Sunday, August 10, 2025

ప్రవర్తన పరివర్తనతోనే ప్రగతి సాధ్యం / Progress is possible only through behavioral change.

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు ప్రవర్తన పరివర్తనతోనే ప్రగతి సాధ్యం నియమబద్ధంగా జీవించడం కష్టమైన పనేం కాదు! మనసు పెడితే అందరికీ సాధ్యమయ్యేదే!! అందు కోసం కోడల్ని త్రవ్వాల్సిన పనిలేదు. సంప్టా సముద్రాలు దాటాల్సి అవసరం అంతకన్నా లేదు! మరేం చేయాలి? మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మన తప్పులను మనం తెలుసుకోవాలి. వాటిని అంగీకరించాలి. ఆ తర్వాత సంస్కరించుకోవాలి. మారిన మనసే ప్రశాంత ఆత్మా, నెమ్మదించిన మనసు. మానసిక పరివర్తన పొందిన మనిషే మహోన్నతుడు! సత్‌ ప్రవర్తనను అలవర్చుకోవడం ఆధ్యాత్మిక సాధనలో తొలి సోపానం. ఆ తర్వాత సాగించే ప్రయాణంలో అల్లాహ్ సంరక్షకుడిగా వెంట ఉంటాడు. అలాంటి శుభవాత్మ కలిగి వారిని ప్రేమ పవిత్రుడైన ప్రభువు తన స్వర్గ వనాల వైపు పిలుస్తున్నాడు: (ఇక సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నుడయిన మనిషిని ఉద్దేశించి) “తృప్తి చెందిన మనసా! పద నీ ప్రభువు సన్నిధికి. నీవు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. (ఇక) నా పుణ్యదాసులలో చేరి నా స్వర్గంలో ప్రవేశించు” అని చెప్పడం జరుగుతుంది. (అల్-ఫజ్ర్: 27-30)
ఒక ఉన్నత స్థాయి గల వ్యక్తి రోజూ నిష్ఠగా అయిదు పూటల నమాజు, ఖుర్ఆన్ పారాయణం చేసేవాడు. వీలు కుదిరినప్పుడల్లా నియమబద్ధంగా మక్కా మదీనాలకు వెళ్ళేవాడు. అయిదేళ్లకు ఒకసారి హజ్జ్ కు వెళ్లడం అతనికి ఉన్న మంచి అలవాటు. కానీ, ఆయన ముక్కోపి. రోజూ భార్యను, పిల్లల్ని కొడుతూ ఉండేవాడు. బంధుమిత్రులతో దురుసుగా ప్రవర్తించేవాడు. అతని స్నేహితులు అసహనంతో ‘ఇంకేం లాభం! నమాజు, ఖుర్ఆన్ పారాయణం, హజ్జ్ ఉమారాలు మానేయొచ్చు కదా!’ అనేవారు. కానీ ఆ ప్రబుద్ధుడు ‘లేదు! లేదు! వాటిని ఎలా మానతాను? అవి నా ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో ఉపయోగపడతాయి’ అనేవాడట. కారణం - దైవ అహక్కుల నిర్వర్తన ఎంత అవసరమే, దైవ దాసులా హక్కుల నిర్వహణ కూడా అంటే అవసరం అన్న విషయం అతనికి తేలికపోవడమే. దైవ ప్రవక్త (స) తన అనుచరుల (సహాబాల) తో “ముఫ్లిన్ (దరిద్రుడు) (ఏ ఆధారము లేనివాడు) ఎవరు?" అని ప్రశ్నిచారు. సహాబా (రజి) దానికి సమాధానంగా "తన వద్ద దిర్హమ్ మరియు దీనార్ లేనివాడు" అని అన్నారు. అది విని ప్రవక్త ముహమ్మద్ (స) "కాదు, ప్రళయ దినాన నమాజ్, ఉపవాసము, సదఖాల వంటి తిహామా పర్వతాలు వంటి పుణ్యాలు తీసుకొని వస్తాడు =, కానీ అతను ఇతరులను తిట్టి ఉంటాడు, ఇతరులపై అపనిందలు మోపి ఉంటాడు, ఇతరులను కొట్టి ఉంటాడు, ఇతరుల సంపదను అన్యాయముగా అనుభవించి ఉంటాడు. ప్రళయ దినాన లెక్కల ఘడియ ఆసన్నమైనప్పుడు, అతనిచే బాధింపబడిన వారందరు తమతమ హక్కు కొరకు హాజరవుతారు. వారి వారి హక్కులకు సరిపోవు అతని పుణ్యఫలములో నుండి ఇప్పించ బడుతుంది. . చివరికి అతని పుణ్యాలన్నియు ఖాళీ అయితాయి. తరువాత వారి పాప భారము ఇతనిపై వేయ బడుతుంది. . తరువాత అతనిని నరకములో త్రోయ బడుతుంది. ఇటువంటి వ్యక్తిని ముఫ్లిన్ (దరిద్రుడు), (ఏ ఆధారము లేనివాడు) అని అంటారు" అని మహనీయ ముహమ్మద్ (స) వివరించారు. (ముస్లిం) దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు : నరకానికి ఎవరు (లేక) నరకం ఎవరిపై నిషిద్ధమో నేను మీకు తెల్పనా? ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సౌక ర్యాన్ని కలగజేస్తూ, మృదుత్వం మార్దవా లతో వ్యవహరించే ప్రతి వ్యక్తిపై నరకం నిషిద్ధమే. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు) (సుననె తిర్మిజీ) సన్నిహితంగా ఉండటమంటే తమ నడవడికతో, మంచి ప్రవర్తనతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవటమని అర్థం. అదేవిధంగా సౌకర్యాన్ని కలుగజేస్తూ మృదువుగా వ్యవహరించటమంటే ప్రాపంచిక వ్యవహారాల్లో వారిపట్ల అణకువతో, ప్రేమతో వ్యవహరించటమని భావం. ఈ హదీసులో కూడా ఉత్తమ నడవడికకు గల గొప్పదనం వివరించబడింది. దీనికి విశ్వాసంతో ప్రగాఢమైన సంబంధముంది. మనిషిని నరకాగ్ని నుంచి కాపాడేది ఆ విశ్వాసమే . అంటే ‘కట్టుకున్న భార్యను, ఇంట్లో పిల్లల్ని ప్రేమించకుండా, ఇతరులతో సౌమ్యంగా మెలగకుండా మనం ఎన్ని సాధనలు, ప్రార్థనలు చేసినా ఫలితం ఉండదు. ముందు మన ప్రవర్తన మార్చుకోవాలి. దైవభక్తి, ధర్మనిరతిది అవినాభావ సంబంధం. ఒకటి పెరిగితే, సమస్థాయిలో రెండోదీ పెరుగుతుంది. పాపభీతి, ధర్మనిరతి కవలల్లాంటివి. ఈ రెంటికీ ఒక దానితో మరోదానికి విడదీయరాని సంబంధం ఉంది. దైవప్రీతి పెరిగే కొద్దీ పాపభీతి కూడా పెరుగుతుంది. అలాగే ,పాపభీతి కలిగే కొద్దీ దైవప్రీతి పెరుగుతుంది. అందుకే ‘మృదుత్వం, సరళత’ ఈ రెండూ దైవభక్తి గలవారి జీవితాన్ని నడిపించే ప్రధానసూత్రాలు. ధర్మాన్ని తప్పి ప్రవర్తించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం శూన్యమే. సద్వర్తనే సాధన విశ్వాసం అంటే నోటితో పలకడం, మనసుతో సత్యం అని అంగీకరించండం, శరీరావయవాలతో ఆచరచయను ఇవ్వడం. కానీ మాజంలో చాలామంది తమ సాధనలన్నిటినీ, ఆరాధనలన్నింటిని యాంత్రికంగా మారుస్తున్నారు. సాధనలు, ఆచారాలు, ఆరాధనలు వీటన్నిటి వెనుక ఉన్న జ్ఞానాన్నీ, తత్వాన్నీ అర్థం చేసుకోకుండా, నిత్యజీవన ప్రవర్తనతో అన్వయించుకోకుండా మొక్కుబడిగా ముగించేస్తుంటారు. మనసులో దయ, కరుణ, ప్రేమ పెంచుకోకుండా ఆచరించే ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరే! ‘కోపం, మూర్ఖత్వం, కపటం, అసూయ, అహంకారం, చెడు ఆలోచనలు తదితరమైనవి అపరిశుద్ధ మనో లక్షణాలు. శాంతం, సహనం, ప్రేమ, కరుణ, సేవాభావం గల మనస్సులే పరిశుద్ధమైనవి. మనం సంప్రదాయ, ఆచార వ్యవహారాల నుంచి లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ముస్లింసమాజంలో ఇంకా చాలా మంది ధార్మిక విషయాలకు సంబంధించిన ప్రాథమిక అవగాహనలోనే ఉన్నారు. కొందరు మేధావులు, పండితులు కూడా మతాన్ని కొన్ని ఆరాధనలకు, ఆచారాలకే పరిమితం చేస్తున్నారు. ఇస్లాం ధర్మం సంపూర్ణమయినది, జీవిత అన్ని కోణాల్లో మనిషికి కావాల్సిన మార్గదర్శకత్వాన్ని అది పరిపూర్ణ స్థాయిలో అందిస్తుంది. మనకెందుకులే అనుకుంటే పొరపాటే… అధర్మాన్ని ఎదుర్కోవటం, అసత్యానాన్ని ప్రాలదోలడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, అక్రమాన్ని అడ్డుకోవడం కూడా ఆధ్యాత్మిక ఉన్నతే! ధర్మోద్ధరణలో భాగమే!కళ్ళ ముందు జరుగుతున్న అధర్మాన్ని, అన్యాయాన్ని అడ్డుకోకపోతే ఎలాంటి తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి దైవ ప్రవక్త (స) వారి ఈ హెచ్చరికే సాక్ష్యం. ఎవని చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను - మీరు మంచిని బోధించనయినా బోధించాలి . లేదా చెడు నుండి వారించనయినా వారించాలి. ఇలా గనక మీరు చేయకపోతే అల్లాహ్ శిక్ష మీ మీద విరుచుకుపడే ప్రమాదం ఉంది. అప్పుడు మీరు ప్రార్థించినా, ప్రాధేయపడినా మీ ప్రార్థనలు స్వీకరించబడవు. (తిర్మిజీ) ‘ధర్మం అధర్మం వల్ల బాధకు లోనై తీర్పు కోసం వస్తే, దాన్ని తీర్చని సభ్యులు అధర్మం కారణంగా బాధపడాల్సి వస్తుంది. భయం, బెరుకు విడిచి అధర్మాన్ని అడ్డుకోవాలి అంటున్నారు ప్రవక్త (స). మీలో ఎవ్వ్వారుయిన ఒక చెడును చూస్తే వీలైతే దాన్ని చేతి (బలం)తో ఆపాలి. లేదా నోటి (కలం)తో వారించాలి. అదీ సాధ్యపడకపోతే దాన్ని మన్సులోనయినా తప్పుగా భావించి అసహ్యించుకోవాలి. ఇది విశ్వాసపు అత్యల్ప స్థాయి. (ముస్లిం) నేటి సమాజంలో కూడా అనేక సందర్భాల్లో మన ప్రవర్తన, ప్రతిస్పందన కూడా ఒకనాటి ప్రజల తీరును తలపిస్తూ ఉంటాయి. వారిని గురించి ఖుర్ఆన్ ఇలా నాతుంది: ఇస్రాయీల్‌ సంతతిలో సత్యాన్ని తిరస్కరించినవారు దావూద్‌ నోట, మర్యం కుమారుడు ఈసా నోట శపించబడ్డారు. దానిక్కారణం వారు అవిధేయులయి హద్దుమీరి ప్రవర్తించడమే. అదీగాక వారు ఒకర్నొకరు చెడుల నుండి వారించుకునేవారు కాదు. నిస్సందేహంగా వారు చాలా చెడ్డపని చేశారు. (అల్-మాయిదహ్: 79) మన ఎదుటే ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా ‘మనకెందుకులే!’ అన్న ఉదాసీన ధోరణే అత్యధికం. జోక్యం చేసుకుంటే ఎక్కడ మన తలకు చుట్టుకుంటుందోననే బాధ్యతా రాహిత్యం పౌర ధర్మానికే కాదు, మానవత్వానికే విఘాతం. అభాగినుల విషయంలో కావచ్చు, అనైతిక విషయాల్లో కావచ్చు.. ఎక్కడైనా నీతి, న్యాయాలను సమర్థించగలిగే ధైర్యం లోపించిన నాడు, మనం ఆధునిక సమాజంలో నివసిస్తున్నా ఆటవికులతో సమానమే! అందుకే ఖుర్ఆన్ ఇలా హితవు పలుకుతుంది: దిక్కులేక పోవడం చూసి అణచి వేయబడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలను రక్షించడానికి మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడరు? వారు (బాధలు భరించలేక) “ఓ మా ప్రభువా! దుర్మార్గులు నివసిస్తున్న ఈ నగరం నుండి మమ్మల్ని బయటికి తీసి కాపాడు. మాకు రక్షణ కల్పించి అండగా నిలిచేవారి నెవరినైనా నీ వైపు నుండి మా దగ్గరికి పంపు” అని మొరపెట్టుకుంటున్నారే! అలాంటి పీడిత ప్రజల రక్షణ కోసం ఎందుకు పోరాడరు మీరు? (అన్-నిసా: 75) అంటే, పాపం వల్ల ధర్మం, అసత్యం వల్ల సత్యం గట్టెక్కలేక చెడిపోయిన దుస్థితిలో ఉన్నప్పుడు సమర్థులైనవారు దానిని ఉపేక్షిస్తే, అది వారి తప్పవుతుందని, అది వారికి కీడూ కలిగిస్తుంద’ని హెచ్చరిస్తుంది ఖుర్ఆన్. ఆత్మపరిశీలన కూడా ఆధ్యాత్మికతే పారమార్థికంగా పురోగమిస్తున్న వ్యక్తి ఇతరుల ప్రవర్తనను సరిదిద్దే ముందు తొలుత తన ప్రవర్తనపై దృష్టి పెడతాడు. పెట్టాలి కూడా. తనలోని లోపాల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు. ప్రయత్నించాలి కూడా. మన పూర్వీకుల్లోని ఒకరు ఆత్మపరిశీలన ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ ‘నేను బయట ప్రపంచంలో ఎంతోమంది దుష్టులు ఉన్నారని అనుకునేవాడిని. కానీ, ఒక్కసారి నా హృదయంలోకి తొంగి చూసుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో నా కన్నా పరమదుష్టుడు వేరొకరు లేరని నాకు అర్థమైంది’ అన్నారు. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: . కనుక మీరు ఆత్మశుద్ధిని గురించి గొప్పలు చెప్పుకోకండి. మీలో నిజమైన దైవభీతిపరుడెవరో ఆయనకు బాగాతెలుసు. (అన్-నజ్మ్: 32) మనల్ని అశాంతికి గురిచేసే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే మాలిన్యం మన మనసు నుంచి తొలగిపోయేందుకు ఆత్మపరిశీలన ఎంతగానో దోహద పడుతుంది. కానీ, మన మనసులోకి తొంగి చూసుకునేందుకు మనకు సమయం ఉండదు. ఇష్టం ఉండదు. నిజానికి మన మనసులోని మాలిన్యాన్ని పరిశుభ్రం చేసుకోగలిగితే అంతా నిర్మలంగానూ, ప్రశాంతంగానూ ఉంటుంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు: నిస్సందేహంగా ఆత్మప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మను అణచిపెట్టినవాడు నాశనమవుతాడు. (అష్-షమ్స్: 09-10) అప్పుడే జీవనసార్థకత నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు: ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా వస్తువుని మీ దగ్గర భద్రపరిస్తే తిరిగి వారికి సురక్షితంగా అప్పగించండి. ప్రజల మధ్య ఏదైనా వ్యవహారం తీర్చవలసివస్తే న్యాయంగా తీర్చండి. చూడండి అల్లాహ్ మీకు ఎంత మంచి హితోపదేశం చేస్తున్నాడో! ఆయన సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు. (అన్-నిసా: 58) అల్లాహ్ మార్గంలో (సంపద) ఖర్చుపెట్టండి. చేజేతులా నాశనం కొని తెచ్చుకోకండి. ఉపకారం చేయండి. ఉపకారం చేసేవారంటే అల్లాహ్ కు మిక్కిలి ఇష్టం. (అల్-బఖరహ్ : 195) అన్యుల నుంచి అరువుగా తెచ్చుకున్న వస్తువుకు అధిక శోభను చేకూర్చి మరీ, అతి భద్రంగా అప్పజెప్పే వారు ఉత్తములు. ఆ వస్తువును స్వప్రయోజనాలకు అవసరమైనంత వినియోగించుకొని యథారూపంలో తిరిగి ఇచ్చేసేవారు మధ్యములు. సదరు వస్తువు రూపురేఖల్ని మార్చి అధ్వానంగా ముట్టజెప్పేవారు అధములు. రోజువారీ జీవితంలో వాడుకలో వచ్చే సామాన్య వస్తువులు - ఉప్పు, కారం వంటివి కూడా ఇవ్వడానికి మనసొప్పని వారి అధమాతిఅధములు. వారు నరకంలో అత్యంత లోతైన లోయ వైల్ లో పడవేయబడ్తారు అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. పరలోక తీర్పును ధిక్కరించే వాడ్ని నీవు గమనించావా? అతనే అనాథలను కసరి కొట్టేవాడు. పేదల అన్నదానం కోసం (ఇతరుల్ని) ప్రోత్సహించనివాడు. ప్రార్థన పట్ల అశ్రద్ధ, ఏమరుపాటులు వహించేవారికి వినాశం (రాసిపెట్టి) ఉంది. వారు ప్రతిపనీ లోకుల మెప్పు కోసం ప్రదర్శనాబుద్ధితో చేస్తుంటారు. (మితిమీరిన పిసినారితనంతో) వాడుకునే సాధారణ వస్తువుల్ని సైతం ఇతరులకు ఇవ్వడానికి నిరాకరిస్తారు. (అల్-మాఊన్: 1-7) అల్లాహ్ మనిషిగా పుట్టించి సృష్టి శ్రేష్టులుగా చేశాడు. . మనిషిగా పుట్టించినందుకు అల్లాహ్ కు కృతజ్ఞతగా సార్థక జీవనాన్ని గడిపి, నలుగురి జీవితాల్లో వెలుగులు నింపి ఆయన ప్రసన్నతలు పొంది, కీర్తిశేషులై తమ పేరును నిలబెట్టుకునేవారు ఉత్తములు. ‘నేను, నా వాళ్లు’ అంటూ స్వార్థపరులుగానే జీవించేవారు మధ్యములు. అల్లాహ్ నిర్దేశించిన ధర్మమార్గాన్ని అతిక్రమించి, అస్తవ్యస్త జీవనాన్ని గడుపుతూ, అంది వచ్చిన సువర్ణావకాశాన్ని వృథా చేసుకునేవారు అధములు. అందుకే ‘ముందు మంచి మనీషిగా జీవించటం అలవరచుకోవాలి. మానవత్వాన్ని ఇనుమడింపజేసుకోవాలి! అప్పుడు మ్ననారి ఆరాధ్య ప్రభువు అయిన అల్లాహ్ సంతుష్టుడవుతాడు ... ప్రజలు కూడా సంతోషిస్తారు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: హజ్రత్ అబుల్ అబ్బాస్ సహ్ల్ బిన్ సాద్ సాయిదీ (రజి) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! దేవుడు, ప్రజలు నన్ను అభిమానించా లంటే ఏం చెయ్యాలో చెప్పండి" అని అడిగాడు. “లోకంపట్ల అనాసక్తత చూపు. అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. ఆ తర్వాత ప్రజల దగ్గర ఉన్నవాటి పట్ల అనాసక్తత కనబరచు. అప్పుడు ప్రజలు నిన్ను అభిమానిస్తారు" అని సమాధాన మిచ్చారు దైవప్రవక్త (స).(సుననె ఇబ్నెమాజాలోని ఐహిక అనాసక్తత ప్రకరణం) జిహ్వాతోనే జీవితం ఒంటె బ్రహ్మజెముడు మొక్కల్ని ఇష్టంగా తింటుంది. ముళ్లు గుచ్చుకుని నోట్లోంచి రక్తం కారుతున్నా తినడం మానదు. అది దాని ఆహారం. అయితే మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒంటెల్లాగే శరీర తత్వానికి పడని, డాక్టరు కచ్చితంగా కూడదు అన్నవి, అల్లాహ్ నిషేధించినవి - నాలుకను అదుపులో పెట్టుకోలేక తింటూ ఉంటాం. కడుపులో మంట, అల్సర్లు వస్తే మందులు వాడతాం, అదుపులోకి రాగానే మళ్లీ అదే తిండి, రక్తపోటు, మధుమేహం... ఏ జబ్బైనా సరే, మందులతో కాస్త తగ్గిందంటే చాలు మళ్ళీ నాలుక రుచుల్నే కోరుతుంది. దానివల్ల ఆరోగ్యం, మనసుపైన నియంత్రణ పోతాయి. చేప జిహ్వ చాపల్యంతో ఎరకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. నాలుకను ఒక్కదాన్ని భాషణ, భోజన విషయంలో నియంత్రించగలిగితే, అన్ని ఇంద్రియాలపై నియంత్రణ సాధించవచ్చు. గుర్రం పరుగును నియంత్రించేందుకు రౌతు దానికి కళ్లెం వేసినట్లే, మనం కూడా నాలుకకు పగ్గాలు బిగించాలి. తప్పు దోవ పట్టకుండా మనసును నియంత్రించాలంటే- ముందుగా ఆహారపు అలవాట్లపై నియంత్రణ తెచ్చుకోవాలి. తినకూడదు అన్నవాటికి, అనుకున్నవాటికి దూరంగా ఉండగలగాలి. మాట మీద అదుపుండాలి. వైద్యుడు మన నాలుకను చూసి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నట్లే నాలుక మన ఆత్మీయ స్థితిని. చెబుతుందని పెద్దల మాట. ఎంతో చిన్నదైన నిప్పురవ్వ విస్తారమైన అడవిని తగులబెడుతుంది. నాలుక కూడా అగ్ని వంటిదే. ప్రపంచాన్నంతటినీ వశపరుచుకోవడానికి ప్రయత్నించే మనిషి- ముందు తన నాలుకని స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు