఉపవాసం ఉండాలి. ఉపవాసం మనిషిలోని కామ కోరికలను నియంత్రణలో పెడుతుంది. . 13. వింత చికిత్సల పట్ల జాగ్రత్త: అడ్డగోలుగా మొక్కుబడులు మొక్కుకోవడం లేదా అల్లాహ్ మీద ఒట్టు వేయడం వంటివి చేయకూడదు. ఒకవేళ పొరపాటున అలవాటు రిపీట్ అయితే కఫ్ఫారా (పరిహారం) కట్టాల్సి వస్తుంది. అలాగే లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా చంపేసే మందులు వాడకూడదు. 14. నిద్రపోయేటప్పుడు పాటించాల్సిన నియమాలు: కుడివైపు తిరిగి పడుకోవడం, బోర్లా (కడుపు మీద) పడుకోకపోవడం, నిద్రపోయే ముందు వజూ చేసుకోవడం మరియు అల్లాహ్ స్మరణ (దుఆలు) చేయడం వల్ల చెడు కలలు, ఆలోచనలు రావు. 15. చెడు పుస్తకాలు, పత్రికల పట్ల జాగ్రత్త: వైద్య సలహాల పేరుతో స్వయంతృప్తిని సమర్థించే పుస్తకాలను చదవకూడదు. అవి మనసును మరింత పాడుచేస్తాయి. "నీకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించడంలో నిన్ను నువ్వు నిమగ్నం చేసుకోవడం అత్యంత ప్రయోజనకరమైన మందు, నీకు సంబంధం లేని విషయాల గురించి కాదు. నీకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచించడం ప్రతి చెడుకు తలుపు. నీకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచించే వాడు" అంటే: తన ఇహపరలోకాలకు మేలు చేయని, మంచి చేయని విషయాల గురించి ఆలోచించేవాడు "తనకు సంబంధించిన విషయాలను కోల్పోతాడు. తనకు అత్యంత ప్రయోజనకరమైన విషయాలను వదిలివేసి, తనకు ఎటువంటి ప్రయోజనం లేని విషయాలలో నిమగ్నమవుతాడు. ఆలోచనలు, ఊహలు, సంకల్పం మరియు పట్టుదల నీలో నీవు సంస్కరించుకోవడానికి అత్యంత అర్హమైన విషయాలు. ఇవే నీ ప్రత్యేకత మరియు నీ యదార్థత, వీటి ద్వారా నీవు నీ దేవునికి మరియు ఆరాధ్యునికి దూరం అవుతావు లేదా దగ్గర అవుతావు. ఆయన సామీప్యం మరియు ఆయన ప్రసన్నతలోనే నీకు సంతోషం ఉంది, ఎవరి ఆలోచనలు మరియు ఊహల పరిధులు అధమంగా మరియు నీచంగా ఉంటాయో, అతని పనులు కూడా అలాగే ఉంటాయి". 16- రెండు సద్గుణాలను అలవర్చుకోవడం: "సహనం మరియు పవిత్రత" షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా - అల్లాహ్ అతనిపై కరుణించుగాక - ఇలా అన్నారు: "నిషిద్ధ పనులకు (హరామ్) దూరంగా ఉండటంలో సహనం వహించడం విధి (వాజిబ్), మనస్సు వాటిని కోరుకున్నా మరియు ఇష్టపడినా సరే. అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు:'మరియు వివాహం చేసుకోవడానికి అవకాశం లేనివారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ఐశ్వర్యవంతులను చేసే వరకు పవిత్రతను పాటించాలి.' (సూరా అన్-నూర్: 33) 'ఇస్తిఆఫాఫ్' (పవిత్రతను కోరడం) అంటే నిషేధించబడిన వాటిని వదిలివేయడం, అబూ సయీద్ అల్-ఖుద్రీ (రజి అల్లాహు అన్హు) ద్వారా ఉల్లేఖించబడిన సహీహ్ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: 'ఎవరు పవిత్రతను కోరుకుంటారో, అల్లాహ్ వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరు స్వయంసమృద్ధిని కోరుకుంటారో, అల్లాహ్ వారిని ఐశ్వర్యవంతులను చేస్తాడు. ఎవరు సహనాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారో, అల్లాహ్ వారికి సహనాన్ని ప్రసాదిస్తాడు. మరియు సహనం కంటే మెరుగైన మరియు విశాలమైన కానుక ఎవరికీ ఇవ్వబడలేదు.' " [మజ్మూ' అల్-ఫతావా 10/574] 17. చెడు తర్వాత మంచి పని చేయడం: ఒకవేళ పొరపాటు జరిగితే వెంటనే తౌబా (క్షమాపణ) చేసి, ఏదైనా మంచి పని లేదా నమాజ్ చేయాలి. "మంచి పనులు చెడులను తుడిచివేస్తాయి" (హూద్: 114). 18. దుఆ (ప్రార్థన): అల్లాహ్ సహాయం లేకుండా ఏదీ సాధ్యం కాదు. నిరంతరం అల్లాహ్ తో మొరపెట్టుకోవాలి. మీ వినోదాన్ని పరిశీలించుకోండి. లైంగిక కోరికలు రేకెత్తించే సినిమాలు, టీవీ కార్యక్రమాలు లేదా వెబ్‌సైట్లు మీరు చూస్తుంటారా? “వ్యర్థమైనవాటిని చూడకుండా నా కళ్లను పక్కకు తిప్పు” అని, "ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను అశక్తత (చేతకానితనం), సోమరితనం, పిరికితనం, లోభత్వం, చింత (విచారం), సమాధి శిక్ష మరియు దజ్జాల్ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా ఆత్మకు దైవభీతిని ప్రసాదించు, దానిని పరిశుద్ధం చేయి, దానిని పరిశుద్ధం చేసేవారిలో నీవే అత్యుత్తముడివి, నీవే దానికి రక్షకుడివి మరియు యజమానివి. భయం లేని హృదయం నుండి, ప్రయోజనం లేని జ్ఞానం నుండి, వినబడని (అంగీకరించబడని) ప్రార్థన నుండి మరియు సమాధానం లభించని పిలుపు నుండి నేను నీ శరణు కోరుతున్నాను." అని అల్లాహ్ ను వేసుకోండి. 19. నిరాశ చెందకండి: పైన చూసినట్లు, హస్తప్రయోగానికి అలవాటుపడిన వాళ్లు అపరాధ భావాలతో సతమతమౌతుంటారు. నిజమే, “దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉన్న దుఃఖం” ఆ అలవాటు మానుకోవడానికి మీకు ఒక ప్రేరణగా ఉండగలదు. కానీ మరీ ఎక్కువగా దుఃఖపడడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. దానివల్ల మీరు పూర్తిగా నిరుత్సాహ పడిపోయి, ఆ అలవాటును మానుకోవాలనే పోరాటాన్ని ఆపేసే ప్రమాదం ఉంది. ఎన్నిసార్లు విఫలమైనా అల్లాహ్ కారుణ్యం మీద ఆశ కోల్పోకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. కాబట్టి పరిస్థితిని సరైన విధంగా చూడడానికి కృషి చేయండి. హస్తప్రయోగం ఒక అపవిత్రమైన అలవాటు. అది మిమ్మల్ని ‘రకరకాల కోరికలకు, సుఖాలకు బానిసలుగా’ చేసి, తప్పుడు ఆలోచనా విధానాల్ని మీలో పెంపొందిస్తుంది. అదే సమయంలో, హస్తప్రయోగం వ్యభిచారం అంత ఘోరమైన లైంగిక పాపం కాదు. కాబట్టి మీకు ఒకవేళ హస్తప్రయోగం అలవాటు ఉంటే, మీరు క్షమించరాని పాపం చేస్తున్నారని అనుకోకండి. బదులుగా, ఆ కోరికను అణిచివేస్తూ మీ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు విజయం సాధిస్తారు! ఎప్పుడైనా మళ్లీ ఆ తప్పు చేస్తే, నిరుత్సాహపడడం సహజమే. కానీ ఒక్కసారి తప్పు చేయగానే మీరు చెడ్డవాళ్లు అయిపోరు. కాబట్టి మీ అలవాటుతో పోరాడుతూ ఉండండి. ఏ కారణం వల్ల లొంగిపోయారో ఆలోచించుకొని, మళ్లీ అలా జరగకుండా చూసుకోండి. 20. పేరెంట్స్ తో మీ భావాలను పంచుకోండి మీ సమస్య గురించి ఎవరితోనైనా మాట్లాడండి. మీరు నమ్మే స్నేహితునితో లేదా కుటుంబ సభ్యునితో ఈ విషయం గురించి మాట్లాడాలంటే మీకు సిగ్గు అనిపించవచ్చు. కానీ అలా మాట్లాడడం ఆ అలవాటును మానుకోవడానికి మీకు సహాయం చేయగలదు! దావూద్ మంచిగా మారిన ఓ యువకుడు ఇలా అంటున్నాడు: “నేను మా నాన్నతో ఒంటరిగా దీని గురించి మాట్లాడాను. అప్పుడు ఆయన అన్న మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నాకు భరోసా ఇస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ‘నిన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది.’ ఎందుకంటే ఆయనతో ఆ విషయం గురించి మాట్లాడడానికి నేనెంతో ధైర్యం కూడగట్టుకున్నానని ఆయనకు తెలుసు. ఆయన అన్న ఆ మాట నన్ను ఎంతో ప్రోత్సహించింది, దాన్ని మానేయాలనే పట్టుదలను ఇంకా పెంచింది. “అప్పుడు, మా పండితుల కొన్ని ఉపదేశాల్ని చూపించి, నా పరిస్థితి చేయిదాటిపోలేదని అర్థం చేసుకునేలా సహాయం చేశాడు. తర్వాత, నేను చేసిన తప్పు ఎంత గంభీరమైనదో అర్థం చేసుకోవడానికి మరికొన్ని ఉల్లేఖనాలు చూపించాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు. నేను ఒకవేళ మళ్లీ దానికి లొంగిపోతే నిరుత్సాహపడవద్దని, ఇంకొంచెం ఎక్కువకాలం ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించమని నాకు చెప్పాడు.అలా చివరకు నేను ఆ చెడు అలవాటు నుండి విముక్తి పొందాను. 21.అల్లాహ్ ప్రేమ గురించి ఆలోచించండి సమయం తీసుకొని అల్లాహ్ ప్రేమ గురించి, కరుణ గురించి లోతుగా ఆలోచించండి. బలహీనత కారణంగా ఒకసారి తప్పు చేసిన మనందరి పితామహులు చేసిన దుఆను గుర్తు చేసుకోండి. “ప్రభూ! (మేము ఆత్మవంచనకు పాల్పడి) మాకు మేమే అన్యాయం చేసు కున్నాం. (ఇక నీవే మాకు దిక్కు.) నీవు మమ్మల్ని కనికరించి క్షమించకపోతే మేము సర్వనాశనమైపోతాము” అన్నారు వారిద్దరూ (పశ్చాత్తాపంతో కుమిలిపోతూ). (అల్-ఆరాఫ్-23) ప్రవక్త యూసుఫ్ (అ) అత్యంత నాజూకు సమయంలో చేసిన దుఆను గుర్తు చేసుకొండి. అప్పుడు యూసుఫ్‌ (విశ్వప్రభువును తలచుకుంటూ) “ప్రభూ! వీరు నానుండి కోరుతున్న దానికంటే నాకు జైలుశిక్షే ఇష్టం. నీవు నన్ను వీరి పన్నాగాల నుండి తప్పించక పోతే నేను వీరి వలలో చిక్కుకొని మూఢుల్లో చేరిపోయే ప్రమాదం ఉంది” అని (దైవాన్ని) వేడుకున్నాడు. (యూసుఫ్: 33). ప్రతిగా అల్లాహ్ ఆయన్ను కాపాడి పరమ పునీతుణ్ణి చేయడమే కాక, తర్వాత ఈజిప్ట్ రాజ్యానికి మకుటం లేని మారారాజుగా చేశాడు. అతని ప్రభువు అతని మొరాలకించి అతడ్ని ఆ స్త్రీల కుట్రల నుండి కాపాడాడు. ఆయనే మొరలను ఆలకించేవాడు, సమస్తం ఎరిగినవాడు. (యూసుఫ్: 34) 70 తల్లులకన్నా అధిక కరుణ గలవాడు అల్లాహ్. ముఖ్యంగా తనకు భయపడేవాళ్ల మీద ప్రత్యేకమైన కరుణ కురిపిస్తాడు. . ఎందుకంటే, మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు, మనం మట్టి మనుషులమని, అనేక దౌర్బల్యాలు మనలో ఉన్నాయని, మనం అనేక బలహీనతలతో పుట్టించబడ్డామని ఆయనకు తెలుసు. అవును, మన బలహీనతలను ఆయన అర్థం చేసుకునే విధంగా విశ్వజగత్తులో ఎవరూ చేసుకోలేరు. నిత్యం ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రవక్తా! (వారికి నా మాటలుగా) ఇలా చెప్పు: “ఆత్మవంచనకు పాల్పడిన నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందకండి. అల్లాహ్ తప్పకుండా మీ పాపా లన్నిటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (అజ్-జుమర్: 53) అదే సమయంలో, మెరుగవ్వడానికి, మహా మనీషిగా ఎదగడానికి మనం గట్టిగా కృషి చేయాలని ఆయన ఆశిస్తాడు కూడా. ముఖ్యమైన ధర్మ సందేహాలు: స్వయంతృప్తి వల్ల స్నానం (ఘుసుల్) తప్పనిసరి అవుతుందా? అవును, వీర్యం వెలువడితే అది జనాబత్ (అపవిత్రత) కిందకు వస్తుంది. స్నానం చేయకుండా నమాజ్ చేయకూడదు, ఖురాన్ తాకకూడదు. స్నానం ఎలా చేయాలి? ముందు చేతులు కడుక్కోవాలి, తర్వాత వజూ చేయాలి, తర్వాత తల మీద నీళ్లు పోసుకుని పూర్తి శరీరాన్ని తడపాలి. వీర్యం పవిత్రమైనదా? చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం వీర్యం పవిత్రమైనదే (తాహిర్), కానీ అది బట్టలకు అంటితే కడుక్కోవడం శ్రేయస్కరం. ఒకవేళ వీర్యం బయటకు రాకుండా ఆపుకుంటే స్నానం చేయాలా? బయటకు రానంత వరకు స్నానం అవసరం లేదు, కానీ ఆ ప్రయత్నం చేసినందుకు అల్లాహ్ కు క్షమాపణ చెప్పుకోవాలి. రంజాన్ ఉపవాసంలో ఇది చేస్తే ఏమవుతుంది? ఉపవాసం వి భంగమవుతుంది.. ఆ రోజును మళ్ళీ పాటించాలి (ఖజా) మరియు అల్లాహ్ కు తౌబా చేయాలి. హజ్ లేదా ఉమ్రాలో ఇది చేస్తే? హజ్/ఉమ్రా పాడవుదు కానీ, పరిహారంగా ఒక గొర్రెను బలి ఇవ్వాలి (దమ్) మరియు క్షమాపణ వేడుకోవాలి. ముగింపు: సోదరా, ఈ సమస్య నుండి బయటపడటం అసాధ్యం కాదు. అల్లాహ్ పై నమ్మకంతో, పైన చెప్పిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. అల్లాహ్ మనందరినీ చెడుల నుండి రక్షించుగాక. ఆమీన్.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు