Saturday, January 28, 2023

Friday, January 27, 2023

SPEECH ON 74TH REPUBLIC DAY 20222

Thursday, January 19, 2023

అదుగో ఆదర్శమూర్తి...!



మహిళకు మనసుంటుందనీ 
మగువకు మెదడుంటుందనీ 
ప్రమిదకు ప్రగతుంటుందనీ 
హరిణికి హక్కుంటుందనీ 
వనితకు విలువుంటుందనీ 
కలకంఠికి కన్నీరుంటుందనీ 
స్త్రీకి సముచిత స్థాయి ఉంటుందనీ 
తెలియియజేసిన ఒక దయార్ద్ర మనస్వీ 
పడతి పురోభివృద్ధి తపస్వీ 
కఠినాత్ముడు కాదు కరుణాత్ముడు 
వంచకుడు  కాదు విశ్వనాయకుడు 

ఆయన రాక కొరకు వేచే 
వసంత ఋతు పవనం 
ఆయన ఆగమనానికై  నిరీక్షించే 
సుభగ్తాగ్రేసరుల గణం 
తెలుసు ఋషిశ్రేష్ఠ దళానికి 
తెలుసు భవిష్య పురాణ 
ఇతిహాసానికి ఆ మహితాత్ముడు 
తెలుసు ప్రపంచ పండిత శ్రేయానికి 
తెలుసు తౌరాత్, జబూర్, ఇంజీల్లకి 
ఆ మహిమాన్విత మనీషి మహత్తు 

చిట్ట చివరి ప్రవక్తగా దైవ 
దౌత్య పరంపర పరిసమాప్తిగా 
తెలుసు ఆయన వస్తారని భువన 
గగనాలకి, ఆయన సందేశం 
నిఖిల జగత్తుకి నిర్మల నీతి 
మార్గాన నడిపిస్తుందని 



ఎంత పవిత్రతా ఘన 
తలు మక్కా పురానికి 
ఏమి విశిష్టా ఔన్న 
త్యాలు మదీనా నగరానికి 
ఎన్నెన్ని హంగులు పొంగులు 
వరాల వసంతం రమజానుకి 
ఇంకెన్నెన్ని వింతలూ విశేషాలు 
ఘనమైన ఆ రాత్రికి 

ఎప్పుడు తిష్ట వేసిందో క్రౌర్యం 
ఎటు నుంచి వచ్చి వాలిందో మౌడ్యం 
ఎలా వచ్చి దూరిందో అంధత్వం 
ఎవరు నూరి పోశారో మిథ్యాతత్త్వం 
శాఖోపశాఖలుగా పెరిగిన అచైతన్యం 
పుట్టగొడుగుల్లా పేరుకుపోయిన అసౌజన్యం 

చంద్రుడేమిటి 
సూర్యుడేమిటి 
నక్షత్రాలేమిటి 
చెట్టేమిటి 
పుట్టేమిటి 
మ్రానేమిటి 
మట్టేమిటి 
మనిషేమిటి 
ముడుపేమిటి 
మోక్షమేమిటి 
అన్నీ షిర్క్ 
సంబంధిత శాఖలే 
అర్థం లేని ఆచారాలే 

షడ్రుతుల రుచుల సమ్మేళనం 
సత్యప్రవక్త సత్ప్రవర్తనం 
లోకం ఆ వచన మహిమకి 
దాసోహం నిరంతరం 
ఉషస్సు ప్రకాశించినప్పుడు 
తమస్సు వెన్ను చూపెను 
వెలుగు నిండుగా నవ్వినప్పుడు 
విశ్వ శాంతి  విరబూసెను 

ఏదోక వెర్రి పోకడ వేయి 
తాళ్లు వేసినప్పుడు విశ్వం మొత్తం వైరసాయే 
ఏదోక పాశవికం, పైశాచికం విజృం 
భించినప్పుడు దైవవాని అవతరించే 

సత్యాన్ని సంపూర్ణం 
గావించిన ఘనత 
ధర్మ శాస్త్రాన్ని విపులీకరిం 
చిన మహా గొప్ప విశిష్టత 
ఒక మహాప్రవక్త వారినే వరించింది
ఆయనే ప్రళయం వరకూ వచ్చే 
ప్రజలందరికి పరమ  ఆదర్శమూర్తి 

Wednesday, January 18, 2023

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

శుభోదయం గౌరవనీయులైన ముఖ్య అతిథి, గౌరవనీయులైన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు,

ఈ రోజు మనమందరం భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడకు చేరుకున్నాము.



భారతదేశం 26 జనవరి 1950 నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ తెలుసు, ఎందుకంటే ఈ రోజున భారతదేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడింది మరియు సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాటం తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
1947లో బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారతదేశానికి స్వంత రాజ్యాంగం లేదు, కాబట్టి ఆగస్టు 28, 1947న భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు, భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.

ఆ తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
రిపబ్లిక్ అంటే దేశంలో నివసించే ప్రజల అత్యున్నత శక్తి మరియు దేశాన్ని సరైన దిశలో నడిపించడానికి తమ ప్రతినిధులను రాజకీయ నాయకుడిగా ఎన్నుకునే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది.

భారతదేశానికి గణతంత్ర దినోత్సవం ఒక వేడుక మాత్రమే కాదు, భారతదేశం అంతటా రాజ్యాంగం అమల్లోకి వచ్చినందున మరియు భారతీయ పౌరులు వారి ప్రాథమిక హక్కులను పొందడం వల్ల గర్వం మరియు గౌరవం కూడా ఉంది.

ఈ రోజు మనం సమాజంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నాము, ఈ  ఘనత భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర సైనికులు, అమరవీరులు మరియు స్వాతంత్ర్య సమరయోధులకే చెందుతుంది. 


అన్ని మతాలు మరియు కులాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాతంత్ర్య పోరాటంలో నిస్సందేహంగా పాల్గొన్నారు. ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ ఒకసారి ఇలా వ్రాశాడు: "భారత స్వాతంత్ర్యం ముస్లిం రక్తంతో వ్రాయబడింది, ఎందుకంటే వారి జనాభా తక్కువ శాతంలో  ఉన్నా వారు  స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది  చాలా ఎక్కువ."

కాబట్టి మనం వారి త్యాగాలను మరచిపోకూడదు, మనం భారతదేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలి మరియు దేశ అభివృద్ధికి మరియు పురోగతికి అన్ని చర్యలు తీసుకోవాలి. రండి, మన దేశాన్ని ఉగ్రవాదం, అవినీతి, అసమానతలు, పేదరికం మొదలైన సమస్యల నుండి విముక్తి చేయడానికి సాధ్యమైనదంతా చేస్తామని ఈరోజు మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం.

కులం, మతం, మతం, రాష్ట్రం, భాష మరియు రంగులకు అతీతంగా ఆలోచించమని మనల్ని బలవంతం చేసే రోజు ఇది మరియు మన ప్రియమైన దేశం పట్ల మనందరికీ ఒకే భావన మరియు భావోద్వేగం ఉంది.

ప్రసంగాన్ని ముగించే ముందు, గణతంత్ర దినోత్సవం గురించి నా భావాలను వ్యక్తీకరించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నేను భారతీయుడిగా గర్వపడుతున్నాను.
జై హింద్ 





భలే మంచి రోజు


గౌరవనీయులైన ప్రిన్సిపాల్ సర్ మరియు నా సహచరులు. నా ప్రియమైన విద్యార్థులకు -  శుభోదయం.



నేడు, 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను.
ఈరోజు మన దేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

1950 నుంచి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యం మరియు గణతంత్ర విలువలను జరుపుకునే రోజు.
నేటి రోజు. 

భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను మనం స్మరించుకోవాలి.

గౌరవనీయులైన ముఖ్య అతిథి, గౌరవనీయులైన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన విద్యార్థులు

భారతదేశ స్వాతంత్ర్య కథ మరియు చరిత్ర ముస్లింల రక్తంతో వ్రాయబడింది. చారిత్రక సూచనల ప్రకారం, భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిలబడి, పోరాడిన మరియు త్యాగం చేసిన వారిలో 65% మంది ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు. 

వారు   చాలా త్యాగాలు చేశారు  కాబట్టి మేము ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాము  ఈ రోజును మనం సంబరాలు జరుపుకుంటున్నాము. నేను నా తోటి  విద్యార్థులందరికీ సలహా ఇవ్వాలనుకుంటున్నాను,


సైన్స్ మరియు ఇతర సబ్జెక్టులను అధ్యయనం చేసేవారు. రాజ్యాంగ ప్రవేశికను చదవండి మరియు రాజ్యాంగ సారాంశాన్ని చదవండి. ఆ రాజ్యాంగంలో మన కలలు, మన ప్రణాళిక ఉన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి రాజ్యాంగ సారాంశాన్ని చదవాలి.
రాబోయే తరాలు మీరే. మనమందరం మన దేశ సాధికారత కోసం కృషి చేద్దాం. మీ అందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

జై హింద్

Tuesday, January 17, 2023

ప్రవక్త (స) ప్రవచనం

రచన: శాంతి ప్రియ



ప్రభువు  వచనాలు 
ప్రవక్త  ప్రవచనాలు 
ప్రభువు శక్తి సామర్త్యాలు
ప్రవక్త స్తుతిస్తోత్రాలు 
ప్రభువు ఆదేశాలు 
ప్రవక్త ఆదర్శాలు 

'వ మా యన్తికు  అనిల్ హవా' వలె 
'ఇన్ హువ ఇల్లా వహ్యున్ యోహా' వలె 
మానవాళి పాలిట నిత్య వరాలు 
మార్గ నిర్దేశానికి ప్రతక్ష్య సూత్రాలు 
ప్రభవు ఇష్టాలు ప్రగతికి ప్రతిరూపాలు 
సుందర వనాలు స్వర్గధామ పవనాలు 
మంగళ గీతాలు దైవ దర్శనాలు 
నిత్య  సుఖాలు శాశ్వత స్వర్గాలు 


గెలుపు నిజం

రచన: శాంతి ప్రియ



తరం మారిందిఎం స్వరం మారింది
ప్రియ మిత్రుడా మత్తు నిద్రను వీడి 
సత్యప్రియులతో జత కూడి 
పాతరా సత్య కేతనం 
పర్వత శిఖరాలపై 
హిమ నగాల పై 
పాడరా శాంతి గేయం 
చాటరా మానవత్వం 

సత్య ఉక్తికి గల శక్తి మహత్తరం 
జిత్నా హీ దబావోగే ఉత్నా హీ ఉబ్రేగా 

తెల్ల నల్ల తేడాలే కాదు 
వర్గ వర్ణ విభేదాలే కాదు 
జాతి ప్రాంత విభజనలే కాదు 
అగ్ర, అధమ వివక్షలే కాదు 
ధనిక పేద తారతమ్యాలే లేవు 

మనుషులం  ప్రియ బంధువులం 
సుగుణ సింధు జల బిందువులం
దైవభీతియే అన్నింటికీ గీటురాయి 
సర్వ మానవ సౌభ్రాతృత్వం చాటవోయి 

మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీపురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే దేవుని దృష్టిలో ఎక్కువ గౌరవ నీయుడు. దేవుడు సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (దివ్య ఖురాన్: హుజురాత్ - 13)

భారత భాగ్య పౌరుల్లారా! రేపటి ఆశా దీపాల్లారా!

రచన: శాంతి ప్రియ



భారత భాగ్య  పౌరుల్లారా! 
ఈ అవని మీ జనని 
ఈ దేశం మీ ధరణి 
ఈ భువనం ఆ గగనం 
ఈ సముద్రం ఆ పర్వతం 
ఈ పుష్పం ఆ ఫలం 
అంతా మీ సొంతం 
చెయ్యరా దైవ దాస్యం! 


రేపటి ఆశా దీపాల్లారా! 
ఆ సి=చిత్రం మీ స్వప్నం 
ఆ శిల్పం మీ నైపుణ్యం 
ఆ కావ్యం ఈ కథనం 
ఆ గేయం ఈ రాగం 
ఆ గ్రంథం ఈ వచనం 
అంతా దైవానుగ్రహం 
నమ్మరా ఈ నిజం! 

భారత భాగ్య  పౌరుల్లారా! 
ఈ భవనం ఆ వరణం 
ఈ కోట ఆ పేట 
ఆ ధాన్యం ఈ మూల్యం 
అంతా క్షణభంగురం 
ఎరుగరా ఈ జీవిత సత్యాన్ని! 


రేపటి ఆశా దీపాల్లారా! 
మీ లక్ష్యం దైవ దర్శనం 
మీ గమ్యం స్వర్గధామం 
మీ ధ్యేయం సామాజిక న్యాయం 
మీ కర్తవ్యమ్ ధర్మపోరాటం 
మీ స్వప్నం సత్సమాజ స్థాపనం 
సాకారం చేసుకొండి మీ కలల్ని 
ఫలిస్తాయి తప్పక  మీ కష్టాలన్నీ.... 




నీటి బుడగ ... నీ సిద్ధాంతం...!

రచన: శాంతి ప్రియ



ఇహమే శాశ్వతమ్మని మురిసిపోతావెందుకో 
పరమే అసలు లేదని మిడిసిపడతావెందుకో 
నిఖిల జగత్తుకి  నిజ ప్రభువునే  ధిక్కరిస్తావెందుకో 
ఆగర్భ శత్రువైన షైతాన్నే అనుసరిస్తావెందుకో 

కన్నవారిని కాలదన్ని కన్నెర్రజేస్తావెందుకో 
కలల రాణివనుకున్న కాంత మీద  కరిగిపోతావెందుకో 
జన్మనిచ్చిన జననీజనకులనే విస్మరిస్తావెందుకో 
నీవు భ్రమసి కన్నె కోరితే ప్రాణమిస్తావెందుకో 

విద్య నేర్పి ఇంత  చేసిన ఉస్తాదుతోనా  నీ పరిహాసం 
నైతికతకు నీరు పోసిన నాయకునితోనా నీ పోరాటం  
నివురు గప్పిన నిధినిక్షేపాల కోసమా నీ ఆరాటం 
మట్టితో పుట్టి మట్టిలోనే కలిసిపోయే నీకా ఈ ఆర్భాటం 


ఓ కవి చెప్పినట్టు .... ఎరుగరా నిజాన్ని 
సత్యం ఇది గ్రహించి మార్చుకో నీ గమ్యాన్ని 

దానధర్మము దైవ ప్రియమ్మని మనసులో గుర్తుంచుకో 
సత్యమే నిత్యం  జయమ్మని ధరణిలో పాటించుకో 
బొందిలోన ప్రాణముండగా భూమి మీదే ఆడుతావ్ 
ప్రాణమేమో ఎగిరిపోగా భూమిలోనే దాగుతావ్!  


సత్యం వద...ధర్మం చర...!




పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు 
ప్రవరుఁడైనా ప్రవక్తయినా 
చూసొచ్చా నేను తిరిగిచ్చ నేను 
పుష్పం, ఫలం, తోరణం, జీవితం కాదేదీ శాశ్వతం  

చీకటి తప్పులు చేసి సరదాలు తీర్చుకునే దొరబాబులు 
దాని ప్రతిఫలంగా ఆ తప్పుల్లోంచి జన్మించి 
తుప్పల పాలయ్యే చిన్నారి చిట్టి మొగ్గలు. 

పలకలేని పువ్వు పరిమళాన్నిస్తుంది 
చెప్పలేని చెరువు జలమిస్తుంది 
ఉక్తి  లేని వృక్షం ఫలమిస్తుంది 
విషం సయితం  ఔషధం అవుతుంది 
మనిషి చిమ్మే విషమే ప్రమాదం 

ఒకడిని ఒకడు  చేస్తాడు మోసము  
ఒకని మీద ఒకడు వేస్తాడు నెపము 
గరీబీ నహీ గరీబోన్కో హఠావో 
అంటాడు సత్యాన్ని ఓ బూటకము 
సత్యమే పత్యమైపోయే 
అసత్యమే నిత్యమైపోయే 

అయితే ఉంది ఓ ఉపాయము 
స్వర్గానికి గొనిపోయే మార్గము 

అందరూ  దైవ దాసులమని గ్రహించి 
జరిగిన తప్పులను క్షమించమని దైవాన్ని ప్రార్థించి 
మై తేరా భాయి తూ మేరా భాయి అని నినదించి 
చేయి చేయి కలిపి చాటుదాం మానవత్వాన్ని 
సత్యం వద సత్యమే పలుకుతూ 
ధర్మం చర ధర్మ మార్గాన్నే నడుద్దాం!