Monday, December 2, 2024

అసూయ, అపాయం - ఉపాయం

అసూయ, అపాయం - ఉపాయం అల్లాహ్ తన దయతో వారికి ప్రసాదించిన అనుగ్రహానికిగాను అసూయ పడుతున్నారా? (అన్-నిసా: 54) అసూయ అంటే, ఒకరి దక్కిన వరానుగ్రహాన్ని చూసి ఓర్వలేనితనంతో - అది వారికి దక్కకుండా నశించాలి అని కోరుకోవడం. అన్నారు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహ్మ). అసూయ లేక ఈర్య పెద్ద పాపాల కోవకు చెందినది. ఈర్ష్య మూలంగానే షైతాన్ తొలిసారిగా అల్లాహ్ ను ధిక్కరించాడు. ఖాబిల్ తన సోదరుడైన హాబిల్ ని అసూయతోనే హత్య చేశాడు. దైవప్రవక్త హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఆయన యెడల చేసిన చెడు వ్యవహారానికి అసలు కారణం ఈ అసూయే. యూద పండితులు, అబ్దుల్లాహ్ బిన్ ఉబై వంటి కపటులు మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల చేసిన కపట చేష్టలన్నింటికీ మూలం ఈర్ష్యే. ఇది విశ్వాసానికి విరుద్ధాంశం. అందుకే దీనికి దూరంగా ఉండమని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా గట్టిగా తాకీదు చేశారు. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు: “అసూయకు దూరంగా ఉండండి ఎందుకంటే అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే అసూయ సత్కార్యాలను హరించి వేస్తుంది.” (అబూదావూద్)
అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే. ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు-, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి. ఇది నిత్య సత్యం. త్రిగుణ సంగమం మానవ దేహం మనిషి శరీరాన్ని ఆవరించి త్రిగుణాల ఉంటాయి. సత్త్వ, రజో, తమో గుణాలు అయినా ఈ త్రిగుణాల ప్రభావం వల్ల మనిషి స్వభావం మారుతూ ఉంటుంది. కర్మణస్సుకృతస్యాహు స్వాత్త్వికం నిర్మలం ఫలమ్ రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః ఫలమ్ సత్వగుణముతో ఉన్న వారు చేసే సాత్వికమైన కర్మలకు నిర్మలమైన ఫలము లభిస్తుంది. రజోగుణముతో ఉన్న వారు చేసే రాజసమైన కర్మలకు దుఃఖము కలుగుతుంది. తమోగుణముతో కూడిన తామస కర్మలు చేసే వారికి అజ్ఞానము, అవివేకము ఎక్కువవుతుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ సుఖ పడాలనే కోరిక ఉంటుంది. సుఖపడటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎవరూ దుఃఖపడాలని కోరుకోరు. కాబట్టి ఏ యే పనులు చేస్తే సుఖం కలుగుతుందో ఆయాపనులనే చేయాలి. దుఃఖం కలిగించే పనులు చేయకూడదు. కేవలం సాత్విక కర్మల చేతనే సుఖం కలుగుతుంది. రజోగుణము, తమోగుణము, ఉన్న కర్మలు చేస్తే దుఃఖము, అజ్ఞానము, మోహము, కలుగుతాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మలవైపు అడుగులు వేయాలి. రజోగుణము వలన దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కామము, క్రోధము రజోగుణ ప్రధానములు. కామం మనిషిని మనిషిలో ఉండే విచక్షణను మరిచిపోయేలా చేస్తుంది. కామానికి బానిస అయినవాడు ఎలాంటి వరుసలు చూడడు. సరిగ్గా ప్రస్తుతకాలంలో ఇదే చోటు చేసుకుంటోంది. ఎక్కడపడితే అక్కడ, వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. కామం వల్ల ఇలా జరిగితే రజోగుణంలో మరొక భాగం అయిన కోపం మనిషిని నిలకడగా ఉండనివ్వదు. చీటికీ మాటికి కోపం చేసుకోవడం వల్ల అపార్థాలు చోటుచేసుకుంటాయి. కోపం ఉన్నచోట ఏ బంధం ఎక్కువకాలం నిలబడదు. రగిలిపోతున్న మంట ముందు ఎవరూ ఎక్కువసేపు కూర్చోరు కదా!! కోపం ఉన్న మనిషి కూడా రగిలిపోతున్న మంట లాంటి వాడే. మంట అన్నిటినీ కాల్చి బూడిద చేసినట్టు కోపం ఎక్కువున్న మనిషి ఎదుటివారిని గాయపరుస్తూ ఉంటారు. అందుకే కామం, క్రోధం లేదా కోపం అనే రెండూ మొదట్లో సుఖాన్ని ఇచ్చినా చివరకు దుఃఖం కలిగిస్తాయి. ఇంక తమోగుణము వలన మోహం కలుగుతుంది. మొహం కలిగినవాడికి ముందు వెనుక ఆలోచనలు ఉండవు. అన్నీ సొంతమవ్వాలనే మొండితనం మూర్ఖత్వం తప్ప. ఏమి చేసి అయినా తనకు కావాల్సింది తను సాధించుకునే స్వభావం ఇందులో ఉంటుంది. అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన హాని కలుగుతుంది. కాబట్టి భక్తులు, సాధకులు ఈ రెండు గుణములను అంటే రజోగుణం, తమోగుణం వదిలిపెట్టాలి. మనిషి జీవితంలో సంభవించే భావోద్వేగాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటాడు. తనకు సంతోషకరమైన, లాభకరమైన కార్యం సిద్ధిస్తే- మనసు ఆనందంతో ఉండి ఉరకలేస్తూంటుంది. ఆ సంతోషాన్ని కుటుంబంతో, మిత్రులతో పంచుకొంటాడు. అదే వ్యక్తి కి కొంచెం ఏమాత్రం కష్టం వచ్చినా, నష్టం కలిగినా, మనసు చింతలతో, వ్యాకులపడుతూంటుంది. అప్పుడు మనం ప్రవర్తించే తీరు మరొక రకంగా ఉంటుంది. అంతర్గత శత్రువు అసూయ ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటు-ంటాడు. ఇది సహజం. కానీ,అందరికన్నా గొప్పవా డు కావాలని కొందరు ఆరాట పడతారు. అలా కావటానికి చేతనై న అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. దేని-కై-నా సిద్ధపడతా రు. కొందరు విశేషంగా ధనం సంపాదించి, తాము గొప్పవార మనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధికార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే! కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించి పోతున్నా భరించలేరు. అసూయతో కుమిలిపోతారు. అవకాశం లభిస్తే, ఏ దోవిధంగా, తమ కన్నా అధికులకు అపకారం చేస్తారు. వారికి కష్టనష్టాలు కలిగినప్పు డు, లోలోపల సంతోషపడుతూ, పైకి సానుభూతి ప్రకటిస్తారు. అల్లాహ్ ఇలా హితవు పలుకుతున్నాడు: . నీ ప్రభువు కారుణ్యాన్ని వీరు పంచుతున్నారా? (వారికా అధికారం ఉందా?) ఐహికజీవితంలో కావలసిన ఒనరుల్ని నేనే వారికి పంచిపెట్టాను. కాకపోతే పరస్పరం సేవాసహకారాలకై వారిలో కొందరికి కొందరిపై ఆధిక్యత ఇచ్చాను. అయితే నీ ప్రభువు కారుణ్యం వారి ధనికులు కూడబెడ్తున్నదాని కంటే ఎంతో విలువయినది. (అజ్-జుఖ్రుఫ్: 32) తనకున్నదానితో తృప్తి పడే వానికి ఎన్నడూ అసంతృప్తి ఉండదు. ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి, జీవ ననికి ఢోకా లేని ఆదాయం ఉన్న.వ్యక్తికి అసంతృప్తి ఉండే అవకాశం లేదు. ఏఒక్కరి జీవితం వడ్డించిన విస్తరిలా లేదు. కష్టనష్టాలు భరిం చడానికి సంతోషంగా సిద్ధం కావాలి. అప్పుడే జీవితం లో.మాధుర్యం ఆస్వాదించ గలుగుతాం ఎవరికి, ఏది, ఎంతవరకూ దక్కాలో అది ముందుగానే నిర్ణయించబడుతుంది. దాన్ని ఆనందంగా అనుభవించటమే మన విధి. ఒకరు ఎంత కష్టపడినా లభించనిది, మరొకరు తేలికగా పొందడానికి గల కారణం కూడా ఇదే.అయితే మనకింతవరకే ప్రాప్తం అని సరిపెట్టుకోవడమే అన్నివిధాలా మంచిది. ఈర్ష్యా,అసూయ ,ద్వేషం మొదలైనవాటిని ప్రదర్శించకూడదు. అలా చేయడం వలన ఆశించినది దక్కకపోగా మనశ్శాంతి కూడా కరువవుతుంది. ఈర్ష్యా, అసూయ,ద్వేషాలను పెంచుకుంటే అవి అవతలవారికంటే ఎక్కువగా మనకే నష్టాన్ని కలుగచేస్తాయి. ఆశించినది ఎంతైనా, అందులో దక్కింది కొంతే అయినా సంతృప్తిచెందాలి. ఈర్ష్యా, అసూయలను పెంచుకోవటమంటే మన సంతోషాన్ని మనమే చంపుకోవటం! మనకు లభించినదానికి సంతోషించాలి ఎదటి వారి లభించినది చూసి ఎన్నడూ అసూయ పడకూడదు. ఎంతటి భయంకరమైన వ్యాధులకు మందులు ఉన్నాయి. కాని, అసూయ అనే వ్యాధి సోకిన వారికి మందులు లేవు . అసూయపరులు తమ జీవితాంతం అసంతృప్తితోనే ఉంటారు. ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ సుఖః,సంతోషాలు ఉండవు. విషం కన్నా ప్రమాదమైనది అసూయ. విషం తీసుకున్న మనిషి కొంతసేపు వేదనతో మరణిస్తాడు కాని అసూయకు లోనైనవారు అనుక్షణం జీవితాంతం మరణిస్తూనే ఉంటారు. అసూయకు లోనైన వారు ప్రశాంత జీవితం గడుపలేరు. ఎప్పుడూ కోపంతో ఉంటారు. అసూయ - అనసూయ అన్ని దుర్గుణాలకు మూలం అసూయ. అసూయ అంటే తోటి వ్యక్తి ఆనందంగా, సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేకపోవడమే. ఈ అసూయే ప్రవక్త యూసుఫ్ (అ)కి మరియు తన తండ్రి గారయిన ప్రవక్త యాకూబ్ (అ)కి ఎడబాటుకి మూలకారణమైంది. ఆ తర్వాత అలజడులు, కక్షలు, కార్పణ్యాలు, కాఠిన్యాలు, కలహాలు జరగడానికి అసూయే కారణం అయింది. అసూయ అనే దుర్గుణం అత్యంత ప్రమాదకరమైంది. మర్రి చెట్టు కూడా క్షణాల్లో మాడిపోయేటట్లు చేయగల శక్తి మెరుపు కణానికి ఉన్నట్లే, మహా మహా వృక్షాలు సయితం రోజుల్లోనే ఎండిపోయేటట్లు చేయగల శక్తి వేరుపురుగుకు ఉన్నట్లే, . అసూయ అనే జ్వాలాగ్ని ఒక మనిషిలో ప్రవేశిస్తే, అది ఆ మనిషిని దహించి, సర్వనాశనం చేస్తుంది. . అందుకే అందరూ అసూయ విషయంలో జాగ్రత్త వహించాలి. మనం అసూయ సంతతి కాకూడదు, అనసూయ సంతతి అవ్వాలి. ఇలా ఉంటది అసూయపరులతోటి మరి. ఒక ఊరిలో అందరినీ చూసి అసూయపడే కాకి ఉండేది. ఏ పక్షి దగ్గర ఆహారం చూసినా.. ఏ జంతువు ప్రశాంతంగా నిద్రపోతున్నా దానికి నచ్చేది కాదు. అబ్బా...! పక్కింటామెకు ఎన్ని నగలున్నాయో, ఇంటి నిండా ఎంత ఫర్నీచరుందో మాకే ఏమీలేదు... ఆ రమ్య చూడు ఎంత అందంగా ఉందో... నేనూ ఉన్నాను ఎందుకు...! ఇలాంటి వాటినే అసూయ అంటారు. అవతలివారి వద్ద ఉన్న గుణం లేదా వాస్తవం తమలో లేదన్న భావన వల్ల అసూయ మనసులో జనిస్తుంది. ఈ కారణంగానే అవతలి వారిని చూసి అసూయపడటం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి ఒక ముసలమ్మను "అమ్మా, మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదా. అన్నీ దోచుకెళ్ళారు కదా. అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు కారణమేంటి?" అని అడిగాడట. . దానికా ముసలమ్మ "మా ఇంట్లో వస్తువులకంటే మా పక్కింట్లో వారి వస్తువులు ఎక్కువ మొత్తంలో దొంగలించబడ్డాయి.. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని బదులిచ్చిందట. చిటికెడు విషం ఎలాగైతే కడివెడు పాలను విహాసతుల్యం చేస్తాయో, అలాగే అసూయ అనేది మనిషిలోకి ప్రవేశిస్తే సకల సద్గుణాలను సంహరించేస్తుంది. అందుకే అసూయ, ద్వేషం, క్రోధం అనే దుర్గుణాలకు దూరంగా ఉండాలి. వాటిని అంటరానివిగా, తాకరానివిగా, ముట్టరానివిగా భావించి బహిష్కరించాలి. అప్పుడే ప్రతి మనిషి పురోగమించగలడు. అసూయ ఆదేశం మానవుల మధ్య శత్రుత్వం పెంపొందించే పగ, వైరం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం మొదలైన చెడు(దుష్ట)గుణాలు ఇస్లాంలో అనుమతింపబడలేదు. అనస్ ఇబ్నె మాలికిన్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా హితోపదేశం చేశారు “1. మీరు ద్వేషించుకోవద్దు. 2. మీరు అసూయ (ఈర్ష్య) పడవద్దు. 3. మీరు ఒకరికొకరు వీపు చూపుకోవద్దు (దూరం కావద్దు) మరియు అల్లాహ్ దాసులై సహోదరులుగా ఉండండి. తోటి సోదరులతో మూడు రోజులకంటే ఎక్కువగా (అయిష్టంతో) మాట్లాడకుండా ఉండడం ముస్లింలకు అనుమతింపబడలేదు” (బుఖారి మరియు) ఈ హదీథ్ ద్వారా ముస్లింలు తమలో తాము ఏవిధంగా సోదరభావంతో ప్రేమ, సామరస్యం (పొందిక), సానుభూతి(ఇతరుల దు:ఖంలో పాలుపంచుకోవడం) వంటి మంచి గుణాలు కలిగి ఉండాలో ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లమ్) మనకు బోధించారు. ఇంకా ఉన్నతమైన లక్షణాలకు పునాది అయినటువంటి మర్యాదపూర్వకమైన ప్రవర్తన ఎలా మనలను చెడు నడవడికకు దూరంగా ఉంచుతుందో, మన హృదయాలను ద్వేషం మరియు దురుద్దేశం నుంచి విముక్తి కలిగిస్తుందో తెలుపబడినది. నిష్కపటమైన మరియు పారదర్శకతతో కూడిన పరస్పర సోదరభావం అత్యున్నతమైన ఇస్లామీయ జీవన విధానానికి దారి చూపుతుంది. అసూయ తెచ్చిన అనర్థం చింతా జ్వరం జ్వరం కంటే విలక్షణమైంది. జ్వరమైతే శరీరానికి సంబంధించింది. కాని చింతా జ్వరం మనస్సునకు సంబంధించింది. మొదటిది వ్యాధి ఇది ఆది. వ్యాధికి మందులుంటాయి. కాని ఆధికి మందులు లేవు. మనోవ్యాధికి మందు లేదని లోకంలో అంటారు. చింతా జ్వరం లంకణాలవల్ల నయమయ్యేది కాదు. చింతా జ్వరం బుద్ధిని నిద్రను ఉత్సాహాన్ని ఆకలిని ఆకారాన్ని తేజస్సును బలాన్ని క్రమక్రమంగా క్షీణింపజేస్తంది. అహంకారం – స్వార్థం, అసూయ, ద్వేషం మొదలైన దుర్గుణాలని బయట పెడుతూ ఉంటుంది. అగ్నిలో ఆజ్యం పోస్తే ప్రజ్వరిల్లినట్లు అహంకారం వల్ల మనిషిలోని దుర్గుణాలు అడ్డులేకుండా వెల్లడవుతుంటాయి. ఈర్ష్య, అసూయ, క్రోధం వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో వాటివల్ల ఎంతటి విఘాతాలు జరుగుతాయో విధితవౌతుంది. కావున ఈర్ష్య అసూయలకు దూరంగా ఉండాలని అందువలన, కలిగే ప్రయోజనాలు ఎంతో ఉపకరంగా ఉంటాయని తెయవస్తుంది. బలవంతంగా అవతల వారి నుంచి ఏదీ లాక్కోలేమనే విషయాన్ని గ్రహించాలి. ఈ గ్రహింపు మనిషికి చాలా అవసరం. ప్రపంచంలో ఎవరూ ఎవరి ఆధీనంలోనూ ఉండరని గ్రహించాలి. భార్యభర్తలైనా సరే ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందని ముందుగా గుర్తించాలి. ప్రేమించే వాళ్లనుంచి ఇంకా రెట్టింపు ప్రేమను గౌరవాన్ని పొందగలగాలంటే మనం ఈర్ష్యను జయించాలి. మూర్ఖానాం పండిత వేథ్యా ఆధానం మహాధనమ్ వరంగల్నాః కులస్త్రీణాం సుభగానాం చ దుర్భగః మూర్ఖుడు.. పండితుడిని, పేదవాడు ధనవంతుడు, వేశ్య గృహిణి, వితంతువు భర్తతో నివసించే భార్యను చూసి అసూయపడతాడు అని పద్యం యొక్క అర్థం. పూర్వీకుల మాటల్లో అసూయ ఇబ్ను సీరీన్ (రహ్మ) ఇలా అన్నారు: ప్రాపంచిక విషయాలలో నేను ఎప్పుడూ ఎవరితోనూ అసూయ పడలేదు. ఒకవేళ అతను స్వర్గవాసి అయితే, అశాశ్వత తటాకం కోసం అసూయ చూడటంలో అర్థం లేదు. ఎందుకంటే స్వర్గం శాశ్వత నివాసం. స్వర్గం ముందు ప్రపంచపు భోగభాగ్యాలన్నీ దిగదుడుపే. ఒకవేళ అతను నరకవాసి అయితే, అతనికి దక్కిన ఐహిక సుఖసౌఖ్యాలను చూసి నేను అసూయ చెందడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అతను నరక బాటన్ నడుస్తున్నాడు, నరకమే అతని నివాసమౌతుంది. అబుల్ లైస్ సమర్ఖందీ (రహ్మ) ఇలా అన్నారు: అసూయకు మించిన చెడు అలక్షణం మరొకటి లేదు. ఎందుకంటే, అసూయ పేరుని అసూయాగ్ని జ్వాలలు ఎదుటి వ్యక్తికి తాకక ముందే, అసూయపరుడు స్వతహాగా అయిదు యాతనల్ని అనుభవిస్తాడు. 1) అంతం కానీ ఆవేదన అతన్ని దహించి వేస్తుంది. 2) అతను పడే యాతనకు ఎలాంటి పునీఫలం దక్కదు. 3) అతనిలోని ఈ అవలక్షణం మూలంగా జనం అతన్ని అసహ్యించుకుంటారు. 4) అల్లాహ్ కోపం అతని మీద విరుచుకుపడుతుంది. 5) అసూయ పరునికి సత్కార్యాలు చేసే సత్బుద్ధి కలగదు. రక్త సంబంధీకుల్లో అసూయ తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ప్రేమిస్తారు. కాని కొందరి పట్ల ఎక్కువ ఇష్టం చూపుతారు. అందుక్కారణం ఆ పిల్లల మంచి గుణగణాలు. అయితే ఈ ప్రేమాభిమానాలు వ్యక్తం చేయడంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. సంతానంలో కొందరి పట్ల ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శిస్తే మిగిలిన వారిలో అసహనం, అసూయలు జనించడానికి అవకాశం ఉంది. మన జీవితం అసూయ భరితం, కాదు, అనసూయ భరితమవ్వాలి - అసూయ లేని ఆనంద జీవితం. ఆ నిమిత్తం పనికొచ్చే ఖుర్ఆన్ సత్య గాథ దివ్యఖుర్ఆన్లో ఈ కథ చాలా వివరంగా, చాలా ఆసక్తిదాయకంగా చెప్పడం జరిగింది. ఇందులో హాస్యం, మానవ బలహీనతలు, ఉన్నత గుణగణాలు, ఈర్ష్యాసూయలు, విద్వేషం, అహం, వాంఛలు, మోసం, కుట్ర, క్రూరత్వం, భీభత్సం, సహనం, విశ్వాసం, ధైర్యం, సద్వర్తనం, సానుభూతి వంటి అనేక గుణగణాలు మన ముందుకు వస్తాయి. యూసుఫ్ (అలైహిస్సలాం) పద్ధెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన, అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరుపడ్డారు. ఆయన గౌరవంగా వ్యవహరించే వారు. దయ సానుభూతులతోప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బినామిన్ కూడా అలాంటి గుణగణాలు కలిగినవాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాకెల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాఖూబ్ (అలైహిస్సలాం) ఎక్కువ ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరిని తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చే వారు కాదు. వారిని పరిరక్షించడానికిగాను ఇంటి తోటలోనే వారిని పనిచేసేలా నిర్దేశించారు. సోదరుల కుట్ర (అలైహిస్సలాం) అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు గ్రక్కడం ప్రారంభించింది. విద్వేషంగా మారింది. ఒక సోదరుడు మిగిలిన వారితో, “నాన్నగారు మనందరికన్నా యూసుఫ్, బిన్ యామిన్ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు.నిజానికి వారిద్దరి కన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మలకన్నా వారిద్దరి అమ్మనే ఆయన ఎక్కువ ప్రేమిస్తారు. ఇది న్యాయం కాదు” అన్నాడు. వారందరూ తమకు అన్యాయం జరిగి పోతోందని భావించారు. అసూయ వల్ల బాధలకు గురయిన వానికి దేవుని రక్షణ లభిస్తుంది. యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఆయన్ను బానిసగా అమ్ముడు పోయేలా చేయడానికి పన్నిన కుట్ర నిజానికి ఆయన్ను జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చింది. అసూయ రకాలు ఇమామ్ ఘజాలీ (రహ్మ) అసూయను నాలుగు శ్రేణులుగా విభజించారు 1) ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండానే, తనకు లభించకపోయినా పర్వా లేదు గానీ, ఎదుటి వ్యక్తికి దక్కకూడదు అని కోరుకోవడం. ఇది అత్యంత నీచమైన అసూయ. 2) ఒకరికి లభించినటువంటిదే తనకు కూడా లభిస్తే మంచిది అనుకోవడం. ఉదాహరణకు - విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన వాహనం, అందమైన ఇల్లాలు, సుగుణవంతులై పిల్లలు, సమాజంలో మంచి హోదా మొదలయినవి. ఒకవేళ దక్కకపోతే ఎదుటి వ్యక్తి కీడుని కాంక్షించకపోవడం. 3) ఒకరి మంచి స్థితి తనకు కూడా దక్కాలని రెక్కలు విరిగేలా పని చేసి చివరికి దక్కపోయే సరికి అది ఎదుటి వ్యక్తి దగ్గర కూడా ఉండకూడదు అని కోరుకోవడం. 4) ఒకరిలాగా తానూ మంచి స్థితికి చేరుకోవాలని ఆశ పడటం. ఇది ప్రాపంచిక విషయాల్లోనయితే మినహాయించబడినది. పరలోక విషయంలోనయితే మెచ్చుకోదగినది. ధార్మిక విషయాల్లో అసూయ ఎంత వరకు సబబు? హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరు, దేవుడు ఖుర్ఆన్ విద్యప్రసాదించగా దాన్ని రేయింబవళ్ళు చదవడంలో, చదివించడంలో నిమగ్నుడయి ఉండే వ్యక్తి. రెండోవాడు, దేవుడు సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు (సత్కార్యాలలో) వినియోగించే వ్యక్తి. “(ఇలాంటి వారి పట్ల అసూయ చెందడంలో తప్పులేదు). (సహీహ్ బుఖారీ) అసూయ వేరు పుణ్యకార్యాల్లో పోటీ వేరు హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం : ముహాజిర్లలో పేద ప్రజలైన కొంతమంది ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వచ్చి, “(దైవప్రవక్తా!) ధనికులు (మాకన్నా) గొప్ప స్థానాలను, శాశ్వత సుఖాలను పొందుతారు” అని అన్నారు. “అదెలాగూ?” అని అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికి వారు సమాధానమిస్తూ, “వారూ మాలాగే నమాజులు చేస్తున్నారు. ఉపవాసాలు పాటిస్తున్నారు. అయితే వారు దానధర్మాలు కూడా చేస్తున్నారు. కాని (స్తోమత లేనికారణంగా) మేము (దానధర్మాలు) చేయటం లేదు. వారు బానిసల్ని కూడా విడిపిస్తున్నారు. మేము ఆ పని చేయలేకపోతున్నాం” అని అన్నారు. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అయితే నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు పాటిస్తే, మిమ్మల్ని మించిపోయినవారి స్థాయికి మీరూ చేరుకుంటారు. మీ తరువాత వచ్చిన వారికంటే కూడా మీరు మించిపోతారు. మీ పద్ధతిని పాటించేవారు తప్ప మీకన్నా శ్రేష్ఠులు మరెవ్వరూ ఉండబోరు” అని అన్నారు. “తప్పకుండా తెలియజేయండి దైవప్రవక్తా!” అని విన్నవించుకున్నారు సహచరులు. అప్పుడాయన “ప్రతి నమాజు తరువాత “సుబ్‌హానల్లాహ్‌”, “అలిహందులిల్లాహ్”, “అల్లాహు అక్బర్‌” అని (ప్రతి ఒక్కటి) ముఫ్ఫై మూడుమార్లు చొప్పున పఠించండి” అని అన్నారు. (పేద ప్రజలు దాన్ని ఆచరించటం మొదలుపెట్టారు. కొంతకాలానికి ధనికులకు కూడా ఆ విషయం తెలిసి పోయింది. వాళ్ళు కూడా దాన్ని పాటించసాగారు). అప్పుడు ముహాజిర్‌ నిరుపేదలు మళ్ళీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి, “మేము చేస్తున్నది ధనిక సోదరులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళూ మాలాగే దాన్ని ఆచరించటం మొదలుపెట్టారు” అని ఫిర్యాదు చేసుకున్నారు. దానికాయన “అది అల్లాహ్ అనుగ్రహం. అల్లాహ్ తాను కోరినవారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు” అని అన్నారు. (బుఖారీ – ముస్లిం) స్పర్ధయా వర్ధతే విద్య… చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేష పూరితంగా ఉండకూడదు. పోటీ- తత్వంతో, పట్టుదలగా విద్య నేర్వా లి. వాయిదాలు వేయకుండా విద్యాకృషి చెయ్యాలి. కృషితో నాస్తి దుర్భిక్షం-… నిరంతర కృషి ఒక్కటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డదారులూ ఉండవు. ప్రజాసేవ చేస్తామనేవారికన్నా, చేస్తున్నవారినే ప్రజలు నమ్ముతారు. అలాగే భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవారినే ప్రభువు సైతం ఇష్టపడతాడు. ప్రాపంచిక విషయాలలో పై చేయి సాధించాలనుకోవడం మనస్సు కు కలిగే ఆందోళన ఆధి. కాగా శరీరానికి కలిగే జబ్బు వ్యాధి. అసూయ అనే మానసిక అనారోగ్యం, దౌర్బల్యం శారీరక అనారోగ్యం కంటే ప్రమాదకరమైంది. మొదటిది వ్యాధి ఇది ఆధి. వ్యాధికి మందులుంటాయి. కాని ఆధికి మందులు లేవు. మనోవ్యాధికి మందు లేదు, స్వీయ పరిశీలన, స్వీయ సంస్కరణ తప్ప. అసూయ అనే చింతా జ్వరం బుద్ధిని నిద్రను ఉత్సాహాన్ని ఆకలిని ఆకారాన్ని తేజస్సును బలాన్ని క్రమక్రమంగా క్షీణింపజేస్తంది. ప్రాపంచిక వ్యామోహంలో పరస్పరం పోటీపడి వీలైనంత ఎక్కువ సంపాదించా లన్న తపనే మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది. చివరికి (అదే రందిలో) మీరు సమాధికి చేరుకుంటారు. (అత్-తకాసుర్: 1,2) ఒకానొక సంద్రాభంలో దైవ ప్రవక్త (స) తాన్ సహాబను ఉద్దేశించి: అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మీరు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారన్న భయం నాకు లేదు. కాని గత సమాజాల్లో మాదిరిగా మీక్కూడా పుష్కలంగా ప్రాపంచిక సిరిసంపదలు లభిస్తే మీరూ వారిలాగే ప్రాపంచిక వ్యామోహంలో పోటీ పడతారేమోనని నాకు భయంగా ఉంది. అలా చేస్తే ఈ ప్రాపంచిక వ్యామోహం గత సమాజాలను నాశనం చేసినట్లుగా మిమ్మల్ని కూడా నాశనం చేయవచ్చు" అని వారిని హెచ్చరించారు. (బుఖారీ- ముస్లిం) హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు :- మీలో ఎవరైనా ఐశ్వర్యంలో, దేహ నిర్మాణంలో (అంటే అందంలో) తనకంటే ఆధిక్యత ప్రసాదించబడిన మనిషిని గనక చూస్తే అతను తనకంటే తక్కువ స్థాయి గలవారిపై కూడా దృష్టి సారించాలి. (సహీహ్ బుఖారీ) దిష్టి మరియు అసూయ ఇమామ్ ఇబ్ను ఖయ్యిమ్ (రహ్మ) ఇలా అసూయపరుడు మరియు దిష్టి పెట్టేవాడు ఒక విషయం ఏకీభవిస్తారు, ఒక విషయంలో విభేదిస్తారు. 1) సూయపరుడు చూసి, చూడకుండా రెండు స్థితుల్లోనూ కుళ్ళకుంటాడు. దిష్టి పెట్టేవాడు చూసి దిష్టి పెడ్తాడు. 2) అసూయ అనేది మానవుల వరకే అపరిమితం అవుతుంది. కానీ, దిష్టి మనుషులకు, జంతువులకు, వ్యాపారానికి, వస్తువులకు కూడా తగులుతుంది. ఆ రకంగా అసూయతో దిష్టి పెట్టేవాడు అత్యంత ప్రమాదకరం. గ్రంథప్రజల్లో చాలామంది మిమ్మల్ని ఎలాగైనా విశ్వాసం నుండి తప్పించి అవిశ్వాసం వైపు లాగాలని చూస్తున్నారు. సత్యం వారిముందు స్పష్టంగా వెల్లడైనప్పటికీ వారు అసూయతో మండిపోతూ మిమ్మల్ని అవిశ్వాసులుగా మార్చదలిచారు. కాబట్టి అల్లాహ్ వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకునేవరకు వారిని క్షమించి, చూసీ చూడనట్లు వదిలేయండి. దేవుడు ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (బఖరః : 108-109) చెప్పు: “నేను అరుణోదయానికి ప్రభువయిన దేవుని శరణుగోరుతున్నాను. ఆయన సృష్టించిన ప్రతిదాని కీడునుండి, ముసురుకొచ్చే రాత్రిచీకటి కీడునుండి, (మంత్ర) ముడులపై ఊదేవారి కీడునుండి, అసూయపడుతున్న అసూయాపరుడి కీడునుండి నేను ఆయన శరణు గోరుతున్నాను.” (ఫలఖ్‌: 1-5) అసూయ అపాయాలు 1) అసూయ అనే ఆధి మానసియాక వ్యధకు, మనోవేదనకు గురిచేస్తుంది. దాని మూలంగా శరీరం కూడా ఇబ్బందులు పడుతుంది. అసూయ నయం కానీ రోగం, దూరంకానీ దుఃఖం. అదొక మానసిక వ్యాధి అన్నారు ఇబ్న్ అల్-ముతజ్ (రహ్మ) 2) అసూయపరుని పరువుప్రతిష్ఠలు మంట గలుస్థాయి. క్రమేపి అతని ప్రభ క్షీణించి పోతుంది. ప్రజలు అతని నుండి దూరంగా పారిపోతారు. అసూయ పరుడు ఎన్నటికీ నాయకుడు కాలేడు అని మంసూర్ అల్-హికామ్‌లో చెప్పబడింది. 3) ప్రజలు అతని పట్ల ప్రేమ భావన బదులు ద్వేష భావన కలిగి ఉంటారు. వారిలో అతని యెడల స్నేహ భావం కాకుండా వైరా భావం ఉంటుంది. అతన్ని వారు షర్టువుగానే భావిస్తారు. ఫలితంగా అతను హృదయ గదుల నుండే కాకుండా భౌతిక గృహాల నుండి కూడా వెళ్లగొట్టబడతాడు. 4) అసూయ అనే అవలక్షణం వల్ల అల్లాహ్ పంపకాన్నే ప్రశ్నించి ఆయన ఆగ్రహానికి గురవుతాడు. ఏక సమయంలో అటు ప్రభువుకి ఇటు ప్రజలకి డ్డూరం అవుతాడు. 5) అసూయ పరోక్ష నిందకు, చాడీలు దారితీస్తుంది. 6) అసూయ అన్యాయానికి మరియు దురాక్రమణకు దారితీస్తుంది. 7) అసూయ దొంగతనం మరియు హత్యకు దారితీస్తుంది. ఇంటా బయటా హాని..! 1) అసూయ అన్నది ఒక బలహీనత, ఒక వక్రగుణం. చిన్న బుద్ధిగల వారే అసూయతో కృంగిపోతారు. పరిస్థితులు ఎటువంటివైనా మనం అసూయను సమర్ధించకూడదు. ఇది ముమ్మాటికి మనకు ఇంటాబయటా హానిని కలిగిస్తుంది. దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: మీకు పూర్వం జాతులలో ప్రబలి ఉండే ఒక రుగ్మత మీలో కూడా చోటు చేసుకుంది. అదే అసూయ, ద్వేషం. ఇది మనిషి వెంట్రుకలను కాదు గానీ, అతని ధర్మాన్ని పూర్తిగా క్షవరం చేసేస్తుంది. (తిర్మిజీ) 2) విశ్వాసం భస్మం అవుతుంది. దైవప్రవక్త (స) ఇలా అన్నారు: [ధర్మ మార్గంలోని దుమ్ము మరియు నరకాగ్ని ఏక సమయంలో ఒక దేహంలో ఇమడజాలవు. అలాగే విశ్వాసం మరియు అసూయ ఏక సమయంలో ఓ మనసులో ఇమడజాలవు. (ఇబ్ను హిబ్బాన్) 3) సమాజంలో మంచి అంతరించి, రాగద్వేషాలు రాజుకుంటాయి. దైవప్రవక్త (స) ఇలా అన్నారు: అసూయ పడనంత కాలం ప్రజలు మంచి స్థితిలోనే ఉంటారు. (సహీహ్ అత్తర్గీబ్) 4) అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు: “అసూయకు దూరంగా ఉండండి ఎందుకంటే అగ్ని కట్టెలను భస్మీపటలం చేసినట్లే అసూయ సత్కార్యాలను హరించి వేస్తుంది.” (అబూదావూద్) 5) ప్రజాగ్రహం మరియు ఏవగింపు: ప్రజల్లో అత్యంత చెడ్డ వారు - ఎవరైతే ప్రజల్ని ద్వేషిస్తారో, ఎవర్నయితే ప్రజలు కూడా ద్వేషిస్టారో వారు అన్నారు ప్రవక్త (స). (జయీఫ్ అత్తర్గీబ్) అసూయా ద్వేషాలకు ఉపాయం ‘అవ్యాజ ప్రేమ’.. ఆప్యాయత అమృతాన్ని పంచితే అసూయ విషాన్ని చిమ్ముతుంది అసూయ ఆప్యాయతకు చేరువవుట బహు కష్టం కాని ఆప్యాయత తప్పక అసూయని చవి చూస్తుంది. అప్పుడప్పుడు అన్పిస్తూ ఉంటుంది - మనవారు అనుకున్న మన మనుష్యుల మధ్య దగా పడడం..నమ్మించి మన చుట్టు వల వేసి మోసగించడం వారికే చెల్లింది..బహుశా తిన్నింటి వాసాలు లెక్క పెట్టటం అంటే ఇదే నేమో..మన పక్కనే ఉంటూ మన పతనం కోరుకునే అసూయ వ్యక్తులు వీరేనేమో...? సద్గుణశీలుడికి సత్కారాలు ఉండకపోవచ్చు. దుర్గుణ పీడితుడికి లభించే దూషణ తిరస్కార దండనలు అతడికి ఉండవు. మనిషి తన బాటలో ఇబ్బంది కలిగించే రాళ్లు, ముళ్లు తొలగించి మార్గం సుగమం చేసుకొని ముందుకు సాగుతాడు. దుర్గుణాలనే గాజుపెంకుల్నీ జీవనయానమనే బాట నుంచి తొలగించుకోవాలి. ఆ పని ఎవరికి వారే చేసుకోవాలి. వేరెవరో చేయరు. దేహంలోని ముళ్లు తీయవచ్చుగానీ మనసులోని ముళ్లు ఎవరు తీయగలరు? ఎవరికి వారే తొలగించుకోవాలి. అందరికీ ఆ నేర్పు ఉండదు. కారణం- చాలామంది తాము ఎలాంటి తప్పులూ చేయడం లేదనే భ్రమలోనే జీవిస్తుంటారు. తమ మనసులో దుర్గుణాలనే ముళ్లు ఉన్నాయన్న సంగతి సైతం తెలియనంతగా, వారి అజ్ఞానం ఉంటుంది. ఇక వాటిని తొలగించుకోవాలని ఎవరైనా ఎలా అనుకుంటారు? ఎవరి మీదైనా మనకు ఈర్ష్య ఇప్పటికే ఏర్పడిపోయిందేమో. మనలోకి మనమే తరచి చూసుకోవాలి. అలాంటిది ఉంటే శషభిషలు లేకుండా ఈర్ష్యకు లోనయ్యామనే విషయాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే దీని నుండి త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఈర్ష్య మనసులో ఏర్పడినప్పుడు మానసిక ప్రవర్తన విపరీత పోకడలు పోతూ ఉంటుంది. తమలోతామే కుమిలిపోతుంటారు. నిస్సహాయంగా ఉం టారు. కొంతమంది తమకు కలిగిన చిన్న అసౌకర్యానికి కూడా నెపం అవతలి వాళ్లపై నెట్టేస్తుంటారు. అధిక శాతం మానవుల్లో అసూయ, ద్వేషం అనే రెండు ముళ్లు అశాంతిని కలిగిస్తుంటాయి. ఎదుటివారు స్వశక్తి, కృషి, అంకితభావంతో అభివృద్ధి సాధిస్తుంటే చూడలేరు. అసూయతో రగిలిపోతుంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి గురించి ద్వేషంతో విషం కక్కుతుంటారు. పాముకు కోరల్లోనే ఉండే విషం వీరికి అణువణువునా నిండి విషవృక్షంలా కనిపిస్తారు. ‘ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ’ అన్నాడు శతక కవి. ఈ కారణం వల్లనే ఆధునిక ప్రపంచం ప్రేమలేని ఎడారిలా మారింది. విషానికి విరుగుడుగా సంజీవని ఉన్నట్లే, అసూయా ద్వేషాలకు విరుగుడుగా ‘అవ్యాజ ప్రేమ’ను చెప్పుకోవాలి. మనసుకు ప్రేమను నేర్పాలి. అది పెరిగే కొద్దీ అసూయ, ద్వేషం మంచులా కరిగిపోతాయి. అప్పుడు జీవనయానం పూలబాటలోనే సాగుతుంది! ఆ రోజు సిరి సంపదలుగానీ, సంతానంగానీ దేనికీ పనికి రాదు. స్వచ్ఛమయిన హృదయంతో అల్లాహ్‌ సన్నధిలోకి వచ్చినవాడు మాత్రమే (ఆనాడు మోక్షం పొందుతాడు)”. (షుఅరా: 88,89) మనలోని భావోద్వేగాల, అనుభూతుల, కోరికల, ఆలోచనల కేంద్రం హృదయం. ఏదయినా వస్తువు, ప్రాణి మీద ప్రేమ, ధ్వేషం, అయిష్టం కలిగించే అంతరంగిక ప్రేరణం హృదయం. మనిషి భావాలు, అభిప్రాయాలు, ఆచరణలు అన్నింటికి మూలం హృదయం. అందుకే ”మనిషి నడవడి, ప్రవర్తన అతని మానసిక స్థితికి అద్దం పడుతుంది” అన్నారు పెద్దలు. ఇదే హృదయం గురించి తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”దేహంలో ఒక ముద్ద ఉంది. అది గనక బాగుంటే దేహమంతా బాగుం టుంది. అది గనక పాడయితే శరీరం మొత్తం పాడవుతుంది. గుర్తుంచు కోండి! అదే హృదయం!” (బుఖారీ) ఈ కారణంగానే అల్లాహ్‌ హృదయాన్ని స్వచ్ఛగా ఉంచుకోవాలని ఆదేశిం చాడు: ”నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో”. (అల్‌ ముద్దస్సిర్‌: 4) ఈ వచనంలో దుస్తులు అంటే హృదయం అన్నది పండితుల మాట. ‘నరోత్తములు ఎవరు?’ అని ప్రశ్నించగా- ”హృదయ స్వచ్చత, మాట సత్యత గల ప్రతి వ్యక్తి” అని ప్రవక్త (స)సమాధానమిచ్చారు. ‘మాట సత్యత అంటే మాకు తెలుసు. మరి హృదయ స్వచ్ఛత (మఖ్మూముల్‌ ఖల్బ్‌)అంటే ఏమి?’ అని సహాబహ్‌ వివరణ కోరగా, ”తఖ్వా పరుడు, పరిశుద్ధుడు, ఎలాంటి పాప భావం లేనివాడు, ఎలాంటి అతిక్రమణకు పాల్పడని వాడు, మోసం చెయ్యని వాడు, అసూయ చెందనివాడు” అని అన్నారు ప్రవక్త (స) (ఇబ్ను మాజహ్‌) వారిలా ప్రార్థిస్తారు: “ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందర్నీ క్షమించు. (యావత్తు)విశ్వాసుల పట్ల మాహృదయాల్లో ఎలాంటి అసూయాద్వేషాలు ఉంచకు. ప్రభూ! నీవు గొప్ప క్షమాశీలివి, అపార దయామయుడవు.” (హష్ర్: 10)

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు