Saturday, November 14, 2009

భారతీయులం మనమందరం


ఆదం అడుగు పెట్టిన చోట

రక్తం ఏరులై పారుతోందిరా

అహింస ప్రతి ధ్వనించిన చోట

హింసా ప్రవుత్తి ప్రబలుతుందిరా

మమతల మందారాలు పూచిన చోట

మారణ హోమం రగులుతోందిరా

గాంధీ మహాత్ముడు పుట్టిన చోట

గాడ్సే రాజ్యం సగుతోందిరా

ఒకనాటి మన పుణ్య భూమి

పాప భూమిగా మరుతోందిరా

కాళః నాగుల కరాళ నృత్యం

కర్మ భూమిని కాటు వేస్తోందిరా

పైశాచిక దాడులతో సాతాను చేష్టలతో

రాజ్యం ఆస్తి పంజరాలకు ఆలయమవుతోందిరా

కొంపలు కూల్చే మంచిని సమాధి చేసే

ముష్కరుల్తో తమస్సు తాన్దవిస్తోందిరా

చరిత్రకందని కాలం నుంచి

భారతీయులం మనమందరం

ఒకటిగా నడచి ఒకటిగా నిలిచి

శాంతి సామరస్యాలు స్థాపిద్దాం

నవ సమాజాన్ని నెలకొల్పుదాం


No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు