Friday, May 13, 2022

సాధన చేయుము నరుడా! సాధ్యం కానిది లేదురా!!

సాధన చేయుము నరుడా! సాధ్యం కానిది లేదురా!!

అది ఓ పెద్ద మైదానం.... ఈ రోజు జనకోలాహలంతో నిండి వుంది.... ఏమిటి... విశేషం... అని ఆలోచిస్తున్నారా...! విలు విద్యపోటీలు నిర్వహించబడుతున్నాయి.... పోటీ కాసేపట్లో ఆరంభం కానున్నది...!! విలు విద్యలో ఆరితేరిన వీరులు హాజరై ఉన్నారు. దూరాన ఐదు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. వీరుల దృష్టి మొత్తం వాటి పైనే ఉంది. పోటీ ఆరంభమయ్యింది.




ఓ వ్యక్తి వచ్చాడు... విల్లుని చేతిలో పట్టు కున్నాడు... బాణం అమర్చాడు.... గురి పెట్టాడు...
బాణం విసిరాడు....... కాని గురి తప్పాడు. రెండో వ్యక్తి వచ్చాడు..... ప్రయత్నిం చాడు.....! వైఫల్యం చెందాడు. మూడో వ్యక్తి వచ్చాడు....... మీసాలు మెలేసాడు...... తాడ కొట్టాడు... కండలు చూపించాడు.....! చతికిలా పడ్డాడు. అలా ఒకరి తరువాత ఇంకొకరు వస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ ఒకే ఒక్క లక్ష్యాన్ని కూడా సరిగా గురి పెట్టి కొట్టలేక పోతున్నారు. ఇది చూస్తున్న ప్రేక్షకుల్లో సైతం అసహనం చోటుచేసుకుంది. వారందరూ విసుగెత్తారు..... గురి పెట్టి కొట్టగలిగే సమ రుడు ఇంతమందిలో ఒక్కడు కూడా లేదా...? అని వాపోతున్నారు. అప్పుడు అక్కడ ఓ అద్భుత సంఘటన జరిగింది...... ప్రజలం దరూ దిగ్ర్భాంతి చెందారు........? ఒకడు లేచాడు...... విల్లు వద్దకు చేరు కున్నాడు..... విల్లు చేతిలోకి తీసుకున్నాడు....... లక్ష్యం ఎటువైపు వుందో చెప్పమన్నాడు... ఆ దిశకు తిరిగి నిలబడ్డాడు.....! ఏమిటి అన్ని అడగడమేనా...? అతనికి కనిపించదా..... అని మీరు ప్రశ్నించవచ్చు. అవును అతను కళ్ళు లేని ఓ కబోది, చూడలేడు పాపం. ఏ వస్తువునైనా కేవలం విని గ్రహించగలడు, లేదా స్పర్శ వల్ల తెలుసుకోగలడు. ఇప్పటికీ మీకు అర్థమయ్యివుంటుంది. ప్రేక్షకులు ఎందుకు దిగ్ర్భాంతికి గురయ్యారో...! వచ్చిన ఆ వ్యక్తి విల్లుపై బాణాన్ని పెట్టాడు..... వెనక్కి లాగాడు..... కాసేపు ఆగాడు. ఇటు ఆ దృశ్యాన్ని తిలకించే ప్రేక్షకుల గుండెలు ఆగిపోయేంత పని జరిగింది. వారంతా మౌన మూర్తులై శిలల్లా నిలిచివున్నారు. చూసే శక్తి, బాణం విసిరే నైపుణ్యం ఉన్న గొప్పగొప్ప వ్యక్తులు సాధించలేని ఈ లక్ష్యాలను ఓ కళ్ళు లేని కబోది ఛేదించగలడా? ఇది సంభవ
మేనా...! అతను గురి ఎరిగి బాణాన్ని విసి -రాడు...! ఏమయ్యింది..? బాణం . కరెక్టుగా లక్ష్యం మధ్యలో తగిలింది....! మైదానమంతా నిశ్శబ్దం..! తాము చూస్తున్నది కలా..! నిజమా...! అని వారికే అనుమానం కలుగు తోంది. వారు చూచినది వాస్తవం అని గ్రహిం -చిన మరుక్షణం.... మైదానమంతా చప్పట్లు,
ఈలల ధ్వనితో మారుమోగింది. అలా అతను ఒకటి తరువాత మరొకటంటూ ఐదు లక్ష్యా లను గురి పెట్టి కొట్టి తిరుగులేని విజేతగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఏమిటి కథలు చెబుతున్నారా......? అని మీరు నన్ను నిలదీయవచ్చు. కానీ, నేను చెప్పింది అక్షరాల నిజం...! వాస్తవంగా జరిగిన సంఘటన.....! నమ్మబుద్ధి కలగటం లేదా...? అయితే రండి....! అలాంటిదే ఓ సజీవగాధను చదువుదాం.... అసంభవం ఎలా సంభవ మయ్యిందో తెలుసుకుందాం!

బాల్యం
 జలపాతములు, జలకములు, సరస్సులు, సుమ వనములు, జలజలపారే సెలయేరు, గలగల పారే నదితీరు, ప్రకృతి రమణీయం, సౌందర్యం, సింహగర్జనలు, సింధూర పవనములు, కోయిల రాగాలు, నెమలి నాట్యాలు, చూడటానికి వేయి కళ్ళు చాలవు. వేయి కళ్ళమాట అటుంచి, చూచి ఆనందించడానికి ఒక్క కన్ను కూడా లేని వాడతను. అతను ఏడు సంవత్సరాల బాలుడు....... ఇంటి బైట వీధిలో నుంచొని వున్నాడు. పిల్లల మాటల గలగలలు అతన్ని మైమరపిస్తున్నాయి. వారందరూ 'పట్టుకోండి చూద్దాం' ఆట ఆడుకుంటున్నారు. వారితో కలిసి తానూ ఆడాలని ఆ పసిహృదయం ఆరాటపడుతోంది. నేటి ఈ వింత ప్రేరణ అతన్ని గిలిగింతలు పెడుతూవుంది. అతనిలో ఎక్కడలేని ఉత్సాహం చోటు చేసుకుంది. ఒక్కసారిగా శబ్దం వస్తున్న వైపునకు పరుగెత్తాడు. ఆ బాలుడు.... కొన్ని క్షణాలు తను అంధుడన్న విషయం మరిచాడు....... కళ్ళు గట్టిగా మూసు కొని చేతులు చాచి నలువైపులా తిరుగుతూ ఏ ఒక్కరినైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తు న్నాడు....! ఎవరూ దొరకడం లేదు!! కళ్ళు చెరిచి చూస్తే కనిపిస్తారేమోనని కళ్ళు తెరిచాడు. కాని అంతా చీకటిమయం ...! అప్పుడు అతనికి బోధపడింది తను గుడ్డివాడినని. తను కళ్ళు మూసుకున్నా తెరచినా... తనకు ఎదురయ్యేది చీకటేనని. అతని మనసంతా ముడుచుకు పోయింది. అతని ముఖం వాడిన పువ్వలా మారింది. దుఃఖ విషాన్ని దిగమ్రింగుతూ ఇంటివైపు తిరుగుముఖం పట్టాడు ఆ బాలుడు.

జ్ఞానోదయం ఇప్పుడు అతను యవ్వనస్తుడయ్యాడు. బాల్యం నుండి ఈనాటి వరకు తను కేవలం విని జీవించినవాడే గాని దేన్నీ చూసి ఎరుగడు. పెరిగిన వయస్సు అతన్ని ఓ కళాకారుణ్ణి చేసింది. వినే ప్రతి వస్తువుకి దాని వర్ణనలను బట్టి తన మనోఫలకంపై చిత్రాలు గీసుకునే వాడు. తియ్యటి కమనీయమైన కోయిల రాగాన్ని విన్న అతను ఈ స్వరంలా కోయిల కూడా బహు సుందరంగా వుంటుందను కొన్నాడు. అలాంటి కోయిల చిత్రమే అతని మదిలో చోటుచేసుకుంది. ఈ రోజు అతను ఓ వింత వార్త విన్నాడు. మక్కాలో ముహమ్మద్ అని పేరుగల ఓ వ్యక్తి కొత్త ధర్మాన్ని బోధిస్తు వాడట... మిథ్యాదైవాలను వదలి నిజదైవాన్ని ఆరాధించమంటున్నాడట... అనైతిక చర్యల్ని స్వస్తి పలికి, సభ్యత సంస్కారాలు అలవర్చు కోండని ఉపదేశి స్తున్నాడట...! అతను ఆలో చిస్తున్నాడు. ముహమ్మద్! ముహమ్మద్.....!! ఈ పేరు తను అనేకసార్లు విన్నాడు అని గుర్తుకు వచ్చింది. అవును బాల్యంనుండి ఆయన్ను ప్రజలు కీర్తిస్తూవుంటే తను విన్నాడు. ఆయన్ను ప్రజలు సాదిక్, అమీన్ అని ముద్దుగా పిల వడం కూడా తనకు గుర్తుంది. ఎవరూ తన్ను వచ్చి పరామర్శించకపోయినా ఆయన మాత్రం మరచి పోకుండా వచ్చి తన్ను పరామర్శించి, యోగక్షేమాలు అడిగి మరీ వెళ్ళేవారు. ఈరోజు స్వయంగా తనే వెళ్ళి ఆయన్ను కలుసుకోవా లని నిశ్చయించుకున్నాడు. ప్రవక్త(స)గారు ఎక్కడున్నారో అడిగి తెలుసుకున్నాడు. చివరికి ప్రవక్త(స)గారి దర్బారులో హాజరయ్యాడు. ప్రవక్త(స) తన సహచరులకు దైవం గురించి ధర్మం గురించి చెబుతున్నాడు. "పర్వతాలకూ, సముద్రాలకూ, ఆకాశాలకూ,
భూములకూ, సూర్యచంద్ర నక్షత్రాలకూ, సకల చరాచర సృష్టికి మూలం అల్లాహ్" అన్నారు. కాని అతనికి బోధపడలేదు.... ఎందు కంటే? తను ఎన్నడూ పై పేర్కొన్న ప్రకృతి మమయాన్ని కళ్ళతో చూడలేదు. అవి ఎలా ఉంటాయో కూడా తనకి తెలియదు" అప్పుడు ప్రవక్త(స) ఇలా అన్నారు. అల్లాహ్ యే మనం దరికి మాట్లాడేశక్తి నిచ్చింది, ఆయనే మనకు చేతులు, కాళ్ళు ప్రసాదించింది. ఆయనే మనకు వినే శక్తిని అనుగ్రహించింది. ఆయనే మనకు ప్రాణం పోసింది. ఇప్పుడు అతనికి అర్థమయింది. తమ అక్కడున్న ఓ వ్యక్తికి “అల్లాహ్ ఎలా వుంటాడని' ప్రశ్నించాడు. అల్లాహ్ కు భౌతిక ఆకారం లేదని, భౌతిక నేత్ర ములతో ఆయన్ను చూడలేరని సమాధానం లభించింది. అంటే చూసే శక్తి వున్నవారికి కూడా ఆయన్ను చూసే భాగ్యం లేదన్నమాట. ఇక నాకు కళ్ళు లేవన్న బాధకూడా పోయింది. అని లోలోన మురిసిపోతున్నాడు ఆ అంధుడు. ప్రవక్త గారి మాటలతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది.

ప్రవక్త (స) ఇలా అన్నారు. “అల్లాహ్ దగ్గర ఆమోదిత ధర్మం ఇస్లాం మాత్రమే. (దివ్యఖుర్ఆన్: 3:19) ఎవరు దైవవిధేయతా మార్గం ఇస్లాం కాదని ఇతర జీవిత విధానాలను (శాంతికి, స్వయం సమర్పణకి వ్యతిరేక ధోరణుల్ని) అవలంభించ గోరుతారో వాటిని ఎన్నటికీ ఆమోదించడం జరగదు (దివ్యఖుర్ఆన్: 3:85) అన్న దైవ వచనాలు స్వయంగా ప్రవక్తశ్రీ(స) గారి నోట విన్న తక్షణమే.... తన చూపుడు వ్రేలును, ఏ వ్రేలునైతే తను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదో, ఆకాశం వైపు ఎత్తిచూపుతూ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అప్పదు అన్న ముహమ్మదుర్రసూలుల్లాహ్' అంటూ తన్నుతాను అల్లాహ్ కు ఆయన ప్రవక్త(స) గారికి సమర్పించుకున్నాడు. ఏమిటి ఆశ్చర్యపడుతున్నారా! కళ్ళున్న వేలాది మంది విద్యావంతులైన వందలాదిమంది, వాణిజ్య బృందాలను నడిపే అనేకమంది, కండబలాం- గుండెబలం, మంది మార్బలం  వున్న ఇంతమంది గ్రహించలేని సత్యాన్ని, ఛేదించలేని లక్ష్యాన్ని ఓ గుడ్డివాడు గ్రహించడమా...! ఓ చూసేశక్తి లేని దౌర్భాగ్యుడు ఛేదించడమా...!! అవును... అతను గ్రహించాడు. తను గ్రహించేలా స్వయంగా అతని ప్రభువే నిర్ణయించాడు. అతని ప్రవర్తన ఆ సర్వేశ్వరుడికి నచ్చింది". అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు. “ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లామ్ కై తెరిచాడో అతను తన ప్రభువునుండి లభించిన కాంతి మార్గంలో నడుస్తాడు" (దివ్యఖుర్ఆన్: 39:22)

ఈ పై వచనంలో అల్లాహ్ ఇస్లాంపై మనిషి హృదయకవాటాలను తెరుస్తాడని పేర్కొనడం జరిగింది. అంతేకాని కనురెప్ప లను తెరుస్తాడని పేర్కొనబడలేదు. దివ్య కాంతితో కొంతిమయమైవున్న అతని హృదయంతో, తను సత్యజ్యోతిని గ్రహించ గలిగాడు. మీరు అతన్ని ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించలేని ఓ దౌర్భాగ్యు డన్నారు. కాదు. వాస్తవ దృక్పథంతో గనక గ్రహించినట్లయితే ప్రపంచ మంతటిలో - అతనకి మించిన సౌభాగ్యవంతుడు ఈనాడు -. మరొకడు లేడు. నేడు అతని హృదయం అనందంతో సంతోషంతో పొంగిపొర్లుతోంది. అమందానంద కందళిత హృదయారవిందుడై అతని ముఖం కోటి కాంతులీనుతోంది.  ఇక దౌర్భాగ్యుడెవరని అంటారా.... చూడగలిగే వశక్తి... చేయగలిగే బలం ఉన్నా, సత్యస్వీకారం నుండి తన హృదయచక్షువులను మూసుకున్న వారు. వీరికి కళ్ళున్నాయి. కా ని  సత్యాన్ని గ్రహించే హృదయం కరువైయ్యింది.

 “అల్లాహ్ హితబోధతో మరింత కఠిన హృదయులై పోయిన వారికే కీడు మూడి వుంది. వారే ఈ ప్రపంచమంతటిలోనూ అత్యంత చెడ్డ  దౌర్భాగ్యులు. (దివ్యఖుర్ఆన్: 39:22)

ఇంకా తను సాధించిన లక్ష్యాలేమిటో ఒక్కొక్కటిగా తేలుకుందాం! తన స్థాయి ఏమిటో మన స్థాయి ఏమిటో బేరీజు వేసుకుందాం!!
(సశేషం)

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు