Tuesday, March 24, 2015

భాగ్య జీవితానికి బాట

by - syed abdussalam umri


మనకు మన జీవితంలో సిసలయిన సంతోషం ఎప్పుడు ప్రాప్తమవు తుందో తెలుసా? ఎప్పుడయితే మనం సాటి ప్రజల కోసం పాటు పడతామో అప్పుడు, ఎప్పుడయితే మనం కేవలం అల్లాహ్‌ా ప్రీతిని కోరుతూ బడుగు, బలహీన ప్రజల పట్ల, అభాగ్యుల పట్ల, అనాథల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల దయ, జాలి, కరుణ కలిగి వ్యవహరిస్తామో అప్పుడు. మనిషి సాటి మనిషికి చేసుకునే సేవల్లో అగ్ర భాగానికి చెందిన సేవ మార్గం మరచి, గమ్యం ఏదో తెలియక, ఏ పిలుపు వినాలో, ఏ తలుపు తట్టాలో తెలియక తికమత పడే వారికి సరైన మార్గం వైపునకు, సిసలయిన గమ్యం వైపునకు మార్గదర్శకం వహించడం. ఈ బృహత్తర లక్ష్యంతోనే ఐపిసి స్థాపన అమల్లోకి వచ్చింది.
మానవత ధర్మమయిన ఇస్లాంను సమస్త మానవాళికి చేరవేయాలని, కాంతి కానరాక మిథ్యా మబ్బుల్లో, పైత్యం పబ్బుల్లో కొట్టుమిట్టాడే వారికి సత్యం అన్న పత్యం ఇచ్చి వారి జీవితాల్లో ధర్మ దీపాల్ని వెలిగిం చాలని, సత్యబద్ధ్దమయిన ఇస్లామీయ సమాజంలో వారు శ్వాసించేలా వారికి తర్పీదు ఇవ్వాలన్న సదుద్దేశంతో 1978లో ఐపిసి స్థాపన జరి గింది. నాడు ఓ చిన్న గదిలో కొందరు యువకుల ప్రయత్నంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన మహా వృక్ష సృజనకు దారి తీసింది. దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ ఫలితంగా నేడు అది శాఖోపశాఖలుగా విస్తరించి 14 భాషల్లో ధార్మిక సేవల్ని అందిస్తోంది. 9 భాషల్లో పత్రికల్ని ప్రచురిస్తోంది.
కువైట్‌ జీవధాత్రిపై నేడు మనం చూస్తున్న సామాజిక, ఆధ్యాత్మిక సేవలు ఏవయితే ఉన్నాయో అవన్నీ అల్లాహ్‌ా కృపా కటాక్షాల తర్వాత ఇక్కడి సత్పౌరుల, సజ్జనుల, సుగుణవమతుల, సుమతుల సహాయం తోనే అని మనం గమనించాలి. ఈ రోజు ఓ విదేశి గడ్డపై అచ్చ తెలుగు అచ్చవుతున్న నెలవంక పత్రిక వారి సహకారంతోనే సాధ్యమ యింది. సత్కార్యాల సుమ వనంలా వర్థిల్లుతున్న కువైట్‌ నగరం కల కాలం కళకళలాడుతుండాలని, ప్రతి కీడు నుండి అల్లాహ్‌ా ఈ దేశాన్ని కాపాడాలని, ప్రపంచ దేశాలన్నింటిని సంక్షేమ బాటన నడిపించి, రక్షించాలని మనసారా దయాసాగరుడయిన అల్లాహ్‌ాను దీనాతిదీనంగా వేడుకుందాం!
నిరంతర సమర క్షేత్రంజీవితం. మనిషి కళ్ళు తెరవగానే ప్రారంభమవు తుంది. మళ్ళి కళ్ళు పూర్తిగా మూతబడేంత వరకూ సాగుతుంది. ఈ మధ్య కాలంలో మనిషి తన చర్మ చక్షువులతోపాటు అంతర్‌ చక్షువు ల్ని సయితం తెరవగలగే క్షణం మహత్తరమయినది. అది జీవన సంగ్రా మానికి శంఖారావం. సంపూర్ణ సంరంభానికి ప్రారంభం. అటువంటి శుభ గఢియలు ఒకరి జీవితంలో చోటు చేెసుకునేందుకు మనం కారకు లవ్వడం ఎంత భాగ్యంతో కూడుకున్న విషయమో ఆలోచించండి! ఈ నేపథ్యంలో మహనీయ ముహమ్మద్‌ (స)వారు హజ్రత్‌ అలీ (ర) గారిని ఖైబర్‌ సంగ్రమానికి సాగనంపుతూ యుద్దం కన్నా గొప్ప కార్యం అని చెప్పిన మాట గమనార్హం. ”నీ మాధ్యంగా ఒక వ్యక్తిని అల్లాహ్‌ా సన్మా ర్గాన్ని చూపితే అది నీ పాలిట (అరబ్బుల దగ్గర)అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ఎర్ర ఒంటెల్ని పొందడం కన్నా ఎంతో ఘనతరమయినది”. (బుఖారీ) మరో ఉల్లేఖనంలో: ”అది ప్రపంచ సకల సంపదలకంటే శ్రేష్ఠతరమ యినది” అని ఉంది. (బుఖారీ)
మనం పైన తెలుసుకున్నట్ల కొంత మంది యువకుల శ్రమ ఫలితం నేటి ఐపిసి. అంటే యువకులు ఓ కార్యానికి పూనుకుంటే ఎంతటి సత్ఫ లితం చోటు చేసుకుందో చూస్తున్నాము. కాబట్టి మనందరిపై, ముఖ్యం గా ముస్లిం యవతపై ఈ బాధ్యత మరింత అధికంగా ఉంటుంది. మన లో చాలా మందికి తమ నడకలో,నడవడికలో మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌ అన్పించు కోవాలని ఉంటుంది. మరి మనలో మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌ ఎవరో తెలుసా? ‘ఎవరయితే తన స్వయాన్ని అంచనా వేయగలిగే స్థాయికి చేరుకుని, మరణానంతర జీవితం కోసం ఇహలోకంలోనే సత్కర్మల సామగ్రిని సమ కూర్చుకుంటాడో వాడే మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌’. మనిషికి ఈ స్థాయికి చేరు కోవాలంటే ‘తానేమో, తన పనేమో, ఒకరి మంచిలోకి రాడు, ఒకరి చెబ్బరలోకి పోడు’ అన్నట్టు ఉంటే కుదరదు. అందరితో కలిసి ఉండాలి. అందరి క్షేమాన్ని, శ్రేయాన్ని కోరుకోవాలి. ప్రవక్త మహనీయ ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”ఏ ముస్లిం అయితే జనులతో కలుగోలుగా, కలివిడిగా ఉంటాడో, ఇంకా వారి వల్ల ఏదయినా బాధ కలిగినప్పుడు సహనం వహిస్తాడో అతను,జనులకు దూరంగా ఉంటూ, వారి ద్వారా కలిగే బాధని ఓర్చుకునే అవకాశం లేని ముస్లింకన్నా ఉత్తముడు” (తిర్మిజీ, మిష్కాత్‌)
ప్రతి మనిషి సహజంగా సౌభాగ్యవంతమయిన జీవితాన్నే కాంక్షి స్తాడు. అతని జీవితం సంతోషాల పచ్చ తోరణాలతో కళకళలాడాలనే కోరుకుంటాడు. ఆ విషయమయి మహనీయ ముహమ్మద్‌ (స) వారి దీవెనల్ని పొందాలని మనలో ఎవరికుండదు చెప్పండి! ఆయన అన్నారు: ”నా నుండి ఓ మాట విని దాన్ని స్వయంగా ఆచరించి, యాథావిథిగా ఇతరుల వరకు చేరవేసిన వ్యక్తిని అల్లాహ్‌ా సుభిక్షంగా ఉంచుగాక!” (తిర్మిజీ)
మనం ఆయన చెప్పిన మాటకు అక్షర రూపం ఇవ్వాలంటే దాని కోసం మనం పండితులమో,పెద్ద హోదా గలవారమో, పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తులమో, గొప్ప వక్తలమో కానవసరం లేదు. మనం ఎవరమ యినా, ఏ స్థాయి, హోదాకు చెందిన వారమయినా మనం మన ధర్మాని కి ఏం చేశాము, ఏం చెయగలము? అన్న ఆత్మ సమీక్షతో ముందుకు సాగిన నాడు,పుచ్చికోడంలో కాదు ఇవ్వడంలో ఆత్మానందం దాగుందని గ్రహించిన నాడు మన భాగ్య జీవితానికి బాట, పూబాట పడుతుంది.
మనలోని ప్రతి వ్యక్తి ఏదోక విధంగా ఇతరుల్ని ప్రభావితం చేస్తున్నాడు. ఇతరుల వల్ల ఏదోక విధంగా ప్రభా వితం అవుతున్నాడు. వక్తలు, రచయితలు, నాయకులు, పండితులు మాత్రమే ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలరు అన్నది ఒక అపోహ తప్ప మరేమీ కాదు. వ్యక్తి ఎవర యినా తన మాట ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలడు. ఇతరుల్ని ఇట్టే ఆకట్టుకో గలడు. అంటే మన మంచి ప్రవర్తన మంచి ప్రభావాన్ని చూసిపతే, చెడ్డ ప్రవర్తను చెడు ప్రభావానికి కారణం అవుతుంది.
మనం మన ధర్మ సేవ ఎంత చేశామన్నది కాదు ముఖ్యం. ఎంత నాణ్యతతో చేశాము. ఎంత చిత్తశుద్ధితో చేశామన్నది ముఖ్యం. దైవప్రవక్త (స) ఒక్కో వ్యక్తి దగ్గరకు 70 సార్లకన్నా ఎక్కువ వెళ్ళేవారు అంటే, ఈ బృహత్కార్య నిర్వహణ ఫలితంగానే కొందరు ప్రవక్తలు అన్యాయంగా చంప బడ్డారు, కొందరు ప్రవక్తల్ని రంపంతో రెండుగా చీరేశారు, కొందరు ప్రవక్తలు నిప్పుల్లో నెట్ట బడ్డారు, కొందరు దూషించబడ్డారు, కొందరు చిత్రహింసలకు గురి చేయబడ్డారు అంటే మానవాళిని మాధవుని దరికి చేర్చడం, వారిని నరకాగ్ని నుండి కాపాడటం ఎంత ఘనతర కార్యమో అర్థం అవుతుంది.
కువైట్‌లో నివసించే అరబీ యువకుడు, గోవా రాష్ట్రానికి చెందిన అహ్మద్‌ లూసీ అనే తన రూమ్‌మెట్‌ని ఎప్పుడూ ప్రేమతో పలుకరించే వాడు. అయితే అతను ముస్లిం అవ్వడం చేత ఆ వ్యక్తి అంతగా పట్టిం చుకునే వాడు కాదు. ఇస్లాం గురించి ఏదయినా చెప్పాలన్నా వినేవాడు కాదు. ఓ రోజు ఐపిసి నుండి ఓ గిఫ్ట్‌ ప్యాక్‌ తీసుకెళ్ళి అతనికిచ్చాడు. అతను తీసుకోవడానికయితే తీసుకున్నాడు కానీ, తర్వాత దాన్ని చెత్తకుండి పడేశాడు. అలా అనేక సార్లు జరిగింది. అయినా ముస్లిం సోదరుడు తన ప్రయత్నాన్ని మానుకోలేదు. చివరికి ఓ రోజు ఆ వ్యక్తి ఆలోచించాడు- ఇంతలా నేను అసహ్యించుకుంటున్నా, కాదంటున్నా తనెందుకు అంతలా నన్ను బతిమాలుతున్నాడు. ఆ పుస్తకాలలో ఏముందో చదివితే పోలా, అని అంతకు క్రితమే చెత్తకుండి లో పడేసి ఓ పుస్తకాన్ని తీసుకొని చదవనారంభించాడు. అల్‌హమ్దు లిల్లాహ్‌ా తర్వాత పుస్తకాలన్నీ తిరగేసిన అతను ఇస్లాం స్వీకరించాడు.
ఇలా ఎవరు ఎవరి ఇస్లాం స్వీకరణకు కారకులవుతారో మనకు తెలియదు.ఆ విషయానికొస్తే నేడు పండితాగ్రేసర స్థాయిని అధిరో హించి, హదీసు పుస్తకాన్ని 20 సంపుటాల్లో రచించిన మౌలానా జియావుర్రహ్మాన్‌ ఆజమీ-ఒకప్పుడు ముస్లిం కాదు. అయితే తెలుగులో ‘ఇదియే ఇస్లాం’ అన్న మౌలానా అబుల్‌ ఆలా మౌదూదీ (ర) గారి పుస్తకం ఆయన జీవితాన్నే మార్చి వేసింది. ఆ పుస్తకాన్ని ఆయన హిందీలో చదివారు. ఆ పుస్తకాన్ని ఆయనకెవరిచ్చారో అతని పేరు కూడా ఆయనకు గుర్తు లేదు కానీ నేటికీ ఆయన ఆ వ్యక్తి గుర్తు చేసు కుంటూనే, మనస్ఫూర్తిగా దీవిస్తూనే ఉం టారు.
అలాగే డి.ఎమ్‌.కె వంటి నాస్తిక భావజాలం మీద ఆధార పడిన రాజకీయ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక ప్రసిద్ద తమిళ పాత్రికే యుడు అడియార్‌ ఎలా ఇస్లాం స్వీకరించారనుకుంటున్నారు? ఆయన అనారోగ్యానికి గురయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన అనుమతి మేరకు అందరూ అన్ని మత గ్రంథాలను ఆయనకందిం చారు. వాటన్నింటిని చదివిన ఆయన సత్య ధర్మం ఇస్లాం మాత్రమే అన్న నిర్ణయానికి రావడమే కాకుండా ‘నిరోట్టం’ అనే దిన పత్రికలో ఇస్లాం ధర్మానికి సంబంధించి వ్యాస పరంపరను వ్రాసారు. చివరకు ఇస్లాం స్వీకరించి తన పేరు అబ్దుల్లాహ్‌గా మార్చుకున్నారు.
చూశారా! ఇదంతా ఇటువంటి గిఫ్ట్‌ ప్యాక్‌ మాధ్యమంగానే జరిగింది. కనుక మనం సయితం ఐపిసిని సంప్రదించి ఈ బృహత్కార్యంలో భాగస్తులవుదాం. అల్లాహ్‌ా దాసుల వరకు అల్లాహ్‌ా అంతిమ సందేశాన్ని చేరవేద్దాం!

Saturday, March 14, 2015

సంతాన శిక్షణ - santana sikshana



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

సంతాన శిక్షణ - santana sikshana



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

సంతాన శిక్షణ - santana sikshana



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

సంతాన శిక్షణ - santana sikshana



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

pravakta esa (a) - ప్రవక్త ఈసా (అ) ఇస్లాం దృష్టిలో



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

ఖుర్ ఆన్ ఘనత - quran ghanata



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

సామూహిక నమాజు ప్రాముఖ్యత - saamoohika namzu pramukhyata



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

Friday, March 13, 2015

కర్తవ్యం పిలుస్తోంది! - kartavyam pilustondi



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

మానవ మహోపకారి ముహమ్మద్ (స) - maanava mahopakari muhammad



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

IPC parichayam - ఐపిసి పరిచయం



ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు

Monday, March 9, 2015

ఘర్‌ వాపసీ ఒక సమీక్ష


by - syed abdussalam

ధన్‌ వాపసీ సాధ్య పడలేదుగానీ, ఘర్‌ వాపసీ గాలీ మాతం మహా జోరుగానే వీస్తోంది. ఘర్‌ వాపసీ యొక్క పూర్వ పరాలను పరిశీలించినట్లయితే, శుద్ధి ఉద్యమం ఈనాటిది కాదు. అయితే ఒకప్పటి స్థితి వేరు ఇప్పటి స్థితి వేరు. అసలు మత మార్పిడికి పజ్రలు ఎందుకు పూనుకుంటారు? అంటే సమాధానం కష్టమే. ఒక నిజమయిన ముస్లిం మతం మార్చుకుంటాడా?అన్నది సత్యదూరం అయినప్పటికీ సామాన్య, సగటు మనిషి పరిస్థితి దీనికి పూర్తి భిన్నం అనే చెప్పాలి. ముఖ్యంగా భారత ముస్లింల స్థితిగతులను పరికించినట్లయితే ముందుకొచ్చే కారణాలు మూడు. 1) అజ్ఞానం-అంధానుసరణ. 2) పేదరికం-కటిక దారిద్యం. 3)అపోహ-కోరికల దాస్యం. పేదరికం, అజ్ఞానం పల్లె సీమల, గామ్రాల సమస్యయితే, అపోహలు-కోరికల దాస్యానికి ధనికులు, విద్యావంతులతోపాటు అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువకులు పభ్రావితం అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అజ్ఞానం-అంధానుసరణ:

ధార్మిక విద్యా లేమి బడికెళ్లే వారిలోనూ, వెళ్ళని వారిలోనూ అధిక శాతంలోనే ఉంది. భారత దేశంలో మారుమూల పాంతాల్లో వేలకొలది గామ్రాల్లో నివసించే ముస్లింలకు ఒక్క మస్జిద్‌ కుడా లేదు. మరికొన్ని గామ్రాల్లోనయినతే ఎటువంటి విద్యా ఏర్పాట్లు లేవు. ‘మనిషి తనకు తెలియని దానికి శతువ్రు’ అన్నట్టు అక్కడి ముస్లిం పజ్రలకు ఇస్లాం ఒక అపరిచిత వస్తువనే చెప్పాలి. ఎవరయినా మరణిస్తే జనాజా నమాజుక చదివించేంత అవగాహన గల వ్యక్తి కూడా లేని కారణంగా జనాజా నమాజు చదివించకుండానే ఖననం చేసిన ఉదంతాలెన్నో! సొంత చెల్లి కూతురిని మనువాడిన, ఏక సమయంలో అక్కాచెల్లెలను వివాహమాడిన సంఘటన లెన్నో! దర్గాలు-దుర్గాలంటూ దరిదరిన తలవంచిన సందర్భాలెన్నో! ఇదే స్థితి కొన్ని పట్టణాల్లోని స్లమ్‌ ఏరియాల్లో సయితం దర్శనమిస్తుంది. ఇటువంటి చోట్ల నివసించేవారు నామ మాతాన్రికి ముస్లింలుగా పిలవబడుతున్నా పాపం వారికి ధర్మం గురించి, నిజదైవం గురించి చెప్పే నాధుడు లేడు. ఉన్నా వారి నమ్మకాన్ని అమ్మకానికి పెట్టేవారే అధికం. ఇటువంటి పద్రేశాల్లో పూరి గుడిసెల రూపంలోనయినా సరే పాఠశాలలు, పార్థ్రనాలయాలు, బోధకుల ఏర్పాటు కోసం ఆయా ధార్మిక సంస్థలు పూనుకోవాలిస్సన అవసరం ఎంతయినా ఉంది. సప్తవాహిక సందర్శనాల ధ్వారా కూడా వారి అఖీదాను చక్కదిద్ది మంచి ముస్లింలుగా తీర్చిదిద్దవచ్చు. పవ్రక్త (స) వారు విద్యకు, ధార్మిక విద్యకు ఇచ్చిన విలువ ఎలాంటిదో తెలియనిది కాదు. ‘కుమారునితోపాటు కుమార్తెను సయితం విద్యా బుద్ధులు నేర్పిన వ్యక్తికి స్వర్గ శుభవార్తను అందజేశారు’ పవ్రక్త ముహమ్మద్‌ (స).

పేదరికం:

”పేదరికం అవిశ్వాస అంచున కూర్చోబెడుతుంది” అన్నారు పవ్రక్త (స)- (బైహఖీ). ఈ పరిస్థితి పల్లె పాంతాల్లోనూ, పట్టణ స్లమ్‌ ఏరియాల్లోనూ ఎక్కువ చోటు చేసుకునే అవకాశం ఉంది. అందరి మానసిక స్థితి, స్థాయి ఒకేలాగుండదు గనక మనిషి తన మానాన్ని, పరివారాన్ని కాపాడుకునే నిమిత్తం కొన్ని సందర్భాలలో ధర్మం తప్పడం మనం చూస్తూనే ఉంటాము. ఇటువంటి పేద పాంతాలను టార్గెట్‌ చేస్తూ అటు కైస్త్రవ మిషనరీలు, ఇటు వివిధ సంస్థలు పని చేస్తాయి. వారి ఆర్థిక సమస్యలను తీర్చి, వారికి ఉచిత వైద్యాన్ని అందించి, ఉచిత విద్యా పేరుతో బిగువయిన ఉచ్చులో వారిని బంధించి ధర్మమార్గం నుండి తొలగించే కుయుక్తి పన్నుతాయి. పాథ్రమిక పాఠశాలలు అధికంగా ఉండేలా చూస్తూ, చిన్నతనం నుండే పిల్లల్లో అవిశ్వాస బీజాల్ని నాటేందుకు బరి తెగిస్తాయి. ”అవసరంలో ఉన్న వ్యక్తి అవసరాన్ని తీర్చిన వారి ఇహపర అవసరాల్ని అల్లాహ్‌ా తీరుస్తాడు, వారికి విస్తృత ఉపాధి నొసగుతాడు” అన్నారు పవ్రక్త (స)- ముస్లిం). విశ్వాసం విలువ ఏమిటో తెలిసిన సహృదయులు, సంపన్నులు అలాంటి వారిని ఆదుకునే నిమిత్తం ముందుకు రావాలి. అలా జరగని పక్షంలో వారి ధర్మభష్ట్రత్వానికి వీరూ సమాన భాగస్థులవుతారని గుర్తుంచుకోవాలి. ఈ నిమిత్తం వడ్డీ రహిత రుణాలు అందజేయడం ఫలవంతం కాగలదు. ”ఒక ముస్లిం మరో ముస్లిం సోదరునికి అప్పు ఇచ్చినట్లయితే, అంతే మొత్తం రెండు సార్లు దానం చేసిన పుణ్యం అతనికి లభిస్తుంది” అన్నారు పవ్రక్త (స) – (ఇబ్ను మాజహ్‌ా). అలాగే ”దానం పుణ్యం పదింతలు, రుణం పుణ్యం పద్దెనిమిదింతలు” అని స్వర్గద్వారంపై వాయ్రబడి ఉంటుందన్నారు” పవ్రక(స). (తర్గీబ్‌వత్తర్హీబ్‌)

అపోహ-కోరికల దాస్యం:

నేటి విద్యావిధానం అనండి, పింటింగ్‌, ఎలాక్టాన్రిక్‌ మీడియా అనండి పజ్రల్లో ఇస్లాం మరియు ముస్లిం పట్ల అపోహల్ని, అపార్థాల్ని విస్తృత స్థాయిలో పచ్రారం చేస్తున్నాయి. ఈ విష పచ్రార బారిన ముస్లిం యువత సయితం పడుతోంది. కారణం ఆయా రంగాల్లో సరయిన పత్య్రామ్నాయం లేక పోవడమే. లక్షల్లో ఫీజులు చెల్లించి చదివించే గొప్ప ధార్మిక నేపథ్యం గల కుటుంబాల పిల్లలు సయితం అన్యమనస్కంగానయినా సరే షిర్క్‌ పదాలను వల్లించాల్సిన, సూర్యనమస్కారాలు చేయాల్సిన దుస్థితి అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇట్టి తరుణంలో చదువుకొనే వాతావరణాన్ని తొలగించి చక్కగా చదువుకునే వాతావ రణాన్ని కల్పించడం సుమతుల, సమాలోచనాపరుల, సంపన్నుల పథ్రమ కర్తవ్యం. అయితే ”ధనమే మనిషిని నడిపే ఇంధనం”గా భావించబడుతున్న ఈ ఆధునికంలో ఇది అంత తొందరగా కార్యరూపం దాలుస్తందని మాతం చెప్పలేము. దీనికి తోడు యువతీయువకుల్లోని విచ్చలవిడితనం, కోరికల దాస్యం కొన్ని సందర్భాలలో ధర్మ భష్ట్రత్వానికి కారణం అవుతున్నాయనడం అతిశయోక్తి ఎంత మాతం లేదు.ఏది ఏమయినా ధర్మభష్ట్రత్వానికి దొడ్డి దారులు ఎన్నో! షైతాన్‌ వాగ్గానం మనందరికి గుర్తే ఉంటుంది: ”నేను వీరి కోసం (మానవుల కోసం) నీ రుజుమార్గంలో (మాటు వేసి) కూర్చుంటాను. ఆపైన వారి ముందు నుంచీ, వారి వెనుక నుంచీ, వారి కుడి వైపు నుంచీ, వారి ఎడమ వైపు నుంచీ వాళ్లపై దాడి చేస్తాను”. (దివ్యఖుర్‌ఆన్‌-7:16,17)
బాహ్యా అస్వస్థతలో మతిస్థిమితం కోల్పోవడం అతి పెద్ద సమస్య అయితే, ఆత్మ అస్వస్థతలో మనసు చలించి మార్గ భష్ట్రత్వానికి దారి తీయడం దానికన్నా పెద్ద సమస్య. పుట్టుగుడ్డికి చూపు లేక పోవడం పెద్ద సమస్యయే కావొచ్చుగాక, కానీ బాగా చూడగలిగిన వ్యక్తి ఒక్కసారిగా చూపు కోల్పోవాల్సి రావడం దానికన్నా పెద్ద సమస్య. కాబట్టి మన మతిని, గతిని, మనస్థితిని కాపాడుకోవడం మనందరి విద్యుక్త ధర్మం!

దురాలోచన-దూరాలోచన


by - syed abdussalam umri 

ప్రజల మధ్య, వ్యక్తుల మధ్య ఎక్కడయితే నవీన టెక్నాలజీ ద్వారా దూరాలు తగ్గాయో, అక్కడే వారి మధ్య దూరాల్ని పెంచే విష వాయు వులు సయితం వ్యాప్తి చెందుతున్నాయి.ఈ క్రమంలో మన మధ్య పొడ సూపే అపోహల దుమ్మును, ఒకరి గురించి మరొకరికి ఉన్న అపార్థాల మబ్బులను దూరం చేసుకోవాల్సి ఆవశ్యకత ఎంతయినా ఉంది.ఎందు కంటే, ఒక వ్యక్తి తన ఇరుగు పొరుగున ఉన్న వారి గురించి అవగా హన కలిగి ఉండకపోతే అన్యులు అంటగట్టే రూమర్స్‌ను గుడ్డిగా అనుసరంచే ప్రమాదం ఉంది. ఫలితం ప్రక్క ప్రక్కనే నివసిస్తూ కూడా పగ ధ్వేషాలతో రగిలి పోతారు. ప్రేమ, అవగాహన ప్రజల్ని కలిపితే, ద్వేషం, అవగాహనారాహిత్యం ప్రజలను దూరం చేస్తుంది.ఈ నేపథ్యం లో-భారత దేశంలోని రెండు సముదా యాలు ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే, చారిత్రక, సామాజిక, సాంస్కృతి కంగా స్నేహ సంబంధాలు అభివృద్ధి చెంది, దేశాభ్యుదయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే కార్యక్రమాలు బలోపేతం కాగలవు. ముస్లింల గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను దూరం చేసే ప్రయ త్నమే ఈ వ్యాసం. సహృదయులు, సుమతులు అర్థం చేసుకుని కాంతి కి కళ్ళు తెరుస్తారని భావిస్తూ….

ముస్లిం పర్సనల్‌ లా:

ముస్లిం పర్సనల్‌ లా అంటే నలుగురు భార్యల ను పెళ్ళి చేసుకునే సదుపాయం అని,ఎలా పడితే అలా మూడు సార్లు తలాక్‌ ఇచ్చుకునే సౌకర్యం అని సాధారణ ప్రజలకు ఇన్జక్ట్‌ చేయడం జరుగుతోంది. కాని వాస్తవానికి వ్యక్తిగత చట్టాల సదుపాయం అన్ని సమాజాలకు ఉంది. ఈ చట్టాలు న్యాయపరంగా వివిధ స్థాయిల్లో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఉదాహరణకు హిందూ కుటుంబానికి ఆస్తి, శిస్తుల్లో మినహాయింపు ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ తెగల కు వారి కుటుంబ వ్యవహారాల విషయంలో సంప్రదాయిక చట్టాలను పాటించే హామీ ఇవ్వబడింది. గోవాలో పోర్చుగీస్‌ చట్టం పాటించే అనుమతి, కేంద్ర పాలిత ప్రాంతాలయిన అండమాన్‌,చంఢీగడ్‌, నాగర్‌ హవేలి, డామన్‌ డివ్‌, లక్షదీప్‌, పాండిచ్చేరీలో అమలు పర్చే చట్టాలు. అలాగే ఉత్తరాది హిందువులు పాటించే కుటుంబ చట్టాలు, దక్షిణాది హిందువులు పాటంచే కుటుంబ చట్టాలు భిన్నమయినవి. ఈ చట్టాల్లో సంస్కరణ రావాలని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఒక్కసారిగా యూనిఫాం సివిన్‌ కోడ్‌, ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకు వస్తా మంటే ఎవరు ఎక్కువగా వ్యతిరేకిస్తారో ఆలోచనా పరులకు తెలియని విషయమేమీ కాదు.

ముస్లిం జనాభా పెరుగుదల ఆందోళనకరమా?

ముస్లింలు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని, అందుకే వారి జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, త్వరలోనే వారి జనాభా హిందువుల జనాభాను అధిగమిస్తుందని, భారత దేశం ముస్లిం దేశంగా మారి పోతుందని లెక్కకు పొసగని విషయాలు కొందరు వేదికేక్కి మరి చెప్ప డం మనం గమనించవచ్చు. మతాల వారీగా జనాభా లెక్కల సర్వేలు గమనించినట్లయితే ఈ అపోహ ఎంత అసంబద్ధమయినదో తేలిపో తుంది. మళయాల మనోరమ ఇయర్‌ బుక్‌ 1992 ప్రకారం – 1971 జానాభా లెక్కల్లో హిందువులు 82.7/, ముస్లింలు 11.2/ ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఏటా ముస్లింల జనాభా పెరుగుదల రేటు 2.7 ఉండగా, హిందువుల జనాభా పెరుగుదల రేటు 2.3 ఉంది. అదే జమ్ము కాశ్మీర్‌లో ముస్లిం జనాభా పెరుగుదల రేటు 2.6 శాతం ఉండగా, హిందువుల జనాభా పెరుగుదల రేటు 3.7 శాతం ఉంది. ఈ లెక్కలను ప్రకారం మతాల వారీగా జనాభా పెరుగుదల స్థిరంగానే ఉందని చెప్పొచ్చు. అదే విధంగా ఇంకో వంద రెండు వం దల సంవత్సరాలు గడిచినా ముస్లింల జనాభా హిందువుల జానాభా కన్నా అధికమవ్వడం సాధ్యం కాని విషయం.

పాకిస్థాన్‌ ముస్లింల పవిత్ర భూమా?

పాకిస్థాన్‌ భారతీయ ముస్లింలకు పవిత్ర భూమి అన్న రూమర్‌ను దురాలోచనా పరులు కొందరు ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్‌కుగాని, ఇతర ఏ దేశానికిగానీ ఇస్లాంలో ప్రత్యేక స్థానం లేదు. ఇస్లాంలో మక్కాకు, మక్కాలోని కాబా గృహానికి, మదీనాకు, మదీనాలోని మస్జద్‌ నబవీకి, బైతుల్‌ మఖ్దిస్‌కు, బైతుల్‌ మఖ్దిస్‌లో అఖ్సా మసీదుకు ఉన్నంత ప్రత్యేకత ప్రపంచంలోని మరే ఇతర భూభాగినికి లేదు. ప్రపంచంలోని 57 ముస్లిం దేశాలలో పాకిస్థాన్‌ ఒక దేశం అంతే. మలేషియా, ఇండోనేషియా మాదిరిగానే పాకిస్థాన్‌ కూడా ఓ ముస్లిం దేశం. ఆయా దేశాల జెండాకు ఒక భారత ముస్లిం ఎటువంటి ప్రాధా న్యత ఇవ్వడో పాకిస్థాన్‌ జెండా విషయంలో సయితం అంతే. అలాగే పాకిస్థాన్‌ క్రికెట్‌లోగానీ, హాకీలోగానీ, ఇంకే క్రీిడల్లోగానీ గెలిస్తే సంబ రాలు చేసుకోవాలని దేశంలో ఏ ధార్మిక గురువు, ధార్మిక కేంద్రం చెప్పదు. పైగా ఇటువంటి వాటికి కడు దూరంగా మసలుకోవాలని వారిస్తారు కూడా.

హజ్జ్‌ సబ్సిడీ:

హజ్జ్‌ యాత్రికులకు ఈ సబ్సిడీ ఇచ్చేవారు. అయితే నాటి నుండే ఈ సబ్సిడీని అనేక మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే, స్థోమత గల వ్యక్తిపై మాత్రమే హజ్జ్‌ విధి అవుతుంది. దాని కోసం ఎవరి నుండి అతను సబ్సిడీ పొందాల్సిన అవసరం లేదు. ఇతర సముదాయాలకు సబ్సిడీలు ఉన్నా లేకపోయినా ముస్లింలకు ఈ సబ్సిడీ అవసరం లేదు. ఉండకూడదు.

పచ్చ జెండా, నక్షత్రం మరియు 786 ఇస్లాం చిహ్నాలా?

క్రౖౖెస్తవ మతానికి శిలువ చిహ్నం, హిందూ మతానికి ఓం లేదా స్వస్తిక్‌ చిహ్నం. ఇలా పచ్చ జెండా, నక్షత్రం మరియు 786 ఇస్లాం ధర్మానికి చిహ్నంగా భావిస్తుంటారు. సాధారణంగా ప్రజల్లో ఈ అభిప్రాయం ఎంత బలంగా ఉందంటే మత సముదాయాలకు ఏదయినా అప్పీలు చేయాలంటే ఈ గుర్తులను వాడుతుంటారు కూడా. ఏ మతం వియషం ఎలా ఉన్నా ఇస్లాం ధర్మాన్ని గుర్తించడానికి ఇటువంటి చిహ్నాలను వేటినీ ప్రతిపాదించడం కానీ, అధికారికంగా ఆమోదించడం కానీ ఇస్లాంలో లేదు.
కొన్ని ఆకతాయి చేష్టలు, మూఢనమ్మకాలు నేటి ఈ ఆధునికంలో ముస్లింలలో సయితం మనకు కనబడతాయి. అదేె కోవకు చెందినవి పై మూడు.ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే, ఇంటి గుమ్మంపైన నెలవంక, నక్షత్రం,786 రాసుకునేటంత. పెళ్ళి పత్రికల్లో ముద్రించుకునేటంత. ఉత్తరాల్లో, ప్రతికల్లో ప్రచురించుకునేటంత. తమ కారు రిజిస్ట్రేషన్‌ నెంబరులో చివరి మూడు అంకెలు 786 ఉండాలని, తమ సెల్‌ఫోన్‌ నెంబరులో 786 అంకెలు ఉండాలని భారి మొత్తాన్ని చెల్లించడానికి కూడా వెనుకాడనంత. ఇది ఒక విధంగా సినిమాల ప్రభావం అని కూడా చెప్పొచ్చు.
ఇక నెలవంక, నక్షత్ర విషయానికొస్తే ఇస్లామీయ ఆరాధనలు చంద్ర మానంతో ముడి పడి ఉంటాయి. టర్కిలో ఏర్పడిన ఉస్మానీయా ప్రభు త్వం నెలవంక, నక్షత్రాన్ని తమ జెండాపై వాడుకునేవారు. దాన్నే ఇతర దేశ ప్రజలు కూడా గుడ్డిగా అనుసరించారు అంతే తప్ప వీటకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయినా వీటి వాడకం ఎంతగా ప్రబలిం దంటే ఆమెరికాలో ముస్లింల ఉనికి, వారి పలుకుబడికి గుర్తుగా వాషిం గ్టన్‌ డి.సిలోని శ్వేత సౌధానికి ఎదురుగా ఉద్యాన వనంలో ఇటీవల ఈ చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఏది ఎలా ఉన్నా ఇస్లాంలో మాత్రం ఇటు వంటి వాటికి ఎలాంటి ధార్మిక ప్రాధాన్యత లేదు. ఇలా కొందరు వాడే జెండాను దురాలోచనా పరులు కొందరు అది పాకిస్థాన్‌ జెండా అని అనుమానాలు సృష్టిస్తూ, ముస్లింల దేశాభిమానాన్ని దెబ్బ తీసే ప్రయ త్నం చేస్తుంటారు. ఆ క్రమంలో మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ కార్యాలయాలపై వారే ఇటువంటి జెండాను ఎగరువేసిన సంఘటనలు వెలుగు చూసాయి. అయితే ఆ కుట్ర కొందరు దురాలోచనా పరుల దని తర్వాత విచారణలో తెలిసింది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భారత ప్రజలు మాత్రం వారికి ధీటుగానే, ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు, ఇస్తుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

లవ్‌ జిహాద్‌

హిందూ అమ్మాయిలను ప్రేమలో దింపి ముస్లిం యువకులు వారిని మతం మార్చుకునేలా చేస్తున్నారని, ఇదంతా ఒక ప్రణాళిక బద్ధంగా ముస్లిం సంస్థలు చేయిస్తున్నాయన్న నిందతో కూడినదిఈ దుష్ప్రచారం. కేరళ, కర్టాక శాసన సభల్తోపాటు ఇతరత్రా చోట్ల కూడా ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. స్పందించిన కర్నాటక ప్రభుత్వం ఈ విషయ మయి విచారణకు ఆదేశించగా, ఇదంతా ఉత్త పుకారు అని తేలిపో యింది. ఇక్కడో విషయం గమనించాలి! అనేక మతస్థులు నివసిస్తున్న భారత దేశంలో ఒక మతానికి చెందినవారు మరో మతానికి చెందిన వారి పట్ల, వారు ఏ మతస్తులయినా ఆకర్షితులవ్వడం సాధారణంగా జరిగే విషయం. కారణం వారు స్త్రీ పరుషులు-మనుషులు అవ్వడమే. పెద్దగా కట్టుబాట్లు లేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలే కాకా, గట్టి కట్టు బాట్లు ఉన్న కుటుంబాల్లో పెరిగిన యువతీ యుకుల్లో సయితం ఇటు వంటి ఆకర్షణ సర్వసాధారణంగా మనకు కనబడుతుంది. కొన్ని సంద ర్భాల్లో కోరిక దానికి కారణం అవ్వచ్చు, కొన్ని సందర్భాలలో క్యారెక్టర్‌ కారణం అవ్వచ్చు. ఏ మతానికి వ్యతిరేకంగా ఉన్నా భారత రాజ్యాంగాని కి వ్యతిరేకంగా అయితే వారు చేయడం లేదు. అలా అని వారి ఆ చర్య సమసర్థించడమూ మా ఉద్దేశ్యం కాదు. ఏది ధర్మం, ఏది అధర్మం అన్న అవగాహనే యువతీ యువకుల్లో లేకపోతే మిగిలేదీ స్త్రీ-పురుడు అన్న ఒక్క భావనే. ఇస్లాం ఈ విషయమయి ఎటువంటి ఆదేశాల్ని ఇస్తుందని అడిగితే మాత్రం-ఇస్లాం ఇటువంటి లజ్జారహిత పనుల్ని అనుమతిం చదు గాక అనుమతించదు, పైగా అలా ఎవరయినా రాసుకు, పూసుకు తిరిగితే దండన విధిస్తుంది. అది స్త్రీ, పరుషులకు-వారు ముస్లింలు అయినా సరే చేసే ఉపదేశం:
”(ఓ ప్రవాక్తా!)ముస్లిం పురుషులు (స్త్రీలు) తమ చూపులను క్రిందికి వాల్చి ఉంచాలని, వారు తమ మర్మాస్థానాలను కాపాడుకోవాలని, అది వారి కోసం చాలా పవిత్రమయినది అని వారికి చెప్పు”. (అన్నూర్‌: 30)
వివాహ విషయమయి ఖుర్‌ఆన్‌ ఆదేశం: ”బహు దైవారాధకులయిన స్త్రీలను,వారు విశ్వసించనంత వరకూ మీరు వారిని వివాహమాడకండి. బహుదైవారాధకురాలయిన స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినా ఆమె కంటే విశ్వాసురాలయిన బానిస స్త్రీ ఎంతో ఉత్తమం”. (అల్‌ బఖరహ్‌: 221)
ఇక ఎవరయితే ఇలా జరిగిపోతుంది, అలాజరిగిపోతుంది తెగ హంగామా చేస్తున్నారో వారే ఈ మధ్య అందుకున్న మరో నినాదం ‘బహూ లావో, బేటీ బచావో’-కోడల్ని తీసుకు రండి, కుమార్తెను కాపా డుకోండి అన్నది గమనార్హం! అసలు ఒకరి ఇంకొరికి మీద ప్రేమ పుట్ట డానికి ప్రణాళికలు అవసరమంటారా? నిజంగా ప్రేమ అనేది అసం కల్పితంగా, మానసికంగా మొదలవుతుంది. అది సహేతుకమా, కాదా అన్నది మాత్రం ధర్మం ఖరారు చేస్తుంది. అంతేగానీ బలవంతంగా ఎవరూ ఎవరినీ ఇష్ట పడేలా చేయలేము. ఆ విషయానికొస్తే ధర్మ విష యంలో సయితం బలవంతం లేదు అని చెబుతుంది ఖుర్‌ఆన్‌. ఇది మనిషి స్వేచ్ఛకు ఇస్లాం ఇచ్చే గౌరవం!

ఘర్‌ వాపసీ – తిరిగి గూటికి

భారత రాజ్యాంగం అధికరణలు 14,15,16,17 మరియు 18ల ప్రకా రం సమానత్వపు హక్కు ప్రసాదించబడింది. అలాగే మత స్వాతంత్రపు హక్కు అధికరణలు 25, 26, 27 మరియు 28ల ప్రకారం అందరికీ ఇవ్వబడింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత దేశంలో అన్ని మతాలు సమానమే. ఏ మతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన మతాన్ని అవలంబిమచవచ్చు. పౌరులకు తన మతం గురించి బోధించవచ్చు. తన మతవ్యాప్తి కోసం పాటు పడ వచ్చు. ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించు కోవచ్చు. కాని కొందరు రాజ్యాంగం ప్రసాదించే ఈ స్వేచ్ఛను భారత పౌరుల నుండి లాక్కోవాలని చూస్తున్నారు. ఘర్‌ వాపసీ అనేది ఎటు వంటి బలవంతం, బలాత్కారం లేకుండా జరిగితే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఉండకూడదు కూడా. కాని బలవంతాన రుద్దాలనుకోవడం, ఏవో ఆశలు కల్పించి ఘర్‌ వాపసీ ఎవరు చేసినా నేరమే. భారత రాజ్యాంగానికి విరుద్ధమే. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశం అభ్యుధయ బాటన పయనించాలంటే మనం దురాలోచనను మానుకొని దూరాలోచనను అలవర్చుకోవాలి. అలా మనం చేసినప్పుడే మనం భారత పౌరులుగా భారత దేశాభ్యున్న తికి కారకులం కాగలం. దాని శాంతి భద్రతలను కాపాడిన వారం కాగలం!

స్వచ్ఛ భారతం-స్వేచ్ఛా భారతం


-మౌలానా అబ్దుల్‌ ఖాదిర్‌ ఉమరీ
భారత దేశం ఓ ‘పెద్ద ఓడ’ అయితే భారతీయులంతా అందులోని ప్రయాణీకులు. మన ప్రయాణం సుఖంగా ముందుకు సాగాలంటే, సురక్షితంగా మనం గమ్యం చేరుకోవాలంటే అందరూ కొన్ని నిబంధ నల్ని పాటించాలి. నౌకా సిబ్బంధికి, ప్రయాణీకులకు మధ్య సదవగా హన, సహకారభావన ఉండాలి. ఏ ఒక్కరు మూర్ఖత్వంతో నిబంధనల్ని ఉల్లంఘించినా, బాధ్యతారాహిత్యంగా ఓడను గుల్ల చేసినా, గుల్ల చేస్తున్న వారిని పల్లెత్తుమాట అనకుండా, వారిని ఆపక పోయినా పరి ణామం భయంకరంగా ఉంటుంది. ‘హమ్‌తో డూబే హైఁ సనమ్‌, తుమ్‌కో భీ లే డూబేఁగే’ అన్నట్టు వారితోపాటు అందరూ మునగడం ఖాయం!
సోదర సోదరీమణులారా! ఈ ఉపమానాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ పరిస్థితులను గమనించండి.ఒకవైపు దుర్మార్గులు, నేరస్థులు, అధికార పిపాసులు, అక్రమార్కులు, అవినీతి ధురంధరులు, కులతత్వాన్ని, మత తత్వాన్ని రెచ్చగొట్టేవారు, అధికార దుర్వినియోగం ద్వారా ధనార్జనకు పాల్పడేవారు, ప్రజల హక్కుల్ని కాలరాసేవారు, బలహీనుల్ని అంగ బలం, అండబలం, ధనబలంతో,అణగద్రొక్కే వారు, జూదరులు, వ్యభి చారులు, త్రాగుబోతులు, సమాజాన్ని లోలోనే గుల్ల చేస్తున్నారు. ఫలి తంగా దుర్మార్గం, దౌర్జన్యం, అత్యాచారాలు, అక్రమాలు, లంచగొండి తనం, పీడన పెచ్చరిల్లి మానవత వీధి వీధినా విలవిల్లాడుతూ. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
మరోవైపు సజ్జనులుగా, సదాచారులుగా, సద్వర్తనులుగా ధర్మకర్తలు గా, ధార్మిక పండితులుగా, ఆధ్యాత్మిక గురువులుగా, శాంతిదూతలు గా, ధర్మపరాయణులుగా, దైవభక్తులుగా దేశాభిమానులుగా పరిగణిం చబడే వారు-తమ కళ్ళెదుటే నేరాలు, ఘోరాలు జరుగుతున్నా ప్రేమో న్మాదులు జాతి ఆడపడచులపై యాసీడ్‌ దాడులు చేస్తున్నా కామాం ధులు అమ్మాయిలపై పైశాచికంగా విరుచుకుపడుతున్నా ప్రజల సమస్యల్ని ఎన్నడూ పట్టించుకోని ప్రజాప్ర తినిధులు, అధికార పిపా సులు, స్వార్థపరులు, పరాన్నజీవులు స్వల్ప ప్రయోజనాల కోసం, ఓటు కోసం, సీటు కోసం నోటుతో, మద్యంతో ఆత్మగౌరవాన్ని కొంటున్నా, సమాజంలో కులతత్వాన్ని, మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఒక వర్గం మరొక వర్గంపై దాడులు చేస్తున్నా, మారణ హోమాన్ని రగిలింస్తున్నా, యువతీ యువకులు పాశ్యాత్య నాగరికతకు బానిసలై స్వేచ్ఛ పేరుతో, ప్రేమ పేరుతో కుటుంబ గౌరవాన్ని మంటగలుపుతున్నా, యువత మద్యం, మాదకద్రవ్యాలకు, అక్రమ సంబంధాలకు దాసోహమంటూ తమ బ్రతుకుల్ని, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నా, జాతి కూతుళ్ళు వరకట్న కాళనాగుల కాటుకు బలైపోతున్నా సభ్యసమాజం సిగ్గుపడే విధంగా వారాంతపు కాలక్షేపం పేరిట యువతీయువకులు లైంగిక విశృంఖలత్వానికి బానిసలై ఎయిడ్స్‌ మహమ్మారిని బలపరు స్తున్నా – తమకు ఏమీ పట్టనట్లు, తమకెలాంటి సంబంధం లేనట్టు వ్యవహరిస్తే వారి పరోక్షంగా నేరాలను, నేరస్తులను ప్రోత్సహిస్తునట్లే! అపరాధం చేసిన వారితోపాటు అపరాధాన్ని సహించి నిర్లిప్తంగా ఉండేవారు కూడా నైతికంగా ధర్మం దృష్టిలో నేరస్తులే, శిక్షార్హులే!
తమ ఇంట సమస్త పారిశుద్ధ్యపు నియమాలు పాటిస్తే, తమ కుటుం బానికి మహమ్మారి సోకదని, తమ ఇంటిని కాపాడుకుంటే, వీధిలో వ్యాపిస్తున్న మంటల నుండి తప్పించుకోవచ్చని భ్రమకు లోను కావ డం మూర్ఖత్వమే అవుతుంది. తమతోపాటు తమ పరిసరాలను చక్క బరచడం, చెడును నిరోధించడానికి నడుం కట్టుకోవడం జరగకపోతే వచ్చే మహమ్మారి అయినా, అగ్నికీలలైనా మనల్ని దయతలచి వదిలి పెట్టవని గుర్తించాలి.ఈ నేపథ్యంలోనే విశ్వప్రభువైన అల్లాహ్‌ా సెలవి స్తున్నాడు: ”(జనులారా!) రానున్న ఆపద నుండి రక్షించుకోండి. దాని విపత్తు కేవలం మీలో అపరాధులయిన వారి వరకే పరిమితం కాదు. తెలుసుకోండి! అల్లాహ్‌ కఠినంగా శిక్షించేవాడు”. (దివ్యఖుర్‌ఆన్‌:8:25)
భిన్న సంస్కృతులకు కేంద్రంగా ఉన్న భారత దేశంలో ఒకరి వాదన లో, విధానంలో మరొకరికి ఏదోక లోటు కన్పిస్తూనే ఉంటుంది. నాస్తికునికి ఆస్తికవాదం, ధనికునికి కమ్యూనిజం, పొలీటిషన్‌కి విప్లవ నినాదం, లంచగొండికి నిజాయితీ నినాదం కంపరం కలిగిస్తాయి. వాదం,విధానం ఏదయినా,అవతలి వారిలో స్పష్టంగా తప్పు కనబడు తున్నా నొప్పించకుండా వారి తప్పుపను తెలియజేయడం, ఏ ఒక్క రికి హాని కలుజేయకుండా ఆపడం, మనం సయితం ఏ ముసుగూ లేకుండా బ్రతకడం ఉత్తమం.
ఈ నిమిత్తం. సజ్జనులు, శ్రేయోభిలాషులు,మంచిని ప్రేమించేవారు, తమ వీధి నుంచే, తమ పేట నుంచే మంచిని, మానత్వాన్ని, మత సామరస్యాన్ని, పరిశుద్ధతను పెంపొదించేందుకు నడుం బిగించి ముందుకు వచ్చినప్పుడే స్వచ్ఛ భారతం-స్వేచ్ఛా భారతం సాధ్యమవు తుంది.

అఖీఖా ఆదేశాలు


by - syed abdussalam umri 
‘అస్సలాము అలైకుమ్‌’ అన్నాడు రాఫె, అబ్దుల్లాహ్‌ా గారిని ఉద్దేశించి.
‘వ అలైకుముస్సలామ్‌ రహ్మతుల్లాహి వ బర కాతుహు’ ఎలా ఉన్నారు?
అల్‌హమ్దు లిల్లాహ్‌ బాగున్నాను.
”నేను ఓ పల్లెటూరివాణ్ణి మీతో మాట్లాడాలని వచ్చాను”.
‘రండి కూర్చొండి!’
చూడండి! నా పేరు రాఫె, నాకు ధార్మిక పరి జ్ఞానం అంతగా లేదు. నాకు ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆశగా ఉంది. ముఖ్యంగా నాకు శిశువుని గురించి తెలియజేయండి.
చూడండి రాఫె గారు ఇస్లాం సంతాన ప్రాప్తి కొరకు పాటు పడమని చెబుతుంది. మరియు అధిక సంతానాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. దీని గురించి చాలా హదీసులు కూడా ఉన్నా యి.ఎక్కువ సంతానాన్నిచ్చే స్త్రీని నికాహ్‌ా చేసు కోండి, ప్రళయ దినాన నేను వారి ఆధిక్యతపై గర్విస్తాను. అని ప్రవక్త (స) అన్నారు. (అబూదావూద్‌, నసాయి)
ప్రవక్త (స) ఇంకా ఇలా ప్రవచించారు: ”నికాహ్‌ నా సున్నత్‌ (సంప్రదాయం) ఎవరైతే నా సున్నత్‌ని అనుసరించరో వారు నాలోని వారు కారు. పెళ్ళి చేసుకోండి నేను మీ వల్ల అన్ని సముదాయాలకంటే ఎక్కువ ఆధిక్యతను పొంది ఉంటాను”. (ఇబ్నె మాజహ్‌)
మరో హదీసులో ప్రవక్త (స) ఇలా ప్రభో దించారు: ”నిస్సందేహంగా స్వర్గంలో దాసుడి అంతస్తులను పెంచడం జరుగుతుంది. అప్పుడు దాసుడు ఈ పదవోన్నతి ఎక్కడిది? అని అడగ్గా-‘నీ తదనంతరం నీ సంతానం నీకై చేసిన మన్నింపు వేడుకోలుకి బదులు’ అని అల్లాహ్‌ా సమాధానమిస్తాడు. (అహ్మద్‌, ఇబ్నెమాజహ్‌)
అల్లాహ్‌ ఇలా అన్నాడు: ”ఈ సంపద, సంతా నము ఐహిక జీవితపు అలంకారాలు”. (కహఫ్‌:46) మరో చోట ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ా తాను కోరిన వారికి కూతుళ్ళునూ, తాను కోరిన వారికి కొడుకులను ప్రసాదిస్తాడు. మరియు తాను తలచినవారికి కొడుకులనూ, కూతుళ్ళ నూ కలిపి ఇస్తాడు, తాను తలచిన వారికి అసలు సంతానమే ఇవ్వడు”. (షూరా:49-50)
మరి ప్రజల్లో కొందరు కూతురు పుట్టిందన్న శుభవార్తను తెలియజేస్తే సంతోషించరు కదా?!
ఇది అనాగరికతపు అజ్ఞానుల మూఢాచారం. వీరు ఆడపాప జన్మిస్తే తలవంపుగా భావి స్తారు. కాని ఇస్లాం సంపూర్ణమయిన తర్వాత ఈ దుర్వ్యవస్థను పూర్తిగా రూపుమాపింది. అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు: ”వారిలో ఎవడి కైనా కూతురు పుట్టిందనే శుభవార్తను అంద జేస్తే అతడి ముఖాన్ని నల్లని ఛాయలు ఆవరి స్తాయి. అతడు లోలోన కుమిలిపోతాడు. ఈ దుర్వార్త విన్న తర్వాత ఇక లోకులకు ఎలా ముఖం చూపాలని నక్కి నక్కి తిరుగుతూ ఉం టాడు. అవమానాన్ని భరిస్తూ కూతుర్ని ఇంట్లో అట్టి పెట్టు కోవాలా లేక ఆమెను మట్టిలో పూడ్చి పెట్టాలా? అని ఆలోచిస్తాడు. చూడు వారు చేసే నిర్ణయాలు ఎంత దుష్టమైనవో”. (నహల్‌: 58-59)
ప్రవక్త (స) ఇలా శుభవార్తను తెలియజేసారు ”ఎవరికైతే ముగ్గురు కూతుళ్ళు లేక చెల్లెళ్ళు, ఇద్దరు కూతుళ్ళు లేదా చెల్లెళ్ళు ఉండి, వారిని మంచిగా పెంచి పోషించి, వారి పట్ల సహనం కలిగి ఉండి, వారి విషయంలో అల్లాహ్‌ాకు భయపడ్డాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.” (తిర్మిజి, బుఖారి)
చూడండి! ప్రవక్త (స) గారికి నలుగురు కూతుళ్ళు-జైనబ్‌, ఫాతిమ, రుఖయ్య, ఉమ్మె కుల్సూమ్‌. కూతుళ్ళు నరకం నుండి కాపాడే సాధనాలు. ”ఎవరయినా వీరివల్ల పరీక్షకి గురై, వారితో మంచిగా ప్రవర్తిస్తే వీరు వారిని నరకాగ్ని నుండి అడ్డుకుంటారు”. (బుఖారి, ముస్లిం) ”ఇద్దరు కూతుళ్ళని పెంచి పెద్ద చేసినవాడు మరియు నేను రేపు ప్రళయదినాన ఇలా ఉంటాము” అని తన రెండు వ్రేళ్ళని జోడిం చారు ప్రవక్త (స). (ముస్లిం)
ఇప్పుడు శిశువునికి ఏమి అవసరమో తెలి యజేస్తాను: 1) అజాన్‌: శిశువు జన్మించిన పుడు చెవిలో అజాన్‌ ఇవ్వడం ప్రవక్త (స) గారి సంప్రదాయం.(సున్నత్‌)
ఒక హదీసులో ఇలా ఉంది అబూరాఫె ఇలా అన్నారు హజ్రత్‌ ఫాతిమా (ర) గారికి అప్పుడే పుట్టిన హజ్రత్‌ అలీ (ర) గారి జేష్ట పుత్రుడైన హసన్‌ (ర) గారి చెవిలో ప్రవక్త (స)ను అజాన్‌ ఇస్తూ నేను చూసాను. (అబూదావూద్‌ – తిర్మిజీ)

పరమార్థం:

ఇబ్నె ఖయ్యిమ్‌(ర) ఇలా అన్నారు: ‘మనిషి పుడమి కాలు మోపిన వెంటనే తన నిజ ప్రభువు యొక్క ఘనతని, గొప్పతనాన్ని వినాలి. మరియు ఇది అతడు ఇస్లాంలో ప్రవేశించాడని సాక్ష్యం’. (తొహ్‌ఫతుల్‌ మౌలూద్‌)

తహ్నీక్‌:

తహ్నీక్‌ చేయటం ప్రవక్త (స) గారి విధానము. అబూ మూసా(ర) ఇలా అన్నారు: ”నాకు కుమారుడు జన్మించాడు. అతన్ని నేను ప్రవక్త (స) దగ్గరకు తీసుకెళ్ళాను ప్రవక్త (స) అతన్ని ‘ఇబ్రాహీం’ అని పేరు పెట్టి ఖర్జూరం తో తహ్నీక్‌ చేశారు. అతనికి శుభాలు ప్రాప్తిం చాలని దుఆ చేసి మరీ నాకు అప్పగించారు”. (బుఖారి ముస్లిం)
తహ్నీక్‌ అనగా ఖర్జూరం నమిలి వ్రేలిపై పెట్టి శిశువుని నోటిలో పోనిచ్చి వ్రేలుని కుడి ఎడ మలకు కదిలించాలి. గుణవంతులతో చేయిస్తే ఇంకా మంచిది. తహ్నీక్‌ కోసం తేనెని కూడా ఉపయోగించవచ్చు.

అఖీఖహ్‌:

శిశువుని వెంట్రుకలు తియ్యడం ముస్తహబ్‌. మనవడు హజ్రత్‌ హసన్‌ జన్మించినప్పుడు ప్రవక్త (స) కూతురు ఫాతిమా (ర) గారిని ఉద్దే శించి-‘అతని తల వెంట్రుకలు తియ్యమని, వెంట్రుకల బరువుకు సమానంగా వెండిని పేదవారికి పంచపెట్ట’మన్నారు. (అహ్మద్‌)
అనస్‌ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) హుసైన్‌ (ర) పుట్టిన ఏడవ రోజున తల వెంట్రుకలు తీయించి వాటి బరువంత వెండిని దానం చేసారు. (తొహ్‌ఫతుల్‌ మౌలూద్‌)
తల వెంట్రుకలు తీయడం ఆడ మగ శిశులిరువురికీ వర్తిస్తుంది. జాఫర్‌ బిన్‌ ముహమ్మద్‌ ఇలా అన్నారు: హజ్రత్‌ ఫాతిమా (ర) హసన్‌, హుసైన్‌, జైనబ్‌, ఉమ్మెకుల్సూమ్‌ల తల వెంట్రుకలు తీసారని వాటి బరువుకు సమానంగా వెండిని దానం చేసారని మా తండ్రి చెప్పారు. (ముఅత్త ఇమామ్‌ మాలిక్‌)
”అఖీఖ” అంటే అసలు మాతృ గర్భంలో నుంచి పుడమిపై పాదం మోపిన శిశువు తలవెంట్రుకలను తొలగించడం. ఎందుకంటే ఆ తల వెంట్రుకలు అపరిశుద్ధమైనవి. కాబట్టి శిశువు జన్మించిన ఏడవ రోజున శిరోముండనం చేసి అల్లాహ్‌ా ఒక ప్రాణిని ప్రసాదించినందుకు కృతజ్ఞత గా ఆ ప్రాణికి బదులు ఒక పశువును జిబహ్‌ చెయ్యాలి. మగ శిశువు కొరకు రెండు మేకలు, ఆడ శిశువు కొరకు ఒక మేక. స్థోమత లేని యెడల మగ శిశువు కొరకు కూడా ఒకటి ఇస్తే సరి పోతుంది. ‘ప్రతి శిశువు తన అఖీఖా కి బదులు తాకట్టు ఉంటుంద’ని హదీసులో ఉంది (ముస్నద్‌ అహ్మద్‌)
అఖీఖ అన్నది శిశువు తండ్రి బాధ్యత. తాను చిన్నతనంలో చెయ్యని యెడల లేదా తండ్రి చెయ్యకుండానే మరణించిన యెడల కొడుకు తన తరపు నుండి చెయ్యగలడని కొందరి పండితుల అభిప్రాయం.

ఖితాన్‌:

ఖత్నా అన్నది ఇస్లాం సంప్రదాయం, అది ప్రకృతి ధర్మం కూడా. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మనిషి ముఖ్యంగా చెయ్యాల్సిన ఐదు విషయాలలో ఖితాన్‌ చేయించుకోవడం కూడా ఒకటి”. ఇది తప్పనిసరి. శిశువు ఒకవేళ ఖితాన్‌ పొందినట్లుగా జన్మిస్తే మళ్ళీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఖితాన్‌ కూడా ఏడవ రోజున చెయ్యాలి.
హజ్రత్‌ జాబిర్‌ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) హసన్‌ హుసైన్‌ (ర)లను ఏడవ రోజున ఖితాన్‌ చేయించారు. అలా కుదరకపోతే తర్వాత చెయ్యచ్చు. తర్వాతయినా తప్పనిసరిగా చెయ్యాలి.

నామకరణం:

హదీసులో ఇలా ఉంది: ‘అల్లాహ్‌ాకు అతి ప్రియమైన పేర్లు అబ్దుల్లాహ్‌ా, అబ్దుర్రహ్మాన్‌’. (ముస్లిం) హదీసులో ఇలా ఉంది: ”మీరు ప్రవక్తల పేర్లు పెట్టండి”. (అహ్మద్‌) అలాగే అబ్ద్‌ అని వచ్చే పేర్లు పెట్టవచ్చు. అబ్దుల్లతీఫ్‌, అబ్దుర్రహీం, అబ్దుస్సమద్‌. వగైరా. గమనిక: బహుదాస్య భావాన్ని వ్యక్తపరిచే పేర్లు పెట్టకూడదు. ఉదాహ రణకు – అబ్దున్నబీ, అబ్దుర్రసూల్‌ మొదలయినవి.

మహా హక్కు మహత్తు


by- syed abdussalam umri 
ఈ ప్రపంచంలో హక్కులు అనేకం. తల్లిదండ్రుల హక్కులు, భార్యా పిల్లల హక్కులు, బంధుమిత్రుల హక్కులు, ఇరుగుపొరుగు వారి హక్కులు, ముస్లింల హక్కులు, ముస్లిమేతరుల హక్కులు… వీటిలోని ప్రతి ఒక్కటి ముఖ్యమయినదే. కానీ, ఈ హక్కులన్నింటిలోకెల్లా మహా హక్కు – మనందరి సృష్టికర్తకు, నిజ ఆరాధ్యునికి మనమీదున్న హక్కు. ఎందు కంటే,
ఈ హక్కు మనకు ఉనికిచ్చిన వాని హక్కు, అధికారులకు అధికారి, రాజులకు రాజు అయిన అల్లాహ్‌ హక్కు. అతల, వితల, సుతల తలా తల, రసాతల, మహాతల, పాతాల, భూలోక, భువర్లోక, స్వర్లోక, మహా లోక, జనోలోక, తపోలోక, సత్యలోక-14 లోకాలుగా చెప్పబడుతున్న ఇవే కాదు ఇంకెన్ని లోకాలున్నా అన్నింటికి అధిపతి, యజమాని (రబ్బుల్‌ ఆలమీన్‌) అల్లాహ్‌ా హక్కు. ఆయనే ప్రతి వస్తువు నిర్మాత. ఆయనే శూన్యం నుండి సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు. ఆయనే మనల్ని అల్పమయిన బిందువుతో పట్టించి నఖ,శిఖ పర్యంతం అందంగా తీర్చిదిద్దినవాడు. మూడు చీకట్ల్ల లోపల తల్లి గర్భంలో మన యోగక్షేమా ల్ని చూసిన వాడు. భూమి మీద మనం అడుగు పెట్టక ముందే మనక్కా వాల్సిన వస్తువు సామగ్రినంతటిని సమకూర్చి పెట్టినవాడు. అంతటి ఘనాఘనుడు, మహిమాన్వితుడు, మహోన్నతుని హుక్కు ఎంత మహత్తర మయినదయి ఉంటుందో ఆలోచించండి! ఖుర్‌ఆన్‌ తెర లేపుతున్న ఈ యదార్థం ఎంత గొప్పదో యోచించండి! ”మరియు ఆయనే మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి, మీకేమి తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారు చేసింది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని”. (అల్‌ ఇమ్రాన్‌:6)
మనం పుట్టినప్పుడు మనకెలాంటి లోక జ్ఞానం లేదు. అదృష్టదురదృ ష్టాలంటే ఏమిటో కూడా మనకు తెలియదు. ప్రస్తుతం మనం అనగలుగు తున్నాం, వినగలుగుతున్నాం, కనగలుగుతున్నాం, మనుగడ సాగించగలు తున్నాం. అయినా మనం ఆయన పట్ల కృతజ్ఞులుగా మనగలగ లేక పోతున్నాం!? ఇదే విషయాన్ని అల్లాహ్‌ా ఇలా ప్రశ్నిస్తున్నాడు: ”ఓ మానవుడా! పరమ దాత అయిన నీ ప్రభువును గూర్చి ఏ విషయం నిన్ను మోసంలో పడ వేసింది?”. (ఇన్ఫితార్‌: 6)
మరో చోట ఇలా ఉంది: ”వాస్తవానికి ఆకాశాలను, భూమిని సృష్టించడం, మానవులను సృష్టించడం కంటే ఎంతో ఘనాఘన విష యం. కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు”. (గాఫిర్‌: 57)
అల్లాహ్‌ మనకు ప్రసాదించిన ఈ తెలివీతేటలు, శక్తియుక్తులు ఎందు కోసం? మనం మన జీవితాన్ని ఆయనకు అంకితం చేయ డానికి, ఆయన్ను మాత్రమే ఆరాధించడానికి. ”యాదార్థం – నేను మానవులను, జిన్నాతులను పుట్టించింది కేవలం వారు నన్ను ఆరాధించడానికే”. (జారియాత్‌: 56)
ధర్మం నాలుగు పాదాల నడవాలని,శాంతి, సుస్థిరతల వాతావరణం నెలకొనాలని, ఎలాంటి భయం, ఆందోళనకర పరిస్థితులు ఉండ కూడదని, ప్రతి ఒక్కరూ సజావుగా వారి మనుగడ కొనసాగించగలిగే వాతావరణం నెలకొనాలని మనలోని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. దానికి మనం ఏం చేయాలో మనందరి ప్రభువయిన అల్లాహ్‌ా సెలవి స్తున్నాడు: ”వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు సహవర్తులు గా ఎవరినీ కల్పించకూడదు”. (అన్నూర్‌: 55)
(ఇలా గనక మనం చేస్తే) ”మీలో విశ్వసించి, సత్కార్యాలు చేసే వారితో అల్లాహ్‌ా చేస్తున్న వాగ్గానం – ‘వారి పూర్వీకుల్ని భూమికి ఉత్తారాధికారులుగా చేసినట్లే వారికి కూడా తప్పకుండా ప్రాతినిథ్యం వొసగుతాడు. తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కోరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తాడు. వారికున్న భయాందోలనల స్థానే శాంతిభద్రతలను కల్పిస్తాడు”. (అన్నూర్‌: 55)
అయితే మనిషి చేస్తున్నదేమిటి? దయానిధి అయిన అల్లాహ్‌ా సన్నిధిని వదలి చెట్టు, పుట్ట, రాయి, రప్ప, వాగు, వంకను మ్రొక్కు తున్నాడు. అవి సంతృప్తి ఇవ్వకపోతే ‘తానే స్వయంభువు’ అని బీరాలు పోతున్నాడు. ”ఏమిటి, నిన్ను మట్టితో తర్వాత వీర్య బిందు వుతో పుట్టించిన, ఆ తర్వాత నిన్ను సంపూర్ణ మానవుడిగా తీర్చి దిద్దిన ఆయన్నే (అల్లాహ్‌ానే) ధిక్కరిస్తున్నావా?” (కహఫ్‌: 37)
ఒక రూపాయి, అర్థ రూపాయి సహాయానికే మనం కృతజ్ఞతల్ని కోరుకుంటామే, మరి మనకు అపార అనుగ్రహాలతో సత్కరించన ఆపద్బాంధవుని యెడల ఎందుకీ కృతఘ్నత? చేసిన సహాయన్ని మరచిపోవడం మిత్ర ద్రోహం అయితే, అల్లాహ్‌ చేసిన అగణ్య మేళ్లను మరచి జీవించడం దైవద్రోహం కాదా? ఆయన్ను వదలి అన్యులను ఆశ్రయించడం, ఆరాధించడం మహాపరాధం కాదా?
సహీహ్‌ ముస్లిం మరియు బుఖారీలోని ఓ హదీసులో హజ్రత్‌ మఆజ్‌ బిన్‌ జబల్‌ ఇలా అంటున్నారు: ”నేనో దినం ప్రవక్త (స) వారి వెనకాల సవారీ అయి ఉన్నాను. ఆయన నన్నుద్దేశించి – ”ఓ మఆజ్‌!” అన్నారు. ‘ఓ దైవప్రవక్తా నేను హాజరయు ఉన్నాను’ అన్నాను. అప్పుడాయన (స) – ”నీకు తెలుసా? దాసులపై అల్లాహ్‌ాకు గల హక్కు ఏమిటో? అల్లాహ్‌ాపై ఆయన దాసులకు గల హక్కు ఏమిటో?”. నేనన్నాను – ‘అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’. అందుకాయాన-”దాసులపై అల్లాహ్‌ాకు గల హక్కేమిటంటే, వారు ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆయనతోపాటు ఇంకె వ్వరినీ సాటి కల్పించరాదు. మరియు అల్లాహ్‌ాపై ఆయన దాసులకు గల హక్కు ఏమిటంటే, ఆయన్ను మాత్రమే ఆరాధించి, ఆయనతో పాటు ఇతరులెవ్వరినీ సాటి కల్పించకుండా జీవితం గడిపిన వారిని ఆయన శిక్షించడు”. (ముత్తఫఖున్‌ అలైహి)
ఆయన దాసులమయిన మనం ఆయన ఆదేశాల హద్దుల్లోనే, ఆయన ప్రవక్త (స) బోధనల పద్దుల్లోనే జీవించాలి. ఆయన మనకు ప్రసాదిం చిన అనుగ్రహాలకుగాను క్రియాత్మకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్‌ ఇలా అంటున్నాడు:”ఒకవేళ మీరు గనక కృతజ్ఞులుగా మసలు కుంటే నేను మీకు మరింత సమృద్ధిని కలుగజేస్తాను. ఒకవేళ మీరే గన కృతఘ్నతకు పాల్పడితే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినంగా ఉం టుంది”. (ఇబ్రాహీమ్‌:7)
క్రియాత్మకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే ఓ విధానాన్ని ఆయనే స్వయం హదీసె ఖుద్సీలో తెలియజేస్తున్నాడు: ”నా దాసుడు నా సామీ ప్యం పొందడానికి పాటించే పద్ధతుల్లో నేను అతనిపై విధిగావించిన వాటి(ఫరాయిజ్‌)ది ప్రథమ స్థానం.ఇవే కాక అతను నఫిల్‌ (స్వచ్ఛంద) ఆరాధనల ద్వారా కూడా నా సామీప్యాన్ని పొందే ప్రయత్నం చేస్తుం టాడు. కడకు నేనతన్ని ప్రేమించసాగినప్పుడు అతను వినే చెవినయి పోతాను. అతను కనే కంటినయి పోతాను. అతను పట్టుకునే చేయి నయి పోతాను. అతను నడిచే కాలినయి పోతాను. అతను కోరిందల్లా అతనికనుగ్రహిస్తాను. అతను శరణ కోరిన వాటి నుండి అతన్ని కాపా డుతాను”.(బుఖారీ)
అంటే, అల్లాహ్‌ను అంతలా ఆరాధించే దాసుడు, అల్లాహ్‌ా ప్రేమను పొంది ఏ స్థాయికి చేరుకుంటాడంటే, ఆయన అనమన్నదే అంటాడు. ఆయన వినమన్నదే వింటాడు. ఆయన కనమన్నదే కంటాడు. ఆయన తినమన్నదే తింటాడు. ఆయన నడవమన్న దారినే నడుస్తాడు. ఆయన చేయమన్న కార్యాలే చేస్తాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వెయ్యడు. ”అస్లిమ్‌-విధేయత చూపు” అని అల్లాహ్‌ా ఆదేశించినప్పుడల్లా ‘అస్లమ్తు-విధేయుణ్ణయ్యాను’ అంటూ క్రియా పరంగా తాను నిజ ముస్లిం అని నిరూపించుకుంటాడు.
ఇక అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి అంటే, కేవలం నమాజు, రోజా, హజ్జ్‌, జకాత్‌-ఇవి మాత్రమే కాదు. మన జీవితానికి సంబం ధించిన ప్రతి అంగం, ప్రతి రంగం ఆయన రంగులో రంగరించాలి. దుఆ చేయడం కూడా అల్లాహ్‌ ఆరాధనే. మొకుబడి చెల్లించడం కూడా అల్లాహ్‌ా ఆరాధనే. భయ పడటం, ఆశలు పెట్టుకోవడం కూడా అల్లాహ్‌ా ఆరాధనే. అల్లాహ్‌ా మాటల్లో చెప్పాలంటే: ”ఇలా ప్రకటించు – నిశ్చయంగా నా నమాజు, నా సకల ఉపాసనా రీతులు (ఖుర్బానీ), నా జీవితం, నా మరణం సమస్త లోకాలకు ప్రభువయిన అల్లాహ్‌ా కొరకే”. (అన్‌ఆమ్‌:162)
విశ్వ ప్రభువయిన అల్లాహ్‌ మహా హక్కు మహత్తు గురించి తెలిసి కూడా ఎవరయినా షిర్క్‌కి పాల్పడినట్లయితే, ఆయనతోపాటు ఇతరుల్ని సాటి కల్పించి పూజించినట్లయితే వారు ఓ విషయం తెలుసకోవాలి! క్షమించరాని నేరం షిర్క్‌: ‘నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భాగస్వా మిని కల్పించటాన్ని (షిర్క్‌ని) ఎన్నటికీ క్షమించడు. అది తప్ప దేన్న యినా తాను కోరిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్‌కు సాటి కల్పించిన వాడే, వాస్తవంగా మహాపరా ధానికి పాల్పడినవాడు”. (అన్నిసా:48) ఎందుకంటే, ”నిశ్చయంగా అల్లాహ్‌ాకు భాగస్వాముల్ని కల్పించడం (షిర్క్‌) ఘోరాతిఘోరమయిన దౌర్జన్యం”. (లుఖ్మాన్‌: 13)

సర్వ కర్మ వినాశిని షిర్క్‌:

”ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్క్‌) చేసినట్లయితే నీ కర్మలన్ని వ్యర్థమయి పోతాయి. మరియు నీవు నష్టాని కి గురయిన వారిలో చేరిపోతావు”. (అజ్జుమర్‌: 65)

స్వర్గ అధిరోహణకి అవరోధం షిర్క్‌:

”వాస్తవానికి ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాముల్ని చేసేవారికి, నిశ్చయంగా అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి నివాసం నరకాగ్నియే!”. (మాయిదహ్‌: 72)
ప్రియ పాఠకుల్లారా! మనం బాల్యం నుండి తౌహీద్‌ మరియు షిర్క్‌ అన్న పదాలు తరచూ వింటూనే ఎదిగాము. అయితే ఆ రెండు పదాల వాస్తవ అర్థం తెలియని కారణంగా మనలోని చాలా మంది తౌహీద్‌కు దూరంగా, షిర్క్‌కి అతి దగ్గరగా జీవిస్తున్నారు. ఒక విధంగా చెప్పా లంటే షిర్క్‌నే తౌహీద్‌గా భావిస్తున్నారు. కాబట్టి మన వైఖరి మారాలి. మనలో మార్పు రావాలి. ఇలా జరగాలంటే తౌహీద్‌ మరియు షిర్క్‌ గురించి ఖచ్చితమయిన జ్ఞానం మనకుండాలి. ఈ మార్గంలో షైతాన్‌ పన్నే కుట్రలు, వేసే ఎత్తుగడలు, విసిరే విష వలయాలు నుండి మనం కడు అప్రమత్తంగా ఉండాలి. అందుకు అల్లాహ్‌ా ఆదేశం మనందరికి శిరోధార్యం అవ్వాలి.
”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్య పాలనగా అల్లాహ్‌ా యెడల భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు (అల్లాహ్‌కు) విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మీకు మరణం రాకూడదు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 102)

ప్రవక్తలందరూ తమ సంతానానికి చేసిన అంతిమ హితవు మనందరి కి ఆచరణీయం అవ్వాలి:

”నా బిడ్డలారా! నిశ్చయంగా అల్లాహ్‌ మీ కొరకు (ఇస్లాం) ధర్మాన్నే ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు (అల్లాహ్‌ాకు) విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మీకు మరణం రాకూడదు సుమా!”. (అల్‌ బఖరహ్‌:132)

ఇస్లాం విహాంగ వీక్షణం


by- syed abdussalam umri

అజ్ఞానం, అంధకారంలో మునిగి ఉన్న ఆ సమాజం జ్ఞాన కాంతులతో ప్రకాశించింది.
నామోషిగా భావించి ఆడకూతుళ్ళను సజీవ సమాధి చేసిన తల్లి దండులే  ఆమె పుట్టుకను శుభవార్తగా, స్వర్గానికి సోపానంగా, నరకాగ్ని నుండి కాపాడే రక్షక కవచంగా భావించి తలెత్తుకు తిరిగారు.
కుమా రులతోపాటు కుమార్తెలకు సయితం ఆస్తి హక్కు ఇవ్వడం తమ విధిగా గుర్తించారు.
శతాబ్దాల పాటు మద్యం మత్తులో జోగిన ఆ జాతి – ఇక ప్రళ యం వరకు ఒక్క చుక్క మద్యం కూడా ముట్టేది లేదని  శపథం చేసింది.
తన స్థాయి, ఆత్మగౌరవాన్ని మరచిపోయి అగుపించిన ప్రతి వస్తువును దైవంగా తలంచి పూజించనవారు, నిజ సృష్టికర్త ఒక్కడేనని, సకల ఆరాధనలకు, సమస్త స్తోత్రాలకు, ఉపసనా రీతులకు ఆయన ఒక్కడే అర్హుడని అర్థం చేసుకున్నారు.
ఊడిగం, వెట్టి చాకిరి చెయ్యడానికే వీరు పుట్టారు అనుకునే తమ బాని సలను నాయకులుగా, అధినాయకులుగా నియమించుకోవడానికి సిద్ధ మయ్యారు ఆ జాతి పెద్దలు. వారిలో వచ్చిన ఈ మార్పుకి, వారి ఈ సత్ప్రవర్తనకు, పరివర్తనకు కార ణం ఒక్కటే – అదే ఇస్లాం! ఇస్లాం మనిషి ఇహపరాల సౌభాగ్యానికి, సిసలయిన సంతోషానికి, అసలయిన సంతృప్తికి పూచీ వహిస్తుంది. అదెలా అంటే?
 నిజ సృష్టికర్త అయిన అల్లాహ్‌ యెడల దాసుడు విశ్వాసం కలిగి ఉండటం ద్వారా దీన్ని సాధించుకోగలడు అంటుంది, ఇస్లాం. దాసునికి మరియు దేవునికి మధ్య గల ఈ అనుబంధం వల్లనే మనిషికి అసలయిన సంతోషం, సిసలయిన సంతృప్తి సాధ్యమవుతుంది.  ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”విశ్వసించిన వారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్‌ా ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుండి వెలుగు వైపునకు తీసుకుపోతాడు. కాగా అవిశ్వాసుల నేస్తాలు షైతానులే. వాళ్ళు వారిని వెలుగు నుండి చీకట్ల వైపు లాక్కు పోతారు. వారు నరక వాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు”. (బఖరహ్‌: 257)   ఈ మేరకు  మానవతా ధర్మమయిన ఇస్లాం మానవాళికి ఇచ్చే రక్షణ గురించి, శిక్షణ గురించి తెలుసుకుందాం!

ధర్మ పరిరక్షణ 

 మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి. తనకు సంబంధించిన ప్రతి విషయం లోనూ పూర్తి స్వేచ్ఛ కలిగి జీవించాలని కోరుకుంటాడు. అదే స్వేచ్ఛ తాను అవలంబించే మతధర్మం విషయంలో సయితం తనకు దక్కాలని అభిలషిస్తాడు. అతని ఈ సహజ భావనకనుగుణంగానే సర్వలోక సృష్టి కర్త అతన్ని పుట్టించి, వినే, అనే, కనే శక్తిని అనుగ్రహించి, సత్యా సత్యాల వ్యత్యాసాన్ని విడమరచి చెప్పడంతోపాటే, బాటను అనుసరిం మాటను అనుసరించే సేచ్ఛను మాత్రం అతనికి ప్రసాదించాడు. ఇలా అన్నాడు: ”అసాంతం సత్యం (కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చిందని ప్రకటించు. ఇక కోరిన వారు దీన్ని విశ్వసించ వచ్చు మరియు కోరిన వారు నిరాకరిమచవచ్చు”. (దివ్యఖుర్‌ఆన్‌-18:29)
ధర్మం – ఎంతటి మహత్తు గలదంటే, అల్లాహ్‌ా ప్రజలన్ని దాని కోసమే పుట్టించాడు. దాన్ని సమస్త మానవాళికి చేరవేయడానికి, దాన్ని సంరక్షించడానికి ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఇలా సెలవిచ్చాడు: ‘మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ”అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధ పర్చాము’. (అన్నహ్ల: 36)
 మతధర్మాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ మనిషికి ఉన్నప్పటికీ అతను సత్యధర్మాన్నే అనుసరించినట్లయితే దానికి బదుసు స్వర్గసీమను ప్రసాది స్తానని శుభవార్తను అందజేయడంతోపాటు, ఒకవేళ ఆ సేచ్ఛను దుర్వి నియోగ పరచి మిథ్యావాదాలను, అసత్యాలను, అర్థ సత్యాలను నమ్మి బతికినట్లయితే నరక యాతనలు తప్పవు అని హెచ్చరించాడు కూడా. అయితే మత స్వేచ్ఛ మాత్రం అతని శ్వాస ఆగేంత వరకు అతనికుం టుంది. ఆ విషయంలో ఎలాంటి బలవంతం, బలాత్కారం లేదు అన్నాడు అల్లాహ్‌: ”ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుండి ప్రస్పుటమయింది”. (బఖరహ్‌: 256)

మేధో రక్షణ

 మనిషి మస్తిష్కాన్ని పాడు చేసే ప్రతి విధమయినటువంటి విషయా న్నుండి ఇస్లాం వారిస్తుంది. ఎందుకంటే, మనిషికి ప్రాప్తమయి ఉన్న ఇతర భౌతికానుగ్రహాలు ఓ ఎత్తయితే విచక్షణా జ్ఞానం, తెలివీతేటలు ఓ ఎత్తు.అతనికి ప్రాప్తమయి ఉన్న ఈ  మేధోశక్తి ఆధారంగానే ఇతర సృష్టి తాలలో అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు.అట్టి  మేధోశక్తికి నీరుగార్చే మత్తు పానీయాలను, మాదకద్రవ్యాలను, వెకిలి చేష్టలను ఇస్లాం సంపూర్ణంగా నిషేధిస్తుంది:”ఓ విశ్వసించిన ప్రజలారా!నిశ్చయంగా సారాయి,జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం-ఇవన్నీ పరమ జుగుప్సాకరమయి న విషయాలు, షైతాన్‌ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”. (మాయిదహ్‌: 90)

ప్రాణ రక్షణ

 అల్లాహ్‌, ఏ ప్రాణినయినా లేదా స్వయాన్నయినా సరే హాని కలిగించ డాన్ని, హత్య చేయడాన్ని నిషేధించాడు. ఇలా అన్నాడు: ”చేజేతులా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి”. (అల్‌ బఖరహ్‌ా: 195)
 వ్యక్తులు ఎవరయినా, ఏ మత ధర్మానికి చెందిన వారయినా సరే అన్యాయంగా ఒకరిపై దౌర్జన్యానికి ఒడిగట్టే వారి ఆట కట్టించే నిమిత్తం సరి హద్దులను, శిక్షలను కేటాయించాడు. ఇలా అన్నాడు: ”ఓ విశ్వసిం చిన ప్రజలారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్‌) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది”.  (అల్‌ బఖరహ్‌: 178)
”ఓ బుద్ధి జీవుల్లారా! ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది – ఇలా ఉంటేనే మీరు (అమానుషాల నుండి) ఆగి ఉంటారు”. (అల్‌ బఖరహ్‌: 179)
ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం మనిషి ప్రాణానికి ఇచ్చినంత విలువ మరే మతధర్మం ఇవ్వలేదు: ”ఎవరయితే అన్యాయంగా ఒక మనిషిని చంపాడో అతను సకల మానవులను చంపినట్లే. మరెవరయితే ఒక ప్రాణాన్ని కాపాడాడో అతను సకల మానవుల ప్రాణాలను కాపాడి నట్లే”. (మాయిదహ్‌:32)

సంతాన సంరక్షణ

 సంతాన రక్షణ కోసం ఇస్లాం గట్టి చర్యలే చేపట్టింది. ఏ కుటుంబ పట్టునయితే పిల్లలు పెరిగి పెద్దవుతారో ఆ కుటుంబ పునాదిని ఇస్లాం పవిత్ర బంధం పునాదిగా నిర్మించగోరుతుంది. వారి హక్కుల్ని పెద్దలకు బోధించడమే కాకుండా వారి మధ్య న్యాయంగా వ్యవహరించమని హితవు పలుకుతుంది. ఇస్లాం ధర్మసమ్మతమయిన రీతిలో వివాహం చేసుకోవాలని అభిలషిస్తుంది. అందులో వెకిలి చేష్టలకు, దుబారా ఖర్చుకు, అతికి పాల్పడకూడదంటుంది. ఇస్లాం అక్రమ సంబంధాలపై, అధర్మ వావివరసలపై, అశ్లీలం, అనైతికాలపై తన శిక్షా  కొరడాను ఝుళిపిస్తుంది.

మాన రక్షణ:  

ఇస్లాం మనిషి మానం మర్యాదలకు పెద్ద పీట వేస్తుంది. ప్రజల పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, వారి వంశాన్ని తూల నాడే చర్యలకు పాల్పడకుండా ఉండాలని నొక్కి వక్కాణిస్తుంది. అలా చేయడాన్కి ఘోరపాపంగా పరిగణిస్తుంది. ఇస్లాం మనిషి (స్త్రీపరుషుల) గౌరవ మర్యాదల్ని కాపాడమంటుంది.  ”ఏ వ్యక్తయితే తన పరువును, పరివారాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌” అంటుంది.

ధన సంరక్షణ

 ఇస్లాం ధర్మసమ్మతమయిన జోవనోపాధి కొరకు పరిశ్రమించాలని ఉపదేస్తుంది. ధర్మ రీతిలో వ్యాపారాన్ని అనుమతిస్తుంది. వడ్డీ, దోపిడి, దొంగతనాన్ని నిషేధిస్తుంది. ఎందుకంటే, వడ్డీ వ్యాపారం, జూదం,  మట్కా వంటి వాటి వల్ల ఒకరి సొమ్ము అన్యాయంగా దోచుకోవడం జరుగుతుంది గనక. ఇవి ఒక ఆరోగ్య సమాజానికి గొడ్డలి పెట్టుగా ఉంటాయి గనక. వీటి ద్వారా ప్రజల మధ్య ఉండాల్సిన ప్రేమాను రాగాలు పోయి రాగధ్వేషాలు చోటు చేసుకుంటాయి గనక. ఒక్క మాట లో చెప్పాలంటే, ”ఏ వ్యక్తయితే తన ధనాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌. ఏ వ్యక్తయితే తన పరువును, పరివా రాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌. ఏ వ్యక్తయితే తన ధర్మాన్ని కాపాడుతూ హత్య చెయ్య బడతాడో అతను షహీద్‌. ఏ వ్యక్తయితే తన ప్రాణాన్ని, కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌” అంటుంది ఇస్లాం. (తిర్మిజీ).  ఇక ఇస్లాం మనిషికిచ్చే శిక్షణ గురించి తెలుసుకుందాం!

శుచీశుభ్రతలు  

పరిశుద్ధత, పరిశుభ్రత, పవిత్రత అనేది మానవ నైజం వాంఛించే, మానవ సమాజం కాంక్షించే సుగుణం, సహజ గుణం. దీనికి భిన్నంగా అపరిశుద్ధతను, అపవిత్రతను మానవ నైజం, మానవ సమా జం సహించదు, ఇష్ట పడదు. ఈ కారణంగా ప్రతి విధమయినటు వంటి అశుధ్దాల నుండి దూరంగా ఉండాలని, శుధ్ధి పొందాలంటుంది ఇస్లాం. మనిషి మలమూత్రాలు, నిషిద్ధ జంతువుల మల మూత్రాలు, కుక్క, పంది వంటి నిషిద్ధ జంతువులకు దూరంగా ఉండాలని కోరుకుం టుంది. మలమూత్ర విసర్జనాననంతరం శుద్ధి పొందాలని, వుజూ చేయాలని, స్నానమాచరించాలని, నీరు లేని పక్షంలో తయమ్ముమ్‌ చేయాలని ఉపదేశిస్తుంది.

అప్పగింతల పట్ల అప్రమత్తత 

 ఇస్లాం బోధించే నైతిక ప్రమాణాలలో ఉన్నత నైతిక ప్రమాణం అమానతు. అంటే, నిజాయితీ-సచ్చీలత. వ్యాపారంలోగానీ, వ్యవహారం లోగానీ, మాటలోగానీ, బాటలోగానీ, నడకలోగానీ, నడవడికలోగానీ నిజాయితీగా మసలుకోవాలంటుంది. ”ఎవరి అమానతులను (అప్పగిం తలను) వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చేెసేటప్పుడు  న్యాయంగా తీర్పు చేయండి అని అల్లాహ్‌ా మిమ్మల్ని గట్టిగా తాకీదు చేస్తున్నాడు”. (అన్నిసా: 58)

సత్య సంధత 

 సత్యం-సత్యమే సదా సాపల్య ద్వారం. సత్యమే సమున్నతికి సోపానం – ఇహంలోనూ, పరంలోనూ అన్నది ఇస్లాం ఉపదేశం. కాబట్టి మనిషి సదా సత్యానికి కట్టుబడి ఉండాలంటుంది. అసత్యానికి, అధర్మానికి, అవినీతికి, అన్యాయానికి, అక్రమానికి మనిషి ఆమడ దూరం ఉండా లంటుంది. సత్యప్రవక్త అయిన ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”మీరు సత్యాన్ని అట్టి పెట్టుకు ఉండండి.  దానికే కట్టుబడి జీవించండి. ఎందుకంటే, సత్యం మంచికి మార్గం చూపుతుంది, మరి మంచి మనిషి ని స్వర్గానికి దారి చూపుతుంది.అసత్యం చెడుకై పురిగొల్పుతుంది. మరి చెడు మనిషిని నరకం పాలు చేసి గాని వదలదు”. (ముస్లిం)

స్థితప్రజ్ఞత 

 మనిషి చేపట్టే ఏ కార్యమయినా సరే అందులో తాను స్థితప్రజ్ఞత స్థాయిని సాధించాలని అభిలషిస్తుంది ఇస్లాం. మనిషి చేసే పని ఏద యినా పూర్తి ప్రావీణ్యం కలిగి పని చేయడం హర్షనీయం అంటుంది. ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: ”మనిషి తలపెట్టే ఏ మంచి పనయినా పూర్తి నాణ్యతతో, ప్రావీణ్యం కలిగి పూర్తి చేయడాన్ని అల్లాహ్‌ా ఇష్ట పడతాడు”. (తబ్రానీ)

సంస్కారవంతమయిన వస్త్రధారణ

ఇస్లాంలో వస్త్రధారణం అందంగా, పరిశుభ్రంగా, సంస్కారవంతంగా ఉండాలి. పురుష పోలికలు గల దుస్తులు స్త్రీలు, స్త్రీల పోలికలు గల దుస్తులు పరురుషులు తొడగరాదంటుంది ఇస్లాం. అలాగే గర్వం, అహంకారం, అహంభావం ప్రదర్శితమయ్యే దుస్తుల్ని సయితం ఇస్లాం నిషేధిస్తుంది. వస్త్రధారణ విషయంలో దుబారా ఖర్చును అది సహిం చదు. దుస్తులు మరి పొడవాటివిగా-(పరుషులకు చీలమండలానికి క్రింది వరకు) ఉండటం, మరీ పొట్టి (కనీస కప్పి ఉంచాల్సిన ప్రదేశాల ను బహిర్గత పర్చే) దుస్తుల్ని స్త్రీపరుషులిరువురూ తొడగడాన్ని అది గర్హి  స్తుంది. అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ఆదం సంతతి వారలారా! మేము మీ కోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మాస్థానా లను కప్పి ఉంచడమే గాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి”. (ఆరాఫ్‌: 26)

పెద్దల పట్ల గౌరవం, పిన్నల పట్ల వాత్సల్యం

 ఇస్లాం, ఉత్తమ రీతిలో తల్లిదండ్రుల సేవ చేయాల్సిందిగా,వారి తుది శ్వాస ఆగేంత వరకూ ధర్మసమ్మతమయిన వారి ప్రతి మాట వినాల్సిం దిగా తన అనుయాయుల్ని కోరుతుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు-మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకొని ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్‌’ అని కూడా అనకు. వారిని కసురు కుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు”.  (బనీ ఇస్రాయీల్‌: 23)

బంధుత్వ సంబంధాల రక్షణ; 

ఇస్లాం బంధుత్వ సంబంధాలను పటిష్ఠ పరచమంటుంది. అమ్మానాన్నల తరఫు నుండి ఏర్పడే సంబంధాలను బల పర్చాలంటుంది. ఒకరు మనతో మంచిగుంటే మనం వారితో మంచిగుండటం కాదు, వారి మన పట్ల అనుచితంగా వ్యవహరించినా మనం వారి పట్ల ఉత్తంగా వ్యహరించడం, వారు మన నుండి తెగత్రెంపులు చేసుకున్నా మనం మాత్రం వారితో కలిసే ఉండటం సిసలయిన బంధుప్రీతి అంటుంది.

స్త్రీ రక్షణ; 

ఇస్లాం, ఆస్తిలో న్యాయబద్ధమయిన స్త్రీ వాటాను ప్రత్యేకంగా పేర్కొంటుంది. ఆమె హోదా, ఆమె బాధ్యతల దృష్ట్యా ఆమెకు దక్కాల్సిన హక్కును ఆమెకు ఇస్తుంది.
ఇస్లాం, స్త్రీపరుషుల మధ్య అన్ని విషయాలలో న్యాయబద్ధంగా వ్యహరిస్తుంది.
ఇస్లాం, స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. పిల్లల అసలు పోషణ అమ్మ ఒడిలోనే సాధ్యం అంటుంది. అదే విధమయినటువంటి బాధ్యతల్ని ఆమెపై మోపుతుంది.
ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”మీలోనీ ప్రతి ఒక్కరూ కాపలాదారుడే…..స్త్రీ తన ఇంటికి కాపలాదారు. తన సంరక్షణలో ఉన్న వారి గురించి ఆమె జవాబుదారీ”. (బుఖారీ)
స్త్రీపురుషుల మధ్య గల సంబంధం పరస్పరం ఒండొకరిని బల పర్చేదిగా ఉండాలంటుంది ఇస్లాం, స్త్రీ రహిత పురుష సమాజ అభివృద్ధిగాని, పురుడు లేకుండా మహిళా సమాజ అభ్యుదయంగానీ పరిపూర్ణమవ్వదు అంటుంది. ఒక ఆరోగ్యకరమయిన సమాజానికి స్త్రీపురుషులిరువురి సహకారం, శ్రమ అవసరం అంటుంది.

భూత దయ: 

ఇస్లాం, సకల ప్రాణుల యెడల సాత్విక ప్రేమ, క్షమ, ఉపకార భావం ప్రతి వ్యక్తి మాటలోనూ, నడకలోనూ, నడవడికలోనూ కలిగి ఉండాలని ఉత్బోధిస్తుంది.ఇస్లాం, మూగ జమతువుల పట్ల మెతక వైఖరి, దయాభావం కలిగి ఉండాలంటుంది. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ప్రతి ప్రాణిలోనూ మీకు పుణ్యం ఉంది”. (బుఖారీ)

పర్యావరణ పరిరక్షణ: 

ఇస్లాం, మొక్కల్ని పెంచమంటుంది. భూమి పచ్చని పొలాలలో కళకళలాడాలంటుంది.బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చాలని హితవు పలుకుతుంది.”ప్రళయం ఇంకాసేపట్లో ముంచుకొస్తుందని నీకు తెలుస్తున్నా నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటెయ్యి”అంటుంది.  దీనికి భిన్నంగా భూమిని బంజరు నేలగా మార్చే ప్రక్రియల్ని, చర్యల్ని, లేదా భూమిని చెడు ఉత్పాదనల కోసం వినియో గించడాన్ని అది గర్హిస్తుంది. ఏ విషయంలోనయినా సరే దుబారా ఖర్చు కు దూరంగా ఉండమంటుంది. ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు:  ”నువ్వు ప్రవహించే నది ఒడ్డున ఉన్నా సరే దుబారా ఖర్చు చేయకు”   (ముస్నద్‌ అహ్మద్‌)
 ఇస్లాం, దౌర్జన్యం, దుర్మార్గం, దురాక్రమణ, దమన నీతి, మరణించిన శత్రు శరాన్ని ముక్కలుగా నరకడం  నుండి వారిస్తుంది. అది ప్రతి విషయంలోనూ న్యాయానికి, ధర్మానికి, క్షమకి, విశాల భావానికి కట్టుబడి ఉండాటలంటుంది. సమాజంలోని పెద్దలు, వృద్ధులు, పిల్లలు, స్త్రీల పట్ల మర్యాద పూర్వకంగా మసలుకోవాలని అబిలషిస్తుంది.

ఇస్లాంలో దైవప్రవక్తలు 

ఇస్లాం, ప్రవక్తలందరి పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటుంది. వారి మధ్య వివక్షకు తావు కల్పించకూడదంటుంది. వారిలో కొందరిని నమ్మి మరికొందరిని విశ్వసించకపోవడాన్ని అది అవిశ్వాస చర్యగా పరిగణిస్తుంది. ప్రతి జాతి వైపునకు అల్లాహ్‌ా ప్రవక్తను పంపాడని, అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు జాతుల్లో వచ్చిన ఆ ప్రవక్తలందరూ సత్యప్రవక్తలని, దైవభీతిపరులని, నిజాయితీపరులని, మార్గదర్శకులని, వారి ఇవ్వబడి సందేశాలను సంపూర్ణంగా ఆయా జాతులకు అందజేశారు:
”మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (రపజలారా!) అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి”. (నహ్ల్‌: 36)
 ఏ ఒక్క ఆదేశాన్ని వారు దాచి పెట్టలేదని, మరే ఒక్క ఆదేశంలో హెచ్చు తగ్గులకు పాల్పడరాదని, తమ స్వయానికి లోబడి వారు ఏ మాట పలుక లేదని స్వయంగా అల్లాహ్‌ాయే కితాబు ఇచ్చాడు: ”కనుక ప్రవక్తల బాధ్యత మా సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప మరొకటి లేదు”. (అన్నహ్ల్‌; 35)
|ఈ ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్‌ (స). కట్టకడపటి గ్రంథం ఖుర్‌ఆన్‌.ప్రయళం వరకూ వచ్చే ప్రజలందరికీ ఖుర్‌ఆన్‌ గ్రంథం మార్గదర్శకం, ప్రవక్త (స) వారి జీవితమే ఆదర్శం.

ప్రవక్త ఈసా-యేసు (అ) పట్ల ముస్లింల విశ్వాసం

నిశ్చయంగా ఆయన పుణ్య స్త్రీ అయిన మర్యమ్‌ కుమారుడు. ఆమె సద్గుణవతి, దైవబీతిపరురాలు, సత్యవతి, సౌశీలవతి, అల్లాహ్‌ా విధేయురాలయిన కన్య. ప్రవక్త ఈసా (అ) పురుష సంపర్కం లేకుండానే అల్లాహ్‌ా ఆజ్ఞ  మేరకు ఆమె కడుపున జన్మించారు అని ప్రతి ముస్లిం విశ్వసిస్తాడు.
ప్రవక్త ఈసా (అ) మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) మధ్య మరే ప్రవక్తా లేడు అని  ప్రతి ముస్లిం నమ్ముతాడు.
ముస్లిం అయిన ప్రతి వ్యక్తి, ప్రవక్త ఈసా (అ) వారి చేతుల మీదుగా జరిపించిన మహత్కార్యాల్ని, మహిమల్ని – పుట్టు గుడ్డిని బాగు చేయడం, కుష్టు రోగిని బాగు చేయడం, మృతులను బతికించడం, ప్రజలు వారి వారి ఇళ్ళల్లో ఏమి కూడ బెడతారో, ఏమి తింటారో తదితర విషయాల గురించి అల్లాహ్‌ ఆజ్ఞతో తెలయజేయడం వంటి వాటిని నమ్ముతాడు.
ప్రవక్త ఈసా (అ) వారు హత్య చెయబడలేదు, శిలువా ఎక్కించబడలేదు అని, వాస్తవంగా అల్లాహ్‌ా ఆయన్ను కాపాడి సజీవంగా, సశరీంగా తన వైపునకు ఎత్తుకున్నాడని నమ్మడంతోపటు, ఆయన్ను హతమార్చాలని కుట్ర పన్నిన యూదులు అపోహకు గురి చేయబడ్డారని, వేరెవరినో హత్య చేసి ప్రవక్త (స)ను హత్య చేసినట్లు భ్రమకు గురి చెయ్యబడ్డారని నమ్ముతాడు.

ఇస్లాం స్వీకరించాలంటే ఏం చేయాలి? 

వ్యక్తి ఎవరయినా, ఏ భాష, ఏ రంగు, ఏ ప్రాంతానికి చెందినవాడయినా మనసా, వాఛా, కర్మణా సాక్ష్య వచనాలు పలికి  ఇస్లాం ఛత్రఛాయల్లోకి రావచ్చు. ”అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌” – అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ా ప్రవక్తని సాక్ష్యమిస్తున్నాను”.
ఈ వచనాల్ని మనస్ఫూర్తిగా పలికి మీదట సదరు వ్యక్తి గతం పట్ల పశ్చాత్తాపం చెంది, జీవితంలో మళ్ళి గతించిన నిర్వాకాల జోలికి వెళ్లబొనని ప్రతీన బూని స్నానమాచరించాలి. ఆనక ఇస్లాం మూలాధారాలయి అయిదు విషయాలను క్రియా రూపం ఇచ్చేందుకు కంకణం కట్టుకోవాలి.
1) ”అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ా” అని సాక్ష్యమివ్వడం.
2) నమాజును స్థాపించడం
3) జకాతును చెల్లించడం,
4) రమజాను పూర్తి మాసపు ఉపవాసాలు ఉండటం,
5) స్థోమత కలిగిన వ్యక్తి హజ్జ్‌ చేయడం.
 ”ఇస్లాం ఉపమానం వాన వంటది. దాన్ని స్వీకరించి సత్కర్మలు చేసిన వ్యక్తి సారవంతమయిన నేలను పోలి ఉంటాడు.  దాన్ని తిరస్కరించిన వ్యక్తి వాన కురిసినా  ఎలాంటి పంటను అందించని రాతి నేలను పోలి ఉంటాడు” అన్నారు ప్రవక్త (స).