Saturday, March 19, 2022

హింసను మానుకోవాలి అహింసకు పూనుకోవాలి /Violence must be avoided and non-v...



మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు, ముంది మీ నుండి మొదలవ్వాలి.
నేటి నీ చేతలు రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి
మీరు చేసే పనికి ఫలితమేమిటో మీకు ముందుగా తెలియకపోవచ్చు, కానీ మీరు ఏమీ చేయకపోతే, ఫలితాలు ఎప్పటికీ చూడలేరు.
మీరు మానవత్వంపై విశ్వాసం కోల్పోకూడదు. మానవత్వం ఒక మహాసముద్రం; సముద్రం లోని కొన్ని చుక్కలు కలుషితమైనంత మాత్రాన, సముద్రం కలుషితమైపోదు.
మీ మాటలు ఎల్లప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే మీ మాటలు మీ చేతల్లో ప్రతిబింబిస్తాయి.
నా అనుమతి లేకుండా ఎవరూ నన్ను బాధించలేరు.
మనిషి ఆశలు తీరడానికి భూవిపై దారి ఉందేమో కానీ, దురాశకు తీరడానికి దారి లేదు/ఉండదు…
శారీరక సామర్థ్యం నుండి బలం రాదు. అది లొంగని సంకల్పం నుండి వస్తుంది.
నిన్న. రేపు . జీవితంలో మన చేతిలో లేనివి, మనం మార్చలేని రెండు రోజులు.
మీ ఆలోచనలు ఎల్లప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచనలు మీ మాటల్లో ప్రతిబింబిస్తాయి.
మీరు ధైర్యంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ భయ పెట్టలేరు
బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమ అనేది బలవంతుల లక్షణం.
ప్రేమ, అధికార వాంఛను అధిగమించిన రోజున, ప్రపంచానికి శాంతి తెలుస్తుంది.
మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది.
మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు, తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు, తరువాత వారు మీతో పోరాడుతారు, చివరిగా మీరు గెలుస్తారు.
మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం, ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం
అపజయాలు తప్పులు కావు, అవి విజాయానికి పాఠాలు.
కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి.
విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు.
నీ విజయానికి అడ్డుపడేది, నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో  ఎప్పటికీ విజయం సాధించలేవు.
కిందపడ్డా ప్రయత్నం కొనసాగిస్తే విజయం నీ సొంతమౌతుంది.
అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది, సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది, ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది, జ్ఞానం మిమ్మల్ని గొప్పగా చేస్తుంది.
మీ లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి, మీ లక్ష్యం పట్ల మీకు ఒకే మనస్సు గల భక్తి ఉండాలి.
విజయవంతమైన కథలు చదవడం వలన, మీకు సందేశం మాత్రమే వస్తుంది. ఒకసారి వైఫల్యమైన కథలను చదివి చూడండి, విజయం సాధించడానికి మీకు గొప్ప స్ఫూర్తి లభిస్తుంది.
జీవితంలో ఎన్ని హెచ్చు తగ్గులు వచ్చినా, మీ ఆలోచనలే మీ మూలధనంగా ముందుకు సాగాలి.


విద్యావేత్తలు, విద్యార్థులలో విచారణ, సృజనాత్మకత, వ్యవస్థాపక మరియు నైతిక నాయకత్వ స్ఫూర్తిని పెంపొందేలా ప్రోత్సహించి వారికి ఆదర్శంగా నిలవాలి.

మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి.  ఎందుకంటే,  మీరు రెండవ సారి విఫలమైతే, మీ మొదటి విజయం కేవలం అదృష్టం అని హేళన చేయడానికి ఎన్నో పెదవులు వేచి చూస్తుంటాయి.

మీ కల నిజం కావాలంటే ముందు మీరు ఉన్నతమైన కలగనాలి. దానికై శ్రమించాలి.

మీరు నిద్రలో చూసేది కాదు కల అంటే. మిమ్మల్ని నిద్రపోకుండా చేసేది కల.

జీవితంలో గొప్ప విజయాలు పొందాలంటే ఇబ్బందులు పడక తప్పదు.

గొప్ప గొప్ప మేధావులును చూడాలంటే, ఒకసారి తరగతి గదిలోని చివరి వరసలో వెతికి చూడు…

మీరు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే, ముందు అంతటి వేడిని మీలో నింపుకోవాలి.

కింద పాకుతూ ఎంతకాలం బ్రతుకుతారు. మీకున్న రెక్కలతో పైకి లేచే ప్రయత్నం చేయండి.

ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది.

మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ గురువులు. అవి నేర్పే పాఠాలే మీరు నేర్చుకోవలసిన జీవిత పాఠాలు.

ఒకరిని ఓడించడం చాలా సులభం, కానీ ఒకరి మనసు గెలవడం చాలా కష్టం.

కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతావు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అబద్ధాలను మాట్లాడితే పేరును కోల్పోతావు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు.
మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతీ ఆలోచనను తిరస్కరించండి.
మనిషి ఉన్నతుడా కదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి.

వినయం లేని విద్యా, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలిలేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధం.
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం జీవితాన్నే నాశనం చేస్తుంది. 

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు