Tuesday, January 13, 2015

అదృష్టం పండాలంటే...


Syed Abdus Salam Umari 

అబ్బాసీ ఖలీఫా హారూన్‌ రషీద్‌ 'దజ్లా' నది ఒడ్డున ఓ బ్రహ్మాండమ యిన కోట ఒకటి నిర్మించాల్సిందిగా ఫర్మానా జారీ చేసాడు. కోట పనులు పూర్తయి సందర్భంగా అనేక కవుల్ని పిలిపించి ఆ కోటను గురించి వర్ణించ వలసిందిగా కోరాడు. వచ్చిన ఆ కవుల్లో 'అబూ అతాహియా' అనే కవి తన కవిత్వాన్ని విన్పిస్తూ -

''మీకు నచ్చినట్లు విలాసవంతమయిన కోటల్లో జీవిత మకరందాల్ని ఆస్వాదించండి. మీ మనసుకు నచ్చే, మీరు మెచ్చే ప్రతి వస్తువు ఉదయం సాయంత్రం మీ ముందర హాజరు పరచ బడుతుండాలి''.
ఇది విన్న హారూన్‌ రషీద్‌ ఎంతో సంతోషించాడు. ఇంకా చెప్పా ల్సిందిగా కోరాడు. అప్పుడా కవి అన్నాడు:
''గుండెలోని ప్రాణం గొంతు దాటే ఘడియ సమీపించినప్పుడు, మనసులోని లావా పెల్లుబికినప్పుడు..అప్పుడు తెలుస్తుంది...నీవు కూడబెట్టుకున్నదంతా ఒఠ్ఠి మాయా వస్తువు తప్ప మరేమీ కాదని''. (సర్వం వదలి కాటి మట్టిలో కలవాలని).

ఈ పలుకులు హారూన్‌ రషీద్‌పై పిడుగులై పడ్డాయి. బోరున విలపించసాగాడు...మొత్తం ఆ కోటను కూలదోయించేశాడు..పూర్వం ఎలా ఓ సాధారణ బంగళాలో ఉండేవాడో అందులోనే నివాసముండ సాగాడు. ఎందుకో తెలుసా?
సంతోషం, సంతృప్తి, అదృష్టం, మనశ్శాంతి మనిషి ప్రేమతో పెంచుకున్న తోటల్లో లేదు, మక్కువతో కట్టుకున్న ఎత్తయిన కోటల్లో లేదు, ఇష్టంగా తొడుక్కున్న కొత్త బట్టల్లో లేదు, కూడబెట్టుకున్న అపార ధనగారాల్లో లేదు, అంతస్థుల్లో లేదు, అధికారంలో లేదు... మరెక్కడ ఉంది? వాటన్నింటినీ మనిషికి ప్రసాదించిన ఆ వరప్రదాత అధీనంలో మాత్రమే ఉంది.

అదృష్టం పండాలని, సంతోషంగా ఉండాలని, మది నిండా సంతృప్తి నిండాలని మనలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏ కోటల్లోనూ, మరే సూపర్‌ మార్కెట్లల్లోనూ దొరకని ఈ అదృష్టాన్ని అందరూ కోరుకోవడం ఆశ్చర్యం కదూ! అది మనకు దక్కాలంటే, దాన్ని మనం సొంతం చేసుకోవాలంటే-దాని నిజ నిర్మాతను గురించి తెలుసుకొని, ఆయన్ను రాజీ పర్చుకుంటే చాలు, దాన్నెలా పొందాలో, ఎందులో అది లభించగలదో ఆయనే సెలవిస్తాడు. మరి ఆ అదృష్టకర్త ఎవరం టారా? ఆయనే మనందరి నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌. మనం పురిటిలో ప్రాణం పోసుకోక ముందే మన రాతల్ని వ్రాసిన ఆయన మాత్రమే మనకు ఆదృష్టాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వగలడు. సంతోషం, సంతృప్తి, ప్రశాంతత అనేవి మానసికమయినవి. అవి దేనీ వల్ల ప్రాప్తిస్తాయో స్వయంగా అల్లాహ్‌ తెలియజేస్తున్నాడు: ''గుర్తుంచుకోండి! అల్లాహ్‌ా నామ స్మరణ వల్లనే హృదయాలు నెమ్మదిస్తాయి''. (అర్రాద్‌:28)

అంటే, మనం అల్లాహ్‌కు ఎంతగానయితే దగ్గరవుతామో అంతే మనం అదృష్టాన్ని, మనశ్శాంతిని, నెమ్మదిని, సంతృప్తిన పొంద గలము. మనల్ని అల్లాహ్‌కు దగ్గర చేసే ఆ అమల సాధనం ఏమిటో తెలుసా? ''దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండే స్థితి-అతను సజ్దా చేసే స్థితి'' అన్నారు ప్రవక్త (స). (అహ్మద్‌, ముస్లిం)
ఎలాగయితే పాలు త్రాగె పసికందు తల్లి ఒడికి చేరాక ప్రశాంతత ను పొందుతుందో, ఇక తను సేప్‌ అని భావిస్తుందో, అలాగే అల్లాహ్‌ దాసులమయిన మనం అల్లాహ్‌ా సన్నిధిలో సజ్దా చేసి మనశ్శాంతిని పొందుతాము.
మనిషి ఏదయినా రంగంలో అభివృద్ధిని సాధించాడంటే, ఆర్థికంగా ఎదిగాడంటే అతనికి సంతోషం కలుగుతుంది. ఇది సహజమే. మరి మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళే అత్యద్భుత అస్త్రం ఏమిటో తెలుసా?''అల్లాహ్‌ ప్రసన్నత కోరుతూ ఎవరు ఎంత వినయాన్ని కలిగి ఉంటారో అల్లాహ్‌ వారిని అంతే ఎత్తుకు తీసుకెళతాడు'' అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

అంటే, అతను ఎదుగుతూ, ఎదుగుతూ స్వర్గానికి, అక్కడి నుండి స్వర్గ శిఖర అగ్ర భాగమయి ఫిర్‌దౌస్‌కి చేరుకుంటాడు. ఇక స్వర్గానికి మించిన అదృష్ట స్థలం, సంతోష ఆలయం, శాంతి నిలయం, నెమ్మది నెలవు మరొకటి ఉందా? లేదు. స్వర్గం గురించి తెలియజేస్తూ - ''స్వర్గంలో ఒక్క బాణం పెట్టుకుణేంతటి చోటు లభించినా అది ప్రపంచ సకల సంపదలకంటే ఎంతో మేలయినది'' అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)అల్లాహ్‌ తన స్వహస్తాలతో తయారు చేసిన ఆ స్వర్గ ధామంలో, ఫిర్‌ దౌసుల్‌ ఆలాలో ప్రవక్త (స) వారి సహచర్యం లభించ డం ఎంత భాగ్యంతో కూడుకున్న విషయం! 
హజ్రత్‌ రబీ బిన్‌ కఅబ్‌ (ర) గారు ప్రవక్త (స) వారి సేవ చేసుకునే వారు. ఓ రోజు ప్రవక్త (స) ఆయన్ను ఉద్దేశించి- ''నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావో అడుగు'' అన్నారు. అందుకాయన - 'నేను స్వర్గం లో మీ తోడును కోరుకుంటున్నాను' అని సవినయంగా సమాధాన మిచ్చారు. అది విన్న ప్రవక్త (స) - 'అది మినహాయించి ఇంకేదయినా కోరుకుంటున్నావా?' అని ఆరా తీశారు. 'నాకు అదొక్కటే చాలు, ఇంకేమీ వద్దు' అన్నారు ఆ సహాబీ. అప్పుడు ప్రవక్త (స) - ''అయితే నువ్వు నీ విషయంలో నాకు అత్యధికంగా సజ్దాలు చేసి సహకరించు'' అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
స్వయంగా ప్రవక్త (స) వారు కలత చెందినప్పుడల్లా బిలాల్‌ (ర) గారిని ఉద్దేశించి - ''ఓ బిలాల్‌ నమాజు ద్వారా మమ్మల్ని సంతృప్త పరచు'' అని అంటుండేవారు. అలాగే- ''నా కంటి చలువ నమాజులో ఉంచబడింది'' అంటుండేవారు. స్వయంగా అల్లాహ్‌ ప్రవక్త (స) వారినుద్దేశించి -''నీ ప్రార్థన వారి కోసం ప్రాశాంత సాధన'' (తౌబహ్‌ా: 103) అని కితాబు ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే - ''మన నమాజు మన అదృష్టానికి ఆనవాలు''.

ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) కథనం- నేను షేఖుల్‌ ఇస్లాం ఇబ్ను తైమియా (ర) గారిని చెబుతూ విన్నాను: ''నిశ్చయంగా భూలోకంలో ఓ స్వర్గం ఉంది. అందులో ఇక్కడుండి ప్రవేశించలేని వ్యక్తి పరలోకపు ఆ సిసల యిన స్వర్గంలో ప్రవేశించ లేడు''.
మరో సందర్భంలో ఆయన అన్న మాట -''నా శత్రువులు నన్నేం చేసుకుంటారు. నా స్వర్గం, నా బృందావనం నా మదిలోనే ఉంది. నేనెక్కడికెళ్ళినా అది నాతోనే ఉంటుంది....నన్ను ఖైదు చేస్తే అది నా ఏకాంతం...నన్ను హత్య చేస్తే అది నా వీర మరణం-షహాదత్‌. నన్ను నా దేశం నుండి వెలివేస్తే అది నా విహారం''. 

వ్యాధి ఓ గీటురాయి

10624801_680138215435434_1371347804156934618_n


'ప్రవక్త (స) వారి వైద్య విధానం' అన్న పుస్తకం నుండి

సా ధారణంగా ప్రజలు వ్యాధిని ఓ ఆపదగా, అల్లాహ్‌ా అభిశాపంగా భావిస్తుంటారు. ఒక్కోసారి ఈ వ్యాధుల్ని భూతాలు, ప్రేతాత్మల ప్రభావ ఫలితాలని కూడా పేర్కొంటుంటారు. అంచేత భూతవైద్యులు వ్యాధిగ్ర స్తులకు వైద్యం పేరుతో అనేక బాధలకు గురి చేశారు, చేస్తున్నారు. అయితే ఇస్లాం వ్యాధిని విశ్వాసి పాలిట గీటురాయిగా పేర్కొంటుంది.

ప్రతి పురోగమనానికి ముందు మానవుడు ఓ పరీక్షను ఎదుర్కొవల సిన వస్తుందనేది అందరికీ తెలిసిందే. పరీక్ష, అవరోధాలు లేకుండా ఏ విజయమూ చేకూరదు. ఖుర్‌ఆన్‌లో ఇలా అంటుంది: ''మేము విశ్వ సించాము అన్నంత మాత్రాన తాము ఇట్టే వదలివేయబడతామనీ, తాము పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా? వారికి పూర్వం గతించిన వారిని కూడా మేము బాగా పరీక్షించాము. వారిలో సత్యవం తులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్‌ా తెలుసుకుం టాడు''. (అన్కబూత్‌: 2,3) మరో చోటిలా సెలవియ్యబడింది: ''ఏమిటి మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురయినటువంటి పరిస్థితులు మీకింకా ఎదురే కాలేదు. వారిపై కష్టాలు (కుండపోతగా), రోగాలు (విపరీతంగా) విరుచుకు పడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయ బడ్డారంటే, (ఆ ధాటికి తాళ లేక) ''ఇంతకీ అల్లాహ్‌ా సహాయం ఎప్పుడు వస్తుంది?'' ప్రవక్త మరియు ఆయనతోపాటు విశ్వసించిన వారు ప్రశ్నించసాగారు. వినండి! 'అల్లాహ్‌ా సహాయం సమీపంలోనే ఉంది' అని వారిని ఓదార్చడం జరిగింది''. (బఖరహ్‌ా: 214)
అంతిమ దైవప్రవక్త (స) ముహమ్మద్‌ (స) హితోక్తి- అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: ''నేను ఓ దాసుణ్ణి రెండు ప్రియమయిన విషయాలకు గురి చేసి బాధ కలిగించినప్పుడు అతను నిరాశ చెందకుండా ఉంటే, దానికి బదులుగా నేనతనికి స్వర్గం ప్రసాదిస్తాను. ఆ రెండు ప్రియమ యిన విషయాలంటే అతని రెండు కళ్ళు''. (బుఖారీ)
ఇస్లాం ప్రకృతిసిద్ధమయిన ధర్మం. దాని సూత్రాలు, నియమాలు అన్నీ ప్రకృతిసిద్ధంగానే ఉంటాయి. కాబట్టి వ్యాధి ఆపద కాదు. అది అల్లాహ్‌ా పరీక. అది మన శ్రేయోసాఫల్యాలకు, మోక్ష సాధనకు మార్గం. దైవ ప్రవక్త (స) ఇలా తెలియజేశారు: ''అల్లాహ్‌ా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని తలుస్తాడో వారిని కష్టాలకు గురి చేసి పరీక్షిస్తాడు''. (ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌)
ఎంతటి బలశాలికయినా వ్యాధి బలహీనతకు గురి చేస్తుంది. ఎంతటి అహంభావికయినా వ్యాధి ఆలోచిమపజేస్తుంది. ఎంతటి పాషాణ హృదయుణ్ణయినా వ్యాధి కరిగిస్తుంది.
స్వర్గానికి సోపానం సహనం: అతా బిన్‌ రిబాహ్‌ా (ర) ఉల్లేఖనం- అబ్దుల్లాహ్‌ా బిన్‌ అబ్బాస్‌ (ర) నాతో- ''నేను నీకు స్వర్గ స్త్రీని గురించి చెప్పనా?' అన్నారు. దానికి నేను 'తప్పకుండా చెప్పండి' అన్నాను. అప్పుడాయన ఇలా అన్నారు: ''నలుపు వర్ణం గల ఓ స్త్రీ దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చి - 'ఓ దైవప్రవక్తా! నాకు మూర్ఛ వ్యాధి ఉంది. కొన్ని సార్లు బట్టలు ఊడి పోతాయి. నాకు స్వస్థను ప్రసాదించ మని అల్లాహ్‌ాను వేడుకోండి'' అని విన్నవించుకుంది. దానికి దైవప్రవక్త (స) ''నీవు సహనం వహిస్తే నీకు స్వర్గం లభిస్తుంది. నీవు కోరితే నీకు స్వస్థతను చేకూర్చమని అల్లాహ్‌ాను ప్రార్థిస్తాను'' అన్నారు.

అది విన్న ఆ మహిళ-'నేను సహనం వహిస్తాను, కాని మూర్చ వచ్చి నప్పుడు నా దేహంపై గల వస్త్రం తొలగిపోకుండా ఉండేలా దీవించ మనండి' అని చెప్పింది.దైవప్రవక్త (స) ఆమె దరఖాస్తును మన్నించి అల్లాహ్‌ాను ప్రార్థించారు'. (బుఖార, ముస్లిం)
పాప ప్రక్షాళన సాధనం జ్వరం: దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ''విశ్వాసికి ఒక రాత్రి వచ్చిన జ్వరం ద్వారా అల్లాహ్‌ా అతని పాపాల న్నింటినీ క్షమిస్తాడు''. (అత్‌ తర్గీబ్‌ వత్తర్హీబ్‌)

ఓసారి దైవప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చిన ఒక వ్యక్తి జ్వరాన్ని తూలనాడాడు. అది విన్న ప్రవక్త (స)-''జ్వరాన్ని తిట్టకు. నిప్పు ఇనుము తుప్నును వదలగొట్టి దాన్ని కామతిమయం చేసినట్లు, జ్వరం నీ పాపాలను ప్రక్షాళించి నిన్ను పవిత్రం చేస్తుంది'' అన్నారు. (అబ్ను మాజహ్‌)

ఉమ్ముల్‌ అలా (ర.అ) కథనం - నేను జబ్బున పడినప్పుడు దైవప్రవక్త (స) నన్ను పరామర్శించడానికి వచ్చి ఇలా అన్నారు: ''ఉమ్ముల్‌ అలా! నీకు శుభాకాంక్షలు! విశ్వాసలకు వ్యాధి సోకితే నిప్పు వెండి బంగా రాల తుప్పును, మలినాల్ని వదలగొట్టినట్లు వ్యాధి వారి పాపాలను కడిగి వేస్తుంది''. (అబూ దావూద్‌)

హజ్రత్‌ యహ్యా బిన్‌ సయీద్‌ (ర) గారి కథనం - దైవప్రవక్త (స) వారి హయాంలో ఓ వ్యక్తి మరణించాడు. అప్పుడొకతను 'ఎంత మంచి మరణం ఇతనిది. జీవితంలో ఒక్కసారి కూడా ఇతను వ్యాధికి గురి కాలేదు' అన్నాడు. అది విన్న ప్రవక్త (స); ''నీ మాటలు విని నేను విచారిస్తున్నాను. అల్లాహ్‌ా ఎవరికయినా వ్యాధికి గురి చేస్తే దాని వల్ల అతని పాపాలు ప్రక్షాళించ బడతాయోమో నీకేం తెలుసు?'' అని అన్నారు. (ముఅత్తా ఇమామమ్‌ మాలిక్‌)
చావును కోరుకోరాదు: ప్రవక్త (స) ఇలా అన్నారు: ''మీలో ఎవరూ కష్టం వచ్చినప్పుడు చావును కోరుకోకూడదు. దానికి బదులు 'ఓ అల్లాహ్‌! మేలుకి సంబంధించిన ప్రతి విషయంలో నా జీవిత కాలాన్ని పెంచు. మరియు కీడు, చెడుకి సంబంధించిన ప్రతి విషయంలో నా మరణాన్ని నాకు విశ్రాంతి సాధనంగా చెయ్యి'' అని ప్రార్థించాలి అన్నారు. (అబూ దావూద్‌) 

అల్లాహ్‌ స్మరణ విశిష్ఠత


Syed Abdus Salam Umari 

నిశ్చయంగా అల్లాహ్‌ను స్మరించడం, ఆయన్ను వేడుకోవడం మహుత్పూర్వకం. అల్లాహ్‌ స్మరణలో పీల్చే ప్రతి శ్వాస, గడిచే ప్రతి ఘడియ, ప్రతి రోజు మంగళప్రదమయినదే. దాసుడు తన ప్రభువు సాన్నధ్యాన్ని పొందే అమల సాధనం అల్లాహ్‌ స్మరణ. అది దాసుని ఇహపరాల సకల మేళ్ళకు సంబంధించిన తాళంచెవి. అల్లాహ్‌ ఈ కీని దాసునికి ప్రసాదించాడంటే దానర్థం-శుభాల తలుపులు అతని కోసం తెరిచాడన్న మాట. ఒకరిని ఈ వరప్రసాదానికి దూరం చేెశా డంటే, అతనికై మేలు తాలూకు తలుపులన్నీ మూసి వేయబడ్డాయన్న మాట. ఫలితంగా అతను కలత చెందిన మనస్సుతో, కంగారు నిండిన గుండెతో, స్థిమితం లేని ఆలోచనలతో,ఫలితం లేని చింతలతో, సత్తువ లేని సంకల్పాలతో సతమతమవ్వడం ఖాయం. దీనికి భిన్నంగా ధ్యానాన్ని ఆశ్రయించి, సదా అల్లాహ్‌ాను స్మరిస్తూ ఉండే వ్యక్తి మనస్సు నెమ్మదిస్తుంది. అతని హృదయం ప్రశాంతతో నిండుతుంది. అతని ఆత్మ శాంతితో పరవశిస్తుంది. ఖుర్‌ఆన్‌ ఇలా అంటోంది:

''విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్‌ స్మరణతో తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్‌ా స్మరణతోనే హృదయాలు నెమ్మదిస్తాయి''. (అర్రాద్‌: 28)
ధ్యానం తాలూకు శుభాలు అనేకం; ఇహంలోనూ, పరంలోనూ. అల్లామా అబ్దుర్రహ్మాన్‌ నాసిరుస్సఅదీ (ర) అల్లాహ్‌ా ధ్యానం గురించి ఇలా అభిప్రాయ పడ్డారు: 'మహోన్నత అర్ష్‌కి ప్రభువయిన అల్లాహ్‌ బహిరంగ, రహస్య స్మరణ-లేనిపోని చింతలతో నీవు సతమతమవు తున్న ఘడియలో నీ నుండి దురదృష్టాన్ని, దుఖాన్ని దూరం చేస్తుంది. ఇహపరాల మేళ్లన్నీ నీ ముంగిట వచ్చి వాలేలా చేస్తుంది.

ప్రవక్త (స) తన సహచరునికి ఓ రోజు హితోపదేశం చేశారు - ''అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించే వారు, ముందువారు- ముందే ఉంటారు'' అని.
హజ్రత్‌ మఆజ్‌ (ర) గారికి వసీయతు చేస్తూ- ''అల్లాహ్‌ను ధ్యానించే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే, ఆయన్ను అత్యుత్తమ రీతిలో ఆరా ధించే విషయంలో ఆయన సహయాన్ని అర్ధించు'' అన్నారు.
హితోపదేశాన్ని కోరుతూ వచ్చిన ఓ వ్యక్తిని ఉద్దేశించి-''నీ నాలుక అల్లాహ్‌ స్మరణతో సదా నానుతూనే ఉండాలి. అది నీలో స్థిత ప్రజ్ఞ తను పెంచి, నిన్ను భాగ్య బాటన నడిపిస్తుంది'' అన్నారు.
''అల్లాహ్‌ స్మరణ - స్మరించే వారి పాలిట శాశ్వత స్వర్గ వనాలలో మహా వృక్ష సృజనకు కారణం'' అన్నారు.

''అల్లాహ్‌ాను స్మరించే దాసుడ్ని స్వయంగా అల్లాహ్‌ తన వద్దనున్న దైవదూతల సమక్షంలో ప్రస్తావిస్తాడు'' అన్నారు.
''దాసులు స్వర్గంలో ప్రవేశించిన మీదట కూడా అల్లాహ్‌ స్మరణ అనుక్షణం చేస్తూనే ఉంటారు'' అన్నారు. 

'ధ్యానం దైవ ప్రేమకు మార్గం' అన్న ఒక్క ప్రశంస చాలు అది ఎంత గొప్పదో చెప్పడానికి. ధ్యానం మనిషిని చాడీల నుండి, పరోక్ష నింద నుండి, ధర్మానికి కీడు కలిగించే ప్రతి చేష్ట నుండి కాపాడు తుంది. 

అల్లాహ్‌ను స్మరించుకునే అదృష్టం లభించిన మనం నిజంగా మహా గొప్ప అదృష్టవంతులం. కానీ మన అశ్రద్ధో, అవివేకమో, అజ్ఞానమో ఏమో కానీ, ఎలాగయితే ఆయన్ను ఆరాధించడం, ఆయన్ను మాత్రమే వేెడుకోవడం తగ్గించేశామో, అలాగే అల్లాహ్‌ను స్మరిం చడం, ఆయన స్మరణలోనే తరించడం దాదాపు మరచిపోయాం.

ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ''మీలోని ప్రతి వ్యక్తిపై (శరీరంలోని ప్రతి కీలుపై) ప్రతి ఉదయం ఒక సత్కార్యం చేయడం అనివార్యమయి ఉంటుంది. పోతే, ప్రతి తస్బీహ్‌ా-సుబ్హానల్లాహ్‌ సత్కార్యమే. ప్రతి తహ్మీద్‌-అల్‌హమ్దులిల్లాహ్‌ సత్కార్యమే. ప్రతి తహ్లీల్‌ - లా ఇలాహ ఇల్లల్లాహ్‌ సత్కార్యమే. ప్రతి తక్బీర్‌-అల్లాహు అక్బర్‌ అనడం సత్కార్యమే. మంచిని ఉపదేశించడం కూడా సత్కా ర్యమే. చెడుని వారించడం కూడా సత్కార్యమే. అయితే ఉషోదయం తర్వాత మనిషి చేసే రెండు రకాతుల (ఇష్రాక్‌) నమాజు వీటన్నిం టికి ప్రత్యామ్నాయం కాగలదు''. (ముస్లిం)

''నా స్మరణ నిమిత్తం నమాజును స్థాపించు'' అన్న అల్లాహ్‌ మాట ప్రకారం మన నమాజు కూడా అల్లాహ్‌ స్మరణే. అల్లాహ్‌ ఇలా సెల విస్తున్నాడు: ''ఓ విశ్వసిమచిన వారలారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి''. (అహ్జాబ్‌: 41) 

సత్యమేవ జయతే!



సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ 

పప్రంచ దినాల్లోకెల్లా మహిమాన్విత రోజులైన జుల్‌ హిజ్జా మాసపు థ రాతుల్రు మరొక్కమారు ముస్లిం సమాజంపై పూర్తి శోభతో కారుణ్య మేఘమయి వాలాయి. 'ఈ దినాల్లో చేెసే సత్కార్యాలు, పార్థ్రనలు, దానధర్మాలకు ఇతర రోజుల్లో చేసే ఏ ఆరాధనా, మరే సత్కార్యం సాటి రాదు. వ్యక్తి తన తన, మాన, ధనాలతో దైవమార్గంలో పోరాటం చేస్తూ అమరగతినొవందితే తప్ప' అన్న  పవ్రక్త మహనీయుల వారి మాటకు అక్షర సత్యంగా నిలిచే ఘడియలే ఈ సుదినాలు. ఈ శుభ ఘడి యల్లో విశ్వంలోని విశ్వాసుల్లో భక్తిపప్రత్తులు ఉప్పొంగుతాయి. ఐహిక ఆకర్షణలకు లోనై మోడు వారిన వారి జీవితాల్లో నవ చైతన్యం చోటు చేసుకుంటుంది. ఈ రోజుల్లోని ఒక్కో ఘడియ ఒక్కో శుభ సాగరం. మానవుల ఆలోచనాత్మక శిక్షణకు, ఆచరణాత్మక సంస్కరణకు, ఆధ్యాత్మిక వికా సానికి, అల్లాహ్‌ా నిర్దేశించిన మహత్తర అవకాశం ఈ థ రాతుల్రు, అందులోని హజ్జ్‌. త్యాగాల పచ్చ తోరణాలతో కళాకాంతులీనే ఈ  పవిత వాతావరణంలో శారీరక, మానసిక సాధనాల ద్వారా విప్లవాత్మకమయిన, విశ్వవ్యాప్తమయిన, సాత్వికమయిన, శేయ్రస్కరమయిన పగ్రతి సాధ్య మవుతుంది. 

 నేడు ముస్లిం జనావళి అనేక రంగాల్లో అనేక రకాల వెనుకబాటుతనానికి గురయి ఉంది. ఒక విధమయినటువంటి నిదావ్రస్థకు లోనయి జీవిస్తోంది. దీనికి తోడు కర్తవ్యం పట్ల నిర్లక్ష్యత, బాధ్యతల పట్ల విస్మరణ, నైతిక విలువల పట్ల అశద్ధ్ర, నిర్మాణాత్మక ఆలోచనారాహిత్యం, భావ దారిద్యం, ఆధ్యాత్మిక భావ పతనం-అన్నీ కలగలసి వారిని మరింత నష్టానికి, కష్టానికి గురి చేస్తు న్నాయి. పై కారణాలే పూర్వ జాతుల పతనానికీ కారకాలయ్యాయన్నది జగద్విదితం. నేడు అత్యంత కీలక మలుపులో ఉన్న ముస్లిం జనావళి మేల్కొలుపుగా హజ్జ్‌ వారి జీవితాల్లో ఆశా జ్యోతయి వెలిగింది. అది వారి కమ్రశిక్షణారాహిత్య జీవితానికి కమ్రశిక్షణను నేర్పడానికే వచ్చింది. వెనుకు బాటుతనానికి  గురయి ఉన్న పత్రి రంగంలో వారిని ఉన్నత శిఖరాల మీద కఅదీష్టింప జేసేం దుకే వచ్చింది. నిత్య జీవితంలో తారసపడే అర్థ సత్యాలలు, స్వార్థం, మోసం, మోహం, దురాశ, దుర్నడత, ద్వంద నీతి మొదలయిన చెడు చీడలను సమూలంగా నిర్మూలించి, సంపూర్ణ సత్యాలు, త్యాగం, నమ్మకం, ఆశావాద దృక్పథం, సత్పవ్రర్తన, సత్యసంధత, నిజాయితీ, దైవభీతి, పరోపకార పరాయణత్వం వంటి ఉన్నత పమ్రాణాలతో జీవితాన్ని మరింత అందంగా మలచ డానికే వచ్చింది.  

 అది  పవ్రక్త ఇబాహ్రీమ్‌ (అ) వంటి అచంచల విశ్వాసాన్ని మనలో నూరి పోస్తుంది. మొత్తం జాతి, జాతి నాయకుడు ఓ వైపు ఇబాహ్రీమ్‌(అ) విశ్వాసం ఓ వైపు.  ఆయన్ను సజీవంగా బూడిద పాలు చేయాలన్న జాతి కుటన్రు అల్లాహ్‌ా భంగ పర్చాడు. నింగికెగిసే అగ్ని గుండ మంటలు ఆయన పాలిట ఉద్యాన వనంగా మారాయి. అది మనలో మూసా (అ) వారి మాతృమూర్తి వంటి అనుపమ విశ్వాసాన్ని, అల్లాహ్‌ాపై ఎనలేని భరోసాను కలిగిస్తుంది. 'నవ మాసాలు మోసి కన్న పసికందుని నీటి పాలు చెయ్యి అని, నీకూ శతువ్రు, నాకూ శతువ్రు అయినా, కేవలం పవ్రక్త మూసా (అ) వారి జననాన్ని అడ్డుకునే నిమిత్తం 70 వేల మంది పసికందుల్ని పొట్టన బెట్టుకున్న కాళరాక్షసుడయిన ఫిర్‌ఔన్‌ వద్దకే తీసుకెళతాను' అంటే మరో మారు ఆలోచించకుండా పెట్టెలో పెట్టి నైలు నదీలో వదిలేసింది ఆ మహా తల్లి. పర్యవసానం ఈజప్టు సత్యవంతుల కైవసం అయింది. అది మనలోని సంధిగ్దతను గుహవారి సందిగ్ధతను దూరం చేసినట్లు దూరం చేస్తుంది. అవిశ్వాస రాజ, పజ్రతో భయపడి పాణ్రాల్ని గుప్పెట్లో పెట్టుకుని కాకులు దూరని కార డవిలోని ఓ గుహలో తల దాచుకున్న గుప్పెడు మంది యువకులు వారికి ఎదురయి ఉన్న ఆ దురవస్థ ఎప్పటికి తొలుగుతుందో? అన్న సందిగ్ధానికి లోనయ్యారు. అల్లాహ్‌ా మూడొందల సంవత్సరాల వరకు వారిని పశ్రాంత నిదల్రో ఉంచి లేపితే అప్పుడు వారు చూసిన సమాజం పూర్తి ముస్లిం సమాజం. అంతిమంగా ఓ మాట-పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పత్రికూలం గా తయారయినా విజయ ధుంధుభి మోగ్రించేది సత్యమే. ఎందుకంటే అది వచ్చిందే గెలుపొం దడానికి! ''ఆయనే తన పవ్రక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు - దాన్ని మత ధర్మాలన్నిం టిపై ఆధిక్యం వహించేలా చేయడానికి! ఈ విషయం బహుదైవారాధకులకు (సత్య విరోధులకు) ఎంతగా సహించరానిదైనా సరే''. (అస్‌ సఫ్‌: 9)