Thursday, December 28, 2017
ఇస్తిన్జా మర్యాదలు మరియు తయంముమ్ విధానం
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Wednesday, December 27, 2017
వుజూను భంగ పరచే విషయాల వివరణ
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Tuesday, December 26, 2017
వుజూలోని ఫర్జులు - అర్కానుల వివరణ
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Thursday, November 30, 2017
aazmaayish ke waqt hame kyaa karnaa chahiye
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
pravakta muhammad (pbuh) vamsha visishtata
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Friday, November 24, 2017
shaitan ke madakhil
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
jannat aour ahle jannat
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Monday, November 20, 2017
touhee_ke_manaafi_umoor
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
kaafir_anadam_yenta_varaku_samanjasam
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
تلاوة القرآن بصوت جميل
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
quraan reciting
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Saturday, November 18, 2017
change the world
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
change the world
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Monday, November 13, 2017
మనం మారితే లోకం మారునోయి!
మనం ఒక్కరికి మేలు చేస్తే, లోకం మొత్తానికి మేలు చేసిన వారం అవుతాము. మనం ఒక్కరికి హాని చేస్తే, లోకం మొత్తానికి హాని చేసిన వారం అవుతాము. మనం ఒకరికి చేసే మేలుగానీ, కీడుగానీ ఆ వ్యక్తి వరకే పరిమితం కాదు. దాని ప్రభావం ఏదోక విధంగా లోకం మీద పడుతుంది. కాబట్టి మన వల్ల ఒకరికి మేలు జరగాలనుకున్నా, మన వల్ల ఒకరికి హాని జరగ కూడదనుకున్నా ముందు మనం మారాలి. మార్పు మన నుండే మొదలవ్వాలి. 'నేను నా సౌకర్యం, నేను నా సేఫ్టీ - భద్ర్రత' అనుకుంటే అసౌకర్యం, అభద్రత వాటంతట అవే వచ్చి వాలతాయి. నాకు ఎలాంటి సమస్యలు ఉండ కూడదు అన్న ఆలోచనే అనేకానేక సమస్యలకు మూలం అని గ్రహించాలి. చలనం ఉన్న మనిషీ మారతాడు, చలనం లేని శవ స్థితి మారుతుంది. ఆ రకంగా మనం శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం కూడా మార్పుకి సంకేతమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మారదంటూ ఏది లేదు. సంపూర్ణంగా జీవించి, సంతృప్తిగా మరణించేలా మనల్ని తీర్చదిద్దే అమూల్య సాధనమే మార్పు. సంపూర్ణుడయిన అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: ''నిశ్చయంగా అల్లాహ్ ఆ జాతి గతిని మార్చడు. ఏ జాతయితే తన మనోమయ స్థితికి మార్చుకోవడానికి సిద్ధంగా లేదో;;. (అర్రఅద్;11). మంచి మార్పును ఆశిస్తూ...... ఆ మార్పుకి పనికొచ్చే తొమ్మిది పనిముట్లను ఇక్కడ పొందు పరుస్తున్నాము.
మొది పనిముట్టు: దశక సూత్రం.
మనం మన జీవితంలో ఏదేని సమస్యల వల్ల సతమతమవుతుంటే, క్రింద ఇవ్వబడిన మూడు ప్రశ్నలకు సరయిన సమాధానాలు రాబట్టు కోవాలి.
1) ప్రస్తతం మనకు ఎదురయి ఉన్న ఈ సమస్య ఓ పది రోజుల తర్వాత కూడా ఇంతే ప్రాధాన్యత గలదయి ఉంటుందా?
2) సమస్య వచ్చి పది నెలల గడచిన తర్వాత కూడా ఇంతే ప్రాధాన్యత ఉంటుందా?
3) సమస్య ఎదురయి పది సంవత్సరాలు పూర్తయి తర్వాత కూడా ఇంతే ప్రాధాన్యత ఉంటుందా?
పై ఇవ్వబడిన మూడు ప్రశ్నలలో రెండింటికి మీ సమాధానం 'లేదు' అని ఉంటే, తక్షణమే ఆ సమస్య గురించి ఆలోచించడం, బుర్ర పాడు చేసుకో వడం మానేయండి. మీ దృష్టిని, మీ ఏకాగ్రతను అత్యంత ప్రధాన అంశాల, ఆశయాల మీద కేంద్రీకరించండి!
రెండవ పనిముట్టు: ఒక్క శాతం చాలు.
ఈ రోజు పనిని రేపటికి వాయిదా వెయ్యకు, రేపు చెయ్యాలనుకున్నది ఈ రోజు చెయ్య, ఈ రోజు చెయ్యాల్సినది ఇప్పుడే చెయ్యి అన్నట్టు, ఈ క్షణం మీ జీవితంలో మారాలి అనుకుంటున్న అత్యంత కీలక కోణాన్ని, వృద్ధి పర్చుకోవాలనుకుంటున్న ముఖ్య ఘట్టాన్ని నిర్ధారించుకోండి. కావాలంటే ఒకటి కాదు, నాలుగయిదు విషయాలను ఎంచుకోండి. ఈ క్షణమే వాటిలో ఒక్క శాతం మార్పు, వృద్ధి, వికాసానికి ప్రయత్నించండి. అలా జీవితంలో మీరు అశించిన మార్పు, వృద్ధి, వికాసం రోజుకి ఒక్క శాతం అంటే పూర్తి యేడాది తర్వాతి మీరెక్కడుంటారో ఆలోచించండి! ఇదే నిలకడ, స్థిరచిత్తం కొనసాగితే ఓ అయిదు సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి!
ఇప్పుడే కలం, కాగితం తీసుకొని వృద్ది పర్చాల్సిన, మార్చాల్సిన కొన్నింటిని రాసుకోండి. ఉదాహరణకు - భాషా ప్రావీణ్యానికి దోహద పడే స్కిల్స్, సమయ పాలన దోహద పడే స్కిల్స్, భావోద్రేక నియంత్రణకు దోహద పడే స్కిల్స్, ఆరోగ్యానికి పనికొచ్చే స్కిల్స్, బంధుత్వ సంబంధాలను బల పర్చే స్కిల్స్... మొదలయినవి. ఇవే అని కాదు, మీకు ఏది ముఖ్యం అనిపిస్తే వాటిని వ్రాసుకొని కార్యాచరణకు పూనుకోండి. రెండు మూడు సవత్సరాల్లో మీ జీవితం మారక పోతే ఒట్టు. రొటీన్ లైఫ్ అన్న బోరింగ్ పోయి డేరింగ్ మనస్తత్వం మీ సొంతమవుతంది.
మూడవ పనిముట్టు: నకారాత్మక విషయాలకు స్వస్తి పలకడం.
ఎలాట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మీద హాట్ న్యూస్‌గా ఉన్న హెడ్ లైన్స్‌ను, చర్చాగొష్టిని, ఒండొకరికి ఛాలెంజ్ విసురుకోవడం వంటి వాటిని ఈ క్షణమే త్యజించండి. అత్యవసరమయిన వార్తలు, సంభాషణలు, చర్చలు తప్ప వేరే వాటి జోలికి వెళ్ళకండి. సోషల్ మీడియాలో మీతో జత అయి ఉన్న నెగెటివ్ ఆలోచనలు గల వ్యక్తులను, పేజీలను అన్‌ఫాలో, అన్‌ఫ్రెన్డ్ చేసేయండి. అలాంటి గ్రూపుల నుండి బయికి వచ్చి వాటిని డిలీట్ చేసేయండి. తర్వాత ఎంత ప్రశాంతత ఉంటుందో మీరే గ్రహిస్తారు.
నాల్గవ పనిముట్టు: క్షమించండి!
ఎప్పుడో ఎవరో ఒకరు మనకు పెట్టిన బాధ, చెప్పిన మాటను తీసుకొని ఇప్పటి వరకూ వారిని గురించి అదే విధమయినటువంటి ఏహ్య భావం కలిగి ఉన్న ఎంత మంది మన మధ్యన లేరు చెప్పండి! దీని వల్ల మన గతం ఏమయినా మారి పోయిందా? పైగా ఆ ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే వేధిస్తూనే ఉన్నాయి. అదే మనం వారిని మనస్ఫూర్తిగా మన్నించేసి ఉంటే, దాని వల్ల మన గతం అయితే మారేది కాదుకానీ, భవిష్యత్తు బాగు పడేది. మన ఫోకస్ మన ప్రాధాన్యతల మీద ఉండేది. ఒక్క నిమిషం కోసం ఆలోచించండి! మనలో చాలా మందిలో ఉన్న, కేవలం దేవునికి మాత్రమే తెలిసిన అవలక్షణాలు, వెకిలి చేష్టలు, పాపాలు ఒకవేళ మన తల్లిదండ్రులకు తెలిస్తే వారు మనల్ని వెళ్ళ గొడతారు. భార్యకు తెలిస్తే విడాకులిచ్చే వెళ్ళిపోతుంది, పొరుగు వారికి తెలిస్తే అసహ్యించుకుంటారు. స్నేహితులకు, పరిచయస్తులకు తెలిస్తే ఛీ కొడతారు. నౌఖరులకు తెలిస్తే దగ్గరకే రారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అల్లాహ్ ఎంత కృపాకరుడు, క్షమాశీలుడు అని. మరి అల్లాహ్ మనలో సయితం క్షమా గుణాన్ని కోరుతున్నాడు: ''వారిని క్షమించాలి. వారి పట్ల మన్నిఫుల వైఖరిని అవలంబించాలి. ఏమి, అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లాహ్ మాత్రం (తప్పులను) క్షమించే వాడు. కరుణామయుడు''. (అన్నూర్: 22)
కాబట్టి ఈ క్షణం మీ మనస్సు నొప్పించిన వారిని మనస్ఫూర్తిగా మన్నించేయండి. గుర్తుంచుకోండి! అధిక శాతం మంది ప్రజలు మంచోళ్ళయి ఉంటారు. భావోద్రేకానికి లోనయి వారి వల్ల ఓ అనుచిత వ్యాఖ్యగానీ, చేష్ట గానీ వెలువడి ఉండోచ్చు. వారి వల్ల జరిగిన ఆ తప్పిదం వారి ప్రవృత్తి అయి ఉండదు. అదో తాత్కాలిక చర్య అయి ఉంటుంది అంతే. దాని వల్ల వారు కూడా బాధ పడుతుంటారు. ఆత్మాభిమానం అడ్డోచ్చి అన లేక పోవచ్చు.
అయిదవ పనిముట్టు: సదా కృతజ్ఞులయి ఉండండి.
మనం మన రోజువారి జీవితాన్ని అల్లాహ్ కృతజ్ఞతతో ప్రారంభించాలి. మన ఆరోగ్యం,మన పరివారం, మన ఉద్యోగం, మన స్కిల్స్, మన ప్రతిభ, ప్రజలు మనలో ఇష్ట పడే గుణాలు, మనకు ప్రాప్తమయి ఉన్న స్థాయి గౌరం అన్నీ అల్లాహ్ కృపాకరమే. నిజంగా చెప్పాలంటే, అల్లాహ్ కృపానుగ్రహాలను మనం లెక్కించాలన్నా లెక్కించ లేము. కాబట్టి అల్లాహ్ ఒక్కొ అనుగ్రహాన్ని తలచుకొని నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. వాక్కు పరమయిన కృతజ్ఞత, ధన పరమయిన కృతజ్ఞత, దేహ పరమయిన కృతజ్ఞను నిత్యం చేసుకోవాలి. కృతజ్ఞతా భావం అనేది శుభాల తలుపుల్ని తెరిచే గొప్ప సాధనం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నడు: ''ఒక వేళ మీరు కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను''. (ఇబ్రాహీమ్: 7) కృతజ్ఞతా భావం వల్ల మనలో సాత్విక భావాలు చోటు చేసుకొని, సానుకూల దృక్పథం అలవడి ఒక విధమయిన ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అది మనల్ని మరింత బలవంతులుగా తీర్చి దిద్దుతుంది. మునుపెన్నడూ ఎవ్వరికీ లభించని, ప్రళయం వరకూ ఇంకెవ్వరికి దక్కని గొప్ప రాజ్యాధికారం కలిగిన ప్రవక్త సులైమాన్ (అ) కృతజ్ఞతా పూర్వకంగా చెప్పిన వాక్యాలు మనకు ఆదర్శం. ''నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా దీవించు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో''. (అన్నమ్ల్: 19)
ఆరవ పనిముట్టు: ఆరోగ్యమే మహా భాగ్యం.
''నీ ఆరోగ్యాన్ని నీ అనారోగ్యానికన్నా ముందు గొప్పగా భావించు'' అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (ముస్నద్ అహ్మద్)
మన శరీరమే మన సర్వశ్వం. 'వెన్ యో లుక్ గుడ్, యో ఫీల్ గుడ్!' మీ దేహాకృతి బాగుంటే, మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. మనకు ఆరో గ్యం బాగోలేకపోతే మనం ప్రపంచంలో ఏ పనిని సజావుగా చెయ్యలేము. ఎంత మంది ధనికులున్నారు, వారు కోరింది తిన లేరు, కోరిన చోటుకి వెళ్ళ లేరు. మంచం మీదనే జీవిత ముగిసి పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆరోగ్యం బాగోలేకపోతే మనం ఎంతో ఇష్టం చదివే నమాజును సజావుగా చెయ్య లేము. రుకూ, సజ్దా, ఖియామ్, ఖఅదహ్ కుదరవు. కాబట్టి ఆరోగ్యాన్ని మనం నిజంగా మహా భాగ్యంగా భావించి, ప్రతి రోజు కొంత సమయం (అర గంట) వ్యాయామం కోసం కేయించాలి. మన శరీరం దృఢంగా ఉంటే మనం ఆలోచనలపై దాని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ప్రపంచంలో ఖరీదయిన ఏ వస్తునయినా పాడయిపోతే మార్చగలం. కానీ, ఒక్క సారి శరీరారోగ్యం పాడయితే బాగు చేసుకో లేము.
ఏడవ పనిముట్టు: చదువు, చదువు, చదువు.
ఖుర్‌ఆన్‌లో అవతరించిన తొలి వాణి ''చదువు నీ ప్రభువు పేరుతో'' (అల్ అలఖ్:1) అన్నది. ''నిశ్చయంగా అల్లాహ్‌కు వాస్తవ రీతిలో భయ పడేవారు ఆయన దాసులలోని విద్యావంతులే'' (ఫాతిర్:28) అన్నది అల్లాహ్ మాట. ప్రవక్త ముహమ్మద్ (స) తన గురించి చెప్పిన మాట - 'నేను అధ్యాపకునిగా చేసి పంప బడ్డాను'. (ఇబ్ను మాజహ్) అన్నది. ''విద్యార్జన ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని)పై తప్పనిసరి విధి'' (సహీహుల్ జామె) అన్నది ఇస్లాం ఉపదేశం. ''ధర్మ విద్యార్జన నిమిత్తం బయలుదేరిన విద్యార్థి బాటలో దైవ దూతలు తమ రెక్కలను పరుస్తారు'' (ముస్నద్ అహ్మద్) అన్నది ధర్మం ఇచ్చే శుభవార్త. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యను అర్జించడమంటే విజయానికి బాటలు వేసుకోవడమే. ''విద్యార్జన నిమిత్తం ఒకరు ఒక మార్గాన్ని ఎంచుకుంటే అల్లాహ్ వారి కోసం స్వర్గానికెళ్లే మార్గాన్ని సులభతరం చేస్తాడు'' (ముస్నద్ అహ్మద్) అన్నారు మహనీయ ముహమ్మద్ (స). దీన్ని బట్టి విద్యార్జన ఎంత ప్రాముఖ్యమయనదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక మాసంలో కనీసం ఒక పుస్తకం పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. పుస్తకం మన మస్తిష్కాన్ని ఉత్తేజ పరుస్తుంది, ఉన్నత ఆలోచనలకు ఊతం అవుతుంది. ఉత్తమ ఆశయాలను నిర్దేశిస్తుంది.
బిల్‌గెట్స్ రీడింగ్ హాబీ కోసం ఎన్నిగంటలు కేయిస్తాడో తెలుసా? అక్షరాల ఆరు గంటలు. వార్న్ బఫెట్ రోజుకి ఎన్ని పేజీలు చదువుతాడో తెలిసా? 600 పేజీలు. మార్క్ జకర్ బర్గ్ వారానికి రెండు పుస్తకాలు పూర్తి చేస్తాడు. వీరందరూ ప్రపంచంలో ప్రముఖ విజేతలుగా ఉన్నారు. మరి వీరికి పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కారణం ఒక్కడే, చదువు కేవలం కొలువు కోసం కాదు. అది అతి గొప్ప మస్తిష్క ప్రేరకం.
ఎనిమిదవ పనిముట్టు: ఒక సమయంలో ఒకే లక్ష్యం.
ఏక సమయంలో అనేక లక్ష్యాలు, ఒకే బాణం మూడు పిట్టలు అన్న ఆలోచనను మానుకోండి. ఒక సమయంలో ఒకే లక్ష్యాన్ని ఎంచుకోండి. దాన్ని పూర్తి చేయక ముందు మరో లక్ష్యం జోలికి వెళ్లకండి. మీ మొత్తం దృష్టి దానిపైనే కేంద్రీకరించండి. మీరు ఏ పని చేసినా అంకిత భావంతో, ఆనందంగా చెయ్యండి. ఆ తర్వాత మారిన అద్భుత లోకాని మీరే చూస్తారు. ''వారు ఎటూ కాకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు''. (అన్నిసా: 143)
తొమ్మిదవ పనిముట్టు: ఓర్పు సహనం.
''ఓ విశ్వసించిన ప్రజలారా! ఓర్పు సహనం మరియు నమాజు ద్వారా అల్లాహ్ సహాయం కోరండి. నిశ్చయంగా సహనమూర్తులకు తోడుగా అల్లాహ్ ఉంటాడు''. (అల్ బఖరహ్: 153)
మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే మార్గంలో అనేక ఆటు పోట్లు ఎదురవుతాయి. ఓర్పు సహనాలతో మనం వాటిని అధిగమించి, అల్లాహ్ సహాయాన్ని అనుక్షణం అర్థిస్తూ ఉంటే రంగం ఏదయినా అందులో మంచి ఉంటే విజయం మన సొంతం అవుతుంది.''ప్రతి మనిషీ దేని కోసం స్వయంగా కృషి చేస్తాడో అది మాత్రమే అతనికి లభిస్తుంది. నిశ్చయంగా అతని కృషి త్వరలోనే చూడ బడుతుంది. మరి అతనికి సంపూర్ణ ప్రతిఫలం వొసగబడుతుంది''.(అన్నజ్మ్:39-41)
పై ఆయతులో మూడు విషయాలు బోధ పడతాయి. 1) మనం ఏది చెయ్యాలన్నా బతికుండగానే చేసుకోవాలి. మనం చేసింది, సంపాదించింది మాత్రమే మనదవుతుంది. 2) మనం చేసిన మంచిగానీ, చెడు గానీ దాన్ని త్వరలోనే మనం చూసుకుంటాము. 3) మనం చేసిన కర్మను బట్టి శిక్షా బహుమానాలు ఖచ్చితంగా లభిస్తాయి.
పదవ పనిముట్టు: అనవసర విషయాల జోలికి వెళ్ళొద్దు.
అఖీదాలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, సామాజిక సంబంధాలలో, నైతికతలో, సేవలో...జీవితపు ఏ రంగలోనయినా, ఏ అంగంలోనయినా అనవసర విషయాల జోలికి వెళ్ళకూడదు. అనవసరంగా ఒకరి విషయంలో జోక్యం చేసుకోకూడదు. ''వారు అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడయినా వ్యర్థమయిన వాటి గుండా పోవలసి వస్తే, హుందాగా ముందుకు సాగి పోతారు''. (అల్ ఫుర్‌ఖాన్: 72)
''వ్యక్తి ధర్మం (ఇస్లాం), అత్యున్నత స్థాయికి చెందినది అనడానికి - అతనికి సంబంధం, అవసరం లేని విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ఒకటి'' అన్నారు మహనీయ ముహమ్మద్ (స). (తిర్మిజీ)
Sunday, November 5, 2017
ఖుర్ఆన్ లోని చిన్న సూరాల అనువాదం
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
ఖుర్ఆన్ లోని చిన్న సూరాల అనువాదం
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Wednesday, October 11, 2017
నమ్మకం – అమ్మకం
ప్రశ్న; నమ్మకం – అమ్మకం
గురించి వివరించ గలరు?
జ: అన్ని రోజులూ మంచివే. అన్ని కాలాలూ మంచివే. మనం చేసే
పనులు మంచివయితే ఫలితాలు మంచివి అవుతాయి. మన ఆలోచనలు సక్రమంగా ఉంటే మనం చేసే పనులూ
సక్రమంగా ఉంటాయి. మన సామర్థ్యం, మన జ్ఞానం, మన
అనుభవం, మన విశ్వాసం, మన ఆత్మ
విశ్వాసం, కార్య ప్రణాళిక, క్రమశిక్షణ
వీటిపైనే మన జయాపజయాలు, లాభనష్టాలు ఆధార పడి ఉంటాయి.అయితే కొందరు ఇవేమి పట్టనట్లు
తమ నిర్వాకాలకు అన్యుల్ని, సూర్యచంద్రనక్షత్రాల్ని బాధ్యుల్ని చేస్తారు. ‘మా వాడు
మంచి నక్ష త్రంలో పుట్టాడు’ అని ఒకడంటే, ‘మీ
హస్తవాసి మంచిది’ అంటూనే హస్తాని కున్న వాచీ మీద కన్నేసేవాడు మరొకడు. ‘అర చేతి
గీత చూసి నీ రాత తెల్చేస్తాను’ అంటాడు ఒకడు. ‘నీ ఇంటి
వాస్తు చూసి నీ కొంప కూల్చేస్తానంటాడు’ మరొకడు.
‘నీ బోణి మంచిది’ అని
ఒకడంటే, ‘నువ్వు ఎదురొస్తే మంచిది’ అంటాడు
మరొకడు. ఒకడికి పిల్లి శకునం, ఒకడికి బల్లి
శకునం, ఒకడికి తుమ్ము శకునం, ఒకడికి
వితంతు చెల్లి శకునం, ఒకడికి విధవ తల్లి శకునం. ఒకడికి నక్క శకునం, ఒకటడికి
కుక్క శకునం, ఒకడికి వితంతువు అక్క శకునం. ఒకడికి శుభ లగ్నం ఒకవేళ, మరొకడికి
శుభ ముహూర్తం మరొకవేళ. కొందరికి కాకి శకునం, కొందరికి
గుడ్ల గూబ శకునం, కొందరికి 10, 13 వంటి
సంఖ్య శకునం, కొందరికి కొన్ని ఘడియలు శకునం కొందరికి కొన్ని రోజలు
శకునం-ఒక్క మాటలో చెప్పాలంటే బాగా అందరిని ప్రభావితం చేసే ప్రమాదకర వైరస్ ఈ
శకునం. ఇలాంటి శకునాల్లో ఓ బుల్లి శకునం సఫర్ మాసపు శకునం. నమ్మకం అది ఏదయినా సరే, భౌతికంగా, మానసి
కంగా మనల్ని బలహీన పరిస్తే దాన్ని విషంలా భావించి వదిలెయ్యాలి. అది ఎంతమాత్రం
సత్యం కాదని తెలిసుకోవాలి. ఎందుకంటే సత్యం సదా మనిషిని బల పరుస్తుంది, దాన్ని
నమ్మి నడుచుకునే వ్యక్తిలో నిత్య చైతన్యాన్ని నింపుతుంది. ”అల్లాహ్
మాకు రాసి పెట్టినది తప్ప మరొకటి మాకు జరగదు. ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులయిన
వారు అల్లాహ్‌నే నమ్ముకో వాలని (ఓ ప్రవక్తా! వారికి చెప్పు”. (తౌబహ్:
51)
దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”వ్యాధి ఏది స్వతహాగా అంటువ్యాధి అయి ఉండదు. శకునం లేదు. ఏ పక్షిని చెడు శకునంగా భావించడం సరి కాదు. సఫర్ మాసాన్ని చెడుగా భావించడం తగదు”. (ముస్లిం)
సఫర్ మాసానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలలో రెండు. 1) ఈ మాసంలో ప్రవక్త (స) వారు రోగ బారిన పడ్డారని, ఆ రోగ అవస్థలోనే అయన మరణించారని, కాబట్టి సఫర్ మాసం మంచిది కాదని అన్నది ఒకటి. ఈ కారణంగా చాలా మంది ధర్మ అవగాహన లేని ముస్లింలు ఈ మాసంలో వివాహమ, శుభ కార్యం ఇత్యాది వాటిని చెయ్యరు. ఈ మాసంలోనే ప్రవక్త (స) తన ముద్దుల కూతురు ఫాతిమా (ర) గారిని అలీ (ర) గారికిచ్చి నికాహ్ చేశారు అన్న యదార్థం పాపం ఈ అమాయకులకు తెలియదు. ఈ మాసం చివర్లో ‘ఆఖరీ చహార్ షున్బా’ – చివరి బుధవారం పేరుతో పచ్చిక బయళ్ల మధ్య సమయం గడిపి వస్తుాంరు.
2) అజ్ఞానం కాలంలో బాగా ప్రచారంలో ఉన్న భావన-సఫర్ అనే పురుగు మనిషి కడుపు లోపల ఉంటుందని, దానికి ఆకలేస్తే అది మనిషిని అతలా కుతలం చేసేస్తుందని, కొన్ని సందర్భాలల్లో దాని తీవ్రత మరణానికి దారి తీస్తుందని, ఈ కారణమంగా సఫర్ మాసం చెడ్డదని. ఈ రెండు అపనమ్మకాలు, గాలి కబుర్లు నేటికీ ఏదోక రూపమలో ఎక్కడో చోట మనకు దర్శనమిస్తూనే ఉంటా యి. దైవప్రవక్త (స) అన్నారు: ”నిశ్చయంగా చెడు శకునం, తాయెత్తులు వేలాడదీసుకోవడం, మందు మాకు ద్వారా మనసును వస పరచుకోవచ్చు అన్న భావన షిర్క్ విందే” (ముస్నద్ అహ్మద్)
”ఎవరయితే శుకున బారిన పడతారో వారి పరిస్థితి చాలా విచిత్రంగా ఉం టుంది. అతని మంచిని ఆశిస్తూ ఉంటాడు కానీ శకునం తాలూకు నిరాశే అతనిలో అధికంగా ఉంటుంది. అతను మంచి కోరికలు కలిగి ఉంటాడు కానీ, అతనిలో శకునం తాలూకు భయమే ఎక్కువ ఉంటుంది. విధి వక్రించినా, జరగాల్సిన మేలు జరక్కపోయినా ప్రతి దాన్ని అతను ఏదో ఒక వస్తువు శకునంగా భావించి, పరాజయ భారాన్నంతా ఆ వ్యక్తి లేదా వస్తువు మీద నెట్టేసి బాధ్యత నుండి పారి పోయేందుకు ప్రయత్నిస్తాడు. మనిషిలో తిష్ట వేసుకున్న శకున జాఢ్యం అతన్ని ప్రగతి బాటన పయనించకుండా ఆపు తుంది. ఉన్నత స్థాయికి అతను చేరుకోకుండా నిరోదిస్తుంది. అలా అతని ప్రయత్నం వృధా అవుతుంది. అతని ఆశయం నీరుగారి పోతుంది” అన్నారు ఇమామ్ మావర్దీ (ర).

శకునానికి విరుగుడు:
‘శకునం అనే భావన ఎలాంటిదంటే, దాన్ని ఆశ్రయించిన వ్యక్తిని భయం గుప్పెట్లోకి నెట్టుతుంది, అతన్ని తీవ్రంగా నష్ట పరుస్తుంది. దాన్ని పట్టించుకోని వ్యక్తి నుండి అది తోక ముడిచి పారి పోతుంది. అతనికి ఎలాంటి నష్టం వాటిల్లదు.ఎవరికయినా

ఎప్పుడయినా ఇలాంటి ఆలోచన వచ్చినా, ఎవరి
ద్వారా ఇలాంటి మాట విన్నా, ఇలాంటి దృశ్యాలను కన్నా అతను ప్రవక్త (స) వారు సూచించిన ఈ
విరుగుడు ప్రార్థన చెయ్యాలి’ అన్నారు ఇమామ్
ఇబ్నుల్ ఖయ్యిమ్ (ర). ”అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక్. వ లా తైరా ఇల్లా
తైరుక్. వ లా ఇలాహ గైరుక్”. (అహ్మద్) – ” ఓ
అల్లాహ్నీ! నీ వద్ద మేలయినదే అసలు మేలు, నీ వద్ద
కీడయినదే అసలు కీడు. నువ్వు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు”.
”అల్లాహుమ్మ లా యాతి బిల్ హసనాతి ఇలా అన్‌త. వ లా యజ్‌హబు బిస్సయ్యిఆతి ఇల్లా అన్‌త.వ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిక”. (అబూ దావూద్) ఓ అల్లాహ్ నువ్వు తప్ప మేళ్ళను మాకు ప్రసాదించేవాడు ఎవ్వరూ లేరు. నువ్వు తప్ప మా నుండి చెడులను తొలగించే వాడు ఎవ్వడూ లేడు. నీ అనుగ్రం లేకుండా చెడు నుండి రకణ పొందే ధైర్యం గానీ, సత్కార్యం చేసే శక్తి గానీ మాలో లేదు”. (అబూ దావూద్)
శకునం నష్టాలు:

శని, శకున, అరిష్ట భావాలు
కలిగి ఉండటం వల్ల కలిగే నష్టాలను మనం పదిగా పేర్కొనవచ్చు.
1) శకునం విశ్వాసానికి విరుద్ధ పదం, నమ్మకానికి వ్యతిరేకం.
2) శకునం వల్ల కీడు సోకడంగానీ, మేలు కలగడం గానీ జరుగదు.
3) శకునం బుద్ధి మాంద్యానికి, వివేక శూన్యానికి నిదర్శనం.
4) శకునం ఆందోళనకు, చపల చిత్తానికి ఆనవాలు.
5) శకునం కార్య శూన్యతకు ప్రేరకం.
6) శకునం మంచి పనులు కూడా చేడకుండా ఆడ్డుకుంటుంది. మనిషి ప్రయత్నాన్ని మాన్పించి, పని దొంగగా
మారుస్తుంది.
7) శకునం అజ్ఞాన కాలపు అవలక్షణం, మూర్ఖపు చేష్ట.
8) శకునాన్ని నమ్మడం అంటే విధి వ్రాతను తిరస్కరించడమే.
9) శకునం అవిశ్వాసుల గుణం.
10) అల్లాహ్ ఆదేశానికి మరియు ప్రవక్త ముహమ్మద్ (స) వారి సున్నత్‌కు వ్యతిరేకం.

Monday, October 2, 2017
Bhavodrega vyaktitvam - emotinal personality
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Wednesday, September 20, 2017
Repati aashaa deepaalu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Tuesday, September 12, 2017
Intiki deepam uttama illaalu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Intiki deepam uttama illaalu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Saturday, August 26, 2017
Manava jeevita lakshyam
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Moodu prashanalu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Saturday, August 12, 2017
swatartra sangramam - muslimlu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
swatartra sangramam - muslimlu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Sunday, August 6, 2017
nava muslimlaku ashta hitavulu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
islamlo pravaktala sthaananm
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
haajiyon ki takreem
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Saturday, July 29, 2017
quran pramanikataku sakshyam
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Tuesday, July 25, 2017
Karunya grantham quran
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Saturday, July 22, 2017
varasatvapu hakkulu

Thursday, July 20, 2017
Karunya pravakta muhammad (pbuh)
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Wednesday, July 19, 2017
karunya dharmam islam
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Wednesday, July 12, 2017
40 hadees in telugu part 1
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Tuesday, July 11, 2017
Time manegment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Happy Life 2017
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Sunday, June 18, 2017
karunya varashini
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
karunya varashini
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
కారుణ్య వర్షిణి రమదాన్ EPS#0029
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
పవిత్ర మాసం ప్రశ్నోత్తరాలు EPS#27

Saturday, June 17, 2017
kahaf parichayam
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Friday, June 16, 2017
karunya varshini ramadan 28
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
pavitra masam prashnottaraalu 26

Thursday, June 15, 2017
పవిత్ర మాసం ప్రశ్నోత్తరాలు EPS#25
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Tuesday, June 13, 2017
Monday, June 12, 2017
కారుణ్య వర్షిణి రమదాన్ EPS#0023
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
కారుణ్య వర్షిణి రమదాన్ EPS#0023
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Subscribe to:
Comments (Atom)