ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సంఖ్యలో ముస్లింలు నివసించే భారత దేశంలో వారిని సర్వనాశనం చేయ డానికై సన్నాహాలు సాగుతున్నాయి. ప్రస్తుతం పూర్తి ముస్లిం సముదాయం నిరాశ నిస్పుృహలకు లోనై ఉంది. ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. రెక్కలు తెగి నేలకొరిగిన పక్షిలా వారి స్థితి మారిపోయింది. తరుణోపాయం కోసం వారందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అని ఆశలు పెంచుకొని బ్రతుకుతున్నారు.
ఇట్టి క్లిష్ట స్థితిలో మరొక్కసారి రమజాను మాసం
ముస్లిం సముదాయంపై కారుణ్య మేముమై
వాలింది. రమజాను మానం భయంకర ఎడారిలో జలనిధి శుభవార్తను, బంజరు భూమిలో బంగారు వంట కబురును
మోసుకొచ్చే సుగంధ భరిత పవనం. ఈ మాసంలో సత్కార్యాలు, పుణ్యవతాలు ఏరులై పారుతాయి. దానికితోడు ఈ మాసం దళిత జనాల పాలిట, పీడిత ప్రజల పాలిట విప్లవ నాదం, మార్పుకి చిహ్నం కూడా. కారుణ్య గ్రంథం ఈ
మాసంలోనే అవతరిం చింది. ఈ ఉధ్రంధం అన్యాయాన్ని, అక్ర మాల్ని, దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని అంతమొం దించింది. ఈ గ్రంథరాజం మూలంగానే పీడిత ప్రజలు, దళిత జనాలు, పాలిత ప్రజలు పాలకులయ్యారు.
గొర్రెల్ని మేపే కృషీవలులు, ఒంటెల్ని తోలుకునే శ్రమజీవులు సభ్యతా సంస్కారాల్ని వెదజల్లే చిరుదివ్వె
లయ్యారు. అబ్దుల్లా ముద్దుల కొడుకు ముహమ్మద్ ఈ దళిత జనాల నుంచి ఉద్భ వించిన
నాయకుడే. అవిశ్వాస అంధకారాల్లో కొట్టుమిట్టాడే మానవాళికి దివ్యతేజమై, ఉదయ భానుడై వెలిగాడు. ఆయనపై తొలి దైవవాణి
అవతరించి, ఆయనకు దైవదౌత్యం
ఒసగబడింది. ఈ మాసంలోనే. ఫిరౌను కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించే తౌరాత్ గ్రంథం
కూడా ఈ మాసంలోనే లభించింది. యూద జనాల్ని, ఇస్రాయీలు ప్రజల్ని ప్రభువు మార్గాన నడిపేందుకు వచ్చిన ఇద్దీల్ (సువార్త-
దేవుని సువార్త) గ్రంథం సైతం ఈ మాసంలోనే అవతరించింది. నియంత నమూదు ఎదిరించేందుకు, బూటకపు దైవాల్ని మట్టికరిపించేందుకు, దాసుల మెడలలో పడివున్న శృంఖాలను క్రౌంచేం
దుకు 'సుహుఫ్ ఇబ్రాహీమ్' ఈ మాసంలోనే ఇవ్వబడ్డాయి.
ఉదయం సాయంత్రాలు దైవమహిమను కొనియాడేందుకు జబూర్ గ్రంథం ఈ
మాసంలోనే వచ్చింది. ఈ మాసంలో బద్రి సంగ్రామం జరిగింది. ఈ దినాన్నే ఖుర్ఆన్ 'యౌముల్ ఫుర్ఖాన్'గా పేర్కొంది. ఈ సమరం సత్యానికి అసత్యానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగింది.
సత్యాసత్యాలకు గీటురాయిగా నిలిచింది. ఈ సత్యపోరాటంలో అల్లాహ్ అవిశ్వాసపు వ్రేళ్ళను
కూకటి వేళ్ళతో సహా పెకళించాడు. మక్కా విజయం కూడా ఈ మాసంలోనే ప్రాప్తి మయింది. ఇది
కేవలం మక్కా పరిసరాలకు పరిమితమయిన విజయం కాదు. పూర్తి ప్రపంచపు రాజకీయ వ్యవస్థ
మార్పుకి సంకేతం. ఈ మాసంలోనే అజాన్ కూడా షరీయత్ విభాగంలోకి వచ్చింది. ఇది తౌహీద్
నినాదం.
ఘంటారావంగా 'దేవుడు ఒక్కడే' అన్న పిలుపును విశ్వమానవాళికి చేరవేసే అజాన్
నాదం. నాటి నుంచి నేటివరకు, నేటి నుండి ప్రళయం వరకు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నిర్విఘ్నంగా సృష్టి
మొత్తంలో వినబడే ఏకేశ్వరోపాసనా పిలుపు. అమ్ బిన్ ఆస్ సారధ్యంలో ఈజిప్టుపై విజయ
ఢంకా ఈ మాసంలోనే మ్రోగించబడింది. ఈ నెలలోనే తారిఖ్ బిన్ జియాద్ ఉందులుస్ (ఫ్రాన్స్)ను జయించారు. 16 ఏళ్ళ నూనుగు మీసాల
కుర్రోడు ముహమ్మద్ బిన్ ఖాసిమ్ రాజా దాహిర్‌ను ఓడించి సింధూ ప్రాంతాన్ని ఇస్లామీయ
రాజ్యంలో విలీనపర్చింది ఈ మాసంలోనే. ఈ నెలలోనే ఇమాదుద్దీన్ జంకీ శిలువ క్రూసేడులపై విజయ కేతనాన్ని ఎగుర
వేసింది. ఉస్మానీయ పరిపాలకులు ఈ మాసంలోనే 'హంగదే'ని తన కైవసం చేసు
కున్నారు. ఈ సంఘటనలన్నీ ఇచ్చే సందేశం - రమజాన్ మాసం శుభప్రదాయిని, కారుణ్య వర్షిణి మాత్రమే కాదు, అది ముస్లింల పాలిట విజయ పరంపరల సువార్తలను
అందజేసే మాసం.
పరీక్షలు, ఇక్కట్లు, ఇబ్బం దులు ఈ సముదాయపు
అంతర్భాగాలు. దాని చరిత్రలో సమస్యల సునామీలు, పరీక్షల తుఫానులు లేని కాలమంటూ ఏదీ లేదు. అయినప్పటికీ చరిత్ర ఇచ్చే సాక్ష్యంఈ
సముదాయం పడుతూ పడుతూ కూడా ఉవ్వెత్తున లేచింది. మరణ ఘడియలు దీనికి ఆవహించాయి అని
అందరూ అన్న నాజూకు నమయంలో కూడా జీవం పోసుకుని నిండు యవ్వనాన్ని సంపాదించు కుంది.
కారణం- 'పదివేల పౌరుల రక్తంతోనే, త్యాగంతోనే విజయం సాధ్యం' అన్న మాటను అక్షరాల నమ్మినవారు వీరు.
ప్రతి ఎడారి తర్వాత ఒక ఉద్యానవనం ఉంటుందని, ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉండి
తీరుతుందన్నది వీరి ప్రగాఢ నమ్మకం. వీరు ఎవరూ ఎరగనంతటి ఆశాజీవులు. విజయపరంపరలు
వీరి లక్షణాలు. పరాజయం మీద పరాజయాలు వీరు ఎరుగరు. కాబట్టి శుభప్రదమైన ఈ మాసంలో, విప్లవాత్మకమైన ఈ నెలలో నింగికీ నేలకి
నిచ్చెన వేయాలన్న స్ఫూర్తితో ప్రతి వ్యక్తి సంసిద్ధమవ్వాలి. సలహా సంప్రదింపులతో
కొంక్రొత్త ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఇది మన లక్ష్యం అంటూ ముందుకు
దూసుకుపోవాలి. రమజాను నెలవంక మన జీవితాల్లో విప్లవ జ్యోతియై వెలగాలి. విప్లవం
అనేది మనలో ప్రతి వ్యక్తి తన్నుతాను మార్చుకోవాలి, గొప్పగా మలచుకోవాలి అన్న ఆత్మపరిశీలనతోనే వస్తుంది. నిజం ఏమిటంటే“నిజంగా
అల్లాహ్ కూడా ఆ జాతి దుస్థితిని మార్చడు. ఏ జాతి అయితే స్వయంగా తన మనోస్థితిని
మార్చుకోదో. అల్లాహ్ ఏ జాతి నయినా శిక్షించదలచుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే
ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించేవాడు కూడా ఎవరూ ఉండరు."
(దివ్యఖుర్ఆన్- అరోరాద్:11)
వ్యవస్థ - అది ఎంత బలమైనదైనా, సిద్ధాంతం- అది ఎంత ఉత్తమమైనదైనా, కేవలం అనుసరించినందు వల్ల సమైక్యత, సాఫల్యం సిద్ధించదు. విస్తృతమైన, ప్రగాఢమైన ఎరుక, చైతన్యం, విప్లవభావం ఉన్న ప్పుడే
అది సాధ్యమవుతుంది. ఈ ఎరుక చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ఊరికే పైపై ఉత్తుత్తి
ఫలితాలతో తృప్తి పడితే చాలదు. ఇస్లాంను అప్రచారం పాట్టేస్తున్నారన్నది నిజమే.
కానీ...., 'సముద్రానికి చమురు పూస్తే
జిడ్డు పడు తుందా? హిమ నగానికి బాగు పూస్తే నల్లబడుతుందా? లేదు కదా! మరి పోరాడుతూ, పోరాడుతూనే ఉండండి. చివరి శ్వాస ఆగే వరకు. పోతూ పోతూ ప్రేమను పంచండి. లోక
శాంతి, విశ్వకళ్యాణం సిద్ధించే
వరకు.

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు