Saturday, June 14, 2014

ముహర్రం – సాంప్రదాయాలు, దురాచారాలు


“ముహర్రముల్ హరామ్” ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం మొదటి మాసం. ప్రతి సంవత్సరం ఈ మాసం వచ్చి- నప్పుడు ప్రవక్త జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం గుర్తుకు వస్తుంది. అదే ‘హిజ్రత్’ (మక్కా నుండి మదీనాకు వలసపోవుట). హిజ్రత్ తరువాతనే ఇస్లాం ధర్మం బల పడింది. ఇతర ప్రాంతాలకు అతి వేగంగా పాకింది. ఇస్లాం దర్మాన్ని కాపాడుటకొనుటకు స్వదేశాన్ని వీడిపోయే సందర్భం వచ్చినా నేను సిద్ధం అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ ముహర్రం మాసం.
ఇస్లామీయ పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు చాలా గౌరవనీయమైనవి. (ఖుర్ఆన్ 9:36). అందులో ఒకటి ఇది కూడాను. ప్రవక్త సల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః
“పన్నెండు నెలలది ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవనీయమైనవి. మూడు క్రమంగా ఉన్నాయి; జుల్ ఖాద, జుల్ హిజ్జ, ముహర్రమ్. నాల్గవది; జుమాద మరియు షఅబాన్ మధ్యలోని రజబ్”. (బుఖారి 3197).
పై ఆయతు మరియు హదీసు ద్వారా తెలిసిందేమిటంటే ఈ పవిత్ర మాసములో ముస్లిములు ఇతర మాసాలకంటే ఎక్కువగా పాపాలకు దూరంగా ఉండాలి. ఇస్లాం వ్యాప్తికై, దాని ప్రాభల్యానికై నిరంతరం కృషి చేయాలి. సమాజంలో అన్ని రకాల చెడుల రూపు మాపడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లవేలల్లో అల్లాహ్ భయబీతి (తఖ్వా) పాటించాలి. అప్పుడే అల్లాహ్ మనతో ఉండి మన ప్రతి కార్యానికి సహాయపడతాడు.
ఈ పవిత్ర మాసము ఘనత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః “రమజాను మాసంలోని విధి ఉపవాసాల తరువాత ఉత్తమమైన ఉపవాసాలు అల్లాహ్ మాసము ముహర్రమ్ యొక్క ఉపవాసాలు”. (ముస్లిం 1163). స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు. తమ సహచరులకు దీని గురించి ప్రోత్సహించేవారు. రుబయ్యిఅ బిన్తె ముఅవ్విజ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త కాలంలో సహచరులు వారి పిల్లవాళ్ళు కూడా ఈ మాసంలో ఉపవాసాలుండేవారు. (బుఖారి 1960, ముస్లిం 1136). రమజాను ఉపవాసాలు విధికాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండింది. మరియు అదే రోజు కాబాపై క్రొత్త వస్త్రం వేయబడేది. (బుఖారి 1592). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నగరానికి వలస వచ్చిన తరువాత యూదులు కూడా ఆషూరా రోజు ఉపవాసం పాటించడాన్ని చూసి, వారిని అడిగితే వారు చెప్పారుః ‘ఈ రోజు సుదినం. ఈ దినమే అల్లాహ్ ఇస్రాయీల్ సంతతిని వారి శత్రువుల బారి నుండి విముక్తి కలిగించాడు. అందుకు హజ్రత్ మూసా అలైహిస్సలాం ఈ రోజు ఉపవాసం పాటించారు’. అప్పడు ప్రవక్త ఇలా ప్రవచించారుః “మూసా అనుకరణ హక్కు మాకు మీ కంటే ఎక్కువ ఉంది”. ఆ తరువాత ప్రవక్త ఉపవాసం పాటించారు, తమ సహచరులకు దీని ఆదేశమిచ్చారు. (బుఖారి 2004).
ఆషూరా రోజు ఉపవాసం ఘనతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“ఆషూరా రోజు ఉపవాసం గురించి అడిగినప్పుడు చెప్పారుః “అందువల్ల గత ఒక సంవత్ససరపు పాపాలు మన్నించబడతాయి”. (ముస్లిం 1162).
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరతో పాటు తొమ్మిదవ తేదిన ఉపవాసం పాటిస్తానని ఉద్దేశించారు. అంటే 9, 10 రెండు రోజులు. (ముస్లిం 1134). అయితే 10, 11 రెండు రోజులు లేదా 9,10,11 మూడు రోజులు కూడా ఉపవాసముండవచ్చని కొందరు పండితులు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు బలహీనంగా ఉన్నాయి. ఇవి ముహర్రం మాసములోని ధర్మాలు.
ప్రవక్తశ్రీ సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువు కాని, ధర్మంగా భావిస్తూ చేస్తున్న పనులను విడనాడాలి. ఉదాహరణకుః పీరీల పండుగలు. ఈ పండుగలు చేయాలని మనకు ఖుర్ఆనులో గాని లేదా ప్రవక్తశ్రీ గారి సహీ హదీసుల్లో గాని ఏదైనా ఆధారం గలదా? కనీసం హజ్రత్ హుసైన్ రజియల్లాహు అన్హు ఇలా చేయాలని ఏదైనా ఆదేశం ఇచ్చారా? మరి కొందరు ఈ పవిత్ర మాసాన్ని అపశకునంగా భావిస్తారు. అంటే వివాహము వంటి ఏదైనా శుభకార్యం ఇందులో చేయరాదని భావిస్తారు. దీనికి ఏ ఆధారమూ మన ఇస్లామ్ ధర్మంలో లేదు. ఇవి ప్రజల మూఢనమ్మకాలు మాత్రమే. ఇంకొందరు నల్లటి దుస్తులు ధరించి శోక వ్రతం అని పాటి-స్తారు. దీనికి కూడా ఇస్లాంలో ఏ మాత్రం అనుమతి లేదు. మరి కొందరు ఈ మాసంలో ఇమాం హుసైన్ రజియల్లాహు అన్హు పేరున మ్రొక్కుబడులు చేస్తారు. మ్రొక్కుబడి ‘ఇబాదత్’ (ఆరాధన), ఇది అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట ఎంతమాత్రం యోగ్యం కాదు.
అల్లాహ్ మనందరిని ఇస్లాంపై స్థిరంగా ఉంచుగాకా! దురాచారాల నుండి దూరముంచి, ప్రవక్త సహీ సాంప్ర దాయాలను అనుసరించే భాగ్యం నొసంగుగాకా!

ముహర్రం శుభాలు



పవిత్ర మాసమైన ముహర్రం మాసం అల్లాహ్ దీవెనలతో కూడిన ఒక ప్రత్యేకమైన మాసం. ఇది హిజ్రీ క్యాలెండరులోని మొదటి మాసం. ఇస్లామీయ సంవత్సరంలోని నాలుగు పవిత్ర మాసములలోని ఒక మాసం.

ఖుర్ఆన్ వెలుగులో

“నిశ్చయంగా,అల్లాహ్ దగ్గర నెలల సంఖ్య పన్నెండు, భూమ్యాకాశాలు సృష్టించినప్పుడే అల్లాహ్ దీనిని నిర్ణయించెను; వాటిలో నాలుగు పవిత్రమైనవి. అది సరైన ధర్మము, కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”ఖుర్ఆన్ సూరా తౌబా9:36

హదీసు వెలుగులో

అబూ బకర్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించినారు: “సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి, వాటిలో నాలుగు పవిత్రమైనవి, వరుస క్రమంలోని మూడు–దుల్ ఖైదహ్, దుల్ హజ్జ్, ముహర్రం మరియు (నాలుగవది) రజబ్ ఏదైతే జుమాదల్ ఉఖ్రా మరియు షాబాన్ మాసముల మధ్యలో వచ్చునో.” (బుఖారీ: 2958)
ముహర్రం అనే పేరు దాని పవిత్రతను సూచిస్తున్నది మరియు ధృవపరుస్తున్నది - అల్లాహ్ పదాలు (ఖుర్ఆన్ పదాల భావానికి అర్థం): “కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…” అంటే ఈ పవిత్ర మాసములలో మీరు స్వయంగా తప్పులు చేయవద్దు. ఎందుకంటే ఈ పవిత్ర మాసములలోని తప్పులు, పాపములు మిగిలిన మాసములలోని తప్పులు, పాపముల కంటే తీవ్రమైనవి.
“కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అనే పదముల గురించిఇబ్నె అబ్బాస్ రజిఅల్లాహు అన్హుమా యొక్క అభిప్రాయం ఇలా ఉన్నది –ఈ ఆయత్ (వచనం) మొత్తం నెలల సంఖ్యను తెలియజేసి, ఆ తర్వాత ప్రత్యేకంగా వాటిలో నుండి ఈ నాలుగింటిని వేరు పరచి, వాటిని పవిత్రమైనవిగా ప్రకటించినది. కాబట్టి ఈ పవిత్ర మాసములలో చేసిన పాపము చాలా గంభీరమైనది మరియు తీవ్రమైనది. అలాగే ఈ మాసములలో చేసిన మంచి పనులు అనేక రెట్ల పుణ్యాలను సంపాదించి పెట్టును.
“కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అనే ఆయత్ (వచనం) గురించి ఖతాదా అనే ఆయన ఇలా అభిప్రాయపడినారు –పవిత్ర మాసములలో చేసే తప్పుడు పనులు (గునాహ్) ఇతర మాసములలో చేసే తప్పుడు పనుల కంటే చాలా గంభీరమైనవి మరియు చాలా పాపాత్మకమైనవి. తప్పుడు పనులు చేయటం అనేది ఏ సమయంలోనైనా సరే పాపాత్మకమైనదే, కాని అల్లాహ్ తన ఇష్టానుసారం కొన్నింటిని ఎక్కువ గంభీరమైనవిగా ప్రకటించెను. అల్లాహ్ తన సృష్టిలో నుండి కొన్నింటిని ఎన్నుకొనెను. తన దైవదూతలలో కొందరిని వార్తాహరులుగా ఎన్నుకొనెను. అలాగే మానవులలో కొందరిని ప్రవక్తలుగా, సందేశహరులుగా ఎన్నుకొనెను. పలుకులలో కొన్నింటిని తన జికర్ (ధ్యానం) కోసం ప్రత్యేకింపబడిన పలుకులుగా ఎన్నుకొనెను. భూమండలంపై ఉన్న ప్రాంతాలలో మస్జిద్ ప్రాంతాలను పవిత్రమైనవిగా ఎన్నుకొనెను. మాసములలో రమదాన్ మాసాన్ని మరియు ఇతర పవిత్ర మాసాలను ఎన్నుకొనెను. వారంలో శుక్రవారాన్ని పవిత్రమైన దినంగా ఎన్నుకొనెను. దినములలో అరఫాహ్ దినాన్ని పవిత్రమైన దినంగా ఎన్నుకొనెను. రాత్రులలో లైలతుల్ ఖదర్ రాత్రిని పవిత్రమైన రాత్రిగా ఎన్నుకొనెను. కాబట్టి వేటినైతే ప్రత్యేకంగా గౌరవించమని అల్లాహ్ ప్రకటించెనో, వాటిని మనం తప్పకుండా గౌరవించవలెను. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, ఖుర్ఆన్ సూరా తౌబా 9:36)

ముహర్రంలో నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలు ఎక్కువగా ఉండటం వలన లభించే శుభాలు

అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ లో ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు:‘అల్లాహ్ యొక్క మాసమైన ముహర్రం మాసపు ఉపవాసము, రమజాన్ తర్వాతి ఉపవాసాలలో ఉత్తమమైనది.’ (ముస్లిం – 1982)
వ్యాకరణ పరంగా “అల్లాహ్ యొక్క మాసం”అనే పదాలు, ఈ మాసపు పేరును అల్లాహ్ యొక్క పేరుతో కలిసి రావటమనేది, ఈ నెల యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, ప్రత్యేకతను సూచిస్తున్నది. అల్ ఖారీ ఇలా తెలిపారు: “ముహర్రం మాసం మొత్తం పవిత్రమైనదే”అనేది దీనిలో ప్రదర్శితమవుతున్న అర్థం. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసం తప్ప వేరే ఇతర ఏ మాసమూ పూర్తిగా ఉపవాసం ఉండలేదనేది నిరూపింపబడిన వాస్తవము. కాబట్టి, ఈ హదీస్ ముహర్రంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండటాన్ని ప్రోత్సహిస్తున్నదని భావించవచ్చును. అంతేగాని ముహర్రం నెల మొత్తం ఉపవాసాలు ఉండమని కాదు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ మాసంలో అధికంగా ఉపవాసాలు ఉండేవారని వేరే హదీస్ లలో నమోదు చేయబడినది. ముహర్రం మాసం యొక్క పవిత్రత గురించి అల్లాహ్ ఆదేశములు వారి చివరి దినముల వరకు అవతరించి ఉండక పోవచ్చును మరియు ఆ ఆదేశముల తర్వాత మరుసటి ముహర్రం మాసం వచ్చేలోగానే ఆయన మరణించి ఉండవచ్చును. (షరహ్ అన్నవావి అలా సహీహ్ ముస్లిం)

అల్లాహ్ తన ఇష్టానుసారం సమయాన్ని, ప్రాంతాన్ని ఎన్నుకొనును



    అల్ ఇజ్జ్ ఇబ్నె అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా తెలిపారు: “సమయాలకు, ప్రాంతాలకు రెండు విధాలుగా ప్రత్యేకత ఇవ్వవచ్చును –ప్రాపంచికంగా లేక ధార్మికంగా. ధార్మికంగా అంటే, ఈ ప్రత్యేక సమయాలలో, ప్రాంతాలలో ప్రతి పుణ్యకార్యానికి అనేక రెట్ల పుణ్యాలను ప్రసాదిస్తూ, అల్లాహ్ తన దాసులపై ప్రత్యేక దీవెనలు కురిపించును. ఉదాహరణకు రమజాన్ మాసపు ఉపవాసాలకు లభించే పుణ్యాలు మిగిలిన సమయాల ఉపవాసాలకు లభించే పుణ్యాల కంటే ఎన్నో రెట్లు అధికమైనవి. అలాగే ఆషూరా దినపు ఉపవాసానికి మిగిలిన నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాల కంటే ఎన్నో రెట్ల పుణ్యాలు లభించును. దీనికి కారణం ఆయా శుభదినాలలో అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులపై కురిపించే ప్రత్యేక దయాదాక్షిణ్యాలు, కారుణ్యాలు.…” (ఖవాయిద్ అల్ అహ్కామ్, 1/38)

    మానవ విలువల పరిరక్షణకు ప్రేరణ


    ప్రకృతినే మనిషి అనాదిగా అనుసరిస్తూ వస్తున్నాడు. కాలగతిలో కేలండర్లు మారుతుంటాయి. కొత్త సంవత్సరాలు వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ఉగాదిగా, మహారాష్టల్రో గుడిపదగా అస్సాంలో బిహూగా, కేరళలో కాల వర్షగా పిలుచుకుంటారు. క్రీ.శ.జనవరి ఒకటవ తేదీ హంగామా తెలిసిందే. అయితే హి.శ మొదటి మాసంతో ప్రారంభమయ్యే ముహర్రం ముస్లింలకు కొత్త సంవత్సరంగా చెలామణిలో ఉంది. ఇస్లామియా చరిత్రలో ముహర్రం మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మహ మ్మద్‌ ప్రవక్త(స) మక్కా నుండి, మదీనా నగరానికి వలసవెళ్లిన సందర్భాన్ని హిజ్రి అంటారు. నాటి నుండే ఓ నవ శకం ఆరంభమైంది.
    ఓ నూతన రాజ కీయ, సాంఘిక, సామాజిక, ఆధ్మా త్మిక, నైతిక వ్యవస్థ ఉనికిలోకొచ్చింది. అందుకే హి.శ.తో ప్రారంభమయ్యే ఈ మాసానికి ఇంతటి ప్రత్యేకత. అంతే కాకుండా ఈ మా సంలోనే యౌమె ఆఘారా కూడా ఉంది. కొన్ని ప్రత్యే కతల దృష్ట్యా ముహర్రం మాసం పదవ తేదీని యౌమె ఆఘారా అంటారు.
    మహ్మద్‌ ప్రవక్త నిర్యాణం తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో హ.అబూబక్‌ సిద్దిఖ్‌, ఖలీఫాగా ఎన్నికయ్యారు.ఆయన తరువాత వరుసగా ఉమర్‌, ఉస్మా న్‌, అలీ, ఖలీఫాలుగా ఎన్నికయ్యారు. చివరి ఖలీఫా హ.అలీ (రజి)ని ఎన్నుకున్నారు. కొన్ని అనివార్య పరిస్థితులలో ఆయన అధికారాన్ని వదులుకున్నారు. అనంతరం యజీద్‌ తనను రాజుగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడలేదు. వారంతా రాచరికానికి ఎదురు తిరిగారు. ఖిలాఫత్‌ ఉద్యమానికి నాయత్వం వహించే బాధ్యత హ. ఇమామె హుసైన్‌ (రజి )భుజస్కందాలపై పడింది.
    ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం ఏ సమస్యకైనా చర్చలు సంప్రదింపులే పరి ష్కారమార్గం. అందుకే ఇమామ్ ఆ మార్గాన్నే ఎన్నుకున్నారు. మజీద్‌లో చర్చ ల కోసం రాజధాని కుఫాకు బయలుదేరారు. మార్గమధ్యంలోనే కర్బలా అనే చోట యజీద్‌ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించింది. ఇమాం మాటల్ని పట్టించుకోకుండా కయ్యానికి కాలుదువ్వింది. కర్బలా మైదానం రక్తపుటేరులతో ఎర్ర బారింది. అది ముహర్రం మాసం పదవ తేదీ. శుక్రవారం హోరా హోరీ పోరు సాగుతూనే వుంది. అటు వైపు శతృసైన్యం వందలాది మంది, ఇటు ఇమామె హుసైన్‌ ఒక్కరే. అయినా పోరాడుతూ అసంఖ్యాక మంది శతృ సైనికులను నేల కూల్చాడు.


      శుక్రవారం నమాజు సమయం కూడా మించి పోతోంది. ఎలాంటి స్థితిలోనైనా దైవప్రార్థనను ఉపేక్షించని ఆ మహనీయు డు, ప్రార్థన చేసుకోవడానికి కొన్నినిమిషాలు అవకాశం ఇవ్వమని సైన్యాధిపతిని అభ్యర్థించారు.యుద్ధనీతిలో భాగంగా ప్రార్థనకు అవకాశమి చ్చిన శతృసైన్యం, ఇమాం సజ్‌దా నుండి లేస్తే తమకు నూకలు చెల్లినట్లేనని భావించి సజ్దాస్థితిలోనే బరిశతో పొడిచి చంపారు. పండుగ చేసుకున్నారు.ఇదే క్లుప్తంగా ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘుటన. కానీ అది సత్యం కోసం, ధర్మం కోసం,మానవత్వ పరిరక్షణ కోసం సంభవించిన అనివార్య పరిణామం. అందుకని, ఇమాం హుసైన్‌ ఏ విలువల కోసం తన ప్రాణాలను పణంగా పె ట్టారో, ఆ విలువల పరిరక్షణ కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్య త. విలువలు మంటగలిసి పోతుంటే, పౌరుల హక్కులు కాలరాయబడుతుంటే, చూస్తూ కూర్చోవడం న్యాయ ప్రేమికుల, మానవతా ప్రియుల లక్షణం ఎంతమాత్రం కాదు.

      అజ్ఞానం – విజ్ఞానం


      ఒక విషయం గురించి ఏమీ తెలియనప్పుడు అజ్ఞానం ఉందంటాం. ఆ అజ్ఞానం ఏదో ఒక నమ్మకానికి దారి తీస్తుంది. ఆయా విషయాల గురించి నిజాలు తెలిసిన తర్వాత అజ్ఞానం తొలగి విజ్ఞానం చోటు చేసుకుంటుంది. అయితే నిజం వెలుగు చూసిన తర్వాత కూడా పూర్వ నమ్మకాన్నే పట్టుకు వ్రేలాడితే దాన్ని మూడ నమ్మకం, అంధ విశ్వాసం అంటాము. అలా మూఢ నమ్మకాలకు కొమ్ము కాసేవారు పవిత్రం కాని దానికి పవిత్రతను అంటగటతారు. దైవం కాలేని వాటిని దైవంగా ప్రతిష్టింపజేస్తారు. నిజ ప్రభువు అయిన అల్లాహ్‌ాకు ఇవ్వాల్సిన స్థానాన్ని, ఘనతాగౌరవాలను ప్రవక్తలకు, పుణ్య పురుషులకు ఆపాదిస్తారు. పర్యవసానం అంధ విశ్వాసం పరవళ్ళు తొక్కుతుంది. ఇటు వంటి అజ్ఞానాంధకారాల్లో కొట్టుమిట్టాడే వ్యక్తి ఆకాశంలో మెరుపు తీగ కనిపిస్తే దాన్ని ఏదోక దేవత ఝుళిపించిన కొరడాగా భావిస్తాడు. సూర్యచంద్ర గ్రహణాలను చూసి దేవతలకేదో విపత్కర పరిస్థితి ఏర్పడిందని తలపోస్తాడు. ‘మశూచి రోగాన్ని’ పోలేరమ్మగా, చికెన్‌ ఫోక్స్‌ను ‘అమ్మోరుగా భావించి అలౌకికానందంతో హారతు పడతాడు. వర్షాలు పడటానికి జల యజ్ఞం అంటూ వందల కొలది నెయ్యి డబ్బాలు నిప్పుల్లో ధారబోస్తాడు. జబ్బులు తగ్గడానికి వాతలు పెడతాడు. క్షుద్ర పూజలంటూ పసికందుల్ని బలిగొంటాడు. ద్రాక్ష రసాన్ని ఏసు రక్తగంగా, జొన్న రొట్టెను ఆయన మాంసంగా అభివర్ణించుకొని నర మాంస భక్షకుడిగా మారతాడు.
      ‘పవిత్రత’ పేరుతో మొదలయిన ఈ బహుదైవారాధనా భావం స్వార్థపరులైన మత నాయకులకు, పీఠాధిపతులకు, పోపులు, బిషప్పు లకు, పీష్వాలకు, పీర్లు, ముర్షిద్‌లకు – ముఖ్యంగా రాజులకు సువర్ణావకాశంగా పరిణమించింది. ప్రజల బలహీనతను పసిగట్టిన అవకాశవాదులు ఇటువంటి మూఢ నమ్మకాలను మరింత వ్యవస్థీకృతం చేశారు. ‘గాడ్‌ కింగ్‌’ అన్న సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టారు. ప్రజలకు – ప్రభువుకు మధ్య తాను వారధి లాంటి వాడనని ఒకడంటే, తన ప్రసన్నతలోనే దైవ ప్రసన్నత ఇమిడి ఉందని ఇంకొకడన్నాటాడు. వేరొకడు మరింత ముందుకెళ్ళి తానే భగవత్‌ స్వరూపూణ్ణని, అవతార పురుషుణ్ణని ప్రకటించుకున్నాడు. ఈ ‘గాడ్‌ కింగ్‌’ అనే సిద్ధాంతం మూలంగా అధికార, రాజకీయ వ్యవస్థలో చెడు తారా స్థాయికి చేరుకుంది.
      జ్ఞానం వేలుగైతే అజ్ఞానం చీకటి. విజ్ఞానం వికసించాలన్నా, సైన్స్‌ భావాలు పరిఢవిల్లాలన్నా, సాంకేతిక పరమైన ఆలోచనలు మొగ్గ తొడగాలన్నా -భావ స్వాతంత్య్రం ఎంతో అవసరం. కానీ ఈ స్వేచ్ఛా వాయువులు అన్నీ దేశాల్లోలాగే అరబ్బులో, భారత దేశంలో, గ్రీకు దేశంలో సయితం అందని ద్రాక్షగానే ఉండేవి. ఏథెన్స్‌ నగర యువ కుల్లో స్వేచ్ఛా భావాలను పెంచి పోషిస్తున్నాడన్న అభియోగంపై సోక్రటీస్‌ బలవంతంగా విషం త్రాగాల్సి వచ్చింది. భారత దేశంలో శూద్రులు వేదాలు చదవకూడదు, వినకూడదు అన్న నిషేధాజ్ఞలాగే గీకు దేశంలో సయితం ఇతరత్రా గ్రంథాలు చదవకూడదన్న ఆంక్షలు విధించబడ్డాయి. ఎందరో కళా పిపాసులు, తాత్వికులు దేశ బహిష్కరణ గావించబడ్డారు. కారాగారాల్లో కుక్కివేయబడ్డారు. ఉరికంబాలకు వ్రేలాడదీయబడ్డారు. యూరి ఫాయిడ్స్‌, సోక్రటీస్‌, అరిస్టాటిల్‌, ఫిరియాస్‌ మొదలగువారు ఈ కోవకు చెందినవారే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం ఎక్కడా శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన స్వేచ్ఛ ఉన్నట్టు కనబడదు. మరలాంటప్పుడు స్వయంగా అరబ్బుల్లో ఈ ఆలోచన ఎలా పుట్టింది? సాధారణంగా మిగతా ప్రపంచం ఏ వెనుకబాటుతనానికి, స్తబ్ధతకు లోనై ఉండేదో అదే భావ దారిద్య్రం, దాస్యానికి అరబ్బులు కూడా గురై ఉన్నప్పుడు వారెలా అందరికి మార్గదర్శకం కాగలిగారు?
      సమాధానం – తౌహీద్‌. అదే వారి మనో వికాసానికి, క్రియాత్మక విప్లవానికి హేతువు అయ్యింది. మిగిలిన జాతుల్లో ‘షిర్క్‌’ – అజ్ఞానం ఉండగా, అరబ్బుల దగ్గర ‘తౌహీద్‌’ – విజ్ఞా నం ఉండేది. ఈ వ్యత్యాసమే చరిత్రలో అసాధారణమైన పరివర్తనకు కారకం అయింది. ఇది ముస్లింలు సాధించిన విజయం కాదు; ఇస్లాం, ఖుర్‌ఆన్‌ ద్వారా వారికి ప్ర్రాప్తమయిన మహదానుగ్రహం. క్రీస్తు శకం 7వ శతాబ్దిలో మహా ఇస్లాం ద్వారా ఓ గొప్ప విప్లవం వచ్చింది. అది బహుదైవోపాసన, గాడ్‌ కింగ్‌ పెత్తనంతో కూడుకున్న వాతావరణాన్ని ప్రక్షాళించి ఏకేశ్వరోపాసనా భావ విప్లవానికి, స్వేచ్ఛకు అగ్ర స్థానాన్ని కేటాయించింది. ఆ విధంగా మానవ చరిత్రలో ప్రకృతికి సంబంధించిన స్వేచ్ఛా పరిశోధనల నూతన యుగం మొదలయింది. ఈ యుగం వెయ్యేళ్ళ నిరంతర సాధనానంతరం – నేటి – ఆధునిక సైన్స్‌ మరియు సాంకేతిక పరిజ్ఞానం థకు చేరుకుంది. కాబట్టి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆధునిక సైన్స్‌ ఇస్లామీయ (తౌహీద్‌) విప్లవ ప్రభావమే. కాబట్టి -
      భావి భాగ్య విధాతల్లారా! అందరూ నడిచిన బాటలో నడవడం తేలిక. అదే థాబ్దాలుగా మనం చేెస్తున్న పని. ఈ రంగంలో మీరు కొత్త అధ్యాయాని కి నాంది వాచకంగా నిలవాలి. నూతన బాటలు వేయాలి. అలా చేయడమంటే గొప్ప సాహసం, తెగింపు మీలో ఉండాలి. ముళ్ళు తొక్కాలి, తుప్పల మీదుగా సాగాలి మీరు. ముళ్లు గుచ్చుకుంటాయి, కాళ్ళు గీచుకుపోతాయి. మీరు నడిచే బాట జనానికి ఉపయోగకరం అని తెలేదాకా జనం కూడా ఎద్దేవ చేయవచ్చు. ఒకసారి ఉపయోగం అని తేలాక ఆ బాటను మీ పేరుతోనే శాశ్వతంగా గుర్తుంచుకుంటారు. ఏది ఏమైనా ‘అజ్ఞానం – షిర్క్‌ -కుఫ్ర్‌’కి ఇష్టమున్నా లేకపోయినా ‘విజ్ఞానం – తౌహీద్‌ – ఇస్లాం’ ముందు తలవంచి ఓడిపోక తప్పదు. ఈ విషయాన్నే పరమోన్నతుడైన అల్లాహ్‌ా ఇలా తెలియ జేస్తున్నాడు:
      ”వారు (సత్య విరోధులు) తమ నోళ్ళతో (ప్రింటింగ్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇతరత్రా ప్రసార, ప్రచార సాధనాల ద్వారా) అల్లాహ్‌ జ్యోతిని ఊది ఆర్పివేయజూస్తున్నారు. అల్లాహ్‌ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణం చేసి తీరతాడు – అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు అది ఎంత సహించరానిదైనా సరే!”. (అస్సఫ్‌: 8)
      వందల, వేల, లక్షల మంది లాగా ఏ గుర్తింపూ లేకుండా – ‘జీవించి ఉండగానే అజ్ఞానుల్లా అనామకంగా మరణించినవారి’లా జీవించడమా? ‘మరణించిన తర్వాత కూడా విజ్ఞుల్లా జీవించి ఉండే వారి’ జాబితాలో చేరడానికి ప్రయత్నించడమా? మనమే తేల్చుకోవాలి మరి!

      నమ్మకాలు – నిజాలు


      నమ్మకాలుగా ప్రచారం పొందినవన్నీ అబద్ధాలు కావు. అలా అని అన్ని నమ్మకాలు నిజమేననటమూ న్యాయం కాదు. నమ్మకమనేది విచిత్రమైనది. దేవుడున్నాడా? ఆత్మ ఉన్నదా? మరణానంతర జీవితం, స్వర్గ-నరకాలు నమ్మదగినవా? ఆత్మకు రూపం ఉందా? మృత్యువుకు అర్థమేమిటి? – ఇవి ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మానవుడు అనాదిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటో ఇటో తేల్చి చెప్పేవారు, ఎటూ తేల్చలేని వారు ఎప్పుడూ ఉంటూనే వస్తున్నారు. నాటికీ, నేటికీ ఇవి వివాదాస్పద విషయాలే! హేతువే సర్వస్వం అని నమ్మేవారు, తమకు ప్రాప్తమయి ఉన్న మేధకు తామే మత్తెక్కి, కళ్ళు పైకెక్కిన వీటిని తెలికగా కొట్టి పారేస్తారు. అలా వారు కొట్టిపారేయడానికి హేతువు (కారణం) లేకపోలేదు. చాలా మంది అబద్ధాలు చెప్పి, లేని గొప్పలను ఆపాదించుకుని మోసాలు చేశారు. ఇలాంటి మోసగాళ్ళ వలన ఇదంతా బూటకమే కావచ్చునన్న అభిప్రాయం చదువుకున్న వారిలో చాలా మందికే ఉంటుంది. అయితే ‘తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరమున్‌ పలుకగ రాదు’ అంటూ తెనాలి రామకృష్ణ ఒక అహంకారిని మందలించాడన్న మాట మరువకూడదు. కట్టు కథలు అనేెకం ప్రచారం కావడం వల్ల ఏది నిజమో, ఏది కాదో తెలుసుకోవడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడిందన్నది నిజమే కావచ్చు. తమకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తమకు తెలిసిందే విజ్ఞానమని భ్రమించే వ్యక్తులుంటారు. ఎంత తెలిసినా, తమకు ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉందని, విజ్ఞానానికి అంచులు లేవని సవినయంగా అంగీకరించే పండితాగ్రేసరలూ ఉంటారు. ఏది ఏమైనా ఈ విచిత్ర ప్రపంచంలో మనిషికి తెలియని, అను భవంలో రాని విశేషాలు ఎన్నో ఉన్నాయన్నది నిర్వివాదాంశం. వాస్తవం (రియాలిటీ) కన్నా, దానిని గురించిన మన అవగాహన మనకు సులభంగా బుర్రకెక్కుతుంది. కనుక ఆ రెంటికి మధ్య ఉన్న తేడాను మరచిపోయి, మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ఊహలు, ఇవే వాస్తవాలు, నిజాలు అన్న గందరగోళంలో పడిపోతుంటాము.
      గబ్బిళం రాత్రిలో చూస్తుంది. పగటి పూట దానికి కన్పించదు. అంత మాత్రాన పగలు కాంతిహీనమైనదనీ, రాత్రి కాంతివంతమైన దని చెప్పలేము కదా! గబ్బిళం చూపు బలహీనమైనది. అది బలమైన వెలుగును చూడలేదు. కనుక వెలుగు చీకటి కలిసున్నప్పుడు మాత్రమే అది కానగలుగుతుంది. అలాగే ఒక వస్తువు చాలా దగ్గరగా, తేజోవంతంగా చూసినప్పుడు కూడా ఆ వస్తువ వాస్తవికత ఏమిటో అర్థం కాకపోవచ్చు. అదే విధంగా మన పంచేెద్రియాల పరిధిలో వచ్చేది, మన జ్ఞానేద్రియాలకు అందినది మాత్రమే నిజం, తక్కినవన్నీ తృణీకరించదగినవనుకోవడం ఎంత మాత్రం వివేెకం అన్పించుకోదు. రూపం లేని దానిని తెలుసుకోవడానికి, అనుభవ మవడానికి రూపం అవసరమే. కానీ రూపమే సర్వం అనుకోవడం ఎంత వరకు సబబు? మార్గమే గమ్యమనుకోవడం ఎంత అవి వేకమో ఇది కూడా అంతే. నూనె జిడ్డు పోవడానికి పోసుకున్న కుంకుడు రసం (షాంపొ)ని అలానే ఉంచుకోలేము కదా! అలాగే మత మౌఢ్యం, మూఢ నమ్మకం అనే నూనె జిడ్డును కూడా వదిలించుకోవాలి. మనిషి అంటే ఏమిటి? అతడి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రి యాలే అన్నింటికీ ప్రమాణాలా? ఏ యుగంలోనయినా ఆ యుగపు ప్రధానమైన ఆలోచనా స్రవంతిని అధిగమించడం అన్నది మానసి కంగా చాలా కష్టసాధ్యమైన పని అన్న మాట నిజమే కావచ్చు. అయినా మన ప్రయత్నం మనం చేయాలి.
      చివరి మాట – మన చేతిలో ఉన్న పనిముట్టు కేవలం సుత్తి మాత్రమే, అయితే మనకు ఎదురయ్యే ప్రతి వస్తువును మేకులాగానే చూస్తాము. సైన్సు లేదా హేతువు అనే సుత్తిని చేతపట్టుకుని కనపడ్డ ప్రతి దాని నెత్తిన మొత్తడం అన్నది నేటి ఫ్యాషన్‌. సైన్సుకి మతం అవసరం లేదు అంటారు కొందరు. మతానికి సైన్సు అవసరం లేదు అని అంటారు మరికొందరు. కాని మనిషికి సైన్సు, మతమూ రెండూ అవసరమే అన్నది విజ్ఞుల మాట.
      మతం పేరిటి పెంచుకున్న మౌఢ్యం అనే జిడ్డును కడగటానికి, అంధ విశ్వాసాల ఊబిలో కూరుకుపోయిన జన వాసాలను నిజం వెలుగులో తిసుకురావడాని, హేతవు పేరిటి గంతలు కట్టుకున్న వారి గంతలు విప్పడానికి, సుత్తి, గరిటె, కుంచె, ఉలి, కమానులాంటి సాధనాలకు లొంగని సత్యాలూ ఉన్నాయని సవినయంగా మనవి చేయడానికి నెలవంక కృషి చేస్తోంది. నాన్సెన్స్‌! సెన్స్‌ లేకుండా మాట్లాడతారేమిటి? అనే వారిని వారి తర్కానికే అప్పగించి…కాంతి, శాంతి లోకంలోకి ప్రవేశిద్దాం! ఇక్కడ మీ గైడ్‌ పేరు ఖుర్‌ఆన్‌+ముహ్మద్‌ (స)= ఇస్లాం.

      కాలం పరిణామశీలం


      కాలమనే కడలిలో మరో కెరటం లేచింది. మానవ చరిత్ర మరో మైలు రాయి దాటింది. చరిత్రలో ఏ సంవత్సరానికా సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కొత్తదనం అంటే చిత్తానికి ఎప్పుడూ ఉత్తేజమే. పాత జ్ఞాపకల స్థానంలో రానున్న భవిష్యత్తును ఊహించుకుంటూ రాబోయే సమయం సంతోషంగా గడవాలని కోరుకుంటాడు మనిషి. ఉషాకాంతుల వంటి పసిడి కలలతో మిసిమి భవితవ్యానికి సుస్వాసగం పలికే సంప్రదాయం వెనుకున్న రహస్యం – మనిషి నిత్య ఆశావాది కావడమే! ఆ ఆశావాదమే అడవి మనిషిని అణు అధికారిగా మార్చింది. ఎదురుదెబ్బలెన్ని ఎదురైనా అదరక, బెదరక సమస్యల సునామీలకు ఎదురేగి మరీ దూసుకుపోయే సుగుణమే మనిషిని ఇతర జీవరాసులలో శ్రేష్ఠుణ్ణి చేసింది. శిశిరం వస్తుంది, పోతుంది, మళ్లీ వస్తుంది. అయినా వసంత పవన తాకిడికే పరవశించిపోతుంది కోయిల. మధు మాసం రాగానే మావి చిగురు కొమ్మ మీద చేరి రాగాలాపన చేస్తుంది. అలాగే గత అనుభవాలు ఎలా ఉన్నా – రాబోయే కాలమంతా సర్వే జనా సుఖినోభవంతు, సర్వ జనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించడం ఒక్క మనిషికే చెల్లింది. అయితే 2013లో ఈ మనిషి చేసిందేమిటి? అంటే, ‘పతనంతో పోరాటం’ అనక మానదు.
      పోరాటం – అది అరబ్బు ప్రపంచంలో నియంతలపై సాగిన ఆగ్రహ జ్వాలలే కావచ్చు. మళ్ళి నిరాయుధ ప్రజలను గురి పెట్టి చూసిన కరకు మర తుపాకులే కావచ్చు. మళ్లీ మళ్ళీ శాంతి కపోతాల రక్తాన్ని చవి చూసిన ఇనుప మూతి కాకులే కావచ్చు. ఐరోపాలో ఆర్థిక సంకోభంపై సమరమే కావచ్చు. భారత దేశంలోనిర్భయ నిరసనలే కావచ్చు. రూపిణి పతనావస్థకు గురి చేసిన పరిస్తుతులే కావచ్చు.సామ్రాజ్యవాదులను సమస్యల్లోకి, సామాన్యులను కష్టాల్లోకి నెట్టిన, ముంచుతున్న ఆర్థిక సంకోభమే కావచ్చు. వెరసి 2014 వీటికి ఓ పెను సవాల్‌!
      ఏది ఏమైనా, కాలం – దాని విలువ అమూల్యం. అది కలిమితో కొనలేనిది, బలిమితో వశపర్చుకోలేనిది. ఒక్కసారి చేజారితే తిరిగి సంపాదించుకోలేనిది. మ్రొక్కి పట్టుకోలేనిది, వెతికి వెనక్కి తెచ్చుకోలేనిది. నియతి తప్పక నడితే ఆ కాలం మనిషికిచ్చే సందేశం – శిశిరంలో సయితం వసంతాన్నే కలగనమని. గతి తప్పిన చోటు నుంచే మతి మార్చుకుని మసలుకోమని. మానవ జాతికి ఊపిరి స్వాతంత్య్రం – అది జ్యోతిగా వెలిగే చైెతన్యం – ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యం అని. శిఖరంలా ప్రతి మనిషీ శిరసెత్తిన నాడే, అవనీ ఆకాశం, సూర్య చంద్ర నకత్రాల్లా ఆ సర్వేశ్వరుడికి తల వంచిన నాడే, జల నిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయం అని. అది గతాన్ని సింహావలోకనం చేసుకుని బంగారు భవిష్యత్తుకు దైవవిధేయతా పునాదులు వేసుకోవడంతోనే సాధ్యమని.
      ”కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు”. (అల్‌ అస్ర్‌: 1-3)

      హాస్యం మరియు ఇస్లాం


      నబీ (స) వారు ఇలా ప్రబోధించారు: ”ఏ మంచి పనినీ అల్పంగా భావించకండి. మీ సోదరుణ్ణి నగుమోముతో నవ్వుతూ పలకరించటాన్నయినా సరే” (ముస్లిం)
      మృదుత్వం, ప్రేమ, అణకువ, ఆప్యాయత, అనురాగం-ఇలాంటి ఇతర నైతిక విలువలు ప్రజల మధ్య చాలా అవసరం. ఇవి లేకుంటే ప్రజలు మనల్ని అభిమానించరు. దగ్గరికి రావడానికి ఇష్టపడరు. సుపరిచితు లైనా, అపరిచితులైనా ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటం మనందరి నైతిక ధర్మంగా ఎంచాలి. సాధారణంగా మనం దానికి అంతగా ప్రాధా న్యతనివ్వకపోవచ్చు. కానీ నైతికంగా అది చాలా గొప్ప గుణం. ఎదుటి వ్యక్తి పట్ల మనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకునే విధానం. అందుకే ప్రియ ప్రవక్త (స) దానికి అంతటి ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు దాన్నో పుణ్యకార్యంగా పేర్కొన్నారు: ”నీ సోదరునితో నీ నగు మోము సంభాషణ కూడా పుణ్యకార్యమే”. స్వయంగా ప్రవక్త (స) వారి పట్ల ఆయన సహచరుల అభిప్రాయమేమిటంటే – మాలోని ఎవరైనా సరే ఆయన వైపు గనక చూస్తే ఆయన నగుమోముతో పలకరించే వారు. ఈ కారణంగా మాలోని ప్రతి వ్యక్తి, ‘ప్రవక్త (స) అందరికన్నా అధికంగా తననే ప్రేమిస్తున్నారు’ అన్న సద్భావంతో ఉండేవాడు. రండీ! మన ప్రియ ప్రవక్త (స) వారిని నవ్వించేలా చేసిన ఆ మందస్మిత స్మృతుల్ని నెమరువేసుకుందాం!!
      దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో చూసిచూడనట్టుగా ప్రవర్తించు”. (అల్‌ ఆరాఫ్‌: 199)
      హజ్రత్‌ అనస్‌ (ర) కథనం – నేనోసారి నబీ (స) వారి వెంట నడు స్తున్నాను. ఆ సమయంలో ఆయన దళసరి అంచులు గల నజ్రాన్‌ దుప్పటి కప్పుకొని ఉన్నారు. దారి మధ్యలో ఓ పల్లెటూరి మొరటు వ్యక్తి కలిసి ఆయన ఉప్పటి పట్టుకొని గట్టిగా లాగాడు. నేను నబీ (స) వారి భుజం వంక చూశాను. గట్టిగా లాగడం వల్ల దుప్పటి అంచులు గీసుకు పోయి ఆయన భుజం కందిపోయివుంది. ఆ పల్లెటూరి వ్యక్తి అంతటితో ఊరుకోక, ‘అల్లాహ్‌ నీకిచ్చిన సొమ్ములో నుంచి నాక్కొంచెం ఇప్పించు!’ అని కాస్త కటువుగానే అడిగాడు. దానికి నబీ (స) వారు అతని వైపు తిరిగి చూసి ‘నవ్వుతూ’ ఇతనికి కొంత ధనం ఇవ్వండి” అని సహచ రుల్ని ఆజ్ఞాపించారు. (బుఖారీ, ముస్లిం)
      ఓ సందర్భాన ఆయన ఇలా అన్నారు: ‘కుస్తీ పట్టి మల్ల యుద్ధంలో ఇతరులను చిత్తు చేసేవాడు పహిల్వాను కాడు. కోపం వచ్చినప్పుడు తనను తాను నిగ్రహించుకొని తన కోపాన్ని అదుపులో ఉంచుకో (కమించ) గలిగేవాడే నిజమైన బలశాలి”. (బుఖారీ, ముస్లిం)
      హజ్రత్‌ అబూ అమ్ర్‌ జరీర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ా (ర) గారి కథనం – ఒక రోజు మిట్ట మధ్యాహ్నం మేము నబీ (స) వారి పవిత్ర సన్నిధిలో ఉండ గా కొంత మంది వచ్చారు. వారి ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు. గళ్ల దుప్పటి లేక కంబళ్లు చుట్టుకొని ఉన్నారు. వాళ్లలో చాలా మంది, చాలా మందేమిటి దాదాపు అందరూ ‘ముజర్‌’ తెగకు చెందిన వాళ్లే. వారి పస్తుల స్థితి చూసి నబీ (స) వారు చలించిపోయారు. ఆయన (స) ముఖారవిందం కమిలిపోయింది. ఆయన తన కుటీరం లోనికి వెళ్ళి తిరిగి బయటికొచ్చారు. అజాన్‌ ఇవ్వమని హజ్రత్‌ బిలాల్‌ (ర)ను ఆదేశించారు. బిలాల్‌ (ర) అజాన్‌ ఇచ్చి (ప్రజలు నమాజు కోసం హాజరైన తర్వాత) ఇఖామత్‌ పలికారు. నబీ (స) వారు నమాజు చేయించిన తర్వాత ప్రజల ముందు ఉపన్యసిస్తూ ఇలా అన్నారు: ”ప్రజలారా! మిమ్మలందర్నీ ఒకే ప్రాణి నుంచి పుట్టించిన మీ ఆ ప్రభువుకు భయ పడండి…..అల్లాహ్‌ా మిమ్మల్ని గమనిస్తున్నాడనే విషయాన్ని విస్మరించకండి”. (నిసా:1) తరువాత సూరయె హష్ర్‌లోని ఆయతులు పఠించారు: ”విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ాకు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కోసం ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి”.
      ఆ తర్వాత ప్రజల్ని దానధర్మాలు చేయమని ప్రోత్సహించారు. ప్రతి వ్యక్తీ తన దీనారు నుండి, తన దిర్హము నుండి, తన బట్టల నుండి, ఇంకా గోధుమలు ‘సా’ (కొలిచే ఒక ప్రమాణం) నుంచి, ఖర్జూరాల ‘సా’ నుంచి దానం చేయాలన్నారు. అంతే కాదు. ఒక్క ఖర్జూరపు ముక్కయి నా సరే దానం చేయాలని పురిగొల్పారు.
      అప్పుడు అన్సార్లలోని ఒకతను ఒక నిండు బస్తా తీసుకొచ్చాడు. అతని చేయి ఆ బస్తాను మోయలేనట్టుగా ఉంది. (కొంత దూరం వచ్చాక) సాధ్యం కాలేకపోయింది. ఆ తర్వాత ప్రజలు ఒకర్ని చూసి మరొకరు దానాలు చేస్తూ పోయారు. నేను చూస్తుండగానే అక్కడ రెండు రాసులు తయారయ్యాయి. వాటిలో ఒకటి తినే వస్తువులది. రెండోది బట్టలది. అది చూసి నబీ (స) వారి ముఖారవిందం మేలిమి బంగారపు ముక్కలా మెరుస్తుండటం నేను గమనించాను.
      తరువాత నబీ (స) వారు ఇలా ఉద్బోధించారు: ”ఎవడైనా ఇస్లాంలో ఒక మంచి పనిని మొదలు పెడితే అతనికి తన పుణ్యం లభిస్తుంది. ఇంకా అతని తర్వాత దానిని ఆచరించేవారి పుణ్యం కూడా లభిస్తుంది. దాని వల్ల వారికి లభించే పుణ్యంలో ఎలాంటి కొరతా ఏర్పడు. దీనికి విరుద్ధంగా ఇస్లాంలో ఎవడైనా ఏదైనా చెడ్డ పని ప్రారం భిస్తే అతనిపై దాని పాపభారం పడుతుంది. ఇంకా అతని తర్వాత దానిని అమలు చేసేవారందరి పాపం కూడా అతని నెత్తి మీద పడుతుంది. అయితే దీని వల్ల వారిపై పడే పాపభారం ఏ మాత్రం తగ్గింపు ఉండదు”. (ముస్లిం)

      పరదా పరిచయం

      ఖుర్ఆన్లో పరదా పురుషులు మరియు స్త్రీలకు అనివార్యం చేయబడింది. ఇస్లాంలో ఇది ముందుగా పురుషులకు, ఆ తర్వాత స్త్రీలకు వర్తిస్తుంది. ఖుర్ఆన్ మరియు హదీసులలో సూచించిన విధంగా కేవలం 

      ఒక్క అల్లాహ్ నే ప్రార్దిoచడం తన కర్తవ్యo మరియు అల్లాహ్ యే తాను సృష్టించబడటానికి కారణం అని ప్రతి ముస్లిం భావిస్తాడు. పరదా కూడా అల్లాహ్ కు విధేయత చూపే ఓ మార్గం.
      “(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకి గానీతమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త). ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:36
      ఖుర్ఆన్ మహిళలకు పరదా ఎందుకు విధించిందంటే దాని వల్ల వారు గౌరవం గల స్త్రీలు అని తెలుస్తుంది మరియు స్త్రీల మానమర్యాదలకు హాని కలిగే అవకాశం ఉండదు. వినయం విశ్వాసానికి చిహ్నం. వినయం, విధేయత, పరదా లేని వారు ధర్మానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. పరదా స్త్రీని కించపరచదు, సరికదా ఆమె మానమర్యాదలను కాపాడుతుంది. పరదా వల్ల స్త్రీలపై గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో శాంతి నెలకొంటుంది.
      పురుషుల పరదా
      ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిస్తున్నాడు: (ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. ఖుర్ఆన్ సూరా నూర్ 24:30
      గైర్ మహ్రం (పెళ్లి చేసుకొనే అవకాశం గలవారు)తో కరచాలనం చేయడం
      ఇస్లాంలో గైర్ మహ్రం తో కరచాలనం చేసే అనుమతి లేదు. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మీకు అనుమతించబడని (గైర్ మహ్రం) స్త్రీలను ముట్టుకోవడం కన్నా మీ తలను ఇనుప సూదితో గుచ్చడం మీకు మేలైనది.” (అల్ ముజాం అల్ కబీర్ లో అత్ తబరాని (20/213), అల్ ముసన్నఫ్ లో అబీ శైబహ్ (4/341)
      స్త్రీల పరదా
      (ఓ ప్రవక్త ! ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గితమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణిలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలసి మెలసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అందచందాలను) కనబడనివ్వకూడదనీ, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా ! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (ఖుర్ఆన్ సూరా నూర్ 24:31)
      ఓ ప్రవక్తా ! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. (సూరా అహజాబ్ 33:59)
      హదీసు
      సఫియ్యా బింత్ శైబహ్ రజిఅల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ఆయిషా రజిఅల్లాహు అన్హా ఇలా అన్నారు: ఈ పదాలు అవతరించినపుడు – “జలాబీబిహిన్న”తో అంతా కప్పుకోండి (అంటే- శరీరం, ముఖం, మెడ, చాతీలపై)” – వారు (ఇజార్) ఒక రకమైన బట్ట తీసుకొని దాన్ని అంచుల నుండి కత్తిరించి తమ ముఖాలను కప్పుకున్నారు. (సహీహ్ బుఖారీ 4481)
      పరదా చేసే వయసు
      ఆడపిల్లలు యుక్త వయస్సుకు రాగానే పరదా చేయాలి.
      (మగపిల్లలు, ఆడపిల్లలు) యుక్తవయసుకు చేరుకున్నారనడానికి మూడు సూచనలు ఉన్నాయి:
      1 – తడి కలలు రావడం
      2 – మర్మాంగాల చుట్టూ వెంట్రుకలు రావడం
      3 – పద్నాలుగు సంవత్సరాలకు చేరడం
      ఆడవారిలో నాలుగో సూచన కూడా ఉంది:
      4 – బహిష్టు
      ఈ నాలుగింటిలో ఏ ఒకటి కనిపించినా అప్పటి నుండి ఆడపిల్ల తప్పనిసరి పరదా చెయ్యాలి మరియు నిషేధించబడిన వాటి నుండి ఆగాలి.
      పురుషుల పరదా నిబంధనలు
      1. కనీసం నాభి నుండి కాలి మడమకు దిగకుండా ఉండాలి.
      2. ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.
      3. అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.
      4. అది మగవారి వస్త్రంలా ఉండాలి, ఆడవారి వస్త్రంలా ఉండకూడదు.
      5. దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల ఆడవారికి ఆకర్షణ పుడుతుంది.
      6. అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.
      7. అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.
      స్త్రీల పరదా నిబంధనలు
      1. పూర్తి శరీరాన్ని తల నుండి కాళ్ళవరకు కప్పి ఉంచాలి
      2. ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.
      3. అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.
      4. అది ఆడవారి వస్త్రంలా ఉండాలి, మగవారివిలా ఉండకూడదు.
      5. దానికి సువాసనలు పూసుకోరాదు.
      6. దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల మగవారికి ఆకర్షణ పుడుతుంది.
      7. అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.
      8. అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.


        ఇస్లాం స్త్రీలను రక్షిస్తుంది. అoదుకొరకే అల్లాహ్ ఇలాంటి కట్టుదిట్టమైన నియమాలను రూపొందించాడు. నేటి సమాజంలో ఆడవారిని చాలామంది మగవారు కేవలం ఆట వస్తువుగా వాడుతున్నారు. ప్రతి ప్రకటనలో స్త్రీలను అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. ఇది ఆడవారి స్వేచ్చా? లేదా వారిని కించపరచడమా? ఇస్లాం ఆడవారికి అసలైన స్వేచ్చను 1400సంవత్సరాల క్రితమే ఇచ్చింది.

        మహిళా హక్కులు మరియు ఇస్లాం


        పాశ్చాత్య ప్రపంచం ప్రకృతిపై తిరుగుబాటు చేసి సామాజిక వ్యవ స్థను ఛిన్నాభిన్నం చేసింది. ఫలితంగా కుటుంబ వ్యవస్థ అంతరించి పోతోంది. వ్యక్తికి తన వంశం ఏదో తెలియయని దౌర్భాగ్య స్థితి. ఈ వికృత పోకడ అందరికంటే అధికంగా అబలను అవమానం పాలు చేసింది. ఆమె బ్రతుకు తెరువు కోసం బయట వెళ్ళాల్సిన గత్యంత రానికి కారణం అయింది. తాను బైట పని, ఇంటి పని, వంట పని, భర్త ఒంటి పని కూడా చేయాలి. వాణిజ్య ప్రకటనల్లో తానే అంగడి బొమ్మనవ్వాలి. సిగ్గు, సిరిని వదిలేసి, మానం మర్యాదను తగలేసి వీరు చేసే ఈ వర్తకం పూర్తి మానవతకే కళంకం. పూర్వపరాల్లోకెళితే -

        హిందూ మతంలో స్త్రీ

        స్త్రీలకు తండ్రి ద్వారాగానీ, భర్త ద్వారాగానీ ఆస్తిలో హక్కు ఉండేది కాదు. జీవన వ్యవహారాల్లో స్త్రీ పరుషులు రెండు వ్యక్తిత్వాలుగా గుర్తించ బడేవారు కాదు. పురుషుడు యజమానిగాను, స్త్రీ అతని ఆస్తి గానూ పరగణించబడేది. ఈ కారణంగా భర్త నుండి విడాకులు పొంద డంగాని, వేరే వివాహం చేసుకోవడానికిగాని అనుమతి ఉండేది కాదు. ఒకవేళ భర్త మరణిస్తే పతితోపాటు సతిని కూడా చితిపై పేర్చి నిర్ధాక్షి ణ్యంగా కాల్చేసేవారు. ఒకవేళ ప్రాణాలు మిగిలినా వితంతువుగా మిగి లిపోయిన వనితామణులకు పునర్వివాహ అనుమతి అస్సలుండేది కాదు.ఇది సరిపోదన్నట్లు ‘నియోగం’అన్న ఆచారంతో ఆమెను మరింత కించపర్చడం జరిగేది. ‘నియోగం’ అంటే స్వామి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రాకాశికలో వివరించినట్లు – వితంతువు మహిళ తన మరిదితోగానీ, మరొక అపరిచిత పురుషునితోగాని వివాహం లేకుండా శారీరక సంబంధం కలిగి ఉండటం. అలాగే భర్త బ్రతికున్న స్త్రీలు కూడా అతని అనుమతితో సంతాన ప్రాప్తి కోసం పరపురుషునితో జత కట్టవచ్చు. ఇదిలా ఉంటే, నేటి హిందూ వివాహ చట్టాన్ని రూపొందిం చడంలో చాలా వరకు ఇస్లాంలోని సామాజిక చట్టాల ద్వారా ప్రయోజ నం పొందడం జరిగిందని డిస్కవరీ ఆఫ్‌ ఇండియాలో స్వయంగా నెహ్రూ గారే పేర్కొనడం గమనార్హం.

        యూద మతంలో స్త్రీ

        స్త్రీలు అత్యధికంగా అపరిశుభ్రంగా ఉంటారని యూదులు భావించ డమే కాక, బహిష్టు దినాల్లో వారిని అన్నింటికీ ఎడంగా ఉంచేవారు. అలాగే కుమారుడు లేని పక్షంలో మాత్రమే కూతురికి ఆస్తిలో హక్కుం టుంది. కూతుళ్లల్లో కూడా తర్వాతి వారికంటే మొదటి వారికే నాలుగు భాగాలంత వాటా ఉంటుంది. అదే విధంగా విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ బైబిల్‌ ఇలా అంటోంది: ”స్త్రీ తరఫు నుండి అభ్యంతరం లేకపోతే విడాకుల పత్రం వ్రాసి ఆమె ఇచ్చి ఆమె తన ఇంటి నుండి బహిష్కరించాలి”.

        క్రైస్తవ మతంలో స్త్రీ

        క్రైస్తవులు తౌరాత్‌ ధర్మ శాస్రానికే ప్రాధాన్యతనిస్తారు. అయితే క్రైస్తవంలో స్త్రీ యూదత్వంలోకంటే ఎక్కువగా అవమానించబడింది. ‘ఆది మానవుడు ఆదం (అ) స్త్రీయే ఆయన్ను మోస పుచ్చింది’ అని క్రైస్తవం సూచిస్తుంది. క్రైస్తవంలోని పాపం-పరిహారం అన్న విశ్వాసాని కి ఈ భావనే పునాది. అలాగే సెంట్‌ పౌలు ‘పురుషుడు స్త్రీని తాకక పోవడమే మేలు’ అన్న ప్రతిపాదననుసరించి క్రైస్తవ సమాజంలో ఒక సుదీర్ఘ కాలం వరకు సన్యాసత్వం అట్టహాసంగా అమలయింది. అప్ప ట్లో ఆడపడచు మానవ సమాజమ పాలిట వినాశకారిణిగా పరిగణించ బడేది. చివరి ఆమె రక్తం పంచుకు పుట్టిన పురుష పుంగవులు సయి తం ఆమెను ద్వేషించే దుస్థితి. అలాగే విడాకులు, పునర్వివాహ హక్కు స్త్రీకి ఉండేది కాదు.

        ఈరాన్‌లో స్త్రీ

        ఈరాన్‌ స్త్రీల విషయంలో విచిత్ర వాదానికి దిగింది. ‘మజ్‌దక్‌’ అన బడే వ్యక్తి ప్రతిపాదన మేరకు – స్త్రీలు పురుషుల ఉమ్మడి సొత్తు. తత్ఫ లితంగా వారిని ఆస్తిని పంచుకున్నట్లు పంచుకునేవారు. ఈ వికృతా చారం ఎంతగా ప్రబలిందంటే వావివరసులనేవి పూర్తి తుడిచి పెట్టుకు పోయాయి. ఈ పొకడకు వ్యతిరేకంగా మరొక సిద్ధాంతి ‘మాని’ పేరుతో ఒకఉద్యమం లేవదీశాడు.ఇది మరో అనర్థానికి దారి తీసింది. అతడు భార్యాభర్తల సంబంధాన్ని కూడా అధర్మమని ఖరారు చేశాడు. ఈ రెండు అతివాదాల నడుమ నలిగింది మాత్రం అతివలే.

        రోము, గ్రీకు సమాజంలో స్త్రీ

        గ్రీకులలో అడపడచులు అంగడి వస్తువులా అమ్మబడేవారు. నేటి కట్నం అనే రాక్షస ఆచారం కూడా వారినుండి సంక్రమించినదే.చట్టం రీత్యా ఒకే భార్య కలిగి ఉండే అనుమతి ఉండేది. కాని చట్ట విరుద్ధమ యిన అక్రమ సంబంధాలకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ప్రొఫె సర్‌ ‘లీకి’ ప్రకారం-గ్రీకులో అశ్లీలత, నీతి బాహ్యత విడాకులు ఎంత గా ప్రబలాయంటే వేశ్యల వద్దకు వెళ్లడం వినా జాతి నాయకుల వంటి వారికి సయితం మార్గాంతరం ఉండేది కాదు. గ్రీకు సంస్కృతి నుండే రోము సంస్కృతి పుట్టుకు వచ్చింది. తత్కారణంగా ఇవే దురాచారాలు వారిలోనూ ఉండేవి.

        అరేబియాలో స్త్రీ

        ఏ భూభాగం నుండయితే ఇస్లాం కాంతి ప్రసరించిందో అక్కడ కూడా ఆడపిల్లల స్థితి చాలా దారుణంగా ఉండేది. ఆడ శిశువు పడితే సజీ వంగా పాతి పెట్టేవారు. ఆస్తిలో స్త్రీకి ఎలాంటి వాటా ఉండేది కాదు. సవతి తల్లుల్ని వివాహమాడే దురాచారం ఉండేది. వితంవుల విషయం లో న్యాయసమ్మతమయిన చట్టంఉండేది కాదు.భారత దేశంలో పాండ వుల మాదిరిగానే ఏక సమయంలో ఒక స్త్రీకి నలుగురేసి భర్తలుండే వారు.
        ఈ వివాహాన్ని ‘రహత్‌’ వివాహంగా పిలిచేవారు. ‘రవికల పండుగ’ మాదిరి భార్యలను మార్చుకునే నికృష్ట ఆచారం కూడా ఉండేది.
        విటన్నింటికీ భిన్నంగా ఇస్లాం ప్రసాదించిన సామాజిక చట్టం అతివల ఆత్మ గౌరవానికి, మహిళల మానం, మర్యాదలకు పెద్ద పీట వేసింది. ఇస్లాం స్త్రీకి ప్రసాదించిన సామాజిక స్థాయిని సంక్షిప్తంగా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

        ఇస్లాం ధర్మంలో స్త్రీ

        మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు ప్రభవించిన సమయానికి నిస్స హాయులు, అణగారిన రెండు వర్గాలు ఉండేవి. ఒకటి స్త్రీల వర్గం, రెండవది బాలిసల వర్గం. మహనీయ ముహమ్మద్‌ (స) అన్ని వర్గాల ప్రజలతోపాటు ముఖ్యంగా ఈ ఇరు వర్గాల పట్ల మరింత కారుణ్యం తో వ్యవహరించారు. ఇస్లాం స్త్రీలకు గౌరవాన్నిచ్చింది అనడానికి నిద ర్శనం ఖుర్‌ఆన్‌లో 176 వాక్యాలు గల ఒక పూర్తి సూరా (అధ్యాయం) స్త్రీల కోసమే అవతరించింది. ఆ సూరా పేరు ‘అన్నిసా- స్త్రీలు’. ఖుర్‌ ఆన్‌లోని మరో సూరాకు పుణ్యస్త్రీ పేరయిన ‘మర్యం’అని పెట్టబడింది. అలాగే అల్లాహ్‌ా విశ్వాసుల కోసం ఆదర్శంగా తోటి విశ్వాసుల్ని పేర్కొ ంటూ ఇద్దరు స్త్రీలను-ప్రవక్త ఈసా (అ) గారి మాతృమూర్తి హజ్రత్‌ మర్యమ్‌ మరియు నియంత ఫిర్‌ఔన్‌ సతీమణి హజ్రత్‌ ఆసియా బిన్త్‌ ముజాహిమ్‌ (అ)ల పేర్లను ప్రస్తావించాడు అంటే అల్లాహ్‌ా స్త్రీలకు ఏ స్థాయి గౌరవాన్ని ఇచ్చాడో ఇట్టే అర్థమవుతుంది. వివరాల్లోకెళితే -

        సమానత్వంకన్నా న్యాయమే ప్రాధానం

        ఇస్లాం స్త్రీపరుషుల మధ్య సమానత్వం, సమాన స్థాయి గురించి ఆదే శించిందని సాధారణంగా కొందరు అంటుంటారు. ఇది నిజం కాదు. ఇస్లాం ఇద్దరి మధ్య న్యాయం గురించి ఆజ్ఞాపించింది. న్యాయం అంద రికి వారి ప్రతిభాపాటవాలను పరిగణలోకి తీసుకోకుండా సమాన స్థాయిని కల్పించడం కాదు. అర్హతను బట్టి తగిన స్థానాన్ని ఇవ్వడం. స్త్రీ పురుషుల సామర్థ్యాలలో ప్రకృతి రీత్యా వ్యత్యాసం ఉంది. ఈ తేడా ను గమనించకుండా ఇద్దరిపై ఒకే విధమయినటువంటి బాధ్యతలను మోపడం ఎంత మాత్రం న్యాయం అన్పించుకోదు. అందరికీ అన్నీ ఇచ్చేయడం కాదు, ముందు వారి సామర్థ్యాలను చూడాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు,పెద్దలు,యువకులు, వృద్ధులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు-అందరిపై ఒకే విధమయినటువంటి బాధ్యత ల్ని మోపడం ఏ విధంగానూ వివేకం అన్పించుకోదు. కాబట్టి బాహ్య ప్రపంచానికి అనుకూలంగా పురుషుడి సృజన జరిగింది గనక ఇస్లాం బైటి వ్యవహారాలు పురుషునికి అప్పగించి, ఇంటి వ్యవహారాలు స్త్రీకి అప్పగిస్తోంది. దీనర్థం ఒకరి స్థాయి ఎక్కువ, మరొకరి స్థాయి తక్కువ అని ఎంత మాత్రం కాదు.

        స్త్రీ, పురుషునిలో ఒకే ఆత్మ

        పురుషులకంటే తక్కువ స్థాయి గల సృష్టిరాసిగా స్త్రీని భావించడాన్ని ఖుర్‌ఆన్‌ ఖండిస్తోంది: ”మానవులారా! మీ రపభువుకు భయ పడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఆదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు”. (దివ్యఖుర్‌ఆన్‌-4:1)

        స్తీ శాశ్వత వ్యక్తిత్వం గలది

        స్త్రీని శాశ్వతమయిన  వ్యక్తిత్వం గలది ఇస్లాం పేర్కొంటుంది. ”మంచి పనులు చేసేవారు-పరుషులయినా, స్త్రీలయినా వారు విశ్వాసులయిన పక్షంలో స్వర్గంలో ప్రవేశిస్తారు”. (దివ్యఖుర్‌ఆన్‌-4: 125)

        యాజమాన్యపు హక్కు:

        ఆమెకు షరీయతు సరిహద్దుల్లో ఉంటూ వ్యాపారం, ఉద్యోగం చేసు కునే అనుమతి ఉంది. తన సొమ్మును ధర్మం ఆమోదించిన ఏ విష యంలోనయినా ఖర్చు చెసుకునే హక్కు ఆమెకుంది. ఆమె భర్త అయినా సరే ఆమె అనుమతి లేనిదే ఆమె ఆస్తిని ముట్టుకునే అధి కారం, హక్కు అతనికి లేదు.
        ”ఒకవేళ స్త్రీలు సంతోషంతో తన మహర్‌ సొమ్ము నుండి కొంత భాగం ఇచ్చినట్లయితే దానిని మీరు ఖర్చు పెట్టుకోవడం ధర్మసమ్మ తమే”. (దివ్యఖుర్‌ఆన్‌-4: 4)

        విమర్శించే హక్కు:

        పురుషుల వలే స్త్రీలకు సయితం ఇంటి వ్యవ హారాల్లో కాక, సామాజిక, ధార్మిక వ్యవహారాల్లోనూ విమర్శించే హక్కు ఉంది. కొన్ని విషయాలలో హజ్రత్‌ అలీ (ర) గారితో విశ్వా సుల మాత అయిన ఆయిషా (ర)గారు విభేదించడం, స్వయంగా అప్పటి ఖలీఫా అయిన హజ్రత్‌ ఉమర్‌ (ర) గారిని ఓ సాధారణ మహిళ ‘మహర్‌’ విషయమయి నిలదీయడం, ఆయన కూడా తన అభిప్రాయాన్ని విరమించుకుని ‘మదీనాలో ఉమర్‌కంటే తెలిసి వారున్నార’ని అంగీకరించడం వంటి సంఘటనలు దీనికి మచ్చు తునకలు.

        నికాహ్‌ హక్కు:

        ఇస్లాం పరిపూర్ణమవ్వక ముందు ఏ సమాజం లోనూ వివాహం కోసం అమ్మాయి అనుమతి ఆచారం ఉన్నట్లు కన బడదు. ”అవివాహిత వనితలతో వారి వివాహం గురించి అభిప్రా యం కోరాలి” అని, ”కన్నె పిల్లలతో వివాహం కోసం వారి అను మతి కోరాలి”అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స)వారు నొక్కి వక్కాణిం చడమే కాక, ‘తన తండ్రి తన అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించాడు’ అని ఓ అమ్మాయి దావా వేయగా, ప్రవక్త (స) ఆ పెళ్ళిని రద్దు చేయించారు. ”ఇస్లాంలో వివాహానికి ముందు అమ్మా యితో తప్పనిసరి అనుమతి పొందే విధానం నాకు ఎంతో నచ్చి ంది” అని ఓ సందర్భంలో భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయి అభిప్రాయ పడటం గమనార్హం!

        స్త్రీలకు భద్రతా హక్కు:

        ఇస్లాంలో ఒక ప్రధాన చట్టం ‘అమాన్‌’ చట్టం. అమాన్‌ అంటే రక్షణ కల్పించడం. ఈ హక్కును ఇస్లాం పురుషుల వలే స్త్రీలకు సయితం ఇచ్చింది. ఈ హక్కు గల వారు ఇతరులను రక్షణ కల్పించవచ్చు. అలా రక్షణ పొందిన వ్యక్తి మీద దాడికి దిగడానికి అనుమతి ఉండదు.”మీరు ఎవరికి రక్షణ కల్పిం చారో నేను కూడా వారికి రక్షణ ఇచ్చాను” అని ప్రవక్త (స) మక్కా విజయం సందర్భంగా హజ్రత్‌ ఉమ్మె హానీ(ర)గారితో అనడం దీనికి ప్రబల నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే, విద్యా హక్కు, ఫత్వా హక్కు, ఉద్యోగ హక్కు, ఆస్తి హక్కు, ఖులా హక్కు మొదలయిన ప్రధాన హక్కులన్నింటిని ఇస్లాం మహిళకు ప్రసాదించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్లాం పడతి ప్రగతికి సోపానం. దీనికంటే శ్రేయస్కరమయిన వ్యవస్థ మరొకటి లేదు. లభించదు. ఇందులో వారికి గౌరమూ ఉంది. రక్షణా ఉంది.

        గివ్మీ సమ్ సన్ షైన్


        బాల్యం – జగం మరచిన నవ్వులు బాల్యం. చెరువుల్లో, చేలల్లో, మేళల్లో, పచ్చని తొట ల్లో, పాతబడ్డ కోటల్లో ఉరుకులు, పరుగులు బాల్యం.  అమ్మ పెట్టే ముద్దల్తో, అమ్మమ్మ చెప్పే కథల్తో,  నాన్నమ్మ ఇచ్చే ముద్దుల్తో, తాత తెలిపే నీతుల్తో, నాన్న ఇచ్చే గిఫ్టుల్తో సర దాగా, సంతోషంగా సమయం గడపటం బాల్యం. ముఖంపై కల్మషం ఎరుగని మంద హాసం ఉంటుంది.  మదిలో ఆటలాడుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. మైలుదూరమ యినా బడికెళ్లడంలో అంతులేని ఆనందం ఉంటుంది. కొబ్బరుండ పంచుకొవడంలో …పిప్పర్‌ మెంట్‌ బిళ్లలు చప్పరించడంలో అనిర్వవచనీయమయిన మధురానుభూతి ఉంటుంది. అందరూ తనవారే, పరాయి వారే లేరన్న సంతృప్తి, సాత్వికత ఉంటుంది. బడి పంతులు గారి ప్రశంసపై మక్కువ ఉంటుంది. బడి వదలగానే మళ్ళీ ఆడుకోవచ్చ నే ఆశ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బాల్యం మన స్తోమతకొద్దీ మనం పరి పూర్ణంగా పొందినది. పరవశంతో మళ్ళీ మళ్లి తలచుకునేది! ఈ కారణంగానే -           ‘యే దౌతలత్‌ భీ లేలో, యే షొహ్ రత్‌ భీ లేలో,    భలే ఛీన్లో ముఝ్సే మేరీ జవానీ.

        మగర్‌ ముఝ్కో లౌటాదో బచ్‌పన్‌కా సావన్‌ ,      వో కాగజ్‌కి కిష్తీ వో బారిష్‌కా పానీ…..’
        అంటూ తన బాల్యాన్నే స్మరించుకున్నాడో కవి.
        పిల్లల లోకం మనకు తెలియని లోకమేం కాదు; బాల్య స్మృతులు లేని పెద్దలుండరు. అయితే వయసు మీద పడేకొద్దీ, బరువు బాధ్య తలు పెరిగేకొద్దీ మన బాల్య స్మృతులు మసక బారడం మొదలవుతాయి. చివరికి మమకారా న్ని మరచి గుండెను బండలా మార్చుకుని మన కలల పంటల్నే మనం నిర్లక్ష్యం చేస్తుం టాము, స్వేచ్ఛగా తిరిగే తూనిగని చిన్నతనం లో దారం కట్టి ఆడిన సంఘటన మీకు గుర్తే ఉంటుంది. అప్పుడు మనకు ఆ చిన్న ప్రాణి బాధ అర్థం కాలేదు. అసలు దానికో మనసుం టుందని, దానికీ బాధ కలుగుతుందనిగాని అప్పుడు మనకు తెలీదు.  ఇప్పుడు మనం ఎది గాము. తెలివివంతులం అయ్యాము. ఇప్పుడు మన పిల్లల కళ్లల్లో సునిశితంగా చూసినట్ల యితే, మనం వారిపై వేస్తున్న అధిక భారాని కి, ఒత్తిడికి తట్టుకోలేక – ఇకనయినా వదిలి పెట్టమనే అభ్యర్థన కనబడుతుంది.పిల్లలు మర మనుషులు కారు; చెప్పినవన్నీ చెప్పినట్టు వల్లె వేయ డానికి. బాల్యం అంటే కాంపిటేటివ్‌ స్పిరిట్‌ పేరిట క్లాసు రూముల్లో కుక్కి శ్వాస   ఆడని రీతిన నలిపేయడం కాదు. ట్యూషన్ల పేరిట ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా మింగేయ డం కాదు. వారి చిట్టిపొట్టి ఇష్టాలను అదిమేసి, స్వేచ్ఛను చిదిమేసి డాన్సులు, పాటలు నేర్పడం కాదు. మార్కులు…కాదు..కాదు…ర్యాంకులు తెచ్చుకుంటే ముద్దులు…లేదంటే గుద్దులు..ఇది కాదు వాత్సల్యం. భవిష్యత్తు పట్ల భయంతో బాల్యాన్ని తాకట్టు ప్టెడం కాదు ప్రేమంటే. వారి బాల్యాన్ని వారి నుండి బలవంతంగా లాక్కోవడం కాదు. మన ప్రేమ తోడుగా, వాత్సల్య నీడగా వారిని స్వేచ్ఛగా ఎదగనిద్దాం! వారి జీవితం సాఫీగా సాగిపోవడానికి, విజ్ఞాన సముపార్జనకు కావాల్సిన చదువు  చాలా అవసరం. కానీ, వేట…వేట..ర్యాంకుల వేట..అంతులేని ఆశల వెంపర్లాట. అందుకోలేని నిరాశలో కుంగుబాట. నిస్పృహ లోనయి మరణ వాత. ఈ పోటీలో జరగరానిది జరిగితే తల్లిదండ్రులకు గుండె కోత! ఎందుకీ రోత! వినండి! పైకి చెప్పలేక మధన పడే ఆ హృదయాల ఘోష!
        తొలి అడుగయినా పడలేదే       అలిసిందా నా పయనం
        ఇంకా మొదలయినా కాలేదే     ముగిసిందా పురాతం
        లేనే లేదా నా కోసం             ఏనాడు ఏ అవకాశం
        కన్నెదురుగా ఉన్నా సరే           కనరాదుగా నాకే నేను
        దారిని చూపే ప్రతి దీపం        మంటయి పోతుంటే
        చినుకే ఇవ్వని ఆకాశం          చిగురించాలనుకుంటే…..
        ఒక స్వాతి చినుకు భవితవ్యం అది పడే స్థానంపై ఆధార పడి ఉంటుంది. కాలుతున్న ఇనుము మీద ఆ నీటి చుక్క పడితే క్షణాల్లో ఆవిరయిపోతుంది. తామరాకు మీద పడితే కొంత కాలం పాటు మెరుస్తుంది. అదే ఒక ఆల్చిప్పలో పడితే ముత్యమయి విలువని సంతరించుకుంటుంది.  ఈ ఉదాహరణకీ పిల్ల జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే పిల్లల్లో సయితం మూడు రకాలు. 1) ఆల్చిప్పలో పడిన స్వాతి చినుకులా బాల్యం  నుండే గొప్ప విలువలతో
        జీవించి, మంచి స్థాయికి చేరుకుని ఇంకా ఆద ర్శంగా బ్రతికేందుకు ప్రయత్నిస్తూ జీవించే వారు. 2) పెద్దలకున్న పలుకుబడితోనో, మరో మార్గాననుసరించో వీరు పైకి వస్తారు. కానీ తామరాకుపై నీటి బొట్టులా వీరి జీవితం మొదట తళతళలాడినా కొంతకాలానికి కళా హీనమయిపోతుంది. 3) ప్రారంభ థలోనే జీవితానికి విలువ ఇవ్వని వీరు పెరిగేకొద్దీ వ్యసనాలు, గొడవలు, అల్లర్లు అలజడులకు పాల్పడుతూ జీవితంలో ఉత్సాహం, ఉల్లాసాన్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిపోతారు. కాలు తున్న ఇనుము మీద పడిన నీటి చుక్క ఆవిర యిపోయినట్టు వీరి జీవితాల్లోని శాంతి, సం తృప్తి హరించుకుపోతుంది. ఒకవేళ ఇటువంటి వ్యసనపరులు అదృష్టం కలిసొచ్చి హీరోలయి నా చివరికి మాత్రం జీరోలుగా మిగిలిపోతారు.
        ఇక్కడ తల్లదండ్రులుగా మనం గమనించాల్సిం దేమిటంటే, ఒక పొలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగి మంచి పైరు నాశనమయిందంటే తప్పు పైరుది కాదు. ఆ తప్పు కలుపు మొక్కలదీ కాదు. ముమ్మాటికి ఆ తప్పు రైతుదే అన్న యదార్థాన్ని మనం అంగీకరిస్తాం కదా! అలాగే మన పిల్లలు గొప్పవారుగా ఎదిగినా, మధ్యములుగా మిగిలిపోయినా, అధములుగా తయారయినా అందుకు కారణం వారొక్కరే కాదు. మనం కూడా కారకులమే, సమాన స్థాయి భాగస్వాములమే. కుటుం బ పెద్దలమయిన మనం పిల్లలు ఎదిగేకొద్దీ తోటి పిల్లల నుంచి, పరిసరాల నుంచి, పాఠశాలల నుంచి వారు సమకూర్చుకున్న జ్ఞానాన్ని సమన్వయంగా ఉపయోగ పడేలా, అది సత్యబద్దంగా ఉండేలా చూడాలి. ఉచితానుచితాల విచక్షణా జ్ఞానాన్ని వారికివ్వాలి. పిల్లలు మన గుమ్మానికి కట్టుకునే ఆకులో, పూలో కారు. కుటుంబం అనే చెట్టు నుంచి జీవన చైతన్యాన్ని ఆస్వాదిస్తూ విచ్చుకునే మొగ్గలు. ఆ చెట్టులోని ఒక్కో రెమ్మ, ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క ఆకు ఉపయోగదాయ కమయినట్టే, పువ్వయి విరబూసి పండుగా మారిన మన సంతానం  నుండి సయితం దాని మధురామృతం జాలువారుతుంది, ఆ ఫల విత్తనమే తన నైజం దృష్ట్యా మరో మహావృక్ష సృజన కు కారణమవుతుంది.
        కాబట్టి తల్లిందండ్రులుగా మనం మనోహరమయిన ఈ పూదోటను కాపాడుకోవాలంటే అందు కు తగిన శ్రమ పడాలి. తోటమాలిలా కష్టించి పిల్లల్ని పెంచాలి.సారవంతమయిన నేల, పరిశు ద్దమయిన గాలి, నీరు అందమయిన తోటకు ఆలంబన. సూర్యుడు వాటి ఊపిరి. ఈదురు గాలులు, పెనుతుఫానులు, ఈ వృక్షాల పోరాట పటిమను ద్విగుణీకృతం చేసే సాధనాలు. తోట లో ఒక్క చెట్టు ఎదిగి ఫలసాయాన్ని ఇవ్వాలంటే అందుకు ఇన్ని శక్తులు సహకరించాలి మరి. అంటే తోటమాలులమయిన మనం ప్రేక్షక పాత్ర వహిస్తామని కాదు. అసలు పిల్లలు సరిగ్గా ఎదగడానికి మూల కారకులం మనమే. అలా కాక, మన కలల పంటలతో రోజుకో అరగంట యినా గడపడానికి, వారి మనోభావాల్ని అర్థం చేసుకోవడానికి సమయం లేనంత బిజీలోమనం ఉంటే…రేపు వారికి చెప్పి ప్రయోజనం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుందాములే అనో, రోగం వచ్చాక వైద్యం చేయిద్దాములే అనో నిర్లక్యం చేయకూడదు. ఆకులు పట్టుకునే గత్యంతరం రాకుండా, మహమ్మారి రోగాన్ని భరించే దుస్థితి ఎదురవకుండా ముందే జాగ్రత్త పడాలి.
        నేడు ఎంతో మంది గొప్ప ప్రతిభ గల పిల్లలు మన కళ్ల ముందే ఉన్నా కూడా మనం వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించే స్థితిలో లేము. కారణం ఆ పిల్లల్లో ఆ యువకు ల్లో గల అల్లరే. ముఖ్యంగా యువకుల్లో టీజింగ్‌ చేెసే స్వభావం ఉంటుంది. వారికి భవిష్యత్తును భూతద్దంలో చూపించి బెదరగొట్టాలనుకునే ఆలోచనకు స్వస్తి పలికి జీవితాన్ని ప్రేమించడం, జీవిత మకరందాన్ని ఆస్వాదించడం నేర్పాలి. ఒకవేళ పిల్లలు మన వద్దకొచ్చి, కామర్స్‌ గురించి, గ్లామర్స్‌ గురించి, సెక్స్‌ గురించి, సెన్సెక్స్‌ గురించి, ప్రేమ గురించి, పెళ్ళి గురించి, సామాజిక, రాజకీయ, జాతీయ, ఆంతర్జాతీయ అంశా లగురించిగానీ చర్చించినప్పుడు – మనం విసుక్కోక అసలు వాళ్ళు మనల్నే ఎందుకు సంప్రతించారు? మన పట్ల గౌరవం, నమ్మకం లేకపోతే వారు మనతో ఇలా అడిగే వారా? అని పేరెంట్స్‌గా కాక ఫ్రెండ్స్‌గా ఆలోచించాలి. మనల్ని వారు ఫ్రేమిస్తున్నారు, మన మాటకు విలువ ఇస్తున్నారు కాబట్టే వారి సమస్యలను మనతో వచ్చి చెప్పుకుం టున్నారు. కన్నవారమయి మనమే వారి మనోభావాల్ని అర్థం చేసుకోకపొతే పాపం వారెక్కడికెళతారు? వారు పడ్డారు నిజమే; కానీ మనం వారికి చేయందించి లేపాలి. మన సంతానం మా నుండి కోరుతున్నదేమిటి? మీరు కాంతి మూలాలు. శాంతి మూర్తులు. గివ్‌ మీ సమ్‌ సన్‌ షైన్‌ – నాకు కాస్త  వెలుగు, కాసిన్ని కిరణాలు కావాలి……నాకు మరో అవకాశం కావాలి నేను మళ్లీ ఎదగాలి!!

        లైంగిక సంబంధాలు ప్రకృతి నియమాలు


        ”వ్యభిచార దరిదాపులకు కూడా పోకూడదు సుమా! అది ఎంతో నీతిబాహ్య మైన చేష్ట. మహా చెడ్డ మార్గం”. (బనీ ఇస్రాయీల్: 32)
        ఒక్కసారి వ్యభిచారం, దాని పరిణామాలను గురించి ప్రశాంతంగా ఆలోచిం చండి. మన సామూహిక జీవితంపై, సమాజంపై అదెలాంటి దుష్ప్రభావాన్ని వేస్తుందో పరిశీలించండి.
        ప్రథమంగా వ్యభిచారి తనను సుఖరోగాల కు గురిచేస్తాడు. తద్వారా తన శారీరక శక్తుల కార్యాచరణలో లోపాన్ని సృష్టించు కోవటమే కాదు, సమాజానికి, సంతతికి తీరని నష్టం కూడా కలిగిస్తాడు. సెగరోగం లేక పాండు రోగాన్ని గురించి ఏ వైద్యున్నై నా అడిగి చూడండి. మర్మాంగంలో ఏర్ప డిన పుండు సామాన్యంగా నయం కానిది. ఒక గొప్ప డాక్టర్‌ లోకోక్తి ఏమిటంటే ”ఒకసారి సోకిన సెగ రోగము శాశ్వతమైన రోగము.” దీనివల్ల కాలేయము, మూత్ర కోశము మొదలగు అవయవాలు కూడా కొన్ని సందర్భాల్లో దెబ్బ తింటాయి. ఇది కీళ్ళ నొప్పులు, ఇతర రోగాలకు కారణ భూతమవుతుంది. వ్యభిచారం వల్ల శాశ్వతంగా గొడ్డుతనం ఏర్పడే ప్రమాదముంది. అంతేకాక ఇది ఇతరులకు సోకే ప్రమాద మున్న రోగం కూడాను. మరికొన్ని సుఖ రోగాల ప్రభావాలయితే ఇంకా తీవ్రంగా, భయంకరంగా ఉంటాయి. అవి రోగి నుండి ఇతరులకు కుడా పాకిపోతాయి. ఇలా ఈ దుర్మార్గుడి మూలంగా అతని సంతానం, ఆ సంతానపు సంతానం కూడా, చేయని నేరానికి శిక్ష అనుభవించ వలసివస్తుంది. అంధులు, మూగ, చెవిటి, మతిలేని పిల్లల జననం-దౌర్జన్యకారుడైన తండ్రి, తన జీవితపు మధురానుభూతులు అనుకొని గడిపిన ఆ కొద్ది క్షణాల దుష్ఫలితాలే.
        సుఖరోగాలు ప్రతి వ్యభిచారికి సోకడం తప్పనిసరి కాకపోయినా ఈ చర్య తో అనివార్య సంబంధమున్న నైతిక బల హీనతల నుండి మాత్రం ఎవరూ తప్పించు కోలేరు. అశ్లీలం, మోసం, కాపట్యం, అబద్ధం, అవినీతి,స్వార్థం, భోగలాలస, నిగ్రహలోపం, ఆలోచనల్లో పోకిరి తనం, నడవడికల్లో చంచలత్వం, ముఖం చాటేసు కోవటం, విశ్వాసఘాతుకం- ఇవన్నీ వ్యభి చారానికి  సంబంధించిన  నైతిక రుగ్మ  తలు. ఇవి వ్యభిచారి మనోమస్తిష్కాలపై ప్రభావం వేయకుండా ఉండజాలవు. ఏ వ్యక్తిలో ఈ దుష్ట గుణాలు చోటుచేసు కుంటాయో అవి కేవలం లైంగిక విష యాల వరకే పరిమితమై ఉండవు. జీవితంలోని ప్రతి రంగంలో ఆ వ్యక్తి తన సంఘానికి ఈ గుణాలనే, వాటి ప్రభావా లనే సమర్పించుకుంటాడు.ఒకవేళ పైన పేర్కొన్న గుణాలు సమాజంలోని అత్యధిక మందికి కనుక సోకినట్లయితే అవి కళ, సాహిత్యం, వినోద క్రీడలు, పరిశ్రమలు, సంస్కృతి, ఆర్థికత్వము, రాజకీయము, న్యాయ వ్యవస్థలు, సైనిక సేవలు, రాజ్య వ్యవహారాలు- ఒక్కటేమిటి, సర్వ రంగా లను నిర్వీర్యం చేసి పడేస్తాయి. ప్రత్యేకించి ప్రజాస్వామ్యవ్యవస్థ లోనైతే…..వ్యభిచారాన్ని అనుమతించటమంటే సమాజంలో వేశ్యవృత్తి సాగకుండా ఉండదు. ఒక వ్యక్తి, యువకుడైన పురుషు నికి ‘వినోదం’ హక్కు ఉండాలని చెప్తున్నా డంటే దాని అర్థం సామూహిక జీవితంలో, సాంఘిక జీవితంలో అత్యంత నీచమైన పడుపువృత్తిని అవలంబించే స్త్రీల వర్గం ఒకటి ఉండి తీరాలన్న మాట. అయితే ఈ స్త్రీ వర్గం ఎక్కడి నుండి ఊడి పడుతుంది? ఈ సమాజం నుండే రావాలి కదా! సమా జంలోని ఎవరో ఒక పురుషుని బిడ్డనో, చెల్లినో కాక తప్పదు. ఒక ఇంటికి యజ మానురాలు, ఒక కుటుంబానికి స్థాపకు రాలు, అనేకమంది పిల్లలకి సంరక్షకురాలు కాగలిగిన ఇలాంటి లక్షలాది స్త్రీలనే ఈడ్చు కు వచ్చి ఈ వేశ్య బజారులో కూర్చోబెట్టా లి కదా! మునిసిపాలిటి మూత్రశాలల్లో ఇష్టం వచ్చిన వారు అవసరమనుకున్నప్పు డల్లా వెళ్ళినట్లు తమ కామవాంఛను తీర్చు కునే దుష్ట పురుషుల అవసరాలు తీర్చే కేంద్రాలుగా మార్చటమే కదా! దీని ద్వారా స్త్రీ తనలో ఉన్న సుగుణాలన్నిటినీ కోల్పోక తప్పదు. వారికి వయ్యారం,కుటిల మనస్తత్వం నేర్పటం జరుగుతుంది. తమ ప్రేమ, హృదయం, శరీరం, అందచం దాలు-సర్వస్వాన్ని ఒక్కొక్క గంటకు ఒక్కొక్క వినియోగ దారునికి అమ్ముకోవ టానికి తగిన విధంగా వారిని మార్చటం జరుగుతుంది. ఈ విధంగా స్త్రీ, ప్రయో జనకరమైన కుటుంబ వ్యవస్థ నిర్వాహకు రాలు కావడానికి బదులు జీవితాంతం పరపురుషుల కామవాంఛను తీర్చే కీలు బొమ్మలుగా మార్చబడుతుంది.
        వ్యభిచారాన్ని అనుమతిస్తే అది తప్ప కుండా సామాజిక నియమమైన వివాహ వ్యవస్థను నష్టపరిచి తీరుతుంది. ఇంకా చెప్పా లంటే దీని అంతిమ పర్యవసానంగా వివాహ వ్యవస్థ పూర్తి గా నశించిపోయి కేవలం వ్యభి చారమే విశ్వ రూపం దాల్చి సమాజంలో రాజ్యమేలుతుంది. వ్యభిచారం పట్ల మోజు కలిగిన స్త్రీ పురుషుల్లో నిజమైన దాంపత్య జీవి తం గడిపే యోగ్యతే ఉండదు. వ్యభిచార వ్యస నం వల్ల ఉత్పన్నమయ్యే చెడు దృష్టి, చెడు తలంపు, చంచలత్వం పోకిరితనం లాంటి దుర్గు ణాలు, తద్వారా వారి ఆలోచనల్లో అని శ్చలత, భోగలాలస, నిగ్రహ లోపంలాంటి బలహీనతలు చోటు చేసుకుంటాయి. ఒకవేళ ఇలాంటి వ్యక్తుల జీవితం దాంపత్య జీవితంలో
        ముడిపడి పోయినా దంపతుల మధ్య దాంపత్య జీవితానికి అవసరమైన పరస్పర ప్రేమ, అభిమానం, విశ్వాసము, సహ కారం, సానుభూతులు చోటు చేసుకోలేవు. ఇవి ఉంటేనే మంచి భావితరం, ఆనందో త్సాహాలు వెల్లి వెరిసే కుటుంబం ఉనికిలో కి వస్తుంది. ఇంకొక విషయం, వ్యభిచారా నికి అనువైన వాతావరణం నెలకొనే చోటు న లేక సమాజంలో సమాజ బాధ్యతలతో కూడిన వివాహవ్యవస్థ లేక కుటుంబ వ్య వస్థ మనగలజాలదు. ఒక వ్యక్తికి ఎలాంటి బాధ్యతలు లేకుండానే తన కామవాంఛలు తీర్చుకునే అవకాశ మున్నప్పుడు అతడెం దుకు వివాహం చేసుకొని తన భుజాలపై బాధ్యతల బరువును వేసుకుంటాడు? ఈ కారణంగానే పాశ్చాతదేశాల్లో ప్రత్యేకించి యూరోపియన్‌ సమాజాల్లో వివాహ     వ్య వస్థ కుంటు పడి పోయింది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.        వ్యభిచారానికి అనుమతించటం, ఆచారమివ్వటం మూలంగా కేవలం సాం ఘిక పతన మొక్కటే కాదు, మానవజాతి ఉనికికే ప్రమాద మేర్పడుతుంది. ఈ విష యాన్ని పైన రుజువు పరిచాము. విచ్చల విడి లైంగిక సంబంధాల్లో స్త్రీపురుషు లిద్దరికి కూడా సంతానోత్పత్తి లేక మానవజాతి మనుగడ గురించిన కోరిక ఉండదు, ఉండజాలదు కూడా.
        వ్యభిచారం వల్ల సమాజానికి అసలు శిశువులే లభించరు. లభించినా వారు  అక్రమ సంతానంగానే లభిస్తారు. వంశ పరంగా అక్రమ, సక్రమ అనేది కేవలం ఒక మానసిక భావన తప్ప ఇంకేమి కాదని కొందరు అజ్ఞానులు భావిస్తారు. నిజానికి అనేకానేక కారణాల మూలంగా అక్రమ సంతానానికి జన్మనివ్వటం అంటే ఆ శిశు వుపై, సర్వ మానవ సమాజంపై ఒక ఘోర మైన అన్యాయం, దౌర్జన్యం చేయడమే. తల్లిదండ్రులిద్దరూ కేవలం పాశవిక ఉద్రే కంలో మునిగి ఉన్న సమయంలోనే ఈ శిశువుకు తల్లి గర్భంలో అంకురార్పణ జరుగుతుంద నేది మొదటి విషయం. వివాహబంధంతో ముడి పడి ఉన్న ఒక జంటలో సంభోగ సమయంలో ఉండేటట్లు వంటి పవిత్ర మానవీయ విలువలు ఈ అక్రమ లైంగిక సంబంధం ఏర్పర్చుకున్న జంటలో ఎట్టి పరిస్థితుల్లోను ఉత్పన్నం కాజాలవు. వారిని కేవలం పాశవిక ఉద్రే కం మాత్రమే కలిపేస్తుంది. అందుకని ఆ సమయంలో వారిలో ని మానవీయ ప్రత్యే కతలన్నీ పటాపంచలై పోతాయి. తత్ఫలి తంగా అక్రమంగా జన్మించిన ఆ శిశువు తన తల్లిదండ్రుల పాశవిక వారసత్వానికే అర్హుడవుతాడు. ఇక ప్రపంచంలోకి వచ్చిన ఆ శిశువును స్వాగతించటానికి తల్లిగాని, తండ్రిగాని సిద్ధంగా ఉండరు. ఎందుకంటే అతనొక కోరబడిన, అభిలషించిన, ఎదురు చూస్తున్న ఉనికి కాదు. అనాలోచితంగా, అయిష్టంగా,గత్యంతరంలేక మెడలో వచ్చి పడిన పాములాంటి వాడు. సాధారణంగా ఇలాంటి పిల్లలకు తండ్రి ప్రేమకాని, అతని వనరులు కాని లభించవు. తల్లి ఏకపక్ష  ప్రేమ, రక్షణే అతనికి దిక్కు. ఆ ప్రేమలో కూడా విసుగు, అయిష్టత ప్రస్ఫుటంగా కనబడుతాయి. అతను అవ్వ, తాతయ్యల ప్రేమ వాత్సల్యాలకు కూడా నోచుకోలేడు. కుటుంబ సంరక్షణ, ప్రేమ అంటే ఏమిటో అతనెరుగడు. అందుకని అతనొక అసం పూర్ణ వ్యక్తిగా, లోపభూయిష్టమైన వ్యక్తిగానే ఎదుగుతాడు. అతనికి సరియైన శిక్షణ దొరకనందు వలన అతని క్యారక్టర్‌ పరి పూర్ణం కాజాలదు. అతనిలోని యోగ్య తలు వికసించవు. సమాజంలో తగిన విధంగా పురోగమించ టానికి, సముచిత స్థానం పొందటానికి కావలసిన ఒనరులు అతనికి లభ్యంకావు. అందువల్ల అతను లోపభూయిష్టంగా, అనాథగా, అపరిచితుని గా, పీడితునిగా, దూషితునిగా సంఘంలో అడుగు పెడతాడు.
        విశృంఖల లైంగిక సంబంధాల ధ్వజవాహ కులు దీన్ని గురించి వితండ వాదం చేస్తూ ఇలాంటి పిల్లల పోషణ, విద్యాబుద్ధుల కోసం ఒక జాతీయ వ్యవస్థ ఉండాలని, తల్లిదండ్రు లు తమ ఇష్టానుసారం కనిన పిల్లల్ని జాతి పెంచి పోషించి, సామాజిక సేవకోసం తర్ఫీదునివ్వాలని అంటారు. స్త్రీ పురుషులకు లైంగిక స్వాతంత్య్రం, వ్యక్తి గత స్వేచ్ఛ ఉండి, వారు వైవాహిక జీవితం లో బంధింపబడ కుండానే తమ లైంగిక కోరికలు తీర్చుకుంటూ తత్ఫలితంగా జన్మించిన శిశువులకు ఈ విధంగా శిక్షణ ఇస్తే మానవ సంతతీ పెరుగు తుంది; దాని శిక్షణ పూర్తి అవుతుందని వారి భావన. అయితే విచిత్రమైన విషయం ఏమి టంటే ఇటువంటి వారికి ప్రస్తుత తరం వ్యక్తి గత స్వాతంత్రమైతే ఇంతగా ప్రీతి పాత్రమైనది, కాని రాబోయే తరానికి వారు వ్యక్తిగత  పురోగాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఎలాంటి అవకాశం లేని జాతీయ వ్యవస్థ, ప్రభుత్వ పోషణ, శిక్షణా వ్యవస్థలను కోరుతున్నారు. లక్షలాది పిల్లలకు ఏక కాలంలో ఒకేరీతిలో, ఒకే ప్రణాళిక ప్రకారం ఒకే పద్ధతిలో పెంచే ఈ వ్యవస్థలో పిల్లల వ్యక్తిగత గుర్తింపు, ప్రత్యేకత, వ్యక్తిత్వం వికాసం ఎలా సాధ్యమవుతుంది. అలాంటి వ్యవస్థలో సాధ్యమైన మేరకు కృత్రిమ ఏకత్వం, సమానత్వాలైతే కనబడతాయి. కాని ఒక ఫ్యాక్టరీ నుండి ఉత్పాదక వస్తువులు ఒకే మూసలో, ఒకే పోలికతో రూపుదిద్దుకొని బయటకు వచ్చినట్లు ఈ వ్యవస్థ నుండి కూడా పిల్లలు ఒకే వ్యక్తిత్వంతో, ఒకే మనస్తత్వంతో బయటికి వస్తారు. కాస్త ఆలోచించండి. మానవుని గురించి ఈ మూర్ఖుల ఆలోచనలు ఎంత అల్పంగా, ఎంత నీచంగా ఉన్నాయో  ఊహించండి. బాటా చెప్పుల్లాగా వీరు మానవుల్ని తయారు చేయదలిచారు.
        పౌల్ట్రి ఫారంలోని కోడిపిల్లలలాగా, మానవ శిశువులకు దాణా ఇస్తూ మానవుడైనందుకు విద్యాశిక్షణ ఇప్పిస్తారట. అదీ జాతీయ స్థాయి లో ప్రభుత్వ పరంగానట. మానవ శిశువుల ను వీరు బాటా కంపెనీ బూట్లతో, పౌల్ట్రీ ఫారం కోడి పిల్లలతో సమానమనుకుంటు న్నారు. తరతరాలుగా యుగయుగాలుగా ఎందరెం దరో ప్రవక్తలు,ఋషులు,మునులు తత్వవే త్తలు పరిచయం చేసి, సమయోచితంగా దాన్ని సంస్కరిస్తూ ప్రయోగపూర్వకంగా సరి అనిపించుకున్న వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, మానవజాతికి ఈ ‘మహా సంస్కర్తలు’ అందించబోయే పరిష్కారాన్ని, ప్రతిఫలాన్ని చూడండి. ఇదంతా దేనికోసం? విచ్చలవిడిగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవటానికి అడ్డంకి ఉండకూడదనే క్షుద్రకోరికతో ఎంతటి మహోన్నత వ్యవస్థను నేలకూల్చాలని చూస్తున్నారు ఈ కామ పిశాచులు! అయితే ఒక మానవ శిశువును తీర్చిదిద్దటం ఒక సున్నితమైన కళ అనేది వారికి తెలియదు. అది కుటుంబం అనే చిరు కర్మాగారంలోనే, ఆర్ట్‌ గ్యాలరీలోనే  సాధ్య పడుతుంది. ఈ ఆర్ట్‌కు ఎంతో శ్రమ, ఓపిక అవసరం. ఒక కళాకారుడు చిత్రంలోని  ఒక్కొక్క రంగుపై ఏ విధంగానైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడో వ్యక్తిత్వాన్ని రూపొందించటం లో అనేక అంశాలపై, అనేక కోణాలతో పరి కించి సంస్కరించ వలసి ఉంటుంది. కూలీ కొచ్చిన కార్మికులు ఈ ప్రత్యేకతను ఈ సున్నిత మనస్తత్వాన్ని ఎలా సంతరించుకో గలరు?
        అదీగాక జాతీయ విద్యాసంస్కారాల ఈ వ్యవస్థలో పనిచేయటానికి, సమాజం తర ఫున ఈ పిల్లల పోషణా భారాన్ని ఎత్తుకోవ టానికి యోగ్యులైన కార్యకర్తలు అవసరమై ఉంటారు. అయితే ఈ పని కోసం తమ ఐహిక కోరికలను నియంత్రించగలిగే, నైతి కంగా సంయమనం పాటించే కార్యకర్తలే యోగ్యులవుతారు. వారిలోనే ఈ గుణాలు లేకపోతే వారు పిల్లల్లో ఈ నైతిక నియమాల ను, సంయమనాన్ని ఎలా పెంపొందించగలు గుతారు. ఇక్కడో ప్రశ్న జనిస్తుంది. ఇటు వంటి కార్యకర్తల్ని మీరెక్కడి నుండి తీసుకు వస్తారు? స్త్రీపురుషులను తమ కోరికలు తీర్చు కోవటానికి స్వేచ్ఛగా ఉంచాలనే కదా మీరు జాతీయ విద్యా సంస్కారాల వ్యవస్థను ఏర్పాటు చేయదలిచింది. ఇక సమాజంలో నైతిక సంయమనం, కోరికలపై నియంత్రణ కు అవకాశం లేకుండానే చేసేశారే, ఇలాంటి సొసైటీలో మీకు పైగుణాలు కలిగిన కార్య కర్తలు ఎలా లభ్యమవుతారు. ఇష్టానుసారం తమ కోరికల్ని తీర్చుకోవటమే ధ్యేయంగా ఉన్న ఇలాంటి సొసైటీలో సంయమనాన్ని, నిగ్రహాన్ని జీర్ణించుకొని ఆదర్శ ప్రాయంగా నిలిచే నాధుడెవ్వడు?       వ్యభిచారం లేక అక్రమ సంబంధం ద్వారా స్వార్థపరుడైన ఒక వ్యక్తి ఏ స్త్రీనైతే తల్లిగా చేసేస్తాడో, ఆ స్త్రీ జీవితం శాశ్వతంగా నాశనమైపోతుంది. సాంఘికంగా అవ మానం, అవహేళన, చీదరింపు, అసూయ ద్వేషాలే కాక అనేకానేక కష్టాల ఊబిలో ఆమె కూరుకు పోతుంది. బ్రతికున్నంతకాలం ఆ ఊబిలో నుండి ఆమె బయటపడజాలదు. ఆధునిక నైతిక సూత్రాల్లో ఈ సమస్యకు కను గొన్న పరిష్కారమేమిటంటే వివాహం ద్వారా గాని, వివాహేతర సంబంధం ద్వారా గాని, మాతృత్వం దాల్చిన స్త్రీలందరికి సమాన ప్రతి పత్తిని కలుగజేయటం.
        మాతృత్వం అనేది గౌరవించదగ్గ స్థానం గనక ఒక బాలిక అమాయకత్వం వల్లనో, అజాగ్రత్త వల్లనో తల్లి అయ్యే బాధ్యతను స్వీకరించింది. కనుక సమాజంలో ఆమెను అవమానపరచట మంటే ఆమెపై దౌర్జన్యం చేయడమేనంటూ వీరు సమర్థిస్తున్నారు.అయితే మొదటి విష యం – ఈ పరిష్కారం వ్యభిచారిణులకు ఎన్ని విధాల అనుకూలమైనప్పటికి, సామూ హిక రూపంలో మాత్రం సమాజానికి ఇది కష్టాల్నే తెచ్చి పెడుతుంది. సమాజం సహజంగానే అక్రమ సంతానం కన్న తల్లిని నీచంగానే,ద్వేషంగానే చూస్తుంది. అయితే ఈ నీచ, ద్వేష చూపు, ఈ ప్రవర్తన సమాజం లోని ఇతర వ్యక్తుల్ని ఇలాంటి పాపం నుండి ఆపటానికి,బెదరించటానికి అమోఘంగా పనిచేస్తుంది. వేరొక వైపు ఈ చర్యద్వారా సమాజంలో, సమాజ ప్రజల్లో నైతిక జాగృతి ఉందని నిరూపితమవుతుంది. ఒకవేళ సక్రమ సంతానం కలిగిన మరియు అక్రమ సంతానం కలిగిన ఇద్దరు తల్లులకు ఒకే హోదాను కల్పిస్తే దీని అర్థం ఏమిటి? సమాజం నుండి మంచి చెడు, పుణ్యము పాపము, అక్రమం సక్రమం అనే వ్యత్యాసమే అంతమై పోతుంది. ఒకవేళ ఇది సాధ్యపడిందే అనుకోండి, అయినప్పటికి అక్రమ సంతానం కలిగిన తల్లి కష్టాలు కడతేరుతాయా? ఆమె బాధలన్నీ దూరమై పోతాయా? అక్రమ సంతానం, సక్రమ సంతానం కలిగిన ఇద్దరు తల్లుల్ని మీ
        దృష్టిలో, మీ సిద్ధాంతంలో సమానమనిపించు కోవచ్చునేమో కాని ప్రకృతి మాత్రం వీరిద్దరిని సమానంగా లెక్కించదు, వీరిద్దరూ ఎన్నటికీ సమానం కాలేరు. బుద్ధిజ్ఞానాల రీత్యా, తర్కం రీత్యా, న్యాయం రీత్యా, యదార్థతరీత్యా ఏ విధంగా చూసినా వీరిద్దరు సమానం కాలేరు. లైంగిక కోరికల క్షణిక ఉద్రేకంలో తనను తాను మరిచిపోయి, తననుగాని తనకు పుట్ట బోయే పిల్లవానికిగాని సాకటానికి, సంరక్షించ టానికి ఎలాంటి భరోసా ఇవ్వని స్వార్థపరుడైన ఒక మగవానికి శరీరం అర్పించుకున్న ఒక మూర్ఖపు స్త్రీ, బాధ్యతాపరుడు, గౌరవనీయుడు అయిన ఒక పురుషుడు లభించేంతవరకు తన కోరికల్ని, ఉద్రేకాల్ని నియంత్రణలో ఉంచు కున్న శీలవతి అయిన స్త్రీతో ఎలా సమానం కాగలదు? ఏ  బుద్ధిజ్ఞానాలు వీరిద్దరిని సమా మనగలుగుతాయి? మీరు కోరుకున్నట్లయితే  వీరిద్దరిని   కృత్రిమంగా,  ప్రదర్శనా నిమిత్తం సమానం చేసుకోవచ్చు. అయితే ఒకే భర్తతో జీవితం గడుపుతున్న స్త్రీకి లభించే పోషణ, సంరక్షణల   గ్యారంటీని  ఆ ప్రేమ వాత్సల్యా లను,  అనురాగ  పూరితమైన  ఆ యోగ క్షేమాలను ఆ శాంతిని, ఆ నిశ్చలతను, ఆ నమ్మకాన్ని ప్రేమపూర్వకమైన ఆ అనుబం ధాన్ని ఆ మూర్ఖ స్త్రీకి ఎక్కడి నుండి సమ కూర్చ గలుగుతారు? ఆమె  పిల్లవానికి కేవ లం తండ్రి మాత్రమే చూపగలిగే కరుణా వాత్సల్యాలు ఏ బజారు నుండి కొని పెడ్తారు? మహా అయితే చట్ట సహాయంతో ఆమెకు జీవన భృతి ఇప్పించగలరేమో, అయితే ఒక స్త్రీకి ఒక పిల్లవానికి ఈ ప్రపంచంలో కేవలం భృతి మాత్రంతోనే సరి పోతుందా? లేదు. అందుకని అక్రమ సక్రమ మాతృత్వాలను సమానం చేసినంతమాత్రాన పాపంచేసిన స్త్రీలకు బాహ్యంగా ఎంత సౌకర్యం కల్పించి నా వారు చేసిన ఈ పొరపాటుకు భౌతిక ఫలి తాలను ఈ విధంగా జన్మించిన కారణంగా వారి పిల్లలకు కలిగే వాస్తవ నష్టాలనుండి కాపాడలేరు.
        పై కారణాలవల్ల సమాజ మనుగడకు, దాని పురోగతికి, లైంగిక సంబంధాల విచ్చలవిడి తనాన్ని కఠినంగా నిరోధించటం సమాజ అత్యవసరాల్లో పరిగణింపబడుతుంది. అంతే కాదు, లైంగిక కోరికల తృప్తికోసం ఒకేఒక ద్వారం అయిన వివాహ సంబంధం తెరిచి ఉంచక తప్పదు. వ్యక్తులకు వ్యభిచరించే స్వాతంత్య్రమివ్వటం అంటే వారి పట్ల అనవ సరమైన పక్షపాతం చూపించటమే కాదు, సమాజ హత్యగా పరిగణించబడుతుంది. ఏ సమాజమైతే దీన్ని స్వల్ప విషయంగా భావి స్తుందో, వ్యభిచారాన్ని కేవలం వ్యక్తిగత ఆనం దోల్లాసంలో గడిపే సమయం (హ్యావింగ్‌ ఎ గుడ్‌ టైమ్‌)గా భావించి దృష్టి మరల్చుకుం టుందో, విచ్చలవిడి బీజార్పణ (సోవింగ్‌ విల్డ్‌ ఓట్స్‌) పట్ల సహన వైఖరిని అవలంబిస్తుందో ఆ సమాజం ఒక మూర్ఖ సమాజమే అనబడు తుంది. దానికి తన బాధ్యతల సృహ లేదు. తనకు తానే శత్రువుగా వ్యవహరిస్తున్నది. ఆ సమాజానికి తన బాధ్యతల సృహే కనుక ఉండి ఉంటే లైంగిక సంబంధాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛవల్ల సమాజంపై, సమాజ ప్రయోజనాలపై పడే దుష్ప్రభావాల్నే కనుక అది ఎరిగి ఉంటే దొంగతనం, దోపిడి, హత్య లాంటి నేరాల దృష్టితోనే ఈ ‘చర్య’ను కూడా చూడగలిగి ఉండాలి.ఇంకా అంతకన్నా తీవ్రమైన నేరంగా పరిగణించాలి. దొంగ, దోపిడీదారు, హంతకుడు ఏం చేస్తారు? మహా అయితే ఒక వ్యక్తి లేక కొందరు వ్యక్తులకు నష్టం కలిగిస్తారు. కాని వ్యభిచారి సర్వ సమాజాన్ని, దాని భావితరాల ను వినాశం వైపుకు నెడ్తాడు.
        వ్యక్తుల స్వార్థపరమైన దౌర్జన్యాలను ఎదుర్కోవ టానికి, సమాజ ప్రయోజనాలను కాపాడటా నికే చట్టం ఉనికిలోకి వచ్చిందని చట్ట బలం తోనే సమాజ ప్రయోజనాలు కాపాడబడు తున్నాయనేది సర్వ వితం. ఈ కారణంగానే దొంగతనాన్ని, హత్యను, దోపిడీని, హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేకానేక విష యాలను చట్టపరంగా నేరాలని గుర్తించి, వాటికి తగిన శిక్షలు విధించి, సమాజాన్ని ఈ రుగ్మతల నుండి కాపాడటానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటప్పుడు ‘వ్యభిచారం’ విషయంలో చట్టం సొసైటీని ఎందుకు రక్షించకూడదు? సమాజాన్ని ఎందుకు సమ ర్థించకూడదు? వ్యభిచారాన్ని చట్ట పరమైన నేరంగా ఎందుకు పరిగిణించ కూడదు?
        సిద్ధాంతపరంగా కూడా వివాహం, వ్యభి చారం ఈ రెండు ఏకకాలంలో ఒక సమాజం లోని అంతర్‌ భాగాలు కాలేవు. ఒక వ్యక్తికి  బాధ్యతలు స్వీకరించకుండానే లైంగిక వాంఛ లు తీర్చుకునే స్వాతంత్రమిచ్చి అదే పనికోసం వివాహ నియమాన్ని ఏర్పాటు చేయటం అర్థం లేని విషయం. ఉదాహరణకు రైలులో టికెట్టు లేకుండా ప్రయాణించటాన్ని సమర్థిస్తూనే, ప్రయాణం కోసం టికెట్టు కొనుక్కునే నియ మాన్ని ఏర్పాటు చేయటం ఎలా ఉంటుంది? బుద్ధీజ్ఞానాలున్న ఏవ్యక్తి కూడా ఏకకాలంలో ఈ రెండు పద్ధతుల ఉనికిని సమర్థించలేడు. సమంజసమైన, సముచితమైన పద్ధతి ఏమి టంటే టికెట్టు కొనాలనే నియమాన్నైనా తొల గించండి లేదా టికెట్టు కొనాలని నియమం విధిస్తే, టికెట్టు లేకుండా ప్రయాణించటాన్ని నేరంగా పరిగణించండి. ఈ విధంగానే వివా హం, వ్యభిచారాల విషయంలో ఈ ద్వంద్వ వైఖరి అసమంజసమైనదే కాదు. అహేతుకమై నది కూడాను. సమాజం కోసం వివాహ నియమం అనివార్యమని ఏ కారణాలతో దృవీకరించబడిందో, వాటితోనే వ్యభిచారాన్ని  (అది ఏ రూపంలోనున్నా సరే) నేరంగా పరిగణించక తప్పదు.
        సమాజంలో ఒక అపోహను వ్యాపింప జేశారు. అదేమిటంటే వివాహానికి ముందు ఒక యువకునికి లైంగికవాంఛల తృప్తికోసం కొద్దోగొప్పా అవకాశం ఉండాలి. ఎందుకంటే యవ్వనంలో లైంగిక ఉద్రేకాన్ని ఆపటం కష్టమైన పని, అలా ఆపితే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది – కాని ఈ దృక్పథం ఏ విషయాల మీదైతే ఆధారపడి ఉందో, అవన్నీ కల్పితమైనవి, కృత్రిమమైనవి, కామోద్రేకాల్ని లేపే తీవ్రమైన, అసామాన్యమైన (అబ్‌నార్మల్‌) ఈ పరిస్థితి సామాన్య(నార్మల్‌) ప్రజల్లో ఎందుకు జనిస్తుందో తెలుసా? సమాజంలోని చెడు సంస్కృతి ఈ ఆలోచనలకు, భావాలకు బలవంతంగా, ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన ఉద్రేకాలకు గురిచేస్తుంది. మన సమాజంలో ప్రబలిపోయిన సినిమాలు, సాహిత్యం, నగ్న చిత్రాలు, సంగీతం, మిశ్రమ సమాజాల్లో అత్యధికంగా అలంకరించుకున్న స్త్రీలు మగ వారికి తారసపడటం-వంటి కారణాలే సామాన్య ప్రజల్ని లైంగికపరంగా అసామాన్య మైన, తీవ్రమైన పరిస్థితికి గురిచేస్తాయి. అంతే కాని ప్రశాంతమైన వాతావరణంలో సామాన్య  స్త్రీపురుషుల్లో తమనుతాము ఆపుకోలేనంత లైంగిక ఉద్రేకాలు పొడసూపవు. కొద్దోగొప్పో ఇలాంటి ఉద్రేకాలు పొడసూపినా, మానసిక, నైతిక శిక్షణ ద్వారా వాటిని కట్టడి చేయ వచ్చు. యవ్వన థలో లైంగిక కోరికలు తీర్చుకోకపోతే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందనే భావన కేవలం మోస పూరిత మైనది, భ్రమింపజేసేది తప్ప ఇంకేమి కాదు. అందుకని నైతికత, ఆరోగ్యం రెండి టినీ కాపాడుకోవాలంటే సమాజంలోని ఈ చెడు సంస్కృతిని, ధనిక జీవితపు చెడు ప్రమాణాలను మార్చక తప్పదు. వీటివల్లనే నేడు వివాహం కష్టతరమై వ్యభిచారం సుల భమై పోయింది.


          అజ్ఞాన సమాజంలోని స్పష్టంగా కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే ఏ రుగ్మతల ప్రభావాలైతే పరిమితంగా, స్వల్పకాలంగా, పైకి కనపడేవిగా ఉంటాయో వాటిని వెంటనే గుర్తించగలం. కాని ఏ రుగ్మతల ప్రభావాలు బహుముఖంగా, సుదీర్ఘకాలంగా, పైకి కన్పించనిగా ఉంటాయో వాటిని సకాలంలో గుర్తించి నిర్మూలించలేము. ఎందుకంటే వాటి ప్రభావాలు చాలాకాలం గడిచిన తర్వాత గాని బయల్పడవు. అందువల్ల వాటిని గురించి పట్టించుకోవటం జరగదు. పట్టించుకోక పోవటమే కాదు, వాటిని ఉపేక్షించటం, క్షమించటం, చివరికి అనుగ్రహించటం కూడా జరుగుతుంది. దొంగతనం, దోపిడి, హత్యలాంటి నేరాలను ప్రముఖంగాను, వ్యభిచారం లాంటి నేరాన్ని అల్పంగా చూడటానికి కారణం ఇదే. ఒక వ్యక్తి తన ఇంట్లో ప్లేగు వ్యాధి వ్యాపింపజేసే ఎలుకల్ని జమచేసి అంటురోగాల్ని వ్యాపింపజేస్తే మూర్ఖ సమాజం అతన్ని క్షమించరాని నేరస్థునిగా పరిగణిస్తుంది. ఎందుకంటే అతని చర్య స్పష్టంగా, ఎంతో హానికరమైనదిగా కన్పిస్తుంది. అయితే ఇదే ఒక వ్యభిచారి తన స్వార్థంకోసం, సమాజ జీవిత నాడీ కోసేసినా, దాని నష్టాలు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, అవి పైకి కనపడనివిగా ఉంటాయి కనుక ఈ ఆజ్ఞానులకు ఆ వ్యభిచారి ఆన్నివిధాల      క్షమార్హునిగా కనబడతాడు. అంతేకాదు అతను ఒక నేరానికి పాల్పడ్డాడనే అనుమానం కూడా వారికి రాదు. అజ్ఞానం, మూఢత్వాలకు బదులు విజ్ఞతావివేచనాలు, ప్రకృతి నియమాలు మన సమాజ సంస్కృతికి పునాదులు కాగలిగితే ఇలా వ్యవహరించటానికి ఆస్కారమే ఉండదు.