@1.1
పారభాషికాలు
షరీఅహ్: అల్లాహ్ తన దాసుల కోసం ఖుర్‌ఆన్ మరియు హదీసుల ద్వారా నిర్దేశించిన విశ్వాసపరమైన, ఆచరణ పరమైన నియమాలు.
ఫిఖహ్: వివరాణాత్మకమైన
ఆధారాల ద్వారా గ్రహించబడిన షరీయతులోని ఆదేశాల జ్ఞానం. మరోలా చెప్పాలంటే మానవ మేధ అవగాహన
మేరకు షరీయతు ఆదేశాలను క్రియా రూపం ఇవ్వడం.
1.2 ఇస్లామీయ శాస్త్రానికి, కృత్రిమ
సిద్ధాంతాలకి మధ్య వ్యత్యాసం.
1.మానవ నియమావళికి బదులు దైవ
నియమావళి.
2.ఇస్లామీయ శాసనోల్లంఘనకు శిక్ష
ప్రపంచంలోనూ పరలోకంలోనూ ఉంటుంది. అదే కృత్రియ శాసనోల్లంఘనకు శిక్ష ప్రపంచంలో మాత్రమే ఉంటుంది.
3. ధర్మ శాస్త్రానికి, సంబంధించిన ఆదేశాలు
అన్ని కాలాల, ప్రాంతాల ప్రజలకు అమలు పర్చేందుకు అనుకూలంగా ఉంటాయి. అవే కృత్రిమ సిద్ధాంతాలు-
అవి కేవలం కొందరి అభిప్రాయాలు, మరియు అనుభవాలు మాత్రమే. అని ఏక కాలంలో అందరికి ఉపయోగపడజాలవు.
1.3 ఇస్లామీయ శాస్త్ర నియమాలు
1. ఇహపరాల్లో దైవ దాసుల్లో శ్రేయోసాఫల్యాలను
ఇవ్వడం
2. అమలుపర్చేందుకు సులభతరం అయ్యేందుకు.
నైతిక విలువలు, దైనందిన చర్యలు నియమాలు అందజేయడం.
3. శాస్త్ర ఆదేశాలు క్రియానుసారం
ఉండాలి.
4. సౌలభ్యాన్ని కలుగజేయడం, ఇబ్బందికరమైన స్థితిని
తొలగించడం.
5. న్యాయ సంస్థాపన.
1.4 ఇస్లామీయ శాస్త్ర మూలాలు (ఫిఖహ్):
1. ప్రధమ స్థాయి మూలాలు: ఖుర్‌ఆన్
మరియు హదీసు.
2. ద్వితీయస్థాయి మూలాలు: ఏకగ్రీవం, అంచనా. (ఇజ్మా, ఖియాస్)
1.5 ఇస్లామీయ ఫిఖహ్ పాక్షికాలు
ఫిఖహ్ పుస్తకాలు
(వేటిలోనైతే ఖుర్‌ఆన్ మరియు హదీసు ద్వారా, ఇజ్మా మరియు ఖియాస్ ఆధారంగా ఆదేశాలుంటాయో అవి)
వాటిని ఏడు భాగాలుగా
విభజించారు.
నం భాగం అంశం ఉదాహరణలు
1 ఆరాధనలు ఆరాధనలు చేసే శుచీశుభ్రతలు,నమాజ్,ఉపవాసం,జకాత్,హజ్
2 వ్యక్తిగత
విషయాలు కుటుంబ పరమైన వివాహం,విడాకులు,వంశావలి,పోషణ,వారసత్వం
ఆదేశాలు మొదలగునవి
3 వ్యవహారాలు ప్రజల సంబంధాలకు వ్యాపారం,లాభం, వ్యవసాయం మొదలయినవి
సంబంధించిన ఆదేశాలు
4 పరిపాలన
ఆదేశాలు రాజు మరియు ప్రజలకు రాజ్యన్యాయ సంస్థాపన దుర్మార్గ
సంబంధించిన ఆదేశాలు. నిర్మూలన
5 శిక్షలు నేరస్థులకు సంబంధించిన దాంపత్యం, వ్యభిచారం,
శిక్ష ఆదేశాలు, అత్యాచారం వగైరా...
6 బైట
వ్యవహారాలు యుద్ధం మరియు ఒప్పందాలకు
సంబంధించిన
ఆదేశాలు
7 నీతి నియమావళి ఉత్తమ లక్షణాలకు సంబంధించిన
ఆదేశాలు
మొదటి చాప్టర్-1 ఫిఖహ్ పాక్షికాలు
నిశ్చయంగా ఇస్లామీయ
ఫిఖహ్ మనిషి సంఘసమాజానికి అవసరమైన సకల విధమైనటువంటి ఆదేశాలు కలిగి ఉండటం మనం గమనించగలం
1.6 ఫిఖహ్ పారిభాషికాలు
1. ఫర్జ్: ఖచ్చితంగా చేయవలసిందిగా
షరీయతు ఆదేశం. దీన్ని చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, విడనాడటం వల్ల పాపం కలుగుతుంది.
2. ఫర్జె ఐన్: యుక్త వయసుకు చేరిన ప్రతి వ్యక్తి ద్వారా ఖచ్చితంగా కోరబడే ఆదేశాలు. ఉదాహరణకు
నమాజు. రోజ, హజ్ స్తోమత గలవారి కోసం. ఈ ఆరాధనల్ని ప్రతి వ్యక్తి పాటించి తీరాల్సిందే. కొందరు
పాటించి కొందరు వదిలేస్తే విధి నెరవేరదు.
3. ఫర్జె కిఫాయా: ముస్లింల ఒక సమూహంతో కోరబడే ఆదేశాలు. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం లేదు. అంటే
కొందరు ఈ విధిని నిర్వర్తిస్తే మిగతా వారు మినహాయించబడతారు. ఏ ఒక్కరూ పాటించకపోతే అందరూ
పాపాత్ములవుతారు. ఉదాహరణకు: జనాజా నమాజు, శవ సంస్కారాలు వగైరా.
4. సున్నతు: సున్నత్ లేదా మన్దూబ్, చేయమని షరీయతు కోరిందేగాని
ఖచ్చితంగా చేయాలని ఖరారు చేయని కార్యాలు వాటిని
పాటించడం వల్ల పుణ్య లభిస్తుంది, వదలడం వల్ల ఎలాంటి పాపం ఉండదు.
5. సున్నతె ముఅక్కదా: ఏ క్రియల్నయితే దైవప్రవక్త(స)
జీవితమంతా క్రమం తప్పకుండా పాటించారో ఒకటి రెండు సార్లు తప్ప అవి.
6. సున్నతె ముస్తహబ్బహ్: ఏ కార్యాల్నయితే దైవప్రవక్త (స) కొన్నిసార్లు చేశారో,మరి కొన్ని సార్లు
వదిలేసారో అవి.
7. ముబాహ్: వీటిని చేయడం విడనాడటం
రెండూ సమానమే. వీటిని చేయాలనిగాని, విడనాడమనిగాని షరీయతు ఆదేశం లేదు గనక వీటి చేయడం
చేయకపోవడం వల్ల ఎలాంటి పుణ్యము పాపము లభించదు.
8. మక్రూహ్: విడనాడమని ఖచ్చితంగా
కోరని విషయాలు.
9. హరామ్: షరీయతు ఖచ్చితంగా
అధర్మంగా ఖరారు చేసినది. వీటిని విడనాడటం వల్ల దైవవిధేయత, మరియు చేయటం వల్ల
పాపం, శిక్ష పడుతుంది.
10. ఇజ్మా: ఏ కాలమందైననూ ధర్మపండితులందరూ
కలిసి ఏదేని విషయంలో ఏకగ్రీవంగా అంగీకారం తెలుపడం, అలా అంగీకరించబడిన
విషయాన్ని అమలు పర్చడం తప్పనిసరి అయిపోతుంది.
11. ఖియాస్: షరీయతు పరమయిన ఆదేశాలు
లేని, దొరకని విషయంలో కారకాలు, అవసరాలను బట్టి మానవ మేధననుసరించి తీర్మానించే విషయాలు. అయితే
ఈ విషయంలో ముందు ఖుర్‌ఆన్,
హదీసులను, తర్వాత ఇజ్మాను సంప్రదించాల్సి ఉంటుంది.
1.7 ఫిఖహ్ అభివృద్ధి
1.ప్రవక్త(స) వారి కాలంలో ఫిఖహ్
2.సహాబాల కాలంలో ఫిఖహ్
3. నాలుగు మస్లక్‌ల ఆధారంగా ఫిఖహ్
- ఇమామ్ అబు హనీఫా నొమాన్
బిన్ సాబిత్ కూఫీ. (హిజ్రి శకం 80 - 150)
- ఇమామ్ అబూ అబ్దుల్లా మాలిక్
బిన్ అనస్ (హిజ్రి శకం 93 - 179)
- ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్
బిన్ ఇద్రీస్ షాఫయీ (హిజ్రి శకం 150-204)
- ఇమామ్ అబూ అబ్దుల్లా అహ్మద్
బిన్ హంబల్ షైబానీ (హిజ్రి శకం 164-241)
పరీక్ష 1
సరైన పదాలతో ఖాళీ స్థలాలను పూరించండి:
(అ) త్రాగటం (ఆ) ఫర్జ్ (ఇ) సున్నత్ (ఈ) షాఫయీ
(ఉ) నిద్ర
1.ఖుర్‌ఆన్ మరియు......................................ఇస్లాం
షరీయతు మూలాలు.
2. ......................మరియు................................ ఇస్లాంలో ముబాహ్ క్రిందికి వస్తాయి.
3. చేయడం వల్ల పుణ్యం, చేయకపోవడం వల్ల పాపం
దాన్ని........................... అంటారు.
సరైన సమాధానం ఎన్నుకోండి:
4. సువార్త ఇస్లామీయ షరీయతు మూలాల్లోని
ఒక మూలం
(ఎ) అవును
(బి) కాదు
క్రింద ఇవ్వబడిన పారభాషికాలకు సరైన అర్థం ఎన్నుకోండి
(ఎ) ఖుర్‌ఆన్ 6. చేస్తే పుణ్యం చేయకపోతే పాపం లేదు
(బి) ఇజ్మా 7. చేస్తే పాపం, వదిలితే పుణ్యం
(సి) ఖియాస్ 8. ఇస్లామీ షరీయతుకి ప్రథమ మూలం
(డి) ఫర్జ్ 9. వదిలితే పుణ్యం లేదు చేస్తే పాపం ఉండదు
(ఇ) సున్నత్ 10. చేస్తే పుణ్యం లేదు,వదిలితే పాపం
(ఎఫ్) హరామ్ 11. చేయడం చేయకపోవడం రెండు సమానమే
(జి) మక్రూహ్ 12.ఏకాలమందైననూ ధర్మపండితులందరి ఏకగ్రీవ అభిప్రాయం
(ఎచ్) ముబాహ్ 13.షరీయత్ ఆదేశంలేని విషయంలో కొన్ని ఆధారల రీత్యా
ఏర్పరచుకొనే అభిప్రాయం.

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు