రచన: శాంతి ప్రియ
ఇహమే శాశ్వతమ్మని మురిసిపోతావెందుకో
పరమే అసలు లేదని మిడిసిపడతావెందుకో
నిఖిల జగత్తుకి నిజ ప్రభువునే ధిక్కరిస్తావెందుకో
ఆగర్భ శత్రువైన షైతాన్నే అనుసరిస్తావెందుకో
కన్నవారిని కాలదన్ని కన్నెర్రజేస్తావెందుకో
కలల రాణివనుకున్న కాంత మీద కరిగిపోతావెందుకో
జన్మనిచ్చిన జననీజనకులనే విస్మరిస్తావెందుకో
నీవు భ్రమసి కన్నె కోరితే ప్రాణమిస్తావెందుకో
విద్య నేర్పి ఇంత చేసిన ఉస్తాదుతోనా నీ పరిహాసం
నైతికతకు నీరు పోసిన నాయకునితోనా నీ పోరాటం
నివురు గప్పిన నిధినిక్షేపాల కోసమా నీ ఆరాటం
మట్టితో పుట్టి మట్టిలోనే కలిసిపోయే నీకా ఈ ఆర్భాటం
ఓ కవి చెప్పినట్టు .... ఎరుగరా నిజాన్ని
సత్యం ఇది గ్రహించి మార్చుకో నీ గమ్యాన్ని
దానధర్మము దైవ ప్రియమ్మని మనసులో గుర్తుంచుకో
సత్యమే నిత్యం జయమ్మని ధరణిలో పాటించుకో
బొందిలోన ప్రాణముండగా భూమి మీదే ఆడుతావ్
ప్రాణమేమో ఎగిరిపోగా భూమిలోనే దాగుతావ్!

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు