Monday, November 12, 2012

కమ్యూనిజంకంటే ఉన్నతమైన వ్యవస్థ

''దారిద్య్ర ప్రమాదం చూపి షైతాన్‌ మిమ్మల్ని భయపెడతాడు. నీతిబాహ్యమైన, నీచమయిన మార్గం అవలంబించమని ప్రేరేపిస్తాడు. కాని మిమ్మల్ని క్షమిస్తానని, కరుణిస్తానని అల్లాహ్‌ా వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్‌ా అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు''. (బఖర - 268)

పెట్టుబడిదారీ వ్యవస్థ వెన్నెముకను విరిచే సిద్ధాంతాలు రెండు - ఒకటి కమ్యూనిజం, రెండోది ఇస్లాం. 
ఇక్కడ (భారత దేశంలోని) కమ్యూనిస్టుల్లో కొంతమంది మాత్రమే 'దాస్‌ కాపిటల్‌' ( )ను లోతుగా అధ్యయనం చేసి ఉంటారు. మార్క్స్‌ సిద్ధాంతాలలో 'మిగులు విలువ' ( ) అన్నదొకటి. ఈ సూత్రాన్ని మార్క్స్‌ మూడు గ్రంథాల్లో విశదీకరించాడు.
పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడతాడు. శ్రామి
కుడు తన శ్రమతో ఆ పెట్టుబడికి లాభం చేకూరుస్తాడు. ఈ లాభం అసలు మూల ధనం కంటే అధికంగా ఉంటుంది. ఈ అధికాదాయంతో పెట్టుబడిదారుడు మరో ప్యాక్టరీ స్థాపనకు పూనుకుంటాడు. ఈ విధంగా అతడు సామాన్యుల్ని దోచుకుంటాడు- ఇదీ కమ్యూనిజం వాదన, ఈ స్థితిలో కమ్యూనిజం రంగప్రవేశం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు అసలు బలమైన ఈ 'మిగులు విలువ'ను అంతమొందించగోరుతుంది. అది పెట్టుబడిదారీ వ్యవస్థను తుదముట్టించి ఉత్పత్తి సాధనాలన్నింటినీ జాతీయం చేసుకుంటుంది.
పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల సమస్య పరిష్కృత మవుతుందా? అన్నది ఆలోచించవలసిన విషయం. జాతీయం చేయబడిన పరిశ్రమల నుండి కూడా మిగులు విలువ ఉత్పన్నమవుతుంది. ఈ లాభాన్ని ఎటు తరలించాలన్నది ప్రశ్న. నేడు ఆచరణాత్మకంగా ఈ లాభం ఏమవుతుంది అన్నదాన్ని కూడా చూడాలి.
ముందు పరిశ్రమలు జాతీయం చేయబడతాయి. వాటినుండి వచ్చే లాభంలో కొంత భాగం కార్మికులకు ఇవ్వబడుతుంది. మిగతా ప్రజలకు ఏమీ లేదు.
ఏదైనా పరిశ్రమ వల్ల వచ్చే లాభంలో కేవలం ఆ పరిశ్రమలో పని చేసే కార్మికులకు మాత్రమే భాగం లభిస్తుంది. ఇతర రంగాల్లో పని చేసే శ్రామికులు, దేశంలోని నిరుపేదలు, నిరాధార జీవులకు ఇందులో ఎలాంటి వాటా లేదన్న మాట. జాతీయకరణ ఉద్దేశం ఇది కారాదు. లాభం అన్నది యావత్తు జాతి ప్రజలకు పంపిణీ కావాలి.
కమ్యూనిస్టు ప్రభుత్వం శాసన దండంతో ఈ లాభాన్ని ఒకరి నుండి లాక్కొని మరొకరికి ఇస్తుంది. దీనికి భిన్నంగా ఇస్లాంలో, మిగులు విలువ ( )ను - దానికి అర్హులైన వారందరికీ పంచేందుకు ప్రేరేరింపజేయడం జరుగుతుంది. దాని గురించి ఉపదేశించబడింది కూడా. ఇస్లాంలో ఈ పంపిణీ వెనుక ప్రేరణ శక్తి ప్రభుత్వ ఒత్తిడి కాదు- విశ్వాస బలమై ఉంటుంది.
కమ్యూనిస్టు దేశాల్లో పరిశ్రమల్ని మాత్రమే జాతీయం చేయడం జరుగుతుంది. ఆదాయం పంపిణీ అయ్యేదేదో ఆ పరిశ్రమల్లోనే అవుతుంది. ఇక వ్యక్తుల ఆధీనంలోనున్న ఆస్తిపాస్తులపై వచ్చే లాభాల పంపిణీకి సంబంధించిన భావన లేనే లేదు. ఆచరణాత్మకంగా కూడా అలాంటి ఏర్పాటేదీ ఉన్నట్లు కానరాదు. కాని ఇస్లాం, వ్యక్తుల ఆదాయంలోని 'మిగులు విలువ'ను కూడా సమాజంలోని ఇతరులపై వెచ్చించాలని తాకీదు చేస్తోంది. మిగులు విలువలో నుండే ఒక భాగం తీసి సత్కార్యాలకై ఖర్చు చేయడాన్ని జకాత్‌ అనంటుంది ఇస్లాం. అరబీ బాషలో 'జకాత్‌' అంటే పరిశుద్ధపరచుట అని అర్థం. వ్యక్తులు తన ఆదాయంలోని ఒక భాగాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడమే జకాత్‌. అంటే జకాత్‌ ఇచ్చి మనిషి తన ధన సంపత్తిని పరిశుద్ధ పర్చుకుంటాడన్న మాట. అలా చెయక పోతే అతని యావత్తు ధనసంపద అశుద్ధమైపోతుంది. ఇంతటి ఉన్నతమైన బోధన, శిక్షణలు ప్రపంచంలో కేవలం ఇస్లాం మాత్రమే ఇచ్చింది. ధనంలో నుండి కొంత భాగం మంచి పనులకై ఖర్చు పెట్టే ప్రబోధనలైతే ఆ మతం యొక్క సిఫారసులు మాత్రమే కదా. ధనవంతుడైనా మోసగించదలిస్తే అతన్ని దాన్నుంచి వారించేదెలా? అని ఎవరైనా ఆక్ష్షేపించవచ్చు.
అయితే ఈ ఆకేపణకు సమాధానం మనకు చరిత్రలో లభిస్తుంది. జకాత్‌ ఇవ్వడానికి నిరాకరించినవారికి వ్యతిరేకంగా ప్రథమ ఖలీఫా హజ్రత్‌ అబూబకర్‌ సిద్దీఖ్‌ (రజి) కరవాలం చేబూనారు. నిజానికి నాడు జకాత్‌ను తిరస్కరించినవారు బాహ్యంలో ముస్లింలే. ఇస్లాం ధర్మావలంబీకులే. విశ్వాసులు, మహనీయ ముహమ్మద్‌ (స) అనుయాయులు, నమాజ్‌ను ఆచరించేవారయిన ముస్లింలకు వ్యతిరేకంగా ఈ కరవాలం ఝుళిపించబడింది. వారు ఏ నేరానికి (జకాత్‌ను ఎగ్గొట్టే) పాల్పడ్డారో అది అంత కఠినమైందన్న మాట. దైవాన్ని విశ్వసించిన తర్వాత ఇస్లాం ఒక వ్యక్తిపై విధిగా మోపే బాధ్యత, చాలా గట్టిగా తాకీదు చేసే విషయం- జకాత్‌. అంటే తన ఆదాయంలో నుండి ఒక నిర్ణీత బాగాన్ని తీసి తన తోటి బలహీన సోదరులకు సహాయం చేయడం అన్న మాట.
ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే, వ్యక్తి తన సొంత ఆదాయం మరియు సొంత పెట్టుబడిలో నుండి ఇతరుల కోసం ఖర్చు చేయమని కమ్యూనిజం బోధించదు. అయితే ఇస్లాం ఈ విషయమై గట్టిగా తాకీదు చేస్తుంది- ఇటువంటి ఖర్చు తప్పక చేయాలని కోరుతుంది. ఈ ఖర్చును ఎవరైనా చెయ్యకపోతే (అతడు ముస్లిం అయినప్పటికీ) ఇస్లాం అతనికి వ్యతిరేకంగా ధ్వజమెత్తుతుంది. అందుకే ఇస్లాం కమ్యూనిజంకంటే ఉన్నతమైనది, శ్రేష్టమయినది.
సాధారణంగా పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తి తన ఈ ధనం తన సొంత సుఖభోగాలకని భావిస్తాడు. తన ఆదాయాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయడం స్వయంగా లేమిని కొనితెచ్చుకోవడమేనని కూడా అతడు తలుస్తాడు. ఈ సంశయమే ప్రజల్ని సాధారణంగా సంకట పెడుతుంది.
ఇస్లాం అన్నింటికంటే ముందు ఈ భావనను వ్రేళ్ళతో సహా పెకలించి పారేస్తుంది. ఇతరులపై ఖర్చు చేయడం వల్ల సంపద తరగదు - పెరుగుతుంది అని ఖుర్‌ఆన్‌ చాటి చెబుతోంది.
''దారిద్య్ర ప్రమాదం చూపి షైతాన్‌ మిమ్మల్ని భయపెడతాడు. నీతిబాహ్యమైన, నీచమయిన మార్గం అవలంబించమని ప్రేరేపిస్తాడు. కాని మిమ్మల్ని క్షమిస్తానని, కరుణిస్తానని అల్లాహ్‌ా వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్‌ా అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు''. (బఖర - 268)
పిసినారితనం అంటే ఏమిటి? తన కోసం, తన భార్యాపిల్లల కోసం, తోటి సమాజంలోని వారి అవసరాల కోసం ఖర్చు చేయడానికి బదులు ఒక్కొక్క పైసాను కూడబెట్టడమే పిసినిగొట్టుతనం.
తమిళ సినీ పరిశ్రమలో ఒక ప్రసిద్ధ గాయకుడుండేవాడు. అతను అత్యంత పిసినారి. తన కొడుకు కాలికి గాయమైతే వైద్య చికిత్స చేయించడానికి కూడా అతను వెనుకంజ వేసేవాడు. పర్యవసానంగా అతని పుత్రుడు చనిపోయాడు. ఇదీ పిసినారితనానికి ప్రతిఫలం! ఇలాంటి పిసినారితనాన్ని, సంకుచిత హృదయాన్ని ఇస్లాం గట్టిగా వ్యతిరేకిస్తుంది.
ఇస్లాం ఇతరులకై ఖర్చు చేసేందుకు కేవలం ఉపదేశాలు మాత్రమే ఇవ్వలేదు. దాంతోపాటు ఖర్చు చేయాల్సిన నియమాలను, పద్ధతులను కూడా అది నేర్పింది. కొంతమంది ఖర్చు చేస్తారుగాని ఇతరులను దెప్పి పొడవటం, ఉపకారం చేసి తమ ప్రతిష్టను పెంచుకోవటం వారి ఆశయమయి ఉంటుంది. ఇవి, ఇంకా ఇలాంటి ఇతర ఉద్దేశ్యాలు ధర్మబద్ధం కావని ఇస్లాం చెబుతుంది. దానం చెయ్యడం ధార్మికమైన విధి అని, ఇది నమాజు తర్వాత రెండో పెద్ద అంశం అని ఇస్లాం చెబుతుంది. తోటి వారికై ఖర్చు చేసి దైవ ప్రసన్నతను బడయటం తప్ప మరే ఉద్దేశ్యం దానధర్మాలకు ఉండరాదన్నది ఖుర్‌ఆన్‌ ఉపదేశం.
నేనొక చోట చూశాను - ఒకాయన ఓ సంస్థకు ట్యూబ్‌ లైట్‌ను విరాళంగా ఇస్తూ, దానిపై తన పేరును వ్రాయించారు. ఎంత ఘోరంగా వ్రాయించారంటే - ఆ లైటు వెలుగు అసలు బయటికి రాలేదు. ఇలాంటి దానధర్మం, ఇటువంటి సహాయం కేవలం తప్పు మాత్రమే కాదు. అది అతని సకల సత్కార్యాల ప్రతిఫలాలను నాశనం చేసివేస్తుందని ఇస్లాం హెచ్చరిస్తుంది. కొంత మంది ధన సహాయమో లేక వేరే ఏదయినా సహాయమో చేస్తారు కానీ తమ పెత్తనాన్ని సహాయం పొందిన వ్యక్తిపై రుద్ద్దుతారు. తత్ఫలితంగా సహాయం పొందిన ఆ వ్యక్తి మనసు గాయపడుతుంది. ఈ పోకడలన్నీ అధర్మ మయినవని ఇస్లాం ఉద్ఘాటిస్తుంది. దివ్య ఖుర్‌ఆన్‌లో ఉంది:
మనసును గాయపర్చే దానం కంటే, మృదుభాష్యం, క్షమాబుద్ధి ఎంతో మేలయినవి''. (అల్‌ బఖర - 263)
వినోబాభావే భూదాన ఉద్యమం నడిపినప్పుడు కొందరు సారవంత మయిన భూముల్ని కూడా దానం చేసిన వారున్నారు. కాని చాలా మంది భూస్వాములు బంజరు భూములను, రాళ్ళు-రప్పలు నిండిన భూముల్నే దానం చేశారు.
తమ ఇంట్లోని చినిగిపోయిన దుస్తుల్ని, చద్ది అన్నాన్ని, విరిగిపోయిన,పగిలిపోయిన సామాన్లను ఇతరులకు దానం చేసే దాతలు కూడా కానవస్తారు. చినిగిపోయిన నోట్లను, చెల్లని నాణాలను దానం చేసే వారూ ప్రపంచంలో ఉన్నారు. కాని, ఇస్లాం మీ వద్ద ఉండే మంచి వస్తువుల్ని దానం చేయమని ప్రబోధిస్తోంది. దానం చెయ్యదలిస్తే - మీరు ఇష్టపడే దుస్తులు స్వయంగా మీరు తినే పదార్థాలు, మీకు ప్రియమైన సంపద - వీటన్నింటినీ అల్లాహ్‌ా మార్గంలో ఖర్చు చెయ్యమని తాకీదు చేస్తోంది ఇస్లాం. మీరు సంపాయించేదాన్లో అన్నింటికంటే మంచి వస్తువులను దేవుని బాటలో ఖర్చుపెట్టాలి. ఇది ఇస్లాం ఉద్బోధన. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
''విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాయించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసినదానిలోని మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఇవ్వడానికి పనికిరాని వస్తువుల్ని ఏరి తీసే ప్రయత్నం చెయ్యకండి''. (బఖర - 267)
మీరు ఇతరులకు చేసే అన్నదానమయినా, దుస్త్తులయినా లేక ధన సహాయమయినా - వీటిని రహస్యంగా ఇవ్వడం ఉత్తమ విధానమని ఇస్లాం ప్రకటిస్తోంది. అయితే బహిర్గత సహాయం చెయ్యాల్సిన అవసరం లేక స్థితి ఏర్పడితే అలా చెయ్యవచ్చు. దివ్య ఖుర్‌ఆన్‌ ఉపదేశమిది:
''మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే. కాని రహస్యంగా నిరుపేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది''. (2: 271)
దానధర్మాల విషయంలో, ఎవరయినా ఒక త్రాగుబోతు లేక డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టేవాడు మీ వద్దకు వచ్చి సహాయం అర్ధించే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఒకవేళ అలాంటి వారికి సహాయం చేస్తే అదేమవుతుంది? ఈ ప్రశ్నలకు కూడా జవాబిచ్చింది ఇస్లాం. దుర్మార్గులకు, వ్యర్థప్రలాపనలకు పాల్పడేవారికి డబ్బు సహాయం ఇవ్వరాదన్నది ఇస్లాం ఉపదేశం. అయితే తిండి, దుస్తులు ఏర్పాటు చేయవచ్చు. దివ్య కుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
''అల్లాహ్‌ా మీ కొరకు ఏ సొమ్మునయితే జీవనాధారంగా చేశాడో, దాన్ని అవివేకులకు అప్పగించకండి. అయితే దాన్నుండి వారి అన్న వస్త్రాలకు ఇవ్వండి. ఇంకా వారికి హితబోధ చేయండి''. (అన్‌ నిసా-5)

వికసించే ఈ లేత మొగ్గలను కాపాడుకోండి

మీరు గనక శ్రద్ధ వహిస్తే, అక్కడ మీ ఇల్లాలు కూడా మీ పిల్లల్ని అదుపులో ఉంచి, సంస్కారవంతుల్ని చేయగల్గుతుంది. వర్తకం నిమిత్తం దూర దేశాలకు వెళ్ళే ఎంతో మంది పురుషుల ధర్మపత్నులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వగలిగారని చరిత్ర చెబుతోంది. హజ్రత్‌ సుఫియాన్‌ సౌరీ (రహ్మ) గారి తల్లినే చూడండి, పేదరికంలో మ్రగ్గుతూ కూడా దూది ఏకి తన కొడుకుని చదివించారామె. 

ప్రవాసాంధ్ర సోదరులారా!

దేవుడు మిమ్మల్ని విదేశాల-కు చేర్చాడు. జీవనోపాధిని సమకూర్చాడు. మీరు మీ కాళ్ళపై నిలబడగలిగారు. ఓ ఇంటి వారయ్యారు. దేవుడు మీకు పండంటి బిడ్డలను కూడా ప్రసాదించాడు. అక్కడ మీ ఇల్లు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే ఇక్కడ మీరు వారి గురించి నలుగురితో చెప్పుకుని, వారి ఫోటోలు చూపించుకుని ఆనందిస్తున్నారు. నిజంగా ఈ ఆనందం వెలకట్టలేనిది. సదా మీ ఇల్లు ఇలాగ
ే కళకళ లాడాలన్నది, మీ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలన్నది మా ఆకాంక్ష.

అయితే మీరు పెంచే పూవనంలోని ముసిముసి నవ్వుల పాలబుగ్గలు, వికసించే లేత మొగ్గలు మున్ముందు మీకు కన్నుల పండుగ కావాలంటే, మీ చల్లని లోగిలిలో ఆనందం నిండాలంటే, అనురాగం పండాలంటే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికెలాంటి తెగులు పట్టకుండా, కాలుష్యం కాటేయకుండా కాపాడుకోవాలి. అంటే పసితనం నుండే ధార్మికంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలి. సంస్కారం నేర్పాలి. కుటుంబ విలువలను, నైతిక విలువలను నూరిపోయాలి. స్కూలు చదువుతోపాటు, దీని తాలీమ్‌ కూడా ఇవ్వాలి. మీ మీ పేటలలోని మస్జిద్‌లలో జరిగే ఖుర్‌ఆన్‌ బోధనా తరగతులకు వారిని పంపుతూ ఉండాలి. ముఖ్యంగా వేసవి సెలవులలో వారి సమయం వృధా కానివ్వ కుండా - స్థానిక దీనీ సంస్థలు కండక్ట్‌ చేసే శిక్షణా క్లాసులకు మీ పిల్లల్ని పంపించాలి. వీటన్నింటితో పాటు పిల్లల హోంవర్క్‌ను, వారి దిన చర్యలను శ్రద్ధగా వాచ్‌ చేస్తూ ఉండాలి.
తండ్రులు తమ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత తల్లులపై అధికంగా ఉంటుంది. అయినాసరే అడుగడుగునా తండ్రుల గైడెన్స్‌ అవసరం. కాబట్టి మీరు తరచూ ఇంటికి ఫోన్‌ చేసి పిల్లల చదువు సంధ్యల గురించి ఆరాతీయటంతో పాటు, వారు నమాజు చేస్తున్నారో లేదో నిలదీసి అడగాలి. మస్జిద్‌కు వెళ్ళి మరీ నమాజు చేస్తున్నారా లేదా అని మగపిల్లల్ని అడగాలి. అమ్మ మాట వినాలని పిల్లలకు తాకీదు చేస్తూం డాలి. అలాగే - ''మన పిల్లలే మన అసలు ఆస్తి'' అని భార్యకు పదే పదే నొక్కి చెబుతుండాలి.
బ్రతుకు తెరువుకోసం విదేశాలకు వెళ్ళిన చాలా మంది సోదరులు ఆర్థికంగానైతే బాగానే ఉంటారుగాని పిల్లల శిక్షణలో మాత్రం వెనుకంజ వేస్తారు. తత్కారణంగా వారి పిల్లలు నైతికంగా దెబ్బతింటారు. వారిలో విచ్చలవిడితనం వచ్చేస్తుంది. ఇంట్లో డబ్బు ఉంటుంది. అడగంగానే కోరిక తీర్చే అమ్మ ఉంటుంది. టెన్త్‌ పూర్తి కాక ముందే చేతిలో మొబైల్‌ ఫోన్‌, మోటర్‌ బైక్‌ వచ్చేస్తుంది. దాంతో పిల్లల ఊహలకు రెక్క లొచ్చేస్తాయి.

ప్రవాసాంధ్ర సోదరా!
మీరు గనక శ్రద్ధ వహిస్తే, అక్కడ మీ ఇల్లాలు కూడా మీ పిల్లల్ని అదుపులో ఉంచి, సంస్కారవంతుల్ని చేయగల్గుతుంది. వర్తకం నిమిత్తం దూర దేశాలకు వెళ్ళే ఎంతో మంది పురుషుల ధర్మపత్నులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వగలిగారని చరిత్ర చెబుతోంది. హజ్రత్‌ సుఫియాన్‌ సౌరీ (రహ్మ) గారి తల్లినే చూడండి, పేదరికంలో మ్రగ్గుతూ కూడా దూది ఏకి తన కొడుకుని చదివించారామె. పైగా ఆమె తన పిల్లాడికి తరచూ చెబుతుండేది - ''నాయనా! నువ్వు ఎప్పుడు పది వాక్యాలు నేర్చుకున్నా, వాటి ద్వారా నీ భక్తిలో, సభ్యతా సంస్కార్లాల్లో, వినయ వినమ్రతలలో ఏపాటి ఎదుగుదల వచ్చిందో బేరీజు వేసుకో. ఒకవేళ ఎదుగుదల లేకపోతే ఈ చదువు వల్ల నీకు కలిగింది కీడేగాని, మేలు కాదు అని గుర్తుం చుకో''.
ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ) గారి గురువు అయిన రబీఅతుర్రాయ్‌ (రహ్మ) ఉదాహరణను తీసుకోండి - ఈయన పసివాడుగా ఉన్నప్పుడు తండ్రి 30 వేల దీనార్లు ఇల్లాలికి ఇచ్చి, ఒక ముఖ్యమైన పనిపై విదేశానికి వెళ్ళిపోయారు. బాధ్యత గల ఆ ఇల్లాలు ఆ డబ్బంతా ఆ అబ్బాయి చదువు కోసం వెచ్చించి అతన్ని ఆ కాలపు సాటిలేని మేటి విద్వాంసునిగా తీర్చి దిద్దింది. సుదీర్ఘకాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి, తన కుమారుని పాండిత్యాన్ని చూసి ఆనందంతో పరవశించిపోతాడు.
పసిపిల్లలు ప్లెయిన్‌ పేపర్‌ లాంటివారు. దానిపై ఏది గీస్తే అదే ముద్రపడుతుంది. ''మొక్కై వంగనిది మ్రానై వంగునా!?'' అన్న సామెతను జ్ఞప్తికి తెచ్చుకోండి. లేత వయసులో మనం మన పిల్లల్ని ఎలా మలచుకుంటే అలాగే తయారవుతారు. కాబట్టి తల్లి దండ్రులు తమ పిల్లల మంచి శిక్షణకై జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు వారు స్వయంగా పిల్లలకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. విదేశాల్లో ఉండే తండ్రులు వీలైనంత త్వరగా సెలవుపై వెళుతుండాలి. సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆలుబిడ్డలతో గడపాలి.
(1) ఇంట్లో చిన్నతనం నుంచే పిల్లలకు 'సలాం' చేయటం నేర్పాలి. కలిమాలు కంఠస్థం చేయించటంతోపాటు వాటి భావార్థాన్ని విడమరచి చెప్పాలి. (2) బాల్యం నుంచే నమాజు పట్ల శ్రద్ధాసక్తులను కలిగించాలి. ఏడేండ్లు వచ్చాక నమాజు చేయమని ప్రోత్సహించాలి. పదేండ్ల ప్రాయంలో నమాజుకై గట్టిగా ఆదేశించాలి. ఈ వయసులో పిల్లల పడకలను కూడా వేరుచేయాలి. (3) దుర్భాషలకు, దురాచారాలకు, చెడు సావాసాలకు వారిని దూరంగా ఉంచాలి. (4) ముఖ్యంగా ఆడ పిల్లల్లో సిగ్గు, బిడియం, అణకువను చిన్నప్పటి నుండే ఒంట బట్టించాలి. పసితనం నుంచే సంస్కారవంతమైన వస్త్రధారణ గురించి నొక్కి చెప్పాలి. (5) పిల్లలను చాలా జాగ్రత్తగా, సూక్ష్మదృష్టితో గమనిస్తూ ఉండాలి. అంటే - వారి సావాసాలు ఎలాంటివి? ఎక్కువ సమయం వారు ఎవరితో గడుపుతున్నారు? వారి రోజువారి కార్యక్రమాలేమిటి? లాంటి విషయాలను అబ్జర్వ్‌ చేస్తుండాలి.
వేళాకోళానికి కూడా పిల్లల ముందు చెడు అనరాదు. ఆడిన మాట తప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు. వెకిలి సైగలు చేయరాదు. ఇతరులను చెడు పేర్లతో పిలవరాదు. పైగా పిల్లల వల్ల జరిగే తప్పులను ఎప్పడికప్పుడు సరిదిద్దుతూ ఉండాలి. వారు చేసే ప్రతి మంచి పనిపై 'శభాష్‌!' అంటూ ఎంకరేజ్‌ చేస్తుండాలి.

దైవ ప్రవక్త (సఅసం) సమాధిని మస్జిదె నబవీలోనికి తీసుకోవటంలోని ఔచిత్యం?



సందేహం: ఇంతకీ మహాప్రవక్త (సఅసం) వారి సమాధిని మస్జిదె నబవీ లోపలికి తీసుకోవటంలోని ఆంతర్యం ఏమిటి?
సమాధానం: ''యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్‌ శాపం పడుగాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిద్‌ (సాష్టాంగ ప్రణామ స్థలం) గా చేసుకున్నారు'' అని మహాప్రవక్త (సఅసం) ప్రవ చించారు (బుఖారీ, ముస్లిం).
వేరొక హదీసు ద్వారా కూడా రూఢీ అయ్యేద
ేమిటంటే హజ్రత్‌ ఆయిషా (ర.అన్‌హా) కథనానుసారం - ఉమ్మె సలమా, ఉమ్మె హబీబాలిద్దరూ (ర.అన్‌ హుమా) దైవప్రవక్త (స) దగ్గర ఒక చర్చీ గురించి ప్రస్తావించారు. ఆ చర్చీలో చిత్ర పటాలు, విగ్రహాలు ప్రతిష్ఠించి ఉండటం తాము చూశామని వారు చెప్పగా, ఆయన (సఅసం) ఇలా అన్నారు; ''వారు (గ్రంథంగల ప్రజలు) తమలోని పుణ్య పురుషులు చనిపోయినప్పుడు వారి సమాధులపై ఆరాధనాల యాన్ని నిర్మించి, వాటిలో వారి చిత్రపటాలను ఆవిష్కరించేవారు. అల్లాహ్‌ా దృష్టిలో అత్యంత నికృష్ట జనులు వీరే''. (బుఖారీ, ముస్లిం).
ఇంకొక హదీసు -
ఇమామ్‌ ముస్లిం (రహ్మ.లై) గారు తన సహీహ్‌ా ముస్లింలో హజ్రత్‌ జున్దుబ్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ా (రజి) ఉల్లేఖనాన్ని పొందుపరిచారు. దానిప్రకారం ఆయనిలా అన్నారు: దైవ ప్రవక్త (సఅసం) చెప్పగా నేను విన్నాను - ''జాగ్రత్త! మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల, సజ్జనుల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. మీరు మాత్రం అలాంటి చేష్టలకు ఒడిగట్టకండి అని నేను మీకు తాకీదు చేస్తున్నాను''.
హజ్రత్‌ జాబిర్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం ''మహనీయ ముహమ్మద్‌ (సఅసం) వారు సమాధులను పటిష్ట పరచటాన్ని, వాటిపై కూర్చోవటాన్ని, వాటిపై నిర్మాణాలు చేపట్టడాన్ని వారించారు''.
(ముస్లిం)
పైన పేర్కొనబడిన ప్రామాణిక హదీసులను బట్టి ఎట్టి పరిస్థితిలోనూ సమాధులను 'సజ్దా' స్థలాలుగా చేసుకోరాదని స్పష్టంగా విదిత మవుతోంది. అలాగే గోరీలపై నిర్మాణం చేయటం, గుంబదులు వంటివి కట్టడం కూడా అధర్మమే. ఎందుకంటే ఇవన్నీ ప్రజలను దేవుని ఏక త్వం నుండి దూరం చేసి, షిర్క్‌ (బహుదైవోపాసన) కు మార్గం తెరు స్తాయి.
ఇక ప్రవక్త (సఅసం) సమాధిని మస్జిద్‌ లోపలికి తీసుకోవటం గురించి చెప్పుకుందాం -
దైవప్రవక్త (సఅసం) గానీ, ఆయన గారి ఇద్దరు ప్రియ సహచరులు (అబూబక్ర్‌, ఉమర్‌) గానీ వాస్తవానికి మస్జిద్‌ లోపలి భాగంలో ఖననం చేయబడలేదు. నిజానికి వారు ముగ్గురూ హజ్రత్‌ ఆయిషా (ర.అన్‌హా) నివసించే కుటీరంలో ఖననం చేయబడ్డారు. అయితే మస్జిద్‌కు వచ్చేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండటం వల్ల వలీద్‌ బిన్‌ అబ్దుల్‌ మలిక్‌ కాలంలో మస్జిదె నబవీ విస్తృతి జరిగింది. ఆ సందర్భంగా - హి. మొదటి శతాబ్ది చివర్లో - హజ్రత్‌ ఆయిషా (ర.అన్‌హా) గారి కుటీరం కూడా మస్జిద్‌లో విలీనం చేసుకోబడింది.
తత్కారణంగా దైవ ప్రవక్త (సఅసం) సమాధితోపాటు, ప్రియ సహచరులిద్దరి సమాధులు కూడా ఆ విలీన స్థలంలో అంతర్లీనమై నాయి. కాబట్టి ఇది మస్జిద్‌లోపల జరిగిన ఖనన సంస్కారం అని చెప్పటం సరైనది కాదు. ( - షేఖ్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ బాజ్‌ - రహ్మ)

ఫోన్‌లో 'మైనె ఖుబూల్‌ కియా' అంటే సరిపోతుందా?
సందేహం: ఈ మధ్య ఇంటర్‌నెట్‌, ఫోన్ల ఆధారంగా ఎన్నో చోట్ల నికాహ్‌ాలు (వివాహాలు) జరుగుతున్నాయి. ఈ రకమైన వివాహాలు షరియతు పరంగా ధర్మబద్ధమేనా?
సమాధానం: నికాహ్‌ాలో 'ఏజాబ్‌ వ ఖుబూల్‌' (ప్రతిపాదన, ఆమోదం) కీలకమైనది. వివాహబంధంలో ఇమిడిపోయే నూతన వధూవరులు కూడా స్వయానా ఈ తంతు జరుపుకోగలరు. లేదా వారిరువురి తరఫు 'పెద్ద మనుషులు' కూడా జరిపించగలరు. ఒక సారి దైవప్రవక్త (సఅసం) ఒక వ్యక్తినుద్దేశించి, ''నీ వివాహం ఫలానా స్త్రీతో జరిపించమంటావా?'' అని అడగ్గా ''సరే'' నని ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడాయన (సఅసం) వారిరువురికీ నికాహ్‌ా జరిపిం చారు (సుననె అబుదావూద్‌).
నికాహ్‌ా (వివాహం) కోసం షరీయతు ప్రకారం నాలుగు మూలాంశాలుంటాయి. (1) వధువు అంగీకారం (2) ఆమె సంరక్ష కుని అనుమతి (3) మహర్‌ సొమ్ము నిర్థారణ (4) సాక్షులు. నికాహ్‌ా సందర్భంగా ఈ షరతులు పూర్తవ్వాలి. అన్యధా అట్టి నికాహ్‌ా సరైనది కాదు.
ఇక ఫోన్‌ లేదా ఇంటర్‌నెట్‌ సంభాషణ ద్వారా నికాహ్‌ా విషయానికి వస్తే - అందులో 'ఖుబూల్‌' చేసే వ్యక్తి గురించి పెళ్ళి కూతురు తరఫువారు 'ఆ వ్యక్తి అతనే' నని నిజ నిర్థారణ చేయాలి. అంటే ఆ స్థలంలో 'వరుడు' ఉండడు. కానీ దూర భాషణ ద్వారా అతని 'ఆమోదకంఠం' మాత్రం వినబడుతుంది. ఆ వివాహ మహో త్సవానికి విచ్చేసిన వధువు తరఫువారు, సాక్షులు, ఇతర బంధు మిత్రులు ఒక నిర్థారణకు వస్తారు. ఇలాంటి 'నికాహ్‌ా'లో షరీయతు పరంగా ఎలాంటి దోషం లేదు. కాకపోతే ఇంతకు ముందు పేర్కొన బడిన నికాహ్‌ా 'నియమ నిబంధనలు' పరిగణనలోకి వచ్చి ఉండాలి. (నిజము దేవుడెరుగు)
నమాజులో తల్లిదండ్రుల కొరకు 'దుఆ' చేయవచ్చా?
సందేహం: ఫర్జ్‌ నమాజులో తల్లిదండ్రుల కోసంగానీ, వేరితరుల కొరకుగానీ 'దుఆ' చేయటం సమ్మతం కాదని కొందరంటున్నారు. ఇది నిజమేనా?
సమాధానం: నమాజులో దుఆ - తన కోసం చేసుకున్నా, తన తల్లి దండ్రుల, వేరితరుల కోసం చేసుకున్నా - ఆక్షేపణీయం ఏమీ కాదు. ''దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంలో ఉండేది 'సజ్దా' స్థితిలోనే కాబట్టి మీరు (ఆ స్థితిలో) అత్యధికంగా దుఆ చేసుకోండి'' అని మహనీయ ముహమ్మద్‌ (స) వారు ఉపదేశించారు (ముస్లిం).
ఆయన (సఅసం) ఇంకా ఈ విధంగా ప్రవచించారు; రుకూలో మీ ప్రభువు ఔన్నత్యాన్ని కీర్తించండి. సజ్దాలో మాత్రం అత్యధికంగా వేడుకోలు చేయండి. బహుశా మీ వేడుకోలు ఆమోదించబడవచ్చు. (ముస్లిం)
హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ మస్‌వూద్‌ (రజి) ఇలా అన్నారు: మహా ప్రవక్త (సఅసం) తనకు తషహ్హుద్‌ నేర్పిన తర్వాత ఇలా ఉద్బోధించారు - ''ఇక నీవు నీకు ఎంతో ఇష్టమైన దుఆను ఎంపిక చేసుకుని దుఆ చెయ్యి. లేదా నీకు కావలసినది కోరుకో (వేడుకో)'' అన్నారు. (బుఖారీ, ముస్లిం)
కాబట్టి ఎవరయినా నమాజు ముగించక ముందే సజ్దా స్థితిలో గాని, ఖాయిదా స్థితిలోగానీ తన కోసం లేదా తన మాతాపితల కోసం, ఇంకా సమస్త ముస్లిముల కోసం వేడుకుంటే అది అభ్యంతర కరం ఏమీ కాజాలదు. ఇది ధర్మసమ్మతమే.
-షేఖ్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ బాజ్‌ (రహ్మ.లై

islam

ఈ ప్రపంచం ఒక మాయా వస్తువు. ఇక్క వాస్తవంకన్నా ఊహ కే ఎక్కువ ఆకర్షణ ఉంది. సత్యవంతులు చెప్పే అక్షర సత్యాలను నమ్మేవారి సంఖ్యకూడా తక్కువే. నరుడు, పామరుడు, ప్రవఁరుడు ఆడి తప్పేవారి మాటలనే గుడ్డిగా నమ్ముతాడు. ఇక్కడ మనకు అడుగడుగునా పుట్టగొడుగుల్లా కానవచ్చే సిద్ధాంతాలు కాల్పనిక మయినవి, అసంపూర్ణమయినవి. నిజం-మనిషి మరియు అతని కి ప్రాప్తమయి ఉన్న జ్ఞానమే అసంపూర్ణమయినప్పుడు అతను ప్రతి పాదించే రాతారీతులు సంపూర్ణం ఎలా కాగలవు? వాస్తవం ఏమి టంటే పరిపూరర్ణుడు, పరిశుద్ధుడు నిజదైవమయిన అల్లాహ్‌ా మాత్రమే. సృష్టిమొత్తంలో శ్వాస పీల్చే వాటన్నింటిలో మాట్లాడే వారందరిలో పరమ సత్యవంతుడు అల్లాహ్‌ా. ఆయన ఇలా సెలవిస్తున్నాడు: ''అల్లాహ్‌ాకంటే సత్యమయిన మాట పలికేదెవరు?'' 
(అన్నిసా: 122)
అనంత దయాసాగరుడు, అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్‌ా కరుణించి మనందరికి అనుగ్రహించినదే అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). ఈ రెంటి మేలు కలయికే ఇస్లాం. అల్లాహ్‌ా ఇలా ప్రకటించాడు:''ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లాంను మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించాను''. 
(అల్‌ మాయిదా: 3)
''అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది''. (అన్నిసా: 122) 
దైవ దాసులారా! ఇస్లాం ధర్మం కొందరు భావిస్తున్నట్లు మహమ్మదీయ మతమూ కాదు; ముస్లింలు ముహమ్మదీయులూ (ముహమ్మద్‌ను దైవంగా భావించి కొలిచేవారూ) కారు. ఇస్లాం - అది మానవాళి మార్గదర్శకం నిమిత్తం ఆవిర్భవించిన 1 లక్ష 24 వేల మంది ప్రవక్తల ధర్మం. అది ఒక కాలానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక జాతికో పరిమితమ యిన ధర్మం కాదు. దైవ ప్రవక్తలు తమ తమ కాలాల్లో, తమ తమ జాతులకు బోధపరచిన ధర్మమే ఇస్లాం. కాకపోతే దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) ద్వారా ఇది మానవాళికి సంపూర్ణంగా అందజేయబ డింది. అనాదిగా మానవాళి మొత్తానికి ఆ నిజ దైవం నిర్దేశించిన ఈ ధర్మంలో మూడు మౌలికాంశాలున్నాయి. 1) తౌహీద్‌ (దేవుని ఏకత్వం). 2) రిసాలత్‌ (దైవదౌత్యం). 3) ఆఖిరత్‌ (పరలోకం). ఈ మూడు మౌలికాంశాల్నే ప్రవక్తలందరూ మానవాళికి ప్రబోధించారు. ఈ సత్యధర్మాన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రతి యుగంలోనూ జరిగింది. ఈ యుగం - కలియుగంలోనూ జరుగుతూనేె ఉంది. ప్రవక్త నూహ్‌ా (అ) వారు 950 సంవత్సరాలు బాధించబడినా, ప్రవక్త ఇబ్రాహీమ్‌ (స) వారిని అగ్నిగుండంలోకి విసిరేసినా, ప్రవక్త జకరియ్యాను రంపంతో రెండుగా చీరేసినా, ప్రవక్త యహ్యా (అ) గారి శిరస్సుని ఖండించి ఒక అలగా అబల కోసం బహుమతిగా ఇచ్చినా, ప్రవక్త ఈసా (అ) వారిని నానా రకాలుగా పీడించినా, ఒక పూర్తి ఊరును నిప్పుతో నిండిన కంద కానికి ఆహుతి చేెసినా, ఒక పూర్తి వర్గపు జనాభా మాంసాన్ని ఇనుప దువ్వెనలతో ఎముకల నుండి వేరు చేసినా, దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని శతవిధాల అణచివేెసేందుకు, అంతమొందిం చేందుకు ప్రయత్నించినా - కారణం ఒక్కటే - వారు నమ్మింది సత్యం, వారు చెప్పింది సత్యమవ్వడమే. అసత్యం, మిథ్యావాదులు ఎంత పెచ్చ రిల్లి ప్రవర్తించినా అంతిమ విజయం మాత్రం సత్యానికే, సత్యవాదులనే వరించింది. అసత్యప్రియులు అప్రతిష్ఠ పాలయి, అపకీర్తి మూట కట్టు కుని అష్ట కష్టాలు అనుభవించారు. ఘోరమైన శిక్షలకు గురి చేయ బడ్డారు అనడానికి సుదీర్ఘమయిన మానవ చరిత్రే సాక్షి! నిజం - అల్లాహ్‌ా ఇస్లాం ధర్మాన్ని ప్రవక్తల ద్వారా మానవాళికి బోధించింది, దానికి ఇతర జీవన విధానాల మీద ఆధిక్యతను అనుగ్రహించడానికే. ''వారు అల్లాహ్‌ా జ్యోతిని తమ నోటితో (ఊది) అర్పివేయాలని కోరుతు న్నారు. అయితే అల్లాహ్‌ా - అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే-తన జ్యోతి సంపూర్ణం చేయకుండా వదలిపెట్టడానికి అంగీకరిం చడు. ఆయనే తన ప్రవక్తకు-మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పం పాడు. ముష్రికులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర జీవన విధానాలపై దాన్ని ఆధిక్యతను వొసగడానికి''. (తౌబా: 32,33) 
''ఇక ఎవరయితే ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ఆ ధర్మం ఆమోదించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు''. (ఆల్‌ ఇమ్రాన్‌: 85) 
పరిశుద్ధ మనసు గల సమాలోచనాపరులంతా ఇస్లాంను లోతుగా పరి శీలించి తృప్తి చెంది తమ గుండెలకు హత్తుకుంటారు అనడానికి 14 వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రే సాక్షి. వారు, అల్లాహ్‌ా నిర్దేశాల, నియమాల వెనుక గల పరమార్థాన్ని గ్రహించి ఆయన మహోన్నత యుక్తిని తెలుసుకొని ఆయన్ను ప్రేమించనారంభించారు. సర్వకాల సర్వా వస్థలయందు ఆచరణయోగ్యమైన ఏకైక ధర్మం ఇస్లాం ఒక్కటే అన్న యదార్థాన్ని తెలుసుకున్న వారు దాని గొప్పతనాన్ని కొనయాడారు. ఎంతగానయితే మనిషిలో సత్య దృష్టి పరిపక్వత చెందుతుందో అంత గానే అతను ఇస్లాం ధర్మాన్ని అభిమానిస్తాడు, ఆచరిస్తాడు, గౌరవి స్తాడు. ఎందుకంటే, ఇస్లాం మానవ మనుగడకు తోడ్పడే సకల మేళ్ళ, శుభాల, శ్రేయోసాఫల్యాల సమ్మేళనం. 
ఇస్లాం తౌహీద్‌ (దేవుని ఎకత్వం) గురించి, మానవాళికి నొక్కి వక్కాణి స్తుంది. తౌహీద్‌ను అనుసరించిన మనిషి అపూర్వమయిన, అనిర్వవచ నీయమయిన ఆత్మశాంతిని పొందుతాడు. తరతరాలుగా మనిషి భారం గా మోస్తున్న మిథ్యా దైవాల దాస్య కాడిని అతని భుజాల మీద నుంచి దించి, అతనిపై గల అనవసర ఆక్షంల సంకెళ్ళను త్రెంచి అతన్ని స్వేఛ్చా లోకంలో విహరింపజేయగలిగే తౌహీద్‌ సూత్రాన్ని పునాదిగా పేర్కొంటుంది ఇస్లాం. విశ్వ మొత్తానికి కర్త ఒక్కడేనని, ఆయనే ఈ విశ్వ వ్యవస్థను నిరాఘాటంగా నడుపుతున్నాడని, ఆతన తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ఆయనేె ఆది, ఆయనకు ముందు ఏదీ లేదని, ఆయనే అంతం ఆయన తర్వాత ఏది ఉండబోదని, ఆయనే మహోన్నతుడు ఆయనపైన ఏది లేదని, ఆయనే సజీవుడు, నిరంతుడని, భూమ్యాకాశాల మధ్య గల సమస్తం ఆయనదేనని, ఆయన్ను పోలినదేది లేదని, ఆయన సర్వ శక్తిమంతుడుని, ఈ విశ్వ వ్యవస్థను నడపడం ఆయన్ను అలసటకు గురి చేయజాలదని, ఆయనకు కునుకుగాని, నిద్దురగాని రాదని, 
ఆయన జ్ఞానం సమస్త లోకాలకు పర్యవేష్టించి ఉందని, గొచర అగోచ రాలన్నీ ఆయనకు తెలుసునని, వెలుగు వెన్నెల - చిమ్మ చీకటి ఆయన కు సమానమేనని, సకల జీవరాసుల జీవనోపాధి ఆయన చేతిలోనే ఉందని, ప్రతి క్షణం ప్రకృతిని, ప్రజల్ని కాపాడేెది ఆయనేనని, అట్టి కరుణామయునికి మాత్రమే దాస్యం చేెస్తూ, ఆయనకు నచ్చినవాటిని పాటిస్తూ, ఆయనకు నచ్చని వాటికి దూరంగా మసలుకోవాలని ఇస్లాం నొక్కి వక్కాణిస్తోంది. 
వాస్తవం ఏమిటంటే సర్వలోక సృష్టికర్త, పాలకుడు, పరిపోషకుడు అయిన అల్లాహ్‌ా మానవాళి మార్గదర్శకత్వం నిమిత్తం ప్రవక్తలను, గ్రంథాలను అవతరింపజేయడమే కాక, సృష్టిలోనూ, మానవాకృతి నిర్మాణంలోను అనేక నిదర్శనాలను పెట్టాడు. యోచనాపరులు వాటిని గురించి ఆలోచించాలని, పరిశీలించాలని, పరిశోధించాలని, ఇహ పరాల ప్రగతి బాటలు వేసుకోవాలని పలుమార్లు పిలుపునిచ్చాడు కూడా. ఈ అన్వేషణ ద్వారా యుక్తిపరులు ఆయన్ను తెలుసుకొని, ఆయన ఆజ్ఞలను గైగొని, ఆయన హక్కులను నెరవేర్చడం సులభమవు తుంది.''భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర)మార్పిడి లో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రా లలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్‌ా వర్షపు నీటి కురిపించి మృత భూమిని బ్రతికించడంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణు లను వ్యాపింపజేయడంలో, వీచే గాలుల దిశను మార్చడంలో, భూమ్యా కాశాల మధ్య (అల్లాహ్‌ా) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుం టున్న మేఘాలలో బుద్ధిమంతులకు (అల్లాహ్‌ా శక్తిసామర్థ్యాలకు సంబం ధించిన) ఎన్నో సూచనలున్నాయి''. (బఖరా: 164) 
మనం అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాము. 'ఏ సృష్టికర్త లేకుండా మనందరి సృజన ఎలా సాధ్యం?' అని. మనిషి మనో మస్తిష్కాలను తరాల తరబడి కలచి వేస్తున్న ఈ ఆలోచన గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ''ఏమిటి? వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారం తట వారే పుట్టుకొచ్చారా? లేక వారికి వారే సృష్టిలకర్తలా?'' (అత్తూర్‌: 35) ''ఏమిటి? భూమ్యాకాశాలకు వారే సృష్టికర్తలా?'' 
''వాస్తవంగా ఆయనే ఆకాశాలను ఎలాంటి స్తంభాలు లేకుండానే సృష్టించాడు. మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన భూమి లో పర్వతాలను నెలకొల్పాడు. అది (భూమి) మీతోపాటు ఒదిగిపో కుండా ఉండేందుకు. ఇంకా అన్నిరకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు.....ఇదే అల్లాహ్‌ా సృష్టి. ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి''. 
(లుఖ్మాన్‌: 10, 11) 
''ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్‌ాకు) బాగస్వాములుగా నిల బెడుతున్నారా? వారు (మిథ్యాదైవాలు) వీళ్ళకు ఏ సహాయమూ చేయ లేరు. కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు. వాస్త వంగా మీరు అల్లాహ్‌ాను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొర పెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.ఏమిటి, వారు(విగ్రహ ప్రతిమలు) నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవడానికి వారికి చేతులున్నాయా? చూడగలగ టానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓప్రవక్తా!) వారికి చెప్పు:''మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచు కోండి. మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచిం చండి. నాకు కొద్ది పాటి గడువు కూడా ఇవ్వకండి''. (ఆరాఫ్‌: 191-195) 
ఇది యదార్థం అయినప్పుడు, మన ఆరాధనలు, ఉపసనారీతులు, భక్తి ప్రపత్తులు, మొక్కుబడులు, మొరపెట్టుకోవడాలు కూడా ఆయన ఒక్కడి కే అంకితం చేయాలి. (ఓ ముహమ్మద్‌!) వారికిలా చెప్పు: ''ఆయన అల్లాహ్‌ా ఒక్కడే. అల్లాహ్‌ా నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేని వాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన కూడా (ఎవరికీ) పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు''. (ఇఖ్లాస్‌: 1-4) 

ఆకాశాన్ని, దానిలోని వైభవోపేతమయిన సామ్రాజ్యాన్ని చూసినప్పు డల్లా ఆలోచనపరుని నోట ఈ స్తుతి ఆలాపనలు వెలువడతాయి: ''ఆకా శంలో బురుజులు నిర్మించి, అందులో ప్రజ్వలమయిన దీపాన్ని, కాంతి మంతమయిన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు. ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేెశాడు. ఇదంతా గుణ పాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతా పూర్వకంగా మసలుకో దలచిన వాని కోసం చేయబడింది''. (ఫుర్ఖాన్‌: 61,62) 
''సూర్యున్ని ప్రకాశమానంగాను, చంద్రున్ని కాంతిమంతంగానూ చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను, లెక్కలను తెలుసు కోవడానికి చంద్రుని థలను కూడా ఆయనే నిర్థారించాడు. అల్లాహ్‌ా వీటిని సత్యబద్ధంగా తప్ప (నిరర్థకంగా) పుట్టించలేదు. తెలుసుకోగల వారి కోసం ఆయన ఈ సూచనలను విడమరచి చెబుతున్నాడు''. 
(యూనుస్‌: 5) 
''నిస్సందేహంగా విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు ఆయనే. ఆయన జీవమున్న దానిని జీవం లేని దానలోంచి తీస్తాడు. జీవం లేని దానిని జీవమున్న దానిలోంచి తీసేవాడూ ఆయనే. ఆయనే అల్లాహ్‌ా. మరలాం టప్పుడు మీరు (సత్యం నుండి) ఎటు మరలిపోతున్నారు''. 
(అన్‌ఆమ్‌: 95) 
''చీకట్లలోనూ, భూమిలోనూ, సమద్రంలోనూ మీరు మార్గం తెలుసు కునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము''. 
(యూనుస్‌: 5) 
''ఏమిటి నింగినేలకు సంబంధించిన సామ్రాజ్య వైభవాన్ని, అల్లాహ్‌ా సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గర పడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచిం చలేదా? మరి ఖుర్‌ఆన తర్వాత వారు విశ్వసించే మరో వస్తువు ఏముంటుంది?'' (ఆరాఫ్‌: 185)
''ఆయన ఒకదానిపై ఒకటి సప్తాకాశాలను నిర్మించాడు. (ఓ చూచేవాడా!) నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను కానలేవు. కావాలంటే, మరో సారి దృష్టి సారించి చూడు. నీకేమయినా లోపం (బీటలు వారినట్లుగా) కనిపిస్తోందా? మళ్ళి మళ్ళీ దృష్టిని సారించు. నీ దృష్టి అలసిసొలసి, విఫలమయి నీ వైపు తిరిగి వస్తుంది''. (ముల్క్‌: 3,4) 

జ్ఞానవంతులయిన వారు అల్లాహ్‌ నిర్మాణానికి నిదర్శనమయిన భూమిని చూస్తారు. అప్పుడు వారికి కొన్ని విషయాలు బోధపడతాయి. అల్లాహ్‌ా ఘనతాగౌరవంతో వారి హృదయాలు ఉప్పొంగుతాయి. 
''ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను, నదీ నదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్ని రకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు.....భూమిలో అనేక (రకాల) నేలలు (ఒక దాని కొకటి) ఆనుకొని ఉన్నాయి. అందులో ద్రాక్ష తొటలూ ఉన్నాయి. పంట పొలాలూ ఉన్నాయి. కర్జూరపు చెట్లూ ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా, మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాట న్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా ఇందులో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి''. (అర్రాద్‌: 3,4) 
(సశేషం)

అందరివారు అంతిమ దైవ పవ్రక్త ముహమ్మద్‌ (స)

''ఆయన మాకు కూడా ప్రవక్తేనా!'' అని క్రైస్తవ సోదరులు అడగవచ్చు. ''అవును'' అన్నదే జవాబు. ఎందుకంటే, క్రైస్తవులు కూడా గ్రంథ ప్రజలేనని ముస్లిములు విశ్వసిస్తారు కనుక. ఖుర్‌ఆన్‌లో ఈ విషయమై ''గ్రంథ పజలారా! నిజంగా మా ప్రవక్త మీ మధ్యకు వచ్చాడు'' అని దేవుడు పేర్కొన్నాడు. క్రైస్తవుల మధ్యకు మహాప్రవక్త వస్తారన్న సూచనపై ఖుర్‌ఆన్‌ వాక్యంలో ఉంది. యావత్‌ మానవాళికి దైవప్రవక్త. 

పియసోదరులారా! మీకు శాంతి కలుగుగాక!
ప్రపంచంలో ఎంతో శ్రేష్ఠధర్మం అయిన ఇస్లాం ముస్లిములకు మాత్రమే సం బంధించి నదైతే, దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ముస్లిములకు మాత్రమే ప్రవక్త అయితే, ముస్లిమేత రుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది? వారు నిస్పృహకు గురి కావచ్చు, ఈర్షా - అసూయలకు గురికావచ్చు. చివ రకు విద్వేషానికి దారితీయవచ్చు. కాని నిజం చెప్పాలంటే ఇస్లాం, దైవ ప్రవక్త ముహమ్మద్‌(స) తమ సొంత మని చెప్పుకునే హక్కు ఏ ముస్లింకూ లేదు. అంతే కాదు అలా చెప్పుకునే ఆధారం ఏదీ వారి వద్ద లేదు.
మరి,దైవప్రవక్త ఎవరన్నది ప్రశ్న. ఆయన ముస్లిములకు, క్రైస్తవులకు,హిందువులకు, నాస్తికులకు, హేతువాదులకు, ఇంకా చెప్పా లంటే ఎలాంటి ధర్మం లేనివారికి ప్రవక్తే. ఇలా చెప్పడానికి మనవద్ద అవసరమైన నిరూపణ దివ్య ఖుర్‌ఆన్‌లో ఉన్నది. 'దైవ ప్రవక్తలు' అన్న అధ్యాయంలో దేవుడు 
''మహాప్రవక్త ముహమ్మద్‌(స) యావత్‌ మానవాళికి కారుణ్యం'' అని పేర్కొన్నాడు.
''ఆయన మాకు కూడా ప్రవక్తేనా!'' అని క్రైస్తవ సోదరులు అడగవచ్చు. ''అవును'' అన్నదే జవాబు. ఎందుకంటే, క్రైస్తవులు కూడా గ్రంథ ప్రజలేనని ముస్లిములు విశ్వసిస్తారు కనుక. ఖుర్‌ఆన్‌లో ఈ విషయమై ''గ్రంథ పజలారా! నిజంగా మా ప్రవక్త మీ మధ్యకు వచ్చాడు'' అని దేవుడు పేర్కొన్నాడు. క్రైస్తవుల మధ్యకు మహాప్రవక్త వస్తారన్న సూచనపై ఖుర్‌ఆన్‌ వాక్యంలో ఉంది. యావత్‌ మానవాళికి దైవప్రవక్త. అయితే క్రైస్తవులు ఈ వాద నను ప్రశ్నించవచ్చు. తమ గ్రంథాల నుంచి ఈ విషయమై రుజువు కోరవచ్చు. కొత్త నిబంధనలో స్వాంతన నిచ్చే వాని ఆగమనం గురించిన అధ్యాయంలో ఈ వాస్తవం స్పష్టంగా ఉంది. క్రీస్తు స్వయంగా తెలిపిన మాటలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రస్తావించబడిన ''స్వాంతన నిచ్చువాని'' గుణగణాలకు ప్రవక్త ముహమ్మద్‌(స) గుణ గణాలకు మధ్య పూర్తి సారూప్యం ఉంది.
ఈ వాస్తవాన్ని క్రైస్తవులు గుర్తిస్తే, దైవప్రవక్త ముహమ్మద్‌(స) ను వారు తమ ప్రవక్తగా అంగీకరించి తీరుతారు.

హిందువులకూ ప్రవక్తే
ఒక అరేబియా నివాసి భారతదేశ హిందువులకు ప్రవక్త ఎలా అవుతారని మీరు అడగ వచ్చు. కాని మనం హిందూ గ్రంథాలను చది వితే, ముఖ్యంగా రుగ్వేదంలో, భవిష్య పురాణంలో కొన్ని శ్లోకాలు ఎడారి నుంచి వచ్చే, ఒంటె అధిరోహించే ప్రవక్తను గురించి కనబడ తాయి. ఆ ప్రవక్త పేరు 'మహామథ్‌'గా ప్రస్తావించ బడింది. అది మహాప్రవక్త ముహ మ్మద్‌(స) పేరు తప్ప మరొకటి కాదు.

నా ఈ విశ్లేషణ ఒక హిందూ పండితునికి ఆగ్రహ కారణం అయ్యింది. హిందూ పురా ణాల్లో లేనిదంటూ ఏదీ లేదని వాదించాడు. కోపం పట్టలేక నన్ను తీక్షణంగా నిలదీస్తూ హిందూ ధర్మంలో లేని కొత్త సందేశం ఇస్లాంలో ఏముందో చెప్పమని ప్రశ్నించాడు.
అతని ఆగ్రహం చూసి నేను చిరునవ్వుతో, ఇస్లాంలో ఎలాంటి కొత్త సందేశం లేదని అంగీకరించాను. అంతేకాదు, మునుపటి ప్రవక్తలు, దివ్య గ్రంథాలలోని సందేశం తప్ప కొత్త సందేశం ఏదీ ఇస్లాంలో లేదన్న ఖుర్‌ఆన్‌ సూక్తిని కూడా వినిపించాను.
ఆ వ్యక్తికి నా మాటలు నచ్చాయి. నేను ఇంకా ఏం చెప్పబోతానా అని ఆసక్తిగా వినడం ప్రారంభించాడు. హిందూ ధర్మంలోనూ దేవుని ఏకత్వం గురించిన సందేశం ఉంది. ఉపనిషత్తులు ఈ విషయాన్నే చెబుతున్నాయి. తమిళ సాధువు 'తిరుమూలార్‌' అందుకే 'ఒకే దేవుడు' 'ఒకే ప్రజ' అంటూ తీర్మానించాడు. కాని, అనేక దేవుళ్ళను ఆరాధించండ ని చెప్పే శ్లోకాలు, తాత్పర్యాలు కూడా ఉన్నాయి.

శిలా విగ్రహాల ఆరాధనను ఖండిస్తూ 'శివ వక్కియార్‌' రాసిన గేయం ఉంది. అలాగే రాళ్ళు రప్పలను పూజించండని చెప్పే పాటలూ ఉన్నాయి.
ప్రాపంచిక జీవితంలో నీతి నియమాలకు సంబంధించిన బోధనలు ఇస్లాంలో మాదిరిగా హిందూ ధర్మంలోనూ ఉన్నాయి. అయితే వైరుధ్యాలు, అయోమయంతో కూడుకున్న వ్యాఖ్యలు ఆ ధర్మంలో ఎక్కువగా ఉన్నాయి.
''అందుకే మహాత్మగాంధి ఇస్లాం బోధనలను కల్తీ లేనివనీ, కాగా హిందువులు ధార్శని కంగా, జీవన విధానం రీత్యా అయోమయంలో ఉన్నారని అంగీకరించవలసి వచ్చింది.'' ''హిందూ ధర్మంలో మనిషికి అత్యవసరమైన బోధనలు అనవసర వ్యాఖ్యలు కలగలిసి ఉన్నాయి. కాగా, ఇస్లాంలో మనిషికి అత్యవసరమైన బోధనలు ఒక క్రమపద్ధతిన ఉన్నాయి.'' 
నా ఈ మాటలు ఆ హిందూ పండితుని సంతృప్త పరచాయి. అయితే ముహమ్మద్‌(స) ను దైవప్రవక్తగా తానెందుకు అంగీకరిం చాలని ప్రశ్నించాడు.
నేను చెప్పాను, ''మీరు మీ తోటలోని పూలకన్నా ఇస్లాం బోధ నలు మీ హృదయానికి దగ్గరగా ఉన్నాయని ఒప్పుకుంటే, ఈ ఇస్లాం బోధనల పూదోటకు తోటమాలి లాంటివారు మహా ప్రవక్త. ఆయన మీ జీవితవిధానానికి అవసరమైన సలహాలిస్తారు. చెడులు, అనవసర విషయాల గురించి హెచ్చరిస్తారు. చెడులను దూరం చేసుకోండని, మంచిని పెంపొందించండని బోధిస్తారు.
''ఎవరయినా బోధకుడు చెడు గురించి, దుర్మార్గం గురించి హెచ్చరించినా మీరు ఆ చెడులను స్వీకరిస్తారా?
''అతడు మీకు సన్మార్గాన్ని చూపితే మీరు ముఖం తిప్పు కుంటారా?''
నా ఈ ప్రశ్నలకు ఆ హిందూ పండితుని మౌనమే సమాధాన మయ్యింది. అతడి మౌనం అతడి మనోభావాలకు అద్దం పట్టింది. అతని మనస్సు మెత్త బడిందని, సన్మార్గాన్ని స్వీకరిం చడానికి సిద్ధమవుతోందని అర్థమయ్యింది.
ఆ తర్వాత నేను అతనితో ఇంకా మాట్లాడుతూ హిందూ సమాజం ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని సమాజం, మిగి లిన ప్రపంచంతో పోల్చితే విశాల దృక్పథం కలిగిన సమాజమనీ, ఒక మంచి బోధకుడు చెప్పే మాటలను అతడు ఏ జాతికి, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా హిందువులు అంగీకరిస్తారని అన్నాను. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్‌(స) బోధనలు సత్యాలు, మంచి మాటలని గుర్తిస్తే మరుక్షణం హిందువులు ఆయన్ను తమ ప్రవక్తగా అంగీకరిస్తారని అన్నాను నేను.
ఆ హిందూ పండితుడు దీర్ఘమైన ఆలోచనతో ఆలకించాడు. దైవం తలిస్తే, సమీప భవిష్యత్తులో హిందువులు కూడా మహాప్రవక్త ముహమ్మద్‌(స)ను తమ ప్రవక్తగా అంగీకరిస్తారు. 
(ఆ సమయం ఎంతో దూరంలో లేదు ఇన్‌ షాఅల్లాహ్‌ా!)

ముస్లిమేతరుల హక్కులు మరియు ఇస్లాం

ఒకే నేలన పండిన ఆహారాన్ని భుజిస్తాము. ఒకే సెలయేటి నీటిని త్రాగుతాము. ఒకే వాతావరణంలో గాలిని పీల్చుకుంటాము. అంటే మనిషి సంఘజీవి అన్న మాట. మనిషి సంఘజీవి అన్న మాట ఎంత నిజమో 'మనిషి తనకు తెలియనిదానికి శత్రువు' అన్న మాట కూడా అంతే నిజం. మనమందరం మన సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ మన ఇరుగుపొరుగువారి ఆలోచనలు ఎలా సాగుతున్నాయో, వారి ఆచరణలకు ముఖ్యమయిన మూలాధారాలేవో కొంత వరకయినా తెలుసుకోవ డం ఎంతయినా అవసరం. దాని వల్ల మరేమీ కాకపోయినా మన చుట్టుప్రక్కల వాతావరణంలో సాను కూలతను, సహిష్ణుతను, సుహృద్భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. 
 మనం సమాజంలోనే నివసిస్తున్నాము. మన జీవితాలు మన ప్రమేయం లేకూండా అనేక మంది జీవి తాలతో ముడిపడి ఉన్నాయి. అది మనకు ఇష్టమయినా, కష్టమయినా, ప్రత్యక్షంగానయినా, పరోక్షంగాన యినా మనమందరం 
ఒకే నేలన పండిన ఆహారాన్ని భుజిస్తాము. ఒకే సెలయేటి నీటిని త్రాగుతాము. ఒకే వాతావరణంలో గాలిని పీల్చుకుంటాము. అంటే మనిషి సంఘజీవి అన్న మాట. మనిషి సంఘజీవి అన్న మాట ఎంత నిజమో 'మనిషి తనకు తెలియనిదానికి శత్రువు' అన్న మాట కూడా అంతే నిజం. మనమందరం మన సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ మన ఇరుగుపొరుగువారి ఆలోచనలు ఎలా సాగుతున్నాయో, వారి ఆచరణలకు ముఖ్యమయిన మూలాధారాలేవో కొంత వరకయినా తెలుసుకోవ డం ఎంతయినా అవసరం. దాని వల్ల మరేమీ కాకపోయినా మన చుట్టుప్రక్కల వాతావరణంలో సాను కూలతను, సహిష్ణుతను, సుహృద్భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోణంలో చూస్తే 'ఇతరుల మతం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంతే మంచిదేమో' అనుకునే మనలోని ప్రతి వ్యక్తి ప్రపంచంలోని అన్ని మతాలను వాటి సర యిన రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నించడం విశ్వ శాంతి కోసం మార్గం సుగమం చేెసుకోవడమే అవుతుంది. తద్వార పరస్పర అవగాహనకు, మనకు దగ్గరగా, దూరంగా ఉన్న పరిసరాలను ఉత్తమ రీతి లో తెలుసుకోవడానికి, పరస్పరం ఒండొకరిని అర్థం చేసుకొని మసలుకొనే మార్గమేర్పడుతుంది. అప్పుడు అస్పష్టత స్థానంలో, స్పష్టత, అపార్థం స్థానంలో అర్థం చేెసుకునే తత్వం అలవడి, వారిధులపై వారధులు వెలిసి, అపోహల పొరలు తొలగి, గోడలకి బదులు ఒండొకరి మనసును చేరుకునే వంతెనలు నిర్మితమవుతాయి. అదే మన పుట్టుక పరమార్థం కూడాను. ''మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము'' అని అంటోంది ఖుర్‌ఆన్‌. (49:13)

ఇస్లాం రూపంలో ఏ కారుణ్య మేఘాలను అల్లాహ్‌ా మానవాళికి అందించాడో అది - ముస్లిములనీ, మస్లిమేతరులనీ, ఆస్తికులనీ, నాస్తికులనీ, అస్పృశ్యులనీ, అత్యున్నతులనీ తేడా చూపక అందరికి తన కారుణ్య ఒడిలో సేద తీరే అవకాశం ఇస్తుంది. సామాజిక, రాజకీయ, గృహ హింసని, దౌర్జన్యాన్ని రూపు మాపి అహింసను, ప్రశాంతతను, న్యాయాన్ని సమపాళ్ళలో అటు స్త్రీలకు ఇటు పురుషులకు అందిస్తుం ది. మానవులందరూ ఒకే దేవుని దాసులు, ఒకే మానవ జంట నుండి ఉనికిలోకి వచ్చినవారుగా పరస్ప రం సోదరులని, వారు ఒండొకరి పట్ల ప్రేమ భావం, త్యాగ భావం కలిగి ఉండాలని బోధిస్తుంది. 'ఎవరు కరుణించరో వారు కరుణించబడర'ని నొక్కి వక్కాణిస్తుంది. ఆ కరుణను మానవుల వరకే పరి మితం చేయక సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల సాత్విక ప్రేమ కలిగి ఉండాలని మరీ మరీ ఉద్ఘాటిస్తుంది. 'తన కోసం దేన్నయితే ఇష్టపడతామో దాన్నే తన తోటి సోదరుని కోసం సయితం ఇష్టపడనంత వరకు దైవ ప్రేమకు పాత్రులం కాలేమ'ని హితవు పలుకుతుంది. ఇరుగుననున్న వారు - వీరా, వారా అన్న తేడా లే కుండా 'పొరుగుననున్న వారు పస్తులుండగా తాను మాత్రం కడుపార భోంజేసినవాడు విశ్వాసి కాజా లడ'ని హెచ్చరిస్తుంది. 'ఎవరి హింస నుండి పొరుగువారు సురక్షితంగా ఉండరో అతను మోమిన్‌ కాద' ని తీర్మానిస్తుంది. అది చెప్పిన ప్రతిదాన్నీ నూటికి నూరుపాళ్ల్లు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు బ్రతి కుండగానే పాటించి చూపడమే కాక, అటువంటి ఓ సువ్యవస్థను, సత్సమాజాన్ని స్థాపించి మరీ వెళ్ళారు. ఇక ఇస్లాంలో ముస్లిమేతరుల హక్కుల గురించి ప్రస్తావిమచుకున్నట్లయితే -

ఒక వేళ మనకు ముస్లిమేతర బంధువులుండి వారితో మనం ఎలా వ్యవహరించాలన్న సందేహం కలి గితే ''నాకు కృతజ్ఞుడవై ఉండు. నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు...ఒకవేళ నీవు ఎరుగని వారి నెవరినయినా నాకు భాగ్యస్వామిగా చేర్చు అని వారు నిన్ను ఒత్తిడి చేస్తే మాత్రం వారి మాట వినకు. వారితో ప్రపంచంలో ఉన్నంత వరకు ఉత్తమ రీతీలో వ్యవహరించు''. (దివ్యఖుర్‌ఆన్‌- 31: 15) అంటూ మీ ఆ సంశయాన్ని దూరం చేస్తుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు జీవితపు అన్ని రంగాల్లోనూ ఆది మార్గదర్శకత్వం వహిస్తుంది.

స్వయంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) రోగగ్రస్థుడయిన యూద బాలుడ్ని పరామర్శించడానికి వెళ్ళారు. పరమ కపటి అయిన అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉబై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అతని కుమారుడు తన నాన్నపై కప్పడానికి ప్రవక్త (స) వారి కంబలి అడిగితే ఇచ్చారు. మనిషి మనిషిగా చూడాలన్న విష యాన్ననుసరించి ఒక యూదుని శవం పోతుండగా లేచి నిలబడ్డారు. కొందరు సందేహం వెలిబుచ్చగా 'తనూ మనిషే కదా' అని వారి నోళ్లు మూయించారు. యూదులు -'అ్సలాము అలైకుమ్‌'-మీపై శాంతి కురియుగాక! అనడానికి బదులు 'అస్సాము అలైకుమ్‌'-మీకు చావు మూడుగాక! అని శపించినా ప్రవక్త (స) వారి మన్నించారు. విషం పెట్టి చంపాలని ప్రయత్నించిన మరో యూద మహిళను ఆయన క్షమిం చారు.
బీదలకు, అవసరార్థులకు సహాయం చేసే విషయంలో ఇస్లాం ముస్లిమేతరులను ఉపేక్షించలేదు. దివ్యఖుర్‌ఆన్‌ మరియు హదీసు గ్రంథాలలో ఖైదీల పట్ల ఉత్తమంగా వ్యవహరించడి అని బోధించబడింది. ఆ ఖైదీలు అధిక శాతం ముస్లిమేతరులే అయి ఉండేవారు. స్వయంగా మహా ప్రవక్త (స) ఏదయినా మంచి వంటకం, కూర వంటివి ఇంట్లో చేస్తే మొదట పొరుగున ఉన్న ముస్లిమేతరుల ఇళ్లకు పంపేవారు. వారికి ఆర్థిక అవసరం ఏమ యినా ఉంటే తాను ముందుండి వారి అవసరాన్ని తీర్చేవారు. వేళ విశేషాన్ని బట్టి వారికి కానుకలు కూడా పంపేవారు. రోజూ అక్కసుతో తన మీద చెత్త చెదారం పోసే ఓ మహిళ మంచాన పడితే ముందు తానే వెళ్ళి పరామర్శించారు. ఈ సంఘటనల దృష్ట్యా ముస్లిమేతర సోదరులకు సద్ఖతుల్‌ ఫిత్ర్‌ సయితం ముస్లిమేతర సోద రులకు ఇవ్వవచ్చని, ఖుర్బానీ మాంసాన్ని కూడా వారికి పంచి పెట్టవచ్చు అని అభిప్రాయపడ్డారు. కొందరు ధర్మవేత్తలు. అలాగే అవసరార్థం ముస్లిమేతర సోదరులకు ప్రభుత్వ ఖజానా నుండి సహాయం అందించి దాఖ లాలు కూడా కోకొల్లలు.

కయ్యానికి కాలు దువ్వని, యుద్ధం చేయని ముస్లిమేతరుల ప్రాణం, మానం, ధనం ఇస్లాం దృష్టిలో ముస్లింల ప్రాణం, మానం, ధనం వంటిదే. ''ఏ ముస్లిమేతర సోదరుడయితే తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో నేను అతని వాగ్దానాన్ని గౌరవిస్తాను'' అని మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) చెప్పడమే కాక, ''ఒక ముస్లిం వ్యక్తి ఒక 'జిమ్మీ' - ఇస్లామీయ పరిపాలనా పరిధిలో నివసించే ముస్లిమేతర సోదరుడ్ని హత్య చేస్తే అటువంటి ముస్లిం స్వర్గపు సువాసన కూడా ఆఘ్రాణించ లేడు'' అని హెచ్చరించాడు. ఆయన కక్షను, వివక్షను పాటించలేదు. ముస్లిం - ముస్లిమేతరుని ప్రాణాలు సమానమయినవి ప్రకటించారు. అంతే కాదు, ఒక స్వతంత్య్ర ముస్లిం రక్తానికి బదు లుగా ఎంత పరిహారం చెల్లించబడుతుందో అంతే రక్త పరిహారం ఒక ముస్లిమేతరునికి కూడా చెల్లించబడుతుం ది అని నిర్ణయించారు. ఒక ముస్లిం సొమ్మును దొంగలిస్తే ఏ శిక్ష పడుతుందో, ఒక ముస్లిమేతరుని ఆస్తిని దొం గలిస్తే కూడా అదే శిక్ష పడుతుంది. ఒక ముస్లిం నుండి తీసుకోబడిన బాకీని చెల్లించని పక్షంలో ఏ విధమ యినటువంటి చర్యలు తీసుకోబడతాయో అలాంటి చర్యలే ఒక ముస్లిమేరుని అప్పుని తీర్చని పక్షంలో సయితం తీసుకోబడతాయి. ఇదే పరంపర నలుగురు ధర్మ ఖలీఫాల కాలంలో సయితం అమలు పర్చబడింది. సారాయి, నిషిద్ధ జంతువుల మాంసం ఒక ముస్లిం దగ్గర ఉండి మరో ముస్లిం వాటిని పారేసినట్లయితే దానికి ఎలాంటి నిందారోపణ ఆ వ్యక్తిపై ఉండదు. కానీ అదే అవి మరో మతంలో ధర్మసమ్మతంగా పరగణించబడి, ఒక ముస్లి మేతర సోదరుని వద్ద ఆ వస్తులు ఉండగా ఒక ముస్లిం వాటిని వృధా చేసినట్లయితే వాటి ధర ఆ ముస్లిం చెల్లించాల్సి ఉంటుంది.

ఒక మతంగానీ, మత అవలంబీకులుగానీ-ఇతర మతావలంబీకుల పట్ల సమరస భావం కలిగి ఉండటం, వాటిని గౌరవిమచడం అనేది ప్రధానమయిన అంశం. ''ధర్మంలో ఎలాంటి బలవంతం, బలాత్కారం లేదు''అని సైద్ధాంతిక పరంగా బలమయిన పునాదుల మీద ప్రతిపాదించిన తొలి ధర్మం ఇస్లాం మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) మదీనా వచ్చిన తర్వాత చేసుకున్న ఒప్పందం ప్రకా రం, ప్రతి ఒక్కరూ వారి మతం ప్రకారం నడుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటారన్నది ప్రధానాంశం. ఇతర జాతులు, తెగలు, సముదాయాలు ఆరాధించే దైవాల గురించి చెడుగా ప్రస్తావించడాన్ని ఖుర్‌ఆన్‌ బహి రంగంగా వారించింది. అంతేక కాదు, ప్రతి జాతిలోనూ తన ప్రవక్తలను అల్లాహ్‌ా పంపినట్లు ఖుర్‌ఆన్‌ ప్రకటిం చింది. కాబట్టి, ఇతర మార్గదర్శకుల, ప్రవక్తల, సంఘ సంస్కర్తల పట్ల గౌరవభావంతో మెలగాలనీ, వారి విష యంలో తమ నోటిని, ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలనీ అది నొక్కి వక్కాణిస్తోంది. అలా ప్రజల చేత పూజలందుకుంటున్న వారు దైవప్రియులు, దైవప్రవక్తలు అయి ఉండవచ్చు అని కూడా తెలియజేస్తుంది. అలాగే ఇస్లామీయ పరిపాలనా సమాజంలో మైనారిటీల పర్సనల్‌లాకు అన్ని విధాల మద్దతు, రక్షణ ఉంటుంది.

ఇదే విధమయినటువంటి ఔదార్యాన్నే ఇస్లాం ముస్లిమేతరుల ప్రార్థనాలయాల విషయంలో సయితం కనబరు స్తుంది. మామూలు సమయంలోనే కాక, యుద్ధ సమయాల్లో సయితం ముసిలమేతరుల ఆరాధనాలయాలను గానీ, చర్చీలనుగానీ, అగ్నిపూజారుల మందిరాలనుగానీ కూల్చరాదని స్వయంగా ప్రవక్త (స) వారు ఆదేశించడ మేకాక, అటువంటి ఒక క్రైస్తవ బృందం మదీనా రాగా, వారిని మస్జిదె నబవీలో నివసింపజేయడమేకాక, వారు అక్కడ వారి పద్ధతిలో ప్రార్థన చేసుకునే సౌకర్యాన్ని కూడా కలుగజేశారు. మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) వారి ఈ బోధనల, తర్వాతి కాలపు ధర్మఖలీఫాల ఆదర్శాల వెలుగులో ఇస్లామీయ ఫిఖహ్‌ావేత్తలు ముస్లిమేత రుల పట్ల సమరస భావం, సోదరభావం సహనం కలిగి ఉండాలని, మత స్వేచ్ఛ ప్రతి వ్యక్తి జన్మ హక్కని తీర్మా నించడమే కాక, ముస్లిమేతర సోదరుని నుండి అన్యాయంగా కాజేయబడిన భూమిపై నమాజు చేెయడంగానీ, మస్జిదు నిర్మించడంగానీ అధర్మం అని ఖరారు చేశారు. ఈ నేపధ్యంలో అలోచనాపరులయిన వారు - 'ఇస్లాం మానవాళి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు పరిష్కారమేగానీ, సమస్య కాదు; కాజాలదు' అన్న అక్షర సత్యం గురించి సునిశితంగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాము....!

Kuwait marked t

Saturday, June 16, 2012

My Toor to Zoo in Kuwait Slideshow Slideshow

My Toor to Zoo in Kuwait Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ My Toor to Zoo in Kuwait Slideshow Slideshow ★ to Kuwait City. Stunning free travel slideshows on TripAdvisor

Friday, June 8, 2012

సకల మేళ్ళు నమజులోనే ఉన్నాయి

మానవ మనుగడకు సంబంధించిన సకల మేళ్ళు నమజులోనే ఉన్నాయి

 ఎలా అంటారా! చూడండి...
 నమాజు ఉపాధిని లాక్కు వస్తుంది
 నమాజు ఆరోగ్యాన్ని కాపాడుతుంది నమాజు ఆయుష్షును పెంచుతుంది 
 నమాజు కీడును తొలగిస్తుంది
 నమాజు ప్రమాదాన్ని అరికడుతుంది 
 నమాజు ఆత్మకు శక్తినిస్తుంది
 నమాజు ముఖానికి తేజస్సునిస్తుంది
 నమాజు బద్దకాన్ని దూరం చేస్తుంది
 నమాజు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది
 నమాజు అవయవాల్లో చైతన్యాన్ని నింపుతుంది 
 నమాజు హృదయానికి శక్తినిస్తుంది
 నమాజు మనోసీమను విశాల పరుస్తుంది
 నమాజు హృదయానికి కాంతిని, క్రాంతిని ఇస్తుంది
 నమాజు వరానుగ్రహాలను కాపాడుతుంది
 నమాజు దైవానుగ్రహానికి శిక్షకి దూరంగ్ ఉంచుతుంది
 నమాజు శుభాన్ని సమృద్ధిని కలుగజేస్తుంది
 నమాజు సాతానును తరిమికొడుతుంది
 నమాజు నరకయాతనల నుండి కాపాడుతుంది
 నమాజు స్వర్గంలో ప్రవేసిమ్పజేస్తుంది 
 నమాజు అల్లాః కు దగ్గర చేస్తుంది 
 నమాజు దైవ దివ్య దర్శనా భాగ్యాన్ని ప్రసాదిస్తుంది

Thursday, May 24, 2012

ఓ మానవుడా!


ఓ మానవుడా! అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మానవజాతి కోసం సృష్టికర్త పంపిన అంతిమ సందేశం

 ఓ మానవులారా! సృష్టకర్త మీ కోసం దివ్యఖుర్ఆన్ రూపంలో పంపిన ఋజుమార్గపు మార్గదర్శకత్వాన్ని ఎప్పుడైనా పరిశీలించారా? రండి, ఖుర్ఆన్ తెచ్చిన దివ్యసందేశం ద్వారా పరలోకపు భయంకర నరకశిక్ష నుండి కాపాడు కోవటానికి ప్రయత్నిద్దాం. ఓ మానవులారా! ‘ఇస్లాం శాంతిని బోధిస్తుంది, శాంతి వైపునకు పిలుస్తుంది’ అని అన్నట్లయితే ‘ఇతర మతాలు కూడా శాంతినే బోధిస్తున్నాయి కదా!’ అంటారు. ఇదే వాస్తవమైతే ప్రపంచంలో జరిగుతున్న అశాంతి, హింస, అరాచకాలు, హత్యాచారాలు, దోపిడీలకు కారణం ఏమిటి? ఎటువంటి పక్షపాతం లేకుండా నిజాయితీగా ఆలోచించితే, వాటికి అసలు కారణాలు ‘ధనం, సంతానం, కీర్తిప్రతిష్ఠలు, స్త్రీ, పురుషుడు.....అందులో మరీ ముఖ్యమైనది ధర్మం’ అనే పచ్చినిజాన్ని కనిపెట్టగలరు. అన్ని మతాలు ‘సర్వలోకాలకు సృష్టికర్త అయిన దైవం ఒక్కడే’ అని ఎలుగెత్తి చాటుతున్నప్పుడు, ప్రపంచ అశాంతికి ముఖ్యకారణం ధర్మం ఎలా అవుతుంది? అనే సందేహం మనసులోనికి రావచ్చు. కాని ఇది ముమ్మాటికీ నిజం. అనేక మతాల ప్రకటనలకు మరియు వారి ఆచరణలకు మధ్య, భూమ్యాకాశాల నడుమ ఉన్నంత తేడా ఉన్నది. కొన్ని అపోహల వలన, అజ్ఞానం వలన ఆచరణలో వారు ఎందరినో దైవాలుగా భావించి పూజలు, పురస్కారాలు చేస్తున్నారు. వాస్తవానికి సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలంలో ఒక ఉత్తమమైన మానవుడిని తన దూతగా ఎన్నుకుని, అతడి ద్వారా ప్రజలకు మార్గదర్శకత్వాన్ని పంపియున్నాడు. ఇంకా ఆ ప్రవక్తల ద్వారా ‘మీ ఆరాధ్యదైవం ఒక్కడే’ అనే దివ్యసందేశాన్నిచ్చి అక్కడి ప్రజలను శాంతిమార్గం వైపునకు పిలవమని ఆదేశించాడు. అయితే అక్కడి ప్రజలు కొంత కాలం వరకు ఆ యా ప్రవక్తల సందేశాన్ని ఆచరిస్తూ, వారి మరణానంతరం ఆ దివ్య బోధనల్ని వదిలి, తమ తమ ఇష్టానుసారం ఆ సందేశహరులనే లేదా ఆ కాలంలోని కొంతమంది పుణ్య పురుషులనే దైవాలుగా చేసుకున్నారు. ఇంకా వేర్వేరు వర్గాలుగా, మతాలుగా విడిపోయి, అశాంతితో జీవించ సాగారు. పూర్వపు దైవప్రవక్తలు, దివ్యగ్రంథాలు ‘మీ ఆరాధ్యదైవం ఒక్కడే’ అని మాటిమాటికీ బోధించిన ఆ దివ్యసందేశాల్ని మరల ఖుర్ఆన్ రూపంలో మొత్తం మానవజాతి కోసం చిట్టచివరిసారిగా సృష్టికర్త పంపినాడు. అయితే పూర్వపు దివ్యసందేశాలు కాలగర్భంలో కలిసిపోయినట్లు మరల తిరిగి జరగకుండా, ఈ అంతిమ దివ్యసందేశాన్ని (ఖుర్ఆన్) ను సృష్టికర్త స్వయంగా తన సంరక్షణలో తీసుకున్నాడు. ఖుర్ఆన్ లో అనేక సార్లు చేయబడిన స్పష్టమైన ప్రకటన మరియు అవతరించిన నాటి నుండి నేటి వరకు అంటే దాదాపుగా 14 శతాబ్దాల సుదీర్ఘ సమయంలో ఎటువంటి మార్పులకు, చేర్పులకు గురికాకుండా అసలైన రూపంలో, అవతరించిన భాషలో, అందరికీ అందుబాటులో ఉండటం కంటే ఇంకేమి ఋజువులు కావాలి? మరి అటువంటి మహాద్భుతమైన దివ్యఖుర్ఆన్ సందేశాన్ని మనం నిజాయితీగా ఎందుకు పరిశీలించకూడదు? ఇంకా, కేవలం సర్వలోకసృష్టికర్తనే ఆరాధ్యుడిగా ఆరాధించటానకి ఏ అజ్ఞానం అడ్డుపడుతున్నది? హృదయాంతరాలలోని భావాలను సైతం పసిగట్టశక్తిగల ఆ ఏకైక ఆరాధ్యుడి భయభక్తుల వలన, అశాంతి, హింస, అరాచకాలు, హత్యాచారాలు, దోపిడీలు నశించి ప్రపంచంలో శాంతి స్థాపించబడకుండా ఉంటుందా? ఓ మాష్టారూ!........బాబూ!.........హలో...... ఇలాంటి పిలుపు వినగానే పిలిచేది అపరిచితమైన గొంతైనా సరే, ఒక్కక్షణం ఆగి, పిలుపు వచ్చిన దిశగా, ఎవరు పిలుస్తున్నారా? అని కుతూహలంగా చూస్తాము. పరిచయం లేకపోయినా, ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని, ఆ తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకుంటాం. అలాగే నిండు సభలో ప్రసంగిస్తున్న మంత్రి, ఓ ప్రజలారా! అనగానే మన పంచేంద్రియాలను అదుపులోకి తెచ్చుకుని, చాలా శ్రద్ధగా ఏమి చెబుతున్నాడో వింటానికి ప్రయత్నిస్తాము. కొత్తగా టాక్సులేమైనా విధిస్తున్నాడా, ధరలేమైనా పెరగబోతున్నాయా, ఏవైనా కొత్త స్కీములు రాబోతున్నాయా, మన దైనందిన జీవితంలో లాభం చేకూర్చే విషయాలేమైనా చెబుతాడేమోనని శ్రద్ధగా వింటాము. అందరి కంటే ముందు తనే ఆ విషయాలను తెలుసుకుని లాభం పొందాలని శాయశక్తులా ప్రయత్నిస్తాము. అందుకని కళ్ళు, చెవులు అప్పగించి మరీ ఏకాగ్రతతో ప్రసంగాన్ని వింటాము. ఇంకా మనలో చాలా మంది ఉదయం లేవగానే మొట్టమొదట తాజావార్తలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. ‘వాటిలో ఏవి లాభదాయమైనవి, ఏవి కష్టాలకు గురిచేసేవి, షేర్ మార్కెట్ స్థితి ఎలాగుంది’ మొదలైన గమనిస్తూ, దగ్గర వాళ్ళతో వాటిలోని మంచిచెడ్డల గురించి ఆ రోజంతా చర్చించుకుంటూనే ఉంటాము. వార్తల్లో తెలిపిన జాగ్రత్తలు (పవర్ కట్, నీటి సమస్యలు, ట్రాఫిక్ మళ్ళింపులు....) వెంటనే తీసుకోవటానికి ప్రయత్నిస్తాము. అంటే పిలుస్తున్న వ్యక్తికి, తాజా వార్తలకు లేదా ప్రసంగిస్తున్న లీడరుకు ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేది వారు పిలుస్తున్న పరిస్థితులను, వార్తలను లేదా వారి ప్రసంగ విషయాన్ని బట్టి తేల్చుకుంటాము. లేదా ప్రసంగించే వారి స్థాయిని బట్టి నిర్ణయించుకుంటాము. అంతటితో ఆగకుండా తోటివారి ద్వారా వాటిలోని సత్యాసత్యాలను తెలుసుకోవటానికి, సందేహాలను తీర్చుకోవటానికి తీవ్రప్రయత్నాలు చేస్తాము. అంతే కాని గ్రుడ్డిగా ముందడుగువేయం. అంటే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు అది తనకు సంబంధించినదా - లేదా, లాభం కలిస్తుందా - లేదా, నష్టం కలిగిస్తుందా - లేదా అనేది ఆ విషయాన్ని విని లేక చదివి అర్థం చేసుకుని, లాభనష్టాలు, కష్టసుఖాలు బేరీజు వేసుకుని మరీ నిర్ణయం తీసుకుంటాం. ఇది దాదాపు గా ప్రతి ఒక్కరు ప్రపంచ జీవిత విషయాలలో చేస్తుంటారు. కాని, ఇదే పద్ధతిని ధార్మిక విషయాలలో ఎంత వరకు వర్తింపజేస్తున్నారు? ఓ మానవుడా అని స్వష్టంగా పిలుస్తున్న దివ్యసందేశాన్ని ఎందుకు శ్రద్ధగా వినటానికి ప్రయత్నించటం లేదు? పరలోక జీవితంతో పోలిస్తే ఈ ప్రపంచ జీవితకాలం చాలా చాలా స్వల్పమైనది. మరి అటువంటి పరలోక జీవిత సాఫల్యం కోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఆరాధనలకు అర్హుడైన అసలు సృష్టికర్త ఎవరో, మానవజాతి కోసం ఆయన ఆదేశాలు ఏమిటో తెలుసుకోవటానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ప్రతి కాలంలో, ప్రతి ప్రాంతంలో ఆయన మానవజాతి కోసం అవసరమైన సందేశాలు పంపాడు. కాని మానవులు వాటిని తమ ఇష్టానుసారంగా మార్చివేయటమే లేకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకండా కఠిన నియామాలు పెట్టి, దాచేయటమే జరిగినది. ఇక చివరిగా సృష్టికర్త తన సందేశాన్ని పంపుతూ, దాని సంరక్షణ బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. చివరి వరకు ఈ సందేశాన్ని ఎవ్వరూ మార్చలేరని, దాచలేరని స్పష్టమైన ప్రకటన చేసాడు. గత 14 శతాబ్దాల దీర్ఘకాలంలో అవతరించిన అరబీ భాషలోనే యధాతథంగా ఎటువంటి మార్పుచేర్పులకు గురికాకుండా ఉండటమే ఇందుకు సాక్ష్యం. మరి, అటువంటి దివ్యమైన చిట్టచివరి సందేశమైన ఖుర్ఆన్ లో సమస్త మానవజాతి కోసం మన సృష్టికర్త ఏమి ప్రకటించాడనేది తెలుసుకోవటానికి ప్రయత్నించక పోవడం ఎంతటి అవివేకమౌతుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి, రండి, ముందుకు రండి! అందులోని సత్యమైన విషయాలను తెలుసుకోండి. ఓ మానవులారా! .....ఓ మానవులారా! .....ఓ మానవులారా! ..... అనే సృష్టికర్త పిలుపు దివ్యఖుర్ఆన్ లో అనేక చోట్ల ఉన్నది. కాని అనేక మంది ప్రజలు, ఖుర్ఆన్ కేవలం ముస్లింల దైవగ్రంథమనే అపోహలో పడి ఘోరమైన తప్పు చేస్తున్నారు. దీనికి స్వయంగా తమకు తామే బాధ్యులు తప్ప ఇంతరులెవ్వరూ బాధ్యులు కారు. ఈనాడు కేవలం చేతివ్రేళ్ళ క్లిక్ తో ప్రపంచంలో ఏ మూల ఉన్న విషయాన్నైనా, పుస్తకాన్నైనా ఇంటర్నెట్ వంటి సౌకర్యాల ద్వారా అనుకున్నదే తడవుగా వెంటనే చదవ గలుగుతున్నాం. కాబట్టి, ఖుర్ఆన్ లోని విషయాలు తనకు తెలియవు అని చెప్పి తప్పుచుకునే అవకాశం ఎంతమాత్రం లేదు. ఒకవేళ సృష్టికర్త అంతిమ సందేశం చదవకనే మరణించనట్లయితే, దానికి బాధ్యులు మరెవ్వరో కాదు, స్వయంగా తమకు తామే అందుకు బాధ్యులు. మన జీవితసాఫల్యం కోసం పూర్తి సిలబస్, భోగభాగ్యాలు- సుఖసంతోషాలు శాశ్వతంగా ఉండే స్వర్గలోకంలోకి ప్రవేశించటానకి పాటించవలసిన నియమనిబంధనలు, భయంకర పరలోక నరకశిక్ష నుండి కాపాడుకోవటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ ప్రపంచంలో శాంతిని స్థాపించటానికి, తనకు మరియు ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవించటానికి అవసరమయ్యే సూచనలు - సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా చివరి దైవప్రవక్త ద్వారా ఖుర్ఆన్ రూపంలో అవతరించాయి. వాటిని చివరి ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) స్వయంగా ఆచరించి, హదీథ్ లో రూపంలో బోధించారు. మరి అటువంటి మహాద్భుతమైన, అమూల్యమైన ఈ అంతిమ దివ్యసందేశాన్ని (ఖుర్ఆన్) కనీసం ఒక్కసారైనా చదవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ‘24గంటలు సరిపోవట్లేదని చెబుతూ, రాత్రిపగలు ఎంతో హడావిడి పడుతూ, ఇంకెవరూ పొందని భోగభగ్యాలను, సుఖసంతోషాలను ఇక్కడే అనుభవించేయాలని అత్యాశకు పోవటం ఎంత వరకు సమంజసం? మరమనుషుల లాగా జీవిస్తున్న ఓ సోదరులారా! ప్రశాంతంగా ఒక్క క్షణం తన స్వంతాన్ని గురించి ఆలోచించండి. ఇక్కడి జీవితానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఏ క్షణంలోనైనా మరణించ వచ్చును. సమయమైపోయినట్లయితే, ఎంతటి గొప్పవాడైనా. ధనవంతుడైనా, పండితుడైనా ఒక్క గుక్క నీరు కూడా త్రాగలేడు, ఒక్క గింజ కూడా మింగలేడు. ఈ జీవితం కంటే పరలోక జీవితం శాశ్వతమైనది’ అనే విషయం తెలిసిన తర్వాత కూడా. మరి అక్కడి జీవితానికి అవసరమయ్యే జాగ్రత్తల గురించి ఆలోచించటానకి మన బిజీలైఫులో ఎప్పుడు ప్రయత్నిస్తాము?’ ఈ విశ్వవ్యాప్త సంక్లిష్ట సమస్యకు పరిష్కారంగా చిట్టచివరి దైవగ్రంథమైన ఖుర్ఆన్ సమస్త మానవజాతిని (వారే మతం అనుసరిస్తున్నా సరే) సంబోధిస్తూ, సత్యమార్గ సూచనలను అంటే ఏక దైవారాధన వైపుకు పిలుస్తూ, మానవ జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా విశదీకరిస్తూ, ఒకటిగా చేసే సర్వమానవశాంతి సందేశాన్ని ఇస్తున్నది. మర మనకోసం అవతింపబడిన సందేశం ఏమి చెబుతున్నదనే విషయాన్ని కనీసం ఒక్కసారైనా గమనించటానికి ప్రయత్నిద్దాం. దివ్యఖుర్ఆన్ లో మానవజాతిని ఉద్ధేశిస్తూ వెలువడిన కొన్ని సందేశాలు క్రింద ఇవ్వబడినవి. 01) పవిత్ర ఖుర్ఆన్ అవతరించిన నెల రమదాన్ నెల. మానవులందరికీ మార్గదర్శకత్వం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరు పరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. (ఖుర్ఆన్ 2:185) 02) సర్వ మానవులకు ఇదొక సందేశం. వారిని (మానవులను) హెచ్చరించాలనీ, యదార్ధంగా మీ ఆరాధ్య దైవం కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలనీ, జ్ఞానం ఉన్నవారు గ్రహించాలనీ ఇది (ఖుర్ఆన్) పంపబడినది. (ఖుర్ఆన్ 14:52) 03) మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్ముల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దైవం పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో, ఆ దైవానికి భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటం మానుకోండి. అల్లాహ్ (దైవం) మిమ్ముల్ని పరికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. (ఖుర్ఆన్ 4:1) 04) ప్రారంభంలో సర్వమానవులూ ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలను, ఆచారాలను సృష్టించుకున్నారు. నీ ప్రభువు తరపు నుండి ముందుగానే ఒక విషయం నిర్ణయించబడకుండా ఉన్నట్లయితే వారు పరస్పరం విభేదించుకుంటున్నటు వంటి విషయాన్ని గురించి ఎప్పుడో తీర్పు ఇవ్వబడి ఉండేది. (ఖుర్ఆన్ 10:19) 05) (చివరి)ప్రవక్తా! మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను పంపినప్పుడల్లా మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారి వైపునకు మేము మా సందేశాలను దైవ వాక్యాల ద్వారా పంపుతూ ఉండేవారము. మీకు (ప్రజలకు) తెలియకపోతే జ్ఞాపిక (దివ్యగ్రంథం) కలవారిని అడగండి. పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ, పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపిక(ఖుర్ఆన్) ను నీపై అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన సందేశాన్ని స్పష్టంగా వివరించటానికి, ప్రజలు కూడా ఆలోచించటానికి. (ఖుర్ఆన్ 16:43-44) 06) మేము మా సందేశాన్ని అందజేసే నిమిత్తం ప్రవక్తను పంపినప్పుడల్లా, అతడు తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశాన్ని అందజేశాడు, వారికి అతడు విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పటానికి. (ఖుర్ఆన్ 14:4) 07) మేము మా ప్రవక్తలను స్పష్టమైన సూచనలతో, హితోపదేశాలతో పంపాము. వారితో పాటు గ్రంథాన్నీ, త్రాసునూ అవతరింపజేసాము, ప్రజలు న్యాయంపై స్థిరంగా నిలబడాలని ఇనుమునూ దింపాము. అందులో మహత్తరమైన శక్తి ఉన్నది. ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఎందుకు చెయ్యబడినదంటే, ఆయనను(సృష్టకర్తను) చూడకుండానే ఎవడు ఆయనకూ, ఆయన ప్రవక్తలకూ సహాయపడతాడో అల్లాహ్ కు తెలియాలని, నిశ్చయంగా అల్లాహ్ (దైవం) ఎంతో దృఢమైన వాడు, శక్తిమంతుడూను. (ఖుర్ఆన్ 57:25) 08) నీకు (అంతిమ ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్ కు) పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపాము. మేము వారిని ఆలుబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్ అనుమతి లేకుండా ఏ సూచననూ స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. ప్రతియుగానికీ ఒక గ్రంథం ఉన్నది. అల్లాహ్ తాను రద్దు చేయదలచుకున్న దానిని రద్దు చేస్తాడు. తాను ఉంచదలచుకున్న దానిని స్థిరంగా ఉంచుతాడు. అసలు (మూల) గ్రంథం ఆయన దగ్గరే ఉన్నది. (ఖుర్ఆన్ 13:38-30) 09) అల్లాహ్ తోడూ (తెలుపబోయే ఆదేశపు ప్రాధాన్యతను సూచించటానికి కొన్నిచోట్ల ఇలా తనపైనే స్వయంగా శపధం చేసుకోవటం జరిగినది), (చివరి) ప్రవక్తా! నీకు పూర్వం కూడా ఎన్నో జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపియున్నాము. షైతాన్ చెడ్డపనులను వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు. ఆ షైతానే ఈనాడు వీరికి కూడా సంరక్షకుడై కూర్చున్నాడు. వీరు వేదనాభరితమైన (నరక) శిక్షకు అర్హులవుతున్నారు. మేము ఈ (ఖుర్ఆన్) గ్రంథాన్ని నీపా ఎందుకు అవతరింపజేశామంటే, వారు గురి అయిన విభేదాల యదార్ధాన్ని నీవు వారికి స్పష్టం చెయ్యాలని. ఈ గ్రంథం తనను (అల్లాహ్)ను విశ్వసించే వారికోసం మార్గదర్శకత్వం గానూ, కారుణ్యంగానూ అవతరించింది. (ఖుర్ఆన్ 16:63-64) 10) మేము అవతరింపజేసిన (ఖుర్ఆన్) స్పష్టమైన జ్ఞాన బోధనలుస ధర్మోపదేశాలు వాస్తవానికి మావవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తర్వాత కూడా వాటిని దాచే వారిని సృష్టికర్త (అల్లాహ్) తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు. (ఖుర్ఆన్ 2:159) 11) ప్రవక్తా! ఆయన ఈ (ఖుర్ఆన్) గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకువచ్చింది. మునుపు అవతరించిన గ్రంధాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం మానవులకు ఋజుమార్గం చూపటానికి తౌరాతు, ఇన్.జీల్ గ్రంధాలను అవతరింపజేశాడు. (ఖుర్ఆన్ 8:3) 12) మానవులారా! మీ ప్రభువు తరుపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చినది. మేము మీ వద్ద మీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. ఇక అల్లాహ్ (దైవం) మాటను ఆలకించేవారిని, ఆయన శరణు వేడుకునే వారిని అల్లాహ్ తన కరుణతో, తన ఆగ్రహంతో కప్పివేస్తాడు. వారికి తన వైపుకు వచ్చే ఋజుమార్గం చూపుతాడు. (ఖుర్ఆన్ 4:174-175) 13) మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్ముల్ని మీరు రక్షించుకోండి. ఏ తండ్రీ తన కుమారుడికి బదులుగా ముందుకు రాని, ఏ కుమారుడు తన తండ్రికి బదులుగా నిలబడని ఆ (ప్రళయం) రోజుకు భయపడండి, నిస్సందేహంగా అల్లాహ్ (దైవ) వాగ్దానం సత్యం. కనుక ఈ ఐహిక జీవితం మిమ్ముల్ని మోసానికి గురి చేయకూడదు. వంచకులు మిమ్నుల్ని అల్లాహ్ విషయంలో వంచనకు గురిచేయకూడదు. (ఖుర్ఆన్ 31:33) 14) మానవులారా! అల్లాహ్ (దైవం) మీకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోండి. అల్లాహ్ కాక, భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే మరొక సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు. అసలు మీరు ఎవరి వల్ల మోసపోతున్నారు? ఇప్పుడు ఒకవేళ (అంతిమ ప్రవక్తా!) వారు నిన్ను తిరస్కరిస్తున్నారు అంటే నీకు పూర్వం కూడా చాలామంది దైవప్రవక్తలు తిరస్కరింపబడ్డారు. వ్యవహారాలన్నీ చివరకు అల్లాహ్ వైపునకే మరలనున్నాయి. (ఖుర్ఆన్ 35:3-4) 15) ప్రవక్తా! వారితో ఇలా అను, “నేను ఈ ధర్మప్రచారానికి మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరను, నేను వంచకులలోని వాడను కాను. ఇది ఒక హితబోధ, విశ్వ ప్రజలందరికినీ, అచిరకాలంలోనే మీకు స్వయంగా దీని పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది.” (ఖుర్ఆన్ 38: 86-88) 16) ప్రవక్తా! మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా పంపాము. వారితో ఇలా అను “నా వద్ద వచ్చే దైవవాక్యాలు ఏమిటంటే, మీ దైవం కేవలం ఒక్కడే. ఇకనైనా మీరు విశ్వసించారా?” (ఖుర్ఆన్ 21:107) 17) “సృష్టిని మొదటిసారిగా చేసినవాడు ఎవడు? దానిని పున:సృష్టించేవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు మరొక దైవం ఎవడైనా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే మీ ఆధారాన్ని తీసుకురండి” అని అడగు. (ఖుర్ఆన్ 27:64) 18) బాగా తెలుసుకోండి. ఈ లౌకిక జీవితం ఒక ఆట. ఒక వినోదం, బాహ్య పటాటోపం, పరస్పరం ప్రగల్భాలు పలకటం, సంపద, సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరేమీ కాదు. (ఖుర్ఆన్ 57:20) 19) ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా, మీరు త్రాగే ఈ నీటిని మేఘాల నుండి మీరు కురిపించారా లేక దానిని కురిపించేవారము మేమా? మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పగా ఉండేలా చేయగలము. అలాంటప్పుడు మీరు కృతజ్ఞులై ఎందుకు ఉండరు? (ఖుర్ఆన్ 56: 68 – 70) 20) మీ కొరకు భూమిని నివాస స్థలంగా చేసినవాడూ, పైన ఆకాశాన్ని కప్పుగా నిర్మించినవాడూ, మీ రూపాన్ని తీర్చిదిద్దినవాడు, దానిని ఎంతో చక్కగా మలచినవాడూ, మీకు పరిశుభ్రమైన పదార్ధాలను ఆహారంగా ఇచ్చినవాడూ అల్లాహ్ యే కదా! ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. ఆ విశ్వప్రభువు అసంఖ్యాకమైన శుభాలు కలవాడు, ఆయనే సజీవుడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయననే మీరు వేడుకోండి. మీ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకం చేయండి. సకల ప్రశంసలూ సర్వలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కే చెందుతాయి. (ఖుర్ఆన్ 40:64-65) 21) మేము భూమిని పాన్పుగా చేశాము, అందులో పర్వతాలను మేకులుగా పాతాము, మిమ్ముల్ని (స్త్రీ - పురుషుల్ని) జంటలుగా సృష్టంచాము, మీకు నిద్ర ద్వారా సుఖం కలుగజేశాము, రేయిని తెరగా, పగటిని ఉపాధి సమయంగా చేశాము, మీపైన దృఢమైన ఏడు ఆకాశాలను నిర్మించాము, దేదీప్యమానంగా వెలిగే వెచ్చని దీపాన్ని సృష్టంచాము. ధాన్యం, కూరగాయలు పండేందుకు, దట్టమైన తోటలు పెరిగేందుకు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాము, ఇదంతా వాస్తవం కాదా? (ఖుర్ఆన్ 78:6-16) 22) మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము, చివరకు ఈ ఖుర్ఆన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభువు ప్రతిదానికి సాక్షి అనే విషయం సరిపోదా? తెలుసుకో! వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహం కలిగి ఉన్నారు. విను, ఆయన ప్రతి వస్తువునూ పరివేష్టించి ఉన్నాడు. (ఖుర్ఆన్ 41:53-54) 23) మానవులారా! మిమ్ముల్ని, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్ముల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ, సృష్టించినవాడూ, పై నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడూ ఆయనే (అల్లాహ్ యే), ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టకండి. (ఖుర్ఆన్ 2:21-22) 24) మానవులారా! నిశ్చయంగా అల్లాహ్ వాగ్ధానం సత్యమైనది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్ముల్ని మోసానికి గురిచేయకూడదు. ఆ మహావంచకుడు (షైతాన్) కూడా మిమ్ముల్లి అల్లాహ్ విషయంలో మోసగించగలగ కూడదు. (ఖుర్ఆన్ 10:9-10) 25) ఇదీ యదార్థం, విశ్వసించి, మంచి పనులు చేస్తూ ఉండిన వారిని వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా సరియైన మార్గంపై నడుపుతాడు. భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో వారి క్రింద కాలువలు ప్రవహిస్తాయి. అక్కడ వారు “ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు” అని స్తుతిస్తారు, “శాంతి కలుగుగాక” అని ప్రార్థిస్తారు. వారి ప్రతిమాటకు ముగింపు ఇలా ఉంటుంది. ప్రశంసలన్నీ సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే. (ఖుర్ఆన్ 10:9-10) 26) చూడండి! మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి వివేచనా కాంతులు వచ్చేశాయి. కనుక ఇక దృష్టిని వినియోగించుకునే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు. మరి గ్రుడ్డిగా వ్యవహరించే వ్యక్తి తనే నష్టపోతాడు. నేను మాత్రం మీకు కాపలావాణ్ణి కాను. (ఖుర్ఆన్ 6:104)

Saturday, January 21, 2012

desham

దేశానికి తిండి పెట్టేది ఒకరు
దేశాన్ని కాపాడేది మరొకరు