ఇస్లాం ఒక సమీక్ష
ఈ వ్యాసంలో ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణ జీవన సంవిధానంగా సంక్షిప్తంగా వివరించడం జరిగింది.
1. ఇస్లాం ఏకేశ్వరోపాసన (తౌహీద్కు)కు సంబంధించిన ధర్మం. అది ప్రజలందరికీ (వారినిని సృష్టించిన) ప్రభువు తరఫు నుండి అందజేయబడిన సార్వజనీన సందేశం, అది మానవాళికి వారి ప్రభువు తరఫు నుండి చిట్టచివరి గ్రంథాన్ని (ఖురాన్ ను) అందజేస్తుంది. మనసా వాచా కర్మణ - త్రికరణ శుద్ధితో దాన్ని స్వీకరించిస్తే, ఇస్లాం ఒక సంపన్న, సంపూర్ణ జీవన సంవిధానంగా , తిరుగు లేని ప్రపంచ నాగరికత అవుతుంది.
2. నిజ దైవ భావన
విశ్వాన్ని మరియు విశ్వంలోని చరాచరాలన్నింటిని సృష్టించిన ఒక నిజ దేవుడిని నమ్ముతారు. వారు ఆయనను మాత్రమే ఆరాధిస్తారు, ఆయనతోఎవరినీ సహవర్తులుగా చేసి కొలవరు. ఆ నిజ ఆరాధ్యుని పేరే అల్లాహ్. ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయనికి భాగస్వాములు లేదా భార్యాపిల్లలు లేరు. ఆయన మాత్రమే మొత్తం విశ్వాన్ని నియంత్రించేవాడు, మరియు అయన మాత్రమే అందరికీ జీవితాన్నిప్రసాదించే వాడు. ప్రజలందరూ వారి మరణానంతరం ఆయన వద్దకే తిరిగి వస్తారు.
3. ఇస్లాం భావార్థం
(1) ఇస్లాం అంటే సమస్త జీవారాసులను సృష్టించిన ఒకే నిజ దేవునికి (సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు) సమర్పణ విధేయత. (2) ఇస్లాం అంటే మనం శాంతిని పొందడం, ఇతరులకు శాంతిని అందించడం. ఈ అర్థాల ప్రకారం, ఇస్లాం అనేది సమస్త మానవాళి కోసం అల్లాహ్ సమ్మతించి ఆమోదించిన జీవన సంవిధానం, తోలి మానవుడు మరియు ప్రవక్త అయినా హజ్రత్ ఆదమ్ (అ) మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వరకు లోక కల్యాణార్థం వచ్చిన ప్రవక్తలందరి సందేశం సారం.
4. ఇస్లాం చివరి ప్రవక్త
ఇస్లాం ధర్మాన్ని సమస్త మానవుల జీవన సంవిధానంగా పరిచయం చేస్తూ వచ్చిన ప్రవక్తల సంఖ్య అక్షరాల 1 లక్ష 24 వేల మంది. ఈ పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ (స). పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ (571-632 CE). ఆయన శుభా జననం అరేబియా ద్వీపకల్పంలోని మక్కాలో జరిగింది. అక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆయన (ఖురేష్) అనే గొప్ప అరబ్ తెగకు చెందిన వారు. ఆయన ఉన్నత నైతిక ప్రమాణాలతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. ఆయన నడక నడవడికను చూసిన జాతి వారు ఆయన్ను సాదిక్ - సత్యవంతుడు మరియు అమీన్ - నమ్మదగినవాడు అని ప్రేమతో పిలిచేవారు.
అప్పటి ఆ సమాజంలో బహుదైవారాధన సర్వసాధారణమైనప్పటికీ ఆయన ఎప్పుడూ విగ్రహాలను పూజించలేదు. ఆయన తను ఒక ప్రవక్త అవ్వాలని ముందస్తు ప్రణాళిక వేయలేదు, ఇష్టానుసారంగా ప్రవక్త అయిపోలేదు. వాస్తంగా అల్లాహ్ అయన ద్వారా తాన్ అంతిమ సందేసం అయిన దివ్య గ్రంథం "ఖురాన్" ను ప్రజలందరికీ తెలియజేయడానికి ఆయన్ను ఎంపిక చేసుకున్నాడు. ఖుర్ఆన్ అవతరణ 23 సంవత్సరాల వ్యవధిలో (610- 632 CE) ప్రవక్త ముహమ్మద్ (స) వారిపై దైవ దూతల నాయకులైన జిబ్రిల్ ద్వారా అరబిలో అవతరింపజేయ బడింది. ఆయనను ముస్లింలు విశ్వ జనులందరి కోసం విశ్వా ప్రభువు అల్లాహ్ పంపిం అప్రవక్తగా నమ్ముతారు.
5. మూలం మరియు వ్యాప్తి
ఇస్లాం అంతిమ సందేశం మక్కాలో సంపూర్ణమయింది. అయితే మొదటి ఇస్లామీయ సువ్యవస్థ మదీనాలో (మక్కాకు ఉత్తరాన 400 కిమీ) స్థాపించబడింది. క్రీ.శ.623లో మహమ్మద్ ప్రవక్త మరియు ఆయన సహచరులు కొందరు అక్కడికి వలస వెళ్లారు.
ప్రవక్త ముహమ్మద్ (స) మరణం తరువాత, ఆయన సహచరులు మరియు వారి అనుచరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇస్లాం సందేశాన్ని తెలియజేయడానికి కంకణం కట్టారు.
క్రీ.శ.636లో, ఇస్లాం పాలస్తీనా, సిరియా, ఈజిప్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలతోపాటు భారత దేశానికి కూడా చేరుకుంది.
మాలిక్ బిన్ దీనార్, 20 మంది ముహమ్మద్ ప్రవక్త అనుయాయులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం ధర్మానికి మంచి స్పందన లభించింది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావన, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ ను నిర్మించాడు, ఈ మస్జిద్ భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడానూ. ఇది సా.శ. 629 లో నిర్మింపబడినదని భావిస్తున్నారు. మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకొంది. అది యేమనగా, సౌదీ అరేబియా లోని మదీనా తరువాత ఈ మస్జిద్ 'శుక్రవారపు ప్రార్థనలు' జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్.
క్రీ.శ.642లో ఇస్లాం పర్షియాకు చేరుకుంది. అదనంగా, ఇస్లాం ఏడవ శతాబ్దంలో చైనాకు చేరుకుంది.
6) ప్రవక్త ముహమ్మద్ (స) వారి అనుయాయులు
తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ముస్లింల సంఖ్య దాదాపు 1.8 బిలియన్లు. ఇస్లాం భూమిపై రెండవ అతిపెద్ద మతం. వారు 50 దేశాలలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు. ముస్లింలలో 20% మాత్రమే అరబ్బులు.
7) ఇస్లాం ధర్మ గ్రంథం ఖుర్ఆన్
"ఖుర్ఆన్" ఇస్లాం ధర్మ గ్రంథం. దీనిని "పవిత్ర ఖుర్ఆన్" "పరిశుద్ధ ఖుర్ఆన్" అని పిలుస్తారు. దీనిని ముస్లింలు అల్లాహ్ అంతిమ గ్రంథంగా పరిగణిస్తారు. అది అల్లాహ్ మానవాళి కోసం పంపిన అన్ని మునుపటి గ్రంథాలను (వ్యాఖ్యానాలు మరియు మార్పులు లేకుండా వాటి అసలు రూపాల్లో) స్వీకరిస్తుంది. ప్రవక్త ఇబ్రాహీమ్ (అ)కు ఇవ్వబడిన సుహుఫ్ (ప్రతులు), ప్రవక్త దావూద్ (అ)కు ఇవ్వబడిన జబూర్ (కీర్తనలు), ప్రవక్త మూసా (అ) కు ఇవ్వబడిన తౌరాత్ (తోరా) మరియు ప్రవక్త ఈసా (అ)కు ఇవ్వబడిన ఇంజీల్ (దేవుని సువార్త) వంటి దైవ గ్రంథాలను ధృవీకరిస్తుంది, వాటి సారాంశాన్ని సంరక్షిస్తుంది.
ఖుర్ఆన్ భూమిపై ఉన్న సురక్షిత దైవ గ్రంథం. అది మానవులచే మార్పుచేర్పులను చేయబడకుండా అల్లాహ్ వాక్యాలను కలిగి ఉన్న ఏకైక గ్రంథం. అది సకల వక్రీకరణలు, వక్ర భావాల నుండి భద్రపరచబడిన అద్వితీయ అద్భుత దైవ గ్రంథం.
అది దేవుని చట్టం మరియు అల్లాహ్ ఆజ్ఞలతో పాటు ప్రజలందరి కోసం సార్వజనీన సందేశం. జాతులు మరియు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నివసించే కోట్లాది మంది ప్రజల హృదయాలను బలంగా ప్రభావితం చేసిన శక్తివంతమైన గ్రంథం . అలాగే ప్రాంతానికి, భాషకి, జాతికి అతీతంగా లక్షలాది మంది ప్రజలచే మొదటి నుండి చివరి వరకు కంఠస్తం చేయబడి భద్రపరచబదిన గ్రంథం. .
8) ఇస్లాం ధర్మ నిర్మాణం
ఇస్లాంను రెండు భాగాలుగా విభజించవచ్చు:- (1) ఇస్లామీయ విశ్వాసం (2) ఇస్లామీయ ధర్మ శాస్త్రం (చట్టం మరియు జీవన విధానం). వాటిని సాధారణంగా అరబిలో (అకీదః మరియు షరీఅహ్) అని పిలుస్తారు.
అకీదః అనేది ఇస్లాం "నమ్మకం" అది ఇస్లాంలోని అవిభాజ్యాంశం, కీలక భాగం. విశ్వాసం (ఈమాన్ఆ) ఆరు విధాలుగా ఉంటుంది. అవి - అల్లాహ్ పై దృఢమైన విశ్వాసం. ఆయన మనల్ని - ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, మరణానంతర జీవితాన్ని, మంచీ చేదు విధివ్రాతలను విశ్వసించమని ఆజ్ఞాపించాడు.
ఇస్లామీయ ధర్మ శాస్త్రం అనేది "ఆచరణ" సంబంధితమైనది. అది ఇస్లామీయ సువ్యవస్థ, చట్టం మరియు జీవన విధానం. ఇది ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (స) వారి (సున్నత్) బోధనలలో వివరించబడింది.
అది మూడు ప్రధాన శాఖలను నియంత్రించే నియమాలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలను సూచిస్తుంది:
1-ఆచారాలు/ఆరాధనలు
2- నైతికత మరియు నీతి (ముస్లిం ప్రవర్తనలో అంతర్భాగంగా ఉండాలి)
3- వ్యక్తుల మధ్య లావాదేవీలు (సామాజిక/ఆర్థిక విషయాలు)
9. ఇస్లాంలో ఆరాధన (ఇస్లాం యొక్క 5 స్తంభాలు)
ఇస్లామీయ ధర్మ శాస్త్రంలో పేర్కొన్న ఆచారాలు మరియు ఆరాధనలు. (ఇస్లాం ధర్మ 5 మూల స్తంభాలు) ముస్లింగా మారడానికి, మీరు మొత్తం ఐదు స్తంభాలను తెలుసుకోవాలి.
(1) షహాదహ్ (విశ్వాస సంబంధిత రెండు సాక్ష్యాలు).
(2) అల్లాహ్ కోసం రోజువారీ ఐదు పూటల ప్రార్థనలను స్థాపించడం.
(3) ప్రతి సంవత్సరం రంజాన్ మాసపు పూర్తి ఉపవాసాలు పాటించడం. (ఉపవాసం).
(4) పేదవారికి వార్షిక జకాత్ చెల్లించడం.
(5) మక్కాలో ఉన్న కాబా గృహాన్ని ఉద్దేశించి జీవితకాలంలో ఒకసారి హజ్ చేయడం.
హజ్ ప్రయాణం సుమారు ఒక వారం పాటు కొనసాగుతుంది మరియు ప్రవక్త ఇబ్రహీం (అ) వారికి సంబంధించిన అనేక సంప్రదాయాలను నిర్వహించడం అవసరం. (మస్జిద్ హరామ్ లోపల మరియు వెలుపల).
10. ఇస్లాంలో చేయవలసినవి మరియు చేయకూడనివి
ముక్తసరిగా చెప్పాలంటే, మంచిని "చెయ్యండి" మరియు చెడు చేయడం మానుకోండి.
قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ (151)
“మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు:
1) ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు.
2- తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి.
3 - దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము.
4 - నీతిబాహ్యమైన పనుల దరిదాపులక్కూడా వెళ్ళకండి- రహస్యంగానైనా, బహిరంగంగానైనా సరే.
5 - న్యాయప్రాతిపదికపై తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ చంపకండి. మీరు అర్థంచేసుకొని మసలుకుంటారని అల్లాహ్ మీకీ విషయాలు బోధిస్తున్నాడు.
6 - అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకోనంతవరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి పోకండి.
7 - తూనికల్లో, కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. ప్రతి వ్యక్తిపై మేము అతను మోయగలిగినంత బాధ్యతాభారమే మోపుతాము.
8 - వ్యవహారం మీ బంధువులకు సంబంధించినదైనా సరే న్యాయంగా మాట్లాడండి.
9 - అల్లాహ్ విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. మీరు విషయాన్ని గుర్తుంచుకుంటారని దేవుడు మీకిలా హితోపదేశం చేస్తున్నాడు.
ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, మీరు ఈ మార్గానే నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని నచ్చజెప్తున్నాడు.
మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసలుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. (151-153)
ఇస్లాంలో ఘోర పాపాలు:
(1) విశ్వాన్ని మరియు అన్ని జీవులను సృష్టించిన దేవుని ఉనికిని తిరస్కరించడం (అంటే నాస్తికుడు). అదే విధంగా, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను కాకుండా ఇతర సృష్టిరాసులపై నమ్మకం మరియు ఆలాహ్ ఆరాధనలో వారిని భాగస్తులుగా చేర్చడం (షిర్క్).
(2) తల్లిదండ్రులకు అవిధేయత మరియు వారితో చెడుగా ప్రవర్తించడం.
(3) హత్య, ప్రజలను చంపడం మరియు ఆత్మహత్య చేసుకోవడం.
(4) వ్యభిచారం, వ్యభిచారం, స్వలింగ సంపర్కం మరియు లైంగిక వేధింపులు
(5) అనాథ సంపదను అక్రమంగా వినియోగించడం లేదా స్వాధీనం చేసుకోవడం.
(6) కొలతల్లో తూనికల్లో మోసం చేయడం. ఇతరులతో ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.
(7) న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పేటప్పుడు అసత్యం లేదా అబద్ధం చెప్పడం.
(8) అవసరమైన వ్యక్తులకు రుణమిచ్చేటప్పుడు వడ్డీ వసూలు చేయడం.
11. ఆహార పానీయాలు
కింది వాటిని మినహాయించి సముద్రపు ఆహారంతో సహా అన్ని ఆహారాలు (అంటే ఇస్లాంలో హలాల్) తినడానికి అనుమతి ఉంటుంది:
(1)పంది మాంసం,
(2) మాంసం తినే ఏదైనా జంతువు.
(3) చనిపోయిన జంతువులు.
(4) ఇస్లామీయ పద్ధతి ప్రకారం వధించబడని ఏదైనా జంతువు.
రక్తం మరియు ఆల్కహాలిక్ డ్రింక్స్ (ఉదా. వైన్) మినహా అన్ని పానీయాలు ధర్మసమ్మతమైనవి. మత్తుపానీయాలు తక్కువ తాగినా లేదా ఎక్కువ తాగినా మతి భ్రమించేలా చేస్తాయి.
12. డ్రస్ కోడ్
మహిళలు: యుక్తవయస్సు వచ్చినప్పుడు మాత్రమే శరీరం మరియు తల వెంట్రుకలను కప్పి ఉంచే నిరాడంబరమైన వస్త్రధారణ చేసుకోవాలి. పురుషులు: ప్రధానంగా నాభి (బొడ్డు ) నుండి మోకాళ్ల వరకు కప్పి ఉంచే నమ్రతతో కూడిన వస్త్రధారణ చేసుకోవాలి.
13. వారాంతం
ముఖ్యంగా ముస్లిం దేశాలలో శుక్రవారం ముస్లింలకు విశ్రాంతి దినం. వారు మసీదులో సామూహిక శుక్రవారం ప్రార్థనలు చేయవలసి ఉంటుంది మరియు ఒక చిన్న ప్రసంగాన్ని వినవలసి ఉంటుంది.
14. పండుగలు
చంద్రమానం ప్రకారం రెండు వార్షిక పండుగలు నిర్దేశించ బడ్డాయి.
ఈద్ అల్-ఫితర్: (3 రోజులు) రంజాన్ ఉపవాస నెల ముగింపులో.
ఈద్ అల్-అజ్హా : (4 రోజులు) (10వ-13వ తుల్-హిజ్జా) ఇది హజ్ ప్రయాణం సంబంధించిన మాసం. .
ఇస్లాంలో మూడు పవిత్ర స్థలాలు మాత్రమే ఉన్నాయి:
(1) మక్కాలోని మస్జిద్ హరామ్, ఇందులో కాబా ఉంది.
నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను కీర్తించడానికి మరియు ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన మొదటి ప్రార్థనా గృహం.
ప్రవక్త ఇబ్రాహీం (అ) దానిని పునర్నిర్మించారు. మరియు దాని అసలు పునాదిపై దాని గోడలను ఎత్తారు.
ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు మక్కాలోని మస్జిద్ హరామ్ లోని కాబా వైపు ముఖం చేసి ప్రార్థన చేస్తారు.
(2) మదీనాలోని ప్రవక్త ముహమ్మద్ (స) వారి మస్జిద్
ఇస్లామీయ సువ్యవస్థ వైపునకు ప్రస్థానం తర్వాత నిర్మించిబడిన మొదటి మస్జిద్.
మానవాళికి దేవుని సందేశాన్ని తెలియజేయడానికి ప్రారంభ స్థానం.
(3) ఫాలస్తీనా (జెరూసలేం)లోని అల్-అక్సా మసీదు, ఒకే ఒక్క నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ ను ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన రెండవ మసీదు. ఇది ఇస్లాంలో మొదటి "కిబ్లా" కూడా. ప్రార్థన సమయంలో దిశ కాబాకు మార్చడానికి ముందు ముస్లింలు ఈ దిశకు ముఖం చేసి ప్రార్థన చేసే వారు.
.jpg)
No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు