Tuesday, November 23, 2021

వినాశకర ఉపద్రవాలు - పండితుల ఫత్వాలు' అనే పుస్తకంలో నుండి ముఖ్యమైన ఫత్వాలు సంక్షిప్తంగా

 

 సేకరణ మరియు కూర్పు : షేఖ్ ముహమ్మద్ బిన్ హుసైన్

 పున:పరిశీలన : షేఖ్ సాలెహ్ ఫౌజాన్ అల్  ఫౌజాన్, (సుప్రీమ్ ఉలమా కౌన్సిల్ సభ్యులు)

అనువాదం: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ 

  


01) హర్తాళ్ళ గురించి ఆదేశం

ధర్నా, హర్తాళ్ళు  అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా, ప్రవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఉన్నా - వీటి కోసం షరీయతు పరమైన ఎలాంటి అనుమతి లేదు. ధర్నాల్లో, హర్తాళ్ళలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం వల్ల వారి న్యాయ అవసరానికి మించిన నష్టం వాటిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇమామ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమీన్ (రహ్మతుల్లాహి అలైహ్) :

 

02) అత్మహుతి దాడుల ఆదేశం

కొందరు పేలుడు పదార్థాలు ధరించి ముస్లిమేతరుల మధ్యకు వెళ్ళి పేల్చుకుంటూ ఉంటారు. ఇది ముమ్మాటికీ ఆత్మహత్యే. ఇలా తన్ను  తాను చంపుకునే వారు శాశ్వితంగా నరకంలో ఉంటారు. ప్రవక్త (స) వారి ఈ ప్రవచనం ఆధారంగా (బుఖారీ, కితాబులిబ్,బాబు షుర్బిస్సుమ్ వద్దవా..)

 

వాస్తవంగా అతను ఇస్లాం ధర్మం కోసం ప్రాణాలు కోల్పోలేదు, అలాగే పదుల, వందల సంఖ్యలో అమాయక ప్రజల్ని పొట్టన బెట్టుకున్నాడు. ఇలాంటి విధ్వంసకర చేష్టల వల్ల ఇస్లాం ధర్మానికి ఒరిగేదంటూ ఏమీ ఉండదు పైగా ఇస్లాం వంటి సంపూర్ణ జీవన సంవిధానం సందిగ్గాల మధ్య అపార్థం పాలవుతుంది.

కాబట్టి  ఇట్టి ఏ చర్య అయినా "శాశ్వతంగా నరకానికి ఆహుతి చేసే ఆత్మహత్యతో సమానమే. (అల్లాహ్ కాపాడుగాక!) ఇలాంటి వ్యక్తి షహీద్ అనబడడు. అతని మరణం షహాదత్ మార్గం మీద జరగనే లేదు.

ఇమామ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమీన్ (రహ్మతుల్లాహి అలైహ్)

 

03) కాఫిర్ అని చెప్పడం యొక్క ఆదేశం

ఒకర్ని అవిశ్వాసి 'కాఫిర్' అని ప్రకటించడం, పూర్తిగా షరీయతు సంబంధించిన అంశం, అలా నిర్ధారించే హక్కు కేవలం అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్త (స) కు మాత్రమే ఉంటుంది. ఒకరి ప్రతి మాటను, ప్రతి చేష్టను ఆధారంగా చేసుకొని కుఫ్ర్  ఫత్వా ఇవ్వడం, అతను ముస్లిం సంఘం నుండి వేరయిపోయాడు అనడం సమంజసం కాదు. ఒకరిని అవిశ్వాసి అని తీర్మానించే పూర్తి అధికారం అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్త (స) కుమాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఒకరిని ఇతను 'కాఫిర్' అని అనకూడదు. ఖుర్ఆన్ మరియు హదీసు స్పష్టమైన ఆధారాల వెలుగులో ఒకరిని అవిశ్వాసి అనడంలో అభ్యంతరం లేదు. ఒకరి విషయంలో కేవలం అనుమానం ఆధారంగా అలా అనేయడం గర్హనీయం. తద్వారా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి.

సుప్రీమ్ ఉలమా కౌన్సిల్ తీర్మానం: అల్లామా,ముహద్దిస్ షేఖ్ నాసిరుద్దీన్ అల్బానీ (రహ్మతుల్లాహి అలైహ్) :

 

ఒక వ్యక్తిని అతను చేసే నేరాలు, పాపాల ఆధారంగా కాఫిర్ అని తీర్మానించే అనుమతి లేదు, ఆవ్యక్తి హృదయ స్థితి తెలుసుంటే తప్ప.నిజంగా అతను ఉద్దేశపూర్వకంగానే అల్లాహ్ నిషేధించిన వాటిని నిషేధితాలుగా నమ్మడం లేదు అన్న నిర్ధారణ జరిగితే గానీ అలా చేయడానికి అనుమతి లేదు.

కాబట్టి, సదరు వ్యక్తి నిజంగానే అల్లాహ్ దస్తూరిని వ్యతిరేకిస్తున్నాడు అన్న నిర్ధారణ జరిగితే, అతను కాఫిర్,

ధర్మం నుండి వైదొలిగాడు అనడంలో అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇలా అనే వారిని ప్రవక్త (స) హెచ్చరించారు. " ఒక వ్యక్తి తన సోదరుణ్ణి 'ఓ కాఫిర్! అని సంభోదిస్తే, ఆ మాట ఇద్దరిలో ఒకరి విషయంలో నిజమవుతుంది." (బుఖారీ,ముస్లిం)

 

04) పండితుల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే ఆదేశం -

గౌరవనీయ పండితులు - షేఖ్ సాద్ బిన్ అలీఖ్, షేఖ్ ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం, షేఖ్ ఉమర్ బిన్ సలీం, షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లతీఫ్ మరియు షేఖ్ అబ్దుల్లాహ్ అల్ అంగరీ రహిమహుముల్లాహ్

చెప్పిన మాట :

 

పండితుల విషయంలో పరోక్ష నిందకు పాల్పడటం, వారి లోపాలను ఎంచే నిమిత్తం రంధ్రాన్వేషణ చేయడం, ముస్లింల మానం మర్యాదలతో చెలగాటమాడటం ప్రాణం తీసే విషంతో సమానం. భయంకరమైన రోగం, మరియు ఘోరమైన పాపం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: " తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు (చాలా పెద్ద) అభాండాన్ని,

స్పష్టమైన పాపభారాన్ని మోపిన వారవుతారు". (అల్ అహ్ జాబ్ : 58)

 

ఓ కవి అన్నట్టు : - మీ నాశనం గాను! వారిని తూలనాడటం మానండి. లేదా వారు పూరించి ఉన్న ఉన్నత స్థానాల్నయినా భర్తీ చేయండి (వారు చేసి ఉన్న ఘనకార్యాలను మీరు చేసి చూపించండి)

న్యాయ దృష్టిగల ఏ వ్యక్తి అయినా సరే, పై పేర్కొనబడిన ఖుర్ఆన్ వచనాలు హదీసు ప్రవచనాలు, మేధావుల మాటలు, నిపుణుల సలహాలు విన్న తర్వాత రేపు ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో హాజరయి తాను చేసిన ప్రతి కర్మకు సంఝాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్న స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి ఇతరుల మీద దృష్టి పెట్టడం మాని, స్వీయ సంస్కరణ మీద దృష్టిని కేంద్రీకరిస్తాడు.

 

05) ముస్లిం మరియు ముస్లిమేతర దేశాల్లో బాంబు పేలుళ్ళ ఆదేశం

రియాజ్ పట్టణంలోని 'ఉల్యా' ప్రాంతంలో జరిగిన పేలుళ్ళ నేపథ్యంలో సుప్రీమ్ ఉలమా కౌన్సిల్ ఇచ్చిన తీర్పు:

 

కౌన్సిల్ తీర్మానిస్తూ చెప్పిన మాట - ఇటువంటి దాడులు మహా భయంకర నేరం,ద్రోహం, శాంతి విఘాతక చర్య.దేశ శాంతి భద్రతలను,

ధర్మం, ధనం, ప్రాణ రక్షణను విచ్ఛిన్న పరచే మహా నేరం.  ఈ రాక్షస క్రీడ - మదినిండా ఓర్పలేనితనం, అసూయ,ద్వేషం,పగ, శత్రుత్వం, మంచి అంటేనే మంట వంటి అవలక్షణాలు గల మహా పాపిష్టి, పరమ దుర్మార్గుడి పనే అయి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటువంటి దాడులు మహా నీచమైనవి, ఘోరమైన పాపం అన్న విషయంలో ముస్లింల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఇవి, ఇటువంటి ఇతర చేష్టలను, నేరాలను, ఘోరాలను ఖుర్ఆన్ మరియు హదీసులు కూడా ఖండిస్తాయి అన్న విషయమూ విదితమే.

పాప భూయిష్టమైన, నేరపూరితమైన ఇటువంటి చర్యలను ఉలమా కౌన్సిల్ అధర్మంగా తీర్మానించడమే కాక, ఇటువంటి అమానవీయ,దుర్బుద్ధి, దుష్ట మార్గాలకు, సిద్ధాంతాలకు, నమ్మకాలకు అందరూ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటున్నది.

మనిషి మనసు అతన్ని చెడు వైపుకే లాగుతుంది అన్నది యదార్థం. మనిషి మనసు చేతుల్లో బంధీ అయితే, అది అతన్ని వినాశకర మార్గాల మీదకు ఈడ్చుకెళుతుంది. అప్పుడు రాబంధువుల్లా కాచుకొని కూర్చున్న శాంతి విఘాతక శక్తులు అతన్ని అందమైన పదజాలం, ఆర్థిక లాభాలతో ఆకర్షించి, తమ తుచ్ఛ ప్రయోజనాల కోసం పావుగా వాడుకోవడం సులభమైపోతుంది.

 

06) ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా విద్రోహ చర్య ఆదేశం

షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా (రహ్మతుల్లాహి అలైహ్) : అహ్లుస్సున్నహ్ వల్ జమాఅహ్ యొక్క ప్రసిద్ధ పంథా ఏమిటంటే, వారు- సంఘం నుండి వేరు పడటం,కత్తితో యుద్ధం చేయడాన్ని సుతరామూ అనుమతించరు. ఒకవేళ నిజంగానే పాలకులు, ప్రభుత్వం తరపు నుండి దౌర్జన్యం జరుగుతున్నా కూడా, ప్రవక్త (స) వారి ప్రసిద్ధ హదీసు దీనికి ఆధారంగా ఉంది. ఎందుకంటే గొడవలు, కలహాలు, అల్లర్లు - పాలకులు చేసే దౌర్జన్యం కన్నా ఎక్కువ ప్రమాదం. ఒక పెద్ద ఉపద్రవాన్ని చిన్న చిన్న ఉపద్రవాలను లేవనెత్తి నిర్మూలించగలగడం అసంభవం.(చెడును మంచితో నిర్మూలించాలి). మానవ చరిత్ర సయితం ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఎక్కడ ఎప్పుడు ఎవరయినా ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడి, వ్యతిరేక నినాదాలు చేసి ఉన్న దుస్థితిని దూరం చేయడం కాదు కదా మరింత దుర్భర స్థాయికి దిగజార్చారు. సమస్యను పరిష్కరించడం అలా ఉంచి, మరింత జఠిలంగా మార్చేశారు.

(మిన్హాజుసున్నహ్ అన్నబవియ్య 3 1390)

 

07) ధర్నాలు, హరాళ్ళ ఆదేశం

ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహ్మతుల్లాహి అలైహ్) :

స్త్రీ పురుషులు కలిసి రోడెక్కడం, ధర్నాకు దిగటం, హర్తాళ్ళు చేయడం సమస్య పరిష్కారానికి సరైన విధానం కాదు అన్నది నా అభిప్రాయం. ఇది ఒక విధంగా పరస్పర పగకి, ప్రతీకారానికి తలుపులు తెరుస్తుంది. ఈ విషయంలో షరీయతు పరమైన కారకాలను అవలంబించడం ఉత్తమం . ఉదాహరణకు - ఉత్తరం ప్రతి ఉత్తరం ద్వారా. ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కోరుతూ హితబోధ చేయడం ద్వారా. ఈ విధానాన్నే విజ్ఞులు, విద్యావంతులు, సహాబా, తాబయీనులు పాటించారు ప్రభుత్వానికి, పాలకులకు ఉత్తరం రాయడం, వారితో నేరుగా వెళ్ళి కలిసి చర్చించడం, ఇతర, మాధ్యమాల ద్వారా వారిని సంప్రతించి పూర్తి శ్రేయాన్ని కోరుతూ హితబోధ చెయ్యడం. (వారిలో మార్పు కోసం అల్లాహ్ తో దుఆ చేయడం) ఇలా కాక, వేదికలెక్కి పాలకుల తీరుని ప్రచారం చేయగోరడం, ఫలానా వ్యక్తి ఇలా చేశాడు, అలా చేశాడు అని ఎద్దేవ చేయడం సముచితం కాదు. (అల్లా హ్యే ఆదుకోవాలి) 'వల్లాహుల్ ముస్తఆన్'

 

08) అపహరణ మరియు హత్య ఆదేశం

ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (ర్మ తుల్లాహి అలైహ్) :

అపహరణ, హత్య,అల్లర్ల ఆధారంగా ధర్మబోధ చేయాలనుకోవడం ప్రవక్త (స) వారి విధానం ఎంత మాత్రం కాదు, సహాబా పద్ధతి అంతకన్నా కాదు. ప్రియ ప్రవక్త (స) వారి హిజ్రత్ తర్వాత ఆయనకు మదీనాలో ఆధిపత్యం లభించాక, మంచి స్థాపనకై, చెడు నిర్మూలనకై అల్లాహ్ ఆదేశంతో ఆయన (స) అవిశ్వాసులతో జిహాద్ చేశారన్న మాట వాస్తవం. అల్లాహ్ షరీయతు హద్దులను స్థాపించారు అన్న మాట కూడా యదార్థం. (దానికి ఓ సుదీర్ఘ నేపథ్యం ఉంది)

గొడవ, హత్య, రక్తపాతం వంటి వినాశకర చేష్టలు ధర్మబోధ మార్గంలో పని చేసే వారికి ఏ విధంగా శ్రేయస్కరం కావు. ఇలాంటి విధానం వల్ల సత్యం అంటేనే అసహ్యం కలిగే ప్రమాదముంది. దీనికి భిన్నంగా ధర్మబోధకుల్లో ఓర్పు, సహనం, త్యాగ నిరతి, క్షమ, దయ, స్నేహభావం, సహిష్ణుత వంటి లక్షణాలు పుష్కలంగా పరిపూర్ణ స్థాయిలో ఉండాలి.

మస్జిద్ లోపల, బయట, అన్ని చోట్ల అన్ని వేళలా మంచి మాట, ప్రవర్తనను ఆశ్రయించాలి. తద్వారా మంచోళ్ళు పెరిగి, చెడ్డళ్ళు అంతరిస్తారు. ప్రజలు సయితం సులభంగా మాటను విని, మంచిని, దర్మాన్ని అంగీకరిస్తారు.

 

09) ఫ్లయిట్  హైజాక్ గురించి పండితుల ఫత్వా

కాసింత బుద్ధి బలం గల ఏ వ్యక్తయినా - ఫ్లయిట్ మరియు దౌత్య కార్యాలయాల నుండి వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం అత్యంత అవాంఛనీయ అంతర్జాతీయ నేరం అని గ్రహిస్తాడు.

దీని మూలంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే, అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది. అలాగే అమాయక ప్రజలను అన్యాయంగా ఇబ్బంది పెట్టడం, వేధించడం, బాధించడమే అవుతుంది.

దీని పరిణామాలు ఎంత భయంకరంగా ఉండగలవో అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఇలాంటి వెకిలి చేష్టల వల్ల కలిగే నష్టం ఒక వ్యక్తికో, వర్గానికో మాత్రమే పరిమితం అవ్వదు. దీని ప్రభావం, నష్టం అంతర్జాతీయ స్థాయిలో ఉండే ప్రమాదం ఉంది

ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహ్మతుల్లాహి అలైహ్) :

 

Monday, November 22, 2021

Tuesday, November 9, 2021

ఏది వాత్సల్యం? ఏది మాత్సర్యం? 2


వాత్సల్యం - దానం
మనిషికి మరణానంతరం పనికొచ్చేవి 'సత్సంతానం, జ్ఞానం, దానం' అని ప్రవక్త మహినీయులు (స) వారు సెలవిచ్చారు. అది తెలిసిన తలగట్టి తత్వవేత్తలు, మహా మేధావులెందరో తమ సంపత్తిని, సమయాన్ని, సేవని, జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించారు. అయితే లోకం వీళ్ళని 'బ్రతకడం చేతకాని వాళ్ళంటూ అవహేళన చేసింది. ఎంత విచి త్రం! ఎది ఏమయినా, మనం మాత్రం మన పిల్లల్లో దాన గుణాన్ని పెంపొందించాలి. అప్పుడప్పుడు వారి చేతికి డబ్బిచ్చి దానం చేయించాలి. పుచ్చుకోవడం కన్నా ఇవ్వడం ద్వారా పొందే ఆనందం చెప్పనలవి కానిది. 

మన పిల్లలకు పుస్తకాలున్నాయి, బట్టలున్నాయి, కాళ్ళకు చెప్పులున్నాయి. ఇవేమి లేనివాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళూ మన చుట్టూ ఎంతో మంది కనబడతారు. కాబట్టి “మీకున్న దానిలో కాస్త స్వీటు ఆ అభాగ్యులకు ఇచ్చి చూడండి. వారి కళ్ళల్లో కనబడే ఆనందం మీరు స్వీటు తింటున్నప్పుడు కలిగే ఆనంద మకరందంకన్నా మీకె క్కువ సంతోషాన్నిస్తుంది' అని పిల్లలను ప్రోత్సహిస్తే, సత్పౌరులయిన వారు వేలాది దానాలకు, వందలాది సేవా కార్యక్రమాలకు తలకట్టుగా నిలబడి, నిరతం నింగీ నేలల్లో జీవరాసుల చేత నీరాజనాలందుకుంటారు.



వాత్సల్యం - సావాసం
సావాసగాళ్ళందరూ మంచి వారై ఉంటారన్న గ్యారంటి ఏమి లేదు. కొందరి మెదడు మోకాళ్లలో ఉంటుంది. తలకు చెప్పులు అడిగే రకం అన్న మాట. అంటే కొవ్వెక్కి మాట్లాడుతారు. తలమీరిపోతూ, తలకు నొప్పిని మిగిల్చే పనులన్నింటిలోనూ తలదూరుస్తుంటారు. అటువంటి వ్యక్తులకు, ఉక్తులు, చెడు శక్తులకు దూరంగా ఉంచితేగాని మన పిల్లలకు శాంతి తలకూడదు. ఎంత కష్ట పడ్డా అవతలివారు. ఒక్కోసారి మనల్ని అభిమానించరు. ఆఖరికి తలకోసి ముందర పెట్టినా 'ఇదంతా తలతిక్క వ్యవ హారం, గారడీ విద్య లాగుంద'ని చప్పరించి పారేస్తారు. అటువంటి వ్యక్తుల ప్రాపకం కోసం వృధా ఊడిగం చెయ్యకూడదని పిలల్లకు నచ్చ జెప్పాలి. తలకోట్లు నూరి బట్టతలకూ మోకాలుకూ ముడివేసే జిత్తులమారి నక్కలుంటారని జాగరూక పర్చాలి.

చెడు సావాసం వల్ల భారత దేశంలో ఏటా 'లైంగిక వేధింపులకు గురయిన పిల్లల సంఖ్య అక్షరాల 6 లక్షలు. అందులో 67 శాతం బాలి కలయితే, 33 శాతం బాలురుగా నమోదయింది. ఈ సర్వేలో మన పిల్లల్ని ఎత్తుకునే - వారు, స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టే వారు,
ఆప్తులయినా, అధ్యాపకులయినా, వైద్యులయినా, స్నేహితులయినా - వారందరూ మంచో ళ్ళయి ఉండరని తేలింది. కాబట్టి మనం మన పిల్లల్ని మూడు ప్రదేశాలకు సంబంధించిన ప్రమాదాన్ని ఆరు నెలలకోసారి అయినా గుర్తు చేస్తూ ఉండాలన్నది. కొందరు మానసి నిపు ణుల మాట. 1) రొమ్ము 2) తొడలు, తొడల -మధ్య స్థలం 3) పిర్రలు. ఎవరయినా వారిని ఎత్తుకుని ముద్దాడుతూ ఈ ప్రదేశాలను తాకితే ప్రమాదం పొంచి ఉన్నట్టు అని మన పిల్లలకు బోధ పర్చడంతోపాటు తక్షణ చర్యల్ని కూడా సూచించాలి. వారికి అలా అన్పించినప్పుడు పెద్దగా కేక వేసి, ఆ స్థలం నుండి పారిపోయి సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని, తర్వాత వారికి బాగా నమ్మకమున్న వ్యక్తికి దాని గురించి తెలియజేయాలని చెప్పాలి. అలాగే ఏదైనా విషయం మన పిల్లలు మనతో చెబితే పసివాళ్లు కదా అని ఈజీగా తీసిపారేయకూడ దు. లేదంటే తర్వాత మనం చాలానే కోల్పో వాల్సి వస్తుంది. చివరకు సంతానాన్ని కూడా. అలాగే ఈ మూడు ప్రదేశాల్ని మనం చూస్తుండగా ఎవరయినా ముట్టుకుంటే వారు ఎంతటి వారయినా మందలించాలి. -అదే విధంగా పిల్లలతోనే ఎక్కు సమయం గడిపే ఆడ మగవారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. పరాయి వారు ఎవరు ఏది ఇచ్చినా తీసుకో కూడదని చెప్పాలి. మనం కూడా ఇతర పిల్లలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే డైరెక్టుగా పిల్లలకు ఇవ్వకూడదు, వారి తల్లి దండ్రులకిచ్చి వారికి ఇవ్వాలిస్సదిగా రిక్వెస్ట్ చేయాలి. కోరికలు తీరని కామాంధులు కొందరుంటారు. వారి చూపంతా కన్నె పిల్లల పై, చిన్న పిల్లలపైనే అన్న విషయాన్ని విస్మరించడం విషంతో సమానం అన్న విషయం గర్తుంచుకోవాలి.

వాత్సల్యం - శీల నిర్మాణం
"Think High-Acheive High" అనేది నేటి నినాదం. ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకుని దాని మీదే తదేక దృష్టితో పని చేయాలనే నిర్ణయం తీసుకునే తలచూపును తనయులకు తల్లిదండ్రులు ఇవ్వాలి. 'తల తిరిగి అయినా కబళం నోటికి రావాలి' అన్నట్టు అవకాశాలు వాటికవే రావు. వాటిని మనమే అంది పుచ్చుకోగలగాలని, ఎవరో వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపో కూడదని వారికి నచ్చజెప్పాలి. ఒక్కొక్క మెట్టు తలదొక్కుకెళుతూ శిఖరాగ్రానికి చేరుకునే నేర్పును వారిలో నూరి పోయాలి. తలతాకట్టు పెట్టాల్సి వచ్చినా తీసుకున్న అప్పు, ఇచ్చిన మాట తప్ప కూడదని బోధించాలి.

అలాగే స్త్రీ ఇంటికి గుమ్మ వంటిదని, వీధి వాకిట్లో నిలబడి వచ్చి పోయేవాళ్ళతో ఒయ్యా రాలు ఒలకబోస్తూ మాట్లాడటం, కరచాలనం చేయడం ఏ విధంగానూ తగదని, సంస్కారం, వ్రీడ గల సుకన్యలు గుమ్మంలోకి రారని, అలా వీధి గుమ్మంలో నిలబడటం జారస్త్రీ లక్ష ణం అని పెద్దలు చెప్పిన మాటను ఆడ పిల్లలకు నచ్చివచ్చేలా బోధించాలి.

వాత్సల్యం -కామం (వాంఛలు)
తాము అనుభవించలేకపోయిన సౌఖ్యాల్ని, సౌకర్యాల్ని తమ  పిల్లలకు అందేలా చూడాలన్న తపన దాదాపు తల్లిదండ్రులందరిలోనూ ఉంటుంది. అయితే ఏ కోరికల పరిపూర్తి  వల్ల పిల్లల వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుందో, మరే రకపు వాంఛల పరిపూర్తి వల్ల వారి భవితవ్యం బుగ్గి పాలవుతుందో తెలుసుకునే కనీస విచక్ష జాజ్ఞానం తల్లిదండ్రులకు లేకపోతే.......తలవుళ్ళు కడిగాము, ఇవ్వాళ ప్రయోజకులయి సంపద వచ్చే సరికి అన్ని మర్చిపోయారు' అని తీరిగ్గా కూర్చోన్ని బాధ పడక తప్పదు. కనుక పిల్లలు, తలతిక్క పనులు చేసినా, తలకెక్కిన కోర్కెలు కోరినా వారిని మందలించాలి. వాటి వల్ల కలిగే నష్టాన్ని వివరించాలి, అప్పటికీ వినకపోతే 'తలకోల పోట్లగిత్తకు ఇది అవసరం' అన్నట్టు నాలుగు తగిలించాలి కూడా. తప్పని స్థితిలో కొట్టడం వాత్సల్యానికి వ్యతిరేకం ఎంత మాత్రం కాదు, అది మనకు వారి మీదున్న వాత్సల్య అవసరం. అయితే గొడ్డును బాదినట్టు బాదడం గానీ, చీకటి గదిలో బంధించడంగానీ, అన్నం మాన్పించడం, వాతలు పెట్టడం, కళ్ళల్లో కారం పోయడం వంటివి గాని చేయకూడదు.

'తలలు బోడులయినా తలపులు బోడులవుతాయా?' అన్నట్టు వయసుతోపాటు వచ్చే మార్పు వారిని వింతానుభూతికి లోను చేస్తుంది. అప్పటి వరకు తల్లిదండ్రులే సర్వ స్వం అయిన వారి లోకంలోకి కొత్త పరిచయాలు తొంగి చూడాలన్న తాపత్ర్యం బయలు దేరుతుంది. అట్టి క్లిష్ట స్థితిలో వారు స్పందించాల్సిన తీరును, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని వారికి నేర్పాలి. 'పిల్లలు పదవ ఏటకు చేరితే (వారు స్వంత అన్నాచెల్లెలయినా, అక్కాతమ్ము ళ్లయినా) వారి పడకలను వేరు చేయమ'ని ప్రవక్త (స)వారు సెలవిచ్చి ఉన్నారు. అలాగే సమీప బంధువుల మధ్య ఉండే అతి సనువుకు వారిని దూరంగా ఉంచాలి. ఈ నియమాన్ని ఖచ్చితంగా మన ఇళ్ళల్లో అమలు పర్చాలి.

వాత్సల్యం - సహనం
'తలచినప్పుడే తాత పెళ్ళి' అన్నట్టు తొందర పాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. చక్కటి మైత్రినీ, స్నేహాన్నీ, నడవడినీ కలిగి ఉంటూ, అందరి 'తలలో నాలుకలా తయారవ్వాలని హితవు పలకాలి. అవినీతి, కుళ్ళుమోతుతనం, ఎదుటి వారి అభివృద్ధిని సహించకపోవడం వంటి కొట్లమారితనం అనే గుణానికి దూరంగా ఉండమని బోధించాలి.భావోద్వేగ నిబద్ధతను వారిలో నూరిపోయాలి. కష్టమొచ్చినప్పుడు కంగారు పడకుండా అటు వంటి నిబద్ధతతో సమస్యకు పరిష్కారం దొరకుతుందని బోధపర్చాలి.

వాత్సల్యం - వ్యాయామం
ఏడు సంవత్సరాల వరకు పిల్లల్ని ఆడుకోనివ్వాలని, తర్వాత వారికి నమాజు గురించి చెప్పాలని' ప్రవక్త మహనీయులు (స) వారి ప్రవచనం ద్వారా తెలుస్తుంది. వ్యాయామం అనేది రెండు రకాలు. క్రీడా వ్యాయామం , విద్యా వ్యాయామం.  సాధారణంగా పిలల్లలో చాలా హడావిడి, చురుకుతనమూ ఉంటుంది. వాటిని శక్తిగా మార్చాలి. ఈ హడావుడి అనేది 'పాము విషం' లాంటిది. చంపటానికి, బ్రతికిం చడానికి కూడా పనికొస్తుంది. చిన్నతనంలో మన పిల్లల చురుకుదనాన్ని సవ్యమయిన మార్గంలో మళ్ళించకపోతే, పెద్దయ్యాక అది 'కంగారు'గా మారుతుంది. కాబట్టి కొందర వ్యక్తుల్ని మనం చూస్తాము. వారు చాలా చిన్న విషయాలకే హడావుడి పడుతూ ఉంటారు. సమస్యల్ని తొందరగా పరిష్కరించాలనే తాపత్ర్యంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ  ఉంటారు. నిజానికి అప్పుడే నిగ్రహం'పాటిం చాలి. దీన్ని చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి. 

ఫజిల్స్, పొడుపు కథల్లాంటివి చెప్పి విప్పమనాలి. తేలిక ప్రశ్నే కదా అని పిల్లలు హడావుడి జవాబులు చెబుతారు. అది తప్పయినప్పుడు వారికి 'నిగ్రహం' విలువని చెప్పాలి. భవిష్యత్తులో ఆ నిబద్ధతే వారికి చాలా సాయపడుతుంది. ఇది విద్యా వ్యాయామం. క్రీడా వ్యాయామం - పిల్లలు కొందరిలానే ఫలితం తెలియకుండా పని చేస్తారు. ఒక కుర్రాడు గది చుట్టూ చక్కర్లు కొడుతున్నాడనుకుందాం. 'ఎక్కడికి నీ పరుగు? ఏ గమ్యం చేరుకోవడానికి?" అని ప్రశ్నిస్తే వాడి దగ్గర సమాధానం ఉండదు. వారి లోపల్నుంచి ఉవ్వెత్తు ఎగిసి పడుతున్న శక్తిని కాల్చేయడం కోసమే పిల్లలు ఆ విధంగా పరుగెత్తడం, గంతులేయడం, అతిగా మాట్లాడటమ, కొట్టుకోవడం, బల్లపై నుంచి దూకడం వగైరా చేస్తూ ఉంటారు. నిరంతరం వారిలో విడుదలయ్యే 'అంతర్గత శక్తి'ని మంచి దారిన మళ్ళిస్తే వారు అద్భుతమైన వ్యక్తులుగా ఎదుగుతార న్నది మానసిక నిపుణుల మాట. కాబట్టి వారి పరుగుకి, వేగానికి, దూకుడికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం పెద్దల బాధ్యత. అయితే ఈ మధ్య తల్లిదండ్రులు పేరు కోసమో, ప్రాపకం కోసమో తెలియదుగానీ, వారి పిల్లల అంతర్గత శక్తిని పెద్దయ్యాక వారికి ఏ విధంగానూ పనికి రాని పాటల పోటీల్లో, డ్యాన్స్ పోటీల్లో తగులబెట్టి మురిసి పోతున్నారు. వారు ఈ చర్యకు స్వస్తి పలకకపోతే, 'పధ్నాల్గో  ఏట నుంచి పబ్బులకు, క్లబ్బులకెళ్ళే సంతానమే-సంతాపమే' వారికి మిగులుతుందని మరువ కూడదు.

వాత్సల్యం - ప్రోత్సాహం
'తల వెంట్రుకకు కూడా నీడ ఉంటుంది' అన్నట్టు మనం చాలా చిన్నవిగా భావించి అశ్రద్ధ వహించే విషయాలలో మహోపకారాలు చేసేవి చాలానే ఉంటాయి. అది మెచ్చుకోలుగా భుజం తట్టడమే కావచ్చు, నగుమోముతో మాట్లాడటమే కావచ్చు, బహుమానం ఇవ్వడమే కావచ్చు, విహారయాత్రకు తీసుకెళ్ళడం కావచ్చు. అయితే మన పొగడ్తకు, ప్రోత్సాహానికి, చిరునవ్వుకు, ఇచ్చే బహుమానానికి ఒక లక్ష్యం ఉండాలి. మనం ఎందుకు వారిని మెచ్చుకుంటున్నామో, ఎందుకు వారితో నవ్వుతూ మాట్లాడుతున్నామో, ఎంత గా వారిని ప్రేమిస్తున్నామో, ఎందుకు బహుమానాన్ని ఇస్తున్నామో వారి అర్థమయ్యే రీతిన చెప్పగలగాలి. నాన్న గనక గిఫ్ట్ ఇచ్చాడు అన్న ఫీలింగ్ కన్నా 'నేను సాధించిన ఫలానా విజయానికి మెచ్చుకోలుగా నాకు లభించిన బహుమానం ఇద'ని అతను సంతృప్తి, సంతోషం చెందాలి. 
ఒక వేళ మన పిల్లలు ఏదోక కారణంగా దిగులు చెందినట్టు మనకు అన్పిస్తే, వారిని వారి మానాన వదలకుండా - 'గాలి ప్రేమతో స్పర్శించి ప్రేమగా పలుకరించినట్లు, చెట్ల కొమ్మలు చెతులూపుతూ ధైర్యం చెప్పి నట్లు, పర్వతాలు స్థిరంగా ఉండటం ఎలాగో నేర్పినట్లు మనం వారికి ఒక అనురాగ స్పర్శ ను, ఒక అభయ హస్తాన్ని, ఒక సహన స్థయి ర్యాన్ని ఇవ్వగలగాలి. ఇస్తారని ఆశిస్తూ.......!



అందరూ అనుభవించే బాల్యం.. దేవుడు మనందరికీ  ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1954కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.

బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్‌ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.
పాకిస్తాన్‌లో నవంబర్‌ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు.  జపాన్‌లో మే 5న జరుపుకుంటారు.  దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. పోలాండ్ లో జూన్‌ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. శ్రీలంకలో అక్టోబర్‌ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు.

మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు.



సంస్కారం ఓ మస్తిష్క పవిత్రీకరణ ప్రక్రియ.  సంస్కారాన్ని అనుసరించి మానవుడు దైనందిన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాడు. విద్య వల్ల, గురు ప్రబోధితంగా మరికొన్ని సంస్కారాలు అబ్బుతాయి. మనిషి ఆలోచనలకు పునాది అతడి గత జీవితపుఅనుభవాలే! వాటి ఆధారంగా మంచి, చెడు సంస్కారాలు రూపు  దిద్దుకుంటాయి. మనిషి ప్రవర్తన తీరును అతడి సంస్కార
పర్యవసానంగా చెప్పాలి. విపరీత పరిస్థితుల్లో మనసు కకావికలం  అవుతుంది. ఒక వ్యక్తి కోపం, మంచితనం, చెడ్డతనం, కారుణ్యం,  దాన గుణం, జీవితాన్ని యథాతథంగా స్వీకరించగల మనస్తత్వం, ధర్మ శాస్త్ర సారం ఒంటపట్టే చురుకుదనం, ఉద్విగ్న భరిత క్షణాల్లో ప్రవర్తన... అన్ని సన్నివేశాల్లోనూ సంస్కారాన్ని అనుసరించే నడవడి ఉంటుంది. మానవుడు జాతి, కుల, మత, లింగ, వర్ణ, ధనిక, పేద, వర్గ భేదాలకు అతీతంగా ఆచరించవలసిన ఉత్తమ సంస్కారం మరొకటి ఉంది. అదే సౌశీల్యం!

సంస్కారం అనేసరికి షోడశ (16) సంస్కారాలు జ్ఞప్తికి వస్తాయి. సనాతన ధర్మం ఆచరించే వారికి అవి వేదాలు నిర్దేశించిన కర్మలు. సంస్కారాన్ని సంప్రదాయం అనుసరిస్తుంది.
పై సంస్కారాలు ప్రతి సనాతన ధర్మాచరణుడికీ అనువర్తించేవి; 
మానవుడు జాతి, కుల, మత, లింగ, వర్ణ, ధనిక, పేద, వర్గ భేదాలకు అతీతంగా ఆచరించవలసిన ఉత్తమ సంస్కారం మరొకటి ఉంది. అదే సౌశీల్యం!
మానవుడు చేసే కర్మలు ముఖ్యంగా త్రివిధంగా ఉంటాయి. అవి దైవ ప్రీతి కోసం చేసేవి, పాప భీతితో చేసేవి, సంఘనీతిగా చేసేవి. సమాజ ఆమోదం కోసం మానవుడు మొదట సౌశీల్యం పెంపొందించుకోవాలి. సంఘ నీతిగా చెసేవి. సమాజ ఆమోదం కోనం మానవుడు మొదట సౌశీల్యం పెంపొందించుకోవాలి.

సద్గుణ సంపత్తిని పెంపు చేసుకొనే సంస్కారం బాల్య దశ నుంచి బాల బాలికలకు అంది వచ్చే నాగరిక లక్షణం. అదే వినయ సౌశీల్య సంపద. విద్య వల్ల వినయం సిద్ధిస్తుందని భగవద్గీత చెబుతుంది.
మాటలో నిదానం, గౌరవం ఇచ్చిపుచ్చుకొనే స్వభావం, తన మాటలు, చేతలతో ఎవరినీ నొప్పించని సున్నిత మనస్తత్వం, పిరికితనం లేని మృదు గంభీర స్వభావం, సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించే సహృదయం, తోటి మనిషికి, కాలానికి, ప్రకృతికి విలువ ఇచ్చే సుజ్ఞానం... ఈ లక్షణాలు అన్నీ పరిపూర్ణంగా శ్రీరామచంద్రుడు సంతరించుకున్నాడని, ఆయనను మర్యాదా పురుషోత్తముడిగా కీర్తించిన మహా కావ్యం శ్రీమద్రామాయణం చెబుతుంది.
ఆధునిక కాలంలో ధనం, విద్య, హోదా ఉన్న వ్యక్తులు తమ కంటే తక్కువ స్థాయి గల వారిని చులకనగా చూడటం, మాటలో పలుకులో మోటుదనం ప్రదర్శించడం ప్రబలింది. ధనం, యౌవనం, విద్య, సౌందర్యం మానవుడిలో గర్వాన్ని కలిగిస్తాయంటారు. అణకువ కలిగి ఉన్నవాడే గొప్పవాడని సనాతన సంప్రదాయం స్పష్టం చేసింది.

మితస్మిత భాషణం వల్ల గొప్ప పనులు విజయవంతంగా చేయగల సామర్థ్యం సిద్ధిస్తుంది. వాచాలత్వంతో ఏ వ్యక్తి విజేత కాలేడు. భీరుత్వం లేని మంచితనాన్ని మనిషి అభ్యసించవచ్చు అందుకు సహనం తోడ్పడుతుంది. అన్ని కార్యాలూ సాధనతో సఫలీకృతం అవుతాయంటాడు శతకకారుడు. మానవుడిగా జన్మించినవాడు ప్రదర్శించగల ఉత్తమ సంస్కారం మానవత్వం. ఆ దిశగా ప్రయాణం పారమార్థిక విజయానికి నాంది!

ఏది వాత్సల్యం? ఏది మాత్సర్యం? 1


వాత్సల్యం - మాత్సర్యం
'సంతాన సంపూర్ణ హితాన్ని కోరేది వాత్సల్య మయితే, సంతాన వినాశనానికి ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానయినా కారణమవ్వడం మాత్సర్యం'. తలమాని మాయయని స్థితి నుండి మానవత్వానికే తలమానికం అయ్యేలా తనయుల్ని తీర్చిదిద్దాల్సిన భాధ్యత తల్లిదండ్రు లదే. పిలల్ల 'తల'తో తల పెట్టిన మాటలు తేనెల తేటలయి వారు ఆనందంగా ఆశ్వాదించేవిగా ఉండాలి. అతకని అబద్దాలు, పొంతన లేని విషయాలు, అర్థం లేని వంకలు, తలాతోక లేని కథలు, కాకమ్మ కబుర్లు, పుక్కిటి పురాణాలు పిల్లలకు చెప్పకూడదు. కలకన్నా వాస్తవంలో ఉన్న అనుభూతికి అనుభవాన్ని జోడించి చెప్పాలి. పిల్లల్ని బూచోడొస్తున్నాడనో, పిచ్చి పుల్లమ్మ వస్తున్నదనో లేని భయాలను కలిగించకూడదు. 'బాల్యంలో చోటు చేసుకునే భయాలు, చేదు అనుభవాలు వారిని పెద్దయ్యాక కూడా వెంటాడుతుంటాయి. కొందరు జీవితంలో సఫలం కాలేకపోవడానికి గల కారణాల్లో ముఖ్య కారణం బాల్యం తాలూకు భయాలే' అన్నది. మానసిక శాస్త్రవేత్తల మాట. 



తల్లిదండ్రులు తనయులకు చెప్పింది. తలకెక్కాలి. మనం చెప్పింది. తలకె క్కించుకోవడం, ఎక్కించుకోకపోవడం వారి సమర్ధతో, అసమర్ధతో అయివుండొచ్చు. కానీ, తలకెక్కేలా చెప్పడం, చెప్పకపోడం మాత్రం ఖచ్చితంగా మన సమర్థత, అసమర్థ మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మరువకూడదు. చదువులో, సంస్కారంలో అందరిని తలదాటిన వారిగా వారిని తీర్చిదిద్దాలి. అనవ సరమయిన విషయాలలో, తలదూర్చితే లేని పోని చిక్కుల్లో పడే ప్రమాదముంటుందని తెలిసి వచ్చేలా, తెలివి వచ్చేలా చెప్పాలి. తల్లి దండ్రుల ఆనకు తలదాల్చేవారిలా వారిని మలచాలి. విదేశాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని కన్నపిల్లల కోసం కష్టపడుతున్న కన్నవారు వారి గొంతెమ్మ కోర్కెల్ని తీర్చడమే కాక, సమయం కేటాయించి కనీసం నెలకోసారయినా వారితో ప్రశాంతంగా మాట్లాడాలి.

వాత్సల్యం - విజ్ఞానం
వారి చదువుకు సంబంధించిన సమాచారా న్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇళ్ళల్లో ఉన్న తల్లులు అన్ని వేళలా రుచికరమయిన వంటకాలు మాత్రమే వడ్డించకుండా - అప్పుడప్పుడు పచ్చడి అన్నాన్ని, సద్దన్నాన్ని కూడా తినిపించాలి. అలా తినిపించినప్పుడు అలా ఎందుకు తినిపిస్తున్నారో, తల్లిగా దాని - వెనుక లక్ష్యం ఏమిటో వారికి అర్థమయ్యేలా - ప్రేమగా చెప్పాలి. లేదంటే పిల్లలు తల్లిని అపార్గం చేసుకునే ప్రమాదముంటుంది. మనం - పిల్లలకు కేవలం మన ఆస్తుల్ని, ఐశ్వర్యాల్ని,సౌఖ్యాల్ని, సౌకర్యాల్ని మాత్రమే కాదు ఇవ్వా ల్సింది, మన కష్టాలు, మన బాధలు సయితం - వారికి అర్థమయ్యేలా ప్రణాళికబద్ధంగా చెప్పేందుకు ప్రయ త్నించాలి. 

ఒక విషయం గురించి పూర్తిగా తెలియటాన్ని - పాండిత్యము' అంటారు. సమయానుకూలంగా ప్రవర్తించడాన్ని 'సమయస్ఫూర్తి' అంటారు. - పరిష్కారాన్ని ఆలోచించగలిగే శక్తిని 'ప్రజ్ఞత' - అంటారు. ఇవన్నీ కలిస్తే వచ్చేది 'జ్ఞానం' అని అలాంటి జ్ఞానం లేని చదువు ఫల శూన్యం' - అన్నది వారిని బోధ పర్చాలి. అట్టి జ్ఞానంతోనే - ధ్యానం సాధ్యం అని, ఎలాంటి స్థితులు ఎదురయినా అదరని చెదరని 'స్థితప్రజ్ఞ'కు మూల - సాధనం అని వారికి ఎరుక పర్చాలి. అలాకాక - మమకారానికి పోయి తలకెత్తుకుంటే తనయులయినవారే తలకు మించిన భారమయి కూర్చుంటారు. తర్వాత తల్లిదండ్రులు క్షోభతో, బాధతో తల్లడిల్లిపోవాల్సి వస్తుంది. 

అట్టి గుణశూన్యులు కామమధికమయి కన్ను కాగన - కన్నెనే సర్వస్వంగా భ్రమించి, కన్నవారిపై - కన్నెర్ర జేసి, మిన్ను గానక, మమతానురాలను మరచి, ఒళ్ళూ పైనా తెలియక ఒయ్యా రాలు ఒలకబోసే ఒయ్యారి భామల కొరకు - కన్నవారినే కాలదన్ని 'పుట్టి తల్లికి గండము,  పెరికి ఊరికి గండము'గా మారి, చివరకు " ఉన్నవన్నీ ఊడ్చుకుపోయి, అస్తవ్యస్థ దురవస్థ దాపురించి, బ్రతుకు తలక్రిందులయి, తల  దాచుకునేందుకు చోటు దొరకక దరిద్రపు - చావు చస్తారు అన్న విషయాన్ని మరువకూడదు. అప్పుడు వారి కోసం ఏ ఆకాశము రోధించదు, ఏ అవనీ విలపించదు.



వాత్సల్యం-సంస్కారం
సంస్కారం ఓ మస్తిష్క పవిత్రీకరణ ప్రక్రియ.  సంస్కారాన్ని అనుసరించి మానవుడు దైనందిన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాడు. విద్య వల్ల, గురు ప్రబోధితంగా మరికొన్ని సంస్కారాలు అబ్బుతాయి. మనిషి ఆలోచనలకు పునాది అతడి గత జీవితపుఅనుభవాలే! వాటి ఆధారంగా మంచి, చెడు సంస్కారాలు రూపు  దిద్దుకుంటాయి. మనిషి ప్రవర్తన తీరును అతడి సంస్కార
పర్యవసానంగా చెప్పాలి. విపరీత పరిస్థితుల్లో మనసు కకావికలం  అవుతుంది. ఒక వ్యక్తి కోపం, మంచితనం, చెడ్డతనం, కారుణ్యం,  దాన గుణం, జీవితాన్ని యథాతథంగా స్వీకరించగల మనస్తత్వం, ధర్మ శాస్త్ర సారం ఒంటపట్టే చురుకుదనం, ఉద్విగ్న భరిత క్షణాల్లో ప్రవర్తన... అన్ని సన్నివేశాల్లోనూ సంస్కారాన్ని అనుసరించే నడవడి ఉంటుంది. మానవుడు జాతి, కుల, మత, లింగ, వర్ణ, ధనిక, పేద, వర్గ భేదాలకు అతీతంగా ఆచరించవలసిన ఉత్తమ సంస్కారం మరొకటి ఉంది. అదే సౌశీల్యం!

నేటి మన పాఠశాలల చదువులయితే అటువంటి జ్ఞానాన్ని, సామాజిక స్పృహని కలుగజేయడం లేదు. పిల్లలకు ఈ స్కూళ్ళు, కాలేజీలు నేర్పే చదువు తప్ప సంస్కారం, నిజమయిన భక్తి, గౌరవం వంటి ఇతర విషయాలు తెలియకుండా చేసే తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న మన సమాజంలో వినయ పాత్ర -తగ్గి విర్రవీగే తత్వం ప్రబలుతోంది. జాతి, కుల, మత దురభిమానాలు పెచ్చరిల్లు తున్నాయి. విద్యార్థుల జీవితంలో, ముఖ్యంగా - ముస్లిం విద్యార్థుల జీవితాల్లో ఒక ప్రార్థన లేదు, ఒక సద్గ్రంథ పఠనం లేదు, ఒక సద్వచన శ్రవణం లేదు, ఆఖరికి 'కలిమా' రాదు, దానర్థం తెలియదు. ఇక వారికి ఇది మంచి,  ఇది చెడు అనే విచక్షణా జ్ఞానం ఏమయినా ఉంటుందా అంటే అదీ లేదు. ఇది ఎవరి  లోపం? వ్యక్తిదా? వ్యవస్థదా?

పిల్లల్లో 'భక్తి' వల్ల వినయం, 'పాపభీతి' వల్ల - సత్ప్రవర్తన, 'ప్రార్థన' వల్ల క్రశిక్షణ కలుగుతాయి. ఖుర్ఆన్ మరియు హదీసులను నేర్పే తల్లిదండ్రుల పాలిట వారి సంతానం సౌభాగ్యం, కీర్తిగా అలరారుతారు. ఇహంలోనే కాక  రేపు తీర్పు దినాన సయితం దేవుడు అట్టి  సత్సంతాన తల్లిదండ్రుల్ని 'కీర్తి కిరీటాలు' తొడిగించి మహా గొప్పగా సన్మానిస్తాడు' అని  ప్రవక్త మహనీయుల (స) వారు సెలవిచ్చారు.  కాబట్టి పిల్లలకు అవసరమయిన ఆధ్యాత్మిక - శిక్షణ ఇవ్వడంతోపాటు 'సదా మా కళ్ళకు - చల్లదనాన్ని ఇచ్చే భార్యాపిల్లలను మాకు ప్రసాదించు. మమ్మల్ని దైవభీతిపరులకు తలతండ్రి - (ఇమామ్)గా చెయ్యి స్వామీ!' అని నిత్యం ఆ నిజ ప్రభువును వేడుకుంటూ ఉండాలి.

Wednesday, November 3, 2021

సమావేశ మర్యాద Meeting courtesy

Monday, October 25, 2021

మన మాట కావాలి పూబాట


మన మాట కావాలి పూబాట 

మనిషి సంఘజీవి అన్నది వాస్తవం. నలుగురితో కలవడం, సమావేశమవ్వడం, ఎన్నో విషయాల గురించి పరస్పరం చర్చించుకోవడం, సమాలోచనను జరపడటం జరుగుతూనే ఉంటుంది. ఈ సమావేశాలు ధర్మపరమైనవి. సంఘపరమైనవి. అర్థ పరమైనవీ, రాజకీయ పర మైనవి -  ఏవైనా కావచ్చు. “విశ్వసించిన ఓ ప్రజలారా! మీ సమావేశాలలో (వచ్చేవారికి) చోటు కల్పించండని మీతో అన్నప్పుడు మీరు జరిగి చోటు కల్పించండి" అన్న అల్లాహ్ ఆదేశాన్ని శిరసావహించాలి.

“విశ్వాసులారా ! మీరు గనక పరస్పరం రహస్యంగా మాట్లాడేటప్పుడు పాపమూ దౌర్జన్యమూ, "దైవప్రవక్త పట్ల అవిధేయతకు సంబంధించిన విషయాలు కాకుండా సత్యానికి, దైవభీతికి నంబంధించిన విషయాలు మాటాడుకొండి. (ముజాదలః -  9)


బాణంతో దెబ్బ తిన్న వృక్షం చిగురించవచ్చు. గొడ్డలితో నరికిన అరణ్యం మరలా పెరిగవచ్చు, కాని వాగ్బాణాలతో గాయపడిన హృదయానికి, సరైన ఔషధం ఈ లోకంలో లేదు. అందుకే ఒద్దికగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, అవసరమైనప్పుడు మౌనం వహించాలి. మౌనం కూడా ఒక అభివ్యక్తే. మాట్లాడటం వెండి అయితే మౌనం బంగారమన్నది ప్రసిద్ధ నానుడి.   అలా అని అన్ని చోట్లా మౌనం ఆభరణం కాదు. మాట్లాడటం తప్పనిసరి. కాని అతిగా, అనవసరంగా మాట్లాడటం అంటే కోరి కష్టాల్ని తెచ్చుకోవడమే. 

మాట తూలితే అదృష్టం వెక్కిరించడం ఖాయమని షేక్స్పి యర్ (wiliam Shakespeare) ఏనాడో చెప్పాడు. మాటని వెనక్కి తీసుకోవడం అంత సులువు కాదు. ధనస్సు నుంచి వేరైన బాణం నోటి నుండి వెలువడిన మాట రెండూ తిరిగిరావు. ఒకసారి నాలుక నుండి జారిన ఒక దురదృష్టకరమైన మాటను ఏడుగుర్రాలతోనైనా వెనక్కి తీసుకురాలేరు. అందుకే ఆచితూచి మాట్లాడాలి. మన మాటే, మనం ఏమిటో "చెబుతుంది. " నీ నడకలో సమతూకం పాటించు. నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించు." (సూరహ్ లుఖ్మాన్) అన్న అల్లాహ్ వచనాన్ని దృష్టిలో ఉంచుకుంటే మరీ మంచిది.

“నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుంది" అని పెద్దలు అంటుంటారు. ఎదుటి వాళ్ళను మిత్రులుగా చేసుకోవడమైనా, శత్రువులుగా మార్చు కోవడమైనా, మన మాటల మీద ఆధార  పడి వుంటుంది. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించటం అవసరం. ఆచరణ సాధ్యంకాని అంశాల గురించి వాగాడంబరం అసలే అక్కరలేదు.

మాటలతో మాయ చేయవచ్చనుకుంటారు చాలా మంది, కాని వాగుడుకాయల డొల్లతనాన్ని వాళ్లకన్నా వేగంగా ఎదుటి వాళ్లు పసి గడతారు. ''చీటికి మాటికి ఒట్లు వేసే నీచుడికి ఏ మాత్రం లొంగకు. వాడు ఎత్తిపొడుస్తూ ఉంటాడు. చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు." (ఖలం: 10-11) అన్న ఖుర్ఆన్ వచనాన్ని సదా దృష్టిలో ఉంచుకున్నవారు, మంచిగా మాట్లాడటం, ఇతరుల హృదయాలను నొప్పించకుండా మాట్లాడటం కూడా ఓ కళ అని తెలిసిన వారు, వివేచనతో మాట్లాడగలరు. 

మాటకీ - మాటకి మధ్య కాసింత మౌనానికి చోటు ఇవ్వగలరు. మాట్లాడటం కంటే అధికంగా వినాలి అధికంగా చూడాలి, దేవుడు రెండు కళ్ళూ రెండు చెవులు ఇచ్చి నాలుక మాత్రం ఒక్కటే ఇచ్చాడు.  
ఎంతమంది చెప్పిన మంచి మాటలు వింటే అంత గొప్ప శీలవైభవం ఏర్పడుతుంది. వాటిని ఎప్పుడూ వింటూ ఉండాలి. అయితే వినేటప్పుడు ఏవి మంచి మాటలో ఏవి హానికరమో మనకు ముందుగా తెలియదు కదా..అందుకే ఎవరు ఏది చెప్పినా వినగలగడం వాటిలో మంచిని స్వీకరించగలగడం అనేది ఒక గొప్ప కళ.  అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు. ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటివారే, అల్లాహ్‌ మార్గదర్శకత్వం పొందినవారు. మరియు అలాంటివారే బుధ్ధిమంతులు.  (జుమర్ - 18) 

ఈ నేర్పరితనం మనకు రావాలంటే... మహాత్ములయిన వారితో కలిసి తిరుగుతూ ఉండాలి. అటువంటి వారు చెప్పే మాటలతో ... ఒక గ్రంథాలయంలో కూర్చుని చదివితే లభించే సమాచారం కన్నా ఎక్కువగా దొరుకుతుంది.. అదికూడా వివేకం, విచక్షణా జ్ఞానంతో కలిసి లభిస్తుంది

మన  నోటితో మానవతా పరిమళం నిండివుండే మాటలకి ప్రాణం పోయాలి.  జగమంతా మనకు చేరువగా వుంటుంది. అప్పుడే ఇహ పరాల సాఫల్యం సామధ్యమవుతుంది.  అంతిమ దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: "ఎవరైతే రెండు దవడల మధ్య గలదాని (నాలుక) గురించి మరియు రెండు తొడల మధ్య గలదాని (మర్మాంగం) గురించి నాకు హామీ ఇస్తాడో నేను అతనికి స్వర్గం జమానతునిస్తాను.” (బుఖారి) 

ఒక్క మాటలో చెప్పాలంటే, పలుకే బంగారం. మాటే మంత్రం.  ఒకళ్ళని ఒప్పించాలన్నా మాటే, ఒకళ్ళని నొప్పించాలన్నా మాటే, ఒకళ్ళని మెప్పించాలన్నా కూడా మాటే. అటువంటి మాట ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలిస్తే ప్రపంచాన్ని కూడా మాటతో జయించవచ్చు. 

అల్లాహ్ ఈ మాటను ఆచరణలో పెడితే - జీవితం శాంతిమయం అవుతుంది.  
అల్లాహ్‌ను తప్ప మరెవర్నీ ఆరాధించరాదని; తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, అనాథల పట్ల, నిరుపేదల పట్ల సద్భావనతో మెలగాలని; ప్రజలతో (చిరునవ్వు మోముతో) మంచిమాటలు పలకాలని; ప్రార్థనా వ్యవస్థ (నమాజ్‌) స్థాపించాలని; (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ చెల్లిస్తూ ఉండాలని మేము ఇస్రాయీల్‌ సంతతి చేత ప్రమాణం చేయించాం. (అల్ బఖర : 83)