Friday, September 12, 2025

నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం!

మొదటి ఖుత్బా الْحَمْدُ لِلَّهِ الْعَلِيمِ الأَكْرَمِ، الَّذِي عَلَّمَ بِالْقَلَمِ، عَلَّمَ الإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ، وَأَشْهَدُ أَن لَّا إلَهَ إلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، أَعَزَّ بِالْعِلْمِ وَأَكْرَمَ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُ اللَّهِ وَرَسُولُهُ، خَيْرُ مَنْ تَعَلَّمَ بِالْوَحْيِ وَعَلَّمَ، وَبَدَّدَ ظُلُمَاتِ الْجَهْلِ وَبَصَّرَ، صَلَّى اللَّهُ عَلَيْهِ وَآلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إلَى يَوْمِ الدِّينِ، وَسَلَّمَ تَسْلِيمًا كَثِيرًا. నిజమైన మాట అల్లాహ్ గ్రంథం, మరియు ఉత్తమ మార్గదర్శనం ముహమ్మద్ ﷺ యొక్క మార్గదర్శనం. ధర్మంలో కొత్తగా కల్పించినవన్నీ చెడ్డవే బిద్‌అత్ కోవకు చెందినవే. ప్రతి బిద్‌అత్ మార్గభ్రష్టత్వం. ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి మార్గమే.
అల్లాహ్ దాసులారా! నేను నా స్వయానికి మరియు మీ అందరికీ అల్లాహ్ భయాన్ని (తక్వా) ఉపదేశిస్తున్నాను. రహస్యంగానూ, బహిరంగంగానూ సర్వకాల సర్వావస్థలయందు ఆయన మనల్ని గమనిస్తున్నాడన్న విషయాన్ని మరువకండి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّهَ [النساء:131]. నీకు, నీకుపూర్వం గ్రంథం ఇవ్వబడిన వారికి కూడా మేము అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండాలనే ఆదేశించాం. (అన్-నిసా: 131) విశ్వాస సోదరులారా! జీవిత చక్రం తిరుగుతూనే ఉంది. గంటలు, రోజులు, నెలలు సంవత్సరాలు మంచులా కరిగిపోతూ ఉన్నాయి. మరణం సంభవించే వరకూ ఈ పరిణామ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. గతం మన ముందర అనేక పాఠాలను ఉంచుతుంది. నిద్రాణంలో ఉన్న మన హృదయాలను తట్టి లేపుతుంది. నిన్నమొన్ననే మనం గత విద్యా సంవత్సరాన్ని వీడ్కోలు పలికాము. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము. మన రోజువారీ జీవితం సహజస్థితికి వచ్చేసింది. చదువుల బండి కదులుతున్నది, కృషి, జాగ్రత్తలతో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆశలతో, ఉత్సాహంతో కొత్త జీవితం మొదలవుతుంది. విద్యాసంస్థలు తలుపులు తెరిచాయి, పిల్లలు విజ్ఞానానికి పరుగులు తీస్తున్నారు. వారి హృదయాలను భవిష్యత్ ఆశ కదిలిస్తోంది, జ్ఞానాసక్తి వారిని నడిపిస్తోంది. కృషి మరియు వారిని జ్ఞానం – ఆచరణలో నిజాయితీగా ముందడుగు వేయడంలో తోడ్పడుతోంది. అల్లాహ్ దాసులారా! జ్ఞానం అల్లాహ్ పై విశ్వాసానికి ఆధారం, ఆయనను తెలుసుకోవడానికి మార్గం. జ్ఞానం ప్రాధాన్యాన్ని సూచించడానికి మొదటి వహీ (దివ్యావిష్కృతి) ఇలా ప్రారంభమైంది: اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ * خَلَقَ الْإِنْسَانَ مِنْ عَلَقٍ * اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ * الَّذِي عَلَّمَ بِالْقَلَمِ * عَلَّمَ الْإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ [العلق:1-5] (ముహమ్మద్‌!) సర్వసృష్టికర్త అయిన నీప్రభువు పేరు స్మరించి పఠించు. ఆయనే మానవుడ్ని గడ్డకట్టిన రక్తంతో సృజించాడు. చదువు. నీ ప్రభువు మహోన్నతుడు. ఎంతో ఉదారుడు. ఆయన మానవునికి కలం ద్వారా అతను ఎరగని జ్ఞానం నేర్పాడు. [అలఅలక్:1-5] దైవ ప్రవక్త (స) వారిపై అవతరించిన తొలి దైవవాణి "చదువు" అన్నది. దీన్ని బట్టి ఇస్లాం జ్ఞానానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో ఇట్టే అర్థమయిపోతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنْكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ [المجادلة:11] మీలో (సత్యాన్ని) విశ్వసించి (ధర్మ)జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత హోదాలు ప్రసాదిస్తాడు. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ కు తెలుసు. [ముజాదిలా:11] దైవ ప్రవకత (స) ఇలా అన్నారు: أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «وَمَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا، سَهَّلَ اللهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الجَنَّةِ» [رَوَاهُ مُسْلِمٌ]. జ్ఞానసముపార్జన కోసం దాసుడు ఒక మార్గాన్ని అన్వేషిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గానికి మార్గం సులభతరం చేస్తాడు. [ముస్లిం] విశ్వాస సోదరులారా! కొత్త విద్యా సంవత్సరం జ్ఞానం విస్తరించే కాలం, ఆత్మలు సన్మార్గంలో నడిచే కాలం. జ్ఞానం ఆధారంగానే అల్లాహ్ ప్రజలకు ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. లేదా పతనావస్థకు గురి చేస్తాడు. జ్ఞాని – అజ్ఞాని ఎప్పుడూ సమానం కాజాలరు. జ్ఞానం అల్లాహ్ ప్రసన్నతను పొందడానికి అనువైన మార్గం. ప్రవక్త (స) ఇలా అన్నారు: «(إنَّ الملائكةَ لتضعُ أجنحتَها رضًا لِطَالِبِ العِلْمِ» [رَوَاهُ أَبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ ధర్మ విద్యార్జన చేసే విద్యార్థి కోసం దైవ దూతలు తమ రెక్కలను పరుస్తారు. [అబూ దావూద్, తిర్మిధీ] జ్ఞానం మనుషులు ప్రోగు చేసుకోవాల్సిన సంపదల్లో ఉత్తమ సంపద. హృదయాలు అనునిత్యం పరితపించాల్సిన గొప్ప కర్తవ్యం, మనో చీకట్లను, మనసులోని తమస్సును తొలగించే ఉషస్సు, గొప్ప తపస్సు. ఇది ప్రతి ఒక్కరి ధార్మిక అవసరం, జీవనావశ్యకత కూడా. జ్ఞానంతో మనిషి మనోధర్మం సరిదిద్దబడుతుంది, జ్ఞానంతోనే ప్రజలు తమ ప్రభువును తెలుసుకుంటారు. అలాగే ప్రాపంచిక విద్య, విజ్ఞానం ద్వారా కూడా ముస్లింలు లాభపడతారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, నిర్మాణాలు, ఉత్పత్తి, ప్రతి ఉత్పత్తి - అన్నీ జ్ఞానం ద్వారానే సాధ్యం. జ్ఞానంతోనే జాతులు ఎదుగుతాయి, దేశాలు గొప్ప కీర్తిని, గౌరవాన్ని పొందుతాయి. విశ్వాస సోదరులారా! కొత్త విద్యా సంవత్సరాన్ని నూతనోత్సాహంతో, ఆశాభావ దృక్పథంతో స్వాగతించండి. ప్రవక్త (స) ఎల్లప్పుడూ మంచి శకునాన్ని ఇష్టపడ్డారు, అపశకునాన్ని అసహ్యించుకున్నారు. ఆయన ఆలస్యము, సోమరితనం నుండి అల్లాహ్ రక్షణ కోరేవారు. శిక్షకులు, ఉపాధ్యాయులారా! మీరు గొప్ప పని చేస్తున్నారు. మీరు జనం కోసం, సంఘం, సమాజము కోసం వెలుగు దీపాలుగా, కరుణ కమలాలుగా ఉన్నారు. మీ వద్దకు ముస్లింల పిల్లలు వస్తున్నారు. వారు మీ నుండి జ్ఞానం, సన్మార్గ ఉపదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి హృదయాలను గెలుచుకోండి. అల్లాహ్ ప్రేమలో వారిని పెంచండి. ఈమాన్ – ఇహ్సాన్ విత్తనాలు వారి మనసులో నాటండి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: وَمَنْ أَحْسَنُ قَوْلًا مِمَّنْ دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا [فصلت:33] అల్లాహ్ (సందేశం) వైపు (ప్రజలను) పిలిచి, సత్కార్యాలు చేసి, తాను దైవవిధే యుణ్ణని పలికినవాని మాటకంటే శ్రేష్ఠమైన మాట మరెవరిది అవుతుంది? [ఫుస్సిలత్:33] అందువల్ల, అల్లాహ్ మెప్పును కాంక్షిస్తూ మీ మాటల్లోనూ, చేతల్లోనూ నిజాయితీగా ఉండండి. గౌరవనీయ ఉపాధ్యాయులారా! మీ స్థానం మాకు తెలుసు. మీరు మానవాళికి మార్గదర్శకులు, ఆదర్శప్రాయులు. మీ జీవిత కాలాన్ని మీరు కొవ్వొత్తిలా కరిగిపోతూ, విద్యా వాతావరణంలో విద్యార్థుల మధ్య గడుపుతున్నారు. వారిని ప్రయోజకుల్ని చేయడం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చదిద్దే ప్రయతనం శక్తి మంచం లేకుండా చేస్తున్నారు. వారికి నీతికి విలువేమిటో, నాతికి వలువేమిటో నేర్పుతున్నారు, సన్మార్గం చూపుతున్నారు. ఉన్నత విలువలను వారికి బోధిస్తున్నారు. వారిలోని ఉన్నత నైతికతను ప్రోత్సహిస్తున్నారు. వారిని నవ సమాజ నిర్మాతలుగా, భావి భాగ్య విధాతలుగా మలుస్తున్నారు. కాబట్టి, విద్యార్థులను ఆనందంతో స్వాగతించండి, వారిని తక్కువగా అంచనా వేయకండి. వారి యెడల సద్భావం కలిగి ఉండండి. ఎందుకంటే ఈ రోజు వారు చిన్నవారు రేపు పెద్దవారవుతారు, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు అజ్ఞానిగా ఉన్న వ్యక్తి విద్యాబుద్ధులు నేర్చుకుని రేపు మహాజ్ఞాని అవ్వచ్చు. నేడు అలక్ష్యానికి ఏమరుపాటుకి లోనయిన వ్యక్తి కనువిప్పు కలిగి గొప్ప కార్యసాధకుడు కావచ్చు. రెండవ ఖుత్బా الْحَمْدُ لِلَّهِ عَلَى إِحْسَانِهِ، وَالشُّكْرُ لَهُ عَلَى تَوْفِيقِهِ وَامْتِنَانِهِ، وَأَشْهَدُ أَن لَّا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَعْظِيمًا لِشَأْنِهِ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ الدَّاعِي إِلَى رِضْوَانِهِ، صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ. గౌరవనీయ విద్యార్థులారా! ఇదిగో, జ్ఞాన శుభోదయాలు వచ్చేశాయి. మీరు కృషితో, నిజాయితీతో వాటిని స్వీకరించండి. మీ బంగారు భవిత కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండండి, అసభ్యంగా ప్రవర్తించవద్దు. సహనంతో, జాగ్రత్తగా ఉండండి. సోమరితనం, నిర్లక్ష్యాన్ని దూరంగా పెట్టండి. చెడ్డ స్నేహితుల నుండి జాగ్రత్త పడండి. విజ్ఞానాన్ని గౌరవించండి, పుస్తకాలను గౌరవించండి. మీరు నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకోండి. ముస్లిం సముదాయం మీరు నిజాయితీ గల పండితులు, వైద్యులు, ఇంజనీర్లు, సైనికులుగా ఎదగాలని ఆశిస్తోంది. అల్లాహ్ మీకు తోడుగా ఉండుగాక! తల్లిదండ్రులారా! మీరు పాఠశాల యొక్క భాగస్వాములు. మీ పిల్లల్లో జ్ఞాన పిపాసను పెంపొందించండి. ఉపాధ్యాయులను గౌరవించండి. ఎందుకంటే అద్భుతం విద్య ద్వారానే జరుగుతుంది. పాఠశాల యాజమాన్యంతో సహకరించండి, ఉపాధ్యాయులతో సత్సంబంధం కలిగి ఉండండి. ఇది మీ కుమారులు, కుమార్తెలకు మేలు చేస్తుంది. అల్లాహ్ ఈ విద్యా సంవత్సరాన్ని కువైట్ దేశానికి శుభవంతంగా, విజయవంతంగా మార్చుగాక! ముస్లిం సోదరులారా! అత్యున్నత జ్ఞానం ఖుర్‌ఆన్ మరియు సున్నత్ విద్య. ఇది ప్రవక్తల వారసత్వం. అందుకే మనం ధర్మజ్ఞానం కోసం శ్రద్ధ వహించాలి. మన దేశంలో ధార్మిక విద్యాసంస్థలు, ఖుర్‌ఆన్ మదర్సాలు విస్తరింఉన్నాయి. అల్లాహ్ కృపతో వాటిలో ప్రవేశం అందుబాటులో ఉంది. అల్లాహ్ దాసులారా! అల్లాహ్ ప్రవక్త (స) పై దురూద్ పంపండి. "అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుంమ్మజీద్". إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త [ముహమ్మద్ (ﷺ)]పై దరూద్'లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి. (ఖుర్ఆన్ - 33 : 56) “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్” దువా: అల్లాహ్ ఇస్లాం, ముస్లింలను బలపరచుగాక. బలహీన ముస్లింలకు సహాయపడుగాక. శత్రువులను నాశనం చేయుగాక. ఈ దేశాన్ని (కువైట్) భద్రముగా, శాంతియుతముగా చేయుగాక. మా నాయకులను సన్మార్గంలో నడిపించుగాక. మా తల్లిదండ్రులను క్షమించుగాక. మా అన్ని పాపాలను క్షమించుగాక. బాధలను తొలగించుగాక. రోగులను నయం చేయుగాక. నిర్బంధితులను విముక్తి చేయుగాక. సంతానం లేనివారికి సంతానం ప్రసాదించుగాక. اللَّهُمَّ أَعِزَّ الْإِسْلَامَ وَالْمُسْلِمِينَ، وَانْصُرْ عِبَادَكَ الْمُسْتَضْعَفِينَ الْمُوَحِّدِينَ فِي كُلِّ مَكَانٍ، وَدَمِّرْ أَعْدَاءَ الدِّينِ، اللَّهُمَّ اجْعَلْ هَذَا الْبَلَدَ آمِنًا مُطْمَئِنًّا سَخَاءً رَخَاءً وَسَائِرَ بِلَادِ الْمُسْلِمِينَ، اللَّهُمَّ وَفِّقْ أَمِيرَنَا وَوَلِيَّ عَهْدِهِ لِهُدَاكَ، وَاجْعَلْ عَمَلَهُمَا فِي رِضَاكَ، وَارْزُقْهُمَا الْبِطَانَةَ الصَّالِحَةَ النَّاصِحَةَ الَّتِي تَدُلُّهُمْ عَلَى الْخَيْرِ وَتُعِينُهُمْ عَلَيْهِ، اللَّهُمَّ اغْفِرْ لَنَا وَلِوَالِدِينَا كَمَا رَبَّوْنَا صِغَارًا، اللَّهُمَّ ارْزُقْنَا بِرَّهُمْ أَحْيَاءً وَأَمْوَاتًا، اللَّهُمَّ لَا تَدَعْ لَنَا ذَنْبًا إِلَّا غَفَرْتَهُ، وَلَا هَمًّا إِلَّا فَرَّجْتَهُ، وَلَا مَرِيضًا إِلَّا شَفَيْتَهُ، وَلَا مُبْتَلًى إِلَّا عَافَيْتَهُ، وَلَا مَحْرُومًا مِنَ الْأَوْلَادِ إِلَّا وَهَبْتَهُ، رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذَرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు