ఆస్క్ ఇస్లాం పీడియా
మస్జిదె హరమ్ మరియు మస్జిదె నబవి ఇస్లాం లో చాలా పవిత్రమైన మస్జిదులు. ఇవి రెండూ సౌదీ అరబ్ లో ఉన్నాయి. ఈ భూమిపై మొట్టమొదటి మస్జిద్ (ప్రార్థనా నిలయం) మస్జిదె హరమ్. అంటే ఇది మక్కా ప్రదేశంలో ఉంది.(మస్జిదె హరమ్) మరియు మదీనా ప్రదేశంలో ఉన్న(మస్జిదె నబవి)లలో చేయాల్సిన ప్రార్థనా పద్ధతుల గురించి దాదాపు అన్ని ప్రపంచపు భాషలలో అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి. హజ్, ఉమ్రా చేయాల్సిన పద్ధతుల గురించి అనేక పుస్తకాల్లో సవివరంగా తెలియజేయబడింది.
విషయసూచిక
హదీస్
మక్కా ముకర్రమా ఔన్నత్యాలు
మదీనా మునవ్వరా ఔన్నత్యాలు
ప్రస్తుత పరిస్థితి
విస్తరణ వివరాలు
విస్తరణ ప్రదేశం
ఆధారాలు
హదీస్
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారని, ఇబ్న్ జుబైర్రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నా మస్జిద్ (మస్జిదె నబవి)లో నమాజ్ చేయడం ఇతర మస్జిద్ లలో నమాజ్ చేయడం కన్నా వెయ్యిరేట్లు మేలైనది, మస్జిదె హరమ్ తప్ప (కాబా చుట్టూ పరిధి). మస్జిదె హరమ్ లో నమాజ్ చేయడం నా మస్జిద్ లో నమాజ్ చేయడం కన్నా వంద రేట్లు ఉత్తమమైనది.” అహ్మద్ మరియు ఇబ్న్ హిబ్బాన్ దీన్ని ధ్రువీకరించారు. బులూఘుల్ మరాం 779
మక్కాముకర్రమాఔన్నత్యాలు
మక్కా గురించి అల్లాహ్ ఇలా అన్నాడు:“నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రధమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోక వాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు.” ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:96-97
“ఈ నగరము ప్రమాణముగా (నేను చెబుతున్నాను)! (ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం)! నువ్వు ఈ నగరంలో స్వేచ్చా వాసివి.” ఖుర్ఆన్ సూరా బలద్ 90:1-2
“అత్తిపండు సాక్షిగా! ఆలివు సాక్షిగా! “సైనా” పర్వతం సాక్షిగా! శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా!” ఖుర్ఆన్ సూరా తీన్ 95:1-3
ఈ పవిత్రమైన మస్జిద్ మక్కా నగరంలో ఉంది. మస్జిదె హరమ్ లో చేసే నమాజులు ఇతర మస్జిద్ లా నమాజుల కంటే 100,000 రేట్లు ఎక్కువ.
మస్జిదె హరమ్ యెక్క విశిష్టతలలో హజరె అస్వద్ (నల్ల రాయి) ఒకటి. ఇది ఉన్నచోటు నుంచి తవాఫ్ (కాబా ప్రదక్షిణ) మొదలవుతుంది మరియు అంతమవుతుంది. హజరె అస్వద్ స్వర్గపు రాయి. దీని గురించి దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు, “ఈ నల్ల రాయి స్వర్గం నుండి తీసుకొరాబడినప్పుడు ఇది పాల కంటే తెల్లగా ఉండేది, కాని ఆదం సంతానంలోని వారి పాపాల మూలంగా ఇది నల్లగా మారింది.” తిర్మిజి – 877
మదీనా తయ్యిబా ఔన్నత్యాలు
జైద్ బిన్ అస్లం ఆయన తండ్రి (రజి అల్లాహు అన్హుం) ద్వారా ఉల్లేఖించారు, ఉమర్ రజి అల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నాకు నీ దారిలో ప్రాణ సమర్పణ చేసే అవకాశం ఇవ్వు మరియు నాకు నీ ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం పట్టణం లో మరణం ప్రసాదించు.” బుఖారీ-114
ప్రస్తుత పరిస్థితి
మతాఫ్ (కాబా ప్రదక్షిణ చేసే ప్రదేశం)లో ఎక్కువ మంది ప్రదక్షిణ చేసే విధంగా ఓ నమూనాను తయారు చేసి సౌదీ రాజు అబ్దుల్లా ముందు హాజరు చేయ బడింది. దాన్ని ఆయన ఆమోదం చేసి పని ప్రారంభించమని ఆదేశించారు.
ప్రస్తుతం మతాఫ్ (కాబాప్రదక్షిణచేసేప్రదేశం)లో విస్తరణ పనులు జరుగుచున్నవి. కొత్త మతాఫ్ దాదాపు మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది. అది ప్రస్తుతం ఒక గంటలో 52,000 మందికి సరిపోయే విధంగా ఉంది. విస్తరణ తరువాత అక్కడ ఒక్క గంటలో 130,000 మంది విశ్వాసులు ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఒట్టోమన్ (ఒట్టోమన్)కు వెనుక ఉన్న భవనాన్ని కూల్చేసి దాని స్థానంలో 1 పునాదీ 3 అంతస్తులు మరియు ఒక పైకప్పు- ఇవన్నీ ఎలాంటి స్తంభాలులేకుండా కేవలం తవాఫ్ (కాబా ప్రదక్షిణ) కొరకు నిర్మించబడుతున్నాయి.
విస్తరణవివరాలు
మొత్తం పని పూర్తయ్యే వరకు (డిసెoబర్ 2012) నుండి 3 సంవత్సరాలు పడుతుంది.
ఈ విస్తరణ వల్ల ప్రస్తుత 400,000 m^2 కు 1,300,000 m^2 ఎక్కువ చేరుతుంది.
విస్తరణ ప్రదేశం
విస్తరణ ప్రదేశం మొత్తం : 709.460 sq mts
కొత్త భవన విస్తరణ ప్రదేశం: 331.400sqmts
పని చేయు భవన విస్తరణప్రదేశం: 321.400sqmts
బ్రిడ్జులు కట్టే ప్రదేశం: 56.660sqmts
మొత్తం విస్తీర్ణ ప్రదేశంలో సరిపోయే భక్తులు: 871.200
విస్తీర్ణ భవనంలో సరిపోయేభక్తులు: 297.400
పైకప్పులలో సరిపోయేభక్తులు: 187.500
బయటి ప్రదేశంలో సరిపోయేభక్తులు: 315.400
బ్రిడ్జుల్లో సరిపోయేభక్తులు: 71.200
విస్తీర్ణ భవనానికి గల ద్వారాలు: 54. ఓ ముఖ ద్వారం ఉత్తరాన మరియు ఓ ముఖ ద్వారం దక్షిణాన.
ప్రముఖ (డోమ్) గుమ్మపు కప్పు ఎత్తు: 21 మీటర్లు
పైకప్పు భవనం నుంచి కొత్త విస్తీర్ణ భవనానికి భక్తుల్ని తీసుకెళ్ళే బ్రిడ్జుల సంఖ్య: 16
పెద్ద గొడుగుల సంఖ్య: 9
చిన్న గొడుగులసంఖ్య: 24
విస్తీర్ణ భవనంలో గల ఎలివేటర్లు: 16
విస్తీర్ణభవనంలో గల వుజూ ప్రదేశాలు: 3.120
విస్తీర్ణభవనంలోగల మరుగు దొడ్ల సంఖ్య: 1.380.
పైకప్పు భవనంలోగలమరుగుదొడ్లసంఖ్య: 5700

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు