Monday, October 25, 2021
మన మాట కావాలి పూబాట
ఉపవాసం ఎలా?
విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించడం జరిగింది. ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధిగావించ బడిందో, దీని వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. (2:183)
శుభప్రదమైన రమజాను
మానపు ఉపవాసాల ప్రారంభానికి కొన్ని షరీఅత్ నియమాలున్నాయి. " ఇక నుండి రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం
ఉండాలి."
(02:185)
ప్రవక్త(స) ఇలా అన్నారు:
" నెలవంకను చూసి ఉపవాసం ఉండండి, దాన్ని చూసే విరమించండి. మేఘాల
వల్ల స్పష్టంగా కానరాకపోతే షాబాన్ నెల 30 రోజులు పూర్తి చెయ్యండి”. (బుఖారి, ముస్లిం)
"
ఇద్దరు ముస్లింలు
చంద్రుడిని చూసినట్లు సాక్ష్యమిస్తే ఆసాక్ష్యానికి కట్టుబడి ఉపవాసం ఉండండి. మరియు విరమించండి."
(అహ్మద్, నసాయి)
రోజా విధి కావడానికి
షరతులు
(1)
ముస్లిం అయివుండాలి.
అవిశ్వాసులకు విధి కాదు.
(2)
పెద్దవారై ఉండాలి.
పిల్లలపై విధి కాదు.
(3)
మానసిక స్పృహగలవారే
ఉండాలి, మతి చలించిన వారిపై రోజా విధ్ కాదు.
(4) ఉపవాసాలు విధి అన్న విషయం తెలిసి ఉండాలి.
మినహాయింపులు
" మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులెతే లేక ప్రయాణంలో ఉంటే
వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తి చెయ్యాలి.
(1) బాటసారి (2) రోగి
(3)
వృద్ధాప్యం వలన లేక
నయంకాని రోగం వలన, స్త్రీలయినా పురుషులైనా, వీరు ప్రతి ఒక్క ఉపవాసానికి
బదులు ఒక పేదవాడికి రెండు పూటల అన్నం తినిపించాలి.
(4)
స్త్రీలు బహిష్టు
సమయంలో లేదా పురిటిరక్త స్రావం జరుగుతున్నప్పుడు, వేరే రోజుల్లో ఆ ఉపవాసాలను
పూర్తి చెయ్యాలి.
రోజూ రకాలు
* విధి( ఫర్జ్),
* సున్నత్, నఫిల్.
* నిషిద్దేమైనవి(హరామ్).
* హర్షదాయకంకానివి (మక్రూహ్) .
*
విధి
• రమజాను ఉపవాసాలు . • పూర్తి చెయ్యనివి. • మొక్కుకున్నవి మరియు కఫ్పార
(పరిహారం) ఉపవాసాలు
. • హజ్లో "వాజిట్ “ని వదలినందుకు ఇహ్రాం నియమాలు పాటించనందుకు పరిహారంగా.
*
సున్నత్, నఫిల్
• వారంలో రెండు (సోమవారం, గురువారం)
• నెలసరి మూడు (13, 14, 15 ).
• షాబాన్ నెల ఉపవాసాలు.
• ముహర్రం ఉపవాసాలు.
• జుల్ హజ్జా మొదటి 9 రోజుల ఉపవాసాలు.
• అరఫా ఉపవాసం •
షవ్వాల్ నెలలోని 6 ఉపవాసాలు.
* నిషిద్ధమైనవి
• ఈదుల్ ఫిత్ర ఈదుల్ అజ్హాకు చెందిన రెండు
రోజులు
• తశ్రీక్ 11, 12, 13 దినాలు ( ఈదుల్ అజ్హా తరువాత)
*
మక్రూప్
• షాబాన్ నెల ఆఖరి ఒకటి, రెండు రోజులవి.
• షాబాన్ 15 వ తేది ఉపవాసం.
రబీవుల్ అవ్వల్
12 వ తేది ఉపవాసం .
• 27 రజబ్ ఉపవాసం
• విరామం లేకుండా పాటించే నఫిల్ ఉపవాసాలు.
• శుక్రవారపు ఉపవాసం గురువారం, శనివారాన్ని వరుసగా కలిపి ఉంటే
ఫరవాలేదు)
• కేవలం శనివారం రోజు,
సంకల్పం
ఖచ్చితంగా కర్మలు సంకల్పాలపై ఆధారపడి వున్నాయి.
(బుఖారీ, ముస్లిం
(1) సంకల్పం (2) ఉషోదయపు ధవళ రేఖలు సుబహ్ సాదిఖ్) ప్రస్పుటమయ్యే వరకు సంకల్పం చేసుకోవాలి.
అలా చెయ్యని ఎడల ఉపవాసం కాదు. ఈ నియమం విధిగావించబడిన ఉపవాసాలకు మాత్రమే వర్తిస్తుంది.
ధైవభీతి
1) "ఏ దాసుడైనా ఉపవాసం వుండి కూడా అబద్దాలాడటం, అబద్దాలపై అమలు చేయడం వదలని
ఎడల, అతను పస్తులుండటం పట్ల అల్లాహ్ కు ఏ మాత్రం ఆసక్తి లేదు”. (బుఖారి)
2) ఉపవాసం డాలు వంటిది. మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే, అసభ్యకరమైన మాటలకి చేష్టలకీ, పనికి మాలిన కార్యాలకి దూరంగా
మసలుకోవాలి. ఒకవేళ ఎవరైనా అతనితో వాదోపవాదానికి గాని, కొట్లాటకు గాని దిగితే నేను
ఉపవాసమున్నానని చెప్పేయ్యాలి. (బుఖారి, ముస్లిం)
సహ రీ
1. రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నిటినీ
త్యజించి చీకటి పడే వరకు ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. (బఖర 187)
2- మీలో ఎవరైనా తనచేతిలో గ్లాసు (నీళ్ళు) లేదా మరే వస్తువైనా ఉన్నప్పుడు అజాన్ వింటే
అది పూర్తి చేసే వరకూ వాటిని వదలకండి ( అబూ దావూద్).
3- నా అనుచర సమాజం ఎప్పటి వరకైతే "నహరీ చేయడంలో నింపాదిగా వ్యవహరించి ఇఫార్ చేయటంలో
వేగిర పడుతుందో అప్పటి వరకు పుణ్యం (ధర్మం) పై నిలకడ గలిగి ఉంటుంది. (అబూ దావుద్)
4. సహరీ చెయ్యండి, దానిలో చాలా శుభాలున్నాయి.(అబూదావూద్)
ఇఫ్తార్
ప్రవక్త (స) నమాజ్
చేయక ముందే కొన్ని తాజా ఖర్జూర పండ్లతో లేదా నీళ్ళతో ఉపవాసాన్ని విరమించేవారు. ( అబూ
దావుద్) కొందరు ఉప్పుతో ఇఫ్తార్ చేస్తారు. అది పుణ్యం ప్రసాదిస్తుందని భావిస్తారు.
కాని ఇది సున్నత్ కాదు. దాని ద్వారా పుణ్యమూ ప్రాప్తమవ్వదు.
ఇఫ్తార్
జహబజ్ జమవు వబ్తల్లతిల్ ఉరూఖు వ సబతల్
అజరు ఇన్ షా అల్లాహ్
ఓ ఉపవాసికి ఇఫ్తార్
చేయించే వ్యక్తికీ, లేక “ముజాహిద్" కోసం సామగ్రిని తయారు చేసే వ్యక్తికీ ఉపవాసి
మరియు
ముజాహిదకి లభించినంత
పుణ్యం లభిస్తుంది. (బైహఖీ)
అభిలషణీయం
1. దైవ ప్రవక్త (స) లెక్క లేనన్ని సార్లు ఉపవాస సమయంలో "మిస్వాక్ చేస్తూ ఉండగా నేను చూసాను. (అబూ దావూద్).
2) మీరు వుజూ చేసేటప్పుడు ముక్కులో
బాగా నీళ్లు ఎక్కించండి. ఉపవాస సమయంలో మాత్రం అలా చేయవద్దు.....
" 3. ఉపవాసి తన కళ్లల్లో సుర్మా పూసుకోవచ్చు, మందు కూడా వెయ్యవచ్చు. కాని
గొంతులో దిగకుండా జాగ్రత్త వహించాలి.
4. ఇంజక్షను వలన రోజా భంగం కాదు. కానీ గ్లూకోజ్ శక్తినిచ్చే ఇంక్షను వల్ల భంగం అవుతుంది.
5. అత్యవసర సమయంలో ఉపవాస శరీరం నుంచి రక్తం తీసుకోవచ్చు.
6. మనసుని అదుపులో ఉంచుకోగలిగే వ్యక్తి ఉపవాన స్థితిలో తన భార్యని ముద్దాడవచ్చు.
7.భర్త కోపిష్ట అయితే భార్య కూరలోని ఉప్పు, కారం రుచి చూసి ఉమ్మివేయవచ్చు.
8. సువాసన పూయటం, శ్వాస పీల్చడం అభిలషణీయం.
9.శరీరాలకు నూనె రాయటం మాలిష్ చెయ్యడం అభిలషణీయం.
10.నోటిలోని లాలాజలాన్ని మింగవచ్చు కాని జమచేసి మింగటం మాత్రం అవాంఛనీయం.
11.ఉబ్బనం గలవారు స్ప్రై ఉపయోగించవచ్చు
12 తెలీయకుండా వీర్యస్థలనం అయితే ఏమీకాదు.
13. దానంతట అదే వాంతి వస్తే ఏమి కాదు.
14. మరచి పోయి తిన్నా త్రాగినా ఉపవాసం భంగం కాదు.
ఉపవాసాన్ని భంగ పరిచేవి
1. కొన్ని పరిస్థితుల్లో ఉపవాసం భంగమైతే, దాన్ని తరువాత పాటిస్తే సరిపోతుంది.మరికొన్ని
పరిస్థితుల్లో భంగమైన ఉపవాసాన్ని పాటించటంతో పాటు (ఖజా చేసుకోవటంతో పాటు) పరిహారం
(కప్పారా) కూడా చెల్లించవలసి ఉంటుంది.
2.
ఎవరైనా ఉపవాస్థితిలో
తెలిసీ తన భార్యతో సంభోగిస్తే అతని ఉపవాసం భంగమవుతుంది. దానికి అతను పరిహారం చెల్లించాల్సి
వస్తుంది. భార్యా,భర్తలిద్దరూ ఇష్టపూర్వకంగా దీనికి పాల్పడివుంటే ఇద్దరూ బాధ్యులౌతారు.(పరిహారం
చెల్లించాల్సిందే)
కప్ఫార (పరిహారం)
కప్పారాగా ఒక బానిసని
విముక్తి చేయాలి. లేదా వరుసగా రెండు నెలల పాటు ఉపవాసాలు పాటించాలి. లేదా 60 మంది పేద
వారికి రెండు పూటలా అన్నం తినిపించాలి. లేదా ఒకే పేదవాడికి 60 రోజుల వరకు రెండు పూటలా
అన్నం తినిపించండి. కప్పారా ముస్లిములకు మాత్రమే ఇవ్వాలి. ఎవరైనా ఉపవాసం పాటించే శక్తిలేక, పరిహరమూ కట్టలేక అన్నమూ తినిపించలేని
స్థితిలో ఉంటే అలాంటి వ్యక్తికి, స్తోమత ఉన్నప్పుడు పరిహారాన్ని
చెల్లిస్తాననీ సంకల్పం చేసుకోవాలి.

