Monday, March 14, 2022

చేసిన నిర్వాకం చాలు

- శాంతి ప్రియ



సభ్యత గొంతు నొక్కేసి 
సంస్కార ఊపిరి ఆపేసి 
మానం ఉరి తీసేసి 
మర్యాద మంట గలిపేసి 
చేసిన నిర్వాకం చాలు - నీవు చేసిన నిర్వాకం చాలు

విశృంఖల  విష సంస్కృతి పెంచేసి 
పాశ్చాత్య ఫ్యాషన్ ముసుగేసి 
అందాల పోటీలో వివస్త్రను చేసి 
అతివలు అభిమానం అమ్మేసి 
ప్రజ్ఞ ప్రక్కనబెట్టి అందం అర్హతగా చేసి 
సిగ్గూ సిరిని వదిలేసి 
లజ్ఞా మానం తగలేసి 
చేసిన నిర్వాకం చాలు -నీవు చేసిన నిర్వాకం చాలు

ధనస్వామ్యాన్ని జన సామాన్యంపై నెట్టేసి
అపవిత్ర ప్రవృత్తికి నాంది వేసి 
ధనాన్ని దైవంగా చేసి 
కూలి బ్రతుకుల్ని కూల్చేసి 
కూడు గూడు అన్నీ లాగేసి 
నీతి గొంతు నొక్కేసి 
న్యాయం ఊపిరి తీసేసి 
చేసిన నిర్వాకం చాలు -నీవు చేసిన నిర్వాకం చాలు

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు