Friday, February 16, 2024
Sunday, February 11, 2024
చరిత్ర పుటల్లో రమజాన్ స్మృతులు
అది 20వ శతాబ్ది చివరి రోజుల మాట. సోవిట్ యూనియన్ అఫ్గానిస్తాన్ మీద మెరుపుదాడులు చేస్తుంది. పేలుడు వదార్థాలు మోసే ఫ్లైట్లు వసిపిల్లలపై, అమాయక ప్రజలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అటు బోసినియాలో ముస్లిం పౌర సంహారానికి పథకాలు వేస్తున్నారు. వయోభేదం లేకుండా విచక్షణారహితంగా తలల్ని పుచ్చకాయల్లా కోసిపారేస్తున్నారు. పాలస్తీనా మీద ఇస్రాయీల్ డేగ కళ్ళు వడ్డాక అక్కడి వసికందులకు కంటిమీద కునుకు కరువయింది. ఇరాక్ మరియు ఈరాన్ పరస్పరం సోదరులన్న విషయం నురచి తీవ్రంగా కల హించుకుంటున్నాయి. ముస్లిం సముదాయవు మానం మర్యాదలు ఎటుచూసి నా దోచుకోబడుతున్నాయి. భూమి అత్యంత విశాలంగా ఉండి కూడా ఏకేశ్వరోపాసకులకు చోటు లేదా? అన్న భావన కలిగేది.
కానీ చమత్కారం జరిగింది. ప్రతికూల పరిస్థులు అనుకూలంగా మారాయి. ధీరవంతులైన గుప్పెడు జనాల చేతిలో అతి పెద్ద శక్తి పరాభనం పాలయింది. షహీదుల రక్తం తన ప్రతాపం చూపింది. అవమానం పాలై శత్రు సైన్యాలు వెన్ను చూపాయి. ఇది ఇలా ఉండగా మరో వైపు వివిధ దేశాల్లో ఇస్లాం అనుయాయులకు స్పష్టమైన విజయాలు లభించనారంభించాయి. తళుక్కున ఒక ఆశాకిరణం మెరిసింది. మరోక్కసారి ఇస్లాం 'రాజకీయ శక్తి'గా ప్రపంచ వేదిక మీద రావచ్చు అన్న ఆశ చిగురించింది. అవిశ్వాస హృదయాల్లోని కావట్యం, కుళ్ళు వారి వదనాలపై కదలాడనారంభించింది. వివేచనావరులు, మేధావులు 21వ శతాబ్దం 'ఇస్లామీయ శతాబ్దం' కానున్నది అని భవిష్యవాణులు విన్పించారు. కానీ, ఇస్లాంపై ఎవరి కళ్ళు పడ్డాయేకానీ, కన్న కలలన్నీ ఒక్కసారిగా కల్లలై కుప్ప కూలి పోయాయి. పెంచుకున్న ఆశలన్నీ ఆడియాశలైపోయాయి. సెప్టెంబర్ 11 సంఘటన తన ప్రభావం చూపనే చూపింది. అంచనాలకు మించి ఫలితాల్ని రాబట్టింది. డబ్ల్యు.టి.సి. టవర్లలో అగ్గి తగలడమే ఆలస్యం, ఇటు పూర్తి ముస్లిం సమాజంపై మెరువులు కురిశాయి. విచక్షణారహితంగా, పరిశీలించకుండా, పరిశోధించకుండా, యుక్తాయుక్తాల గురించి ఆలోచించకుండానే పూర్తి ముస్లిం జనాభాపై నేరం మోపబడింది. చేయరాని నేరానికి వారి ముద్దుబిడ్డలను ఉరి తీయడం, పైశాచికంగా హింసించడం జరిగింది. .
మీడియా ద్వంధ వైఖరి ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, గల్లీలో పల్లీలమ్ముకునే పేద ముస్లింని సైతం అనుమానాస్పదంగా చూసే దినాలొచ్చాయి. ముస్లింల ఇంట పుట్టే ప్రతి పసివాడు లోకం దృష్టిలో టెర్రరిస్ట్గా గుర్తించ బడ్డాడు. ముస్లిం జనాల నుంచి వాక్కు స్వాతంత్య్రం లాక్కోబడింది. వారు తమ దేశ రక్షణ కోసం చేసే పోరాటాన్ని సైతం ఉగ్రవాదం అన్న లేబుల్ తగిలింది. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న ఇస్లాంను అణచివేసే సువర్ణావకాశం కుమతులకు, కలహాకారులకు అందింది. ప్రగతిని సాధిస్తున్న ఇస్లాం ప్రియులు నానా రకాల విమర్శలకు బలైపోయారు. మెప్పు స్థానే అసహ్యం చోటు చేసుకుంది. ప్రేమ స్థానే పగ వచ్చి దూరింది. ఒక్కసారిగా అఫ్గానిస్తాన్లో రక్తవు హోలి తాండవ మాడింది. అటుకుల్లా మనిషి బ్రతుకుల్ని దంచివేసే ఆట ఊపిరిపోసుకుంది. ఇరాక్ పూర్తిగా అధోగతికి గురయ్యింది. ముస్లిం సిరిసంపదల్ని ఇతరులు ఖబ్జా (ఆక్రమణ) చేసుకున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా ఆ జాబితాలో చేరింది ప్రతి శుక్రవారం పెలుడు పదార్థాలతో ప్రార్థనాలయాలు పేలుడు పదార్థాలతో దద్దరిల్లుతున్నాయి. పాలస్తీనా మంటల్ని అప్పుడప్పుడు ఆజ్యం పోయడం జరుగుతుంది. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సంఖ్యలో ముస్లింలు నివసించే భారత దేశంలో కూడా వారిని సర్వనాశనం చేయడానికై సన్నాహాలు సాగుతున్నాయి. పనిగట్టుకొని ముస్లిం, ఇళ్లను, ప్రార్థనాలయాలను, పాఠశాలలను, 600 యేండ్ల చరిత్ర గల కట్టడాలను బుల్డోజర్ఫ్ నీతితో కుప్ప కూల్చే రాక్షస క్రీడ ఊపండుకుంది. రాజకీయమే మతమై మారణకాండ సృష్టించడానికి సిద్ధమవుతున్నది. రానున్న రోజుల్లో ఈ కుటిల నీతిజ్ఞుల కుట్రలు తారా స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. దైవం దయదలిస్తే తప్ప ఇక మరో ప్రత్యామ్నాయం లేదా అన్న దౌర్భాగ్య స్థితి చోటు చేసుకుంది.
ప్రస్తుతం పూర్తి ముస్లిం సముదాయం నిరాశ నిస్పుృహలకు లోనై ఉంది. ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది రెక్కలు తెగి నేలకొరిగిన వక్షిలా వారి స్థితి మారిపోయింది తరుణోపాయం కోసం వారందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అని ఆశలు పెంచుకొని బ్రతుకుతున్నారు.
ఇట్టి క్లిష్ట స్థితిలో మరొక్కసారి రమజాను మాసం ముస్లిం సముదాయంపై కారుణ్య మేధమై వాలింది. రమజాను మానం భయంకర ఎడారిలో జలనిధి శుభవార్తను, బంజరు భూమిలో బంగారు వంట కబురును మోసుకొచ్చే సుగంధ భరిత వవనం. ఈ మానంలో నత్కార్యాలు, పుణ్యఫలాలు ఏరులై పారుతాయి. దానికితోడు ఈ మాసం దళిత జనాల పాలిట, పీడిత ప్రజల పాలిట విప్లవ నాదం, మార్పుకి చిహ్నం కూడా.
కారుణ్య గ్రంథం ఈ మాసంలోనే అసతరంచింది. ఈ ఉద్గ్రంథం అన్యాయాన్ని ఆక్రమాల్చి, దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని అంతమొం దించింది. ఈ గ్రంథరాజం మూలంగానే పీడిత ప్రజలు, దళిత జనాలు, పాలిత ప్రజలు పాలకులయ్యారు. గొర్రెల్ని మేపే కృషి నలులు, ఒంటెల్ని తోలుకునే క్రమఃవులు సభ్యతా సంస్కారాల్ని వెదజల్లే చిరుదివ్వెలయ్యారు. అబ్దుల్లా ముద్దుల కొడుకు ముహమ్మద్ ఈ దళిత జనాల నుంచి ఉద్భవించిన నాయకుడే. అవిశ్వాస అంధకారాల్లో కొట్టుమిట్టాడే మానవాళికి దివ్యతేజమై, ఉదయ భానుడై వెలిగాడు. ఆయనపై తొలి దైవవాణి అవతరించి, ఆయనకు దైవదౌత్యం ఒసగబడింది ఈ మాసంలోనే.ఫిరౌను కబంధహసాల నుండి విముక్తి కలిగించే తౌరాత్ గ్రంథం కూడా ఈ మాసంలోనే లభించింది. యూద జనాల్ని, ఇస్రాయీలు ప్రజల్ని ప్రభువు మార్గాన నడిపేందుకు నచ్చిన ఇంజీల్ ( దేవుని సువార్త) గ్రంథం సైతం ఈ మాసంలోనే అవతరించింది. నియంత నమ్రూదును ఎదిరించేందుకు, బూటకపు దైవాల్ని మట్టికరిపించేందుకు, దాసుల మెడలలో పడివున్న శృంఖా లను త్రెంచెన్దుకు 'సుహుఫ్ ఇబ్రాహీమ్' ఈ మాసంలోనే ఇవ్వబడ్డాయి. ఉదయం సాయంత్రాలు దైవమహిమను కొనియాడేందుకు జబూర్ గ్రంథం ఈ మాసంలోనే వచ్చింది.
ఈ మాసంలోనే బద్ర్ సంగ్రామం జరిగింది. ఈ దినాన్నే ఖుర్ఆన్ 'యౌముల్ ఫుర్ఖాన్'గా పేర్కొంది. ఈ సమరం సత్యానికి అనత్యానికి, దర్మానికి అధర్మానికి మధ్య జరిగింది. ఈ సత్య సమరం సత్యాసత్యాలకు మధ్య గీటురాయిగా నిలిచింది. ఈ సత్యపోరులో అల్లాహ్ అవిశ్వానపు వ్రేళ్ళను కూకటి వ్రేళ్ళతో సహా పెకళించాడు. మక్కా విజయం కూడా ఈ మాసంలోనే ప్రాప్తమయింది. ఇది కేవలం మక్కా పరిసరాలకు పరిమితమయిన విజయం కాదు. పూర్తి ప్రపంచపు రాజకీయ వ్యవస్థ మార్పుకి సంకేతం. ఈ మాసంలోనే అజాన్ కూడా షరియత్ విభాగంలోకి వచ్చింది. ఇది తౌహీద్ నినాదం. ఘంటారావంగా 'దేవుడు ఒక్కడే' అన్న పిలువును విశ్వమానవాళికి చేరవేసే ఆజాన్ నినాదం నాటి నుంచి నేటివరకు, నేది నుండి ప్రశయం వరకు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నిర్విఘ్నంగా సృష్టి మొత్తంలో వినబడే ఏకేశ్వరోపాసనా పిలుపు, అమ్ర్ బిన్ ఆస్ (ర) సారధ్యంలో ఈజిప్టుపై విజయ ఢంకా ఈ నెలలోనే మ్రోగించబడింది, తారిఖ్ బిన్ జియాద్ ఉందులుస్ - నేటి ఫ్రాస్ ను ఈ మాసంలోనే జయించారు. 15 ఏళ్ళ సూనుగు మీసాల కుర్రోడు ముహమ్మద్ బిస్ ఖాసిమ్ రాజు దాహిర్ ను ఓడించి సింధూ ప్రాంతాన్ని ఇస్లామీయ రాజ్యంలో విలీనపర్సింది ఈ మాసంలోనే.
ఈ నెలలోనే ఇమాదుద్దీన్ జంకీ శిలువ క్రూసేడులపై విజయ పతాకను ఎగుర వేసింది. ఉస్మానీయ పలపాలకులు ఈ పూసలలోనే 'హంగదే'ని తన కైవసం చేసుకున్నారు. ఈ సంఘటనలన్ని ఇచ్చే సందేశం - రనుజాన్ మాసం శుభప్రదాయిని, కారుణ్య వర్షిణీ మాత్రమే కాదు. అది ముస్లింల -పాలిట విజయ పరంపరల సువార్తలను అందజేసే మాసం కూడా. పరీక్షలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఈ సముదాయపు అంతర్భాగాలు. దాని చరిత్రలో సమస్యల సునామీలు, పరీక్షల తుఫానులు లేని కాలకుంటూ ఏదీ లేదు. అయినప్పటికీ చరిత్ర ఇచ్చే సాక్ష్యం- ఈ సముదాయం పడుతూ పడుతూ కూడా ఉవ్వేత్తున లేచింది. మరణ ఘడియలు దీనికి ఆవహించాయి అని అందరూ అన్న నాజూకు సమయంలో కూడా జీవం పోసుకుని నిండు యవ్వనాన్ని సంపాదించుకుంది. కారణం- 'పదివేల పౌరుల రక్తంలోనే, త్యాగంతోనే విజయం సాధ్యం' అన్న మాటను అక్షరాల నమ్మినవారు వీరు.. ప్రతి ఎడారి తర్వాత ఒక ఉద్యానవనం ఉంటుందని, ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉండి తీరుతుందన్నది వీరి ప్రగాఢ నమ్మకం. వీరు ఎవరూ ఎరగనంతట ఆశాజీవులు. విజయపరంపరలు వీరి లక్షణాలు. పరాజయం మీద పరాజయాలు వీరు ఎరుగరు. కాబట్టి శుభప్రదమైన ఈ మాసంలో, విప్లవాత్మకమైన ఈ నెలలో నింగికీ నేలకి నిచ్చెన వేయాలన్న స్ఫూర్తితో ప్రతి వ్యక్తి సంసిద్ధమవ్వాలి. సలహా సంప్రదింపులతో కొంగ్రొత్త ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఇది మన లక్ష్యం అంటూ ముందుకు దూసుకుపోవాలి, రమబాను నెలవంక మన జీవితాల్లో విప్లవ జ్యోతియై వెలగాలి. విప్లవం అనేది మనలోని ప్రతి వ్యక్తి తన్నుతాను మార్చుకోవాలి, గొప్పగా మలచుకోవాలి అన్న ఆత్మపరిశీలనతోనే వస్తుంది. నిజం ఏమి టంటే -
"నిశ్చయంగా అల్లాహ్ కూడా ఆ బాతి దుస్ధితిని మార్చడు. ఏ జాతి అయితే స్వయంగా తన మనోస్థితిని మార్చుకోదో, అల్లాహ్ ఏ జాతి సయినా శిక్షించదలచుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప నారిని రక్షించేవాడు కూడా ఎవరూ ఉండరు. (దివ్యఖంఆన్- అర్రాద్: 11))
వ్యవస్థ- అది ఎంత బలమైనదైనా, సిద్ధాంతం అది ఎంత ఉత్తమమైనదైనా, కేవలం అనుసరించినందు వల్ల సమైక్యత, సాఫల్యం సిద్ధించదు. విస్తృతమైన, ప్రగాఢమైన ఎరుక, చైతన్యం, విప్లవభావం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ ఎరుక చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ఊరికే పైపై ఉత్తుత్తి ఫలితాలతో తృప్తిపడితే చాలదు. 'సముద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా?
హిమ నగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా? లేదు కదా! పారాడుతూ, పోరాడుతూనే ఉండండి. చివరి శ్వాస ఆగే
వరకు, పోతూ పోతూ ప్రేమను పంచండి. లోక శాంతి, విశ్వకళ్యాణం సిద్ధించే వరకు.
Friday, February 9, 2024
Saturday, February 3, 2024
Subscribe to:
Comments (Atom)
