Friday, September 12, 2025

అనుసరణ మరియు అతిశయోక్తికి మధ్య మహనీయ ముహమ్మద్ (స) వారి యెడల ప్రేమ

بسم الله الرحمن الرحيم సమస్త స్తోత్రాలు అల్లాహ్ కు మాత్రమే అంకితం ఆయనే మనందరి కోసం అత్యున్నతమైన ప్రవక్తను పంపాడు,తన శ్రేష్టమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. తన సంపూర్ణ షరీయత్‌ను మన కోసం నిర్దేశించాడు. నేను ఆయనను స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఆయనను ఎంత స్తుతించిన కీర్తించినా తక్కువే. అల్లాహ్ తసెలవిచ్చాడు: ] الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا [ నేనీ రోజు మీకోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవనధర్మంగా ఆమోదించాను. (అల్ మాయిదా:3)
అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్య దేవుడు లేడు, ఆయన ఒకే ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను మరియు ఆయన సహచరులను కరుణించుగాక వారికి శాంతిని ప్రసాదించుగాక! ) يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا ( [الأحزاب:70- 71] కనుక విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సరైన మాటే పలకండి. అల్లాహ్ మీ పనులు చక్కబెడతాడు. మీపొరపాట్లు క్షమిస్తాడు. దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయుడైనవాడు నిజంగా గొప్ప విజయం సాధించినట్లే. (అల్-అహ్_జాబ్: 70-71) అల్లాహ్ తఆల మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన సందేశాన్ని ప్రజలకు అందించేందుకు సందేశహరుడిగా ప్రత్యేకించుకున్నాడు. ఆయనకు తన కృపానుగ్రహాలతో విశేష గౌరవాన్ని ప్రసాదించాడు. ఆయన పట్ల విదేయతను సమస్త సృష్టి జనులపై తప్పనిసరి చేశాడు. ఆయనను గౌరవించటం, ప్రేమించటం ప్రతి మానవునిపై విధిగా చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల చూపే ప్రేమ మన తల్లిదండ్రులు, సంతానం పై గల ప్రేమకంటే కూడా అధికంగా ఉండాలి. అంతేకాదు మన ప్రాణం కంటే కూడా మిన్నగా ఉండాలి. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: لا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ మీలో ఎవరు నన్ను తన తండ్రి, తన కుమారుడు మరియు సమస్త జనులకంటే ఎక్కువగా ప్రేమించడో అప్పటివరకు అతను నికార్సయిన విశ్వాసి కాజాలడు. (బుఖారీ, ముస్లిం) మహాశయులారా! అబ్దుల్లాహ్ బిన్ హిషామ్ రజియల్లాహు అన్హు కథనం: మేము మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నాము. ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చేతిని పట్టుకొని ఉన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒక్క నా ప్రాణం మినహా మీరు నాకు ప్రతి వస్తువుకంటే ప్రియమైనవారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పందిస్తూ ఇలా బదులిచ్చారు: ముమ్మాటికికాదు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నేను నీకు నీ ప్రాణంకన్నా ప్రియతముడిగా మారనంత వరకు విశ్వాసం పూర్తవదు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు: ఇప్పుడు, అల్లాహ్‌ సాక్షిగా, మీరు నాకు నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రియమైనవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: ఇప్పుడు విశ్వాసం పూర్తయింది ఓ ఉమర్! (బుఖారీ హదీస్) అభిమాన సోధరులారా! ప్రవక్త ప్రియసహచరులు రజియల్లాహు అన్హుమ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉండేవారు. ఆ ప్రేమ వారి చెవులు, కళ్ళు, హృదయాలపై ప్రభావం చూపింది. వారు ఆ ప్రేమ కోసం తమ ప్రాణాలను, త్యాగం చేశారు. రక్తాన్ని అర్పణం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారికున్న ప్రేమ ఒట్టి నోటి మాటలది కాదు సత్యమైనది త్రికరణ శుద్ధితో కూడిన ఆచరణాత్మకమైనది. ఆధారాలు లేని మాటలు, ఒకరిని అందలం ఎక్కించాలనే ఉబుసుపోక పొగడ్తలు కేవలం వదరుబోతులు వాదనలు మాత్రమే అవి నిజమైన ప్రేమను సూచించవు. కానీ, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు హిజ్రత్ సమయంలో ఎదురైన ఘటనలో అబూబకర్ రజియల్లాహు అన్హు చూపిన ధైర్యసాహసాలు ఆయన హృదయస్వచ్ఛతను, నిజంగా అనుభవించిన ప్రేమను తెలియజేస్తాయి. శత్రువులు వారిని వెతుకుతున్న సమయంలో, అబూ బకర్ (ర) కంగారు పడ్డారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రతిగా ఆయను కళ్ళు చెమర్చాయి. ఆగకుండా కన్నీళ్లు రావడం గమనించిన దైవ ప్రవక్త ప్రశ్నించారు: ఏమైందీ అబూ బకర్? ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు అబూ బకర్ ఇలా సమాధానమిచ్చారు: 'అల్లాహ్‌ సాక్షిగా, నా ప్రాణం గురించి నేను దుఖించడం లేదు, మీకు ఏదైనా హాని కలగుతుందేమోనన్న భయంతో నేను ఏడుస్తున్నాను. (అహ్మద్ ఉల్లేఖనం, ఇమాం అల్బానీ దీనిని సహీహ్‌ ప్రామాణికమైనదిగా నిర్ధారించారు). ఉహుద్ యుద్ధ దినాన ఒకానొక సందర్భంలో పరిస్థితి ముస్లింలకు ప్రతికూలంగా మారింది. బహుదైవారాధకులకు ఆధిపత్యం దక్కింది, అలాంటి క్లిష్ట సమయంలో శత్రువుల భీకరపోరు మొదలయింది. ముస్లింల కాసింత వెనుకడుగు వేయసాగారు. కానీ మధ్య దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్యంగా ముందుకు సాగారు.అప్పుడు అబూ తల్హా రజియల్లాహు అన్హు ప్రవక్తను ఉద్దేశించి ఇలా అన్నారు:"నా తల్లిదండ్రులు మీ కోసం అర్పితమగు గాక! దయచేసి ముందుకు రాకండి శత్రుబాణం మిమ్మల్ని గాయపరచవచ్చు. నా ప్రాణం మీ ప్రాణానికి రక్షణగా ఉంటుంది. (సహీబుఖారీ సహీముస్లిం ఉల్లేఖనం) శుభకరుల్లారా! ఆయన్ను అల్లాహ్ ప్రవక్తగా విశ్వసించడం: దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పట్ల ప్రేమకు కొన్ని స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: ఆయనను విశ్వసించడం, ఆయన తెలిపిన సందేశాలను సత్యంమని అంగీకరించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇవన్నీ ముహమ్మద్ (స) అల్లాహ్ ప్రవక్త అని ఇచ్చిన సాక్ష్యానికి అసలైన అర్థాన్ని ప్రతిబింబిస్తాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: قَالَ تَعَالَى: فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالنُّورِ الَّذِي أَنْزَلْنَا وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ )التغابن8( కనుక (మానవులారా!) అల్లాహ్ ను , ఆయన ప్రవక్తను, మేము పంపిన (ఖుర్‌ఆన్‌) జ్యోతిని విశ్వసించండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. ఆయన్ను గౌరవించడం: మహనీయ ముహమ్మద్ (స) యెడల ప్రేమను సూచించే లక్షణాలలో ముఖ్యమైనవి: ఆయన జీవించి ఉన్నప్పుడు మరియు మరణించిన తరువాత ఆయన యెడల గౌరవం చూపడం, ఆయన సున్నతులను గౌరవించడం. అల్లాహ్ఇలా సెలవిచ్చాడు. ]إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا * لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ [ [الفتح:8-9]. ఓ ముహమ్మద్‌ (స)! మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్త అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఎందుకంటే (మానవులారా!) మీరు దేవుడ్ని, ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయనకు మీ సహాయసహకారాలు అందజేయండి. ఆయన్ని గౌరవించండి. ఉదయం, సాయంత్రం దేవుని పవిత్రత స్మరిస్తూ ఉండండి. (ఫతహ్: 8-9) ఇంకోచోట ఇలా సెలవిచ్చాడు : ] فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ أُولَئِكَ هُمُ الْمُفْلِحُونَ [ [الأعراف:157] కనుక ఎవరు అతడ్ని విశ్వసించి సమర్థించి అతనితో సహకరిస్తూ, అతనిపై అవతరించిన (ఖుర్‌ఆన్‌) జ్యోతిని అనుసరిస్తారో వారే సార్థకజీవులు. వారినే విజయం వరిస్తుంది. (ఆరాఫ్: 157) షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా رحمه الله అన్నారు: " التَّعْزِيرُ " అనే పదం ప్రవక్తకు సహాయం చేయడం, మద్దతు ఇవ్వడం, ఆయనకు హాని కలిగించే ప్రతి దాని నుండి ఆయనను సంరక్షించడం అనే అర్థాలను కలిగి ఉన్న ఒక సమగ్ర పదం. " التَّوْقِيرُ " అనే పదం గౌరవం, ఆదరణ, ప్రశాంతతతో కూడిన స్థిరతను సూచించే సమగ్రపదం. ఆయన యెడల గౌరవంతో, వినయ వినమ్రలతో మెలగడం , ఆయన గౌరవాన్ని తగ్గించే ప్రతిదానినుండి ఆయనను కాపాడే విధంగా ఉండాలి. మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ పట్ల ప్రేమను సూచించే లక్షణాలలో ఒకటి: ఆయన జీవిత చరిత్రను, ఆయన మార్గాన్ని తెలుసుకోవడం, ఆయన గుణాలను, నైతిక విలువలను లోతుగా పరిశీలించడం. అల్లాహ్ తాయాలా ఇలా సెలవిచ్చాడు: ]لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا [ [الأحزاب:21]. విశ్వాసులారా!) దైవప్రవక్త (జీవనసరళి)లో మీకు మంచి ఆదర్శం ఉంది. దేవుడ్ని, అంతిమదినాన్ని నమ్మి, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించేవారికి ఈ ఆదర్శం ఎంతో ఉప యోగపడుతుంది. (అహ్జాబ్: 21) అల్లామా ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తెలిపారు:ఈ ఆయతు దైవప్రవక్త యొక్క మాటలను, ఆచరణలను, స్థితిగతులను అనుసరించడంలో ఒక ప్రదానమైన మూల ఆధారంగా నిలుస్తుంది. సున్నత్ ప్రచారం: ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహివ సల్లం పట్ల ప్రేమను సూచించే ముఖ్యమైన లక్షణాలలో మరోకటి: ఆయన సున్నతులను ప్రచారం చేయడం, వాటిని రక్షించడం, వాటిపై అపారమైన శ్రద్ధ మరియు గౌరవాన్ని కలిగి ఉండటం. అబ్దుల్లాహ్ ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా కథనం ప్రకారం: ప్రవక్త ఇలా అన్నారు: ఏ పురుషుడు తన కుటుంబ సభ్యులను(స్త్రీలను) మస్జిద్‌కు వెళ్లకుండా అడ్డుకోకూడదు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌ కుమారుడు ఇలా అన్నాడు: మేము వారిని (స్త్రీలను) మస్జిద్‌కు వెళ్లకుండా అడ్డుకుంటాము. దానికి అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు తీవ్రంగా స్పందిస్తూ ఇలా అన్నారు: నేను నీకు అల్లాహ్ ప్రవక్త గురించి హదీస్ చెబుతున్నాను, కానీ నీవు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు! అబ్దుల్లాహ్ ఆ కుమారుడితో మరణించే వరకు మాట్లాడలేదు.(సహీ బుఖారీ ముస్లిం ఉల్లేఖనం మరియు అహ్మద్ తన పదాలతో ఉల్లేఖించారు) అబ్దుల్లాహ్ బిన్ ముఘఫ్ఫల్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ఒక వ్యక్తి వేట నిమిత్తం రాళ్లను విసురుతండటం ఆయన చూశారు అప్పుడు ఆయన అతనితో ఇలా అన్నారు ఇలా రాళ్లు చేయవద్దు ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ దీనిని నిషేధించారు. ఆపై ఇలా అన్నారు దానివల్ల వేట జయప్రదం కాదు. శత్రువును గాయపర్చలేరు. పైగా అది పల్లు రాలగొడుతుంది. , కళ్లను దెబ్బతీస్తుంది. తర్వాత, అదే వ్యక్తి మళ్లీ రాళ్లు విసురోతూ అబ్దుల్లాహ్ చూశారు. దానికి ఆయన తీవ్రంగా మండిపడుతూ ఇలా అన్నారు: నేను దైవప్రవక్త నిషేధించడాని హదీసు నీకు చెబుతున్నాను, కానీ నీవు ఇంకా రాళ్లు విసురుతూనే ఉన్నావా ? ఇకపై నేను నీతో అస్సలు మాట్లాడను. ( సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం కథనం) మీరు విన్నదాన్ని నేను చెబుతున్నాను. అల్లాహ్‌ను నా కోసం, మీ కోసం క్షమాపణ కోరుతున్నాను. కాబట్టి మీరు కూడా ఆయనను క్షమాపణ కోరండి. నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, దయగలవాడు. రెండవ ప్రసంగం సమస్త పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కి అంకితం. ఆయనకే శుభప్రద ప్రశంసలు, అందమైన స్తుతులు శోబిస్తాయి. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరూ లేరు, ఆయన ఏకైకుడు ఆయనకు భాగస్వామి ఎవ్వరూ లేరు ఆయన సత్యాన్ని పలుకుతాడు సరైన మార్గాన్ని చూపుతాడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ (స) ఆయన దాసుడు మరియు సందేశహరుడు, ఆయనపై ఆయన కుటుంబీకులపై ఆయన సహచరులపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక! దైవదాసులారా! అల్లాహ్‌’కు భయపడండి! తెలుసుకోండి నిశ్చయంగా అల్లాహ్‌ పట్ల భీతి అత్యుత్తమమైన విధానం మరియు అత్యంత దృఢమైనమార్గం. విశ్వాసులారా ! నిస్సందేహంగా మహోన్నతమైన ప్రేమ మరియు దాని అత్యున్నత ద్వారం ఏమిటంటే అల్లాహ్‌ పట్ల విధేయత, సమర్పణ, అంగీకారం మరియు ఆజ్ఞాపాలన. అల్లాహ్ తఆల ఇలా సెలవిచ్చాడు: ]قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ آل عمران:31 వారికిలా చెప్పు: “మీరు నిజంగా దేవుడ్ని అభిమానిస్తుంటే నన్ను అనుసరించండి; దేవుడు మిమ్మల్ని అభిమానిస్తాడు; మీ పాపాలు క్షమిస్తాడు. దేవుడు ఎంతో క్షమించే వాడు, కరుణించేవాడు. (ఆల్ ఇమ్రాన్: 31) అల్లామా ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ సెలవిచ్చారు: ప్రవక్త ముహమ్మద్ ﷺ పట్ల ప్రేమ అనేది ఆయన గురించి అతిశయోక్తులు చెబుతూ గాని, ఆయనను సాయం కోసం పిలుస్తూ గాని, మౌలిద్ వేడుకలు జరుపుతూ గాని, ఇళ్ళను నినాదాలు, శ్లోకాలు వ్రాసి అలంకరిస్తూ గాని ఉండదు. ఎందుకంటే సహాబా (రజియల్లాహు అన్హుమ్) అనేవారు అత్యున్నతమైన తరం, గొప్ప సమూహం. వారు ఎప్పుడూ ఈ తేదీని గుర్తించి మీలాద్ జరుపుకోలేదు, అది మంచి పనైతే వారు ముందుగానే చేసి చూపించేవారు. మిత్రమా! నీకు తెలుసా? మౌలిద్ వేడుకను మొదట సృష్టించి ఆచరించిన వారు ఫాతిమీ రాజులు. వారు నాలుగవ హిజ్రీ శతాబ్దంలో దీనిని ఆరంభించారు. వారు తాము ప్రవక్త వంశానికి చెందినవాళ్లమని చెప్పుకున్నా, వాస్తవానికి వారు యూద మతానికి చెందిన బాతినీ అయిన అబ్దుల్లాహ్ బిన్ మైమూన్ అల్-ఖద్దాహ్ సంతానం. వారి రాజ్యంలో ప్రధానుడు, అధికారం అల్లా ఆయనతోనే" అని తప్పుడు చెప్పి తన్ను తానే దేవుడినని ప్రకటించాడు. అంతేకాక, అతడు అనేక బాతినీ తీగలను స్థాపించాడు. సారాంశం: మౌలిద్ అనే బిద్‌అత్ (కొత్త పోకడ) ఇక్కడి నుంచే పుట్టింది. ఇప్పుడు ఒక జ్ఞానవంతుడు ఇలా అనగలడా? అంటే – ఆ సత్యాన్ని సిద్దీఖ్ (అబూ బక్ర్ ర.అ.), ఫారూక్ (ఉమర్ ర.అ.), మరియు ఇతర సహాబాలు, సలఫ్ ఇమామ్‌లు కూడా గ్రహించలేకపోయారు, కానీ ఈ జహ్మీ, బాతినీ, ధర్మం వీడి దారి తప్పినవాళ్లు మాత్రమే గ్రహించారా?! షైఖ్-ఉల్-ఇస్లాం ఇబ్ను తైమీయ్యా రహిమహుల్లాహ్ మౌలిద్ బిద్‌అత్ గురించి ఇలా అన్నారు: “ఈ ఆచారాన్ని సలఫ్ ఎప్పుడూ చేయలేదు, చేయడానికి అవసరమున్నప్పటికీ, అడ్డంకీ లేకపోయినా. ఇది పూర్తిగా మంచి పనై ఉండి ఉంటే, లేదా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నదై ఉంటే, సలఫ్ (సహాబాలు) మనకంటే ముందు దీనిని ఆచరించేవారు. ఎందుకంటే వారు మనకంటే ఎక్కువగా ప్రవక్త ﷺ పట్ల ప్రేమతో, గౌరవంతో ఉండేవారు, మరియు మంచి పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపేవారు. ప్రవక్త ﷺ పట్ల సంపూర్ణమైన ప్రేమ, గౌరవం అంటే ఆయనను అనుసరించడం, ఆయన ఆదేశాలను పాటించడం, ఆయన సున్నతును బహిరంగంగా మరియు అంతరంగంగా జీవనంలో నిలబెట్టుకోవడం, ఆయన తెచ్చిన సందేశాన్ని వ్యాప్తి చేయడం, దాని కోసం ఆత్మశుధ్ధిత్తో, సత్కర్మలతో, సత్య వాక్కుతో అవిశ్రావంతంగా పరిశరమించడం. అందువల్ల, అల్లాహ్ దాసులారా! బిద్‌అత్ ధర్మంలో కొత్త ఆవిష్కరణల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త ఆచారం బిద్‌అత్, ప్రతి బిద్‌అత్ మార్గభ్రష్టత్వం, ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది. ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ వద్ద ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నారు: “అబూ అబ్దిల్లాహ్! నేను ఎక్కడి నుండి ఇహ్రామ్ కట్టాలి?” ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ చెప్పారు: “ధీ-హులైఫా నుండి, అక్కడే ప్రవక్త ﷺ ఇహ్రామ్ కట్టారు.” ఆ వ్యక్తి అన్నాడు: “కానీ నేను మస్జిద్ నబవి నుంచే ఇహ్రామ్ కట్టాలని అనుకుంటున్నాను.” అప్పుడు ఇమామ్ మాలిక్ అన్నారు: “అలా చేయకు! నీకు ఫిత్నా (పరీక్ష/విపత్తు) వస్తుందని భయపడుతున్నాను.” ఆ వ్యక్తి అన్నాడు: “ఫిత్నా ఏముంటుంది ఇందులో? నేను కొన్ని మైళ్ళు ఎక్కువగా నడుస్తాను అంతే!” అప్పుడు ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ చెప్పారు: “రసూలుల్లాహ్ ﷺ చేయని ఒక పనిలో నువ్వు ఆయనకంటే ముందే చేరుకున్నావని అనుకోవడం కన్నా పెద్ద ఫిత్నా ఇంకేముంటుంది? నేను అల్లాహ్ వాక్యాన్ని విన్నాను: فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِ أَنْ تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ )النور:63( ముస్లింలారా! దైవప్రవక్త పిలుపును మీరు ఒకరినొకర్ని పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో (ఏదో నెపంతో) చల్లగా జారుకునేవారెవరో దేవునికి బాగా తెలుసు. ఆయితే ప్రవక్త ఆజ్ఞల్ని ఉల్లంఘించేవారు తాము ఏదైనా ప్రమాదంలో చిక్కుబడతామే మోనని లేదా దుర్భరయాతనకు గురవుతామేమోనని తలచి భయపడాలి. (63) ఓ అల్లాహ్! ప్రకాశవంతమైన ముఖకాంతి గలవాడైన, తెల్లని నుదుటి కాంతిగలవాడైన, అబ్దుల్లాహ్ కుమారుడైన ముహమ్మద్ ﷺ మీద, ఆయన కుటుంబం మీద, ఆయన సహాబా మీద, మరియు కియామత్ దాకా వారి మార్గాన్ని అనుసరించేవారి మీద నీ దయా-శాంతులు కురిపించు. ఓ అల్లాహ్! మేము నీ దగ్గర నుండి హిదాయత్, సన్మార్గం తక్వా, పవిత్రత, ధనసంపద కోరుకుంటున్నాము. ఓ అల్లాహ్! మాకు హిదాయత్ చూపు, మమ్మల్ని ధర్మ దారిలో నడిపించు. ఓ అల్లాహ్! మాకు మరియు మా తల్లిదండ్రులకు పుణ్యఫలాలతో మా కర్మల త్రాసును భారంగా చేయి. మమ్మల్ని స్వర్గవాసులలో చేర్చు. ఓ అల్లాహ్! మా దారిగా ఉన్న మా ధర్మాన్ని సరిచేయి. మా జీవనోపాధి ఉన్న ఈ ప్రాపంచిక వ్యవహారాలను సరిచేయి. మా తిరుగు ప్రయాణం ఉండే పరలోకాన్ని బాగు చేయి. జీవితం మాకు ప్రతి మంచిపనిలో పెరుగుదల అయ్యేలా చేయి. మరణం మాకు ప్రతి చెడు నుండి విశ్రాంతి అయ్యేలా చేయి. ఓ అల్లాహ్! యూద అక్రమార్కులను శిక్షించు. నేరగాళ్లైన జియోనిస్టుల మీద ప్రతీకారం తీర్చు. గాయపడిన అల్-అక్సాను ముస్లింల ఆధీనంలోకి తిరిగి తీసుకురా. ఓ అల్లాహ్! పాలస్తీన్ లోని మా ప్రజలకు నువ్వు సహాయకుడవై ఉండు. వారి రక్తాలను కాపాడు. వారి గౌరవాలను రక్షించు. వారికి నీ ప్రత్యేక సహాయాన్ని అందించు. వారి శత్రువుల కుట్రలను వారికే తిరిగి మళ్లించు. ఓ అల్లాహ్! మా పాలకులను మరియు ముస్లింల నాయకులను నీవు ఇష్టపడే, సంతోషించే విషయాలలో విజయవంతం చేయి. వారి మాటలను హక్కు మరియు తక్వా మీద ఏకం చేయి. వారి హృదయాలను కలిపివేయి. వారిని శాంతి మార్గంలో నడిపించు. వారిచేత భూమికీ, ప్రజలకీ లాభం కలుగజేయి. ఓ అల్లాహ్! ఈ దేశాన్ని (మన దేశాన్ని) భద్రంగా, ప్రశాంతంగా, సమృద్ధిగా, న్యాయం మరియు విశ్వాసం కలిగిన స్థలంగా, రక్షణ మరియు సురక్షిత నివాసంగా చేయి. అలాగే అన్ని ముస్లిం దేశాలను కూడా. మా చివరి పలుకు నీ స్తోత్రమే!

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు