Tuesday, March 4, 2025

అద్భుత ఆరాధనా ఆహ్వానం అజాన్

అల్లాహ్ వైపున, ఆయనప్రవక్త వైపున మహాహజ్‌ దినాన ప్రజలందరికీ ఓ బహిరంగ ప్రకటన - అజాన్ (ఇది):(తౌబహ్: 03) ఇస్లాం సత్య ధర్మ ధుని ధ్వని అజాన్. గుంపులు గుంపులుగా అలుముకునేందుకు ఎగబడివుతున్న మిథ్యాంధకారాన్ని పటాపంచలు చేసే సత్య స్వర తేజం అజాన్. కుఫ్ర్ కారు చీకట్లను కడదాకా తరిమికొట్టే క్రాంతి నాదం అజాన్. అన్యాయం, అవినీతి, అవిశ్వాసం, ఘోరాతి ఘోరమైన అత్యాచారం - షిర్క్ కి వ్యతిరేకం రోజుకు అయిదు సార్లు ప్రపంచవ్యాప్తంగా పూరించబడే సత్య సమర శంఖారావం అజాన్. అది ప్రకటించే సమరభేరి ఉక్కు కరవాలంతో కాదు, మందు తూటాలతోనూ కాదు, అణ్వాయుధాలతో అంతకన్నా కాదు. ఈ సమరంలో సత్య నినాదం - అజాన్ చేతిలో ఒకే ఆయుధం - అదే సత్యం- సత్యతాకరవాలం!
జగమంతా అజాన్ మయం మనలో అజాన్‌ పలుకులు వినని వారు ఎవరుంటారు చెప్పండి! దివారాత్రుల్లో అయిదు సార్లు మనం అజాన్‌ పలుకుల్ని వింటున్నాము. నిజం చెప్పాలంటే విశ్వం మొత్తంలోని విశ్వాసులు అన్ని పలుకులకన్నా అధికంగా అజాన్‌ పలుకుల్నే వింటారు. ఆ విషయానికొస్తే ప్రపంచంలో ప్రతి ఘడియ మారుమ్రోగుతున్న ఏకైక శబ్దం అజాన్‌ అని అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది. ఓ చోట ఫజ్ర్‌ అజాన్‌ అయితే, మరో చోట జుహ్ర్‌ అజాన్‌, ఇంకో చోట అస్ర్‌ అజాన్‌… జగమంతా అజాన్ మయం, మాయం. అజాన్ పరిచయం అజా‘న్‌ అంటే ప్రకటన, తెలియపరచటం, వార్త అందించటం అని అర్థం. ధార్మిక పరిభాషలో నమా’జ్‌ కోసం ప్రత్యేక పదాల ద్వారా పిలవటం అని అర్థం. అదేవిధంగా బిడ్డ పుట్టగానే కుడిచెవిలో అజా‘న్‌, ఎడమ చెవిలో ఇఖామత్‌ పలకాలి. నమా’జ్‌ కోసం అజా‘న్‌ ఇవ్వటం ప్రవక్త సాంప్రదాయం. ఇది ఇస్లామ్‌ చిహ్నాల్లో ఒక చిహ్నం. ఐదుపూటల నమా’జుకు, శుక్రవారంనాడు అజా‘న్‌ ఇవ్వటం ప్రవక్త సాంప్రదాయం. అజాన్ ఆదేశం నిర్ణీత సమయంలో చేయు ఫర్జ్‌ నమాజు కొరకు మరియు చేజారిపోయిన ఫర్జ్‌ నమాజుల కొరకు అజాన్‌ పలకడం సున్నత్‌. సామూహికంగా నమాజ్‌ చేసేవారి కొరకు అజాన్‌ పలకడం సున్నత్‌ ముఅక్కదహ్‌, ఫర్జ్ కిఫాయా. కాకపోతే జన సమూహంలో ఏ ఒక్కరూ అజాన్‌ పలికినా అందరి తరపునా అదే సరిపోతుంది. ఒంటరిగా నమాజ్‌ చేసేవారి కొరకు అజాన్‌ పలకటం సున్నతె ఐనియ్యహ్‌. ఇస్లాం చిహ్నాలలో అజాన్‌ పలకడంలో చాలా గొప్ప విశిష్ఠత ఉంది. అజాన్ పూర్వ పరాలు – అజాన్‌ ప్రారంభం: హిజ్రీ శకం మొదటి సంవత్సరంలో అజాన్‌ పలకడం ప్రారంభమైనది. అజా‘న్‌ ప్రారంభం: ప్రవక్త (స) మక్కహ్ జీవితం అంతా ఆపదలతో, కష్టాలతో, బాధలతో గడిచింది. ఆ సమయంలో ఒక్క నమా’జు మాత్రమే విధి అయి ఉండేది. మదీనహ్ వచ్చిన తరువాత కొంత వరకు శాంతి భద్రతలు చోటు చేసుకున్న తరువాత విధులు, నిబంధనలు, బాధ్యతలు అవతరించటం ప్రారంభం అయ్యాయి. అనంతరం ’జకాత్‌, ఉపవాసాలు విధించబడ్డాయి. హద్దులు నిర్దేశించ బడ్డాయి. ధర్మాధర్మాలను వివరించటం జరిగింది. ఆ కాలంలో ప్రతి నమా’జుకు ప్రజలు ఒకచోట చేరుకునే వారు. ప్రజలందరూ వచ్చిన తర్వాత నమా’జును ప్రవక్త (స) చదివించేవారు. అయితే ప్రజలకు నమా’జు సమయం గురించి తెలియపరిచే సాధనాలేవీ ఉండేవి కావు. అందువల్ల ప్రవక్త (స) నమా’జు సమయం కాగానే యూదుల్లా డప్పులు కొట్టటం, లేదా బాకా ఊదడం చేద్దామని నిశ్చయించుకున్నారు. ఇంతలో అన్సారుల్లోని ’అబ్దుల్లాహ్‌ బిన్‌-’జైద్‌ బిన్‌- ’అబ్దురబ్బిహ్ స్వప్నంలో అజా‘న్‌ పదాలు చూశారు. మేల్కొని ప్రవక్త (స) వద్దకు వచ్చి, వివరించారు. దానికి ప్రవక్త (స) నీకల సత్యమైనది, బిలాల్‌ కు అజా‘న్‌ నేర్పించ వలసిందిగా ఆదేశించారు. బిలాల్‌ అజా‘న్‌ ఇస్తున్నారు. ఇంతలో ’ఉమర్‌ (ర) వచ్చి తన స్వప్నాన్ని గురించి వివరిస్తూ, ‘నేను కూడా స్వప్నంలో ఈ పదాలనే విన్నాను,’ అని అన్నారు. ప్రవక్త (స) అది విని చాలా సంతో షించారు. ఇద్దరు ముస్లిముల ఏకాభిప్రాయంపై అల్లాహ్ (త) కృతజ్ఞతలు తెలుపుకున్నారు. (ఇబ్నె హిషామ్‌ – 283, జామె తిర్మిజి’ – 37) ఆధారం: అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ” ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్‌(పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్‌ ధ్యానం వైపు పరుగెత్తండి, క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ” ( సూరా జుముఅహ్‌: 9) దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ” నమాజు చదివే సమయం ఆసన్నమైనప్పుడు మీలో ఒకరు అజాన్‌ పలకాలి మరియు మీలో పెద్దవారు ఇమామత్‌ చేయాలి.(బుఖారి:602, ముస్లిం:674) అజాన్‌ పరమార్థం: అల్లాహ్‌ మహా వివేకి. అజాన్‌ పిలుపు ఇతర సముదాయాల మాదిరి కేవలం ఓ పిలుపు, లేదా హెచ్చరికలా మాత్రమే ఉండకూడదని, అజాన్‌ పిలుపు ఇస్లాం ధర్మ పరిచయంలా ఉండాలని, అది ఆరాధనా రూపంగా కూడా ఉండాలని అజాన్‌ పలుకుల్ని నుబువ్వత్ లోని నలభైవ భాగమైన సత్య కల ద్వారా నిర్దేశించాడు. ఇస్లామీయ ఆచరణలకు ముఖ్య ప్రాతిపదికలు – తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌. ఈ మూడు మూలాంశాలు ఇస్లాం ధర్మానికి పునాదిరాళ్ళు. ఈ మూడు మౌలికాంశాలు మనకు అజాన్‌ రూపంలో విశ్వ వ్యాప్తంగా రోజుకి ఐదు సార్లు వినిపిస్తాయి. అజాన్ ఔన్నత్యం హాఫిజ్‌ ఇబ్నె కసీర్‌ వ్యాఖ్యానం: అల్లాహ్ వైపునకు (ప్రజలను) పిలిచి, సత్కార్యాలు చేసి, తాను ముస్లింని అని పలికినవాని మాటకంటే శ్రేష్ఠమైన మాట మరెవరిది అవుతుంది? (హా మీమ్: 33)’ ఈ ఆయతు అందరికి వర్తిస్తుంది. అందరికంటే ప్రవక్త (స) దీనికి తగినవారు. కొందరు అజా‘న్‌ ఇచ్చేవారని భావించారు. ’సహీ ముస్లిమ్ లో ఇలా ఉంది, ”తీర్పుదినం నాడు ముఅజ్జి‘న్‌ అందరి కంటే పొడవైన మెడలు కలిగి ఉంటారు. ఇంకా సునన్‌లో ముఅజ్జి‘న్‌ నిజాయితీ పరుడని ఉంది. అల్లాహ్‌ ఇమాములను సన్మార్గం చూపాలి, ముఅజ్జి‘న్‌లను క్షమించాలి అని ఉంది. ఇబ్నె ’అబీ ’హాతిమ్‌లో ఇలా ఉంది, స’అద్‌ బిన్‌ వఖ్ఖాస్‌ (ర) అభిప్రాయం: ”అజా’న్‌ ఇచ్చేవారికి తీర్పు దినం నాడు అల్లాహ్‌ వద్ద జిహాద్‌ చేసిన వారికి లభించినంత పుణ్యం లభిస్తుంది. అజా‘న్‌ ఇఖామత్‌ల మధ్యకాలం పోరాటం చేయటం, రక్తసిక్తమై ఉండటంతో సమానం.” ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ”ఒకవేళ నేను ముఅజ్జి‘న్‌ అయితే, మరి నాకు ’హజ్జ్, ’ఉమ్‌రహ్‌, జిహాద్‌లు అన్నా ఫరవాలేదు.”’ఆయి‘షహ్‌ (ర) కథనం: ఈ ఆయతులో కూడా ముఅజ్జి‘న్‌ల గొప్పతనం ఉంది. ’హయ్య ’అల’స్సలాహ్‌ అని పిలవటం దేవుని గొప్పతనం వైపు పిలవటం అవుతుంది. ఇబ్నె ’ఉమర్‌ (ర) మరియు ఇక్రమ (ర)ల కథనం: ఇది ముఅజ్జి‘న్‌లకు కూడా వర్తిస్తుంది. అతడు సత్కార్యాలు చేస్తాడు. అంటే అ’జాన్‌ మరియు తక్‌బీర్‌ల మధ్య రెండు రకాతులు నమా’జు చదవటం. ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు అజా‘నుల మధ్య నమా’జు ఉంది. రెండు అజా‘నుల మధ్య నమా’జు ఉంది, రెండు అజా’నుల మధ్య నమా’జు ఉంది. కోరిన వారు అని ఉంది.” మరో ’హదీసు‘లో, ‘అజా‘న్‌ మరియు ఇఖామత్‌ల మధ్య దు’ఆ (ప్రార్థన) తిరస్కరించబడదు,’ అని ఉంది. అందువల్ల ఈ ఆయతు అల్లాహ్‌ వైపు పిలిచే వారందరికీ వర్తిస్తుంది. ’హసన్‌ బ’స్రీ ఈ ఆయతు పఠించి, ‘వీరు దైవప్రియ భక్తులు, వీరే అల్లాహ్‌ సన్నిహితులు అల్లాహ్‌ ప్రేమించేవారు, వీరు విశ్వసించి, ఇతరులకు కూడా వాటిని అందజేస్తారు. సత్కార్యాలు చేస్తారు. వీరే దైవప్రతినిధులు,’ అని వ్యాఖ్యానించారు. అజాన్ పిలుపుకి షైతాన్ పరార్ అబూ-హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జుకోసం అజా‘న్‌ ఇస్తే, షై’తాన్‌ అజా‘న్‌ వినబడనంత దూరం పారిపోతాడు. అజా‘న్‌ పూర్తవ గానే మళ్ళీ తిరిగి వస్తాడు, ఇఖామత్‌ అయిన వెంటనే పారిపోతాడు, పూర్తవగానే మళ్ళీ తిరిగి వస్తాడు. నమా’జీల హృదయాల్లో కలతలు సృష్టిస్తాడు. ఇంకా ఆ వ్యక్తికి మరచి పోయిన పనులను గుర్తుచేస్తాడు. ఈ విధంగా ఆ వ్యక్తి ఎన్ని రకాతులు చదివాడో తెలియకుండా చేస్తాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌) జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ‘నమా’జు అజా‘న్‌ను విని షై’తాన్‌ రౌహా ప్రాంతం వరకు పారిపోతాడు. ఉల్లేఖన కర్త రౌహా మదీనహ్ కు 36 మైళ్ళదూరంలో ఉంది,‘ అని అన్నారు. (ముస్లిమ్‌) ముఅజ్జిన్ ఘనత 1) గొప్ప పుణ్యం దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటీలు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటీలు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు“. (బుఖారీ 615, ముస్లిం 437). 2) సృష్టి సాక్ష్యం అబూసయీద్‌ అల్‌ ఖుద్రీ (ర)తో దైవప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: ” నీవు గొర్రెలను, పల్లెలను ఇష్టపడుతున్నావనే విషయం నేను గమనిస్తున్నాను, నీవు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు లేదా పల్లెలో ఉన్నప్పుడు నమాజ్‌ చేయుటకు అజాన్‌ పలికితే బిగ్గరగా శబ్దాన్ని పెంచి అజాన్‌ పలుకు. ఎందుకనగా అజాన్‌ పలికే వ్యక్తి శబ్దం ఎంత దూరం పోతుందో ఆలోపు ఉన్న మానవులు, జిన్నాతులు, మరియు ప్రతి ఒక్కటీ అతని గురించి పరలోకంలో సాక్ష్యం పలుకుతాయి. (బుఖారి-584) 3) స్వర్గ ప్రాప్తి ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”12 సంవత్సరాల వరకు అజా‘న్‌ ఇచ్చిన వ్యక్తి కోసం స్వర్గం తప్పనిసరి అయిపోయింది. అతని అజా’న్‌కు బదులు ప్రతిరోజు 60 పుణ్యాలు లిఖించ బడతాయి. ప్రతి తక్‌బీర్‌కు బదులుగా 30 పుణ్యాలు లిఖించబడతాయి.” (ఇబ్నె మాజహ్) ’ఉఖ్‌బ బిన్‌-’ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”అల్లాహ్‌ కొండ శిఖరాలపై మేకలు మేపుతూ, అజా‘న్‌ ఇచ్చి, నమా’జ్‌ చదివే మేకల కాపరి పట్ల సంతోషిస్తాడు. ఇంకా అల్లాహ్‌ దైవ దూతలతో, ‘ఈ నా దాసుణ్ణి చూడండి, అజా‘న్‌ ఇచ్చి నమా’జు చదువు తున్నాడు. ఇంకా నాకు భయ పడుతూ ఉన్నాడు, నేను నా దాసుణ్ణి క్షమించి వేసాను. ఇంకా నేను ఇతన్ని స్వర్గంలో ప్రవేశింప జేస్తాను,’ అని అంటాడు. (అబూ-దావూద్‌, నసాయి’) 4) కస్తూరీ కొండ మీద కొలువు అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తులు కస్తూరి కొండలపై ఉంటారు: 1. అల్లాహ్ హక్కును మరియు తన యజ మాని హక్కును నెరవేర్చిన సేవకుడు, 2. తన జాతికి ఇమామత్‌ చేసి, ముఖ్తదీలందరూ ఆయన పట్ల సంతోషంగా ఉన్న వ్యక్తి, 3. ప్రతిరోజు ఐదు పూటలు అజా‘న్‌ ఇచ్చేవాడు. (తిర్మిజి‘ – ఏకోల్లేఖనం) ముఅజ్జిన్ గురించి ప్రవక్త (స) వారి భవిష్యవాణి ’ఉమర్‌ (ర) ఒకవేళ నేను ముఅజ్జి‘న్‌ అయితే, నా కోరిక తీరి పోయేది, ఇంకా నేను రాత్రి అదనపు ఆరాధనలు, పగలు అదనపు ఉపవాసాలు గురించి ప్రయత్నించే వాడిని కాను. ఇంకా నేను, ”ప్రవక్త (స) ముఅజ్జి‘న్‌ క్షమాపణ గురించి మూడుసార్లు ప్రార్థించారని విన్నాను. అప్పుడు నేను, ప్రవక్తా! తమరు తమ ప్రార్థనల్లో మమ్మల్ని గురించి పేర్కొనటం లేదు, ”మేము అజా‘న్‌ ఇవ్వటానికి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాము,” అని అన్నాము. దానికి ప్రవక్త (స) అవును, కాని ఓ ’ఉమర్‌! ఒక కాలం రాబోతుంది. అజా‘న్‌ ఇవ్వటం కేవలం పేదల వరకే పరిమితమై పోతుంది. ’ఉమర్‌! విను నరకాగ్ని నిషేధించబడిన వారిలో ముఅజ్జి‘న్‌లు కూడా ఉన్నారు అని అన్నారు. అజాన్ బదులుకి లభించే పుణ్యం ‘అబ్దుల్లాహ్‌ బిన్‌-‘అమ్ర్ బిన్‌-‘ఆస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముఅజ్జి‘న్‌ అజా‘న్‌ విని అలాగే వల్లించండి, అజా‘న్‌ తరువాత నాకొరకు దరూద్‌ చదవండి, నాపై ఒకసారి దరూద్‌ పంపినవారిపై అల్లాహ్‌ 10 సార్లు కారుణ్యం అవతరింపజేస్తాడు. ఇంకా నాకోసం వసీలహ్‌ను పొందటానికి దు’ఆ చేయండి. ఎందుకంటే వసీలహ్‌ అనేది స్వర్గంలోని ఒకస్థానం పేరు. అది కేవలం ఒక్క దాసుని కొరకే ఉంది. అయితే నేను దాని అభ్యర్థిని. నా గురించి వసీలహ్‌ విషయంలో అల్లాహ్‌ను ప్రార్థిస్తే, అతని గురించి నా సిఫారసు ధర్మసమ్మతం అయిపోతుంది. అంటే అతని గురించి నా వసీలహ్‌ తప్పనిసరి అయిపోతుంది. ఇన్‌షా‘అల్లాహ్‌ అతని గురించి నేను తప్పనిసరిగా సిఫారసు చేస్తాను. (ముస్లిమ్‌) అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యమన్ వైపున హిజాజులో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండగా, బిలాల్ నిలబడి అజాన్ ఇచ్చాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “ఇతను (బిలాల్) చెప్పినట్లు పూర్తి నమ్మకంతో ఎవరు జవాబిస్తారో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (అహ్మద్ 2/352. నిసాయీ 668). అజాన్ సమాధానం ఇలా… ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్’ అన్నపుడు దానికి జవాబుగా మీలో ఒకడు తన హృదయాంతరంతో ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్’ అంటే, అతను (ముఅజ్జిన్) ‘అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్’ అన్నపుడు ఇతను (మీలో ఒకడు) ‘అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్’ అంటే, అతను ‘అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అన్నపుడు ఇతను ‘అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అంటే, అతను ‘హయ్య అలస్సలాహ్’ అన్నపుడు ఇతను ‘లాహౌల వలా ఖవ్వత ఇల్లా బిల్లాహ్’ అంటే, అతను ‘హయ్య అలల్ ఫలాహ్’ అన్నపుడు ఇతను ‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్’ అంటే అతను అల్లాహు అక్బర్ అన్నపుడు ఇతను అల్లాహు అక్బర్ అంటే మళ్ళీ అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే ఇతను స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 385). అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద కొంత మంది ఉన్నారు. ఇంతలో బిలాల్‌ (ర) నిలబడి అజా‘న్‌ ఇవ్వసాగారు. అజా‘న్‌ పూర్తయిన తర్వాత ప్రవక్త (స), ”నిర్మలమైన మనస్సుతో, దృఢమైన నమ్మకంతో అజా‘న్‌కు సమాధానంగా అజా‘న్‌ పదాలను వల్లించిన వ్యక్తి, స్వర్గంలో ప్రవేశిస్తాడు” అని అన్నారు. (నసాయి’) అజాన్ తర్వాతి దుఆ ఘనత 1) ప్రళయదినాన ప్రవక్త యొక్క సిఫారసుకు అర్హుడవుతాడు జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు “ఎవరైతే అదాన్ విన్న తర్వాత ఈ దుఆ (“అల్లాహుమ్మ రబ్బహాదిహిద్దావతిత్ త్తామ్మతి వస్సలాతిల్ ఖాయిమతి , ఆతి ముహమ్మదనిల్ వసీలత, వల్ ఫదీలత వబ్అథ్ హు మఖామం మహ్.మూదల్లదీ వఅత్తహు”) పఠించారో వారు ప్రళయదినం రోజున నా సిఫారసు పొందుటకు అర్హులగుదురు” సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం 2) పాపాల మన్నింపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “ముఅజ్జిన్ అజాన్ విన్నాక ‘వ అన అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బన్ వబి ముహమ్మదిన్ రసూలన్ వబిల్ ఇస్లామి దీనన్’ చదివిన వారి పాపాలు మన్నించబడతాయి”. (ముస్లిం 386, అబూ దావూద్ 525, తిర్మిజీ 210, నిసాయీ 672, ఇబ్ను మాజ 721). అజాన్ గురించి అపోహా ఈ పలుకులు అరబీ ఉండటం చేత అనేక మంది ముస్లిమేతర సోదరులు అపోహకు గురయి ఉన్నారు. ముస్లింలు అక్బర్‌ చక్రవర్తిని దైవంగా కొలుస్తారా? ‘అక్బర్‌’ని అల్లాహ్‌కు సమానంగా భావిస్తారా? అకర్‌నే అమతగా స్తుతిస్తారెందుకు? అన్న సందేహం కొందరిది. నిజానికి ఈ భావన సరి కాదు. అక్బర్‌ అంటే మహోన్నతుడు, గొప్పవాడు. అల్లాహు అక్బర్‌ అంటే, అల్లాహ్‌ ఘనాఘనుడు అని అర్థం. అవగాహనా రాహిత్యంగా కబీర్‌ దాస్‌ చెప్పిన మాట కూడా గమనార్హం – ‘కంకర్‌ పత్థర్‌ జోడ్‌కె మస్జిద్‌ నయీ బనాయ్‌, తాఛడి ముల్లా బాంగ్‌దె క్యా బహిరా హువా ఖుదాయ్‌’ రాళ్ళు, రప్పలు పేర్చి మస్జిద్‌ ఓ కొత్తది కట్టారు. ముల్లా కేకలు పెడుతున్నాడే, దేవుడేమయినా చెవిటి వాడా?. (అల్లాహ్ క్షమించుగాక!) అంటే అతని ఉద్దేశ్యంలో ముస్లింలు అజాన్‌ ద్వారా అల్లాహ్‌ను పిలుస్తారు అని. నిజానికి అజాన్‌ పిలుపు ద్వారా ప్రజలను ‘అల్లాహ్‌ ఆరాధన వైపునకు రండి’ అని పిలవడం జరుగుతుంది. నష్ట పోకు మరియు ఒకర్ని నష్ట పర్చకు "గుళ్లలోనూ ఉదయం 3 గంటలకే హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో డ్రమ్స్ వాయిస్తూ హారతినిస్తారు. ఆ శబ్దం వల్ల ధ్వని కాలుష్యం కాదా..? గంట వాయిస్తుంటే ఆ శబ్దం కేవలం గుడికే పరిమితమవుతుందా..? బయటకు వినబడకుండా ఉంటుందా. ఇలాంటి పిటిషన్‌లను ఏ మాత్రం ఉపేక్షించం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఆచారమది. ఓ 10 నిముషాల ప్రార్థన గురించి దాన్ని కాదనలేం కదా" -సౌండ్ పొల్యూషన్‌ని కొలవడానికి ఓ సైంటిఫిక్ మెథడ్ ఉంటుందని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలేవీ పిటిషన్‌లో లేవని మండి పడింది. 10 నిముషాల అజాన్ వల్ల ఎంత ధ్వని కాలుష్యం నమోదవుతుందో చెప్పాలని అడిగింది. - గుజరాత్ హైకోర్టు అయితే, నష్ట పోకు మరియు ఒకర్ని నష్ట పర్చకు అన్న సూత్రం దృష్ట్యా - అజాన్ బిగ్గరగా ఇవ్వడం అనివార్యమైన విషయమే అయినప్పటికీ కొన్ని సందర్భాలలో పునరాలోచించుకోవడంలో తప్పు లేదు. ఇది ఒక్క అజాన్ విషయంలోనే కాదు - శబ్ద కాలుష్యానికి సంబంధించి ప్రతి విషయంలోనూ జరగాలి. పాలకుడు పక్షపాతరహితంగా వ్యవహరిస్తే ప్రజలందరూ హర్షిస్తారు. ఓట్ల కోసమో, భయం చేతనో, బుజ్జగించాలనో ఒక వర్గం వారు ఏం చేసినా ఊరుకుంటూ ఉంటే అవతలివాళ్లకు ఆగ్రహం కలుగుతుంది. మన దగ్గర గుళ్లు, మసీదులు, చర్చిలు అన్నీ తౌడుస్పీకర్లు పెట్టి హోరెత్తించేస్తూ ఉంటాయి. పండగ సమయాల్లో పిచ్చెక్కిచేస్తూ ఉంటారు. అధికారులు చూసీచూడనట్లు ఊరుకుంటారు. పౌరుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిర్వాహకులు చావగొడతారు. ఇక లౌడుస్పీకర్ల వినియోగం గురించి సుప్రీం కోర్టు తన 2005 నాటి తీర్పులో ఏం చెప్పిందంటే, పండగ రోజుల్లో అర్థరాత్రి వరకు వాటిని వాడవచ్చు. అలాటి పండగలు ఏడాదిలో 15 రోజులకు మించకూడదు. ఇండస్ట్రియల్ ఏరియాలలో పగటి పూట 75 డిసిబెల్స్కు మించి శబ్దం ఉండరాదు. రాత్రి అది 70. కమ్మర్షియల్ ఏరియాలలో పగలు 65, రాత్రి 55. రెసిడెన్షియల్ ఏరియాలలో పగలు 55, రాత్రి 45. ఆసుపత్రులు, విద్యాలయాలు, కోర్టులు, ప్రార్థనలయాలు వంటి వాటికి 100 మీటర్ల వ్యాసంలో ఉన్న ప్రాంతాన్ని సైలెన్స్ జోన్: అంటారు. వాటిలో పగలు 50, రాత్రి 40. అన్ని రకాల శబ్దాలు కలిపి యీ పరిమితులన్నమాట. లౌడుస్పీకర్లయితే వాటి శబ్దం 10 డెసిబెల్స్కు మించి ఉండకూడదు. వ్రాతపూర్వకమైన అనుమతి లేకుండా పెట్టకూడదు. సాధారణంగా రాత్రి 10 గంటల తర్వాత వాటిని వాడకూడదు. చట్టాలెన్ని ఉన్నా అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. మతపరమైన విషయం అనగానే చర్య తీసుకోవడానికి జంకుతున్నారు. ఆ విషయానికి ఒక్క శబ్ద కాలుష్య సమస్యే కాదు ... మత పరమైన అక్రమ కట్టడాల సమస్య కూడా పెద్దదే. మన తెలుగు రాష్ట్రాలలో రహదారులపైనే కాదు, హైవేల మీద కూడా గుళ్లు, దర్గాలు కొత్తగా వెలుస్తున్నాయి. పాతవాటిని విస్తరిస్తున్నారు. అజాన్ ద్వారా ఇస్లాం ధర్మ పరిచయం అజాన్ ఒక్కో వాక్యం ద్వారా ఇస్లాం ధర్మ పరిచయం జరుగుతుంది. అల్లాహు అక్బర్‌ అని అజాన్‌లో 6 సార్లు పలకడం జరుగుతుంది. ఈ పలుకు ప్రతి రోజు పూర్వ సంద్యా సమయంలో సమస్త మానవాళిని సంబోధిస్తుంది. అ సమయం ఎలాంటి అంటే, సూర్యున్ని పూజించాలనుకున్న వాళ్లు దాని కోసం సమాయత్తమవుతుంటారు. విగ్రహాలను కొలిచేవారు వాటిని కొలిచేందుకు సిద్ధమవుతుంటారు. పదార్థ పూజారులు వారి ప్రయోజనాలకై ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. నిజమయిన అల్లాహ్‌ దాసులు ఫజ్ర్‌ నమాజు కోసం సమాయత్తమవుతుంటారు. ఆ సమయంలో ఫురించబడే సత్య శంఖం అజాన్‌. మీరు భావిస్తున్న సూర్యాచంద్రనకత్రాలు దైవం కాదు, మీరు భ్రమిస్తున్న విగ్రహప్రతిమలు దైవం కాదు. మీరు ప్రాకులాడుతున్న మీ కోరికలు, ఐహిక వాంఛలు దైవం కాదు. అల్లాహ్‌ా ఒక్కడే నిజ ఆరాధ్యుడు. ఓ మానవుల్లారా! ఆయనే ఆది ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతం ఆయన తర్వాత ఏదీ ఉండదు. ఆయనే బాహ్యాం ఆయనకు మించింది ఏదీ లేదు. ఆయనే నిగూఢం ఆయన తప్ప ఏదీ లేదు. ఆయనే సర్వ శుభాలకు నిలయం. ఆయనే సర్వ శక్తులకు మూలం. ఆయనే కీర్తికి అసలు కారకడు. ఆయనే విశ్వ సామ్రాజ్యాధికారి. తాను తలచిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు, తాను తలచి వారి నూమడి రాజ్యాధికారాన్ని ఊడబెరుకుతాడు. తాను తలచిన వారికి కీర్తి శిఖరాలపై కూర్చోబెడతాడు, ఆతను తలచివారిని అప్రతిష్ట అడుసు పాల్జేస్తాడు. అందరూ దీనులే ఆయన ప్రసాదించిన వారు తప్ప, అందరూ నగ్నులే ఆయన తొడిగించినవారు తప్ప. అందరూ ఆకలిగొన్నవారే అయన తినిపిం చినవారు తప్ప. సృష్టి మొదలు నేటి వరకు, నేడు మొదలు ప్రళయం వరకు వచ్చిన, ఉన్న, రాబోవు వారందరూ కలిసి ఆయన్ను ఆరాధించే గొప్ప భక్తునిలా మారిపోయినా ఆయన ఘనాఘనుడే, ఆందరూ కలిసి పరమ నీచునిగా మారిపోయి ఆయన్ను ఆరాధించడం మానేసినా ఆయన ఘనాఘనుడే. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ – నిశ్చయంగా అల్లాహ్‌ తప్ప మరో నిజ ఆరాధ్యుడెవడూ లేడు. సృష్టి ఇచ్చే సాక్ష్యం సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే సృష్టిలో ప్రతి ప్రాణీ, అది భౌతికంగా కనిపించేద అయినా, కనిపించనిదయినా, సూర్యచంద్ర నక్షత్రాలయినా, సముద్రాలు, అరణ్యాలు, అండ పిండ బ్రహ్మాండాల్లోని అనువణువు ఇచ్చే సాక్ష్యం అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడు అని. అవన్ని ఆయనే ఆజబద్ధులయి జీవిస్తున్నాయి. కాబట్టి వాటి మధ్యన ఘర్షణ లేదు. ఆ దృష్ట్యా అన్నీ ముస్లిములే. మనిషి ఈయాదార్థాన్ని విస్మరించిన కారణంగానే అధోగతికి పాలవుతున్నాడు, అశాంతి, అలజడులకు కారణం అవుతున్నాడు. సృష్టికి కర్త ఒక్కడే అని మనిషి అంగీకరిమచి ఆయన ఆధెశానుసారం జీవించిన నాడు అతని కావాల్సిన మానాసిక శాంతి, పరలోక మోకం రెండూ ప్రాప్తిస్తాయి. అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్ల్లాహ్‌: నిశ్చయంగా ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ ప్రవక్త అని నేను సాక్యమిస్తున్నాను. జ ఆరాధ్య దైవం అల్లాహ్‌ ఒక్కడే అని తెలుసుకున్న తర్వాత ఆభీష్టం ఏమిటి. ఆయనకు ఇష్టం లేనిది ఏమిటి? ఆయన్ను ఎలా ఆరాధించాలి? అన్న తదితర ప్రశ్నలకు సమాధానమే ఇది. ఈ నిమిత్తమే అల్లాహ్‌ ఒక లక్ష 24 వేల మంది దైబప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. ఆ పరంపరలో చిట్ట చివరివారు ముహమ్మద్‌ (స). ఆయన వచ్చింది మొదలు అంతిమ దినం వరకూ మానవాళి మొత్తానికి ఆయనే ఆదర్శం. ఈ రెండు సాక్య వచనాలు పలికే ఓ వ్యక్తి ఇస్లాం స్వీకరిస్తాడు. హయ్యా అలస్సలాహ్‌- నమాజు వైపునకు రండి! విశ్వాసం అంటే ఖవలుమ్‌ బిల్లిసాన్‌ అ తస్‌దీకూమ్‌ బిల్‌ జినాన్‌ వ అమలుమ్‌ బిల్‌ అర్కాన్‌. విశ్వాసం అంటే నోటి పలకడం, మనసుతో అంగీకరించడమే కాదు, దానికనుగుణంగా మన క్రియా జీవితం రూపొందాలి. అందులో మొదటి ఆచరణే నమాజు. అంటే మనం మన నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ను, ఆయన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి సున్నతు ప్రకారం ఆరాధించాలి. హయ్యా అలల్‌ ఫలాహ్‌: సాఫల్యాం వైపునకు రండి! సాఫల్యం- ఆస్తుల్ని కూడబెట్టడంలోనూ, మరే ఇతర ప్రాపమచిక విషయాలలోనూ లేదు. అది కేవలం అల్లాహ్‌ దాస్యంలోనే ఉంది. వీటితోపాటు ఫజ్ర్‌ అజాన్‌లో హయ్యా అలల్‌ ఫలాహ్‌ తర్వాత అస్సలాతు ఖైరుమిమ్మనన్‌ నౌమ్ – నిద్రకన్నా నమాజు గొప్పది. మేల్కొని ఉన్న స్థితిలో అంటారా, పనికన్నా గొప్పది, పరివారానికన్నా గొప్పది. మనకు సంబంధించిన ప్రతి దానికన్నా గొప్పది. అ తర్వాత తౌహీద్‌ పలుకులతో ప్రారంభమయిన అజాన్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అన్న తౌహీద్‌ పలుకులతోనే సమాప్తం అవుతుంది. ముఅజ్జిన్ వల్ల జరిగే పద ఉచ్చారణా పొరపాట్ల ఆదేశం వాక్యం వాక్యంలో తప్పు తప్పు వర్ణణన తప్పు ఆదేశం వ్యాఖ్యలు అల్లాహు అక్బర్ ఆల్లాహు అక్బర్ అలీఫ్ ను సాగదీయడం అర్థం ఏమిటి అల్లాహ్ గొప్పవాడా? జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు వ అల్లాహు అక్బర్ ప్రారంభంలో వావ్ ను అదనంగా పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లా అక్బర్ హ ను స్పష్టంగా పలకకపోవడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహూ అక్బర్ హ ను సాగదీసి పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహ్ వక్బర్ అల్లాహ్ తర్వాత వక్బర్ అనడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహ్ వ అక్బర్ అల్లాహ్ మరియు అక్బర్ కి మధ్య వ ను పలకడం అల్లాహ్ మరియు అక్బర్ అని అర్థం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహు - ఆక్బర్ అక్బర్ లో అ ను సాగదీయడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహ్ ---- అక్బర్ రెండు పదాలను విడదీసి పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహు అగ్బర్ క కి బదులు గ పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహు అఖ్బర్ క కి బదులు ఖ పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహు అష్బర్ క కి బదులు ష పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహు అక్బార్ అక్బార్ షైతాన్ నామాల్లో ఓ నామం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహు అకబ్బర్ బ ను నొక్కి పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు అల్లాహు అక్బల్ ర కి బదులు ల పలకడం జలీ - స్పష్టమైన తప్పు అజాన్ అవ్వదు ...

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు