Saturday, November 1, 2014

ఓ భర్తగా నేను



- అబుల్‌ హసన్‌

   జీవితపు అన్ని ఘడియల్లో నేను ఆమెను సుఖ పెడతాను.
  ఆమె లోపాలని పదేపదే ఎత్తి చూపను. దుస్తుల్లో వంటకాల్లో, మాటల్లో ఉన్న లోపాలను అప్పటికప్పుడు వేలెత్తి చూపను. మరొకరితోనూ చెప్పుకోను.
  అప్పుడప్పుడు ఆమె కోసం స్త్రరితీశి కొని, దాచి - కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకున్న తరువాత ఇస్తాను.
ఆమె నాకు స్త్రరితీశి ఇచ్చినప్పుడు ఆమెను నేను ఎంతగానో  మెచ్చుకుంటాను.
ఆమె నాతో ఏదైనా చెప్పదలిస్తే నేను ఆమెను ప్రోత్సహిస్తాను. నేను ఆమెకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆమె భావోద్దేశాలను దృష్టిలో ఉంచుకుంటాను. పొలం విషయంలోనైనా, వంట విషయంలోనైనా గుడ్డలు కుట్టే కుట్టించే విషయంలోనైనా, అవసరమనిపిస్తే వెనకడుగు వెయ్యను. నా వల్ల కాదు, కూడదు అని సాకులు చెప్పను.
కొన్ని సందర్భాల్లో ఆమె పట్ల నా ప్రేమని ఎక్కువ ప్రదర్శిస్తాను. ముఖ్యంగా బహిష్టు సమయంలో, గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవించినప్పుడు.

నేను ఆమెతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించను. ఆమె ఓ స్త్రీ అనీ, స్త్రీ గాజులాంటిదని సదా దృష్టిలో ఉంచుకుంటాను. ప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ''వారు (స్త్రీలు) గాజుల్లా నాజుకైన వారు. వారితో మృదువుగా ప్రవర్తించండి''.
అప్పుడప్పుడు ఆమెకు ఇష్టమైన వస్తువులు నాకు ఇష్టం లేకపోయినా తెచ్చిస్తాను.
నేను ఆమెను మంచి పేరుతో పిలుస్తాను. ప్రవక్త(స) మన అమ్మగారైన ఆయిషా(ర) ని ప్రేమతో 'ఆయిష్‌' అని పిలిచేవారు  కదా!
ఆమె నా కోసం శ్రమించినప్పుడల్లా, నేను ఆమెపై ప్రశంసావర్షం కురిపిస్తాను.
  నేను ఇంట్లో అడుగుపెట్టాక బయటి విషయం గురించి ఆలోచించను. నేను ఆమెకు తోడుగా ఉంటూ, రోజూ
   అవసరమయిన వాటి గురించి చర్చిస్తాను.
  దీనీ ఇజ్తెమాలలో, సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనమని ఆమెకు చెబుతూ ఉంటాను.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు