Sunday, October 16, 2011

Wedding Slideshow Slideshow

Wedding Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Wedding Slideshow Slideshow ★ to Kuwait. Stunning free travel slideshows on TripAdvisor

Thursday, October 13, 2011

bahu daivaaradhana

నిర్వచనం:

అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం - ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు - బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది, పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది.

1- పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు -

(لقمان 13) إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” - భావం యొక్క అనువాదం{ఖచ్ఛితంగా, అష్షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరమైన పాపిష్టి పని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో - అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధన అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.

2- క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(النساء 48) - إِنَّ اللَّهَ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ

భావం యొక్క అనువాదం{తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}

3- స్వర్గం నిషేధించబడినది: ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు -

إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ (المائدة 72)

భావం యొక్క అనువాదం{తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.

4- పుణ్యకార్యాలన్నీ వ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ- “ (الأنعام 88)

భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.

ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(الزمر70) - وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنْ الْخَاسِرِينَ

భావం యొక్క అర్థం {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}

5- ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

(التوبة 5)- فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ

భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు

أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –

అనువాదం - “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప, నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.

6- ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు - ألا أنبئكم بأكبر الكبائر” - అనువాదం - ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును, ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” - అనువాదం - “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం

కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.