Saturday, July 16, 2011
marayadalu

من آداب الأكل والشرب ఇస్లాం ధర్మంలో అన్నపానీయములు సేవించే విధానం -
- عن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ. قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللّهِ صلى الله عليه وسلم. وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصّحْفَةِ. فَقَالَ لِي: «يَا غُلاَمُ سَمّ اللّهَ. وَكُلْ بِيَمِينِكَ. وَكُلْ مِمّا يَلِيكَ» . رواه مسلم.
అనువాదం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు - నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంపకంలో వారి ఇంటిలోనే నివాసముంటున్నప్పుడు, నా చేయి పళ్ళెంలో నలుమూలలా కదిలేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా బోధించారు.” ఓ సేవకుడా! తినే ముందు అల్లాహ్ పేరును స్మరించు మరియు నీ యొక్క కుడిచేతితో భుజించు మరియు (పళ్ళెంలో) నీ వైపు నుండి తిను.
వివరణ:- భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకటం మరియు కుడిచేతితో భుజించటం గురించిన ఇస్లాం ధర్మపు ఆదేశాలను ఈ హదీథ్ నిరూపిస్తున్నది. అలాగే ఎడమచేతితో అన్నపానీయాలు సేవించటం నిషేధించబడినది అనే విషయాన్ని కూడా ఋజువు చేస్తున్నది. ఎందుకంటే అలా తినటం ధర్మ పద్ధతి నుండి దారి తప్పిన వారి జీవనవిధానం. అలాంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండమని తెలియజేయబడినది. పైగా అది షైతాన్ యొక్క పద్ధతి మరియు అలవాటు. ఇంకో హదీథ్ లో ఎవరికైనా, ఏదైనా ఇవ్వాలన్నా, వారి నుండి తీసుకోవాలన్నా కుడిచేతిని మాత్రమే ఉపయోగించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు తెలుపబడినది. అలాగే పళ్ళంలో తన ముందున్న భాగం నుండి మాత్రమే భుజించమని కూడా ఆదేశించబడినది.
ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు׃
1.ఏదైనా తినటం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది.
2. ఒకవేళ భోజనం ప్రారంభించే టప్పుడు బిస్మిల్లాహ్ అని పలకటం మరచిపోయినట్లయితే, భోజన సమయంలో జ్ఞాపకం రాగానే బిస్మిల్లాహి వ అవ్వలుహు, వ ఆఖిరుహు (అల్లాహ్ పేరుతో - మరియు ఆరంభంలో ఉన్నవాడు మరియు చిట్టచివరగా ఉండేవాడు అని పలకవలెను.
3. భోజనం కుడి చేత్తో మరియు నీరు త్రాగటం కుడిచేత్తో మాత్రమే చేయవలెను.
4. భోజనం ముగించిన తర్వాత మరియు నీరు త్రాగిన తర్వాత అల్ హమ్దులిల్లాహ్ అని పలకవలెను.
5. భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో తన వైపు ఉన్నదానిలో నుండి తినవలెను.
من آداب العطاسఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి -
عن أبي هريرةَ رضيَ الله عنه عنِ النبيّ صلى الله عليه وسلم قال: إذا عطَسَ أحدُكم فليقل الحمد لله, وليقلْ له أخوه أو صاحبه ـ يَرحمكَ الله, فإذا قال له يَرحمكَ الله, فليقل: يَهديكُم الله ويُصلحُ بالكم) .رواه البخاري .
అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు, అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల – ఇదా అతస అహదుకుమ్ ఫల్ యఖుల్ అల్ హందులిల్లాహ్, వల్ యఖూలల్లాహు అఖూహు అవ్ సాహిబహు యర్ హమకల్లాహ్, ఫఇదా ఖాల లహు యర్ హమకల్లాహ, ఫల్ యఖుల్ యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ బుఖారి.
అనువాదం: మీలో ఎవరైనా ఒకవేళ తుమ్మినప్పుడు, అల్ హందులిల్లాహ్ అని పలకవలెను. మరియు అతని దగ్గరున్న సోదరుడు గాని లేదా మిత్రుడు గాని జవాబుగా అతడి కోసం యర్ హమకల్లాహ్ అని పలకవలెను. అలా యర్ హమకల్లాహ్ అని పలికినప్పుడు, తుమ్మినతడు బదులుగా వారికోసం యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ అని పలకవలెను.
వివరణ:- ఈ హదీథ్ లో తుమ్మినతడు పొందే అల్లాహ్ యొక్క దీవెనల గురించి ప్రస్తావించబడినది. అతడికి లభించే పుణ్యాల గురించి తెలుపబడినది. అల్లాహ్ యొక్క అనంతమైన కరుణాకటాక్షాలు అతడి పై ఎలా అవతరిస్తున్నాయో ఈ హదీథ్ తెలియజేస్తున్నది. మానవుడికి అనారోగ్యం కలిగించే కొన్ని వాయువుల నుండి తుమ్ము మనల్ని కాపాడును. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే తుమ్ముకు బదులుగా అల్ హమ్ దులిల్లాహ్ అని పలుకుతూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలా పలకటం ద్వారా తన చుట్టుప్రక్కల ఉన్నవారి ఆశీస్సులూ లభించటం జరుగును
Wednesday, July 13, 2011
ఉపవాసములు
వివిధ రకముల ఉపవాసములు:
1. విధి ఉపవాసములు
i. రమదాన్ ఉపవాసములు - పరిహారపు ఉపవాసములు - మొక్కుకున్న ఉపవాసములు
2. విధి కాని ఉపవాసములు
i. సున్నహ్ ఉపవాసములు - అయిష్టపు ఉపవాసములు - నిషిద్ధింపబడిన ఉపవాసములు
ఉపవాసపు మూల స్థంభములు:
i. ఉపవాసపు సంకల్పము.
ii. ఉపవాసమును భంగపరిచే వాటి నుండి వేకువజాము నుండి సూర్యాస్తమయము వరకు వేచి వుండుట.
ii.
ఉపవాసపు నిబంధనలు:-
i. ముస్లిం అయి వుండాలి.- యుక్త వయసుకు చేరి వుండాలి.
ii. బుద్ధి గలవాడై ఉండాలి (పిచ్చి వాడుగాని మతి స్థిమితము లేని వాడై వుండారాదు.
iii. బాటసారి కోసం ఉపవాసం తప్పని సరికాదు.
iv. ఇది స్త్రీలకు పరిమితము బహిష్టు వచ్చిన సమయమున ఉపవాసము ఉండరాదు.
iv.
ఉపవాసము సరియగునకు నిబంధనలు:-
i. ఇస్లాం స్వీకరించుట - ముందు నుంచే (వాజిబ్) ఉపవాసములు సంకల్పము చేయుట
ii. బుద్ది కలిగి ఉండుట. - ఉపవాసము భంగపరిచే వాటి గురించి తెలిసి ఉండుట.
iii. బహిష్టు రాకుండా ఉండుట మరియు ప్రసవించిన తర్వాత శుభ్రతపొందుట.
ఉపవాసపు విధానం మరియు సున్నతులు :- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఆలైహి వసల్లం ఇలా ఉద్బోదించారు “ ప్రజలు ఇఫ్ తార్ తొందరగా చేయుట వలన శుభాలు పొందుతారు. (బుఖారి & ముస్లిం)
ఇఫ్ తార్ ముందు దుఆ చేయుట:-
ఉపవాసము ఉన్నవారు ఇఫ్ తార్ కి ముందు చేసే దుఆ రద్దు చేయబడదు.
రమదాన్ ప్రత్యేకంగా శ్రద్ధగా చేయవలసిన శుభకార్యాలు:-
1. సహరీ చివరి ఘడియలలో చేయవలెను. 2 అధికంగా నఫిల్ సలాహ్ చేయవలెను 3 ఖుర్ ఆన్ పఠనము చాలా ఎక్కువగా చేయవలెను 4 ఉమ్రా చేయవలెను 5 తరావీహ్ సలాహ్ చేయవలెను 6 ఎతెకాఫ్ లో కూర్చో వలెను.
7- పుణ్యకార్యములు చాలా ఎక్కువగా చేయవలెను
7-
ఉపవాసములో చేయకూడని పనులు:-
1. గర్ గరా చేయుట గొంతు వరకూ నీళ్ళు వెళ్ళ నివ్వుట లేదా ముక్కులు నీరు లోపలకు పీల్చుట.
2. అబద్ధము చెప్పుట, చాడీలు చెప్పుట, అశ్లీల మాటలు మాట్లాడుట.
3. అశ్లీల పనులను ప్రోత్సహించుట ఉదా: టివి చూడుట, పాటలు వినుట మొదలైనవి.
పైన తెలిపిన వాటి నుండి మిమ్మల్ని మీరు తప్పక కాపాడుకోవలెను.
ఎలాంటి పరిస్థితులలో ఉపవాసము లేకుండా ఉండవచ్చును :-
1. ప్రయాణము కారణముగా
2. అనారోగ్యము కారణముగా
3. ఎవరినైనా ప్రాణాపాయము నుండి కాపాడుట కొరకు, గర్భిణి స్త్ర్రీ లేదా పాలు ఇచ్చే తల్లి. (వీరు తమ ఉపవాసములను తర్వాత పూర్తి చేసూకోవలెను.)
ఉపవాసమును భంగపరిచేవి :-
1. తినుట, త్రాగుట, ఇటువంటి ఏ పనైనా
2. భార్యతో కలియుట
3. బలవంతంగా వాంతి చేయుట
4. అశ్లీల మాటలు, లేదా చేష్టలు లేదా టివి చూచుట వలన మనీ వెలువడుట
5. స్త్రీకి మాసపు నెత్తురు లేదా గర్భిణీ స్త్రీకి నెత్తురు రావడంవలన
6. ఎక్కువగా నెత్తురు పొవుట లేదా తీయుట
7. ఉపవాసాన్ని ఉపసంహరించుకున్నట్లు సంకల్పము చేసుకొనుట (అతను తినకపొయిన త్రాగకపొయినా కూడా)
పైన తెలుపబడిన ఉపవాసమును భంగపరిచే కార్యములు ప్రతి ముస్లింనకు తెలిసి వుండవలెను.
ఉపవాసములకు బదులు :-
రమదాన్ మాసములో ఒకవేళ ఏవైనా దినములలో ఉపవాసము పాటించని యెడల, ఎన్ని రోజులు ఉపవాసం పాటించలేదో అన్ని రోజుల పాటు ఆ తర్వాత అయినా తప్పక ఉపవాసం ఉండవలెను. ఎవరైనా రమదాన్ మాసములో ఉపవాస సమయంలో భార్యతో కలిసిన యెడల అతను
1. ఒక బానిసను విముక్తి చేయాలి.
2. లేనిచో ఎకధాటిగా రెండు మాసములు ఉపవాసములు ఉండవలెను.
3. లేనిచో అరవై బీద ముస్లింలకు భోజనము పెట్టవలెను
సున్నహ్ ఉపవాసములు :-
1. హజ్ కి వెళ్ళని వారు 9 జిల్ హజ్ అరఫా రోజు ఉపవాసము ఉండుట
2. షవ్వాల్ మాసములో 6 రోజులు ఉపవాసము ఉండుట
3. ముహర్రంలో ఆషురా రోజు ఉపవాసముండుట
4. దిల్ హజ్ యొక్క మొదటి 9 రోజులు ఉపవాసము ఉండుట
5. ప్రతి నెల 13,14,15 తారీఖులలో ఉపవాసముండుట
6. ప్రతి వారంలో సోమవారం మరియు గురువారం రోజు ఉపవాసము ఉండుట
7. దావుద్ అలైహిస్సలాం లాగా ఒక రోజు విడిచి ఒక రోజు ఉపవాసము ఉండుట
8. ఎవరికైతే పెళ్ళి చేసుకొనే స్థోమత లేదో వారు ఉపవాసములు ఉండి తన మనోవాంఛలను తగ్గించుకో వచ్చును
ఈ క్రింది తెలుపబడిన రోజులలో ఉపవాసముండుట – మకరూహ్:-
1. హజ్ చేసే వారు అరాఫ్ రోజు ఉపవాసము ఉండుట
2. జుమహ్ రోజు, శనివారం రోజు, ఆదివారం రోజు ప్రత్యేకించి ఉపవాసము ఉండుట
3. ఎడతెరిపి లేకుండా ఉపవాసములుండుట (అకారణముగా)
4. షాబాన్ చివరి రోజు అనుమానం కొద్ది ఉపవాసముండుట (మొడటి రమదాన్ అవ్వచ్చు అనుకొని)
5. భర్త అంగీకరం లేకుండా భార్య (నఫీల్) ఉపవాసములుండుట
6. ఎప్పుడూ ఉపవాసములుండుట
ఈ క్రింది తెలుపబడిన రోజులలో ఉపవాసముండుట నిషిధ్ధించబడినది:-
1. రెండు పండగల రోజులలో ఉపవాసముండుట
2. బహిష్టు స్త్రీ లేదా ప్రసవించిన స్త్రీ, పరిశుభ్రం కాక ముందు ఉపవాసముండుట
3. ఉపవాసము కారణంగా మరణం సంభవించే ప్రమాదమున్న ఎడల
4. అయ్యామ్ తష్రీఖ్ జిల్ హజ్ 11,12,13 రోజులలో ఉపవాసముండుట
