Saturday, November 1, 2014

ఓ భార్యగా నేను



- ఉమ్మె హసన్‌

స్వాగతం

  నేను మా శ్రీవారిని పూర్తి ఉత్సాహంతో ఘనంగా స్వాగతిస్తాను. వారు ఎప్పుడు ఎదురైనా నవ్వుతూనే పలకరిస్తాను. నేను వారి రాకకై పరితపిస్తున్నట్టు, ఎదురుచూస్తున్నట్టుగా వారికి అవగతమయ్యేలా ప్రయత్నిస్తాను. 
   వారు ఇంట్లో ప్రవేశించేటప్పుడు నేను చిరునవ్వుతో వారి అలసటను దూరం చేస్తాను. 
   ఇంట్లో ప్రవేశించాక దుస్తులు మార్చుకునేంతవరకు, ప్రశాంతంగా కూర్చునేంతవరకు నేను వారితోనే ఉంటాను. 
  నేను వారి ఆరోగ్యం గురించి అడుగుతాను. వారి దిన చర్యల గురించి ప్రశ్నిస్తాను. 
   వారికోసం నేను నీళ్ళగ్లాస్‌ అందజేస్తాను. పళ్ళరసాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 
  నా శరీరం నుండి ఎలాంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడతాను.

బంధు మిత్రులు

   శ్రీవారి బంధువులు- అతిథుల  కోసం నేను మెచ్చేది కాక వారు 
   ఇష్టపడే  వంటకాలని చేసి పెడతాను. 
   వారు విశ్రాంతి తీసుకునే గదులను నీటుగా ఉంచుతాను. 
   నేను వారందరితో ప్రేమతో వాత్సల్యంతో మసలుకుంటాను. 

భర్త కోపం

   నేను వారి ముఖ్య కార్యాల్లో తలదూర్చను.ఏదైనా మాటనికాని లేక 
   నా కోరికను గాని మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించను. 
  నేను వారిని చాలా మృదువుగా పలకరిస్తాను. నా మాట 
  సరైనదైనా ఆ సమయంలో నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను 
  మంచి సమయం చూసి వారికి చెప్పి ఒప్పిస్తాను. 
  వారు ఏదైనా మరచిన ఎడల నేను వారిని చాలా సున్నితమైన 
   రీతిలో తెలియపరుస్తాను.
  వారు రాజీపడిన తరువాతే నిద్రిస్తాను. వారికి ముందు 
   నిద్రించను.
 అప్పుడప్పుడు ప్రవక్త(స) గారి ఈ సద్వచనాన్ని వారి చెవిన 
   వేస్తుంటాను. ''నీ భార్యే నీ స్వర్గం, నీ భార్యే నీ నరకం''.  


No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు