రచన: శాంతి ప్రియ
భారత భాగ్య పౌరుల్లారా!
ఈ అవని మీ జనని
ఈ దేశం మీ ధరణి
ఈ భువనం ఆ గగనం
ఈ సముద్రం ఆ పర్వతం
ఈ పుష్పం ఆ ఫలం
అంతా మీ సొంతం
చెయ్యరా దైవ దాస్యం!
రేపటి ఆశా దీపాల్లారా!
ఆ సి=చిత్రం మీ స్వప్నం
ఆ శిల్పం మీ నైపుణ్యం
ఆ కావ్యం ఈ కథనం
ఆ గేయం ఈ రాగం
ఆ గ్రంథం ఈ వచనం
అంతా దైవానుగ్రహం
నమ్మరా ఈ నిజం!
భారత భాగ్య పౌరుల్లారా!
ఈ భవనం ఆ వరణం
ఈ కోట ఆ పేట
ఆ ధాన్యం ఈ మూల్యం
అంతా క్షణభంగురం
ఎరుగరా ఈ జీవిత సత్యాన్ని!
రేపటి ఆశా దీపాల్లారా!
మీ లక్ష్యం దైవ దర్శనం
మీ గమ్యం స్వర్గధామం
మీ ధ్యేయం సామాజిక న్యాయం
మీ కర్తవ్యమ్ ధర్మపోరాటం
మీ స్వప్నం సత్సమాజ స్థాపనం
సాకారం చేసుకొండి మీ కలల్ని
ఫలిస్తాయి తప్పక మీ కష్టాలన్నీ....

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు