పియసోదరులారా! మీకు శాంతి కలుగుగాక!
ప్రపంచంలో ఎంతో శ్రేష్ఠధర్మం అయిన ఇస్లాం ముస్లిములకు మాత్రమే సం బంధించి నదైతే, దైవప్రవక్త ముహమ్మద్ (స) ముస్లిములకు మాత్రమే ప్రవక్త అయితే, ముస్లిమేత రుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది? వారు నిస్పృహకు గురి కావచ్చు, ఈర్షా - అసూయలకు గురికావచ్చు. చివ రకు విద్వేషానికి దారితీయవచ్చు. కాని నిజం చెప్పాలంటే ఇస్లాం, దైవ ప్రవక్త ముహమ్మద్(స) తమ సొంత మని చెప్పుకునే హక్కు ఏ ముస్లింకూ లేదు. అంతే కాదు అలా చెప్పుకునే ఆధారం ఏదీ వారి వద్ద లేదు.
మరి,దైవప్రవక్త ఎవరన్నది ప్రశ్న. ఆయన ముస్లిములకు, క్రైస్తవులకు,హిందువులకు, నాస్తికులకు, హేతువాదులకు, ఇంకా చెప్పా లంటే ఎలాంటి ధర్మం లేనివారికి ప్రవక్తే. ఇలా చెప్పడానికి మనవద్ద అవసరమైన నిరూపణ దివ్య ఖుర్‌ఆన్‌లో ఉన్నది. 'దైవ ప్రవక్తలు' అన్న అధ్యాయంలో దేవుడు
''మహాప్రవక్త ముహమ్మద్(స) యావత్ మానవాళికి కారుణ్యం'' అని పేర్కొన్నాడు.
''ఆయన మాకు కూడా ప్రవక్తేనా!'' అని క్రైస్తవ సోదరులు అడగవచ్చు. ''అవును'' అన్నదే జవాబు. ఎందుకంటే, క్రైస్తవులు కూడా గ్రంథ ప్రజలేనని ముస్లిములు విశ్వసిస్తారు కనుక. ఖుర్‌ఆన్‌లో ఈ విషయమై ''గ్రంథ పజలారా! నిజంగా మా ప్రవక్త మీ మధ్యకు వచ్చాడు'' అని దేవుడు పేర్కొన్నాడు. క్రైస్తవుల మధ్యకు మహాప్రవక్త వస్తారన్న సూచనపై ఖుర్‌ఆన్ వాక్యంలో ఉంది. యావత్ మానవాళికి దైవప్రవక్త. అయితే క్రైస్తవులు ఈ వాద నను ప్రశ్నించవచ్చు. తమ గ్రంథాల నుంచి ఈ విషయమై రుజువు కోరవచ్చు. కొత్త నిబంధనలో స్వాంతన నిచ్చే వాని ఆగమనం గురించిన అధ్యాయంలో ఈ వాస్తవం స్పష్టంగా ఉంది. క్రీస్తు స్వయంగా తెలిపిన మాటలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రస్తావించబడిన ''స్వాంతన నిచ్చువాని'' గుణగణాలకు ప్రవక్త ముహమ్మద్(స) గుణ గణాలకు మధ్య పూర్తి సారూప్యం ఉంది.
ఈ వాస్తవాన్ని క్రైస్తవులు గుర్తిస్తే, దైవప్రవక్త ముహమ్మద్(స) ను వారు తమ ప్రవక్తగా అంగీకరించి తీరుతారు.
హిందువులకూ ప్రవక్తే
ఒక అరేబియా నివాసి భారతదేశ హిందువులకు ప్రవక్త ఎలా అవుతారని మీరు అడగ వచ్చు. కాని మనం హిందూ గ్రంథాలను చది వితే, ముఖ్యంగా రుగ్వేదంలో, భవిష్య పురాణంలో కొన్ని శ్లోకాలు ఎడారి నుంచి వచ్చే, ఒంటె అధిరోహించే ప్రవక్తను గురించి కనబడ తాయి. ఆ ప్రవక్త పేరు 'మహామథ్'గా ప్రస్తావించ బడింది. అది మహాప్రవక్త ముహ మ్మద్(స) పేరు తప్ప మరొకటి కాదు.
నా ఈ విశ్లేషణ ఒక హిందూ పండితునికి ఆగ్రహ కారణం అయ్యింది. హిందూ పురా ణాల్లో లేనిదంటూ ఏదీ లేదని వాదించాడు. కోపం పట్టలేక నన్ను తీక్షణంగా నిలదీస్తూ హిందూ ధర్మంలో లేని కొత్త సందేశం ఇస్లాంలో ఏముందో చెప్పమని ప్రశ్నించాడు.
అతని ఆగ్రహం చూసి నేను చిరునవ్వుతో, ఇస్లాంలో ఎలాంటి కొత్త సందేశం లేదని అంగీకరించాను. అంతేకాదు, మునుపటి ప్రవక్తలు, దివ్య గ్రంథాలలోని సందేశం తప్ప కొత్త సందేశం ఏదీ ఇస్లాంలో లేదన్న ఖుర్‌ఆన్ సూక్తిని కూడా వినిపించాను.
ఆ వ్యక్తికి నా మాటలు నచ్చాయి. నేను ఇంకా ఏం చెప్పబోతానా అని ఆసక్తిగా వినడం ప్రారంభించాడు. హిందూ ధర్మంలోనూ దేవుని ఏకత్వం గురించిన సందేశం ఉంది. ఉపనిషత్తులు ఈ విషయాన్నే చెబుతున్నాయి. తమిళ సాధువు 'తిరుమూలార్' అందుకే 'ఒకే దేవుడు' 'ఒకే ప్రజ' అంటూ తీర్మానించాడు. కాని, అనేక దేవుళ్ళను ఆరాధించండ ని చెప్పే శ్లోకాలు, తాత్పర్యాలు కూడా ఉన్నాయి.
శిలా విగ్రహాల ఆరాధనను ఖండిస్తూ 'శివ వక్కియార్' రాసిన గేయం ఉంది. అలాగే రాళ్ళు రప్పలను పూజించండని చెప్పే పాటలూ ఉన్నాయి.
ప్రాపంచిక జీవితంలో నీతి నియమాలకు సంబంధించిన బోధనలు ఇస్లాంలో మాదిరిగా హిందూ ధర్మంలోనూ ఉన్నాయి. అయితే వైరుధ్యాలు, అయోమయంతో కూడుకున్న వ్యాఖ్యలు ఆ ధర్మంలో ఎక్కువగా ఉన్నాయి.
''అందుకే మహాత్మగాంధి ఇస్లాం బోధనలను కల్తీ లేనివనీ, కాగా హిందువులు ధార్శని కంగా, జీవన విధానం రీత్యా అయోమయంలో ఉన్నారని అంగీకరించవలసి వచ్చింది.'' ''హిందూ ధర్మంలో మనిషికి అత్యవసరమైన బోధనలు అనవసర వ్యాఖ్యలు కలగలిసి ఉన్నాయి. కాగా, ఇస్లాంలో మనిషికి అత్యవసరమైన బోధనలు ఒక క్రమపద్ధతిన ఉన్నాయి.''
నా ఈ మాటలు ఆ హిందూ పండితుని సంతృప్త పరచాయి. అయితే ముహమ్మద్(స) ను దైవప్రవక్తగా తానెందుకు అంగీకరిం చాలని ప్రశ్నించాడు.
నేను చెప్పాను, ''మీరు మీ తోటలోని పూలకన్నా ఇస్లాం బోధ నలు మీ హృదయానికి దగ్గరగా ఉన్నాయని ఒప్పుకుంటే, ఈ ఇస్లాం బోధనల పూదోటకు తోటమాలి లాంటివారు మహా ప్రవక్త. ఆయన మీ జీవితవిధానానికి అవసరమైన సలహాలిస్తారు. చెడులు, అనవసర విషయాల గురించి హెచ్చరిస్తారు. చెడులను దూరం చేసుకోండని, మంచిని పెంపొందించండని బోధిస్తారు.
''ఎవరయినా బోధకుడు చెడు గురించి, దుర్మార్గం గురించి హెచ్చరించినా మీరు ఆ చెడులను స్వీకరిస్తారా?
''అతడు మీకు సన్మార్గాన్ని చూపితే మీరు ముఖం తిప్పు కుంటారా?''
నా ఈ ప్రశ్నలకు ఆ హిందూ పండితుని మౌనమే సమాధాన మయ్యింది. అతడి మౌనం అతడి మనోభావాలకు అద్దం పట్టింది. అతని మనస్సు మెత్త బడిందని, సన్మార్గాన్ని స్వీకరిం చడానికి సిద్ధమవుతోందని అర్థమయ్యింది.
ఆ తర్వాత నేను అతనితో ఇంకా మాట్లాడుతూ హిందూ సమాజం ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని సమాజం, మిగి లిన ప్రపంచంతో పోల్చితే విశాల దృక్పథం కలిగిన సమాజమనీ, ఒక మంచి బోధకుడు చెప్పే మాటలను అతడు ఏ జాతికి, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా హిందువులు అంగీకరిస్తారని అన్నాను. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్(స) బోధనలు సత్యాలు, మంచి మాటలని గుర్తిస్తే మరుక్షణం హిందువులు ఆయన్ను తమ ప్రవక్తగా అంగీకరిస్తారని అన్నాను నేను.
ఆ హిందూ పండితుడు దీర్ఘమైన ఆలోచనతో ఆలకించాడు. దైవం తలిస్తే, సమీప భవిష్యత్తులో హిందువులు కూడా మహాప్రవక్త ముహమ్మద్(స)ను తమ ప్రవక్తగా అంగీకరిస్తారు.
(ఆ సమయం ఎంతో దూరంలో లేదు ఇన్ షాఅల్లాహ్‌ా!)
No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు