Sunday, August 10, 2025
పరామర్శ పరమార్థం /Meaning of consultation
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
పరామర్శ పరమార్థం
నన్ను విశ్వప్రభువు సృష్టించాడు. ఆయనే నాకు (రుజు)మార్గం చూపించాడు. నాకు ఆహారపానీయాలు ఆయనే ప్రసాదిస్తున్నాడు. నేను జబ్బుపడితే స్వస్థత చేకూర్చేవాడు, నాకు మరణం కలిగించేవాడు, (పరలోకంలో) నన్ను పునర్జీవింపజేసేవాడు కూడా ఆ ప్రభువే. ఆయన తీర్పుదినాన నా పాపాలు క్షమిస్తాడని ఆశిస్తున్నాను” అన్నాడు ఇబ్రాహీం. (అష్-షుఅరా: 76-82)
అబీ హురైరా రజియల్లాహు అన్ నుండి వచ్చిన ఒక హదీస్సులో: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: "భక్తుడు మరియు భక్తురాలు తమకు, వారి పిల్లలకు, మరియు వారి ధనానికి సంబంధించిన కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు, ఎంత వరకు అంటే, వారు అల్లాహ్‌ను కలుసుకునే సమయానికి వారి మీద ఒక తప్పు కూడా ఉండదు." (తిర్మిజీ)
"అబూ సయీద్ ఖుద్రీ ఇలా అన్నాడుః" "నేను ఇలా అడిగాను, 'ఓ అల్లాహ్ ప్రవక్తా! మానవులలో ఎవరు ఎక్కువ కఠినంగా పరీక్షించబడ్డారు?" ఆయన అన్నాడుః "ప్రవక్తలు". నేను ఇలా అన్నానుః "'ఓ అల్లాహ్ ప్రవక్తా! తర్వాత ఎవరు? ఆయన ఇలా అన్నాడుః "నీతిమంతులు. సజ్జన పూర్వీకుల్లో ఒకడు పేదరికంతో ఎంతగా పరీక్షించబడేవాడంటే , అతను తనను తాను కప్పుకోడానికి ఒక దుప్పటి తప్ప తన వద్ద మరేమీ ఉండేది కాదు. అయినా ఎంతో సంతృప్తిగా ఉండేవాడు. ఎంతవరకంటే, మీలో ఒకరికి అపార సంపద లభిస్తే ఎంతగానయితే సంతోషిస్తారో వారిలో ఒకరు విపరీత పరీక్షకు గురి చేడయబెడితే అంతకంటే అధికంగా ఆనందించేవారు. (ఇబ్న్ మజా)
రోగుల పరామర్శ ఆదేశం
ప్రపంచంలోని నిస్సహాయులైన మానవుల పట్ల, ఇంకా చెప్పాలంటే, తన పని తాను చేసుకోలేని ప్రతి ప్రాణి పట్ల కూడా ఇతర మానవులు సానుభూతిలో వ్యవహరించాలి. వ్యాధిగ్రస్తుల బాగోగుల్ని పట్టించుకోవటం, వారిని పరామర్నిం చటం, వారికి సేవలు చేయటం మొదలగు పనులి అరబీలో ఇయాదత్ " అని అంటారు.
వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించటం ఆరోగ్యవంతుడయిన ప్రతి మానవుడి విది. దైవప్రవక్త (సల్లం) వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించమని ప్రత్యేకంగా తాకిడుచేసి చెప్పాడు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేటప్పుడు పాటించవలసిన నియమాలను, వారి కొరకు ప్రార్థించవలసిన దుఆలను ఇంకా దానికి లబించే పుణ్యం గురించి కూడా ఆయన బోధించారు.ఆయన ఇలా ఉపదేశించారు. "ఖైదీలను విడిపించండి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి. ధిగ్రస్తుల్ని పరామర్శించండి."
విలువ పెరగాలంటే లక్షలు కాదు లక్షణాలు కావాలి-విజ్ఞానం వికసించాలంటే విద్య కాదు విజ్ఞత కావాలి - మేధావి గా గుర్తింపు పొందాలంటే పట్టాలు కాదు ప్రావీణ్యత కావాలి - వినయం, సహనం, సంయమనం, విశ్వసనీయత సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి. జీవితం విచిత్రమైనది - కష్టపడి విజయం సాధించాం అని విశ్రాంతి తీసుకుంటే కుదరదు - అది నిలబెట్టుకోవడానికి అహర్నిశలూ కృషి చేయాలి - ప్రయత్నించి ఓడిపోయాము అని సరిపెట్టుకున్నా కుదరదు - విజయం దక్కేవరకూ శ్రమించాలి.- రెండింటికీ మానసిక సంయమనం తప్పనిసరి.
ఆరోగ్యవంతుని మీద రోగికి ఉన్న హక్కు
ఒక ముస్లింకు తోటి ముస్లింపై ఐదు హక్కులుంటాయి. 1) అతను సలాం చేస్తే దానికి ప్రతి సలాం చేయటం.
2) అతను వ్యాధిగ్రస్తుడయినప్పుడు అతన్ని పరామర్శించటం. 3) అతను చనిపోతే అతని జరాజా (శవపేటిక) వెంట వడపటం. 4)అతని ఆహ్వానాన్ని అంగీకరించటం. 5) అతను తుమ్మి "అల్ఫాములిల్లాహ్" అని అంటే దానికి సమాధానంగా "యర్హీముకల్లాహ్" అని అనటం. (బుఖారీ)
దైవప్రవక్త (స) హితోక్తి: "ఆకలిగొన్నవానికి అన్నం పెట్టండి. రోగిని పరామర్శించండి." (బుఖార్ షరీఫ్)
మహాప్రవక్త (స) మహితోక్తి: "ఒక ముస్లిం మరో ముస్లిం సోదరుణ్ని పరామర్శించటానికి వెళ్ళి తిరిగివచ్చేవరకు అతను స్వర్గలోకంలోని కిటికీలో ఉంటాడు." (ముస్లిం, మిష్కాత్ షరీఫ్)
నేను అనే అహం మనుషులకు దూరం చేస్తుంది - మనం అనే భావం "మిత్రమా స్వాగతం"అంటుంది - స్నేహం అనే బంధం జీవితాంతం తోడు ఉంటుంది - సానుకూల స్పందన మన దృక్పథం లో మార్పు తెస్తుంది. మన అనుభూతులు అనుభవాలుగా మారి మనతో కలిసి ప్రయాణం చేస్తాయి,అవి - భయం అయినా దూకుడు అయినా - నమ్మకం అయినా అనుమానం అయినా సంకల్పం అయినా సందేహం అయినా ఎంచుకోవలసిన వివేకం మాత్రం మనదే.
రోగి పరామర్శవల్ల కలిగే పుణ్యం
మహాప్రవక్త ముహమ్మద్ (స) మహితోక్తి “రోగిని పరామర్శించటానికి ఒకతను సాయంత్రం బయలుదేరినప్పుడు అతని వెంట డెబ్భైవేల మంది దైవదూతలు బయలుదేరుతారు. మరునాడుదయం వరకు వారా వ్యక్తి పాప మన్నింపు కోసం దుజ చేస్తారు; అతని కోసం స్వర్ణంలో ఓ స్థానం ప్రత్యేకించబడుతుంది. అలాగే ఒకతను రోగిని పరా మర్శించటానికి ఉదయం బయలు చేరుతాడు. అప్పుడతని వెంట చెళైవేల నుండి దైవదూతలు బయలుదేరుతారు. వారతని పాపమన్నింపు కోసం సాయంత్రందాకా దుబి చేస్తారు. అతని కోసం స్వర్గంలో పండ్లతో నిండిన ఓ తోట ప్రత్యేకించబడుతుంది." (తిర్మిజీ, అబూదావూద్)
అనస్ బిన్ మాలిక్ (రజి) కథనం: "ఉజూ" చేసి తోటి ముస్లిం సోదరుణ్ని పరామర్శించిన మనిషి నుండి సరకం డెబ్బై (ఖరీఫ్) సంవత్సరాల దూరంలో ఉంచబడుతుంది." (అబూదావూద్)
వ్యాధిగ్రస్తునికి సేవ చేయటానికి వెళ్ళి అతన్ని పరామర్శించే వ్యక్తిని ఉద్దేశించి ఆకాశంలో ఉండే పడూత ఒకడు ఇలా ప్రకటిస్తారు: "నువ్వు ఎంతో మంచి పని చేశావు. నీ నడక ధన్యమగు గాక! నువ్వు స్వర్గంలో స్థానాన్ని ఏర్పరచుకున్నావు." (ఇబును మాజా)
నేనే అనే ఆలోచన అహాన్ని పెంచుతుంది - నాదే అనే భావన స్వార్ధాన్ని పెంచుతుంది - అహం, స్వార్థం రెండు కలిసి ఆధిపత్యాన్ని పెంచుతాయి - కానీ ఆధిపత్యం మాత్రం అన్ని వేళలా సమర్ధనీయం కాదు - సమానత్వమే సదా సౌభ్రాతృత్వం.. తాళానికి తాళంచెవి పరిష్కారం - పాపానికి ప్రాయశ్చిత్తం పరిష్కారం - సన్మార్గానకి సత్సంగం పరిష్కారం - రోగానికి ఔషధం పరిష్కారం పరిష్కారం లేని సమస్యే ఉత్పన్నం కాదు - కానీ సానుకూల దృక్పథంతో ప్రయత్నం మాత్రం మానవ ధర్మం.
దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారని అబూ మూసా (రజి) తెలియజేశారు: "రోగులను పరామర్శించండి. ఆకలితో ఉన్నవారికి ఆహారం సమకూర్చండి, బానిస లకు స్వాతంత్ర్యం ప్రసాదించండి." (బుఖారీ)
దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారని అబూ హురైరా (రజి) తెలియజేశారు: "అల్లాహ్ కోసం మీలో ఎవరైనా ఒక రోగిని గాని లేక మీ సోదరుణ్ణిగాని సందర్శించి పరామర్శిస్తే అప్పుడు ఒక ప్రకటనకర్త, "నీవు క్షేమంగా ఉంటావు. నీ నడక శుభప్రదమవుతుంది. నిశ్చయంగా నీవు స్వర్గంలో స్థానం సంపాదించుకుంటావు" అని ప్రకటిస్తాడు. (తిర్మిజి)
దాసుని పరామర్శ దేవుని పరామర్శే
హఅబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా తెలిపారు: "ఆదంపుతుడా! నేను జబ్బుపడినప్పుడు నీవు నన్ను పరామర్శించ దానికి రాలేదు' అంటాడు దేవుడు. దానికి దాసుడు 'ప్రభూ! నేను మిమ్మల్ని ఎలా పరామర్శించగలను? మీరు యాపశ్లోకాలకే ప్రభువు కదా!' అంటాడు. అప్పుడు. విశ్వప్రభువు ఇలా అంటాడు. 'ఫలానా దాసుడు అబ్బుపడ్డాడు. కాని నీవు అతడ్ని పరామర్శించ లేదు. (ఆరోజు) నీవు అతడ్ని పరామర్శించి ఉంటే అతని దగ్గర నన్ను దర్శించి ఉండేవాడివి" (ముస్లిం షరీఫ్)
ప్రతి పరిచయం విలువైనదే - ప్రతి బంధం బలమైనదే - ప్రతి భావం అర్ధవంతమైనదే - ప్రతి రాగం రంజితమైనదే - అర్ధం చేసుకుంటే అన్నీ అనుకూలమే - అపార్ధం చేసుకుంటే అన్నీ అనుమానాలే!
పరామర్శించే తీరు
హజ్రత్ అబీ ఉమాను (రజి) కథనం: "రోగిని పరామర్శించడానికి మీరు అతని సుదుటి పై మీ చేయి పెట్టి లేదా అతని చేతిపై మీ చేయి పెట్టి 'మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడగాలి." (తిర్మిజి షరీఫ్)
రోగిని పరామర్శించడంలోని అసలు ఉద్దేశ్యం అతని ఆందోళనసు దూరంచేసి మనస్సును కుదుటపరచడమే. మనం ఎవరి బాధనూ దూరం చేయ లేకపోవచ్చు, కాని మన మృదుభాషణ లేక మంచిమాటల ద్వారా రోగి హృదయాన్ని ఉల్లాసపరచి, అతని విచారాన్ని కొంతవరకు దూరం చేయగలం.
అనవసరపు ఆలోచనలు ఆరోగ్యానికి హానికరం - అతిగా ఆలోచనలు చేయడం మనసుకు ఆందోళనకరం - సహేతుకమైన ఆలోచనలు జీవితానికి సత్సంగ సాకారం - సానుకూల స్పందనలు మానసిక ఆరోగ్యానికి సదా సహకారం. ఎదుటివారిలో మంచిని గ్రహించాలి అనే భావం మనలో సత్ప్రవర్తన కలిగిస్తుంది - సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిత్వం విలువలకు కట్టుబడి ఉంటుంది - విలువలు కలిగిన జీవితం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
మంచి మాటలతో రోగి పరామర్శ
హజ్రత్ సయీద్ బిన్ ఖుద్రి (రజి) ప్రకారం దైవప్రవక్త(0) హితోక్తి: "మీరు రోగిని పరామర్శించడానికి వెళితే అక్కడ అతని ఆయుష్షు పెరిగే మాటలు ప్రస్తావించాలి. దీనిపల్ల మనకు ఏ కొరతా రాదు. పైగా ఇలాంటి మాటలతో రోగి మనసు సంతోషంతో కుదుటపడుతుంది." (ఇన్నిమాణా)
హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రవి) ఉల్లేఖనం: "ఓసారి దైవప్రవక్త (స) ఓ రోగిని పరామర్శించటానికి వెళ్ళారు. ఆ సమయంలో దైవప్రవక్త (స) తన మామూలు సంప్రదాయం ప్రకారం రోగితో 'ఎలాంటి ప్రమాదం లేదు. దేవుడు తలచుకుంటే పరిశుద్ధత, స్వస్థత చేకూరుతాయి' అని అంటారు. (బుఖారి షరీఫ్) لا بَأْسَ، طَهُورٌ إِن شَاء اللَّه
మంచి చెడూ, విజయం ఓటమి, కష్టం సుఖం అన్నీ జీవితంలో తప్పని ఘట్టాలే - మంచి నుంచి మానవత్వం - చెడు నుంచి ధృడత్వం విజయం నుంచి స్ఫూర్తితత్వం - ఓటమి నుంచి అనుభవంసారం - కష్టం నుంచి కార్య దీక్షత - సుఖం నుంచి వినమ్రత ప్రేరణ గా పొందావంటే జీవితం పరివర్తన చెంది పరిపూర్ణమవుతుంది.
పరామర్శలో క్లుప్తత
హజ్రత్ సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్ (రజి) ఉల్లేఖనం: "పుద్యార్దన కోసం రోగిని పరామర్శించడానికి వెళ్ళినపుడు రోగి వద్ద కొద్దిసేపు మాత్రమే ఉండాలి.. ఇదే మంచి పరామర్శ. (ఫతహుల్ కబీర్)
హజ్రత్ అనస్ (రజి) ప్రకారం దైవప్రవక్త (స) హితోక్తి "రోగిని పరామర్శించటానికి వెళ్ళేవారు అతని వద్ద ఎక్కువ సేపు కూర్చోరాదు. రోగివద్ద తిష్టవేసి చాలా సేపు కూర్చోవటం అభిలషనీయమైన చర్యకాదు."
ప్రతి జీవిలో మంచీ చెడూ రెండూ ఉంటాయి - చీమల లోని క్రమశిక్షణ - కాకుల లోని ఐకమత్యం - కుక్కల లోని విశ్వాసం -ప్రకృతి లోని సహజత్వం - మానవత్వానికి జత కలిస్తే మనుగడ ఆదర్శమే!
రోగిని మూడవరోజు పరామర్శించాలి
హజ్రత్ ఇసస్ (రజి) ప్రకారం దైవప్రవక్త (స) రోగిని మూడు రోజుల తర్వాత పరామర్శించేవారు. మరో ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) జ్వరానికి మూడు రోజుల తర్వాత చికిత్స చేసేవారు. (ఇబ్సెమాజా, ఖచ్వినీ, తిబ్రాని)
పై ఉల్లేఖనం ద్వారా దైవప్రవక్త (స) వ్యాధివచ్చిన మూడు రోజుల పిదప రోగిని పరామర్శించటానికి వెళ్ళేవారని తెలుస్తోంది. ఇది ఓ ప్రత్యేక వ్యాధి విషయంలో కావచ్చు లేదా ఆయన పనుల వత్తిడి వల్ల అలా చేసి ఉండవచ్చు. మొత్తం మీద ఆయన రోగిని తప్పకుండా పరామర్శించేవారు.
ఆత్మవిశ్వాసాన్ని మించిన స్ఫూర్తి లేదు -ఆత్మాభిమానాన్ని మించిన వ్యక్తిత్వం లేదు - ఆత్మగౌరవాన్ని మించిన సంపద లేదు - ఆత్మసాక్షిని మించిన నమ్మకం లేదు - ఇన్ని ప్రమాణాలు కలిగిన ఉన్న జీవితానికి ఎదురే లేదు. మెరుగు పెడితేనే స్వర్ణానికి మెరుపు -సాన పడితేనే కత్తికి పదును -ఉలి తాకితేనే రాయికి రూపు - అలాగే కష్టాలను చాకచక్యంగా అధిగమిస్తే నే మనిషి కి గుర్తింపు.
రోగిని నమాజీకై ప్రోత్సహించటం
అబూహురా (రజి) కథనం: “ఒకసారి నేను కడుపునొప్పి బాధతో ఉన్నానని తెలిసి దైవప్రవక్త (స) నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఆయన నన్ను చూసి 'అబూహురైరా నీకు కడుపులో నొప్పిగా ఉందా?" అని అడిగారు. నేను 'అవును దైవప్రవక్తా అన్నాను. అపుందాయన "లే. లేచి సమాజ్ చెయ్యి, నమాజ్ లో స్వస్థత ఉంది' అని చెప్పారు." (ఇబ్నెమాజ)
దైవప్రవక్త (స) హజ్రత్ అబూహురైనా (రజి)తో ఇలా అన్నారు. "నీకు కలిగే ఏదైనా ఆపద, బాధ లేక విచారం పోవటానికి సమాజ్ చెయ్యి సమాజ్లో స్వచ్ఛత ఉంది. కరుణామయుడైన దేవుడు నీ బాధల్ని దూరం చేస్తాడు. "
మౌనం బలహీనత కాదు,సంకల్ప బలం - సహనం అలసత్వం కాదు, అపూర్వ నమ్మకం - చిరునవ్వు లౌక్యం కాదు, అనేక సమస్యలకు స్పందన - ఓదార్పు సానుభూతి కాదు, మనిషి కి ఆలంబన.
తప్పులు ఎంచడం అవివేకం - అవహేళన చేయడం అహంకారం - అవమానించడం ఆత్మన్యూనత - తప్పులు సరిదిద్ది అక్కున - ర్చుకుని ఆదరించడం సమానత్వం - సమానత్వం పాటించండి, సౌభ్రాతృత్వం పెంపొందించండి.
దైవప్రవక్త (స) కళ్ళ వెంట ఆశ్రుధారలు
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రజి) ఉల్లేఖనం పరామర్శకు సంబంధించి దైవప్రవక్త (స)కు ఎదురైన ఒక సంఘటన ఇలా ఉంది ఒకసారి సయీద్ బిన్ ఉబాడా (రజి) జబ్బు పడినప్పుడు దైవప్రవక్త (స) అతడ్ని పరామర్శించడానికి వచ్చారు. అప్పుడు ఆయన (స) వెంట అబ్దుర్రహ్మాన్ బిన్ బెఫ్, సయీద్ బిన్ పూస్, అబ్దుల్లా బిన్ మసూద్ (రజి) ఉన్నారు. దైవప్రవక్త (స) సయీద్ బిన్ ఉపోదా దగ్గరకు చేరుకున్నప్పుడు సయీద్ స్పృహలో లేరు. దైవప్రవక్త (స) ఆ దృశ్యం చూసి అతను చనిపోయాడా?" అని అడిగితే, బేదని తెలిపారు అక్కడున్నవారు. ఆ సమయంలో దైవప్రవక్త (స)పై విషాదఛాయలు అలుముకున్నాయి. తరువాత ఉల్లేఖకులు ఇలా తెలిపారు - దైవప్రవక్త (స)ను ఆ స్థితిలో చూసినవారు కూడా రోదించసాగారు. తరువాత దైవప్రవక్త (స) ఇలా తెలిపారు- " అశ్రువులపై, హృదయావేదనలపై దేవుడు ఎలాంటి శిక్ష విధించడని మీరు వినలేదా? కాని (నాలుక వైపు చూపిస్తూ) దీనిద్వారా శిక్షిస్తాడు లేదా కరుణిస్తాడు" అని అన్నారు. (బుఖారి, ముస్లిమ్)
భయం ఉంటేనే ధైర్యం విలువ తెలుస్తుంది - కన్నీళ్లు ఉంటేనే కష్టాల విలువ తెలుస్తుంది - ప్రకృతి ఉంటేనే కాలం విలువ తెలుస్తుంది-కష్ట సుఖాల సమభావన సంయమనం ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది.మనిషి కి ఆశ ఎక్కువ - మనసు కి కోరిక ఎక్కువ - డబ్బు కి స్వార్థం ఎక్కువ - హోదా కి అహం ఎక్కువ - ఎక్కువలన్నీ అదుపులో ఉంటే జీవితం అర్ధవంతంగా ఉంటుంది.
పరామర్శ వేళ చేయాల్సిన దుఆలు
హజ్రత్ అయిసా సిద్దిఖా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) రోగిని పదామర్శించటానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఈ దుఖ పఠించేవారు: " أذهب البأس، رب الناس، واشفِ أنت الشافي، لا شفاءَ إلا شفاؤك، شفاءً لا يُغادر سقمًا" మానవుల సృష్టికర్త! ఇతని బాధ దూరం చెయ్యి ఎలాంటి వ్యాధీ మిగలకుండా పూర్తిగా స్వస్థత చేకూర్చు. (బుఖారి)
పరామర్శవేళ మరో దుఆ
బిస్మిల్లాహి అర్కీక మిన్ కుల్లి షైయిన్ యూజీక వ మిన్ షర్రి కుల్లి నప్సిన్ ఔ హాసిదిన్ అల్లాహు యశ్ఫీక బిస్మిల్లాహి అర్కీక
దుఆ చేయమని రోగిని అభ్యర్థించడం
దైవప్రవక్త (స) హితోక్తి: "మీరు రోగిని పరామర్శించండి. మీ కోసం దేవుడ్ని ప్రార్థించమని చెప్పండి. వ్యాధి గ్రస్తుడి దుఆ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, అతని పాపాలు మన్నించబడతాయి." (అత్తర్ బుల్ తరివాజ్)
దైవప్రవక్త (స) హీరోక్తి: "మీలో ఎవరైనా రోగి వద్దకు వెళ్ళినప్పుడు మీ కోసం దుఆ చేయమని అతడ్ని అర్లించండి. అతని దుఆ దైవదూతల దుఆకు సమానంగా ఉంటుంది. (ఇచ్నెమాజ, మిష్కాత్)
అంతిమఘడియల్లో గుర్తుచేయవలసిన మాటలు
అబూసయీద్ ఖుద్రీ (రజి) ప్రకారం ప్రవక్త (స) హితోక్తి: "మీలో మరణించేవానికి 'లా ఇబాహ ఇల్లల్లాహ్ పఠించమని గుర్తుచేయండి (ముస్లిం)
హజ్రత్ మహల్ (రజి) ప్రకారం దైవప్రవక్త (స) హితోక్తి: "మీలో ఎవరి చివరి వచనాలు 'లాఇలాహ ఇల్లల్లాహ్ అవుతాయో వారు స్వర్గప్రవేశం చేస్తారు." (ముస్తదరక్ హాకిమ్. సుననె అబూబాపూర్)
రోగికి అంతిమ ఘడియలు సమీపించాయని అనుకున్నప్పుడు రోగి చుట్టూ చేరినవారు "కలిమా"యె తయ్యిల" పఠించమని గుర్తుచేయాలి. గుర్తు చేయటమంటే రోగి దగ్గర కూర్చున్నవారు బిగ్గరగా 'కలిమా' పఠిస్తుండాలి.
ఒకవేళ వ్యాధిగ్రస్తుణ్ని కలిమా పఠించమంటే అతని మనసు అతని అదుపాజ్ఞల్లో ఉందో లేదో మనకు తెలియదు. అలాంటి స్థితిలో అతను కలిమ పఠించటానికి నిరాకరించవచ్చు. అంచేత అతని దగ్గర కూర్చున్నవారే కలిమా పరిస్తే రోగి దీన్ని గ్రహించి తానూ 'కలిమా' వదించడానికి ప్రయత్నించవచ్చు.
దైవప్రవక్త (స) పరలోక ప్రస్థానం
హజ్రత్ అయిషా సిద్దిఖా (రజి) కథనం: "దైవప్రవక్త (స)ను అంతిము ఘడియలు సమీపించినప్పుడు ఆయన వద్ద ఒక నీటిపాత్ర ఉంది. అందులో నీళ్ళున్నాయి. ఆయన తన చేతిని ఆ పాత్రలో ముంచి ఆ తడిచేత్తో తన ముఖంపై రుద్దకునేవారు. తరువాత ఆయన దేవా! నాకు సహాయం చేయి-మృత్యువు నుంచి, దాని బాధల నుంచి, " (తిర్మిజి షరీఫ్)
హజ్రత్ అయిషా (రజి) కథనం: "దైవప్రవక్త నన్ను ఊతగా చేసుకొని కూర్చొని మాటలు పలకటం నిన్నాను- "దేవా! నన్ను క్షమించు. నాపై కరుణించు, నన్ను నా పరమోన్నత మిత్రునితో కలువు." (ముత్తపఖున్ అలై)
రోగుల్ని పరామర్శించటంలో కుల, మత, వర్గ భేదాలు పాటించరాదు
దైవప్రవక్త (సల్లం) తను స్వయంగా వ్యాధిగుస్తుల్ని పరామర్శించటమే గాకుండా (దానికోసం ఇతరుల్ని కూడా పురికొల్పేవారు). పైగా బహుదైవారాధకులు, యూదులు, కపట విశ్వాసులు మొదలగు ముస్లిమేతరులు వ్యాధిగ్రస్తు అయినప్పుడు దైవప్రవక్త (సల్లం) వారి దగ్గరకు వెళ్ళి వారిని కూడా పరామర్శిస్తూ ఉండేవారు.
నీ ప్రభువు తలిస్తే భూవాసులంతా (సత్యాన్ని) విశ్వసించేవారు. కాని నీవు ప్రజల్ని బలవంతంగా విశ్వాసులుగా మార్చదలిచావా? దైవాజ్ఞ లేనిదే ఏఒక్కడూ విశ్వసించలేడు. (యూనుస్: 99)
మాటల్లో చూపించే ప్రేమను గౌరవించాలి - నటనలో చూపించే ప్రేమను గమనించాలి - చేతల్లో చూపించే ప్రేమను ఆహ్వానించాలి .అహంతో చూపించే ప్రేమను తిరస్కరించాలి - బంధాల నిర్మాణంలో ఎంతో విలువైనది ప్రేమ అన్న యదార్థాన్ని గమనించాలి.
గమ్యం లేని వాడికి మార్గం ఉన్నా కనపడదు - లక్ష్యం లేని మనిషికి సాధన ఉన్నా ఫలితం ఉండదు - ఆలోచన లేని వ్యక్తికి ప్రణాళిక ఉన్నా పనికి రాదు - కానీ చిత్తశుద్ధి ఉన్న వారికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వైపు గమనం సాగుతూనే ఉంటుంది.
చివరి మాట
హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రజి) ఇలా అన్నారు: అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: విశ్వాసి యొక్క ఉదాహరణ ఒక మృదువైన మరియు సున్నితమైన మొక్క లాంటిది, అది నిరంతరం గాలికి ఊగిపోతుంది. కపట విశ్వాసి యొక్క ఉదాహరణ ఒక పైన్ చెట్టు లాంటిది, దాని వేర్లు భూమిలో చాలా బలంగా ఉన్నాయి, గాలులు దానిని కదిలించలేవు, అది ఒకేసారి పెకిలించబడే వరకు. (బుఖారీ, కితాబ్ అల్-మర్ధి, వ్యాధి ప్రాయశ్చిత్తం అధ్యాయం: 5643)
జనులు దీర్ఘకాల ఆందోళన, భయం, వేదన, లేక అలాంటి ఇతర ప్రతికూల భావోద్రేకాలను అనుభవించినప్పుడు, సామాన్యంగా వారు కృంగిపోతారు. ప్రియమైనవారి మరణం, విడాకులు, ఉద్యోగం ఊడిపోవడం, లేక కోలుకోలేని అనారోగ్యం కృంగుదలకు లేక విపరీతమైన దుఃఖానికి కారణం కావచ్చు. తాము చేసింది విఫలమై, అందరినీ నిరుత్సాహపరిచామన్న భావనతో, మేమెందుకూ పనికిరామన్న భావనను పెంచుకోవడం వల్ల కూడా ప్రజలు కృంగిపోతుంటారు. ఒత్తిళ్లను బట్టి ఎవరైనా పూర్తిగా నీరుగారి పోవచ్చు, ఆరు నూరయినా ఊరు ఏరైనా నిరాశకు గురికాకూడదు. మనం రేపటి గురించి చింతించకూడదు ఎందుకంటే ఏ రోజు కష్టం ఆ రోజుకు ఉంటుంది. అరచేతిలో గీతలు తలరాతని మార్చలేవు - గగనంలో గ్రహాలు మన గమనాన్ని ఆపలేవు - రాశులు, నక్షత్రాలు నడవడికను శాసించలేవు-కృషి,పట్టుదల, ఆత్మవిశ్వాసం, సంకల్పబలం మాత్రమే మన జీవిత సాఫల్యాన్ని నిర్ణయిస్తాయి.
వృద్ధులు అనుభవ భాండాగారాలు - వృద్ధులు సుధీర్ఘ జీవిత సుసంపన్నులు - వృద్ధులు యువతకు స్ఫూర్తి ప్రదాతలు - వృద్ధులు తరతరాల వారసత్వ సంపదలు - వృద్ధులు సమసమాజ స్థాపన సంధానకర్తలు - గౌరవించండి, అనుసరించండి, ఆదరించండి!. మన మాటల్లో పరిణితి - చేతల్లో ఆత్మీయత - నడతలో వినమ్రత - మనసులో ఆర్ద్రత - బంధంలో బాధ్యత - ఇవి సంపద కంటే విలువైనవి నిలబెట్టుకుంటే జీవితం సుసంపన్నం.
వయసుతో వచ్చేది పెద్దరికం కాదు, బాధ్యత తో వచ్చేదే పెద్దరికం - హోదాతో వచ్చేది గౌరవం కాదు, విలువలతో వచ్చేదే గౌరవం - చదువుతో వచ్చేది జ్ఞానం కాదు, సంస్కారంతో వచ్చేదే జ్ఞానం - రంగు తో వచ్చేది అందం కాదు, మనసుతో వచ్చేదే అందం.
కోరికలను త్యజించిన మనసులో ఆత్మజ్ఞానం ఆవిర్భవిస్తుంది - ఆత్మజ్ఞానం ద్వారా పొందే ఆనందం అనంతమైన అనుభూతిని ఇస్తుంది- శరీరం సౌఖ్యాలకు బానిసై సుఖాలను ఆశిస్తుంది - సుఖాల ద్వారా అనుభవించే ఆనందం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది - నిర్మలమైన, నిశ్చలమైన మనస్సుతో సాధన చేసే ఆనందం నిరంతరమై ఉంటుంది. ప్రయత్నం పవిత్రమైతే ఫలితం ఆనందమే.. మహాద్భుతమే!.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు