1.0 "లా ఇలాహ ఇల్లల్లాహ్" యొక్క నిబంధనలు
లా = లేరు, ఇలాహ = ఆరాధ్యులు (ఎవ్వరూ), ఇల్లల్లాహ్ = ఒక్క ఆరాధ్యుడు (అల్లాహ్) తప్ప. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధ్యులు (ఎవరూ) లేరు ఒక్క ఆరాధ్యుడు (అల్లాహ్) తప్ప.
లా ఇలాహ ఇల్లల్లాహ్ స్వర్గమునకు తాళం చెవి లాంటిది. ప్రతి తాళం చెవికి దంతాలు ఉంటాయి. ఏ తాళం చెవికి దంతాలు ఉంటాయో, ఆ తాళం చెవి మాత్రమే తాళం విప్పగలదు. దంతాలు లేని తాళం చెవి, ఏ తాళాన్నీ విప్పలేదు. అదే విధంగా ఈ క్రింద తెలిపిన షరతులు లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క దంతముల (లా ఇలాహ ఇల్లల్లాహ్ ను విశ్వసించుటకు) లాంటివి.
1.1) లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్ధం తెలుసుకొనుట. :- అల్లాహ్ తప్ప వేరే ఇతర దేవుళ్ళెవ్వరూ లేరని, ఆయన ఒక్కడే సకల ఆరాధనలకు అర్హుడని హృదయపూర్వకముగా అర్ధం చేసుకొని నమ్మటం.
)فَاعْلَمْ أَنَّهُ لا إِلَهَ إِلاّ اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْـمُؤْمِنَاتِ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ( [محمد:19]
దివ్యఖుర్ఆన్, ముహమ్మద్ 47:19 :- "మీరు నిశ్చయంగా తెలుసుకోండి, అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హులు వెరెవ్వరూ లేరు"
وقال رسول الله r : (من مات وهو يعلم أنه لا إله إلا الله دخل الجنة) رواه مسلم
ముస్లిం హదీథ్ గ్రంథం:- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా ఉద్బోధించారు. "ఎవరైతే అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హులు వేరెవ్వరూ లేరని గ్రహించి మరణించిన ఎడల అతను స్వర్గమున ప్రవేశించును."
1.2) లా ఇలాహ ఇల్లల్లాహ్ యే తథ్యమని, ఎలాంటి సంకోచము లేకుండా నమ్ముట:- సకలరాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడని మనస్పూర్తిగా నమ్ముట.
قال الله تعالى:)إِنَّمَـا الْـمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَـمْ يَرْتَابُوا وَجَاهَدُوا بِأَمْوَالِـهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ أُوْلَئِكَ هُمُ الصَّادِقُونَ ( [الحجرات:15]
దివ్యఖుర్ఆన్, హుజురాత్ 49:15 :- అల్లాహ్ ఇలా సంబోధించెను "అల్లాహ్ పై మరియు ప్రవక్త పై ఏ విధమైన సంకోచం (అనుమానం) లేకుండా హృదయపూర్వకంగా నమ్మిన వారే నిజమైన విశ్వాసులు."
قال رسول الله r : (أشهد أن لا إله إلا الله ، وأني رسول الله لا يلقى الله بهما عبد غير شاك ، فيحجب عن الجنة ) رواه مسلم
ముస్లిం హదీథ్ గ్రంథం :- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా ఉద్బోధించారు," నిశ్చయంగా ఎవ్వరూ ఆరాధనలకు అర్హులు లేరు, కాని కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు, మరియు నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ యొక్క ప్రవక్త ' అని ఎవరైతే ఏ విధమైన అనుమానం లేకుండా నమ్మి, సాక్ష్యమిచ్చి, అల్లాహ్తో కలియునో వారు స్వర్గమున ప్రవేశించుటలో ఆపబడరు."
1.3) మనస్ఫూర్తిగా నమ్మి, సాక్ష్యమిచ్చి లా ఇలాహ ఇల్లల్లాహ్ నిబంధనలను స్వీకరించుట:-
قال الله تعالى:) إِنَّـهُمْ كَانُوا إِذَا قِيلَ لـَهُمْ لا إِلَهَ إِلا اللَّهُ يَسْتَكْبِرُونَ( [الصافات:35-36]
దివ్యఖుర్ఆన్, అస్సాఫ్ఫాత్ 37:35 - 36:- అల్లాహ్ ఇలా సంబోధించెను వారు (అపరాధులు) ఎలాంటి వారంటే, "అల్లాహ్ తప్ప మరొక సత్యమైన ఆరాధ్యుడు లేడు"అని చెప్పినప్పుడు, వారు అహంకారంతో, "మేము ఒక పిచ్చికవి కోసం మా దేవుళ్ళను వదులుకోవాలా?" అని అనేవారు.
1.4) లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా ఆజ్ఞలను శిరసావహించుట:-
قال الله تعالى:)وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ مِن قَبْلِ أَن يَأْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لا تُنصَرُونَ ([الزمر:54]
దివ్యఖుర్ఆన్, అజ్జుమర్ 39:54:- అల్లాహ్ ఇలా సంబోధించెను, "మీరంతా మీ అల్లాహ్ (ప్రభువు) వైపుకు మరలండి మరియు ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తుండండి."
1.5) లా ఇలాహ ఇల్లల్లాహ్ను నిజంగా మరియు పటిష్టంగా స్వీకరించుట (విశ్వసించుట) :-
قال الله تعالى:) أَحَسِبَ النَّاسُ أَن يُتْرَكُوا أَن يَقُولُوا آمَنَّا وَهُمْ لا يُفْتَنُونَ * وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ( [العنكبوت:2-3]
అల్ అంకబూత్ 29 : 2 - 3:- అల్లాహ్ ఇలా సంబోధించెను " కేవలం మేము విశ్వసించాము అన్నంత మాత్రాన, వారిని పరీక్షించక వదిలి వేయబడుతుందని భావిస్తున్నారా? వాస్తవంగా మేము వారి పూర్వికుల్ని పరీక్షించాము, నిశ్చయంగా అల్లాహ్ సత్యపరులను, అసత్యపరులను తెలుసుకొనును."
قال رسول الله r:ما من أحد يشهد أن لا إله إلا الله ، وأن محمداً عبده ورسوله صدقاً من قلبه إلا حرمه الله على النار- متفق عليه
బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు :- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ఉద్బోధించారు," మానవుడు హృదయపూర్వకంగా ' అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, మరియు ప్రవక్త' అని సాక్ష్యమిచ్చిన ఎడల అల్లాహ్ నరకాన్ని అతని పై నిషేధించెను."
1.6) ఏకాగ్రత తో (sincere devotion) తో అల్లాహ్ను ఆరాధించుట:-
)وَمَا أُمِرُوا إِلا لِيَعْبُدُوا اللَّهَ مـُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاء وَيُـقِيمُوا الصَّلاةَ وَيُؤْتُوا الزَّكَاةَ وَذَلِكَ دِينُ الْقَـيِّـمَةِ ( البينة:5
అల్బయ్యిన 98:5 అల్లాహ్ ఇలా తెలిపెను "వారికి అల్లాహ్ని ఏకాగ్రతతో ఆరాధించమని మాత్రమే ఆదేశించెను"
قال رسول الله r: ( أسعد الناس بشفاعتي من قال لا إله إلا الله خالصاً من قلبه،أو نفسه) رواه البخاري
బుఖారి హదీథ్ గ్రంథం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఈ విధంగా ఉద్బోధించారు,"ప్రజలారా! నా సిఫారసుకు వారు మాత్రమే అర్హులు, ఎవరైతే ఏకాగ్రతతో హృదయపూర్వకంగా లాఇలాహ ఇల్లల్లాహ్ చదివారో."
قال رسول الله r : (إن الله حرم على النار من قال : لا إله إلا الله يبتغي بذلك وجه الله عز وجل) رواه مسلم .
ముస్లిం హదీథ్ గ్రంథం : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా ఉద్బోధించారు, "ఎవరైతే అల్లాహ్ను నమ్మి, అల్లాహ్ యొక్క స్వీకరణ కోసం లాఇలాహ ఇల్లల్లాహ్ పలికారో వారిపై అల్లాహ్ నరకాగ్నిని నిషేధించెను.”
1.7) ప్రేమభిమానాలతో సకలరాశి సృష్టికర్తైన అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని నమ్ముట:-
قال الله تعالى:)وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللّهِ أَندَاداً يُـحِبُّونَهُمْ كَحُبِّ اللّهِ وَالَّذِينَ آمَنُواْ أَشَدُّ حُبًّا لِّلّهِ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُواْ إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلّهِ جَـمِيعاً وَأَنَّ اللّهَ شَدِيدُ الْعَذَابِ ([البقرة:165]
అల్ బఖర 2:165 :- అల్లాహ్ ఈ విధంగా సంబోధించెను,”కాని కొందరు అల్లాహ్కు సాటి కల్పించి, వారితో అల్లాహ్ను ప్రేమించవలసినట్లుగా ప్రేమిస్తారు,కాని విశ్వాసులు అల్లాహ్ పట్ల పటిష్టమైన ప్రేమ కలిగి ఉంటారు”
قال رسول الله r: ( ثلاث من كن فيه وجد حلاوة الإيمان : أن يكون الله ورسوله أحب إليه من ما سواهما ، وأن يحب المرء لا يحبه إلا لله ، وأن يكره أن يعود في الكفر بعد إذ أنقذه الله منه ، كما يكره أن يقذف في النار) متفق عليه.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు, “ఎవరైతే ఈ మూడు గుణములు కలిగి ఉంటారో, వారు విశ్వాసపు మాధుర్యాన్ని పొందుతారు.”
అ> అల్లాహ్ మరిము ప్రవక్త ను అన్నింటి కంటే (తన ప్రాణం కంటే) ఎక్కువగా ప్రేమించుట (అభిమానించుట).
ఆ> ఎవ్వరితో అయిన స్నేహం (ప్రేమ) చేయాలనుకుంటే, కేవలం ఒక్క అల్లాహ్ కొరకే చేయుట.
ఇ> అల్లాహ్ అవిశ్వాసి నుండి విశ్వాసిగా చేసినప్పుడు, మరల అవిశ్వాసి అగుటను నరకంలో పడినట్లు అసహ్యించుకొనుట.
No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు