Thursday, November 14, 2013

సంయమనంతో ప్రవర్తించాలి


పిల్లలను తీర్చిదిద్దే విషయంలో పెద్దలు బాధ్యతగా ప్రవర్తించాలి. వారి వ్యక్తిత్వాన్ని సరైన విధంగా రూపొందేలా శిక్షణ నిస్తూ, మంచి బుద్దులు నేర్పించాలి. పిల్లలతో పెద్దలు విధంగా ప్రవర్తించా లో, ఏవిధంగా ప్రవర్తించకూడదో తెలుసు కోవాలి. అప్పుడే తల్లిదండ్రులు పిల్లల పట్ల తాము ఏర్పరచుకున్న ఆశలను, కలలను నిజం చేయగలుగు తారు.
1.పిల్లలను మందలించేటప్పుడు దుర్భాష లాడకుండా, సంయమనంతో ప్రవర్తిం చాలి. మందూపు కటువుగా కాకుండా, మృదువుగా ఉండాలి.
2. పిల్లల ఎదుట వారి టీచర్లను గురించి తేలికగా మాట్లాడకూడదు.
3. పిల్లల పొరపాట్లను సరిదిద్దాలి. అయితే వారిపొరపాటును వారు అర్థం చేసుకునేలా, మరోసారి పొరపాటు జరుగకుండాఉండేలా మాట్లాడాలి. పెద్దలు.
4. పిల్లలకు ఏదైనా వాగ్దానం చేసినప్పుడు, మాటను నిలబెట్టుకుని పిల్లలను సంతోషపరచాలి.
5.పిల్లలకు ఏదైనా విషయాన్ని చెప్తున్న పుడు, వారు శ్రద్ధగా వినేలాగా, విషయాన్ని వారు చక్కగా అర్థం చేసుకునే లాగా, వారు ఆసక్తిని పెంపొందించు కునేలా చెప్పాలి.
6.పిల్లల తప్పును తప్పనిసరిగా ఖండిం చాలి. తాము తప్పుచేస్తే పెద్దలు సహించ రన్న విషయం తెలుసుకోవాలి. పెద్దలపట్ల చనువుతో పాటు, భయమూ ఉండాలి.
7.పిల్లలకు శిక్షణను ఇచ్చే విధం ఒకరకం గానూ, తమ ప్రవర్తన మరోరకంగానూ ఉండకూడదు.
8.తల్లిదండ్రులు పొరపాటు చేసినప్పుడు, దాన్ని కప్పిపుచ్చుకునే మాటలు చెప్ప కూడదు. తమ పొరపాటును నిజాయితీగా అంగీకరించాలి.
9.పిల్లలముందు అబద్ధాలు చెప్ప కూడదు.
10.బాల్యంనుంచే పిల్లలకు వారి వయస్సు కు తగినట్లుగా తమ పనులను తాము చేసుకోవడం నేర్పించాలి. పనులు చేయడంలో ఆనందాన్ని పొందుతారు.
11. కేవలం చదువుకే ప్రాథాన్యత నివ్వ కుండా, ఎప్పుడూ చదువు చదువుకుంటూ వారిని సతాయించకుండా, ప్రతి రోజు కొంత సమయం వారి ఆటలకు హాబీలకు కేటాయించాలి.
12.పిల్లల ఎదురుగా తలిదండ్రులు కానీ, ఇతర కుటుంబసభ్యులతో కానీ జగడ మాడుతూ తీవ్రపదజాలంతో, మాటలు విసరకూడదు, పిల్లలకు అశాంతి, మనో వ్యధ, అభద్రతా భావం ఏర్పడుతాయి అని తెలుసుకోవాలి.
13. తోటి పిల్లలతో కానీ, తోబుట్టువులతో కానీ పిల్లలను విషయంలోనూపొలుస్తూ కించపరచకూడదు. అల్లాచేస్తే పిల్లలలో ఆత్మన్యూనతా భావం ఏర్పడవచ్చు. లేదా ఎదుటి పిల్లల పట్ల ద్వేషభావం కలుగ వచ్చు. అటువంటి మాటలు పిల్లల వ్యక్తిత్వా నికీ, అభిమానికి సవాలుగా నిలిచి వారి మనస్సు బాగా గాయపడుతుంది.
14.పిల్లలు మంచిపనులు చేసినపుడు, విజయాన్ని పొందినప్పుడు, చదువులో రాణిస్తున్నా వారిని అభినందిస్తూ, వారిని మరింతగా ప్రోత్సహించాలి.
15.పిల్లలకు మనస్సుంటుందని, మనస్సులో ఆలోచనలు, భావాలుఉంటా యనీ అర్థం చేసుకుని, పిల్లల మాటలను చక్కగానూ ఓర్పుతోనూ వినాలి. వారి అభిప్రాయాలు బాగునపుడు,వారి మాటల తో తామూ ఏకీభవిస్తున్నామని చెప్పి వారిని ఆనందపరచాలి. అప్పుడే వారిలో ఆలోచనాశక్తి పెరుగుతుంది.
16.అప్పుడప్పుడు పిల్లలతో కలిసి షికార్లకు, పిక్నిక్లకు,దర్శనీయస్థలాలకూ వెళ్తూండాలి.
17. తల్లిదండ్రులు ఉద్యోగస్థులయినప్పటికీ, ప్రతిరోజూ కొంత సమయం పిల్లలతో గడపడం పిల్లలమనస్సును, ఆలోచనలను తెలుసుకోగలుగుతారు. పెద్దలకూ, పిల్ల లకూ మధ్యసాన్నిహిత్యం పెరుగుతుంది.
18. పిల్లల ఎదుట, ఇతరుల గురించి అవహేళనగా వారితోబాటుగా మాట్లా డటం, తోటి వారిని కామెంట్చేయడం, వారికి నిక్నేమ్స్పెట్టడం లాంటివి చేయ కూడదు.
19.తీసిన వస్తువు తిరిగి యథాస్థానంలో పెట్టే అలవాటు పిల్లలకు నేర్పించాలి. పెద్దలు అదేవిధంగా ప్రవర్తించాలి.
20. పిల్లలకు కొంత స్వేచ్ఛనివ్వాలి. తాము చెప్పినట్టే వినాలని, ఆంక్షలు పెట్టకూడదు. అయితే, ఆస్వేచ్ఛ నివ్వాలి. తాము చెప్పినట్లే వినాలని ఆంక్షలు పెట్టకూడదు. అయితే, ఆస్వేచ్ఛను పిల్లలు దుర్వినియోగపరచకుండా, సక్రమంగా ప్రవర్తించేలా వారికి శిక్షణ నివ్వాలి.
21.అందవిహీనలను, అంగవైకల్యంకల వారినీ చీదరించుకోకూడదనీ, అవహేళన చేయకూడదనీ, వారితో ప్రేమగా స్నేహం గా ఉండాలనీ, మన ప్రవర్తన వారిని మానసికంగా గాయపరచకూడదనీ పిల్లలకు అవతల వారిపట్ల సద్భావం, సానుభూతి, మైత్రీభావం, ఆదరణ ఏర్పడేలాగా పిల్లలకు మృదువుగా బోధించాలి.
22. ధనిక, పేద భావాలు, కులాలు తార తమ్యాలు పిల్లల మనస్సులో ఏర్పడనివ్వ కుండా తల్లిదండ్రులే పిల్లలకు మార్గ దర్శకులు కావాలి.
23.పిల్లలు తోటి పిల్లలతో జగడమాడు తున్నప్పుడూ పెద్దలు జోక్యం చేసుకో కూడదు. తాము పట్టించుకోకుండా వదిలేస్తే ,వారి మరో క్షణంలోనే తమ కలహాన్ని మరచి, చక్కగా కలిసిపోతారు.
24.నోరులేని మూగజంతువులను హింసించకూడదని చెప్పాలి. కుక్క లేదా పిల్లి,మేక లాంటివాటితో తోకపట్టుకు లాగినా, వాటిమీద రాళ్ళు విసిరినా చాలా బాధకలుగుతుందని అల్లా వాటిని బాధించ కుండా అన్యాయమని తప్పని చెప్పాలి.
25.ఎదిగిన పిల్లలను మిత్రులుగా ట్రీట్చేస్తూంటే, వారితో కుటుంబ విషయాలను, మంచి చెడు ముచ్చటిస్తుంటే, పిల్లలు కూడా కష్టసుఖాలను తెలుసుకోగలుగారు.

26. పిల్లలకుఅభిరుచి, ఆసక్తి ఉన్న రంగం లో వారిని ప్రవేవపెడితే , ఆరంగంలో, విద్యలో వారు రాణించగలుగుతారు.