వాత్సల్యం - మాత్సర్యం
'సంతాన సంపూర్ణ హితాన్ని కోరేది వాత్సల్య మయితే, సంతాన వినాశనానికి ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానయినా కారణమవ్వడం మాత్సర్యం'. తలమాని మాయయని స్థితి నుండి మానవత్వానికే తలమానికం అయ్యేలా తనయుల్ని తీర్చిదిద్దాల్సిన భాధ్యత తల్లిదండ్రు లదే. పిలల్ల 'తల'తో తల పెట్టిన మాటలు తేనెల తేటలయి వారు ఆనందంగా ఆశ్వాదించేవిగా ఉండాలి. అతకని అబద్దాలు, పొంతన లేని విషయాలు, అర్థం లేని వంకలు, తలాతోక లేని కథలు, కాకమ్మ కబుర్లు, పుక్కిటి పురాణాలు పిల్లలకు చెప్పకూడదు. కలకన్నా వాస్తవంలో ఉన్న అనుభూతికి అనుభవాన్ని జోడించి చెప్పాలి. పిల్లల్ని బూచోడొస్తున్నాడనో, పిచ్చి పుల్లమ్మ వస్తున్నదనో లేని భయాలను కలిగించకూడదు. 'బాల్యంలో చోటు చేసుకునే భయాలు, చేదు అనుభవాలు వారిని పెద్దయ్యాక కూడా వెంటాడుతుంటాయి. కొందరు జీవితంలో సఫలం కాలేకపోవడానికి గల కారణాల్లో ముఖ్య కారణం బాల్యం తాలూకు భయాలే' అన్నది. మానసిక శాస్త్రవేత్తల మాట.
తల్లిదండ్రులు తనయులకు చెప్పింది. తలకెక్కాలి. మనం చెప్పింది. తలకె క్కించుకోవడం, ఎక్కించుకోకపోవడం వారి సమర్ధతో, అసమర్ధతో అయివుండొచ్చు. కానీ, తలకెక్కేలా చెప్పడం, చెప్పకపోడం మాత్రం ఖచ్చితంగా మన సమర్థత, అసమర్థ మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మరువకూడదు. చదువులో, సంస్కారంలో అందరిని తలదాటిన వారిగా వారిని తీర్చిదిద్దాలి. అనవ సరమయిన విషయాలలో, తలదూర్చితే లేని పోని చిక్కుల్లో పడే ప్రమాదముంటుందని తెలిసి వచ్చేలా, తెలివి వచ్చేలా చెప్పాలి. తల్లి దండ్రుల ఆనకు తలదాల్చేవారిలా వారిని మలచాలి. విదేశాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని కన్నపిల్లల కోసం కష్టపడుతున్న కన్నవారు వారి గొంతెమ్మ కోర్కెల్ని తీర్చడమే కాక, సమయం కేటాయించి కనీసం నెలకోసారయినా వారితో ప్రశాంతంగా మాట్లాడాలి.
వాత్సల్యం - విజ్ఞానం
వారి చదువుకు సంబంధించిన సమాచారా న్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇళ్ళల్లో ఉన్న తల్లులు అన్ని వేళలా రుచికరమయిన వంటకాలు మాత్రమే వడ్డించకుండా - అప్పుడప్పుడు పచ్చడి అన్నాన్ని, సద్దన్నాన్ని కూడా తినిపించాలి. అలా తినిపించినప్పుడు అలా ఎందుకు తినిపిస్తున్నారో, తల్లిగా దాని - వెనుక లక్ష్యం ఏమిటో వారికి అర్థమయ్యేలా - ప్రేమగా చెప్పాలి. లేదంటే పిల్లలు తల్లిని అపార్గం చేసుకునే ప్రమాదముంటుంది. మనం - పిల్లలకు కేవలం మన ఆస్తుల్ని, ఐశ్వర్యాల్ని,సౌఖ్యాల్ని, సౌకర్యాల్ని మాత్రమే కాదు ఇవ్వా ల్సింది, మన కష్టాలు, మన బాధలు సయితం - వారికి అర్థమయ్యేలా ప్రణాళికబద్ధంగా చెప్పేందుకు ప్రయ త్నించాలి.
ఒక విషయం గురించి పూర్తిగా తెలియటాన్ని - పాండిత్యము' అంటారు. సమయానుకూలంగా ప్రవర్తించడాన్ని 'సమయస్ఫూర్తి' అంటారు. - పరిష్కారాన్ని ఆలోచించగలిగే శక్తిని 'ప్రజ్ఞత' - అంటారు. ఇవన్నీ కలిస్తే వచ్చేది 'జ్ఞానం' అని అలాంటి జ్ఞానం లేని చదువు ఫల శూన్యం' - అన్నది వారిని బోధ పర్చాలి. అట్టి జ్ఞానంతోనే - ధ్యానం సాధ్యం అని, ఎలాంటి స్థితులు ఎదురయినా అదరని చెదరని 'స్థితప్రజ్ఞ'కు మూల - సాధనం అని వారికి ఎరుక పర్చాలి. అలాకాక - మమకారానికి పోయి తలకెత్తుకుంటే తనయులయినవారే తలకు మించిన భారమయి కూర్చుంటారు. తర్వాత తల్లిదండ్రులు క్షోభతో, బాధతో తల్లడిల్లిపోవాల్సి వస్తుంది.
అట్టి గుణశూన్యులు కామమధికమయి కన్ను కాగన - కన్నెనే సర్వస్వంగా భ్రమించి, కన్నవారిపై - కన్నెర్ర జేసి, మిన్ను గానక, మమతానురాలను మరచి, ఒళ్ళూ పైనా తెలియక ఒయ్యా రాలు ఒలకబోసే ఒయ్యారి భామల కొరకు - కన్నవారినే కాలదన్ని 'పుట్టి తల్లికి గండము, పెరికి ఊరికి గండము'గా మారి, చివరకు " ఉన్నవన్నీ ఊడ్చుకుపోయి, అస్తవ్యస్థ దురవస్థ దాపురించి, బ్రతుకు తలక్రిందులయి, తల దాచుకునేందుకు చోటు దొరకక దరిద్రపు - చావు చస్తారు అన్న విషయాన్ని మరువకూడదు. అప్పుడు వారి కోసం ఏ ఆకాశము రోధించదు, ఏ అవనీ విలపించదు.
వాత్సల్యం-సంస్కారం
సంస్కారం ఓ మస్తిష్క పవిత్రీకరణ ప్రక్రియ. సంస్కారాన్ని అనుసరించి మానవుడు దైనందిన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాడు. విద్య వల్ల, గురు ప్రబోధితంగా మరికొన్ని సంస్కారాలు అబ్బుతాయి. మనిషి ఆలోచనలకు పునాది అతడి గత జీవితపుఅనుభవాలే! వాటి ఆధారంగా మంచి, చెడు సంస్కారాలు రూపు దిద్దుకుంటాయి. మనిషి ప్రవర్తన తీరును అతడి సంస్కార
పర్యవసానంగా చెప్పాలి. విపరీత పరిస్థితుల్లో మనసు కకావికలం అవుతుంది. ఒక వ్యక్తి కోపం, మంచితనం, చెడ్డతనం, కారుణ్యం, దాన గుణం, జీవితాన్ని యథాతథంగా స్వీకరించగల మనస్తత్వం, ధర్మ శాస్త్ర సారం ఒంటపట్టే చురుకుదనం, ఉద్విగ్న భరిత క్షణాల్లో ప్రవర్తన... అన్ని సన్నివేశాల్లోనూ సంస్కారాన్ని అనుసరించే నడవడి ఉంటుంది. మానవుడు జాతి, కుల, మత, లింగ, వర్ణ, ధనిక, పేద, వర్గ భేదాలకు అతీతంగా ఆచరించవలసిన ఉత్తమ సంస్కారం మరొకటి ఉంది. అదే సౌశీల్యం!
నేటి మన పాఠశాలల చదువులయితే అటువంటి జ్ఞానాన్ని, సామాజిక స్పృహని కలుగజేయడం లేదు. పిల్లలకు ఈ స్కూళ్ళు, కాలేజీలు నేర్పే చదువు తప్ప సంస్కారం, నిజమయిన భక్తి, గౌరవం వంటి ఇతర విషయాలు తెలియకుండా చేసే తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న మన సమాజంలో వినయ పాత్ర -తగ్గి విర్రవీగే తత్వం ప్రబలుతోంది. జాతి, కుల, మత దురభిమానాలు పెచ్చరిల్లు తున్నాయి. విద్యార్థుల జీవితంలో, ముఖ్యంగా - ముస్లిం విద్యార్థుల జీవితాల్లో ఒక ప్రార్థన లేదు, ఒక సద్గ్రంథ పఠనం లేదు, ఒక సద్వచన శ్రవణం లేదు, ఆఖరికి 'కలిమా' రాదు, దానర్థం తెలియదు. ఇక వారికి ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణా జ్ఞానం ఏమయినా ఉంటుందా అంటే అదీ లేదు. ఇది ఎవరి లోపం? వ్యక్తిదా? వ్యవస్థదా?
పిల్లల్లో 'భక్తి' వల్ల వినయం, 'పాపభీతి' వల్ల - సత్ప్రవర్తన, 'ప్రార్థన' వల్ల క్రశిక్షణ కలుగుతాయి. ఖుర్ఆన్ మరియు హదీసులను నేర్పే తల్లిదండ్రుల పాలిట వారి సంతానం సౌభాగ్యం, కీర్తిగా అలరారుతారు. ఇహంలోనే కాక రేపు తీర్పు దినాన సయితం దేవుడు అట్టి సత్సంతాన తల్లిదండ్రుల్ని 'కీర్తి కిరీటాలు' తొడిగించి మహా గొప్పగా సన్మానిస్తాడు' అని ప్రవక్త మహనీయుల (స) వారు సెలవిచ్చారు. కాబట్టి పిల్లలకు అవసరమయిన ఆధ్యాత్మిక - శిక్షణ ఇవ్వడంతోపాటు 'సదా మా కళ్ళకు - చల్లదనాన్ని ఇచ్చే భార్యాపిల్లలను మాకు ప్రసాదించు. మమ్మల్ని దైవభీతిపరులకు తలతండ్రి - (ఇమామ్)గా చెయ్యి స్వామీ!' అని నిత్యం ఆ నిజ ప్రభువును వేడుకుంటూ ఉండాలి.

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు