Monday, February 16, 2026
రంజాన్ మాస వైభవం!
శాంతి ప్రియ
రమజాను నెలవంకను చూసి నా కళ్ళు చెమర్చాయి,
ప్రేమతో, విశ్వాసంతో ఆనంద భాష్పవాలు రాలాయి.
నా హృదయం దైవస్మరణలో తన్మయత్వం పొందింది,
విశ్వమంతా అల్లాహ్ కీర్తనలతో ప్రతిధ్వనిస్తోంది.
విశ్వాసపు పరిమళాలు మనల్ని చుట్టుముట్టాయి,
ప్రభువు ప్రసన్నత కోసం మదిలో తపన మొదలయింది.
ఓ పుణ్యాత్ముడా! ఇది దాతృత్వపు మాసం,
నిజాయితీతో ముందుకు రా, దైవం నీకు మేలు చేస్తాడు.
దానధర్మాలలో వెనకాడకు, నమాజులతో గడపు,
విధిగా చేయాల్సిన ఆరాధనలను భక్తితో నిర్వర్తించు,
ఖుర్ఆన్ పారాయణంతో నీ జీవితాన్ని నవనీతం చేసుకో
నీ నాలుకను అదుపులో ఉంచుకో, వ్యర్థ మాటలు వద్దు,
ఎవరినీ నొప్పించకు, నీ సంపదలో కొంత దానమివ్వు,
చిత్తశుద్ధితో చేసే పుణ్యం సంపదను పవిత్రం చేస్తుంది.
అవసరార్థుని హృదయాన్ని చల్ల బరుస్తుంది.
మాస ప్రారంభం కారుణ్యంతో మొదలవుతుంది,
మధ్యలో అల్లాహ్ క్షమాభిక్ష వెల్లివిరుస్తుంది,
ముగింపులో నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది,
అల్లాహ్ ప్రసన్నతా భాగ్యంతో జన్మ ధన్యమవుతుంది
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు