పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు
ప్రవరుఁడైనా ప్రవక్తయినా
చూసొచ్చా నేను తిరిగిచ్చ నేను
పుష్పం, ఫలం, తోరణం, జీవితం కాదేదీ శాశ్వతం
చీకటి తప్పులు చేసి సరదాలు తీర్చుకునే దొరబాబులు
దాని ప్రతిఫలంగా ఆ తప్పుల్లోంచి జన్మించి
తుప్పల పాలయ్యే చిన్నారి చిట్టి మొగ్గలు.
పలకలేని పువ్వు పరిమళాన్నిస్తుంది
చెప్పలేని చెరువు జలమిస్తుంది
ఉక్తి లేని వృక్షం ఫలమిస్తుంది
విషం సయితం ఔషధం అవుతుంది
మనిషి చిమ్మే విషమే ప్రమాదం
ఒకడిని ఒకడు చేస్తాడు మోసము
ఒకని మీద ఒకడు వేస్తాడు నెపము
గరీబీ నహీ గరీబోన్కో హఠావో
అంటాడు సత్యాన్ని ఓ బూటకము
సత్యమే పత్యమైపోయే
అసత్యమే నిత్యమైపోయే
అయితే ఉంది ఓ ఉపాయము
స్వర్గానికి గొనిపోయే మార్గము
అందరూ దైవ దాసులమని గ్రహించి
జరిగిన తప్పులను క్షమించమని దైవాన్ని ప్రార్థించి
మై తేరా భాయి తూ మేరా భాయి అని నినదించి
చేయి చేయి కలిపి చాటుదాం మానవత్వాన్ని
సత్యం వద సత్యమే పలుకుతూ
ధర్మం చర ధర్మ మార్గాన్నే నడుద్దాం!

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు