Tuesday, January 17, 2023

గెలుపు నిజం

రచన: శాంతి ప్రియ



తరం మారిందిఎం స్వరం మారింది
ప్రియ మిత్రుడా మత్తు నిద్రను వీడి 
సత్యప్రియులతో జత కూడి 
పాతరా సత్య కేతనం 
పర్వత శిఖరాలపై 
హిమ నగాల పై 
పాడరా శాంతి గేయం 
చాటరా మానవత్వం 

సత్య ఉక్తికి గల శక్తి మహత్తరం 
జిత్నా హీ దబావోగే ఉత్నా హీ ఉబ్రేగా 

తెల్ల నల్ల తేడాలే కాదు 
వర్గ వర్ణ విభేదాలే కాదు 
జాతి ప్రాంత విభజనలే కాదు 
అగ్ర, అధమ వివక్షలే కాదు 
ధనిక పేద తారతమ్యాలే లేవు 

మనుషులం  ప్రియ బంధువులం 
సుగుణ సింధు జల బిందువులం
దైవభీతియే అన్నింటికీ గీటురాయి 
సర్వ మానవ సౌభ్రాతృత్వం చాటవోయి 

మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీపురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే దేవుని దృష్టిలో ఎక్కువ గౌరవ నీయుడు. దేవుడు సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (దివ్య ఖురాన్: హుజురాత్ - 13)

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు