Saturday, November 1, 2014

హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా)




తాహిరా తన్వీర్ 


హజ్రత్‌ ఫాతిమా(రజి) పరిచయం:

హజ్రత్‌ ఫాతిమా(ర.అన్‌హా) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం కనిష్ఠ పుత్రిక.
ఇస్లామీయ చరిత్రలో ప్రవక్త ముహమ్మద్‌ (స) తరువాత సాదరంగా ప్రస్తావించబడే వారిలో ఆయన(సల్లం) సతీమణి, విశ్వాసుల మాత హజ్రత్‌ ఖదీజతుల్‌ కుబ్రా(ర.అన్‌హా), ఆయన పెత్తండ్రి కుమారుడైన అలీ(ర.అ), ఆయన మనుమలు హసన్‌ హుసైన్‌(అ) ముఖ్యులు. ఖదీజా(ర.అన్‌హా) హజ్రత్‌ ఫాతిమా(ర.అన్‌హా) తల్లి, హజ్రత్‌ అలీ (ర.అ) ఆమె భర్త, హసన్‌ హుసైన్లిరువురు వారి పుత్రులు. హజ్రత్‌ ఫాతిమా(ర.అన్‌హా) జీవితంతో ఈ మహనీయులకు గాఢ సంబంధముంది కనుక కాస్త వారిని గూర్చి తెలుసుకోవడం సమంజసం.

హజ్రత్‌ ఖదీజా(ర.అన్‌హా)  మక్కా పట్టణంలోనే గొప్ప సంపన్నురాలు. ఒకటి తరువాత మరొకటి రెండు మార్లు వివాహమాడి విధి వంచితులై రెండు మార్లూ విధువరాలయ్యారు. వారిద్దరి ద్వారా ఒక్కొక్క కుమారునికి తల్లి కూడా. రెండవ భర్త చనిపోయిన కొద్దికాలంలోనే తండ్రి ఆప్యాయతకు కూడా దూరమయ్యారు. కానీ తండ్రీ, భర్తల ఆస్తిపాస్తులకు వారసురాల య్యారు. దైవం ఆమెకు అందచందాలతో పాటు సుగుణాలను కూడా ప్రసాదించాడు. ఈ కారణాల వల్ల ఎందరో ఉన్నత ధనిక కుటుంబీకులు ఆమెకు వివాహ సందేశం ఇచ్చారు. కానీ తను ఇష్టపడలేదు.
 తమ వద్దనున్న ధనాన్ని వ్యాపారంలో వెట్టుబడిగా వెట్టారు. వాణిజ్య సమర్థులకు లాభాల్లో వాటా ఇచ్చే షరతుపై వర్తకులుగా నియమించి, వారితో సరకులను అమ్మించి
 
తమ వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఆ రోజుల్లో ముహమ్మద్‌(స) తమ  పెత్తండ్రి  అబూ తాలిబ్‌తో ఉండేవారు. అబూ తాలిబ్‌ ఆర్థిక స్థోమత వ్యాపారంలో వెట్టుబడి వెట్టేంతగా లేనందువలన ప్రవక్త (స) ఇతర వ్యాపారస్తులవద్ద  పనిచేసేవారు.
ఆయన(స)  తెలివితేటలూ, నిజాయితీ, నిస్వార్థ గుణాలు మక్కా పట్టణంలో మారుమ్రోగ సాగాయి. ఈయన  గూర్చి విన్న ఖదీజా(ర.అన్‌హా) తన సరకులను ఆయనకవ్పగించి 'మైసరా' అను తన నౌకరును తోడుగా పంవించారు. ఈసారి పంవిన వర్తక బిడారు వారికి ఊహించని లాభాలను తెచ్చివెట్టింది. అదేకాక
ముహమ్మద్‌(స)తో వెళ్ళిన నౌకరు ఆయన(స) గుణగణాలను, నిజాయితీని ఎంతో ముచ్చటగా చిత్రీకరించాడు. ఆ వర్ణన ఖదీజా(ర.అ) హృదయాన్ని ఆయన వైపు

ఆకర్షింపజేసింది.  తనే స్వయంగా ఆయనకు వివాహ సందేశం పంపి ఆయన్ని(స) వివాహమాడారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్‌(స) వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే. ఖదీజా(రఅ) వయసు నలభై సంవత్సరాలు. ప్రవక్త (స)తో వివాహం తర్వాత ఆయన  అలవాట్లను చాలా దగ్గర్నుంచి చూసే అవకాశం లభించింది. ఆయన వ్యక్తిత్వ మహత్యమే ఆమెను వ్రేమ ముగ్ధురాలుగా చేసింది. ప్రతి పనిని చేయటానికి నౌకర్లున్నవ్పటికీ తనే స్వయంగా ఆయన సేవలు చేసి ఆనందించేవారు. 
 ప్రవక్త కూడా ఆమెను అలాగే వ్రేమించేవారు. ఆనాడు అరబ్బు దేశంలో బహుభార్యాత్వం చెలామణిలో ఉన్నప్పటికీ ఆమె జీవించి ఉన్నంత కాలం ప్రవక్త(సల్లం) మరో వెళ్ళి గురించి ఆలోచించలేదు. 

ప్రవక్త(స) సహకారం:

 ప్రవక్త ముహమ్మద్‌(స) నలభై సంవత్సరాల వయసుకు చేరుకున్న విదప అల్లాహ్‌ా ఆయన్ని సమస్త మానవజాతికి అంతిమ ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఈ వార్తను  ప్రవక్త(స) మొట్టమొదట తన అర్ధాంగియైన ఖదీజా(ర.అన్‌హా)కే తెలియపరచారు. అదీ కాక తమలోని భయాందోళనలను కూడా వ్యక్తపరచారు. ఈ వార్త వినగానే ఖదీజా (ర.అన్‌హా) ఏ మాత్రం సంకోచించకుండా విశ్వసించారు. పైగా ఆమె ఈ విధంగా ఓదార్చారు:
 ''మీరు వేదసాదలకు సన్నిధి, బంధువిుత్రుల హక్కులను నెరవేర్చువారు, నిరువేదల వెన్నిధి, అతిథులకు వుర్యాద చేయువారు, సత్యాన్ని సవుర్థించువారు కనుక అల్లాహ్‌ మిమ్ముల్ని వృధాచేయడు.'' 
 ఇలా ఇస్లాం స్వీకరించిన తొలి స్త్రీగా ప్రఖ్యాతి గాంచారు ఖదీజా (ర.అన్‌హా).  
ప్రవక్త (స)ను వెంటబెట్టుకుని తన  పిన తండ్రి కుమారుడు, క్రైస్తవ పండితుడైన వరఖా బిన్‌ నౌవ¦ిల్‌ వద్దకు వెళ్ళి పూర్తి విషయం అతని ముందుంచి, ప్రవక్త (స)వై అవతరింపబడిన వాక్యాలు అల్లాహ్‌ తర్ఫునుండనీ, ప్రవక్త ముహమ్మద్‌ (స) అంతిమ దైవ సందేశహరుడనీ ధృవీకరించుకున్నారు.  ఆ తరువాత మనసా, వాచా కర్మణా ఆయనకు అండగా నిలబడ్డారు.-జీవితాంతం!


No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు