Wednesday, March 13, 2024

Tuesday, March 12, 2024

దైవగ్రంథం ఖుర్ఆన్ దివ్య మాసం రమజాన్ / Holy book is Quran The divine month of Ramadan

పాఠం 3

దైవగ్రంథం ఖుర్ఆన్ దివ్య మాసం రమజాన్

దివ్యఖుర్ఆన్ రమజాన్ మాసాన్ని ప్రేమిస్తుంది. రమజాన్ మాసం దివ్య ఖుర్ఆన్ను అభిమానిస్తుంది. ఈ రెండిటిడీ ఆత్మీయబంధం, అల్లాహ్ ఇలా

ప్రబోధించాడు:

రమజాను నెల -ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. (55 2: 185)



"లౌహె మహే పూజ్" అనబడే సురక్షిత ఫలకంలో నుండి దివ్యఖుర్ఆన్ మొత్తం భూమిపై గల మొదటి ఆకాశంపైకి ఈ నెలలోనే అవతరింపజేయబడింది. దివ్య ఖుర్ఆన్ అవతరించటం ఈ నెలకు దైవికంగా ప్రాప్తించిన ఒక మహా గౌరవం. అందుకే దైవప్రవక్త (స) ప్రత్యేకించి రమజాన్ నెలలో జిబ్రయీల్ దూతతో కలిసి ఖుర్ఆన్ అధ్యయనం చేసేవారు. ఆయన ఖుర్ఆన్ శ్రద్ధగా ఆలకించేవారు. దాని భావం గురించి యోచించేవారు. పారాయణం చేసేవారు. దాని పిలుపులకు స్పందించే వారు.

రమజాన్ నెలలో ఉపవాసం పాటిస్తూ ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తి ఆ నెల సొంతం మహోన్నతమైన గ్రంథంతోపాటు జీవిస్తాడు. ఆ గ్రంథ ఔన్నత్యం గురించి అల్లాహ్ ఇలా ప్రకటించాడు:

"ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటం దుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చు కునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము." (55 38:29)

"ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?" (5 47:24)

"ఏమిటీ, వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచిగాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుద్ధ్యం కనపడేది." (5 4: 82)

రమజాన్ నెలలో ఖుర్ఆన్ పారాయణానికి ఉండే ఆ రుచి, ఆ మాధుర్యమే వేరు! ఆ నెలలో ఖుర్ఆన్ పారాయణం మనిషిలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. మౌఢ్యం కాని విశ్వాసాన్ని అతనిలో జాగృతపరుస్తుంది. అంతేకాదు, పారాయణ కర్తకు వినూత్న శక్తిని ప్రసాదిస్తుంది. ఇస్లాం ప్రారంభంలో ఖుర్ఆన్ అవతరణకు సంబంధిం చిన సర్వ స్మృతులనూ అది జ్ఞాపకంలోకి తెస్తుంది. సామూహికంగా ఖుర్ఆన్ పారాయణం చేసిన సంఘటనలు, సదాచార సంపన్నులైన మన పూర్వీకులు ఖుర్ఆన్ పట్ల ఆకర్షితులై, దాని పారాయణం కోసం అత్యధిక సమయాన్ని వినియోగించటం మొదలగు తీపి జ్ఞాపకాలన్నీ కూడా మన మనోసీమలో మెదలుతాయి. దైవప్రవక్త (స) ఒకసారి తన సహచరులకు ఉపదేశిస్తూ, "ఖుర్ఆన్ పఠించండి, నిశ్చయంగా అది రేపు తీర్పు దినాన దైవసన్నిధిలో మీకోసం సిఫారసు చేస్తుంది" అన్నారు. "ఖుర్ఆన్ నేర్చుకొని ఇతరులకు నేర్పించేవారు మీలో అందరికంటే ఉత్తములు" అని కూడా ప్రవక్త (స) ప్రబోధించి ఉన్నారు. "అల్ బఖర మరియు అలి ఇమ్రాన్ అనే పుష్పద్వయాన్ని పారాయణం చేస్తూ ఉండండి. తీర్పు దినాన అవి రెండు మేఘాల రూపంలోనో లేక పక్షుల గుంపు రూపంలోనో వచ్చి తమ చదువరులకు నీడను కల్పిస్తాయి" అన్న మాట కూడా దైవప్రవక్త (స) ప్రబోధించినదే.

ఆయన ఇంకా ఇలా ప్రబోధించారు: "ఖుర్ఆన్ పండితుడై ఉండి దాన్ని పఠించే వ్యక్తి (తీర్పుదినాన) గౌరవనీయులు, పుణ్యాత్ములైన దైవదూతల వెంట ఉంటాడు. ఖుర్ఆన్ను పఠించటంలో తడబడుతూ, శ్రమకోర్చి పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు."

రమజాన్ నెల రాగానే మన పూర్వీకులు ప్రాపంచిక వ్యవహారాలన్నిటిని ప్రక్కకు నెట్టి ఖుర్ఆన్ పారాయణంతోపాటు ఆధ్యాత్మిక ప్రయాణానికి సంసిద్ధులయ్యే వారు. రమజాన్ రాకతో ఇమామ్ మాలిక్ ఒక్క ఖుర్ఆన్ పారాయణం తప్ప ఇతర ఏ విషయానికీ ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదని చారిత్రక ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. విద్యార్ధులకు ఖుర్ఆన్ హదీసులు బోధించటం, ఇస్లామీయ చట్టపరమైన విషయాల్లో

ప్రజలకు సలహసహకారాలు అందించటం సాధారణ రోజుల్లో ఆయన నిత్యకృత్యాలు అయితే రమజాన్ నెల వస్తే చాలు ఆయన ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నులయి ఉండేవారు. రమజాన్ అంటే ఖుర్ఆన్ మాసమని చెబుతుండేవారు. ఒక్క ఇమామ్ మాలిక్ అనే కాదు, రమజాన్ నెలలో మన పూర్వీకులందరి ఇండ్ల నుంచీ తేనెటీగలు పాడుతున్నట్టు కమ్మని ఖుర్ఆన్ పారాయణం. వినిపిస్తూ ఉండేది. ఉపవాసపు నెలసాంతం వారి ఇండ్లు ఖుర్ఆన్ పారాయణపు నవకాంతుల్ని వెదజల్లుతూ ప్రజల గుండెల్లో నూతన ఆనందాల్ని నింపుతూ ఉండేవి. కమ్మటి స్వరాలతో వారు ఖుర్ఆన్ను మధురాతి మధురంగా పారాయణం చేసేవారు. అందులోని వింత విషయాల వద్ద ఆగి విస్మయం వెలిబుచ్చేవారు. శిక్షకు సంబంధిం చిన హెచ్చరికలు వినగానే వణకిపోయేవారు. నరకం గురించి తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించేవారు. స్వర్గ ప్రస్తావనలు వస్తే అమితానందాన్ని వ్యక్తపరిచేవారు. ఆదేశాత్మక వాక్యాలు పఠించినప్పుడు వాటిని పాటించాలని మనసులో గట్టిగా నిశ్చయించుకునేవారు. వారింపు విషయాలకు దూరంగా ఉంటామని ప్రతినబూనేవారు.

ఇది సత్యమని ధృవీకరించబడిన విషయం. ఒకసారి ఇబ్నె మన్వూద్ (రజి) దైవప్రవక్త (స) ముందు నిసా అధ్యాయంలోని మొదటి భాగం పారాయణం చేస్తున్నారు. అలా పఠిస్తూ పఠిస్తూ ఆయన, "ఓ ముహమ్మద్ (స)! మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?" అనే వాక్యం దగ్గరికి వచ్చేసరికి దైవప్రవక్త (స), "ఇక చాలు, ఆపండి" అన్నారు. ఇబ్నె మసూద్ (రజి) తలపైకెత్తి చూస్తే, దైవప్రవక్త (స) కన్నీళ్ల పర్యంతమై ఉన్నారు. ఆయన కండ్ల వెంబడి అశ్రుధారలు ప్రవహిస్తూ కనిపించాయి.

మరో ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి అబూమూసా (రజి) దివ్య ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. అయితే తన పారాయణం దైవప్రవక్త (స) ఆలకిస్తున్న సంగతి ఆయన గమనించలేదు. కాసేపటి తర్వాత దైవప్రవక్త (స) ఆయనతో, "నేను నైపుణ్యభరితమైన నీ పారాయణం ఆలకించాను. బహుశా నువ్వు గమనించలేదేమో!

ఏమైనా దావూద్ ప్రవక్తకు ప్రసాదించబడిన స్వరమాధుర్యంలోని ఒకింత నీకు కూడా

లభించినట్లుంది" అన్నారు. అబూ మూసా దైవప్రవక్త (స) కు బదులిస్తూ, “దైవప్రవక్తా!

మీరు నా పారాయణం ఆలకిస్తున్న సంగతి నేను గమనించి ఉన్నట్లయితే మరింత

మనోహరంగా, శ్రావ్యంగా పారాయణం చేసి ఉండేవాడిని కదా!" అన్నారు.

ఈ సందర్భంగా మరో సంఘటన కూడా గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది.

"అబూ మూసా! మాకు మా ప్రభువును గుర్తు చేయవూ?" అని వేడుకునేవారు. అంతే, అబూమూసా ముందుకు వచ్చి మధురమైన తన కంఠంతో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఆయన పారాయణం విన్నవారందరూ కన్నీరుమున్నీరుగా విలపించేవారు.

ఆ తర్వాతి తరాల ప్రజల్లో పురుడు పోసుకున్న అనుచిత కోరికలు వారిని అల్లాహ్ గ్రంథాన్ని వినకుండా చేశాయి. మనుషుల అభిరుచులు మారిపోయాయి. విద్యా సంగ్రహణానికి గ్రహణం పట్టింది. ప్రజల అవగాహనా శక్తికి సుస్తీ చేసింది.

దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని వదలిపెట్టి మత గురువులు పుస్తకాలకు పెద్దపీట వేసిన రోజు నుంచే ముస్లిం సమాజంలో పతనం మొదలయింది. శుద్ధ సమాజం లోనూ ప్రతి చోటా చాపక్రింద నీరులా కల్తీ వ్యాపించింది. ఫలితంగా ముస్లిం సమాజంపై ఘోరమైన విపత్తులూ విరుచుకుపడ్డాయి. ఖుర్ఆన్ పదాలకు చెప్పబడిన అనుచిత తాత్పర్యాలు, వెలికి తీయబడిన విపరీతార్దాలు ముస్లిం సమాజాన్ని ముక్క చెక్కలు చేసి పడేశాయి. ప్రజల్లో ధైర్య సాహసాలు క్షీణించాయి. సమాజాన్ని సన్మార్గంలో నడిపింపజేయటం ఖుర్ఆన్ ఉద్దేశం. హృదయ రోగాలకు స్వస్థతను చేకూర్చే సంజీవని ఖుర్ఆన్. ఆసాంతం అది ఒక జ్ఞానం, ఒక సంస్కృతి. మనిషి జీవితానికి, ప్రాణానికి, మోక్షానికి తిరుగులేని ఆధారం. సంతోషమైనా, ఆనందమైనా ఖుర్ఆన్ ద్వారానే ప్రాప్తిస్తుంది. ఇహలోక బహుమానమైనా, పరలోక పారితోషికమైనా ఖుర్ఆన్ చలువే. అది విశ్వప్రభువు ప్రబోధనం. మానవ జీవన సంవిధానం. సమసిపోని విజ్ఞానం.

అలాంటప్పుడు రమజాన్ నెలలో ఒక్క రమజాన్ నెలలోనే ఏమిటి, మిగతా నెలల్లోనూ మనం ఖుర్ఆన్తో పాటు జీవించకపోవటం ధర్మమేనా? ఖుర్ఆన్ మహత్యాన్ని గుర్తెరిగి దాని వెలుగుజిలుగులతో, దాని పారాయణం వల్ల సంప్రాప్త మయ్యే సుఖసంతోషాలతో మన హృదయాలను నింపుకోకపోవటం న్యాయమా? మనలో మార్పు అనేది రాదా?

రమజాన్ ఉపవాసాల్లోని మర్మం / The secret of Ramadan fasts

పాఠం 2

రమజాన్ ఉపవాసాల్లోని మర్మం

అల్లాహ్ తన దాసుల కోసం విధించే చట్టాలలో ఎన్నో మర్మాలుంటాయి. ఆయన చేసే నిర్ణయాల్లో ఎన్నో రహస్యాలు నర్మగర్భితంగా నెలకొని ఉంటాయి. ఆయన సృష్టిలో లెక్కలేనన్ని లక్ష్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ మర్మాలు, రహస్యాలు, లక్ష్యాలలో కొన్నిటిని మానవ మెదడు అర్ధం చేసుకోవచ్చు, మరికొన్నిటిని అర్ధం చేసుకోలేక పోవచ్చు. ఉపవాసం విషయానికి వస్తే దాని గురించి అల్లాహ్ నిర్ణయం ఇలా ఉంది:

"ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీ పై విధిగా నిర్ణయించ బడింది-మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. ! దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది." (55 2 : 183)



దీని ప్రకారం ఉపవాసం అనేది దైవభీతికి, ధర్మపరాయణతకు దారితీస్తుందని తెలుస్తోంది. ఉపవాసం పాటించే వ్యక్తి అల్లాహ్కు అత్యంత సన్నిహితుడౌతాడని కూడా చెప్పవచ్చు. ఉపవాస స్థితిలో మనిషి కడుపు ఆకలితో నకనకలాడిపోవచ్చు. అయితే దాంతోపాటు అతని హృదయమూ పరిశుద్ధమవుతుంది. సాయంత్రం పూట దాహం తీర్చుకొని ఉపవాసం విరమించినప్పుడు అతని కండ్లు చెమ్మగిల్లుతాయి. ప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: “ఓ యువకుల్లారా! మీలో మహర్ సొమ్ము చెల్లించగల స్తోమత వున్నవారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే, చూపులనూ, మర్మావయవాలను కాపాడుకోవటానికి అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అదే. అలా చేసే స్తోమత లేనివారు ఉపవాసం పాటించాలి. అది అతని కొరకు డాలు లాగా పనిచేస్తుంది."

ఉపవాసం శరీరంలోని అన్నవాహికను, ధమనులను సంకోచింపజేస్తుంది. ఇవి షైతాన్ ప్రసార మార్గాలుగా ప్రసిద్ధం. ఏమైనప్పటికీ ఉపవాసం ఈ మార్గాల్లో షైతాన్ దౌష్ట్యాలను అరికడుతుంది. అలాగే ఉపవాసం లైంగిక కోరికలను,

ఆలోచనలనూ, అవిధేయతా ప్రోత్సాహకాలను బలహీనపరుస్తుంది. 'ఆత్మ' భారాన్ని తగ్గించి అందులో చురుకుదనం తీసుకువస్తుంది. ఒక ఉపవాసి తన లాగే ఉపవాసం పాటించే తోటి సామాజిక సోదరుల గురించి ఆలోచిస్తాడు. తన చుట్టూ బ్రతికే నిరుపేదలనూ, అవసరాల్లో అలమటిస్తున్న వారిని గుర్తిస్తాడు. వారికి తన సాను భూతిని ప్రకటిస్తాడు. తనకు చేతనయినంత వరకు వారికి సాయం చేయటానికి ముందుకు వస్తాడు.

ఉపవాసాన్ని ఓ శిక్షణాకాలంగా కూడా భావించవచ్చు. ఈ కాలంలో ఆత్మకు బలమైన శిక్షణ లభిస్తుంది. హృదయం పరిశుద్ధమవుతుంది. చూపులకు బిడియం అలవడుతుంది. అవయవాలు సురక్షితమవుతాయి. ఉపవాసం అనేది దాసునికి అల్లాహు మధ్య సర్మగర్భంగా ఉండే ఒక రహస్యం. ధృవీకృత హదీసు ఒకటి ఈ విషయాన్ని దైవప్రవక్త మాటల్లో ఇలా ప్రస్ఫుటం చేసింది:

"అల్లాహ్ ప్రకటించాడు: మనిషి చేసే ప్రతి సత్కార్యం అతని సొంతానిదే, ఒక్క ఉపవాసం తప్ప. అది నాది. నేనే దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను." మనిషి ఉపవాసం పాటిస్తున్న సంగతిని ఒక్క అల్లాహ్ తప్ప మరెవరూ అర్ధం

చేసుకోలేరు. నమాజు, జకాతు, హజ్ లాంటి ఇతర ఆరాధనల కంటే ఇది పూర్తిగా విభిన్నం. వాటిని పాటిస్తున్నప్పుడు జనం చూసి వారిని ఆరాధనపరులుగా గుర్తించ గలరు. కాని ఉపవాసం పాటిస్తున్న వ్యక్తిని చూసి అతను ఉపవాసి అని తెలుసు కోవటం అసంభవం. అంతటి రహస్యమైన ఆరాధన అది. అందుకే అల్లాహూ అది ఎంతో ప్రీతికరం.

ఉపవాసం మనిషిని అల్లాహ్ సామీప్యానికి తీసుకువెళ్తుందని సదాచార సంపన్నులైన మన పూర్వీకులు వక్కాణించారు. పుణ్యకార్యాలు జుర్రుకునే పవిత్ర మాసంగా, సత్కార్యాల కోసం పరస్పరం పోటిపడే సువర్ణ సమయంగా ఈ నెలను భావిస్తారు చాలామంది. అందుకే రమజాన్ నెల వచ్చిందంటే చాలు వారు సంతో షంతో కేరింతలు కొడతారు. అది వెళ్ళిపోగానే దిగాలు చెందుతారు. మన పూర్వీకులు ఉపవాసపు పరమార్థాన్ని గ్రహించారు. అందుకనే రమజాన్ నెల అంటే వారికి అమితమైన ప్రేమ. రమజాన్లో వారు మునుపెన్నడూ లేని రీతిలో ఆరాధన చేసేవారు. నిరుపమాన త్యాగభావాన్ని కనబరిచేవారు. రాత్రిళ్లు ఎప్పుడూ నమాజులో నిలబడి ఉండేవారు. రుకూలో వంగి వుండేవారు. అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగ ప్రణామం (సజ్జా) చేస్తూ కనిపించేవారు. అల్లాహ్ జ్ఞాపకంలో కన్నీరు మున్నీరయ్యే వారు. అత్యంత అణకువతో అల్లాహ్ ను ప్రార్థించేవారు. అల్లాహ్ ధ్యానం, దైవగ్రంథ పారాయణం, ధర్మజ్ఞాన సముపార్జన, ధర్మబోధన, పరస్పర హితోపదేశం- శుభప్రద మైన రమజాన్ మాసంలో ఇవే వారి నిత్య కృత్యాలు,

ప్రారంభకాలంలోని ముస్లింలకు ఉపవాసం ఆనందాన్ని, ఆత్మశాంతిని సమకూర్చేది. ఉపవాసంతో వారి హృదయాలు మరింత విశాలమయ్యేవి. అందుకనే ఉపవాస లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ ఆత్మలకు శిక్షణనిచ్చుకునేవారు. ఉపవాసం ద్వారా పొందే జ్ఞానంతో తమ హృదయాలను పరిశుద్ధపరచుకునేవారు. తమ నోళ్ళనూ, కళ్ళనూ పాపకార్యాల నుంచి పరిరక్షించుకుంటూ ఉండేవారు. దైవగ్రంథ పారాయణం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపించేవారు. విశ్వసనీయమైన ఎన్నో ఆధారాల ద్వారా స్పష్టంగా ఈ విషయాలు తెలుస్తున్నాయి.

ఉపవాసం ముస్లింల ఐకమత్యానికి పట్టుగొమ్మలా పరిఢవిల్లుతుంది. ప్రపంచంలోని ముస్లింలంతా ఒకే సమయంలో ఉపవాసం ప్రారంభించి, తిరిగి ఒకే. సమయంలో ఉపవాసాన్ని విరమించటం అందుకు ఓ సజీవ సాక్ష్యం, ఉపవాస కాలంలో సామాన్యంగా అందరూ సోదరభావంతో కలసి భోజనం చేస్తారు. చెడు పోకడలనూ, దుష్కార్యాలను ఉపవాసం కడిగివేస్తుంది. దీని గురించే ప్రవక్త (సఅసం) అన్నారు: "ఒక శుక్రవారం (జుమా) నుంచి మరో శుక్రవారం. ఒక ఉమ్రా నుంచి మరో ఉమ్రా, ఒక రమజాన్ నుంచి మరో రమజాన్ వాటి మధ్య జరిగే పాపాలకు పరిహారం అవుతుంది. అయితే ఆ మధ్యకాలంలో పెద్దపాపాల (కబాయిర్)కు పాల్పడి ఉండకూడదు."

ఇక శారీరకంగా చూస్తే, ఉపవాసం దేహ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శరీరం నుంచి మలినాలను విసర్జింపజేస్తుంది. కడుపును సాంత్వన పరుస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. గుండెకు నెమ్మదినిస్తుంది. ఆత్మను ఉత్తేజపరుస్తుంది. నడవడికను క్రమబద్ధం చేస్తుంది. ఉపవాసం పాటించే వ్యక్తి ఆత్మ విసమ్రమవుతుంది. మనసు ప్రశాంతమవుతుంది. కోరికలకు కళ్ళెం పడుతుంది. అతని హృదయం అల్లాహ్ సామీప్యతను సంపాదిస్తుంది. ఫలితంగా అల్లాహ్ అతని ప్రార్ధనలను నెరవేరుస్తాడు.

ఉపవాసంలో మరో గొప్ప మర్మం దాగి ఉంది. అదేమంటే, దాసుడు అల్లాహ్ సంతోషం కోసం ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తాడు. అల్లాహ్ ప్రీతికోసం తన కోరికలను త్యజించుకుంటాడు. అన్నపానీయాలు మానేస్తాడు. ఉపవాసం మూలంగా ఒక ముస్లిం కోరికలను జయించగలుగుతాడు. మనసుపై అదుపు సాధిస్తాడు. అసలు సగం ఓపిక ఉపవాసమే. కనుక సరైన కారణం లేకుండా ఉపవాసం వదలిపెట్టే వ్యక్తికి తన మనసుపై అదుపు ఉండదు. అతను కోరికలను జయించలేడు.

మొత్తానికి జీవితంలో కష్టాలను భరించటానికి, జిహాద్, త్యాగం లాంటి కఠోర ధర్మ విధులను నిర్వర్తించటానికి కావలసిన నైతిక శక్తిని, బలాన్ని సాధించి పెట్టేది, అందుకు తగ్గట్టు క్రమశిక్షణను ఇచ్చేదే ఉపవాసం. పూర్వం తాలూత్ అనే రాజు శత్రువులతో యుద్ధం చేయటానికి సైన్యంతో బయలుదేరాడు. ఆ సమయంలో అతని సైన్యాన్ని అల్లాహ్ ఒక నది ద్వారా పరీక్షించిన సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నది ఎదురైనప్పుడు తాలూత్ తన సైనికులతో ఇలా అన్నాడు:

తాలూత్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు ఇలా ప్రకటించాడు : "చూడండి! అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షించబోతున్నాడు. అందు లోని నీళ్ళను త్రాగినవాడు నా వాడు కాడు. త్రాగనివాడు మాత్రమే నా వాడు. చేత్తో గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే ఫరవాలేదు." కాని కొద్ది మంది తప్ప మిగిలిన వారంతా ఆ నీళ్ళను (కడుపునిండా) త్రాగేశారు. (95 2: 249)

సహనం కలిగివుండేవారు. కోరికలను అదుపులో పెట్టుకునే వారు మాత్రమే విజయం సాధించగలుగుతారు. దీనికి పూర్తి భిన్నంగా మనోవాంఛలకు బానిసలయ్యే వారు జీవనపోరాటంలో వెన్నుచూపి పారిపోతారు.

ఉపవాస సారాన్ని మనం ఇలా క్లుప్తీకరించుకోవచ్చు

ఉపవాసం మనిషిలో దైవభీతిని కలుగుజేస్తుంది. అల్లాహు వినమ్రునిగా మారుస్తుంది. కోరికలకు కళ్ళెం వేస్తుంది. ఉపవాసం ఉండే మనిషికి మనసు మీద నియంత్రణ సులువు అవుతుంది. త్యాగనిరతిని పెంపొందింపజేస్తుంది. అవయవాల మీదే కాక అంతరంగంపై కూడా మనిషికి అదుపు లభిస్తుంది. మంచి ఆరోగ్యా న్నిస్తుంది. పాపాలను తుడిచిపెట్టేస్తుంది. ముస్లింలలో సాంఘిక చైతన్యం అభివృద్ధి చెందుతుంది. సోదరభావం పెంపొందుతుంది. ఆకలిగొన్న వారిపట్ల, అవసరాల్లో ఉన్నవారి పట్ల దయాభావం జాగృతమవుతుంది.

ఈ శిక్షణ మనందరి రక్షణ / This training is the protection of all of us

ఉపవాస ఆదేశాలు / Fasting orders

ఉపవాస ఆశయాలు / Fasting ambitions

Monday, March 11, 2024

ఉపవాస పరమార్థం / The essence of fasting part 02

దైవప్రవక్త (స) వారి ఉపవాస దివ్యోపదేశాలు

పాఠం 1

దైవప్రవక్త (స) వారి ఉపవాస దివ్యోపదేశాలు

సర్వ స్తోత్రాలూ అల్లాహ్కే. ఆయన తన శాంతినీ, అనుగ్రహాలను తన ప్రవక్తపై, ప్రవక్త ఇంటివారలపై, సహచరులపై, విశ్వాసులందరిపై కురిపించాలని మా ప్రార్ధన.

ఇబ్బుల్ ఖయ్యిమ్ ఓ గొప్ప ఇస్లామీయ విద్వాంసులు. ఆయన ఓ సందర్భంగా అంటారు, "రమజాన్ నెలలో దైవప్రవక్త (స) వారి ఆదర్శం మనకు పరిపూర్ణ మార్గ దర్శకం. రమజాన్ మాసం తారసిల్లినప్పుడు ప్రజలు పలు రకాల ఆరాధనల్లో నిమగ్నమవటమూ ఆ ఆదర్శంలో అంతర్భాగం. దైవదూత జిబ్రయీల్ (అలైహి) దైవప్రవక్త (స)కు దివ్యఖుర్ఆన్ పాఠాలు బోధిస్తూ ఉండినది ఈ నెలలోనే జిబ్రయీల్ను కలిసినప్పుడు ఆయన ప్రభంజనం కంటే అధికంగా ఔదార్యాన్ని ప్రదర్శించేవారని హదీసుల ద్వారా తెలుస్తుంది. సహజంగానే ఆయన చాలా ఉదార స్వభావులు. అయితే రమజాన్ నెల రాగానే ఆయన ఉదారత్వం ఇంకా ఊపందు కునేది. రమజాన్ నెల మొత్తం ఆయన దానధర్మాల్లో, సత్కార్యాలు చేయటంలో, దివ్యఖుర్ఆన్ పారాయణంలో, దైవారాధనలో, ధ్యానంలో, ప్రశాంతంగా అల్లాహ్ స్మరణలో గడిపేసేవారు.




రమజాన్ మాసపు ఆరాధన కోసం ఆయన ఇతర నెలల్లో కంటే ఎక్కువ సమ యాన్ని కేటాయించేవారు. రాత్రిళ్ళు ఎక్కువ సేపు ఆరాధనకే ప్రత్యేకించుకునేవారు. ఒక్కోసారి రాత్రంతా అల్లాహ్ ఆరాధనలోనే గడిచిపోయేది. అయితే తన అనుయాయులను మాత్రం ఆయన అంత విపరీతంగా ఆరాధన చేయవద్దని వారించేవారు. "మరి మీరు రాత్రంతా అదే పనిగా ఆరాధన చేస్తూ పోవటం లేదా దైవప్రవక్తా?" అని ఆరాధనా ప్రియులైన సహచరులు సందేహం వెలిబుచ్చితే, "నా శరీరం మీ శరీరాల వంటిది కాదు. నేను నా ప్రభువు సన్నిధిలో ఉంటాను. ఆయనే నాకు భోజనం తినిపిస్తాడు, పానీయమూ త్రాపిస్తాడు" అని ఆప్యాయంగా వారికి బోధించేవారు (ఈ హదీసు బుఖారి, ముస్లిం గ్రంథాలలో ఉంది). దైవప్రవక్త (స) ఎడతెగకుండా ఉపవాసాలు పాటిస్తున్నప్పుడు అనూహ్యమైన రీతిలో అల్లాహ్ ఆయనకు విజ్ఞానం, వివేకం, దివ్య సందేశ శక్తులు ప్రసాదిస్తూ ఉండేవాడన్నమాట. 'ఆ శక్తిని ప్రాపంచిక మైన భోజన సామగ్రి లాంటిదని ఊహించుకోనక్కరలేదు. అదే నిజమయితే దాన్ని అసలు ఉపవాసంగా భావించటానికి వీలు ఎక్కడుంటుంది?

ప్రవక్త (స) నిత్యం తమ ప్రభువు ఆరాధన పట్ల సంతుష్టులై ఉండేవారు. ఆయన హృదయ ద్వారాలు అంతిమ లక్ష్యం నిమిత్తం బార్లా తెరుచుకొని ఉండేవి. ప్రభువు ధ్యానంలో ఆయన మనసు పరిపూర్ణ విశ్రాంతిని, సంతృప్తిని పొంద గలిగేది. ప్రభువు సామీప్యం మూలంగా ఆయన మానసిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్నప్పుడు, ఇక ఆయన అన్నపానీయాలు మరిచి పోయేవారు. వాస్తవానికి ఆధ్యాత్మిక శక్తి మనిషిలో అంతర్గతమైన ఆత్మబలం మీద ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి భోజన పానీయాలతో నిమిత్తమయినది కాదు. ఆ శక్తితో ప్రభువు జ్ఞానాన్ని చేరుకున్న మనిషికి ప్రపంచంలోని ఏ వస్తువూ హాని కలిగించజాలదు.

అల్లాహ్ ను ధ్యానించే, ఆయన్ను ఆరాధించేవారందరిలో కెల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యుత్తములు, దైవారాధన, దైవధ్యానం, దివ్యఖుర్ఆన్ పారాయణం విస్తృతంగా జరిగే శుభప్రదమైన మాసం రమజాన్. అందుకే దైవప్రవక్త (స) ఈ మాసంలో రాత్రులు అల్లాహ్ను ప్రార్థిస్తూ, అల్లాహ్ పట్ల అత్యంత అణకువను కనబరుస్తూ గడిపేవారు. ఆయన సహాయాన్ని, తోడ్పాటును, విజయాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించమని కడు దీనంగా వేడుకునేవారు. సమాజులో దివ్యఖుర్ఆన్ లోని సుదీర్ఘమైన అధ్యాయాలను పారాయణం చేస్తూ గంటల తరబడి అలాగే నిలుచొని ఉండేవారు. ఎంతో సేపు 'రుకూ' స్థితిలో వంగి ఉండేవారు. అల్లాహ్ సమక్షంలో మోకరిల్లి (సజ్జా చేసి), అదే స్థితిలో చాలాసేపు ఉండేవారు. ఆయనలో అల్లాహ్ ఆరాధన పట్ల కాంక్ష ఎంతో బలంగా ఉండేది. రాత్రి పూట ఆరాధనలో ఎంత ఎక్కువ సేపు నిలబడితే ఆయనకు అంత ఎక్కువ ఆత్మ బలం. ఆధ్యాత్మిక శక్తి ఒనగూరుతూ ఉండేవి. సర్వశక్తిమాన్యుడైన అల్లాహ్ ఆయన్ను సంబోధిస్తూ దివ్య ఖుర్ఆన్ గ్రంథంలో

ఇలా అన్నాడు: “ఓ వస్త్రమును కప్పుకున్నవాడా? కొద్దిసేపు మినహా రాత్రంతా (నమాజులో) నిలబడు." (25 73: 1)

మరోచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు:

"రాత్రిపూట కొంతభాగం తహజ్జాద్ (సమాజు)లో ఖుర్ఆన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను "మఖామె మహమూద్"కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు." (95 17: 79)

ఉపవాస దినాలలోనూ దైవప్రపక్త (స) ఇస్లాం ధర్మ వ్యాప్తి కోసం కృషి చేస్తుండే వారు. ఉపవాసం ఉంటూనే అల్లాహ్ ధర్మోన్నతి కోసం పోరాడుతూ (జిహాడ్ చేస్తూ) ఉండేవారు. ఉపవాస రోజుల్లోనే తన సహచరులకు శిక్షణా తరగతులు నిర్వహించే వారు. ధర్మబోధనలు చేస్తుండేవారు. ఏదైనా లక్ష్యాన్ని గురిపెట్టుకొని దాన్ని సాధిం చాలనే ఉద్దేశం లేకుండా దైవప్రవక్త (స) రమజాన్ మాసపు ఉపవాసాలు మొదలు పెట్టకపోవటం ఆయన ఆచరణల్లో ఒకటి. రమజాన్లో ప్రతి రోజూ ఉషోదయానికి ముండే సహరీ ఆహారం తీసుకోవాలని ఆయన తన అనుచరులను ప్రోత్సహిస్తుండే వారు, సత్యమని ధృవీకరించబడిన ఒక హదీసు ప్రకారం ఆయన తన సహచరులకు ఇలా ప్రబోధించారు:

"ఉషోదయానికి ముందే భోజనం ఆరగించండి. నిశ్చయంగా ఆ వేళలో! (మీ కొరకు) శుభం ఉంది." (205)

ఉషోదయానికి ముందు ఉండే సమయాన్ని శుభప్రదమైనదిగా పేర్కొనటం జరిగింది. ఎందుకో తెలుసా? అది రాత్రిలో చివరి మూడో వంతు సమయం. అల్లాహ్ మొదటి ఆకాశానికి దిగివచ్చే సమయం. ఆయన తన దాసులకు క్షమాభిక్ష పెట్టే సమయం అది. దివ్య ఖుర్ఆన్లో ఒకచోట ఇలా అనబడింది: "వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణకై (అల్లాహ్ను) వేడుకుంటూ ఉంటారు." (51: 18)

మరోచోట ఇలా చెప్పబడింది: "వారు ఓర్పు వహిస్తారు. సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. దైవమార్గంలో ఖర్చుచేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేదు కుంటారు."  (5 3:17)

అంతేకాదు, ఉపవాసం ప్రారంభించే ఉద్దేశంతో ఉషోదయానికి ముందు భుజించే ఆహారం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పగటిపూట విశ్వాసికి దాని వల్ల ఒంట్లో సత్తువ క్షీణించకుండా ఉంటుంది. దాంతో పగలు దైవారాధన చేసుకోవ టానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

అలాగే స్థిరమైన వాస్తవం మరొకటుంది. దైవప్రవక్త (స) పగలంతా ఉపవాసం పాటించినప్పటికీ సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే ఆయన ఆహారం తీసుకోవటంలో త్వరపడేవారు. ఈ పద్ధతిని పాటించమని ఆయన తన అనుయాయు లకూ ఆదేశించి ఉన్నారు. ఖాళీగా ఉండే కడుపు ఏదైనా తీపి పదార్థాన్ని తొందరగా గ్రహిస్తుంది. అందుకని సాధారణంగా ఆయన ఉపవాస విరమణ కోసం కొన్ని ఖర్జూర పండ్లు, కాసిన్ని నీళ్ళు ఉపయోగించేవారు. పలు ఉల్లేఖనాలు దైవప్రవక్త (స) ఇలా ప్రవచించినట్టు తెలుపుతున్నాయి:

నిశ్చయంగా ఉపవాసి చేసే ప్రార్ధన తిరస్కరించబడదు."

అందుకని ఉపవాస సమయంలో ఆయన ఇహలోకంలోనూ, పరలోకంలోనూ తనకు శుభం ప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఉండేవారు. సూర్యాస్తమయం అయిన వెంటనే మగ్రిబ్ నమాజు ఆచరించబడుతుంది కదా! ఆ సమాజుకు ముందే ఆయన ఉపవాస దీక్షను విరమించేవారు. సత్యమని ధృవీకరించబడిన ఒక హదీసు ప్రకారం, " ఈ దిశ నుంచి రాత్రి ప్రవేశించి ఆ దిశ నుండి అది నిష్క్రమిస్తే ఇక ఉపవాసి తన దీక్షను విరమించాలి " అని ఆయన ప్రబోధిస్తుండేవారు.

ముహమ్మద్ ప్రవక్త (స) రమజాన్ నెలలోనూ ప్రయాణాలు చేసేవారు. ఈ కాలంలో ఆయన కొన్ని సార్లు ఉపవాసాలు ఉండేవారు. మరికొన్ని సార్లు ఉపవాసాలు విడిచిపెట్టేవారు. ప్రయాణకాలంలో ఉపవాసం ఉన్నా లేకున్నా అది తమ ఇష్టమని దైవప్రవక్త (స) తన సహచరులకు బోధించేవారు. అయితే యుద్ధ సమయాల్లో శత్రువులతో తలపడటానికి శక్తి కావాలి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉపవాసాన్ని విరమించాలని ఆయన వారికి ఆదేశించేవారు. 'బద్ర్' మహాపోరాటం జరిగింది. రమజాన్ నెలలోనే! ఈ పోరాటంలో ముస్లింలకు అల్లాహ్ నిరుపమానమైన విజయాన్ని చేకూర్చిపెట్టాడు. అయితే ఖత్తాబ్ కుమారులు ఉమర్ (రజి) చెప్పిన ప్రకారం దైవప్రవక్త (స) రెండు యుద్ధాల్లో ఉపవాసం ప్రారంభించారు. కాని తర్వాత దానిని మధ్యలోనే విరమించేసుకున్నారు. తిర్మిజీ, అహ్మద్ గ్రంథకర్తలు ఈ హదీసును తమ గ్రంథాల్లో క్రోడీకరించారు. ఎంత దూరం ప్రయాణం చేసినప్పుడు ఉపవాసం వదలివేయవచ్చు అనే విషయం మాత్రం నిర్ధారణ కాలేదు. దీని గురించి ప్రామాణిక మైన ఆధారాలు కూడా ఏమీ లేవు. కొన్నిసార్లు దైవప్రవక్త (స) సంభోగానంతరం అశుద్ధావస్థలో ఉండేవారు. అదే సమయంలో ఫజ్ నమాజుకు వేళ అయ్యేది. అటువంటి పరిస్థితిలో ఆయన షరీఅత్బద్ధంగా స్నానం చేసి పరిశుద్ధులై ఉపవాస దీక్షను ప్రారంభించేవారు. దైవప్రవక్త జీవితంలో ఇలాంటి సంఘటనలు కూడా జరిగివున్నాయి. కొన్ని సమ యాల్లో 'రమజాన్' ఉపవాసం పాటిస్తూ ఆయన తన భార్యను ముద్దు పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఉపవాస స్థితిలో నీళ్లు త్రాగకూడదు, కాని నోరు పుక్కిలించటానికి అనుమతి ఉంది కదా! అలాగే ఉపవాస స్థితిలో భార్యను ముద్దుపెట్టుకోవటంలోనూ తప్పు లేదని సోదాహరణంగా చెబుతుండేవారాయన.

ఒక వ్యక్తి నిజంగా మతి మరుపుకు లోనై తన ఉపవాసాన్ని విరమించుకున్నట్ల యితే అతను మళ్ళీ ఆ ఉపవాసాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉండదని, అసలు అటువంటి పరిస్థితిలో ఉపవాస దీక్ష భగ్నమే కాదని, నిజానికి అల్లాహ్ స్వయంగా ఆ వ్యక్తికి తినిపించాడని, త్రాపించాడని దైవప్రవక్త (స) తీర్మానం చేశారు. ఉపవాస సమయంలో తినటం, త్రాగటం, కావాలని వాంతి చేసుకోవటం వల్ల ఉపవాస దీక్ష. విరమించబడుతుందని ప్రవక్త ప్రవచనాలు మనకు ప్రబోధిస్తున్నాయి. అన్నపానీ యాలు ఉపవాస దీక్షను నిర్వీర్యం చేసినట్లే భార్యతో సంభోగం కూడా ఉపవాస దీక్షను భగ్నం చేస్తుందని దివ్య ఖుర్ఆన్ ద్వారా మనకు స్పష్టమయింది.

రమజాన్ నెల చివరి పదిరోజులు ఏకాంత ధ్యానం (ఏతికాఫ్)లో, దైవారాధ నలో గడపటం కూడా దైవప్రవక్త (స) వారి ఆచరణల్లో ముఖ్యమైనది. ఐహిక ఆసక్తులను విస్మరించి పూర్తిగా పది రోజుల పాటు నిరంతర ఆరాధనలతో తన అంతరాన్ని అల్లాహ్ ఆరాధనలో నిలిపి ఉంచటానికి ఆయన ఈ దీక్షకు ఉపక్రమించే వారు. ఈ సమయంలో ఆయన గారి మనోమయ జగత్తు సర్వం స్వర్గసాధనా కాంక్షతో నిండి ఉండేది. ఈ పది రోజులూ ఆయన ప్రజలతో సంబంధాలు తగ్గించుకునేవారు. ఎక్కువ సమయం అల్లాహ్ ఆరాధనలోనే వెచ్చించేవారు. ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రార్ధనల్లో, ఆరాధనల్లో నిమగ్నులై ఉండేవారు. ఆయన హృదయం అన్ని వేళలా ప్రభువు గుణగణాలను, విశేష లక్షణాలను ప్రస్తుతించటంలో లీనమై ఉండేది. ప్రస్ఫుటమైన అల్లాహ్ చిహ్నాలను, ఆయన సృష్టించిన ఈ అనంత విశ్వాన్ని, భూమ్యాకాశాలలో ఆయన ఉంచిన వింతలనూ, విశేషాలనూ గుర్తు చేసుకుంటూ ఉండేది. ఈ విధంగా ఆయన ఎంత జ్ఞాన సముపార్జన చేశారో, ఆయనకు ఎంత జ్ఞాన జ్యోతి ప్రసాదించ బడిందో, సృష్టికి సంబంధించిన ఎన్ని నిజాలు ఆయన హృదయ సీమలో ఆవిష్కృతం అయి ఉంటాయో నిర్ణయించటం కష్టమే. సృష్టిలో అల్లాహు అత్యధికంగా ఎరిగిన వ్యక్తి, అల్లాహ్ పట్ల నిరుపమాన భయభక్తులు గలిగిన వ్యక్తి, అల్లాహ్ నే నమ్ముకొని, ఆయనపైనే ఆధారపడి జీవించిన వారందరిలోకెల్లా ఉత్తముడైన వ్యక్తి ముహమ్మద్ (స) ఒక్కరే అన్న నిజాన్ని పై సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. మనుషుల్లో మహామనీషి ఆయన. అల్లాహ్ మార్గం కోసం తన సరస్వాన్ని అర్పించిన ఘనుడు, త్యాగధనుడు.

అందుకే, కస్తూరి తన సువాసనలు వెదజల్లుతూ ఉన్నంత కాలం, కపోతాల కూని రాగాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నంతకాలం, కోయిల తన పాటలు ఆలాపిస్తూ ఉన్నంత కాలం అల్లాహ్ తన శాంతీకారుణ్యాలు ప్రవక్త ముహమ్మద్ (స)పై కురిపిస్తూ ఉండాలని వినయ పూర్వకంగా మా ప్రార్ధన,

 

Saturday, March 2, 2024